ఇలలో కలలో గురువర పదమే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

పల్లవి:
ఇలలో కలలో గురువర పదమే స్థిరమై వరమై వెలుంగనీ
శివగురు దేవా! సచ్చిదావందా! జగాన నీ కరుణయె పెన్నిధి

మనసిది మాయా వశమై మునగా, నడకలలో వడి చెడగా
పలుకులలో పస తొలగా జగాన నీ కరుణయె పెన్నిధి

కలతలు పొంగీ బ్రతుకే విరిగీ మనుషులపై గురి తొలిగీ
దిశ కొరకై పరుగిడగా జగాన నీ కరుణయె పెన్నిధి