ఇద్దరి పొందేలరా - సామి
Appearance
పల్లవి:
ఇద్దరి పొందేలరా - సామి దానింటికె పోపోరా ॥ఇద్దరి పొందేలరా॥
అనుపల్లవి:
సద్దేల జేసేవు - సామి నే నోర్వ నా
వద్దకు నీవు రా - వద్దుర వద్దుర ॥ఇద్దరి పొందేలరా॥
చరణం1:
నా జోలి నీకేలరా ఆబ్రహ్మ - నిన్నెట్లు పుట్టించెరా
ఏ జాము దానింట - నీజాడ నేజూడ
బేజారు గాజాల - నేజెల్ల నేజెల్ల ॥ఇద్దరి పొందేలరా॥
చరణం2:
కన్నుల ఎరుపేమిరా చెక్కుల - కాటుక నలుపేమిరా
కన్నుల విలుకాని - కయ్యాల మెలగిన
చిన్నెలే తోచెరా - చెప్పరా చెప్పరా ॥ఇద్దరి పొందేలరా॥
చరణం3:
శ్రీపూర్ణ తోట్ల వల్లూరిపుర - వేణుగోపాల బాగాయె
రాపేల దాసు శ్రీ - రామకవిపాల
ఈ పట్ల నీపను - లింతాయె వింతాయె ॥ఇద్దరి పొందేలరా॥