ఇటు రారా

వికీసోర్స్ నుండి

రాగం: భైరవి / తాళం: రూపక[మార్చు]

పల్లవి:
ఇటు రారా ఇది మేరా యేరా నంద కుమారా||

చరణం 1:
సన్నజాజి పూదండ సవరించి సేవించెద ||

చరణం 2:
మొగమున కస్తురి దిద్ది సిగ దువ్వి సేవించెద ||

చరణం 3:
మేలైన గంధము మేనబూసి సేవించెద ||

చరణం 4:
ఆకు మడుపులందించి అడుగులొత్తి సేవించెద ||

చరణం 5:
దాసు రామ కవి హ్రుదయ వాసుడవని సేవించెద ||

"https://te.wikisource.org/w/index.php?title=ఇటు_రారా&oldid=408174" నుండి వెలికితీశారు