ఇచ్ఛినీకుమారి/ఇచ్ఛినీకుమారి

వికీసోర్స్ నుండి

ఇచ్ఛినీకుమారి


మొదటి ప్రకరణము


వేఁట

రాత్రి తెలతెలవాఱఁజొచ్చెను. వేఁగుఁజుక్క యను వార్తాహరునివలన దనమనోహరుఁడగు సూర్యభగవానుని రాకను విని పూర్వదిశాకాంతముఖమున వికాసము వహించెను. ఆసమాచారమును విని భయపడియే కాఁబోలును జుక్కలును, నంతవఱకును దట్టముగా వ్యాపించియున్న చీకటులును మెలమెల్లగా మాయ మగుచుండెను. ప్రాతఃకాల మలయమారుతములు వసంతకుసుమముల పరిమళమును వహించి దిశలను నించుచుండెను. లేమావియాకుల మెసవుటచే మదమెక్కినకోయిల సుఖముగాఁ బంచమస్వర మాలాపించుచుండెను. రాత్రించరము లగుమృగములును, బక్షులును దమతమనిలయములు చేరుకొనుచుండెను. అంతవఱకును నిద్రాగతమై నిస్తబ్ధత వహించిన ప్రాణికోటి తెలివి వహించి కలకలలాడుచుండెను. వ్యాపించియు వ్యాపింపని వెలుతురుతోను, నశించియు నశింపని చీకటితోను గూడిన యాకసము గంగాయమునానదులుగూడిన ప్రదేశమువలే మనోహరముగా నుండెను.

ఇట్టిసమయమున ఘూర్జరదేశమున కీశాన్యదిక్కుగా నున్న మహాటవియం దిరువురుపురుషులు సంచరించుచుండిరి. వారు నఖశిఖపర్యంతమును వ్యాపించిన కవచమును దొడిగికొనిరి. కావున నారి దేహచ్ఛాయ లెట్టివియో మనము చెప్పలేము. వారు మిక్కిలి యున్నతశరీరులు. మోపెట్టిన దృఢచాపములు వారికరములం దుండెను. వాఁడిబాణములు వారిరెండవచేత వెలయుచుండెను. సమున్నతములగు నీటెలను, నతిదీర్ఘము లగు ఖడ్గములను, మఱికొన్ని మృగయాసాధనములను దాల్చి వారు చూపఱకు భీతి గొల్పుచుండిరి. ఎత్తగు చెట్లకొమ్మలందుఁ దగినతావు లేర్పఱుచుకొని మృగములనిమిత్త మొకనదీతీరమున వారు గాచుకొని యుండిరి. చాపహస్తులగు నావీరులను జూచినప్పుడు సురపొన్నతరువునందుఁ బొంచియుండి సమాధినవలంబించి యున్నశంకరుని వేఁటాడనుంకించుచున్న మన్మథుఁడు మనకు స్ఫురింపకపోఁడు. కాని, యతనిబలె వీ రపాయములపాలఁ బడలేదు. అతని బాణములవలె వీరిబాణములు , వ్యర్థములుఁ గాలేదు. చక్కఁగా గుఱిచూచి ప్రయోగించిన వారి బాణము లిదివఱ కొక్కొక్కటి యొక్కొక మృగమును గూల్పఁగలిగినవి. అందుచే వారు మన్మథునివలె వ్యర్థమనోరథులు కాలేదు. అయినను వారి కొకవిచారము లేకపోలేదు.

పురుషునిసాయమున నాపంది నతికష్టముతోఁ దిరుగవేసెను. బాణ మింకను దానిశరీరమును నాఁటుకొనియే యుండెను. ఆ వీరుఁడు దాని నూడఁదీయవ లెనని కదల్చి చూచెను. కాని, యది కదలలేదు. ఆ బాణమును బ్రయోగించిన వీరుని బలమున కతఁ డ చ్చెరువొందెను. అతఁడు తనయావచ్ఛక్తిని వినియోగించి లాగఁబోయెను. కాని, యది యూడి రాలేదు. తాను వేసిన బాణముకంటె నది యాపందిశరీరమును గాఢముగా నాఁటుకొన్నదని యావీరునకు బోధపడెను. తనబలముకంటె నావీరుని బలము హెచ్చని గ్రహించెను. అతఁ డచ్చెరుపాటుతో మరల నా బాణములపిడిని బట్టుకొని యిట్టటు కదలించి యావచ్ఛక్తిని వినియోగించి లాగెను. ఎట్టయిన నేమి యాబాణ మూడివచ్చెను. అది రక్తముతోఁ దడిసియుండెను. ఆవేఁటకాఁడు సమీపమున నున్ననదిలో రక్తసిక్తములగు దనచేతులను గడిగికొని యాబాణమునుగూడఁ గడిగెను, అంత దానిపైఁ గొన్నియక్షరములు గానవచ్చెను. అతఁ డాతురుఁడై వానిని జదివెను, 'ఇచ్ఛినీకుమారి' అని యున్నది. అతఁ డది చదివి యాశ్చర్యమున స్తంభించిపోయెను. మాటిమాటి కతనినోటనుండి 'ఇచ్చినీకుమారి' 'ఇచ్ఛినీకుమారి' అను శబ్దమే వెలువడఁ జొచ్చెను. అతఁడు రెండవవానితో 'ఓయీ! ఈ బాణ మిచ్ఛినీకుమారిది. ఆమెకు విలువిద్యయందుఁగూడ మిక్కిలి నేర్పున్నట్లు తోఁచుచున్నది. ఆహా! ఆమె యిదివఱలో సౌందర్యము చేతనే నన్ను లోఁగొన్నది. ఇప్పుడు ధనుర్విద్యచేఁగూడ వశపఱుచుకొన్నది. ఆహా! ఏమి నేర్పు! ఎంతబలము! ఆమెబాణ మాపంది హృదయమును జీల్చినట్లు మన్మథుఁడు తనబాణములచే నాహృదయమును జీల్చుచున్నాఁ' డని పలికి యాబాణము నత్యాదరముతోఁ దనయొద్ద నుంచుకొనెను.

రెండవప్రకరణము

ఆబూగడము

హిందూదేశమున సుప్రసిద్ధిగాంచినపర్వతములలో నాబూపర్వత మొకటి. రాజపుత్రస్థానమున నుత్తరదక్షిణదిశలకుఁ బెట్టఁబడినగోడవలె వెలయు నారావళీపర్వతమాలికలో నొకభాగమేయైనను, ఈపర్వతము కేవలము దానితో జేరియుండక కొంచెము వేఱుపడియున్నది. అది రాజస్థానమునఁగల కొండలన్నిటికంటెను మిక్కిలి యున్నతమైనది దాని శిఖరములన్నిటిలోను గురుశిఖరము మిగుల నెత్తైనది. గురుశిఖరముపొడువు 5668 అడుగులు, ఆగిరియందుఁ బ్రశస్తమైన జలకుండలములును, మిగులఁ జక్కనిగుహలును, నానావిధఫలవృక్షములును గలవు. ఇట్టి సదుపాయము లుండుటచే నెల్లవారికిని వాసయోగ్యమై యానందదాయకమై యున్నది.

ఉత్తరహిందూస్థానమందలి జనులందఱు నాబూగిరిని దివ్యక్షేత్రముగాఁ బరిగణింతురు. దానియందుఁ బెక్కులు దేవాలయములు కట్టబడినవి. వానిలోనెల్ల నచలేశ్వరాలయము మిగుల గొప్పది. ఆయాలయము చిరకాలముక్రిందటనే కట్టఁబడినను నూతనముగా నిర్మింపఁబడినట్లు ధవళకాంతుల నీనుచు శిల్పచాతుర్యముచే వింతగొలుపుచుఁ, జూపఱకు దేవతానిర్మిత మేమో యనుసందియముఁ గల్గింపకపోదు. అందలి యీశ్వరుని మునికులపతియగు వసిష్ణుండు ప్రతిష్ఠించెననియు, నా దేవుఁ డెక్కుడు మహత్త్వముగలవాఁ డనియుఁ బెద్దలు చెప్పుదురు.

అచలేశ్వరాలయమునకుఁ దూర్పున నొకకుండము కలదు. అది తొమ్మిదివందలయడుగుల నిడివియు నిన్నూటనలువది యడుగుల వెడల్పును గల్లి సర్వదా జలపూర్ణమై యుండును. పూర్వము మహిషాసురునిచేఁ బీడితులై దేవతలు మిగుల భీతులై యాపర్వతముమీఁదికి వచ్చి యట గోళ్ళతోఁ ద్రవ్వి మఱుఁగు గావించుకొని దాఁగియుండిరఁట. నఖములచేఁ దవ్వబడుటవలన నాజలకుండమునకు 'నఖి' యను పేరు వచ్చెను. దానినడుమభాగమునఁ జిన్నద్వీపము వంటి బండఱాయి యొకటి కలదు. దానిపై జగన్మాత యగు భవానీదేవియాలయము పూర్వకాలమున నుండెడిదఁట. కాని, యిప్పు డది పాడుపడి శిథిలము లగుగోడలు మాత్రము మిగిలియున్నవి. ఆకుండమును గుఱించియు, నాఱాతిని గుఱించియు, భవానీదేవియాలయమును గుఱించియు నొకవింతకథ చెప్పుదురు.

'పూర్వకాలమున నీపర్వతముపై వసిష్ఠమహాముని యాశ్రమ మొకదానిని గల్పించుకొని తపస్సు చేసికొనుచుండెను. అతని హోమధేను వొకనాఁ డాకుండముతీరమునఁ బచ్చిక మేయుచు జాఱి దానిలోఁ బడెను. అప్పటి కాకుండములో నీరు లేదు. అగాధ మగు నాగోతిలోనుండి యాయావు వెడలి రాలేకపోయెను.

వసిష్ఠుఁ డైన నాగోవు నుద్ధరించుటకు సమర్థుఁడు కాక భక్తవత్సలుఁ డగు శంకరునిఁ బ్రార్థింప నతఁడు తనజటాజూటమం దున్నగంగాజలముతో నాకుండమును నిండించి యాగోవు నందుండి పైకి రప్పించెను, అందులకు వసిష్ఠుఁడు సంతసించి యాకుండమువలన మరల నెప్పుడైన నట్టియాపద సంభవించు నేమో యని భయపడి యాకుండమును బూడ్చవలయునని యీశ్వరునిఁ బ్రార్థించెను. అతఁ డామునికోర్కిని దీర్చుటకై హిమవంతునికుమారులలో నొకనిఁ బిలిచి యా కుండమును బూడ్చి వేయ నాజ్ఞాపింపఁగా వారిలో గడగొట్టువాఁ డీశ్వరాజ్ఞను శిరసావహించి యందులో దుమికెను. కాని, వాఁడు చిన్నవాఁ డగుటచే నాకుండమును బూర్తిగాఁ గప్పలేకపోయెను. ఆచిన్నకొండయే యాకుండమున ద్వీపము వలె వెలయుచుండెను. తాను దానిని గప్పిపుచ్చఁబ్రయత్నించియు నందుఁ గృతార్థుఁడు కాకపోవుటచే శంకరుఁ డప్పని భగవత్సంకల్పితము కాదని యిఁక నాప్రయత్నము నుండి విరమించెను. అంత పార్వతి తనముద్దుతమ్ముని విడచి యుండలేక యచ్చటికి వచ్చి యీపిల్లగుట్టపై నివసించెను. సాక్షాత్పరమేశ్వరి వచ్చి యందు వెలయుటచే నది పుణ్యస్థలం బని యెంచ దేవతలును, మునులును నామె కట నాలయమును గట్టి పూజించుచుండిరి. కలి ప్రవేశించుటతోడనే దేవతలు భూమికి రాకపోవుటచేతను మునులు మాయమగుటచేతను నాయాలయము పాడయిపోయెను.

ఇట్టి వింతలకు నిలయ మగుటచే జనులు వేనవేలు యాత్రార్థ మాగిరికి వచ్చుచుందురు. సంతతము జనులరాకపోకలుగల యాపర్వతముపై నెలకొని జైనులు తమతమమతమును హిందువుల కుపదేశించి తమలో జేర్చుకొనుచుండిరి. అందుచే నాపర్వతమున హిందువులయాలయము లే కాక, జైనమందిరములుఁ గూడఁ బెక్కులు గలవు. ఇట్లు నానావిధమందిరములతో నిండినయాపర్వత మెక్కిన వారి కది లోకాంతరముగాఁ జూపట్టుచుండును.

ఆపర్వతపాదమందును, జఱియలయందును బెక్కులు పల్లెలును, గ్రామములును, దుర్గములును గలవు. వానిలో నాబూగడము మిగుల బలిష్ఠమగు దుర్గము. దానిని బరమారు వంశజులగు క్షత్రియు లేలుచుండిరి. మొదట నీక్షత్రియులు

చంద్రావతీ పురమును రాజధానిగాఁ జేసికొని యాబూ రాజ్యము నేలుచుండిరి. దాని కెల్లపుడును శత్రువుల రాపిడి సంభవించు చుండుటచే వారలు దానిని విడిచి శత్రువుల క భేద్యమగు నీకొండ దుర్గమును రాజధానిగాఁ జేసికొని తమ రాజ్యమును బాలించుచుండిరి.

మన కథాకాలమున జైతపరమారుఁ డను రాజపుంగ వుఁడు దానిఁ బాలించుచుండెను. అతఁడు మిగుల ధైర్య సాహసములు గలవాఁడు; వివేక శాలి; నిజమతమునం దెక్కుడు పట్టుదల గలవాఁడు. అతఁడు ధర్మయుక్త ముగా ధరణిఁ బాలించి తొంటిరాజులకంటె నధికమగు కీ ర్తి గాం చెను. అతని కొక కుమారుఁడును నొక కుమార్తి యును గలరు. కుమారుని పేరు చళుక సింహుఁడు. కూతు పేరు ఇచ్చినీ కుమారి. ఆమె రూపలావణ్యములం దసమానురాలని యా కాలమున వాసికెక్కినది. ఆయందమునకు వివేకమును, సుగుణసంపదయు, విద్యయుఁ దోడ్పడి వన్నె పెట్టుచుండెను. ఆమె తనయన్న యగుచళుక సింహునితో పాటు విలువిద్య గూడ సభ్యసించెను. వింట బాణము సంధించి లక్ష్యమును భేదించుటయం దామెకుఁ గుదిరిన నేర్పు మిక్కిలి కొనియాడ దగినది. పర్వెత్తిపోవుమృగములను గుఱిచూచి కొట్టి చంపఁ గలదు. ఆమె యొక్కొకమారన్న గారితో వేఁట కరుగు నభ్యాసముగూడఁ గలదు. మిసమిసలాడుతూ వనవిలాసము లచేఁ డులకించు నా మె దివ్యరూపము యువజన హృదయము

లకు నిరంకుశమగు మదన బాణమువలె నొప్పుచుండెను. ఆ యువతి సుందర రూపము చేతనే కాక ధనుర్విద్యా పాటవము చే గూడఁ "బెక్కండ్ర రాజవీరుల హృదయములను లోఁగొనెను, ఆకన్యను బెండ్లియాడి జన్మసాఫల్యము గావించుకొన రాజ కుమారులు పెక్కురు ప్రయత్నించు చుండిరి.

మూఁ డ వ ప్ర క ర ణ ము

చిత్ర కారయువతి

శిల్పములకు మన హిందూ దేశము ప్రసిద్ధిగాంచినది. చెక్కడఁపుఁబనియందును, జిత్ర లేఖనమందును మన దేశము వారి కలవడిన నేర్పు వేఱొకరి కలవడ లేదు. శిలామయము లగు ద్వారబంధములందును, దేవాలయపు గోడలయందును, గోపురములందును, స్తంభములందును మన పూర్వులు చూపిన శిల్పచాతుర్య మిప్పటికిని చూపఱ క త్యాశ్చర్యమును, మహా నందమును. గల్గించుచున్నది. ఇందులకు దివ్య క్షేత్రము లే దృష్టాంతములు. సోమనాథుని దేవాలయము, సింహాచలము, విశ్వనాథ క్షేత్రము, మధుర మొదలగు పుణ్య క్షేత్రములను జూచిన వారికి మన పూర్వులశిల్పచాతుర్యము తెలియక పోదు. చెక్కడఁపుఁ బనియం దెంత నేర్పు గలదొ, చిత్రరచన సయందుఁగూడ మనవారి కంత నేర్పుం డెడిది. ఈ విషయమై

బుణ్య క్షేత్రములే నిదర్శనములు. ఒక్కొక క్షేత్రమం దుండిన శిలావిగహములను జూచిన నత్యాశ్చర్యము గొలు పకపోవు, పూర్వము రాజులకుఁ జిత్రకళయందభిరుచి యెక్కుడుగా నుండెను. వారు స్వయముగా నేర్చుకొనుట యే కాక యంతఃపుర స్త్రీలకు గూడ నేర్పించుచుండు వారు. రాజు లావిద్య నంతగా నాదరించుట చేత నే పూర్వ మది యంత యౌన్నత్యముఁ గాంచినది.

ఒక నాఁ డొక చిత్రకారయువతి కొన్ని చిత్రపటములను జేత బట్టుకొని కొన్ని పెట్టెలోనుంచుకొని యమ్ముకొనుట కై యాబూగడపు రాజవీథినిఁబడి పోవుచుండెను. దాని వయస్సు ముప్పదివత్సరములకు మించి యుండును. అయిన నది సౌం దర్యమున సుంతయైనఁ గొఱంత వడ లేదు. దాని వాక్చా తుర్యము మృదుమధురముగా నుండెను. దాని పేరు రూపవతి. దానిఁ జూచినవా రా పేరు దానికిఁ దగు నని పలుకక పోరు. ఆయువతి చిత్రపటముల నమ్ముకొనుటకై యాపురమున కొకటి రెండుదినముల క్రిందట వచ్చియుండెను. దాని కాపుర మునఁ బరిచితులు లేరు.


ఆరూపవతి రాజగృహమునకు సమీపముగా నొక చోట గూర్చుండి యమ్ముకొనుటకై చిత్ర పటములను దీసి యచ్చటి వారికిఁ జూపుచుండెను. ఒక్క నిముసములోనే యాచిత్రము లను జూచుటకు జనులు పెక్కురు ప్రోవైరి. ఆచిత్రములను జూచియు, నావనిత చెప్పుసరస వచనములు వినియు నచ్చటి. వారు మిగుల నానందించి యచ్చోటును గదలిపో లేకుండిరి, ఆచిత్రములను జూచుటకంటె నచ్చటి కొందఱు కావనిత ముఖ పద్మమును జూచుటయందే మిక్కిలి యింపు జనించుచుండెను. ఇంతలో నొక యువతి యచ్చటికి వచ్చి జనుల నొత్తి గించికొని యామెను సమీపించి “మా రాజకుమారి నీచిత్ర పటముఁజూడ నభిలషించుచున్నది, రమ్ము; నాతో నంతః పురమునకు రమ్ము” అని చెప్పెను. ఆరూపవతి యందులకు సంతసించి కొనక పోయినను నెగాదిగఁజూచి యానందించు చున్న వారి చేతులలోనిపటములను లాగుకొని యాదాసితో నంతఃపురమునకుఁ బోయెను. తమయానందమునకు భంగము గల్గించిన యాదాసిని దిట్టనివా రచ్చట నొక్కరును లేరు. రూపవతి యాదాసిని వెంబడించి పెక్కుమందిరము లను గడచి పోయిపోయి శుద్ధాంతమును ప్రవేశించెను. ఆభవనము స్ఫటిక శిలా నిర్మితమై యెటుచూచిన నతిమనో హరమై యద్దమువ లేఁ దళతళలాడుచుండెను. అందొక విశాల మండపమున రాజకుమారి సఖులతోఁ గూర్చుండియుం డెను. చుక్కలనడుమ బాలచంద్ర రేఖవ లెఁ బోలుపాఱుచున్న యా రాజకుమారినిఁ జూచి భూమి కవతరించిన దేవకాంతయేమో యని రూపవతి భ్రమింపక పోలేదు. అది పెక్కండ్ర నంతః పుర స్త్రీలను జూచియుండెనుగాని యీ రాజకుమారియంత సౌందర్యవతిని జూచియుండ లేదు. ఒకమాఱామెయందమును గన్ను లారఁ జూచి రూపవతి యామెకు నమస్కారము చేసి జూచుచుండిరి. తన పెట్టె నచ్చట దింపెను. తోడ నే చెలికత్తెలందఱు నా యునతిని జుట్టుముట్టి యాచిత్రములను ఇచ్ఛినీకుమారి కొన్ని పటములు చూచి దానితోఁ బ్రస్తుతము భూపాలనముఁ జేయుచున్న రాజులపటములు లేవా?' అని ప్రశ్నించెను.

రూపనతి 'అమ్మా! లేకేమి, ఉన్నవి' అని కొన్ని పటములుదీసి యామె చేతి కిచ్చెను. ఆ రాజకుమారి వాని నెల్లం బరిశీలించెను. వానిలో నొకటి దానికిఁ జూపి 'యువతీ! ఈపట మెవ్వరిది' అని యడి గెను. రూ—అమ్మా ! సకలరాజకులాలం కారుఁ డై, శత్రు భయంకరుఁడై , మహామహుఁడై ఘూర్జర దేశమును బాలించు చున్న చాళుక్య భీమ దేవునిపట మిది.

ఇచ్ఛి– భీమ దేవుఁ డితఁడా ! ఇతని రూపమునకును, బేరునకును మిక్కిలి తగియున్నది. కాని, యువతీ ! ఇతని నంతగాఁ బొగడుచున్నావు ? ఇట్లు పొగడుమని యారాజు నీ కేమయిన నిచ్చెనా యేమి ?

రూ—అమ్మా ! ఇచ్చెడి దేమి ? మహామహు లంద ఱకును బొగడఁదగినవారే కదా ? నే నతని గుఱించి చెప్పినది వాస్త వకథనమే కాని యతిశయోక్తి యేమియును లేదు. ఇచ్ఛి అతిశయోక్తి యేమియును లేదా ? పోనిమ్ము, దాని కేమి ! కాని, పృథ్వీరాజు చిత్రపట మున్నదా ?

రూ. ఉండెడివి. కాని యవియన్నియు నమ్మం బడినవి.

ఇచ్ఛి——అతనిఁ గూర్చి నీ కేమయినను దెలియునా ?

రూ. తెలియ కేమి! కొంతకాలము క్రిందటనే చాళుక్య భీమ దేవునకును, బృథ్వీరాజుజనకుఁడగు సోమేశ్వరుసకును ఘోరయుద్ధము సంభవించెను. అందు భీముఁడు సోమేశ్వరుని జయించి విఖ్యా ----------------

ఇచ్చి- యునతీ ! ఆ వృత్త మెందులకు ? దానివలన భీమ దేవుఁడు సర్వాధికుఁ డని స్థాపింపఁ బూనుచుంటివా ! ఈ మాజు భీమునియందు నీకుఁగల పక్షపాతము వెల్లడి యగు చున్నది. అంతమాత్రముచే నాతనికి వచ్చి నమహత్త్వ మేమి ? తదితరులకుఁ గల్గిన నీచత యేమి ? పృథ్వీ రాజవృత్తము ననవసర వృత్తాంతము తెచ్చి మాటాడెదవేల?


రూ: అమ్మా! క్షమింపుము, నాయు ద్దేశ మది కాదు. పృథ్వీరాజుతండ్రి ని గూడ నెఱుఁగుదు నని చెప్పుటకు నా వృత్తమును ద్రవ్వితిని. అంతకుఁ దప్ప వేఱులేదు, పృథ్వీ రాజుగూడ మహత్తరుఁ డనియె వినుచున్నాను.


ఇచ్చి: ఇంకను బక్షపాతబుద్ధిని వదలకున్నావు. భీముని పృథ్వీరాజుతో సమానునిగాఁ జేయ సెంచుచున్నావు? పోనిమ్ము, పృథ్వీరాజు ప్రతిమను వ్రాయఁగలనా ? రూ: -అమ్మా! చిత్రలేఖన మందు. నాకు మంచి నేర్పున్నది. సెలనయిన చో వ్రా సెదను.

ఇచ్చి. వ్రాయుము, తెప్పక వ్రాయుము. అందులకు: దగిన బహుమతి నీ కీయక పోను.

విని రూపనతి దూనందించుచుఁ దన పెట్టెలో నున్న రంగులను, కుంచిక లను దీసి యొక ప్రతిమను వాసి యామెకుఁ జూపెను. ఇచ్చిని దానిని బరిశీలించి (మందహాసము చేయుచు) “ఓయువతీ ! భీమ దేవుని చిత్రము వ్రాయుట యందుఁ జూసినంతచాతుర్యము నీ చేయి వేఱొక చిత్ర రచన యందుఁ జూపలేదని తలం చెదను.

రూ: ఏమమ్మా ! అట్లనుచున్నారు.

ఇచ్ఛి: — ఏమియును లేదు. అపృద్వీరాజు పోల్కి సరిగా నిందు లేదు. మఱియు రచనకూడ సంత యందముగా లేదు. నీవు వ్రాయఁగలిగియు దీనినిఁ బాడు చేసితి వేమో యని నా యనుమానము.

రూ: -అమ్మా! మీ రట్లనుట ధర్మమా ! నాచాతుర్య మును జూపి మాయనుగ్రహమును సంపాదించుకొని బ్రదుక న లెనని యున్న దాన నిట్లు చేయుదునా ! పృథ్వీరాజు నాకా రము సరిగా మనస్సునకుఁ బట్టక పోవుటచే నట్లు వ్రాసితిని. అంతియ కాని వేఱుగాదు.


ఇచ్ఛి: ——పోనిమ్ము !, పృథ్వీరాజు ప్రతిమ నాయొద్ద నున్నది. దానిఁ జూచి సరిగా వ్రాయుదువా ? రూ-:.. వ్రా సెదను.

ఇచ్ఛినీకుమారి యొక చెలికత్తె చేఁ దన పడకటింటిలో నున్న పృథ్వీరాజు పటమును దెచ్చి రూపవతి కిచ్చెను. ఆయువతి దాని నిదానించి చూచి చిత్రపటము వ్రాయ మొదలిడెను. అది తనచాతుర్యమంతయు - నాచిత్రమునఁ జూ పెను. ఆపటమును జూచి యిచ్ఛినీకుమారి మిగుల సంత. సించి దానికిఁ దగిన బహుమాన మిచ్చి “ఓయువతీ ! నీ నేర్పు మిగులఁ గొనియాడఁ దగియున్నది. నీవలన నీచిత్ర లేఖన విద్య నేర్చుకొనవలె నని యున్నాను. నీవు నేర్పుదువా ? ' అని యడిగెను.

రూ—అమ్మా ! అందుల కభ్యంతర మేమి ? అంత కంటె నాకుఁ గావలసిన దేమున్నది?

ఇచ్చి: – సంతోష మే ! ఇందులకు మాజనకుని యను మతి వడయవలెను. మఱి యొకమారు నాకగపడుము.' అని చెప్పి దానిని బంపి వేసెను,

నాల్గవ ప్రకరణము

దేశ చరిత్రము

హిందూ దేశమునఁ బడమటి సముద్రతీరము నందు ఘూర్జర మను దేశము గలదు. దానినే యిప్పుడు గుజ రాతని పిల్చుచున్నాము. క్రీ. శ. 6 వ శతాబ్ద ప్రారంభమున వల్లభీ పురమును రాజధానిగాఁ జేసికొని శిలాదిత్యుం డను రా

జా దేశమును బాలించుచుండినట్లు జైనమత గురువులు వ్రాసిన వ్రాఁతలవలనఁ దెలియవచ్చుచున్నది. అతఁడు మహాపరా క్రమవంతుఁడు, యుద్ధములందు మిగుల సమర్థుఁడు. అతడు సూర్యు నారాధించి యతనివలన నొక ఖడ్గమును బడసి చిర కాలమునుండి యా దేశమున నివసించియున్నయాటవికు లను బాజఁదోలి రాజ్యము స్థాపించి పాలింపనారంభించెను. కొన్ని యేండ్లు గడ చెను. ఇట్లుండ మహాధనసంపన్నుఁ డగు 'రంకు' అను వర్తకునితో నమ్మహా రాజునకు విరోధము సంభవించెను. ఆవర్తకుఁడు మిగులఁ బట్టుదల గలవాఁడు. అతఁడు తనపగ దీర్చుకొనుట కై శిలాదిత్యునకుఁ బూర్వ విరోధులగు నాట వికులతో స్నేహము చేసి వారికిఁ గోరినంత ధన మిచ్చి వల్ల భీపురమును ధ్వంసము గావింపఁ బురికొల్పెను. వారును మహానంద మొంది తమ పగను దీర్చుకొనుటకై వల్లభ పురము పై గవిసిరి. శిలాదిత్యుఁ డది విని ధీరుడై తన సైన్య ములను గూచ్చుకొని వారి నెదిరించెను. కాని, దైవము ప్రతి కూలమైనందున నతనికిజయ మబ్బ లేదు. ఆయుద్ధమం దే వీరమరణముఁ జెందెను. అతనికి సంతానము, లేనందున నతనితోఁ దద్వంశ మంతరిం చెను.

అనంతరము రమారమి రెండు శ తాబ్దముల కాలము గుజరాతును బాలించువా రెన్వరో మనము - స్పష్టముగాఁ జెప్పఁజాలము. అందులకుఁ దగిన యాధారములు లేవు. కాని, యేడవ శతాద్ధాంతమునఁ జోరవంశజుడగు జయ శేఖరుఁ


డా దేశము నేలుచుండినట్లు చరిత్ర వలనఁ దెలియ వచ్చుచున్నది . ఆరాజు మిగుల శూరుఁడు, విద్వాంసుఁడు, రాజనీతియం దాఱి తేటిన వాఁడు. పంచాసర మనుపట్టణ మతనికి రాజధాని. అతని భార్య రూపసుందరి. అతని బానమఱఁది శూర పాలుఁ డును మహాశూరుఁడు. ఆతఁడు మహానై భవముతో ఘూర్జర మును బాలించుచుండ నాకాలమున కలియాపురమును బా లించువాఁడును, చాళుక్యవంశ సంభవుఁడును నగుభూవర రాజు జయ శేఖరునికీ ర్తి విని యతని జయింపఁదలంపుతో సై న్యము లను జేర్చుకొని గుజ రాతు పై దాడి వెడ లెను. జయ శేఖరుఁ డది విని సుంతేనియు ' జంకక' శూర పాలునికిఁ గొంత సైన్య మిచ్చి భూవరుని నెదిరింపఁ బంపెను. ఆ రెండు సైన్యములు నాబూ పర్వతము యొద్దఁ గలసికొ నెను. ఘోరయుద్ధము జరి ఆ యుద్ధమున శూరపాలుఁడే జయమందెను. భూవరుఁడు పరాభూతుఁడై తన పురమునకు మరలిపోయెను. రెండువత్సరములు గడచిన పిమ్మట భూవరుఁడు వెను కటి పరాభవమును దీర్చుకొన నెంచి మహా సై న్యముతో వెడలి జయ శేఖరుని రాజధాని యగుపంచాసరమును ముట్ట డిం చెను. మహాసముద్రమువంటి శత్రు సై న్యమును జూచి జయము గల్గుట దుర్లభ మని నిశ్చయించి గర్భవతి యగుతన భార్యను శూర పాలుని కప్పగించి పురము "వెడలిపొమ్మని యాజ్ఞాపించి జయ శేఖరుఁడు శత్రువులతో వీరస్వర్గముఁ గాం చెను. అతని రాజ్యము భూవరునికి వశమయ్యెను. 

గూడి యుద్ధారంభమునకుఁ బూర్వమేమే శూరపాలుడు తన సోదరిని దీసికొని యొక యరణ్యముఁ జేరెను. ఆయరణ్యమందే యామెకు- గుమారుఁ డుదయిం చెను, వనమందుఁ బుట్టుట చే నాబాలునికి వన రాజని పేరు గల్లెను. ఆతఁడు క్రమముగాఁ బెద్దవాఁడై తండ్రివలె మహాశూరుఁ డయ్యెను. అతఁడు తండ్రి రాజ్యమును స్వాధీనము గావించుకొన నెంచి మేనమామతో, సమీప గ్రామములను గొల్లఁ గొట్టి దానినలనఁ దగినంత ధన మార్జించి ఖిల్ల సైన్యములను జేర్చుకొని భూవరుని జయించి తజిమి గుజరాతును వశ పఱుచుకొనెను. పూర్వపు రాజధాని యగు పంచాసరము పాడుపడినందున దానిని విడిచి యతఁడు సరస్వతీ నదీతీరమున విశాలసమ ప్రదేశమున నొక పురముఁ గట్టించెను.తనచిన్న తనమున వన వాసదినములలో 'అస్ట్రేలుఁ' డను నొక జైనగురువు తన్నును, తనతల్లిని మిక్కిలి ప్రేమించి కాపొడినందున నాయుపకారమును మఱవక వన రాజు తాను గట్టించిన పట్టణమున కాజైనుని పేరు 'అనిలపుర' మని పేరు పెట్టెను. అదియే ఘూర్జర దేశమునకుఁ జిర కాలము రాజ ధానియై యొ ప్పెను. వన రాజు క్రీ. శ. 746 వ యేఁట గుజ రాతుసింహాసనము నెక్కి యఱువది సంవత్సరములు ప్రజలఁ బాలించి క్రీ. శ. 806 లో గాలధర్మమునొందెను. అతని యనంతరమున యుగ రాజును, క్షేమ రాజును, భూయాదుఁ డును, వీరసింహుఁడును, రత్నాదిత్యుఁడును, సామంత సింహుఁ డును గ్రమముగా నన్షిలవుర సింహాసనమునఁ గూర్చుండి గుజరాతును బాలించిరి. సామంతసింహునకు సంతతి లేదు. కాని, లీలా దేవి యను తోబుట్టువు మాత్రము కలదు. అతఁ డామెను కలియాపురమును బాలించు భూవనాదిత్యునికునూ రుని కిచ్చి పెండ్లి గావిం చెను. ఆదంపతుల కొక కుమారుఁడు పుట్టెను. అతని పేరు మూల రాజు. సామంత సింహునితోఁ జోరవంశ మంతరించుటచేఁ, దల్లి మూలముగా నవ్లపుర రాజ్యము మూలరాజువశ మయ్యెను. ఆతఁడు క్రీ. శ. 942 వ యేఁట రాజ్యభారము సహించి 997 వ వత్సరమువజుకును గుజ రాతును బరిపాలించెను. గుజరాతును బాలించిన చాళుక్య వంశ రాజులలో నితఁడే మొదటివాఁడు. మూల రాజుననంతర మున చాముండ రాయఁడును, దుర్లభ రాజును నంహిలపురము నకుఁ బ్రభువు లై రి, దుర్లభ రాజు సంతాన హీనుఁ డగుట చే నతని తమ్మునికుమారుఁడగు భీమ దేవుఁడు ఘూర్జర దేశ ప్రభు నయ్యెను. చాళుక్యవంశజులలో నీ భీమ దేవుఁడు మిగుల విఖ్యాతి గాంచిన మహాశూరుఁడు. మహమ్మదజనీ సోమనాథ క్షేత్ర మును ముట్టడించినప్పు డీమహావీరుఁడు సైన్యసమేతుఁ డై పోయి గజనీని మార్కొని ఘోర యుద్ధము చేసి యతని నోడించి తఱిమి వేసెను. దానితో నతనికిరి యుతర హిందూస్థానమందంతటను వ్యాపించెను. అతఁడు 'ఉదయమతి' యనుయువతిని బెండ్లా డెను. ఆదంపతులకుఁ గరుణ రా జుదయించెను. అతఁడు క్రీ. శ. 1072 మొదలుకొని 1094 వ సంవత్సరము దాఁకఁ బరిపాలిం చెను. అతఁడు కర్ణాట దేశపు రాజగు జయకక్షి కూఁతును 'మీన


దేవిని' బెండ్లియాడి యా మెయందు సిద్ధిరా జనుకుమారునిఁ గనియెను. అతఃడే తండ్రియనంతరము ఘూర్జర దేశమునకు జయ్యెను, అతఁడు మిగుల బలశాలి, శూరుఁడు. అతఁడు తన పై దండెత్తి వచ్చిన మాలవ దేశ రాజగుయశోవర్మ నోడిం చెను. మఱియు సూరతు పైకిఁ బలుసారులు దాడి వెడలి దాని జయించి తన రాజ్యమునఁ గలుపుకొనెను. అతనికి సం తానము లేనందున త్రిభువనపాలుని కుమారుఁడగు కుమార పాలుఁడు గుజరాతునకుఁ బ్రభు పయ్యెను. ఆత్రి భువన పాలుఁడు పెఱ వాఁడు కాఁడు. అనిలపురమును బాలించిన భీమ దేవునకు నకుళా దేవియనెడి వేటొక భార్యయందుఁ గల్గిన క్షేమ రాజు నకు మనుమఁడు. కుమార పాలుఁడు కీ. శ. 1148 వ వత్సర మున ఘూర్జర సింహాసన మెక్కి 1174 వ యేఁటివఱకును నిరం కుశముగాఁ బాలించి కీర్తి (గాంచెను. అతఁడు మిగుల యుద్ధ ప్రియుఁడు. పెక్కండ్రతో యుద్ధము చేసి జయలక్ష్మిని వరిం చెను. అతఁ డొనర్చిన యుద్ధము లన్ని టిలోను గొంకణ దేశాధి పతియగు మల్లికార్జునునితోఁ జేసినది మిగుల భయంకరమైనది. కుమార పాలునకు సంతతి లేదు. "కాని, కీర్తి పాలుఁడు మహీ పాలుఁడు నను నిరువును సోదరులు గలరు. వారిలో మహీ పాలుని కుమారుఁడగు జయపాలుఁడు కుమారపాలున నంతర మున నని లపుర రాజ్యమున కధీశుఁ డయ్యెను. అతఁ డొన ర్చినమన కార్యము లేమియును లేవు. అతనియనంతరమునం. దత్కుమారుఁడు రెండవ మూల రాజు గుజరాతును బాలిం చెను. అతఁడు సంతానహీనుఁ డగుట చే నతని తరువాత నతని పినతండ్రియగు రెండన భీమ దేవుఁడు ఘూర్జరమునకు రా జయ్యెను. ఇతఁడు గుజరాతును బాలించిన చాళుక్యవంశజు అందజుఱు లోను మిక్కిలి ప్రసిద్ధిగాం చెను. ఇతనినే భోలా భీముఁ డని కూడఁ బిలుచుచుందురు,

ఆ యి ద వ ప్రకరణ ము

భీమ దేవుఁడు

అన్దిలపురమును బాలించిన కుమార పాలునికి మహీ పొలుఁ డను తమ్ముఁడు గలఁడు. అతనికి జయపాలుఁడు, భీమ దేవుఁడు నను నిరువురు కుమారు లుండిరి. వారిలోఁ బెద్దవాడగు జయపాలుఁడు రాజయ్యెను. అతనికి నాయకీ దేవియం దొక కుమారుఁ డుదయించెను. అతఁడు రెండవ మూలరా జను పేరుతో నంహిలమును బాలిం చెను. అతఁ డసం తాను డగుట చేతను, దుర్బలుఁ డగుట చేతను, నతని పినతండ్రి యగు భీమ దేవుఁడు వది నె గారియనుమతి చొప్పున రాజకీయ వ్యవ హారములందును, యుద్ధములందును మూలరాజునకు సాయ మొనర్చుచుఁ గ్రమముగా నధి కారమంతయుఁ దానే వహించి మూల రాజు నొక మూలకుఁ దోచి యన్షిలమును స్వతం ఈముగా నేలఁజొచ్చెను. అతఁడు పరాక్రమవంతుఁడును, మాట చెల్లు బడిగలవాఁడు నగుట చే నతఁడు చేసిన యీయన్యా


యమును దిద్దక పోవుట యే. కాక మంత్రులును, సానుంతు లును, బ్రజలును నతని ప్రభుత్వమున కంగీకరించిరి. భీమ దేవునిపరాక్రమము సాధారణమైనది కాదు. అతని పట్టుదలయు సామాన్యమైనది కాదు. అతఁ డారంభిం చిన పనులు తుద ముట్టువజకు మిక్కిలి దీక్షతోఁ జేయును, అతనియధికారము నిరాటంకముగా సాగుచుండెడిది. అతని ప్రభావము కొనియాడఁదగినది. ఒకప్పుడు మాళవ రాజయిన సహ దేవుడు తన పై దండెత్తిరాఁగా నది విని భీమ దేవుఁ డతని కిట్లు వార్తపంపెను. “ఓ రాజా ! నీవు సూర్యవంశజుఁ డవు. మీవంశకర్తయగు సూర్యునివలె మీరును దూర్పు దిక్కున మాత్రమె ప్రకాశింతురు. పడమట " నట్లు ప్రకాశం చుట పొసఁగదు. తుదకు నాశమే సంభవించును.” భయపఱుచుచు నిట్లు పంపిన వా ర్తకు మాళవ రాజును, నతనికుమాకుడర్జున దేవును మిగుల క్రుద్ధులై భీమ దేవుని రాజ్యమును ధ్వంసము చేయనారంభించిరి. భీమ దేవుం డందు లకు మిక్కిలి కినిసి సైన్యసమేతుఁడై పోయి వారలను జయించి తమి వేసెను.

ఒకప్పుడు భీమ దేవుని ప్రఖ్యాతి విని శహబుద్దీనుఘోరీ సముద్రమువంటి మహా సై న్యమును వెంటఁ బెట్టుకొని భీముని జయించి గుజరాతును నోట వేసికొనవలె నని యువ్విళ్ళూ రుచు వచ్చి యుద్ధమునకుఁ దలప డెను. అందులకు భీముం డిం తేనియుఁ జంకక చతురంగబలములను గూర్చుకొని పోయి ఘోరీని జయించి పాఱద్రోలెను. ఈసంతత విజయ ములచే మూర్జర రాజ్యము మధ్యందిన సూర్యమండలమువ లె శత్రువుల చూపులకు దుస్సహమై యాకాలమున నుత్తర హిందూస్థానమునఁ బ్రసిద్ధి కెక్కిన రాజ్యములలో నొక్కటియై పరఁగుచుండెను. అస్ట్రేలపురమున కితని కాలమున వచ్చి నంతయశము మటెప్పు డెవ్వరికాల ములందును సంభవింపక పోవుట చే నితనికి 'అస్ట్రేలపుర భూషణ'మని బిరుదము కల్లెను

• భీముఁడు జైనమత మం దెక్కుడభిమానము గల్లి పెక్కు రు జై నగురువుల కాశ్రయమిచ్చి తన రాజ్యమున నామతము సభివర్ధించుటకు మిగులఁ బాటుపడెను. అయినను హిందువు లనుగాని, తన్మతమును గాని ద్వేషింప లేదు, ఆజైనులలో సమర సింహు: డీ భీమ రాజునకుఁ ' జెలియై, గురువై, చుట్టమై, సేవకుఁడై, సర్వకార్యములందును బాసటయై తోడునీడవలె కరించుచుండెను. అతఁడు మిగుల బుద్ధిశాలి. మాయోపాయ ములందును, మంత్రతంత్రములందును, మంత్రతంత్రములందును, నోషధులందును గడు నేర్పరి. ఇన్ని గుణములుగలవాఁ డగుట చేతనే భీముఁ డతనిఁ బ్రాణపదముగాఁ జూచుకొనుచు నొక క్షణమైనను విడువ లేకుండెను. భీమ దేవుఁ డొకనాఁ డొక దివ్యమందిరమున నొంటిగా గూర్చుండెను. మలయమారుతములు ప్రసరించి మిగుల హాయిని గల్గించుచుండెను. ఏమూలఁ జూచినను నతిమనో హరములగువస్తువులు కంటఁబడి హృదయమున కానందము


గొలుపుచుండెను. కాని, యతడట్టి యానంద మనుభవించు 'చున్నట్టు లేదు. కాంతిరహితమగు ముఖమును వామహస్త మునఁ జేర్చి యతఁడు దీర్ఘాలోచన పరుఁడై మాటిమాటికిని వేఁడిని ట్టూర్పులు పుచ్చుచుండెను. ఇది పరిశీలింప నతఁ డేదో భరింపరాని వేదనలకుఁ బాలయి యుండెనని తోపకపోదు. అతఁ డట్లే కొంచెము సేపు గూర్చుండి చటాలున లేచి ప్రక్క గదిలోనికిఁ బోయి యొక వస్తువును గొనివచ్చి దానినే సదా నిదానించి చూచు చుండెను. ఆసమయమున నతఁ డెఱుఁగ కుండఁగ నే యతనినో టనుండి 'ఆహా ! ఇచ్చినీ ! నీయాయుధ చాతుర్యము నెట్లు మఱతును ? నీగుణము లెంతని వర్ణిం తును ? విలువిద్యయందు రెండవ సత్యభామ వగు నీ వేవీరుని హృదయమును గలంపఁజాలవు?' అనుమాటలు వెడలివచ్చెను. అతఁ డాబాణమునే యెగాదిగ చూచుచు నానందించుచుం డెను. విరహులకుఁ దమ ప్రియు రాండ్ర వస్తువులు వినోదపాత్రము లగుట చే నతని కాబాణమే దుస్సహమగు కాలమును బుచ్చుట కొక సాధన మయ్యెను. అతఁడట్లు వినోదించుచుండఁగా సమరసింహుం డచటం ప్రత్యక్ష మయ్యెను. భీమదేవు డతనిఁ జూచి యుచి తాసనమునఁ గూర్చుండ నియమించి యిట్లు సంభాషించెను. భీమ:- అమర సింహా ! మన శార్య మేమగునో, యని విచారించుచున్నాను.


అమ: - దేవా ! ఈస్వల్ప కార్యమునకుఁ దమ రింత

           విచారింప నేల ? ఆయునతికిఁ దమయందనురాగము
           గల్గింపనొక తె నిదినఱకే ఫుచ్చియుంటిమిక దా ! ఆమె యాయిచ్ఛిని
           మ్రోలఁ దమగుణములను వర్ణించి తదీయమానసమును మీ
          యం దీపాటి కే లగ్నముగావించి యుండును. ఈయభిప్రాయ
          మును బరమారునకుఁ దెలిసినచో నధికానందభరితుఁడై తమ
          కిచ్చి పెండ్లి చేయును. పరమారునకుఁ దమవంటివాఁ డల్లుఁ
          డగుట మహాభాగ్యము గదా !

భీమ: - నీ వన్న దానియందుఁ జాలనఱకు సత్య

            మున్నది. కాని, యారాజు జై నమతమును ద్వేషించును .
            జైనమతావలంబి నగునాకా కన్యక నతఁడు సంతోష పూర్వ
            కముగా నెప్పటికి నీయఁడు.

అమ: - దేవా ! తమరి ట్లమాయికముగా మాటా

             డెద రేల ! మీ పేరు విని గడగడలాడని రాజవీరుఁ . డీయుత్తర
             హిందూస్థానమున నెవఁ డున్నాఁడు ? తమకోర్కి, నేరాజు
             విఫలముగాఁ జేయఁజూలును ? ఒక వేళ నీపరమారుఁ డట్టి
             సాహసమునకే పూనికొనినచో దండోపాయము చేత నే
             కార్యము' సాధించుకొనవచ్చును.

భీమ. ముందుగా జై తపరమారుని యభిప్రాయ

          మెఱిగి వచ్చుట మనకుఁ గర్త వ్యముకాదా ?

అమ: - అవును, దేవర సెలవిచ్చినది సత్యమే !

భీమ- అట్లయిన నీవె యాబూదుర్గమునకుఁ బోయి

          రావలయును, 

అమ- దేవర యజ్ఞ చొప్పున నట్లే పోయెదను.

భీమ-నీవు పరమారుని దర్శించి మొదట సామము తోనే మాటాడుము. నే నతనికుమారిని గోరుచున్నా నని చెప్పుము, తరువాత నాసంబంధమునందుఁగల గొప్పతనమును వర్ణింపుము. అంగీకరించినసరియే ! లేకున్న , రెండు నిముసముల లో నే యాబూగడము నామావ శేషమగు నని చెప్పుము.

అమ— రాజేంద్రా ! అట్లే చేసెదను. తమరు నాకు మాటలు నేర్పవ లెనా ! ఈ కార్య మెట్లయిన సాధింపఁగలనను నమ్మకము నా కున్నది.

అనిచెప్పి యారాజు సెలవు గైకొని యప్పుడే యాబూగడమునకుఁ బోయెను.

ఆ ఱవ ప్రకరణ ము

అభయ సింగు

ఆబూగడమున నభయసింగనెడి రాజకుమారుఁ డొకఁ డుండెను. అతఁడు జై తపరమారుని చెల్లెలికొడుకు. అతఁడు చిన్నప్పటినుండియు నాబూగడమున నే పెరిఁగెను. పరమారుఁడు తన సోదరియందలి ప్రేమాతిశయములను బురస్కరించుకొని యభయసింగు నెక్కువగా నాదరించి తన పుతీ పుత్రులతో సమానముగా నభివర్ధించెను. అభయసింగును మేనమామ యందు మిగుల భయభక్తులు గలవాఁడై మెలఁగుచుండెను.

అతఁ డిప్పు డిరువదియై దేండ్ల ప్రాయముగలవాఁడు. చళుక సింహునికంటె రెండుమూఁ డేండ్లు మాత్రమే పెద్ద. కావునఁ, జళుక సింహాభయసింహులును, నిచ్ఛినీకుమారియుఁ గలసి చిన్నప్పు డొక్కచోటనే యుండి చదువుకొనిరి. నిద్రించు నప్పుడు తప్పఁ దదితర కాలమం దెల్లప్పుడా మువ్వురును గలసి వర్తించుచుం డెడివారు. అస్త్ర విద్యాభ్యాసమునందుఁ గూడ వారు మువ్వురును సహాధ్యాయులే ! వారు కమముగా యౌవన వంతులై మహావీరు లైరి. ఇచ్చి నీకుమారి యావన మంకురించిన తోడ నే వెనుకటి వలే నలువురకంటను బడక యంతఃపురమున నే వర్తిం చుచుండెను.

యూవనవంతు డై , మహావీరుఁడై , యఖిలవిద్యానిపు ణుఁడై, యన్ని కార్యములందుఁ దనకు సహాయుఁడై వర్తించు నభయసింగును జూచి పరమారుఁడు మిగులఁ బ్రేమించి యత నికి సేనానాయక పదవి నొసంగుటయే కాక యాంతరంగిక కార్యములం దతని యాలోచనముఁగూడ గైకొనుచుండెను. ఆమహారా జతని నెక్కుడుగా గౌరవించుటచే దుర్గములోని వారుగూడ నతనియందు గౌరవబుద్ధితో నే మెలఁగుచుండిరి.

ఇరువదియై దేండ్ల ప్రాయము వచ్చినను నభయసిం గింకను 'బెండ్లి చేసికొన లేదు. ఇంతకుఁబూర్వమం దే యతనికి వివాహేచ్ఛ యంకురిం చెను గాని కొన్ని కారణములచేఁ దత్ప్రయత్నము' మాని వేసెను. అతఁడు చిన్నప్పటినుండియు నిచ్ఛినీకుమారితోఁగూడి చదివిన వాఁ డగుట చే నామెనుగు

ణములకును, మునీంద్రులకైన మోహము పుట్టింపఁజాలు దివ్య రూపమునకును, సామాన్య వీరులకు లభింపని యస్త్ర విద్యకును బట్టుపడి క్రమముగాఁ దన చిత్తము నా మెయందు లయింప జేసెను. యూనన సతియైన పిమ్మట నిచ్ఛినితో నతనికి సంబం ధము లేక పోవుటచే నామె గుణస్వభావము లెట్లుం డెనో యెఱుఁగకపోయెను. చిన్న తనమం దామె చూపుచున్న ప్రేమాతిశయమును దలంచుకొన్నపు డభయసింగునకుఁ దన కోర్కి ఫలించు నన్న దృఢవిశ్వాస మంకురింపక పోలేదు, తన మేనమామ చూపుచున్న గౌరవాదరములచే నతనియాశ మతింత వృద్ధి చెందెను. తా నుత్త మనంశజుఁ డగుట చేతను, రాజునకు మేనల్లుఁ డగుట చేతను నా రాజపుత్రి నభయసిం గవేక్షించుట యన్యాయము కాదు. ఇట్టి యసాధారణ కార ఇముల చే నిచ్ఛినీకుమారిని వరింపన లె నన్న తలం పతని కధిక మై యుండెను. కాని తా నావిషయమును దన మేనమామ కేజింగించుట యయుక్త ముకాదా ! చిన్న ప్పటినుండియుఁ దన గుణస్వభావము లెఱిఁగిన రాజునకుఁ దన్నుఁ దా నెింగింప వలసినయవసర మభయసింగునకు లేదు. కావున, నిచ్ఛిని యందుఁ గొండంతాస గలవాఁడై నను దానిని మనస్సులో నే యిఱికించుకొని పై సంబంధములను గుఱించి ప్రయత్నములను మాని వేసెను.

ప్రస్తుతమున నిచ్ఛినీరూపము తనకంటఁ బడక పోయి నను చిన్నప్పుడు తన హృదయమునఁ బదిలపఱుచుకొనియున్న


యాసుందరిరూపమును మాటిమాటికిని జూచుచు నిట్టూర్పులు పుచ్చుచుఁ గాలము గడ పుచుండెను. కాని, యతఁ డెంత కాల మటు గడపఁగలడు? ఆసుందరిని వివాహమాడవలెనన్న కోరి - యగ్ని హోత్రతుల్యమై హృదయకుహరమును దహిం చుచుండ నెట్టు లోర్చియుండఁగలఁడు ? కావున, నతఁ డూర కుండక యిచ్ఛినియభిప్రాయ మెట్లున్నదో, యామెజనకుఁ డామె సెన్వరి కీయఁదలంచుచున్నాడో, మొదలగుసమాచార తెలిసికొనవ లెనని యెంచి యిచ్ఛిని యతఃపురమున నర్తించు దాసీజనముతో స్నేహము చేయుచు వారికిఁ దగిన బహుమతు లిచ్చుచు, వారి నొక పరిఁ దనయింటికి రప్పించు కొనుచు, మఱియొక పరి రారాత్రిసమయములందుఁ దానే వారి యిండ్లకుఁ బోవుచు నీవిధమునఁ గాలము గడపుచుండెను.

ఒక నాఁ డభయసింగు నిశాసమయమున నొక యువతి యింటి కరిగెను. ఆమెయు నతని నుచితరీతుల గౌరవించి యాసనమునఁ గూర్చుండఁ జేసి 'అయ్యా ! మీ రెన్నో సారులు నాగృహంబునకు వచ్చినారు. మీవంటివారు మాయింటికి నచ్చుటచే మాయిల్లు 'పవిత్రస్థల మగుచున్నది. మేమును గృతార్థుల మగుచున్నాము. ఇందువలన నాకు మితిమీరిన యానందము గల్గుచున్నది. కాని, మీరిట్లు దయ చేయు చుండుటకుఁ గారణ మరయ నేరక యాకులపడుచున్నాను, మున్ముందుగా . మీ రాయకుల పాటును దొలఁగింపఁగోరు చున్నాను, ' అని పలికెను.

అభయసింగందుల కానందించి రూపవతీ ! నీవంటి బుద్ధిమంతురాలును, నుచితజ్ఞురాలును వేడొకతి యుండదు. నీచిత్ర లేఖనా చాతుర్యముగూడ మిగులఁ గొనియాడదగినది. కన్యాంతఃపురమున నీకున్న చనవు మఱి యెవ్వరికిని లేదు. రాజపుత్రిగూడ నిన్ను బహిఃప్రాణముగాఁ జూచుకొనును. ఇంతస్వల్ప కాలములో నే రాజకులమునందు నీ వింత గౌరవ మార్జించుటకు నీగుణసంపత్తి యే కాక వేఱు కారణ మేమి కలదు?

రూ-అయ్యా!నే నంత పొగడఁదగిన దానను గాను. ఇక నాప్రసంగము విడిచి మీరు వచ్చినపని యేమో తెలియఁ జెప్పుఁడు.

అభ: యువతీ ! ఏమియును లేదు. మీయంతఃపుర మునఁగల విశేషములను దెలిసికొనవచ్చితిని,

రూ: రాజపుత్రా! చెప్పఁదగినవి శేషము లేమియును లేవు,

అభ- సుందరీ ! నీవు మిగుల మంచిదానవు. కార్యమును నెఱ వేర్పఁదగిస శక్తి నీకుఁ దప్ప మఱియెవ్వరికిని లేదు. నాకు రెండవ హృదయమువంటిదాన వగునీకు నారహ స్యములు వెల్లడించిన నేమి చిక్కులు సంభవించును ? కావున, నామనస్సునఁ గలదంతయు వెడలఁబోసెదను వినుము. 'నేను జై తపరమారుని మేనల్లుఁడ ననువిషయము నీకుఁ డెలియునా ?


రూ- విన్నాను, 'రాజునకు మీయం దెక్కు డను గ్రహము గలదఁట కాదా ?

అభ-- అనుగ్రహమే కాదు, గౌరవమో !

రూ- అవును, అదియును గలదఁట. ఆ రాజు మిమ్ము మంత్రికంటెనుగూడ నధికముగా గౌరవించునఁట గాదా ?

అభ- అందసత్య మేమియును లేదు, ఇచ్ఛినీకుమారి యును, చళుక సింహుఁడును, నేనును గలసి చదువుకొన్నా మని కూడ నీవు వినియే యుందువు.

రూ- అవును, విన్నాను. అభ: సుందరీ ! చిన్నప్పటినుండియు సోమన స్సీచ్ఛినీ కుమారియందు నాఁటియున్నది.

రూ- అది యుక్త మే ! అట్టి సౌందర్యవతియం దెవ్వరి మనస్సు నాఁటుకొనదు ?

అభ-- కాని, యామెను బెండ్లాడుటయందు నాకందఱ కంటే నెక్కు డధికార మున్నది కాదా ?

రూ: నిశ్చయమే ! మేన టికము. ఇట్టి దాని నతిక్ర మించి పెఱవారికిఁ బిల్లనిచ్చినవా రెచ్చటనో కాని యుండరు,

అభ-- నాగుణములను, సత్ప్రవర్తనమును, వలనను ప్రజలవలనను నాకుఁగల్గుచుండిన గౌరవమును నీ వెఱుఁ గకపోవు. నే నా రాజపుత్రి నభిలషించుట న్యాయము కాదా! నీమనస్సున నున్న దున్నట్టు దెలుపుము.

రూ: రాజపుతా! నీమేనమామకూతును నీవభిలషించుట యెవ్వ రన్యాయ్య మనఁగలరు !


అభ---యువతీ ! నేను గోరునది మేమియును గాదు. నీవు నాపక్ష మవలంబించి యారాజపుత్రియును రాగమునకు నన్నుఁ బాత్రునిగాఁ జేయుము. ఇందులకుఁ దగిన ప్రతిఫలము నీవు చెందకపోవు.

రూ- న్యాయ్యపక్షము నవలంబించుట కభ్యంతర మేమున్నది ? తప్పక ప్రయత్నించెదను. అభయసిం గందులకు సంతసించి వెంట నే లేచి తాఁ గొనివచ్చిన ముత్యాలహారమును నాయువతి మెడలో వేసి “రూపవతీ ! ప్రస్తుత మిది బహుమానముగాఁ గైకొనుము. కార్యసాధనానంతరమున నిన్నింతకంటె . నెక్కుడుగా సంత సింపఁ జేసెదను” అని పలికి వెడలిపోయెను.

ఏడవ ప క ర ణ ము

భీమ దేవుని సం దేశము

జై తపరమారుఁ డొక నాఁడు కొలువుదీర్చి యుండెను. మంత్రులును, సామంతులును, సేనానులును, హితులును, బురోహితులును సభయందుచి తాసనములఁ గూర్చుండిరి. ఉదయ కాలమందలి తామరకొలఁకువలె నాసభయంతయుఁ గలక లలాడుచుండెను. అపుడు ద్వారపాలకుఁ డొకసం దేశ కునిఁ గొనివచ్చి రాజసన్నిధిని నిలిపి వెడలిపోయెను. ఆ రాయబారియు జైతునకు వినయపూర్వకముగా సమస్కరించి తదనుమతిని బడసి యుచితాసనమునఁ గూర్చుం డెను. పరమారుఁ డతనిఁ జూచి 'భీమ దేవుఁడు నాకు రాయ బార మంపియున్నాఁడా ? ఇది మిక్కిలి వింతగా నున్నది. మాకును, నతనికిని వ్యవహారము లేమియును లేవే! ఏదీ ! వినిపింపుమా, నీవృత్తాంతము' అని పల్కఁగా నాతఁడు లేచి నిలువఁబడి రాజేంద్రా ! నేను భీమ దేవుని స్నేహితుఁడను, న న్నమర సింహుఁడందురు. మారాజుననుమతి ననుసరించి తమ్ము దర్శింపనచ్చితిని. మారాజేంద్రుఁడు తమసన్నిధిని బల్కవలయునని చెప్పిన మాటలు యథాను పూర్విగా పించుచున్నాను. దేవరవారవధరింపుఁడు, “ఓరాజేంద్రా ! పరమారునంశజులు రాజపుత్రులలో సుప్రసిద్ధులు. మీ వంశ్యు లందతిలోను నీవు చుక్కలలో జంద్రునివలెఁ బకాశించు చున్నావు. జాతి చేతను, నీతి చేతను, విఖ్యాతి చేతను నీ వీ కాల మున వాసిగాంచినావు.” అని చెప్పుచుండ నతని కడ్డువచ్చి పరమారుఁ డిట్లనియె.

'ఓయీ ! ఇవి భీమదేవుఁడు పల్కిననచనము లే !' యడిగెను.

అమ: దేవా ! 'అవును, అతనినోటనుండి నచ్చిన మాటలే తు, చ తప్పకుండఁ జెప్పుచున్నాను' అని చెప్పెను.

జైతుండాశ్చర్యమును సూచించుచు 'ఆఁ, ఏమి ! భీమ దేవునోటనుండి వచ్చినమాట లేయివి ! ఆశ్చర్యమాశ్చ ర్యము ! అగ్ని హోత్రము చల్లనియమృతబిందువులను గురియు చున్నదే ! దారుణమగు పిరంగి కోమలములగు పుష్పగుచ్ఛ ముల వెదచల్లుచున్నదే ! క్రూర హృదయమగు పెద్దపులి సాధు త్వమును వెల్లడించుచున్నదే ! 'మంచిది, కానిమ్ము! చెప్ప వలసినది చెప్పుము' అని పల్కెను.

ఇంతకుఁబూర్వము భీమ దేవుఁడు జై తపరచమునకు గర్భశత్రువై పక్కలోనిబల్లెమై, పరమారుని పేరు విన్న తోడనే బగ్గునమండిపడుచుండెడివాఁడు. అట్టివాఁ డిపు డిట్టి మృదుమధుర వచనములు పలుకుచున్నందులకుఁ బరమారుఁ డాశ్చర్యపడి యిట్లు పలికెను.

అమర సింహుఁడు మరలఁ దన ప్రసంగ మారంభిం చెను. ‘భూపాలా ! అత్యుత్తముఁడవగు నీతో జుట్టఱకము చేసికొన మనస్సువ్విళ్ళూరుచున్నది. నీకుమారికను (ఇచ్చి నీకుమారిని) సంతోషముతో ఘూర్జర రాజ్యలక్ష్మికి సపత్ని గాఁ జేయుదువు గాక ! నీపుత్రిక తన సౌందర్యవిలాసములచే నీ భీము దేవునంతః పురము నలంకరించుఁగాక ! ' అని పల్కుచుండఁ బరమారుఁ డడ్డుపడి యిట్లనియె.

తెలిసెఁ దెలిసె ! ఈమంచిమాటలు, ఈస్తోత్రములు 'నిందులకా ? 'ఓయీ ! మీ రాజుకోర్కె యెప్పటికిని నేఱ వేఱదు. పరమపవిత్రమగు హిందూమతమును విడిచి జైన మతావలంబియగు నతనికి నాకూఁతు నిచ్చెద నన్న మాట వట్టిది. అట్లోనర్చి నిర్మలమగు నా వంశమును నకళంక ముగా


జేయ నీపరమారుఁ డంత బుద్ధిహీనుఁనుఁడు కాఁడు. భీమరాజు పరాక్రమవంతుఁడు; అఖండ సైన్యముగలవాఁడు. విస్తారమగు రాజ్యముగలవాఁడు. చాళుక్యవంశము లోకమునఁ బ్రసిద్ధి గాంచినది. అట్టివానికి నాకూఁతు నర్పించుట కెంతయో సంత సించి యుందును. నీ జై నసంబంధము చేఁ దన్నును దనవంశమును గలుషితము గావించుకొన్న యారాజునకు నాకుమారి నే ట్లిత్తును ? పోయి యీవృత్తాంతము నీ ప్రభువునకు విన్న వింపుము.”

అమరసింహుఁ డావచనములు విని ‘రాజేంద్రా ! అథ్లె విన్నవించెదను. కాని, తమ రతనికోర్కిని దీర్పని చోఁ జెప్పుమన్నవి కొన్ని మాటలు మిగిలియున్నవి. మీ రతనికి విరుద్ధముగా నడవనున్నారు.. కావున, నావచనములు తెలియఁ జెస్పెదను. 'ఓరాజా ! నీవు నాకోర్కిని విఫలముగావించితి వేని నీ రాజ్యమున కకాలప్రళయము సంభవించిన దని యెఱుం గుము. భీముఁడు మయిమయిఁ బోవువాఁడు కాఁడు. అపార సైన్యములతో వచ్చి రెండునిముసములలో నాబూగడమును మంటఁగలిపి, మిమ్ముల నవలీల జయించి; విజయలక్ష్మితోను, నాబూగడ రాజ్యలక్ష్మితోను నీకూతును వరింతును. శత్రు వులపాలిట ప్రళయకాలయమునివంటి భీమ దేవు నెదిరించువాఁ డెవ్వఁడో చూచెదనుగాక!' అని పల్కుచుండఁగనే పర మారుడు మిగుల గోపోద్దీపితుడై 'ఓయీ! జైతపర మారుఁడు మీ రాజువీరాలాపములకు జంకెడి పిఱికిపంద గాఁడు. పరమారు . కంతపరాక్రమ హీనుఁడుఁ గాఁడు. ఆబూ రాజ్య మంత గొడ్డువోవ లేదు. లక్షలకొలఁది వీరు లున్నారు. వీరాధి, వీరులగు పదు నెనమండ్రు సామంతప్రభువు లెల్లప్పు డాబూ గడము నఱచేతిలోఁ బెట్టికొని రక్షించుచుండఁగ దీనిని గన్నెత్తి చూచువా రేవ్వరు ? నాకంఠమున జీవితమున్నంత కాలమును నారాజ్యముగాని, నాకుమారిగాని యాభీమునిపో లగుట యసంభనము. మఱియు, నేమహాత్ముఁ డుత్తర గర్భము లోని బాలకునిఁ బరీక్షితుని గాపాడెనో, యేభక్త వత్సలుఁడు దేవేంద్రుఁ డతిభయంకరముగాఁ గురియు జాలవానలవలన గోపాలకులరక్షింపఁగోరి గోవర్ధన గిరి గొడుగువలె ధరించెనో యాపర మేశ్వరు: డా రాధాకాంతుఁడు మమ్ముద్ధరింపక పోఁడు, ఎవఁడు త్రిపు రాసుర గజాసుర భస్మాసుర ప్రముఖులగుదుష్టు లను సంహరించి లోకోపద్రనము లడంచెనో, యేకరుణా కరుఁడు భక్తులకష్టములఁ దొలఁగించి దర్శనమాత్రమున నే మోక్ష మొసంగ నీయాబూపర్వత శిఖరమున నెలకొనెనో యాయచ లేశ్వముఁ దా దేవ దేవుఁడు మమ్ము రక్షింపక పోఁడు' అని నుడివెను.

అతని ధీరవచనములు విని సభ్యులందఱును సంతోష, ముచేఁ బులకిత శరీరులైరి. తావలచిన కస్యకామణి యేమగునో యని యంతవఱకును దడదడ కొట్టుకొనుచున్న చిత్త ముతో నుండిన యభయసింగు పొందిన యానందమునకు మేరయే లేదు. అమరసింహుఁడు రోజునొద్ద సెలవు గైకొని సభ నుండి వెడలిపోయెను. అనంతరము కొంత సేపటికి జైతునికోపము 'పోయెను. సభచాలించి యంతఃపురమునకుఁ బోయెను. నొక రమణీయ ప్రదేశమునఁ గూగ్చుండి నాఁటి సభానృత్తాం తమును దలపోయ నారంభించెను. జైనమతావలంబియగు భీముఁడు పరమ పవిత్రమగు హిందూమతముచే బుఁడగు తనకూఁతు నడుగుట పెద్దపరాభవముగాఁ దలంచి పర మారుఁడు వికటముగా సమాధానము చెప్పి భీముని రాయ బారిని బంపించి వేయుట మిగులఁ బ్రమాదకర మని దుప్పు డతని మనస్సునకుఁ దట్టెను. అతఁ డెంత ధైర్యవంతుఁ డైన నా విషయము నాలోచించునపు డతని హృదయము చెల్లా చెదరు గాక పోదు. జై తుని రాజ్యము మిగులం. బెద్దదిది కాదు. అతని సైన్యము గూడ స్వల్పమైన దే ! ఎవనితోఁ దాను విరోధ మవలంబిం చెనో యాభీమ దేవుఁడన సామాన్యుఁడు కాడు. అతఁడు మిగులఁ బరాక్రమశాలి.

దానికిదో డపారమగు సైన్యముగలవాఁడు. తలంచిన కార్యము నెఱ వేర్చుకొనుటలో నతనికున్న పట్టుదల వేఱొక రికి లేదు. అట్టి భీమునితో వైరమూనుట పులితోఁ జెలగాటము వంటి దనియు, నతిభయంకరమగు మృత్యువునోటిలోనికోర నూడలాగయత్నించుట వంటి దనియు జై తెపరమారుఁ డెఱుఁ గును. " తానంపిన ప్రత్యుత్తరము విన్నతోడ నే భీముఁడు కోపోద్దీపితుఁ డై యఖండ సై న్యమును గూర్చికొని తన పై కెత్తివచ్చుననియుఁ గొలది కాలములోనె తన రాజధాని పై


మృత్యు దేవత తాండవముసల్ప నున్నదనియు నతఁడు నిశ్చయింపకపోలేదు. అయిన, నతఁ డిప్పుడేమి చేయును ? తనకూఁతు నర్పింతునని భీమునకు వార్తపంపిన . వెనుకటి యపాయ మొక్క క్షణములోనే మాయమగును. కాని, పౌరుషవంతుఁడును, క్షత్రియవంశసంభవుఁడును నగుపరమా రుఁడు తనకు సంపూర్ణ నాశనము రానున్నను నట్టినీచకృత్య మున కిష్టపడునా ? కులక్రమాగతమగు నాబూగడ రాజ్య తనతరమున శతగతమయిన నగుగాక ! పుత్ర మిత్రస మేతుఁడై సైన్యముతో గూడ యుద్ధరంగమునఁ బ్రాణము లర్పింపవలసిన సమయము సంభవించిన సంభవించుఁ గాక ! గుణరూపసంపదలచే రెండవ లక్ష్మీ దేవివ లెనున్న తన కూతు నిచ్ఛినీకుమారిని జైనమ తానలంబి యగు భీమున కర్పించి పరమపవిత్రమగు తనహిందూ మతమునకుఁ గళం కము తెచ్చునా ? అట్లెన్నఁడును బరమారుఁడు చేయ లేఁడు, చేయఁడు.

ఎ నీ ని ద వ మ క ర ణ ము

పృథ్వీరాజు

ఉత్తర హిందూస్థానమునఁగల పురములలో ఢిల్లీ నగ కము తలమానికమువంటిది. అదియే పూర్వము ధర్మరాజు నకుఁ బ్రధాననగరమై యింద్రప్రస్థ మను పేరితో వాసిఁ గాంచి

వది. దానికి డిల్లీ యను పేరెప్పుడు వచ్చెనో మనము స్పష్ట ముగాఁ జెప్పలేము గాని హిందూ దేశముపై దాడి వెడలి వచ్చిన మహమ్మదీయులలో మొదటివాఁడగు గజనీ కాలము నకు పూర్వమందే యాపురమున కాపేరు గలుగుట మాత్రము నిజము. మిక్కిలి పాటుపడిన యింద్రప్రస్థమును దిల్లియుఁ డను "రాజు "బాగుచేయింప నతని పేరుననుసరించి యానగరమునకు ఢిల్లీ యను నామము గల్గినట్లు గొందఱుపండితులు చెప్పుదురు. ఆది యెంతవజకు నిజమో మనము చెప్పఁజాలము.

క్రీ. శ. 1750 న వత్సరమున, తూరువంజుం డగు ననంగపాలుడు ఢిల్లీపురమును బాలించుచుండెను. అతనికిఁ బురుష.సంతతి లేదు. ఇరువురు కూఁతులు మాత్రము గలరు. ఆ కాలమున రహతూరువంశజుఁడగుకాన్యాకుబ్జపురమును (క నౌజ) పరిపాలించుచుండెను. అతఁడు ఢిల్లీశ్వరునియశ క్తతను గనిపట్టి యతనిజయించి యారాజ్యము నాక్ర మించుకోన వలెనను తలంపుతో ఢిల్లి పై దాడి వెడలెను, అనంగ పాలుఁ డది విని మనస్సులో జంకియు,. లేనిపోని ధైర్యమును చెచ్చుకొని విజయపాలు నెదిరింప నిశ్చయించుకొనెను.

ఆ కాలమున చోహనవంశజుఁడగు నానంద దేవుకుమా రుఁడు సోమేశ్వరుఁ డజమీరు రాజ్య మేలుచుండెను. అతఁడు విజయపాలుని దాడినిగూర్చి విని సైన్యములతోఁ బోయి యనంగ పాలునకుఁ దోడయి విజయపాలు నెదిరించి పోరి జయముగాంచెను. విజయపాలుఁడు పరాజితుఁడై పారి పోయెను. ఆనందపాలుడు సో మేశ్వరుని తో డ్పాటునకు సంత సించి తనకూ తులలో : బెద్దదానిని గమలా డేవి నతని కిచ్చి వివాహము చేసి తన బహుమతు లొసంగి పంపి వేసెను, సోమేశ్వరునకు గమలా దేవియుము. స్వరా జుదయించెను,

ఆతి వృద్దుడగు ననంగ పాలుడు తన 'దౌహిత్రుఁడగు వృద్వీరాజును రాజ్యమున సభషిక్తునిఁ గావించి రాజర్షి యై బదరికాననమునకుఁ బోయెను. తండ్రియగు సోమేశ్వరుఁ డజ మీరును బాలించుచుండఁగాఁ బృద్వీరాజుడిల్లీ పురము నేలు చుండెను. ఇట్లుండ గుజరాతును బాలించు బీమ డవుఁ డజ మీరు రాజ్యము పై దాడి వెడలి సోమేశ్వరునితోఁ బోరు సల్పెను. సోమేశ్వరుఁడును నతనితో ఘోరముగాఁ బోరి వీర మరణమునందెను. పృద్వీవరాజది విని తండ్రి మరణమునకు విచారించి యుత్తరక్రియలు గావించి యజమీరు రాజ్యమును డిల్లీతోఁగలపి పాలించుచు భీమ దేవుని జయించి తనతండ్రిని జంపిన పగను దీర్చుకొనవలె నని నిశ్చయించి తగిన సైన్య మును గూర్చుకొని సమయమున 'కేదురు చూచుచుండెను. ఢిల్లీశ్వరుఁ డొక నాఁడు కొలువు దీర్చియుండెను. సింగపుఁ గొడమలవంటి రాజకుమారు లతని బరి వేష్టించి యుండిరి, చాందుభట్టను మహాకవి చోహనునంశజుల సద్గుణములను, ఖురాళమమును వర్ణించి సభ్యులను సంతసింపఁ జేసి యుథా, స్థానమునఁ గూర్చుండెను. అంతట ద్వార పాలకుఁడు రాజు ననుమతి చొప్పున నేడ్వురు రాజకుమారులను సభలోనికి వర్గం: కొనివ చ్చెను. వారి శర్రీరములు మిగుల దీర్ఘ ములుగా నుండెను. వారిబాహు డండములు ఒలిసి యేనుఁగుతుండముల ననుకరించు నుండెను. వారిచూపులు మిక్కిలి ధీరము లై యుండెను. పెక్కేల ! వారియాకార ములు చూచినచో వారు మహా వీరులన్న బుద్ధి పొడమకపోదు. ఆవీరు లల్లంతదూరమునుం డియే వినయముతో రాజునకు నమస్కరించిరి. అంతఁ బృ్ద్వీ రాజు వారి నెదుర్కొనివచ్చి యాసనములఁ గూర్చుండ నియ మించి యాదరించెను. రాజు చేసిన గౌరవమునకు వారు మిగుల నానందించిరి. వారిలోఁ బెద్దవాఁడను ప్రతాపసింగు లేచి రాజసన్నిధిని నిలువఁబడి యెల్లరు విన నిట్లు పల్కెను.

'ఓమహారాజా ! మావృత్తాంతము యథార్థముగాఁ జెప్పుచున్నాను, అవధరింపుఁడు, మా కాపురము ఘూర్జర దేశము. మేము చాళుక్యవంశమునఁ బొడమిన వారము. ఇప్పుడు గుజ రాతును బాలించుచున్న భీమ దేవునికి జ్ఞాతులము, మా జనకుని పేరు సారంగ దేవుఁడు. భీమరాజు గర్వము చే గన్ను గానక మమ్మును, మాతండ్రిని దిరస్కరించి తన రాజ్యమునుండి తఱిమి వేసెను. మేము చేయునది లేక మా జనకునితోగూడ కొండల కేగి యచ్చట నే కాపురముండి మాకిట్టియిడుమలు గల్గించిన భీమ దేవునకుఁ దగిన ప్రతీకారము చేయవలెనని నిశ్చయించి కొంటిమి. మే మతని రాజ్యములోని గ్రామములఁ గొల్లఁగొట్టి యింతవఱకును జీవించుచుంటిమి. కొన్ని దినములకిందట నాభీమునకుఁ బ్రాణపదమైన పట్టపు టేనుఁ గొక కొలినిలో విహరించుచుండ నేనును నాతమ్ముఁ డుగు నీయరిసింగును గలసి దాసిని జంపితిమి. మే మొనర్చిన యాఅయుపకారమున కారాజు మిగులం గుపితుఁడై మ మ్మా కొండలందు గూడ నుండనీ రాదని నిశ్చయించుకొని సైన్య ములవచ్చి మమ్ముఁ దరిమిమి వేసెను. మాజనకుఁడు పర లోకగతు డయ్యెను. చేయునది లేక మే మేడ్వురమును మహా రాజు నెవ్వని నేసి యాశ్రయించి జీవింపఁదలంచి నీవు మహావీరుఁడవనియు, మంచివాడవనియు విని నీ చెంతకు వచ్చి నారము . మాకొలువు నంగీక రింపుము. సమయము వచ్చినపుడు మాప్రతా పొదులను గనుఁగొనుము' అని పలికి తన స్థానమునఁ కూర్చుండెను.

పృద్వీరాజు మంత్రులతో నాలోచించి వారిని జూచి 'రాజపుత్రులారా ! చాళుక్యవంశ సంభవుఁడగు భీమ దేవున కను, మాకును విరోధము ప్రబలుచున్నది. పుట్టుకచే శత్రు కోటిలోనివారగు మీకాశ్రయ మిచ్చుట రాజనీతికి విరుద్ధము ' 'అయినను మీరు, భీమ దేవునితో బద్ధశత్రుత్వ మవలంబించి యున్నారని యిదినుకే చారులవలన వినియున్నాము. మీ మాటలయం దసత్య నుమియు లేదు. కావున, మీ కాశ్రయ మిచ్చితిమి. మీరు సుఖముగా మాపురమున నుండి మా గౌరవ మందుచుండుఁ డని పల్కి వారిఁ జేరఁదీ సెను.

ఆకాలమునఁ బృద్వీ రాజు ధైర్యసాహములచేతను, సద్గుణములచేతను, దేశాభిమానము చేతను మిక్కిలి ప్రసిద్ధి ధి కొంచెను. అజ్మీరు డిల్లీ రాజ్యములు గలసి యొక్కటియగుటచే నుత్తరహిందూస్థానమున నతఁడు మిగులఁ బ్రబలుఁడయ్యెను, రాజ్యము విస్తరించుట చేతను, సైన్య మెక్కుఁడగుట చేతను నతని నెదిరించుట కెట్టివారును జంకుచుండిరి. అప్పటివారలలో ప్రభలుడగు భీమ దేవుఁడు గూడఁ బృద్వీరాజు నెదిరించుటకు వెనుదీయుచుండక పోలేదు. మఱియుఁ దండ్రినిజంపినపగ దీర్చు కొనుటకుఁ బృద్వీరా జెప్పుడో తన పైకి దండెత్తి రాకమానఁ డని నిశ్చయించుకొని భీమ దేవుఁ డతి జాగరూశుఁడై యుండెను

పృద్వీరా జిదివఱ కే యిచ్ఛినీకుమారి గుణరూపములను విని యామెను వరింపఁదలఁచియుండెను. తన కాకుమారినిమ్మని యడిగిన జై తపరనూరుఁ డత్యాదరముతోఁ దనకోర్కి దీర్చు నని పృ్ద్వీరా జెఱుంగును. అయినను, రాజకుమారియనురాగ లత 'యెటు ప్రాకుచున్నదో తెలియకుండ నందులకై ప్రయ త్నించుట 'వ్యర్థమని యూరకుండెను. కాని, యాతఁ డామె వృత్తాంత మెప్పటికప్పు డరయుచుండక పోలేదు.

తొ మ్మి ద వ ప్రకరణ ము

సం భాష ణ ము

కాలవశమున ముదుసలియైన సూర్యుడు పడమటి కొండ శిఖరమునఁ దిరుగుచుఁ బ్రమాదవశమునఁ గాలు జాటి సము ద్రమునఁ బడి యదృశ్యుఁ డయ్యెను. తనప్రియునికి సంభవిం చిన యాపద దెలిసికొని పడమటిదిశ చేయుచున్న రోదన ద్వవ నులన లె దమతమ కులాయములకుఁబోవు పక్షుల నినాదము లంతటను వ్యాపించెను. పతివి యోగమున కోర్వలేక యేడ్చుట చేత నే కాబోలు బడమటి దిశముఖ మెర్ర వారి యుండెను. దుఃఖ వినశురాలగు నాదిశా కాంత వీడ్వడిన తల వెండ్రుకలో యనం జీకట్లు వ్యాపించెను. ఆమె నోదార్చుటకై- వచ్చుచున్న బంధుజనులవలె జుక్క లొక్కొకటి చొప్పున కానవచ్చు. చుండెను. ప్రజలు తమతమ కార్యములనుండి మరలి సాయం కాలపుఁజల్లగాలుల ననుభవించు చుండిరి. ప్రదోషసమయు మగుట చే శిష్టజనులు కాలు సేతులు గడిగికొని సంధ్యావంద నాదులు చేయుచుండిరి. " దేవాలయములందు ఘంటాధ్వనులు వినవచ్చుచుండెను.

అట్టిత ఱి నచలేశ్వరాలయము భక్త జనులతో నిండి పోయెను. కొందఱు దేవిని నుతించుచుండిరి. కొందఱు శంకరు నకుఁ బ్రియతమమగుబూది నొంటినిండఁ బూసికొనుచుండిరి. కొండఱు భక్తి చే నిమీలిత నేత్రులయి ధ్యానించుచుండిరి, కొంద రీశ్వర ప్రసాదమును స్వీకరించి పైకి నచ్చి యగ్ని కుం డము తీరమునఁ గూర్చుండి మాటాడుకొనుచుండిరి. కొంత సేపటికి వచ్చిన వారందరను స్వామి నారాధించుకొని వెడలి పోయిరి. అర్చకులుగూడ దేవాలయపు తలుపులు బంధించి తమయిండ్ల కరిగిరి. అట్లండురును వెడలిపోయినను నొక యువ తియు, నొక పురుషుడును మాత్ర మచ్చటినుండి కదలకుండిరి. దేవదర్శనార్థము వచ్చిన ప్రజలందఱును వెడలిపోఁగానే వా రిరువుకు నొక చోట గూర్చుండి యేదియో ప్రసంగించుకొను చుండిరి. చీకటిలో నుండుటచే వారెవ్వరో గుఱుతింప లేము గాని వారి సంభాషణమునలన వారియుదంత మేముయినను దెలియు నేమో చూతము. వా రేట్లు సంభాషించుచుండిరి .

పు- యువతీ ! నీవు సుఖముగా నున్నావా ! నీ ప్రయత్నము లెట్లున్నవి ?

యు. నాకు సుఖమే ! కాని, నాయత్నము లేమియు సాగుచున్నట్లు లేదు,

పు--ఆ రాజకుమారియభిప్రాయ 'మెట్లున్నది ?

యు— డిల్లీశ్వరుని వరింప నువ్విళ్ళూరుచున్నది.

పు. ఆమెమనస్సును ద్రిప్పుటకుఁ బ్రయత్నింప లేదా?

యు. లేకేమి ! ఎంతప్రయత్నించినను లాభము లేదు, పృద్వీశ్వరుని పై నా మెకు జనించినయనురాగ ప్రవా హము నుట యసాధ్యము. అయినను బరమారునియభి ప్రాయ మెట్లున్నది?

పు— కన్యక కిష్టము లేనపుడు పరమారునియభిప్రాయ ముతో నేమిపని? అయిన నాతనికిఁగూడఁ దనకూఁతును మన ప్రభువున కీయ వలెనని లేదు. జైనమతసంబంధము చేఁ జెడిపోయిన వాఁడఁట మన రాజు. నయమునను, భయమునను నెంత చెప్పినను నతఁ డిష్టపడ లేదు.

యు... అట్లయిన నాబూగడమునకుఁ గాలము సమీ సించుచున్న ట్లున్నది.

నోట నుండ పు: -సందేహమేమి ? ఈవార్త విన్నతోడనే మన రాజ మండిపడి సేనావారముతో గూడివచ్చి యీదుర్గము నవలీనే మంట గలిసి వేయును,

యు: ఇట నుండ నేమి పని ! నీతో వత్తునా ?

పు: రావద్దు. ఇంకను నీవిట నుండ వ లెను. ఎట్లయి నను గార్యము నెరజ వేర్పవలసి యున్నది. నేను కొలఁదికాల మలో నే మరలి వచ్చెదను.

యు: .మంచిది. నీయిష్ట ప్రకారమే నడ చెదను,

అంత నాయికువురు నాప్రదేశమును విడిచి వెడలి పోయిరి,

ప ద వ ప్రకరణము

భీమ దేవుని వీరావేశము

కామ మంతశ్శత్రువులలో నొకటి. దానికి లోబడని 'వాఁడే ధన్యుఁడు. దాని నగ్నితోఁ బోల్తురు. ఆపోలిక దానికి దగియున్నదనుటకు సందియము లేదు. అగ్ని తానాశ్రయించిన వస్తువును దహనము చేయును. కామముగూడ నెవ్వరిని దా నాశ్రయించునో వారినే చెఱుచును. ఎన్ని కట్టియలు దెచ్చి వై చినను నగ్నికి దృప్తి లేదు. ఎన్ని సుఖము లనుభవించినను దృప్తి లేదు. అగ్ని నీటి చేఁ జల్లారునట్లు కామము జ్ఞానముచే సశించునని ' తెలిసికొని యెవఁడు జ్ఞానము నభివర్ణించుకొని కామమును ని గహించునో వాడే లోకములో సుఖవంతుఁ డగును. లేని - వాజన్మము దుఃఖభోజనమే

భీమ దేవు:డిచ్చి నీకుమారి సౌందర్యాదులు రూమెను వరింపన లెనన్న కోర్కికి లోబడి పలుపాల్లు పడఁ జొచ్చెను. అబూగడమున కరిగిన యమర సింహుఁ దెప్పుడు వచ్చునో, ఇచ్ఛిని దన్ను వరింపనున్న దన్న శుభవార్త యెప్పుడు దన చెవిని వేయునో యని కాసుకొని యుండెను,

ఒక నాఁ డొకచారుఁడు వచ్చి నమస్కరించి చేతులు జోడించి నిలువఁబడెను. భీమదేవుఁ డతనిఁ జూచి 'ఓరీ ! నీ వెనఁడవు ! ఎక్కడికిఁ బోయివచ్చితివి ? ' అని యడిగెను.

చారు: దేవా ! తమపినతండ్రికుమారులు ప్రతాప సింహాదు లెచ్చటికిఁ బోయిరో తెలిసికొని రానలయు నని నా కాజ్ఞాపించినారు. దేవర యాజ్ఞ చొప్పున నానృత్తాంత మరసివచ్చితిని.

భీమ: వార్త లేమి ? చారు: .మహాప్రభూ ! ప్రతాపసింహాదులు ఢిల్లీశ్వరు నాశ్రయించి యున్నారు. ఆమహారాజు వారి నెక్కుడుగా నాదరించుచున్నాడు.

భీమ: _చీ ! తుచ్ఛులు, తుచ్ఛులు. చాళుక్యవంశ సంభవులగువారు తమవంశమునకుఁ బరమశత్రువగు చోహన వంగజుని పృథ్వీరాజు నాశ్రయించినారా ? దురాత్ములు మా వంశమున కప్రతిష్టఁ గల్గించిరి. చీ ! చీ ! అధమాధములు, ,

ఎంతపని చేసినారు. అంతకంటే ముష్టి యెత్తుకొని జీవింప రాదా! ఇంకను వార్త లేమి ?

చారు: దేవా! పృద్వీరాజు గొప్పసై న్యమును గూర్చుచున్నాడు. తండ్రిని జంపిన తమపై బగ సాధించుకొన మిగులఁ ద్వరపడు చున్నాఁడు. స్వల్ప కాలములో నే మన దేశ ముపై డాడి నెడలివచ్చునట్లు తోచు చున్నది.

భీమ: మంచిది, నీ విక: బొమ్ము. అని వానిని బంపి వేసి 'ఈవార్త మిగుల భయంకరమైనదియే! అజ్మీరు రాజ్యము డిల్లీతోఁ గలయుటచేఁ బృద్వీరాజు రాజ్యము ప్రబలమై మా వంటి వారికి హృదయ శల్యమగుచున్నది. దాని బలమును గొంత యణంచినఁగాని మావంటివారికి సౌఖ్యము గలుగదు. నే సందులకై తగిన ప్రయత్నము చేసెదను' అని యాలోచించు కొనుచుండ సమర సింహుఁడు వచ్చి నమస్కరించి యాబూ గడ వృత్తాంతము నంతయును విన్నవించెను. అది విన్న తోడనే భీమ దేవునకుఁ గామాగ్నితోపాటు క్రోధాగ్ని కూడఁ బ్రబలి మండఁజొచ్చెను. హృదయమునం దున్న క్రోధాగ్ని జ్వాలలు మీఁది కెయుట చేఁ గంది వోయిన యతని ముఖమును, నేత్రములును మిక్కిలి జేవురిం చెను. బొమముడి చే నతనిలలాటము కడు భయంకరముగా నుండెను. అతఁ డమరసింహునిఁ జూసి 'ఆ! ఏమీ ! పరమారుఁ డేమనెను. జై నమత సంబంధము చే నేను చెడి పోయితి ననియా ! నావంశము మలిన మయినదనియా ! ఇట్లు

నిర్భయముగాఁ బల్కిన యాజై తునినాలుక నీఖడ్గముచే తుత్తునియలు చేయనలదా ? ఏమీ ! భీముఁ డాతనికంటి కొక నలుసు వలె గన్పడుచుండెను గాఁబోలు! భీముని యాటోప మతికి మఱవునకు వచ్చెనా ? ప్రళయకాల మునివంటి యీ భీముని కోపమునకుఁ బాత్రుడగు నీయపా త్రునిఁ బరమారు నెవ్వరు రక్షింతురో చూచెదనుగాక ! నాప్రచండ సైన్యము లనుసముద్రముచేఁ జుట్టంబడి యాయుధహతులనెడి తరంగముల దెబ్బలుదినుచు నడుగంటుటకుసిద్ద ముగానున్న యీ యాబూదుర్గమ నెడినౌక నెవ్వఁ డుద్ధరించునో చూతము. తనవంటివాఁ డెంత ప్రయత్నము చేసినను దుర్లభమగు నాసంబంధము సులభముగా లభించినందుకు సంతసించుటకు మాఱుగా నాచురాత్ముఁడు దోషారోపణము చేసి నిరసించెనా ! ఇందులకుఁ దగినదుష్ఫలమును జై తుఁడు :స్వల్ప కాలములో నే పొందగలఁడు. ఆరాజకుమారి పృద్వీ రాజు నే వరించునా ? నన్నుఁ గాదని యామె యా రాజాధము నెటు వరించునో కనుఁగొందము. పరమారుఁడు నాసంబంధ మున కేల యియ్యకొనఁడో, యాయిచ్ఛిని నా కేల భార్య గాదో చూతము ! అమర సింహా ! ఇక నాలస్య మేల ! మంత్ర్లను బిలువనంపుము. దిగ్గజముల చెవులు చెవుడుపడ మనరణ భేతుల మ్రోయింపుమనుము.

మన సేనా నాయకులను వేగిరింపుము. స్వల్ప కాలములోనే మన చతురంగబలములు కాళ్ళ తొక్కుళ్ళచే భూతల

. మును జూర్ణగా గా వించుచుబోయిజూర్ణ ముగావించుచుఁయాబూగడమును ముట్టడించుఁగాక ! మనవీరుల సింహనాదము చేతను, ఏనుఁగుల ఘీంకారములచేతను ఆబూగడములోని యతఃపుర మందిరములు రాఁబోవునాపద కేడ్చుచున్నట్లు ప్రతిధ్వనులు చేయుఁగాక ! అని యిట్లు కోపా వేశము చే నొడ లెఱుఁగక పలుకుచుండ సమరసింహుఁ డతని కిట్లనియె. 'దేవా ! తామింతయాగ్రహము చూపనవసరము లేదు. పరమారునిమాటలతో మనకుఁ బ్రయోజనమేమి ? అతని రాజ్యలక్ష్మిని మన మాసింప లేదు. కావునఁ, బోరుసల్పి యాబూగడమును జయించుటకుఁ బ్రయత్నింప నేల ? ఇక్కార్యమును సాధింప దండోపాయముదక్క వేజు పాయములు లేవా ! ఏవిధినై న మీరిచ్ఛినీకుమారిని బెండ్లియాడినఁ జాలును, అదియే మనకు ముఖ్యకార్యము, ఈస్వల్ప కార్యమున కంత ప్రయత్నమా ? గోళ్ళతో జీల్చు దానికి గొడ్డళ్ళేల ! కావునఁ, దమరు కొంచెము శాంతివహించి యుండుఁడు. సర్వమును జేసెద' అని పల్కి. యప్పటి కతని యుద్రేకము తగ్గించెను,

పదనొకండవ ప్రకరణము

అభయసింహుని ప్రయత్నములు

జై తపరమారుఁడు తనకూఁతు నియ్య నని చెప్పి భీమదేవుని సం దేశము నిరసించి నప్పటినుండియు సభయసింగుని

కిచ్ఛినీకుమారియం దాశ మఠంత పర్ధిల్లెను. అది హెచ్చుచున్న కొలంది. నతడక్కార్యసాధనమున కై ప్రయత్నముల నేకములు చేయఁదొడఁగెను. సనుర్థు రాలగు రూపవతి తన కార్యము నెఱ వేర్పఁజాలునన్న నమ్మక మున్నను నతఁకంతటితో సంతుష్టి. చెందక తనతల్లిని లలితా దేవిని గూడ నందువిషయమై ప్రోత్సాహించెను. తన మేనగోడలిని దన కొడుకున కిమ్మని యడుగుట కామె యెంతయు స్వతంత్రురాలు. మఱియు; యోగ్యురాలు, గుణవంతురాలు, సౌందర్య వంతురాలు నగు నిచ్ఛినీకుమా రివంటి దానిని కోడలుగాఁగైకొన నెవ్వరి కిష్టముండదు. కావున, లలితా దేవికిఁ గూడ నిందువిషయమై యాశ లేక పో లేదు.కాని, యిచ్ఛినికిఁ బృద్వీ రాజునందు ధృథాను రాగముండుట నెఱిఁగినది గావున నిఁకనందులకై ప్రయత్నింప వ్యర్థమని యూరకుం డెను. లలితా దేవి బుద్ధిమంతురాలు గావున లోకములోని సామాన్య స్త్రీలమేనతీకము చేసికొనుటయందు మొండి పట్టుదల వహింప లేదు.

కానీ, యభయసిం నూరకుండనిచ్చునా ? రాత్రిందినము లామె చెవి నిల్లుగట్టుకొని చెప్పి చెప్పి యతఁ డెట్లయిన నేమి, తనతల్లిని తన కార్యసాధన కభిముఖు రాలినిగాఁజేసెను. లలి తా దేవి కుమారునియందలి ప్రేమాతిశయము చేనప్పని కొప్పుకొన్నను దాని నెట్లు సాధించుట ? ఇచ్ఛినీకుమారికి బోధించుట కామె సమర్థురాలును గాదు. స్వతంత్రురా లును గాదు.తనయన్నయగు పరమారు నడుగుట తప్ప నామెకు సాధనాంతరము లేదు. మఱియు, నామెయంతనఱకే స్వతంత్రురాలు. కుమారునికోర్కి దీర్చుట కామె యొక నాఁడన్న గారిని జూచి తనయభిలాష మెజిఁగించెను. అందుల కతఁడన్మూ! అదియు నాకును సంతోషమే ! పెండ్లికూతురు చిన్నపిల్ల కాదు. 'పెండ్లి విషయమై యామెమనస్సున నుసరించి మనము నడవవలెను. కాని, యామెను మనయిష్టప్రకారమునడవు మనుట భావ్యము కాదుగదా ! నే నేమి చేయఁగలను? నీవు మాకు క్రొత్త దానవు కావు. ఎట్లయిస, నీవు పోయినీ మేనగోడలి నొప్పించి నీకొడుకునకుఁ జేసికొనుము.యాటంక మేమియును లేదు' అని పలికెను.

లలితా దేవి యతని వచనములు నిష్కపటములసియు,సత్యములనియు నెఱుఁగును. ఆమె వెంట నే యింటికి వచ్చిపరమారుఁడు చెప్పినమాటలు వినిపించి 'కుమారా ! నీకోర్కెనెర వేఱుట యసాధ్యము. ఇచ్ఛినికి బృథ్వీ రాజునందున్నయనురాగ మనివార్యమైనది. దానిని ద్రిప్పుట యీశ్వరునకుఁ గూడ నలవి కాదు. చిన్న నాఁటి ప్రేమనుబట్టి యామె నిన్నువరించునని యనుకొనుచున్నావు. అది పొరపాటు. చిన్నప్పటి గుణములును, చేష్టలును, భావములును యవనమంకురించిన తోడ నే మాఱిపోవును. ప్రేమకూడ నానావిధములు. - చిన్న నాటి ప్రేమ వేఱు; భూవన కాలమున నావిర్భవించునది వేఱు.ఇక నీ వాప్రయత్నము విడిచి వేఱొక తెను వరించి సుఖం పుము' అని యుప దేశిం చెను. అది విని యభయసిం గచ్చోటు గదలిపోయెను. తల్లి హితోప దేశము లతని చెవి కెక్కలేదు. రూపవతి చెప్పుచున్న మాటల నాలోచింప నిచ్ఛినియను రాగము తన పై కి మరలుచున్నదని స్పష్టమగుటచే నికఁ గొలఁదిదినములు వేచియుండిన తనకోర్కి సఫలముగావచ్చు నని యభయసింగు తలపోయసాగెను. అంతియ కాని, రూప నతి తన్ను వంచించి తనధనమంతను నపహరింపఁ దలఁచు కొనియే యిట్లు పలుకుచున్నదని యెఱుఁగఁడు. కావున, నభయసింగు రూపవతి యనుగ్రహమును గోరి నానావిధబహు మానము లిచ్చి యామెను సంత సింపఁ జేయుచుండెను. రూప నతియం దితని కెక్కుడు నమ్మకము గుదురుటకు వేరొక "కారణముఁగూడ నున్నది.

ఒక నాడతఁ డచ లేశ్వరుని దర్శింపఁబోయెను. అచలేశ్వరాలయ మెల్లప్పుడును బై రాగులతోను, గోసాయీల తోను నిండి యుండును. వారిలో నొక బైరాగి నెగడియొద్దం గూర్చుండి మంట వెలుఁగున నొక పురుషుని చేతిని బరిశీలించి సాముద్రిక రేఖలననుసరించి ఫలములు చెప్పుచుండెను. అభయ సిం గది చూచి కొంత సేపచ్చట నుండి యాపురుషుని ఫల ములు పూర్తి గాఁ జెప్పిన పిమ్మటం దనకుఁగూడ ఫలములు - చెప్పుమని బై రాగిని గోరెను. పరోపకారి యగు నతఁ డారాజ కుమారుని చేతిని బరిశీలి-చి 'కుమారా ! నీకోర్కి మిగుల గొప్పది ఒక యువతిని బెండ్లాడ నీవు విశ్వప్రయత్నము చేయుచున్నావు, అవునా ? కాదా ? ' అని యడి గెను. అభయసిం గాశ్చర్యచకితుఁడై వికసించిన ముఖముతో 'అయ్యా ! అవును, సత్యమే' అని పలికెను.

బై: — నీ కార్యము విషయమై యొక యువతి నిష్క- పటచి త్తముతోఁ బాటుపడు చున్నది కాదా ? అభ: -చిత్తము, చిత్తము,

బై: నీ నామె చెప్పిన చొప్పున నడవుము. నీ కార్యము నెఱవేును.

అభ: (సంతోషముతో) నాకోర్కి యీ డేరు సని తమకు నమ్మక మున్నదా ?

బై: ఉన్నది. కాని, కష్టసాధ్యము. \ అభ: ఎట్లయిన, నెజు వేజును గదా ?

బై :తప్పక నెటు వేఱును.

అనంతర మభయసింగు బై రాగికి నమస్కరించి వెడలివచ్చెను. ఆ కాలజ్ఞులగు బై రాగులమాట లెప్పుడును వ్యర్థములు గావని యతనికి నమ్మక ముండెను. అప్పటి నుండియు నభయసింగునకు రూపవతియందు మఱింత గుఱి కుదిరెను..అందుచే నతఁడు దాని చేతిలోని కీలుబొమ్మవలె వర్తించుచుండెను.

పండ్రెండ ప ప్రక ర ణ ము

ఇచ్చినీ కు మారి

ఇచ్ఛినీకుమారి తన తండ్రి భీమ దేవునిసం దేశమును నిరసించి నందుల కానందించుచున్నను వెఱ్ఱపట్టుదలగల వాఁ డును, నపార సేనాసమేతుఁడును నాభీమునివలనదమకు రానున్న దుర్ని వార్యము లగునాపదలఁ దలంచుకొన్నపుడు విచారమును గూడ నొందక పోలేదు. భీముఁ డచిరకాలములోనే తమపురమును ముట్టడింపకమానడనియు నాతనిఁబోఱఁద్రోలి యీబూగడమును రక్షింపఁ జాలినశ క్తితమకు లేదనియు నా మె యెఱుంగును. తనతండ్రి రాజ్యమునకును,దనబందుగులకును దనమూలమునఁ దీఱనికష్టము సంభవించుచున్నందుల కామె యొక్కొక్కపుడు చెందుచున్న దుఃఖమునకు మేరయే లేదు. ఆమహాపదను దప్పించుకొనుటకు రెండే మార్గములు. భీమ దేవునిఁ బెండ్లియాడుట యొకటి , రెండవది, తమపై నెత్తి వచ్చిన భీమ దేవు నెదిరించి పాజఁద్రోలఁజాలు బలవంతు నాశ్రయించుట. ఇం దేదియు క్తము ? అన్నివిధముల దనకుఁ బ్రతికూలవ ర్తనుఁ డగువానినిఁ జేపట్టియావజ్జీవమును దనజన్మమును దుఃఖభాజనము గావించుకొనుట యుక్త మా ! కాదు. అంతకంటె వెంట నే ప్రాణ త్యాగము చేసి తానుసుఖించి తన వారిని సుఖంపఁ జేయుటయేమేలుక దా!

కాని, యాత్మహత్య సజ్జనగర్జితము కావునమొదటి పక్షము చేకొనఁదగినది కాదు. ఇక, రెండవపక్ష మాలోచించిన నదియు సంఘటించునట్లు లేదు.భీమ దేవు నెదిరించి తమ్ముఁ గాపాడఁజాలు బలవంతుచెవఁ డున్నాఁడు ? అక్కాలమునఁ బృథ్వీరాజుతప్ప వేఱొక్కడతని నెదుర్కొన లేఁడు. కాని, పృథ్వీరా జందుల కంగీకరిం చునా ? పరుల ప్రాణములఁ గాపాడుటకుఁ గ్రూరసర్పమువంటి భీమ దేవుని యుద్ధములో నెదుర్కొని యనవసరముగాఁ దీఱని కష్టము తెచ్చి పెట్టుకొనునా ! పరోపకారు లట్టికష్టములకు వెనుదీయరు. కాని, యారాజచంద్రునకుఁ బరోపకారబుద్ధియున్నదో లేదో, అతనియభిప్రాయ మెట్లుండునో ? అది తెలిసికొను నంతవఱకు నిర్కార్య మెట్లు నిశ్చయించుట !భీమ దేవుఁడు తమపై దండెత్తి నచ్చులోపున నీ కార్యము చక్కబెట్టుకోన వలయును. అందుచే ముందుగా విశ్వాసార్హు డగువాని నొక దూతను బృథ్వీరాజు చెంతకుఁ బుచ్చవ లెను.ఈవిషయమై యామె తనలోఁ జింతించి తుద కిట్లను కొనెను.“నాకుఁ దెలిసిన వారిలో నట్టివాఁ డెవఁ డున్నాఁడు ! నాకు విద్యోప దేశము చేసిన యీశ్వరభట్టిందుల కన్నీ విధములఁదగిన వాడు. అతని బార్థించి యెట్లో యిందుకు సమ్మతింప జేయుదును. తండ్రియనుమతి వడయకుండ స్వతంత్రురాలనై యతని నారాజునొద్దకుఁ బుచ్చినచో లోకులు నన్ను నీతి బాహ్యురాలని నిందింతురా ! వెనుక రుక్మిణి, శిశుపాల జరా సంధాదులను జయించి తన్నుఁ గొని పోనలయునని కృష్ణునకు సం దేశ మంపెను. ఆమె నెవ్వరు నిందించిరి ! అట్లే నేనును భీమ దేవుని జయించి నన్నుఁ గొనిపోయి పెండ్లాడుమని ప్రార్థించుచు నా రాజునకు సం దేశమంపిన నిందు దోషమే మున్నది ! 'కాని, కృష్ణునివలే నా రాజసత్త ముఁడు దీన స్త్రీ, రక్షణమునకు బద్దకంకణుఁ డగునో కాఁడో ? ఏమయిన, మా

కిప్పట్టున నతనిసాయము నడయుట.ముఖ్యము. మాయుపాధ్యాయులవారి నందులకై పంపెదను” అని యీవిధమున నాలోచించుకొనుచు నిచ్ఛినీకుమారి యతికష్టముతోఁ గాలముపుచ్చు చుండెను.మానవులు సౌఖ్యము లనుభవించుచున్నంత కాలమునుభగవంతుని స్మరింపరు. తానో, తనయాత్మ బంధువులోదుస్సహ రోగ పీడితులై మంచముబట్టి మందులవలన నుపయో గముగానక యమలోకమునుజూడ సిద్ధపడియున్నపుడు దేవుని స్మరించుకొందురు. ముడుపులు గట్టుదురు. దేవతలకుఁ గోడిపుంజులనో, గొఱ్ఱపోతులనో మొక్కుకొందురు. ఇట్లు చేయుట లోక స్వభావము. ఆ బూగడమునకుఁ దనమూలమునఁ దీఱని యాపదరా నుండుట కనిపట్టి యిచ్ఛినీకుమారి యచ లేశ్వరునిదర్శనము గావించుకొని తదీయానుగ్రహమును సంపా దించి తమ్మాయాపదనుండి తప్పించుకొన నూహించెను.ఆమె యిట్లాలోచించుచున్న సమయమున రూపవతి యచ్చటికి వచ్చి సమీపమునఁ గూర్చుండి 'అమ్మా! ఏదో యోజించుచున్నట్లున్నది; అది 'యేదో మీహితురాల నగు నాకుఁ దెలుప రాదా?' అని యడిగెను.


ఇచ్ఛి: – చెలియా ! రాఁబోవునాపదను దప్పించుకొనుట యెట్లోయన్న యోజనము తప్ప నాకు మఱియొకటియేమున్నది ? రూప:: -- అమ్మా ! ఈయపాయమును నిముసములోమాయము చేయవచ్చును; నావిన్నప మాలకింపుము. భీమదేవుని బెండ్లాడుము, అతఁ డందమున నేమి, చందమున నేమి, సంపదలం దేమి, రాజ్య వైభవమం దేమి సుంతై నను గొఱఁతలేనివాఁడు; నేనెంత చెప్పినను నావచన మాలోచింపకున్నావు.తల్లీ ! వేఱాలోచనము మాని, భీముని వరించి ఘూర్జర రాజ్య మేలికొమ్ము. నీతండ్రిని, నీయాబూగడ రాజ్యమును సుఖపడనిమ్ము.

ఇచ్చి: – రూపవతీ ! నీవన్నది బాగుగా నున్నది. కానీ,యాభీమ రాజు నీకంటి కగ పడినట్లు నాకంటి కగపడ లేదు.అట్లయినఁ దప్పక యతని వరించియే యుందును. ఇక నా ప్రసంగము నాయొద్దఁ దేవద్దు. అతని పేరైనను వినుటకు నాకిష్టము లేదు,

రూప: పోనిమ్ము; ఆపదను దరించుట కుపాయముచెప్పితిని. అంతియ కొని వేఱు గాదు.

ఇచ్చి: – అంతకుఁదప్ప నాపదను దరింప నుపాయము లేదా?

రూప: ఏమున్నది

ఇచ్ఛి: – భీమ రాజును జయింపఁజాలిన యొక రాజేంద్రునిసాయ మపేక్షించిన నీయపాయము తొలఁగిపోదా ?

రూప: - అట్టివాఁ డెవ్వఁ డున్నాఁడు ?

ఇచ్ఛి: ఏమి, ఢిల్లీ శ్వరుఁడు లేడా ?

రూప: —చిఱునవ్వు నవ్వి యూరకుండును. -

ఇచ్చి. (కొంచెము కోపముతో) ఎందులకే యట్లు నవ్వుచున్నావు ?

రూప: లేదమ్మా ! ఊరకే నవ్వుచున్నాను.

ఇచ్చి:— కారణము చెప్పుదువా ? చెప్పవా ?

రూప: చెప్పిన నీకుఁ గోపము వచ్చు నేమో !

ఇచ్చి:— రాదు, చెప్పుము.

రూప: అమ్మా ! నీ వింత యమాయికురాల వేమి! తనతండ్రిని జంపిన భీమ దేవు నెదుర్కొన లేక పరాక్రమహీనుఁడై వర్తించిన పృథ్వీరా జెక్కడ ! నచ్చి మన చూపద తొలంగించు టెక్కడ ?

ఇచ్ఛి: — ఏమి ! ఢిల్లీశ్వరుఁడు పరాక్రమహీనత చేత నె భీము నెదుర్కొనలేఁ డందువా ?

రూప: వేఱు కారణ మేమి గలదు ?

ఇచ్చి: తగిన సమయము లభించునందాఁకఁ బగతుర నోర్చియుండుట రాజనీతిజ్ఞుల లక్షణము గదా !

రూప: రాజనీతిజ్ఞులలక్షణ మనుటకంటెఁ జేతకాని వానితనమనుట యుచిత మని \తోఁచుచున్నది,

ఇచ్చి:- తగిన సమాధానము చెప్ప లేక యారాజేంద్రుని నిందించుట యెందుకు ? ఇఁకమీఁద నాతని నిందించిన నే నంగీకరింసను.

రూప: లేదమ్మా కోపింపకుము, అతఁ డూరకుండుటచే నట్లను కొన్నాను.

ఇచ్చి: ఏమయినను సరియే ! నే నాతనికి వారపంపుదును.

రూప: పఅట్లే చేయుము.

ఇచ్చి: – సరియే ! దాని కేమి ? కాని, యొకమా అచలేశ్వరుని దర్శనము చేసి రావలయును.

రూప: అమ్మా ! అది మంచి దే, భగవంతుఁ డాపదుద్ధారకుఁడు. 'కాన, నౌపదలో మునుఁగుచున్న మనల రక్షింపక పోఁడు. నే నందుల కై నిన్నుఁ జాలదినములనుండి ప్రయాణము చేయుచున్నానుగదా !

ఇచ్చి: - ఇందులకు మాతండ్రియనుమతి వడయ వలయును.

రూప: అట్లయిన మనము వెళ్ళినట్లే !

ఇచ్చి: ఏమి?

రూప: మీ తండ్రి ని న్నింటనుండి కదలనీయఁడు !

ఇచ్చి- ఏమి చేయుమందువు ?

రూప: ఏమియును లేదు. ఒరులకుఁ దెలియకుండ మనము పోయివత్తము.

ఇచ్ఛి:– రాత్రి సమయమున మన మొంటరిగాఁబోయిన నేమయినను ప్రమాదము సంభవించు నేమో !

రూప: ఏమియును సంభవింపదు. పల్లకీలోఁ గూర్చుండి వెళ్ళి రావచ్చును. మన కభయసింగు సహాయుఁడై వచ్చును. మన కపాయ మెటు రాఁగలదు మఱియు, నమ్మా! మఱి యొక సమాచారము. అచలేశ్వరునియాలయమున కొక


.

బై రాగి వచ్చినాఁడఁట. అతఁడు త్రికాలజ్ఞుఁడఁట. అడిగిన ప్రశ్నములకుఁ దగిన సమాధానములు చెప్పునఁట. అభయ సింగు నాతోఁ జెప్పినవాడు. అంతటి మహానుభావుడు లోక మందు వేఱొకఁ డుండఁడఁట. మనకు రాఁబోవు నాపదను గుఱించి యతని నడిగి తెలిసికొనుట మంచిదని నాయభిప్రాయము. అతఁ డిట నెన్నో దినము లుండఁడఁట. కనుక , మన మీరాత్రియే పోయివచ్చుట మంచిది.

ఇచ్ఛి: – ఈ రాత్రియే ! మాతండ్రిగారు గ్రామాంతరము వెళ్ళియున్నారు. ఆయన వచ్చిన పిమ్మట వారియాజ్ఞను బొంది వెళ్ళఁగూడదా !

రూప:— అమ్మా! అట్లు కాదు, మీ కేవిధమైన భయమును లేకుండ మిమ్ము రక్షించుభారము నాది.ఈదినమైన చో బై రాగిదర్శనముగూడ మనకు లభించును. లేని చో నది యసంభవము.

ఇచ్ఛి:—-పోనిమ్ము, అట్లే పోవుదము. అందులకుఁ దగిన ప్రయత్నములు చేయుము. ఇచ్ఛిని మొదట జన కాజ్ఞను బొందకుండ స్వామిదర్శనార్థముబోవ నిష్టపడ లేదు. కాని, తనకు సమీపబంధు వగు నభయసింగు తమకు రక్షకుఁడుగా వచ్చుచుండుట చే వేరొక ప్రమాదము సంభవింపదన్న నమ్మకముండుట చేతను, మఱి యొకప్పుడైన బై రాగిదర్శనము లభింపదన్న హేతువు చేతను రూపవతి చెప్పిన చొప్పున నీశ్వరునిసందర్శింపఁబోవ సమకట్టెను.


సాయంసమయమునకు రూపనతి కన్యాంతఃపురము నుండి యింటికి వచ్చునప్పటికి వాడుక చొప్పున నభయసింగు వచ్చి తనయింటియరఁగు పై గూర్చుండెను. రూపవతి యతని నల్లంత దూరముననె చూచి మందహాసముచేసి రాజకుమారా ! నీ వే ధన్యుఁడవు ధన్యుఁడవు' అని పలికెను. ఆతఁ డది విని యధి కానందభరితుఁడై లేచి యామె కెదురుగఁ బోయి 'రూపవతీ ! చెప్పుము 'చెప్పుము, విశేషము లేమయినఁ గలవా ? ఆయువతి నాకు లభించునో, లభింపదో యన్న విచారము చే శుష్క కాష్ఠమువలె నెండిపోయిన నా హృదయమున కమృత బిందువువంటివార్త యేదయినను గలదా ! చెప్పుము' అని యత్యాసక్తి తో నడిగెను

. “ రాజకుమారా ! నీ పుణ్యము పుచ్చినది. నీకోర్కెయీ డేఱినది. సార్వభౌముఁ డనఁదగుభీమ దేవుని నిరసించిన ఇచ్చిని నీదయను గోరుచున్నది. ఇఁకఁ గావలసిన దేమి ! అదృష్టవంతుఁ డవన్న నీవే యదృష్టవంతుఁడవు తెమ్ము, ఏదీ! ! నాకి చ్చెడిబహుమానము తెమ్ము' అని యామె యతని నడి గెను. ‘బహుమానమున కేమి ? ఇదివర కే నీ కది ముడుపు గట్టియున్నాను. ఆమే నన్ను వరించుట కిష్టపడినదా ! ముందామాట చెప్పుము' అని యభయ సిం గా మెను జూచుచుఁ బలికెను.

ఓయీ ! నీవు వట్టి వెర్రి వాఁడవు సుమా ! ఇట్టి వెర్రిని జూపితివా యిచ్ఛిని నిన్నుఁ బెండ్లాడదు. నా ప్రయాసమంత యును వ్యర్థమగును. అట్లు చేయకుము. స్త్రీ. లెప్పుడును నే నీతనిఁ "బెండ్లాడుదునని నోటితోఁ బల్కరు. తమయభిప్రాయ మును జేష్టలచే సూచింతురు; వినుము, ఆ రాకుమారి యీ రాత్రి యచ లేశ్వరునిదర్శింప నిశ్చయించుకొని నిన్ను సహా యునిగా రమ్మని కోరుచున్నది. ఇంక నింతకంటే 'నేమి కావల యును. నీయందుఁ బర పురుష బుద్ధియే కల్గిన నిన్నా మె రా నిచ్చునా ? మఱియు, నేను నీగుణములు వర్ణించి చెప్పితిని. ఆమె యన్ని యు నత్యాదరముతో విన్నది. ఇఁక ని న్నా మె చేపట్టుట నిస్సంశయము. నేనింత కష్టపడి నందులకు నా కీయఁ డలఁచిన బహుమాన మీరాత్రియే యిమ్ము' అని యామె పల్కెను.

'తప్పక యిచ్చెదను. ఇప్పుడే తెచ్చెదను. ఈ రాత్రీయే వెళ్ళవలయునా ! నీవుగూడ వచ్చెదవా ?'అని యతఁ డడిగెను.

“వచ్చెదను. ఆమె దేవ తాదర్శనమునకు: బోవుచున్న విషయము నీకుఁ దప్ప మెరెవ్వరికిని వెలియనీయఁగూడదని యా రాజకుమారి యభిప్రాయము, నీ వెవ్వరికిని దీనిని జెప్ప కుము. ఆమె యాలయమునకుఁ బోయివచ్చుటకు సవారి నొక దానిని సిద్ధపఱుపుము, నేఁడు నీవు చేసిన యేర్పాటుల కామె 'యెంతయు సంతసింపవలయును. నీవు త్వరగాఁ బోయి. భుజించి రమ్ము. వచ్చునప్పుడు నా బహుమానము మాత్రము మఱవ కుమా !' అని పల్క నభయసింగు తన్నుఁ గృతార్థునిగా దలంచుచు నింటికి వెడలిపోయెను.

ఆహా ! లోకములో నెంత లేసిమాయావు లున్నారు ! ఈరూపవతి యిచ్ఛినీకుమారి యెదుట నేఁడు తప్ప నభయ సింగును వేఱొ కప్పుడు స్మరించిన పాపమునఁ బో లేదు. అభయ సింగుని యభిలాష మైనను నామె కెప్పుడును దెలుప లేదు. ఇట్లుండ నతని శార్యము నెఱ వేటినట్లే మాటాడి యభయ సింగును మోసపుచ్చి యది ధసము లాగుచున్నది. ఇచ్చినీ తనతోఁగూడి యచ లేశ్వరాలయమునకుఁ బోవ నుండుట చేఁ దనయం దామె కభిలాష యే లేని చోధన సాయము నడయుట కిష్ట పడ దని తలంచి యాయువతి తన్నుఁ బెండ్లా డుట నిశ్చయ మేయని యభయసిం గానాఁడే యామె కీయఁ - దలఁచిన బహుమాన మిచ్చి వేసెను.

రాత్రి జాముంర కావచ్చినది. అభయ సింగుచితము లగు వస్త్రాలంకారములు ధరించి ఖడ్గ పాణియై యిచ్ఛిని యంతఃపుర ద్వారమునొద్దకుఁ బోఁగా నక్కడ రూపవతి ప్రత్యక్ష మయ్యెను.వా రేదియా సంభాషించుచుండ నా రాకుమారి చక్కఁగా నలంక రించుకొని మేలిముసుఁగు వైచి కొని వచ్చి సవారిలోఁ గూర్చుండెను. బోయీలు సవారీ నెత్తుకొని నడవసాగిరి. రూపవతి సవారీకొక ప్రక్క నడచుచుండెను. అభయసింగు జాగరూకుఁ డై ఖడ్గ పాణియై యాసవారీని వెంట సంటి పోవుచుండెను. వారు కొలఁది కాలములో నే యచ లేశ్వ రునియాలయమును బ్రవేశించిరి. అభయసిం గది వఱకే వా పంపుట చే నర్చకు లారాకుమారి రాక కై వేచియుండిరి. సవారీ నక్కడ దింపఁగా నే యామె రూపవతితోఁగూడి యాలయ మును బ్ర వేశించెను. సవారీ నుండి పైకి నచ్చునపు డా మె సుందర రూపము నొకమాఱు కన్ను లారఁ గాంచవ లెనని యభయసింగు ప్రయత్నించెను. కాని, తదీయశరీరమంతయు మేల్మునుఁగుచేఁ గప్పఁబడియుండ టవలన నతనిమనోరథము సిద్ధింప లేదు, వారిని వెంబడింప మన స్సెంత పీకుచున్నను మర్యా దకు వెఱచి 'యా రాకుమారుఁ డచ్చట నే నిలిచిపోయెను.

ఇచ్ఛినీకుమారి దేవునికి భక్తి పూర్వకముగ నమస్క- రించి నిమీలితలోచనయై చేతులు జోడించి పలువిధముల నీశ్వ రుని స్తోత్రము చేసి “ఓ దేవా! ఓపర మేశ్వరా ! ఓ భక్త వత్సలా! ఆపన్న లరక్షింప నీకుఁ దక్క నెవ్వరికి శక్తి గలదు, ఇంద్రాదు లునుగూడ నీకరుణా లేశమునకుఁ బాత్రులుగాని చో నిరపాయ ముగా సుఖంపఁజాల రనునప్పుడు మావంటి మనుష్య మాత్రుల సంగతి చెప్ప నేల ! అనాధనాథా ! నీ పాదపద్మములందలి మకరందమును ద్రావుటకు నాచిత్తమధుకరమును బురి కొల్పుము. నీ కిదె నమస్కారముగావించి వేఁడుకొనుచున్న యీదీనురాలిని రక్షింపుము. భక్తు రాల నగు నాకోర్కి దీర్చుట నీకు విహితముగదా ! హాలాహలము చేఁ బీడితులగు దేవతల మొఱ లాలించి యావిషమును మింగి లోకములను గాచిన కరుణాకటాక్షము నీదీనురాలి పై బఱుపుము.మృత్యువు గుండెలను జీల్చి ముని బాలకుని మార్కండేయుని రక్షించిన దయారసము నీదాసురాలిపై , జిల్కుము. నామూలమున నాబూగడమునకు వచ్చుచున్న యుపదవముఁ దప్పింపుము. నాకోర్కు లీ డేర్పుము' అని వేఁడి మరల నమస్కరించి తత్ప్ర సాదమును స్వీకరించి మరలివచ్చి సవారీలోఁ గూర్చుండి త్రికాలజ్ఞుఁడగు 'బై రాగిదర్శనము గావించి రాఁబోవు స్థితిగతు లను దెలిసికొనఁగల్గినచో నందులకుఁ దగిన ప్రతి క్రియ నాలో చించుకొనవచ్చునని నిశ్చయించి సవారీని 'బై రాగిమఠమునకుఁ గొనిపో నియమింప నాబోయీ లట్లు గావించిరి.

ఆమఠము దేవాలయమున కెంతో దూరము లేకపోయి నను నొక మూలయం దుండుట చేఁ బ్రయత్నించి సమీపించిన వారికిఁగాని యది కంటఁబడదు. బోయీ లాసవారీని నా మఠము గుమ్మమునొద్ద దించిరి. ఇచ్చినీకుమారి దిగి రూపవతి . వెంటనంటి పోయి నెగడియొద్ద జపముగావించుకొనుచున్న బైరాగిని దర్శించెను.

అతని శరీరము విభూతిపూఁతచే మిక్కిలి తెల్లనయి. యుండెను. అవయవ పటుత్వము కొంచెమేనియు సడలినట్లు లేదు. కాని; జడలును, గడ్డమును నెజుసి ముదుసలివాఁ డని చెప్పుచుండెను. అతని శాంతరూపమును, బూడిదపూఁత చే మిక్కిలి తెల్లగానున్న శరీరమును, జటాకలాపమును జూచి తనయభిలషితములను దీర్చుటకై బై రాగి వేషమున వచ్చిన యాయచ లేశ్వరుఁడేమో యని 'సం దేహించుచు . నా రా కుమారి యతనిని సమీపించి నమస్కరించి యతఁడు చేసైగ చేఁ జూపిన యొక పులిచర్మము పైఁ గూర్చుండెను. రూపవతియు నా మెకు దగ్గఱగా నిలువఁబడెను.

అప్పుడు బై రాగి మంట వెలుఁగున నాయువతిహస్త రేఖలు పరిశీలించి కొంచె మాలోచించి యా మెముఖమును నిదానించిచూచి యిట్లు సంభాషించెను.

బై:– కుమారీ ! నీమనోరథము నాకుఁ దెలియవచ్చి నది. నీ వొక రాజాధి రాజును వరింపఁ దలఁచుకొన్నావు కదా?

ఇచ్చి:- అవును, నాకోర్కె నెట్ వేఱునా, లేదా ? సెలవిండు.

బై: – నీవు కోరునట్టి రాజు నీకు భర్తయగునట్లు లేదు. కాని, యతనికంటె గొప్ప వాఁడగు మఱియొక రాజు లభించును.

ఇచ్ఛి: -స్వామీ ! నేను గోరుకొన్న పురుషుఁడు లభిం పని చో నా కీజన్మముతోఁ బనియేమి ? అప్రియుఁడగు పురు షుని వరించి కష్టముల బారిఁ బడుటకంటె మరణించుటయే యుత్తమము గదా !

బై: తల్లీ స్థితిగతుల నాలోచింప నట్లుతోచుచున్నవి. ఏమి చేయుదును ! అమ్మాయి ! మఱియొక సమా చారము. నీ మూలమున మీతండ్రి రాజ్యమునకు గొప్పయుప దన మొకటి రానున్నది.

ఇచ్ఛి: - యోగీంద్రా ! తమ వాక్యము . నిజము. ఆయుపద్రవమును... దలంచుకొని యే మేమును విచారించు 72

అభ:- అంతవఱకు నీ రాజపుత్రి నిచ్చట నొంటరిగా వదలిపోవుటకు భయపడుచున్నాను,

బై: – అట్లయిన మఱియొక నాఁడు వత్తువా ?

అభ: వచ్చేదను. కాని, యెప్పుడు రమ్మందురు ?

బె: . -ఒక నెల పోయినతరువాత రమ్ము,

అభ: అమ్మయో, అంత కాలమే !

బై: - మజి, యేమి చేయుదును ! ఈలోపల మంచి దినము లభింప లేదు.

అభ-:-- నేఁ డయినచో ?

బై : - చెప్పెడి దేమి ! ఇంతటి మంచిదినము మతి లభిం పదు. కాని, నిన్ను నమ్ముకొని వచ్చిన రాజకుమారిని విడిచి నావెంటవచ్చుట యుక్త ముకాదు కదా !

అభ: స్వామీ ! రూపవతి రాజకుమారిని - భద్ర ముగాఁ గొనిపోవుదు నన్నది. మన మామూలికను సంపా దింపఁ బోవుదము.

బై: అట్లయిన సంతోషమే, అని పలికి రూపవతిని జూచి 'యునతీ ! నానిమిత్తము మీరు వేచియుండ నవసరము లేదు. • రాజకుమారి జపము పూర్తి కాఁగానే 'మారింటికి బొండు' అని చెప్పి యతఁడు మఠమునువిడిచి నడవసాగెను. -అభయసిం గతనిననుసరించి పోవుచుండెను.

రూపవతి కొంచెము సే పచ్చటఁ గూర్చుండి బైటికి వచ్చి బోయీలను మేల్కొలిపి 'ఓరీ ! రాజకుమారి తొందర పడుచున్నది. లెండు లెండు' అని పల్కఁగా వారు లేచి నిద్దురచే మూతపడుచున్నకన్నులతోనే యాసవారీని మోసికొనిపోయిరి.

పదునాల్గవప్రకరణము

ఢిల్లీపురములోని కుట్ర

ఢిల్లీపురమున నొకవిశాలరాజభవనమందుఁ బృథ్వీరా జొకనాఁడు నిండుకొలువుదీర్చియుండెను. అతనికిఁ గుడిప్రక్కన నతనిపినతండ్రి కరుణరాజును, నతనికుమారుఁడును, మఱి కొందఱు రాజులును గూర్చుండిరి. ఆసింహాసనమున కెడమవైపున మంత్రులును, సేనానాయకులును, చాళుక్యవంశజు లగు ప్రతాపసింహాదులును గూర్చుండిరి. తక్కిన సామాన్యజనులు యథోచితస్థానముల నుండిరి. దాడిమిబీజములవలెఁ గ్రిక్కిఱిసిన ప్రజాసమూహముచే నాసభాభవనము నిండి పున్నమనాఁటిసముద్రమువలెఁ దొణుకులాడుచుండెను.

ఆసమయమున చాందుభట్టనెడి మహాకవి లేచి రాజేంద్రున కెదురుగా సభామధ్యమున నిలిచి మేఘగర్జనమువలె గంభీర మగు కంఠస్వరముతోఁ జోహానవంశజులకీర్తిని, బరాక్రమమును, సాహసమును, ధైర్యమును బొగడుచుండెను. ఆగుణవర్ణనము విని సభ్యులందఱును సంతోషించుచుండిరి. కాని, చాళుక్యవంశసంభవుఁ డగు ప్రతావుఁడు లోకములోని

రాజమండలమున కెల్ల మిక్కిలి యవమానకర మగునా వర్ణన మును విని సహింప లేక పోయెను. దుస్సహ మగు కోప మతని మనస్సున నావరించెను. ఆకోపలక్షణములు పై వారి కగపడ కుండునట్లు చేయన లెనని యతఁడు ప్రయత్నించెను. కాని, యతనికి శక్తి లేకపోయెను. తక్కిన వారికివలె నా కట్టి ప్రతా పనిముఖమందు వికాస మంకురింప లేదు. అతని చూపులు సంతోషమును వెలి పుచ్చ లేదు. ముఖమందు వ్యాపించిన క్రోధాగ్ని జ్వాలలకు ధూమ రేఖవ లె నున్న మీసముతో నతని కుడి చేయి మంతనమాడుచుండెను. ప్రతాపసింహుని వికార లక్షణములను గనిపట్టి కరుణ రాజు మిగులం గోపోద్దీపితుఁడై సింగ పుఁగోదమవ లె నాతని పై లంఘించి 'ఓరీ, దురాత్మా! మాచోహన వంశజులగుణములను వినుటకు నీ కంత కష్టముగా నున్నదా ? నిన్నుఁ బోషించు ప్రభువర్ణనము విని యానందించు టకు మాఱుగాఁ బొగచూరిన మోముతో నిటు కటకటం బడ నేల ? చోహనులప్రతాప మెట్టిదో రుచిచూచెదవు ? పిడుగువంటి యీకత్తి దెబ్బను గాచుకొను' మని కత్తి మీఁది "కెత్తెను. అడివఱుకే మండుచున్న క్రోధాగ్ని కాకరుణ రాజు వచనములు నేతిధారలు కాగా నాప్రతాపుడు చటాలునః గత్తి దూసి యతని నెదుర్కొ నెను. వా రిరువురును బోరు చుండిరి. అది చూచి సభ్యులందరును నివ్వెర పడి చూడ సాగిరి. పృథ్వీరాజు గూడ నేమి చేయుటకును దోఁపక సింహాస నమునఁ గూలఁబడెను. కొన్ని నిమిషములలోఁ బ్రతాపుఁడు కరుణ రాజుఖడ్గమున కెర యయ్యెను.


అది చూచి ప్రతాపునితమ్ముఁ డరిసింగు, కరుణ గాజు నెదుర్కొని పోరనారంభించెను. కాని, మహాపరాక్రమశాలి యగు కరుణుని యెదుట నాతఁ డెంతో సేపు నిలువఁబడ లేక పోయెను. అతఁడుగూడ నిహతుఁ డయ్యెను. అందులకు: గినిసి తక్కినసోదరు లైదుగురు ఖడ్గపాణు లై కరుణునిపై గవిసిరి, అది చూచి పృథ్వీరాజు చటాలున లేచి తనపినతండ్రిని వారించి యారాజకుమారులనుగూడ మంచిమాటలాడి యా కలహ మప్పటికిఁ జిల్లా ర్చెను, అకారణక లహమునకుఁ గారకుం డగు పినతండ్రిని జీవాట్లు పెట్టి పృద్వీరా జతనితోఁగూడ నంతఃపురమునకు వెడలిపోయెను. చాళుక్య వంశజులుగూడఁ. గ్రోధవిచారముల చే సంతప్త ములగుహృదయములతోఁ దమ యిండ్లకుఁ బోయిరి. అనంతరము పృథ్వీరాజు వారియిండ్లరుఁ బోయి తగిన మాటలచే వారి విచారము లడఁగించుటకుఁ బ్రయత్నించెను. కాని, భయంకరముగా నుదేకించిన కార్చిచ్చు మంచువాన చేఁ జలాఱునా ? రాజువచనములకు వారికోపము శమింప లేదు. కాని, వారు శాంతులయినట్లు చూపట్టిరి.

ఇది జరిగిన కొంత కాలమునకు ఢిల్లీ పురములో నొక మందిరమున నైదుగురు సోదరులును గూర్చుండిరి. వారి చెంత మఱియొక పురుషుఁ డుండెను. వారు కొంత సేపు మౌనముద్రా ధారులై యుండిరి. అపుడాసోదరులలో నొకఁడు మెల్లగా ‘అమర సింహా ! మాధీను దేవునకు మాయ, దింత యకారణ వాత్సల్య ముదయించుటకు హేతు వేమి ? మంచిమాటలచేఁ జేరఁదీసి తుదముట్టింపవలె నని యున్నదా యేమి ?' అని యడిగెను.

అమ: రాజపుత్రులారా ! మీ రెంతమాత్ర మట్లు తలంపకుఁడు. భీమ రాజుది వెర్రి కోపము. ఒక్కమా ఱు ద్రే కించి యప్పటికప్పుడే యది చల్లాఱును. ఈవిషయము మీ రెఱుఁగనిది కాదు. లోకమున మిక్కిలి ప్రసిద్ధమయిన చాళుక్య వంశమునఁ బుట్టిన మీరు పర రాజులను సేవించుట యతని కిష్టము లేదు. దానివలనఁ జాళుక్యవంశము గౌరవము పోవు నని యతనితలంపు. అందులోఁ జాళుక్య వంశ సంభవులకు, సహజ వై రులగు చోహన వంశజుల సేవించుట మఱింత యవ మానకరము. మీ రీ పృద్వీరాజును సేవించుచున్నా రని యతఁడు మిగుల ఖేదపడుచున్నాఁడు. మిమ్ము తరిమి వేసినం దుల కతఁడు మిక్కిలి పశ్చాత్తాపము చెందుచున్నాఁడు. మి మ్మాదరించి చేరఁదీయవ లెనని తలంచి యారాజు న న్ని చ్చ టీకిఁ బంపెను. ఈనడుమ మీ యన్న లిర్వురును గరుణ రాజు చేఁ జంపఁబడి. రని విని యతఁడు చెందుచున్న విచారమునకు మేరయే లేదు. వీరులారా ! ఈపృథ్వీరాజు మనంశమున కంతటికిని బగ వాఁడు. మీ కీ నడుమ నెట్టియాపగ గల్గిం చెనో మీ రెఱుఁగుదురు. కరుణరా జన్యాయముగా మాయన్న లను జంపుచున్నప్పు డీ రాజు చూచి యూరకుం డెను, వాని వారిం చుటకై నను బ్రయత్నింప లేదు. ఆశ్రయించిన వారిని జంపిం చుట యన్యాయము. ఈ విషయము పృథ్వీరా జెఱుఁగఁ డందురా! అట్లన వీలులేదు. తనకన్నులయెదుటనేకదా యీఘోరము ప్రవర్తిల్లినది. అతని కీపనియే నమ్మకము కానిచో వెంటనే లేచి తన పినతండ్రిని వారించియే యుండును. మీ రెంత మంచిగా ప్రవర్తించినను నతఁడు మిమ్ము నమ్మఁడు. మీయందున్న ద్వేషబుద్ధి విడువఁడు. కావున, మీరు భీమరాజుపక్షము నవలంబింపుఁడు. ఈ రాజునకును, భీమునకును గానున్న యుద్ధమున నతనికిఁ దోడు చూప నంగీకరింపుఁడు. అతనివలన గౌరవమును, సంస్థానములను బొంది సుఖముగా జీవింపుఁడు. నావచనములు నమ్ముఁడు. నా పల్కినదానియం దనృతము కొంచెమైనను లేదు. మిమ్ము వంచించుటకు రాలేదు. భీమదేవునిమనస్సు మీయం దెంత ప్రసన్నత వహించినదో యొక్కమాఱు వచ్చి చూచిన మీకే బోధపడును.

అనిపల్కుచున్న యమరసింహునివాక్యములు విని వా రధికాశ్చర్యము పొందిరి. తమతండ్రికాలమునుండియుఁ దముతో మహావిరోధ మవలంబించిన భీమదేవుఁడు తమపై నేఁ డింత ప్రసన్నత వహించుటకుఁ గారణ మేమో వారికి బోధపడలేదు. అగ్నికిఁ జల్లదనమట్లు భీమున కంతసాధుత్వ మబ్బుట యసంభవ మని వారి తలంపు. మంచిమాటలాడి తనచెంతకు రప్పించుకొని భీముఁడు తమ్ముఁ జంపునేమోయన్న యనుమానము వారిని వదలలేదు. వేఱొకచోటికిఁ బోయి వా రయిదుగురు నేమేమో కూడఁబలికికొని మరలివచ్చి 'అయ్యా! అమరసింహా! మ మ్మేల బలాత్కరింతువు! మాభీమన్న ప్రవర్తన మాలోచింప మా కతనియుం దించుకేనియు నమ్మకము వొడమకున్నది. ఏదో యొకమూలఁ బడి బ్రతుకుచున్న మ మ్మిట్లు బ్రతుకనిమ్ము' అని పలికిరి.

అది విని యమరసింహుఁడు 'రాజకుమారులారా! మీ రన్నది నేను కాదనను. భీముని వెనుకటివర్తన మరయ మీ రట్టి దురభిప్రాయము నొందుట తప్పుగాదు. ఇదిగో! దైవసాక్షిగాఁ బల్కుచున్నాను వినుఁడు. భీమదేవుఁడు మి మ్మాదరించుట కాటంక మేమియును లేదు. అతనివలన మీ కగౌరవముగాని, యపాయముగాని సంభవించిన నాప్రాణముల నిచ్చియైనను దప్పించెదను. మీ కేమయిన ననుమాన మున్నచో మీలో నొకరు నాతో ఘూర్జరదేశమునకు వచ్చునది. ఈ విషయమై భీమున కెంత పశ్చాత్తాపమున్నదో తెలిసికొనునది. మీ కతనియందు నమ్మకము గల్గినచో వచ్చి యతనిఁ జేరుఁడు, లేనిచో మీయిష్టమువచ్చినట్లు నడవుఁడు. మఱియొక సమాచారము, నే నిట్లనుచున్నానని కోపింపకుఁడు. అయ్యా! మీరు రాజపుత్రులు గారా? మీకుఁ బౌరుషము లేదా? బుద్ధిపూర్వకముగా మీ కపచార మొనర్చిన యీరాజును సేవించుట కష్టమనిపింపలేదా? భీముఁడుకూడ మీ కపకారియే కానిండు. అయినను, మీరంద ఱొకకుటుంబములోనివారు. మీలో మీ రేమనుకొన్నను దప్పుకాదు. ఇంతకును గృతమునకై భీముఁడు పశ్చాత్తాపము నొందుచునే యున్నాడు. కావున, నా మాట వినుఁడు; ఈ రాజును విడు వుఁడు ' అని నచ్చఁ జెప్పి వారిలోఁ బెద్దవాఁడగు గోకుల దాసును దనతోఁగూడ నంహిలపురమునకుఁ గొనిపోయెను.

పదు నై ద ప ప్ర క ర ణ ము

అన్వే ష ణ ము

దాసీజనము వాడుక చొప్పునఁ బ్రాతఃకాలమున నేవచ్చి కన్యాంతఃపురమునఁ బనులు చక్కబెట్టుకొనిరి. ఇచ్చినీ కుమారిపడకటింటి తలుపు బంధింపఁబడి యుండెను. ఎల్లప్పుడును దమకంటే ముందుగానే మేల్కనియుడు రాజకుమారి నాఁ డంత సేపేల నిద్రించుచున్నదో వారికి బోధపడ లేదు. రాత్రి చాల భాగము వఱకును మేల్కనియుండుట చే నామె యింక ను నిద్రవోవుచుండ వచ్చు నని నా రెట్లో మనస్సమాధానము చేసికొని యామెనిమిత్త మచ్చటనే వేచియుండిరి.రాజ కుమారి. మేల్కోనునంతవఱకును దాసీజన మామేశయన - గృహమును బ్రవేశించు వాడుక లేదు. అందుచే నాగృహ మును ప్రవేశింప నెవ్వరు సాహసింపరయిరి. వనులన్నియు నెఱు వేర్చుకొన్న వా రగుట చే నచ్చటచ్చటఁ గూర్చుండి యేమియో ప్రసంగించు కొనుచుండిరి. క్రమముగా సూర్య భగవానుఁడు' తనకిరణజాలమును లోకము పై బాసరింపఁ జేయుచు గగన సౌధము నెక్కి వచ్చుచుండెను. కాని, యిచ్ఛిని

యింకను మేల్కొనలేదు. నాఁ డెందు చేతనో రూపవతిగూడఁ బైని గన్పట్టక పోవుట చే నా మెయు నాకుమారి చెంత నే నిద్రించి యుండు నని తలంచుచుండిరి. ఇంతలో నీశ్వరభ టచ్చటికి వచ్చెను. అతఁ డిచ్చినికి గురువు. ప్రస్తుతము సంస్కృత భాష నామెకు నేర్పుచుండు వాఁడు. అందుచే నతఁడు వాడుకను బట్టి సంస్కృతమును జెప్పుట కై వచ్చెను. అతనిఁ జూచి దాసీ జనమందఱును లేచి నమస్కరించిరి. అతఁడు వారిని జూచి 'రాజకుమారి యెక్కడ?' యని యడిగెను.

దా::- ఆమె నిద్రపోవుచున్నది. ఈ:— ఇంత సేపటి దాక నిద్రించుట యేమి ! ఇట్టి దర్భ మెప్పుడును లేదే! దా: - అయ్యా ! ఈపురమునకు రానున్న కష్టములను గూర్చి తలపోయుచునామె రాత్రియందుఁ జాలవఱకు నుల్కొనియుండును. అందుచే నింక ను నిద్రించుచున్నది కాఁబోలును !

ఈ: అగుఁగాక! సూర్యుఁ డుదయించి యిప్పటికీ నాల్గయిదు గడియలు కానచ్చినది. ఇంకను నిద్రించుట యేమి? పోయి మేల్కొలుపుఁడు.

డా: -ఆమే యాగ్రహించు నేమో ?

ఈ: మీ కాభయము వలదు. ఆమెకు సమాధాన మును నేను జెప్పెదను గాదా !

అనంతరము రాజకుమారియొద్ద నెక్కుడు చనవుగల యొక దాసీ వెళ్ళి యిచ్చిని పడకటింటి తలుపును ద్రో సెను, లోపలగడియ వేయక పోవుటచేఁ దలుపులు తెఱవఁబడెను. అంతట నాయుపతి మెల్లగా సడుగులిడుచుఁ బోయి రాజు కుమారి తల్పమును సమీపించి చూచెను. కాని, యందామె లేదు. అందుల కది యచ్చెరువంది గది నలుపక్కలను “వెదకి యామెకనఁబడకుండుటకు మిగుల విచారమును, దొట్టు పాటును గని పైకి వచ్చి రాజకుమారి యందు లేదని తెల్పెను. అంత దాసీ జనమందును దిగులునొంది హాహాకారములు చేయుచు నంతఃపురమునాలుగుమూలలందును వెదకిరి. కాని, లాభము లేకపోయెను, కొందఱు రూపవతియింటికిఁ బోయి చూచిరి. కాని, యది యింట లేదు, రూపవతియు నిచ్ఛినియుఁ గలసి యెచ్చటికో పోయియుందురని వారనుకొనిరి. ఇంతలో నావార్త పురమందంతటను బాగుటచే జనులు గుంపులుగట్టి యంతఃపురమునకు రాఁదొడంగిరి. చళుక సింహుఁ డౌవార విని దుఃఖతుఁడై పర్వుపర్వున(బోయి దాసీజనమును బిలిచి నానావిధములఁ బ్రశ్నించుచుండెను.

భీమ దేవుని సం దేశహరునిఁ దిరస్కరించి పంపి వేసినది 'మొదలు యుద్ధప్రయత్నములు చేయుచున్న వాఁ డగుటచే జై తుఁ డొకసాఁడైన నింటి పట్టున లేఁడు. రాజపుత్రులసాయ మును గోరుటకై గ్రామాంతరములకు బోవుచుండెను, కావునఁ, దొలినాఁడే యెచ్చటికో పోయిన జై తపరమారుఁడు

మఱలి తనపురమున నడుగు పెట్టియుఁ బెట్టకమునుపే యెవరో దుర్వార్త యాతని చెవిని వేసిరి. ఇది విని యతఁడు పిడు గడఁచినట్లు క్రిందఁ గూలఁబడియు నట నుండుటకుఁ దోఁచక నెంట నే కన్యాంతఃపురమునకుఁ బోయెను. అచట నావృత్తాంత మంతయును విని ధైర్యమును విడిచి బోరున నేడ్వఁదొడం గెను. ఇచ్ఛినియం దాతనికిఁ గల ప్రేమ నిరవధిక మైనది. ఆపిల్ల చిన్న తనమం దే యతఁడు భార్యావియోగము నొందినను మాఱువివాహము చేసికొనక యామెను జూచుకొని యే జీవించుచుండెను. ఆబాలిక యుఁ జదువు చేతను, దెలివి తేటల చేతను దండ్రి మనమును బూర్తిగా లోఁ బఱుచుకొని యతని ప్రేమ కళాస్థాన మయ్యెను. అట్టి గుణవంతురాలును, బ్రాణా ధిక యు సగు కుమారి యాక స్మికము గనఁబడ లేదని విన్నప్పు డా రాజుమన స్సెంత కలఁతఁ జెందెనో యెవరు చెప్పఁ గలరు ? అతఁడు కొంత సేపు దుఃఖమున మునిఁగియుండి యెట్ట కేలకు, ధైర్యమవలంబించి దాసీజనమును బిలిచి యాసమా చారమంతయు నడిగెను. తొలినాఁడు జాము రాత్రివజకు నా మెయు, రూపవతియు మాటాడుచు సంతఃపురమున నున్నా రనియుఁ దరువాతివృత్తాంతము మాకుఁ దెలియ దనియుఁ జెప్పిరి. పిమ్మట నతఁ డంతఃపుర ద్వార రక్షకులను బిలిచి యడుగ వారిట్లు చెప్పిరి. 'మహాప్రభూ ! నిన్న రాత్రి జాము న్నర కడచిన పిమ్మట రూపవతి యొక సవారిని లోనికిఁ గొని పోవుచుండ నే న దేమని యడిగితిని. 'ఓయీ ! ఇదేమియును 
గాదు. రాజకుమారి యచ లేశ్వరునిఁ జూడఁబోవుచున్నది. అందులకై యీసవారిని గొనిపోవుచున్నాను. ఈవృత్తాంత మెవ్వరి తోను జెప్పవల దని రాకుమారి కోరుచున్నదని చెప్పి రూపవతి లోనికిఁ బోయెను. కొంత సేపటికి సవారీలోఁ గూర్చుండి రాజకుమారి స్వామి దర్శనార్థ మరి గెను. కాని, యామె మరల సవారితోఁ గొలఁది కాలములో నే యంతఃపురమునకు వచ్చెను. ఇంతకుఁ దప్ప మా కేమియుఁ దెలియదు.” 'సవారితో మరలివచ్చిన చో రాకుమారి యేల కన్ప వారి సందియము. అంత నొక పరిచారకుఁడు. యుచ లేశ్వరస్వామి యర్చకుని దీసికొనివచ్చెను, అతఁడు రాజును సమీపించి నమస్కరించి యుచి తాసనమునఁ గూర్చుండెను. అపుడు బెదరుచున్న చిత్త ముతో రాజా విషయ యమై యతని నడుగఁగా నాపూజారి చేతులు జోడించి మహా ప్రభూ ! నిన్న యభయసింగు వచ్చి 'ఈ రాత్రి రాజకుమారి స్వామి దర్శనార్థము వచ్చును గాన మఱికొంత సేపు వేచి యుండు' మని నాతోఁ జెప్పెను. నే నట్లే వేచియుంటిని. రాత్రి రెండవయామము ముగియుచుండ రాజకుమారి యాల యమునకు నచ్చినది. ఒక చెలికత్తెయు, నభయసింహుఁడును నా మెతో వచ్చిన ట్లున్నది. ఆమె స్వామిని దర్శించి ప్రసా దమును స్వీకరించి సవారీలోఁ గూర్చుండి యింటికి మరలి వ చ్చెను. ఇంతకంటె నా కేమియును దెలియ దని మనవిచేసి కొనెను.  గావించి అంతఁ బరమారుఁ డభయసింగునకు వార పంప నతఁడు రాత్రినుండియు నింటికి రాలేదని యచటివారు చెప్పిరి. ఇవన్నియు ముడి వేసి చూడఁగా రాజకుమారియు రూపవతియు నభయసింగును గలసి యెచ్చటికో పాఱిపోయి యుందురని తో పక పోదు. మఱియు నభయసింగు సర్వదా రూపనతి నాశ్రయించుటచేఁ జతురు రాలగు నాయువతి రాజకుమారి కభయసింగునం దనురాగము గల్గించి వారికిఁ బెండ్లి పరమారునివలన భయముచే నెక్కడికో పాఱిపోయిరనికూడఁ దట్టక మానదు. కాని, యా యూహ విశ్వాసార్హము కాదు, అభయసింగు జనప్రియుఁడు, గుణవంతుఁడు, వి శేషించి రాజు నకు మేనల్లుఁడు, రాజ గౌరవమునకుఁ బాత్రుఁడు. ఇట్టివానిని రాజకుమారి వరించిన చో రాజు సంతోషించు గాని యామెను గోపింపఁడు. జై తుఁడు తనసోదరికిఁ జెప్పిన సమాధానము నాలోచింప నీయంశము తెల్లము కాక మానదు. ఇట్లుండ నామెకుఁ బురమును విడిచి పోవలసినంత యవసర మేమి? మఱియు, నిచ్ఛిని ప్రవర్తన మరసిన వా రామె యంత సాహసము పూనునని తలంపరు.

ఇట్లెంత సేపు గూర్చుండి యాలోచించినను రాజ కుమారి యేమయినదో వారికి బోధపడ లేదు. జై తపరమారుఁడు చిరకాలము దుఃఖించి యెట్ట కేలకు ధైర్యమవలం బించి వేఁడినిట్టూర్పులు దందడింప నచ్చటి వారిని 'మంత్రులారా ! హితులారా ! సేవకులారా ! మాయిచ్చిని

ధూర్తు రాలు కాదు. సద్గుణవతి, యోగ్యురాలు, ఆమె తనంతం దా నిల్లు విడుచుట కంగీకరించి యుండదు. శత్రువు లెవ్వరో యామెనుగొనిపోయి యుండవలయును. అభయసింహుఁడును, రూపవతియు, నిచ్ఛినియు శత్రువుల చే వంచింపఁబడియుందురు. దేవాలయమునుండి యీదుర్గమునకు వచ్చులోసల నే యీ ఘోరము జరిగియుండ వలయును. రక్షకభటులు సవారీ మరల నతఃపురమునకు వచ్చినదని చెప్పుచుండుటచే నదియు నసంగ తముగా నే యున్నది. నాకు బ్రాణపదమగు కుమారిజాడ లెవ్వరు తీయుదురో వారికి గొప్ప బహుమాన మిచ్చెదను. పోయి చుట్టుపట్ల దేశములు వెదకి యామె వృత్తాంత మరసి వినిపించి నన్ను బ్రదికింపుఁ ' డని పలికెను . .

పదు నా ఱ వ ప్రకరణ ము

బాట సారులు

సమీపముగా ఆబూపర్వతమునకుఁ బడమటి దెసను నొకదుర్గము కలదు. అదిఘూర్జర రాజ్యములోనిది. ఆసమి పా రణ్యముల నివసించుదొంగలు గ్రామముల పై బడి కొల్లం గొట్టి దేశమునకు మూపదవముఁగల్గించుచుండ దాని నడంపఁ జాలిన సైన్య మాప్రాంతమున నివసించియుండుటకు భీమునిపూర్వు లెవ్వరో యాదుర్గమును గట్టించిరఁట. మన కథాకాలమున నాకోటలో సామాన్యమగు సైన్యము కలదు.

మన మధు నచ్చట విశేషముగా లభించుట చే దానికి మధుమంత మని పేరు వచ్చెను.

ఒక నాఁటి తెల్ల వాజు జామున నొక పురుషుఁ డాదుర్గము నుండిబయలు దేఱి యచ్చటికిఁ బోవుచుండెను. వాని భార్య కొంతదూరము దాఁక వానిని వెంబడించి పోయెను. అది భర్తతో 'మన యదృష్ట మిప్పుడు తెల్లముగావలెను. ప్రభు వున కభీష్ట కార్యమును నెఱ వేర్చుటలో మిక్కిలి తోడ్పడి తిమి. మనకుఁ దగిన బహుమానము లభింపక తీఱదు. గురువుగా రీయుత్తరమునఁ గూడ వ్రాసినారఁట ! మిగులఁ గష్టపడిన మనకు బహుమాన మిప్పింపఁ దలంచియే నిన్ను బ్రభువు చెంతకుఁ బంపుచున్నాఁడఁట, గురువుగా రీమాట నాతో స్పష్టముగాఁ జెప్పినారు. నీవు భద్రముగాఁ బోయి బహుమాన మందుకొని రమ్ము' అని చెప్పి యతనిఁ బంపి యాయువతి యింటికీ మఱలెను.

వాఁ డుత్సాహభరితుఁడై యుండుట చేతను, నేదే ఫలాపేక్ష గలవాఁ డగుట చేతను,మార్గము శిలామయ మైనను, విషమ మైయున్నను సరకుగొన లేదు. భార్యను విడిచి వాఁడు పదిబార లదూర మేగకము న్నే మఱియొక బాటసారి వానిని గలసికొని యిట్లు సంభాషించెను.

రెండ: .ఓయీ ! నీ వెక్కడికిఁ బోవుచున్నావు ?

మొద: నేనా ! చాలదూరము పోవలయును.

రెండ: _అదే ! ఏ యూరునకుఁ బోవుదువు ? మొద — పశ్చిమ సముదతీరముననున్న యొక పల్లెకు.

రెండ: -మంచిది, నేను గూడ నీతోఁ జాలవఱకు నచ్చెదను.

మొద: ఎంతదూరము ?

'రెండ: వల్లభీపురము ఏజకును.

"మొద:... -సరియె! మనము కలసియె పోవుదము,

అని వారు కూడఁబలికికొనుచుఁ బోవసాగిరి. మహా రణ్యముల చేతను, గుట్టల చేతను దుర్గను మగు నామార్గము వారిని మిగుల శ్రమ పెట్టెను, కొంతదూరమేగిన తరువాత వా రోక చెట్టునీడను విశ్రమించిరి. ఆ రెండన బాటసారి యాయాసముచే మాటాడక మొదటివానివంక, జూచుచుం గూర్చుండెను. మొదటి బాటసారి మార్గాయాసమునకు సుంత యైన బడలినట్లు గనఁబడ లేదు. గనఁబడ లేదు. అతని మొగ మెప్పుడును సంతోషపూర్ణమైనట్లు గనుపట్టుచుండెను. అందులకుఁ గారణ మేమైయుండు నని రెండవవాఁ డూహించెను. ఏమియు గ్రహింప లేక పోయెను. కాని, మొదటివాఁడు భార్యతో జేసిన సంభాషణము విన్నందున నా రెండవ బాటసారి బరిశీ లించి యాపురుషుఁ డేదియో ఘన కార్యము నెఱ వేర్చియున్న ట్టును, వాఁ డొనర్చిన పని కేదో పెద్ద బహుమానము నొందఁ దలంచుచున్నట్టును మాత్రము దెలిసికొనెను. అయిన నతఁ డందువిషయమై యేమియుఁ బ్రసంగింప లేదు.మార్గాయాసము కొంచెము తఱిగినందున వారు మరల నడవనారంభించిరి, అప్పుడైనను రెండవబాటసారి యతనివృత్తాంతమును గూర్చి తరిచి యడుగలేదు. మొదటివాఁడు గూడ నెన్నియో పూర్వవృత్తాంతములును, దేశసమాచారములును జెప్పుచుండెను. కాని, తనసంతోషమునుగుఱించి యేమియును మాటాడలేదు. అప్పటికి సూర్యుఁడు గగనమధ్యముననుండి యగ్గి గురియించుచుండుటచే నెండవేఁడిమికి దాళఁజాలక మఱియొకమాఱు చెట్టునీడను విశ్రమించిరి. మొదటివాఁడు కొంతసేపటివఱకు రెండవవానితో సరిగా మాటలాడుట మానివేసినను క్రమముగా స్నేహము ముదురుటచేఁ దనకష్టసుఖములనుగుఱించియు, గృహవిషయములను గుఱించియు రెండవవానితో జెప్పుచుండకపోలేదు. మఱియు, రెండవవాఁడు సత్ప్రవర్తనునివలెఁ గన్పట్టుటచే వానియందు మొదటివానికి విశ్వాసము గూడ హెచ్చెను.

అందుచే వాడు తనమూటలోని యొకయుత్తరమును దీసి “అయ్యా! నేను జదువెఱుఁగనివాఁడను. దీనిలో నా కెంత బహుమాన మిమ్మని వ్రాయఁబడినదో తెలుపుఁ' డని కోరెను. అంత రెండవవాఁ డతనితో నీకు రెండువేలరూపాయలు బహుమాన మిమ్మని వ్రాసినారని చెప్పి యాయుత్తరము మణఁచి మొదటివాని కిచ్చివేసెను. వారు తెచ్చుకొన్న తినుబండము లచ్చటఁ దినివేసి యాతపబాధ కొంచెము కొంచెము తఱిగినందున మరల నడచి పోవసాగిరి. మార్గాయాసము పూర్తిగా నడఁగిపోవుటచేతనో, యప్పుడే తృప్తిగా నాహారము దిన్నవాడగుట చేతనో రెండవ బాటసారికూడ నిప్పుడు మొదటివానివ లెనే సంతోషమున వరింపఁదొడఁ గెను. మొదటివాఁడు మాటిమాటికిని బహుమానము నే తలంచుకొనుచు నిజముగాఁ దనవంటి బీదవాని కొక్క మా రింత దన్యము లభించుట గొప్ప యదృష్టమనియు నా ధన ముతోఁ దనకోర్కెలును, దన భార్య కోర్కెలును గూడ ఫలింపఁ జేసికొనవచ్చుననియు నేమయినను నా ధనముతో ముందుగాఁ దగిన గృహము నొక దానిని గట్టనలయుననియు నిట్లు మనోరథపరంపరలచే నాకాశమున నొక హర్మ్యముఁ గట్టుకొని యందు విహరించుచుండుట చే వాని సంతోషమును గూర్చి వర్ణింప నవసర మే లేదు.

వా రట్లు పోవఁగాఁ బోవఁగా నొకమహారణ్యము తారసిల్లెను. వారు దానిని దాఁటి పోవలసియున్నది. అపుడు రెండవవాఁడు ప్రథమునితో 'ఓయీ '! సాయంసమయము గావచ్చినది,మనముగూడ మిక్కిలి బడలిక చెందియున్నాము. ముందు మార్గము కంటక శిలామయమై, క్రూరమృగములకు నిలయములగు నరణ్యములచే నావృతమై యెట్టివానికై నను భయము పుట్టింపక పోదు. ఇట్టితతి నీయరణ్యములోనుండి పోవ నెంచుట మహా ప్రమాదకరము. అదిగో! నా కానవచ్చు గ్రామమున - నా స్నేహితుఁ డున్నాఁడు. వాడు మిక్కిలి మంచివాడు. మనలను జక్కఁగా నాదరించును. ఈ రాత్రి యక్కడ నిలిచి యచట భుజించి నిద్రించి తెల్ల వాజు జామున


మరలఁ బ్రయాణము సాగింతము' అని పలుక మొదటివా డందుల కంగీకరింపక కార్యావసరమునుబట్టి తాను మార్గ మధ్యమునఁ కాలముపుచ్చవీలు లేదనియు, రెండన బాటసారి వెనుకకుఁ జిక్కినను దనప్రయాణము తాను మానననియుఁ జెప్పెను. కాని, రెండన వాఁడు సమీప గ్రామమున నుండు టకు నిశ్చయించి యచటి కేగుచున్నప్పుడు మాత్రము మొదటివాఁడు కూడఁ దా ననుకొన్నట్లు చేయక వాని ననుస రిరపక పోలేదు. ఆ చీకటిలో నాగాఢారణ్యములోఁ బడి వాఁడు మాత్రము పోఁగల్గునా ! రెండవవాని సాయ మున్న చో వాఁడు జంకకపోవును. కాని, వాఁడు పెడదారిఁ దొక్కు టచే మొదటివాఁడు గూడఁ జేయునది లేక యారాత్రి యచట నిలిచి పోయెను. రెండవ వాఁడు మొదటి వానిని వెంటఁ బెట్టు కొని తనమిత్రునియింటికిఁ బోయెను. ఆమిత్రుఁ డతని నెక్కు డుగా నాదరించి యాయిరువురకును నతిథిసత్కారము చేసి పండు కొనుటకు వేఱు వేఱు శయ్యల నమర్చెను. బాటసారు లిర్వురును నిదించిరి. ఆగృహస్థుఁడుగూడ మిత్రునితో గొంత సేపు సంభాషించి నిద్రించెను. రెండవ బాటసారి నిశీథ సమయమున లేచి గాఢముగా నిద్రపోవుచున్న మొదటి బాట సారియొద్దకుఁ బోయి వానిమూటలోనున్న యుత్త రమును మెల్లగా సంగ్రహించి తనమిత్రుని మేల్కొలిపి ఓయీ ! ఈ బాటసాగి 'నాకు శతకోటిలోనివాఁడు. నే నెందుల కై తిరుగుచున్నానో యా కార్యము నెఱ వేఱినది. నేనును, వీడును


దెల్ల వాఱుజామున మధుమంతమునుండి బయలు దేజితిమి. వీనికిని, నాకును నిదివఱకు బరిచయము లేదు.మార్గముసాగి వచ్చుచు భార్యతో వీఁ డొనర్చిన సంభాషణమువలన నాకుఁ గొంచెము సందియముగల్గినది. ఆసం దేహమును దీర్చుకొను వీనిని వెంబడించితిని, నాసం దేహము తీరినది. నాకోర్కి ఫలించినది' అని పలికి మిత్రునిసాయముననా మొదటి వానిని బంధించి వీనిని సవారీలోఁ బడ వేసి రహ స్యముగా మాయూరికిఁ బంపుమని చెప్పి వెడలిపోయెను. ఆగృహస్థుఁడు మిత్రుఁడు చెప్పినట్లు చేసెను. ట కే యీదిన మెల్ల

పదు నేడవ ప్రకరణము

భీమ దేవుని పశ్చాత్తాపము

పండు వెన్నెలలు జగమునునిండించుచున్న సమయ మున మలయమారుతము ప్రసరించు తావున నా సౌధోపరి భాగమునందు భీమ దేవుఁ డాసనాసీనుఁడై యుండెను. ఇచ్ఛినీకుమారిని వరింపన లెనన్న కోర్కి యతనిమనస్సున నతిశయించి చెప్పఁదరముగాని వ్యథలఁ బెట్టుచుండెను. సంతత విచారముచే నా రాజు మిగులఁ గృశించియుండెను. ఎన్ని శైత్యోపచారములు చేసినను , నతని దేహ మగ్ని హోత్ర పుంజమువ లె స్పృశింపఁ దరముగాకుం డెను, ఎప్పు డాబూ దుర్గమును ముట్టడింతును, ఎప్పుడు సౌందర్య దేవతన లెనున్న యిచ్ఛినీకుమారి ముఖచంద్రదర్శనము గల్గును. ఎప్పుడు నామనోరథము లీడేరు ననువిచారము తప్ప భీమునకు వే ఱాలోచన మేమియును లేదు. ముందుముందు జరుగఁబోవు కార్యములను గూర్చి మనస్సులో నేనేమియో యోజించుకొనుచు బాహ్యప్రపంచమును మఱచియుండెను. అప్పు డమరసింహుఁ డొకపురుషునితోఁ గూడ నచ్చటికి వచ్చి భీమదేవునకు నమస్కరించెను. ఆరా జతనిని విశేషముగా నాదరించి కూర్చుండనియమించి 'ఆరెండవపురుషుఁ డెవడని యడుగ మీ పినతండ్రికుమారుఁడు గోకులదాసని యమరసింహుడు ప్రత్యుత్తర మిచ్చెను, అది విని భీముఁ డానందముతోను, నాదరముతోను లేచి సోదరుని గౌఁగిలించుకొని యొకయాసనమునఁ గూర్చుండఁబెట్టి 'సోదరా! మీతండ్రి సారంగదేవుఁ డన్యాయముగా నొకసామంతరాజును జంపుటచేతను, నతఁడు నేను జెప్పినట్లు నడవకపోవుటచేతను మాయాగ్రహమునకుఁ బాత్రుఁ డయ్యెను, అన్యాయప్రవర్తకుని రాజ్యమందుండనిచ్చిన ప్రజానురాగమునకు భంగముకలుగునేమో యని భయపడి యతనిని దూరముగాఁ బంపింపవలసివచ్చెను. అట్లు చేసిన తరువాతనైనను మీతండ్రి పశ్చాత్తాపమునొంది యనుకూలముగా ప్రవర్తించిన నింతవఱకును రాకపోయి యుండును. కాని, సమీపగ్రామాదులను కొల్లగొట్టి నా రాజ్యమునకును, నాకును స్వస్థత గలుగనీయక మఱింత

యన్యాయముగాఁ బ్రవరించెను. తనతప్పు స్పష్టముగా దెలియ వచ్చుచుండ దానిని దిద్దుకొనకుండుట మీతండ్రికిఁ దగనిపని. అతనిని మంచి మార్గమునకుఁ దేవ లెనని నాతలంపు. మనుష్యులు పలుకష్టము లనుభవించినఁ గాని మంచి మార్గ మును దొక్కరు. అందులకే నేను మీతండ్రిని బర దేశ ములకుఁ బంపించి యంత లేసి కష్టములు గలిగించితిని. ఏమై నను మహాభినివేశముగల యతఁడు యావజ్జీవమును దనపట్టు వదలఁడయ్యెను. అందు చేత నే మీరు పలుకష్టములు పడ వలసిన చ్చెను. ఇక గతమును ద్రవ్వ నేల? నాకు మీయందు ద్వేషబుద్ధి యెప్పుడును లేదు. మిమ్ములను చేరదీసి కొనన లె ననియే నాతలంపు. తండ్రియనంతరమున మనప్రతాప సింహాదులయినను నాతో నేకీభవింప నిష్టపడక నా పై బగ సాధింప బద్ధకంకు లై నా బహిః ప్రాణ మగు నేనుఁగును జంపి వైవకుండిన నేను మీజోలికి రాక పోయియుందును. మీరు పృథ్వీ రాజు నాశ్రయించి జీవించుచున్నారని విని మిగులఁ బరితపించుచున్నాను. ప్రసిద్ధమగు చాళుక్యవంశమునఁ బుట్టి యఖండ రాజ్యాధిపతినగు నాయట్టి వానికి సోదరు లై యుండి మీరు జీవనార్థము పరులను - శత్రురాజును -మన వంశమున కెల్లఁ బరమశత్రువగు చోహన వంశజుని నాశ్ర యుండుట మిక్కిలి శోచనీయము. ఆవిషయము తలంప నాచిత్త ,మెల్లప్పుడును విశేషమగు పరితాపమును జెందుచున్నది. సోదరా! వేజాలోచన విడిచిచి

నాతోఁ జేరి సుఖంపుఁడు. మన వంశమునకు సంభవించిస యాకళంకమును దుడిచి వేయుఁడు. మనమందఱ మేక మై శత్రువుల జయించిన మన కెంతకీ ర్తి సంభవించును! మన వంశమున కెంత ప్రతిష్ఠ వచ్చును ! మన శౌర్యాదు లెంత రాణించును ! నా కిప్పుడు పృథ్వీరాజుతో గొప్ప యుద్ధము సంభవింప నున్నది. మీరిప్పుడైన నాపక్షము జేరి యాత నితో యుద్ధము చేసి రణరంగమున నతనిఁ జంపి మీ సోదరు లనుజంపిన పగను సాధించుకొనుఁడు. తమ్ముఁడా! నిజముగాఁ జెప్పుచున్నాను సుమా! కరుణరా జన్యాయముగా మన ప్రతాపారిసింహులను జంపినట్టు 'విన్నప్పుడు నేను జెందిన విచారమునకు మేర యే లేదు. అది విని సహింప లేక యీ యమరసింహుని మీ చెంతకుఁ బంపించితిని.కావున, మీరు నాయందున్న ద్వేషబుద్ధిని విడిచి నన్నుఁ జేరి నాళానందముఁ గూర్పుఁడు.' అని పలుక (గా నామాటలు విని గోకులదాసు మిక్కిలి .యానందించి భీమ దేవునియం దీపాటి మంచిగుణ ములుఁగూడ నున్న వియా యని యనుకొని 'అన్నయ్యా ! నీవు మా కాశ్రయ మిచ్చిన చో నిఁకఁ గావలసిన దేమి ! పర రాజుల నేల యాశ్రయింతుము? అతని సేవించుటకు మాకుఁగూడఁ జిన్నతము లేక పోలేదు. నిఖిల రాజుల కవమాన కరముగాఁ 'జోహన వంశజులఁ బొగడుచున్నప్పుడెల్ల మా మనస్సు పరితాపమును బొందక పో లేదు, ఆపరితాపమును సహింప లేక యేక దా మన. ప్రతాపుఁ డట్లు గావించెను!

వేరొక గతి లేక పోవుట చే నాతనిఁ గొల్చుచుంటిమి గాని యను రాగమునఁ గాదు. నీవు మమ్మింతగా నాదరించుచుండ నిది కాదని శత్రువుని జేరి జీవించుటకు మే మంత యవి వేకు లమా' యనుచుండ భీమ దేవుఁ డతనిఁ జూచి 'సోదరా! మీరు సంకోచమును విడిచి యిచ్చటికి రండు' ఈ యుద్ధా నంతరమున మీకు గొప్ప పదవులనుగూడ నిచ్చెద' నని చెప్పి సంత సింపఁ జేసి యతనిని లోనికిఁ గొని తగిన యుప చారములు చేయుటకు సేవకులను నియమించి మరలివచ్చి యమర సింహునితో నిట్లు ప్రసంగించెను.

భీ: -అమర సింహా ! వీరు దేశమును విడిచిపోయి నందు కానందించుచుండ నీవు వీరిని మరలఁ దెచ్చి పెట్టు చున్నావు "జ్ఞాతిశ్చే దన లేన !” మ్మనెడి పండితో క్తిని దలంచి భయపడుచున్నాను.

అ: ప్రభూ! మీరు భయపడ నవసరము లేదు. వీరిలో నసహాయశూరులగు ప్రతాపారిసింహులు మరణించి నారుగదా ! వా రుండిన చో మీరు భయపడుట న్యాయమే! కాని, వీరివిషయమై ఈ రింత చింతింపవలదు. మన మెట్లు చెప్పిన వీరట్లే నడతురు. పృథ్వీరాజు నాశ్రయించి యున్న వీరివలన మన కార్యము సులభముగా, 'నెఱు వేఱు నని యట్లు తలంచితిని, నీ రెప్పుడు పృథ్వీరాజు చెంత నుందురు గాన నచ్చట రహస్యములన్నియు మనకు సులభముగా దెలియును. మఱియు సమయముచిక్కినప్పుడు పృథ్వీ రాజును


బంధించు కొనివచ్చుట కాని లేక యతనిఁ దుదముట్టించుట కాని చేయుదురు. అందులకై వీరి స్నేహము చేసితిమి, తప్పేమి? ఇదిట్లుండ నిండు. మధుమంతమునకు వచ్చి యిచ్ఛినీకుమారిని దర్శింపవలయు నని నేను మీకు వార్త పంపితిని గదా! మీ రెందులకు రాలేదు? ఇచ్చిన సందర్శనసుఖ మనుభ వింపకుండ నిన్ని దినము లిట్లు నిరర్థకముగా నేల కడపినారు ?

భీ: - (అది విని యాశ్చర్యముతో) ఆr ! ఏమీ! ఇచ్ఛినీకుమారిని గొనివచ్చితివా ! సత్య మే ! సత్య మే ! ఈ శుభవార్త నిన్ని దినములదాఁక నా కెందులకుఁ దెల్ప లేదు ! ఆయువతి నిచ్చటికిఁ దీసికొని రాక యచ్చట నేల దాఁచితివి?

అ: -స్వామీ ! ఆమె నొక నాఁటి రాత్రిం గొనివచ్చి యందు విడియించితిమి. ఆమరునాఁ డచ్చటనుండి యామె నిటకుఁ దీసికొని రావలసినది. కాని, జై తపరమారుఁడు భటు లచేఁ గూతును వెదకింపక మానఁడనియు, మే మిచ్చటికి వచ్చుచు మార్గమధ్యమున - వారి కంటఁబడినచో మన ప్రయ" త్నము విఫలమగు ననియుఁ దలంచి యట్లు చేసితిని. ఆశుభ వార్తను దమకుఁ దెలుపుచు సైన్యస మేతముగా మధుమం' ' తమునకు రమ్మని యుత్తరము వ్రాసి మధుమంతుని చేతి కిచ్చి యిక్కడికిఁ బంపితిని. మీ రీశుభ వార్త వినఁగా నే యచటికీ, వత్తురనియు నాలోపున నే యీ రాజకుమారులను దీసికొని రావలయుననియుఁ - దలంచి యటు చేసితిని. నే నీతనితో

ధుమంతమునకుఁ బోయి చూచి మీ రచ్చటి కేల రాలేదో యని విచారించుచు నిచ్చటికి వచ్చితిని,

భీ: _మధుమంతుఁ డేల రాలేదు ?

అ: రాకపోవుట యాశ్చర్యమే !

భీ: ఇచ్ఛిని యట క్షేమముగా నున్నదా !

అ: _అవును, మే మిచ్చటికి వచ్చునపు డామెను జూచి యేవచ్చితిమి. ఇక మీరు తడయ రాదు. ఇచ్ఛినిని గొనివచ్చిన మఱునాటి నుండియుఁ బరమారుని భటులు దేశ మును గాలించుచున్నారు. ఇచ్చిన సమాచారముఁ గనుఁ గొన్న చో వా రవలీలనే వచ్చి 'యాదుర్గమును ముట్టడిం తురు, రాజపుత్రులలోఁ బెక్కం ఢతనికి సాయము చేయ నున్నారు. మనము త్వరగాఁ బోయి యాదుర్గమును రక్షిం పక పోయిన నిచ్ఛినీకుమారి మనకుఁ దక్కుట కష్టము. "లెండు, వేగముగా సైన్యములను వెడలింపుఁడు.

ఈ వచనములు విని భీమ దేవుఁడు తనమీత్రునిఁ గౌఁగి లించుకోని యతని బుద్ధి చాతుర్యమును మెచ్చుకొని యిచ్ఛినీ కుమారిని జూడవలెనన్న కుతూహలమునకు నమరసింహుని ప్రోత్సాహము తోడ్పడ నా దినమున నే చతురంగములతో మధుమంత మను దుర్గమునకుఁ బోయెను,

పదు నెనిమిదవ ప్రక రణము

బిచ్చ గాఁడు

మధుమంతమున నొక దివ్యమందిరములోఁ బదు నెనిమి దేండ్లడ్ల ప్రాయుము గలయువతి యొకతె కూర్చుండి యుండెను. ఆమె ముఖము పగటిపూటచందుకునివలె:గాంతిదక్కి యుం డెను. సంస్కారము లేకపోవుటచేఁ జెదరిన ముంగురులు ఫాల భాగమును గప్పుచుండెను. ఆమెకన్నులు నరకాల మేఘము వలే జలధారల ననిచ్ఛిన్న ముగాఁ గురియుచుండెను. నిరంత రమును వెడలుచున్న నేఁడినిట్టూర్పులచే బింపఫలసదృశమగు - కేమ్మాని పొగచూరి 'యుండెను. ఆమె దేహలత యెండ వేడిమిచే వాడి కొంతిదక్కినను మల్లెపూలదండ వలె నుండెను. పెక్కేల ఆయునతి స్త్రీ రూపమునొందినశోకమున లేఁ గంపడుచుండెను. ఆ దురదృష్ట వంతురాలు వేఱొక తె కాదు, ఇచ్చినకు మారియె.

ఇచ్ఛినీకుమారి బై రాగి చెప్పిన చోప్పున నా మందును దాని జపింపనారంభించెను. కాని, వెంటనే మూర్ఛక్రమ్మి యామెను జైతన్యహీననుగాఁ జేసెను. ఆమే యామఠమున నట్లే పడియుండగా రూపపతి బోయీలకును, ద్వార పాలుర క్షను ననుమానము గలుగకుండుటకై యాపట్టిసవారి నే కన్యాంతఃపురమునకుఁ గొనిపోయి కొంత సేపటికి మఠమునకు డిరిగివచ్చి యమరసింహునియాజ్ఞ ప్రకార మచ్చటికి వచ్చి మఱియొక సవారీయందు మూర్ఛాధీనయై యొడ లేఱుంగక

యున్న యాబాలిక నుంచుకొని రహస్యముగా మధుమంతము నకు గొనినచ్చి యాదిన్య సౌధమున విడియించెను. అభయ సింగును వెంటఁ బెట్టుకొనిపోయిన బైరాగి మరికొంత సేపటి కమరసింహుండె వచ్చి యాదుర్గమును జేరెను. మఱునాఁ డుదయ కాలమున నిచ్ఛినీకుమారి మేల్కొని సలుగడలం జూచెను. ఎటుచూచినను క్రొత్త వస్తువు లే చూ పట్టెను. ఆమె యాశ్చర్యముచే మ్రానుప డెను. అది స్వప్న మేమో యని భావింపఁదొడఁగెను. కాని, కొంత సేపటి కాసం దేహము తీరెను. ఆమె నలువంకలను బరిశీలించి త న్నె స్వరో మోసపుచ్చి యీ నూతనపురమునకుఁ గొనివచ్చి యుందురని నిశ్చయించుకొనెను. ఆమందిరమును విడిచి నాలు గడుగులు నడచి యీవలకు రాఁగా నే రూపవతి ప్రత్యక్ష మయ్యెను. దానిని జూడఁగా నే యా రాజకుమారికిఁ గొంత ధైర్యము గల్లెను. రూపవతియే మోసపుచ్చి త న్నచ్చటికి గొనిన చ్చెనని యామె యెఱుఁగదు. చతురు రాలగు రూపనతి సాయ ముండిన చో నా పదవచ్చినను దప్పించుకొనవచ్చునని యూహించుకొనుచు నిచ్ఛిని దాని చెంతకు వచ్చి యిట్లు ప్రశ్నించెను.

ఇచ్ఛి: — రూపవతీ ! మన మిప్పు డెచ్చట నున్నాము?

రూ: -అమ్మా ! ఇ దేదియో మాయగాఁ నున్నది ! ఆపాడు బై రాగిముండ కొడుకు మనల మోసపుచ్చి యిచ్చ దీసికొనినచ్చిన ట్లున్నది ! అమ్మా ! ఇదేమి యో నా కేమియు బోధపడకున్నది.

ఇచ్చి: -అభయసిం గేఁడీ ?

-ఏమో: ! అతనిసమాచారమే 'తెలియ లేదు.

ఇచ్చి- మన మిప్పు డెచ్చట నున్నాము ?

రూ:  : అంహిలపుర భీమ దేవుని దుర్గమున. ఇచ్చి: - రూపవతీ ! ఈ పేరు వినఁగా నే నాకు భయము వొడముచున్నది. అయ్యో ! ఎంత ప్రమాదము ! ఎంత ప్రేమా దము ! ఆ బై రాగి యెంత మోసము చేసినాఁడు' అయ్యో ఇంక మనగతి యేమి ? సుందరీ ! మనము తప్పించుకొనుట కుపాయ మేదియును లభింపదా ?

రూ: లభింప కేమి ! ఏదయిన నాలోచింతము.

ఇచ్ఛి: - సుందరీ ! నిన్ను బతిమాలుకొనుచున్నాను. ఇటనుండి తప్పించుకొనుమార్గ మాలోచించి యట్లు చేసితివా నీశుఁ "బెద్ద బహుమానము జేసెదను. ఈవార్త మాతండ్రి విని యెంతదుఃఖించునో ! మాచుట్టము లెంత విలపింతురో ! రూపనతీ ! ఎట్లు తప్పింతువో వేగముగాఁ దప్పింపుము.

రూ: -అమ్మా ! అదెంత సేపు! అని పలికి యట నుండి లేచిపోయెను. రూపవతిమాయలాడితనమునకును, నా రాజకుమారి యమాయకత్వమునకును నచ్చటి స్త్రీలు నవ్వుకొనఁజొచ్చిరి. ఇచ్ఛిని వారిని జూచి "యువతులారా! ఏల నవ్వుచున్నారు ? రూపవతి యెచ్చటికిఁ బోయినది ? ”

అని యడిగెను. వా రామెను జూచి "అమ్మా! నీ వింత యమాయికురాల వేమి? రూపవతి నింకను నీకు హితురా ల నియే తలంచుచున్నావా? అబూగడమునకు వచ్చి యతి ప్రయత్నము చేసి మోసపుచ్చి నిన్నుఁగొని వచ్చి భీమ దేవు నకుఁ 'బెండ్లిచేయ నెంచుచున్న రూపవతి నిన్నిందుండి తప్పించునా ? భీమ దేవుని వలన నెంతో బహుమానముఁ గొననున్న రూపవతి నీ విచ్చుస్వల్ప బహుమాన మాసిం చునా?' అని పల్కిరి.

ఆమాటలు విని యిచ్ఛినీకుమారీ పెనుగాలి తాకున నేలఁ గూలిన లత వలె నొక చోఁ గూలఁబడెను. మిక్కిలి దుఃఖించెను. ఎంత సేపు దుఃఖంచిన నేమి ప్రయోజనము ? ఆర్చువారా ! తీర్చువారా ? ఓదార్చువారా ? ఎట్టకేల కామెయే తనకుఁ దా ధైర్యముఁ దెచ్చుకొని యతికష్టముచే దినములు గడపుచుండెను. ఇట్లుండ నొక నాఁడు రూపవతి యామెకంటఁ బడెను. అప్పు డిచ్ఛినికిఁ గల్గినకోపమునకు మేర లేదు. నిప్పులు గురియు నేత్రములతో దానిని జూచి 'ఓసీ ! మాయావి నీ! ఎంత దుష్టురాల వే! అప్పటి నీప్రసంగము వలన నీవు భీమ దేవుని పరిచారకురాల వేమో యను ననుమా నము గల్గుచుండెడిది. వెంట నే నీ కపటవచనములకు మోహిత యాయను మానమును దొలంగించుకొనెడి దానను, అంతియే కాని, నీవు నాకు మహాపకారము చేయఁబోవు కాల సర్పమునుగాఁ దలంప నై తి. ఓదుష్టు రాలా ! ఓకృతఘ్ను

రాలా ! ఇంత కాలము 'నాయన్న ముఁ దిని నాబట్టఁ గట్టి నీవు చేసెడి యుపకార మిదియా ! ఇట్టి నిన్ను ఖండఖండము లుగాఁ గోసి కాకులకు నై చినను బాపముండునా ? అని యిట్లు పలు దెజంగుల నిందించుచుండఁగా రూపవతి పక పక నవ్వుచురాకుమారీ! నేను నీ కపకార మేమియుఁ జేయలేదు.

చక్రవర్తియ సందగిన యొక మహా రాజునకు నిన్నుఁ గూర్చు చున్నాను. ఇది నీ కసకారమా! నేను జేసిన యుప కారమున కానందించుటకుమాఱు నీ వేల యిట్లు విచారిం చెదవు' అని యేమో చెప్పఁబోవుచుండ 'ఓసీ! దురాత్మురాలా ! నాకు బెండ్లి చేయుటకు నీ కేమి యధికారము గలదు? ఇఁక నీవిష యము నాయెదుట మాటాడకుము, మాటాడితి వేని సిగ పాయదీసి తన్నె దను' అని గట్టిగాఁ గసరెను. ఆమె భయం కరాకారమును జూచి రూపవతి జంకి యేమియుఁ బలుక లేక యటనుండి వెడలిపోయెను.

కొంచెము శాంతించి అనంతర మిచ్ఛినీకుమారి తక్కిన స్త్రీలను మంచిమాటలాడి వారితో స్నేహము చేసి యెట్లో కాలము గడపుచుండెను. ఇట్లు కొన్ని దినములు గడచెను.

ఒక నాఁ డామె దాసీజనముతో నొక చోఁ గూర్చుండి సంభాషించుచుండఁగా నామె చెవి కేదో యొక శబ్దము వినఁ బడెను. ఆ యువతి సంభాషణము వినుచుండఁగా

శక్య నాధ్వని మఱింత దగ్గజగా స్పష్టాక్షరములతో వినిపించెను, . అది యీకింది శ్లోకము,

 శో, నమాతుం మే నయనయుగ మాళీకరతలై
స్తనుజ్యోత్స్నా చేయం విఘటయతి గాఢాంధతమసం
సఖినా మాహూతిం రచయతి చ మే గంధనిషహః
రుదంతీం తాం మాతా హసిత వదనా చుంబతి ముఖం.

సీతా దేవి బాల్యమును వర్ణించు నీశ్లోక మానెనమె చెవిని బడినప్పు డిచ్ఛినీ దేవికిఁ గల్గినయానందమునకు మేర లేదు, ఆమె కాశ్లోక మనఁ బ్రాణముకంటెను బ్రియతమమైనది. ఇంట నుండునప్పుడు తుచుగా దాని నే చదువుచుండెడిది. ఆమె దాసీజనమును జూచి 'ఆపాడెడివారెవ్వరు ?" అని యడుగఁగా వాండ్రు 'అమ్మా ! ఎవ్వండో బిచ్చగాడై యుండును' అని చెప్పి యటనుండి వెడలిపొమ్మని కేక వేసిరి. ఆబిచ్చగాఁ డట్లు చేయక యింకను నాశ్లోకము నే పఠింప జొచ్చెను.

అతని కంఠధ్వనికి సౌధములు ప్రతిధ్వనులిచ్చుచుండెను, ఇచ్ఛినీకుమారి కాక ంఠస్వరము పరిచితమైన ట్లుండుట చే న దెవ్వరిదై యుండును ? అని యాలోచించుచున్న సమయమున నొక దాసి బిచ్చగానితో 'ఓరీ ! ఎందుల క ట్లఱచుచున్నావు? ఇక్కడ నీకు బిచ్చము పెట్టువా రెవ్వరును లేరు. కందాకొట్టు దగ్గజుకుఁ బొమ్ము' అని చెప్పెను. అది విని వాఁడు 'అమ్మా! 'నే బిచ్చమునకు రాలేదు. నేను' గాశికిఁ బోవుచున్నాను, మార్గవ్యయమునకు నాకు ధనము కొంచెము కావలసి యున్నది. మారాణిగా రిక్కడ లేరు. నీకు ధనము దారవోయువా రెవ రున్నారు ? పో పొమ్ము' అని పలుకునంతలో నిచ్ఛినీ దేవి యచ్చటికి వచ్చెను. ఆమె యాబిచ్చగానిని జూడఁగా నే యా మేముఖమున వికాస మంకురిం చెను. ఆమె సంతోషవికా రము లేమియుఁ బై కిఁదోఁపనీయక దాసిని జూచి 'ఓసీ ! యింటికి వచ్చిన యాచకున కొక కాసైన నియ్యకుండఁ దఱిమి వేయఁ జూచుచున్నావా? మీ ప్రభువుగారు మీ కిట్టి హితోప దేశముఁ జేసినారా యేమి ? ఇంతధనము, ఇంత రాజ్యము, ఇంత లేసి సంపదలును నొకబిచ్చగాని కింతో యంతో యిచ్చినంత మాతమున నే వట్టిపోవునా ? ఐశ్వర్యమునకుఁ బుట్టినింటిన లె నున్న యీ దివ్యభవనమునకు వచ్చినయాచకుఁడు విఫలమనో రథుఁడై పోయినచో నిఁక నంతకన్న శోచనీయ మేమి ? అని తన యింటనున్న యాభరణము నొక దానిని దీసి యాబిచ్చ గాని కిచ్చి 'అయ్యా ! దీనితో సతీర్థయాత చేసికొనిరండు. మరలివచ్చునపుడు నాకు దర్శన మొసంగుఁడు.మీరు మహానుభావులవలె నున్నారు. మీ వంటివారిదర్శనము మాకు సకలఫలప్రదాయి యగును' అని పల్కెను.

ఆ రాజకుమారి దయతోనిచ్చిన యాబహుమాన మతి వినయముతో నందుకొని కనుల కద్దుకొని యామెను బరిపరి విధముల దీవించుచు వెడలిపోయెను. చుట్టునున్న దాసీజన మా మెయు దారబుద్ధిని, దీన వాత్సల్యమునకును మిక్కిలి


యచ్చెరు వొందసాగిరి. నాఁటినుండియు నారాజపుత్రి దయను సంపాదించి యేదయినను బహుమానము పుచ్చుకొనవలెనని తలంచి నకుళ యను పరిచారిక తక్కినవారికంటె మిక్కిలి యడఁకువతో నర్తించుచు నాయిచ్చిని యభిప్రాయము ననుసరించి నడచుచు నామెకుఁ దగినయుపచారములు చేయ నారంభించెను, అందులకు రాజకుమారి యానందించుచు 'దానిపై నెక్కుడుదయ చూపుచుండెను,

పరి దొమ్మి ద ప ప క ర ణ ము

ఇచ్చినీ భీమ దేవుల సంవాదము

మధువంతమునఁ గైలాసశిఖర మను నొక మహా సౌధము గలదు, ఉన్నతమైన సుధాకాంతుల చే సతి ధవళమై కైలాసశిఖరమువలె నుండుట చేతనే దానికా పేరు గలిగెను. దానియు పరిభాగమున నిచ్ఛినీకుమారి వకుళతోఁగూడ విహ రెంచుచుండెను. ఆ పరిచారిక యచటికీ దూరముగాఁ గనఁబడు చున్న పల్లెలను, బట్టణములను, నదులను, గోండలను జూపు చుండ నిచ్ఛినియుఁ దదేకాగ్రచిత్త ముళోఁ జూచుచుండెను. అంతట నా సౌధమున నెవరో యెక్కి వచ్చుచున్న ట్లడుగుల చప్పుడు వినఁబడఁగా నాయువతులిరువురును శబ్దము వినవచ్చు చున్న వైపు దిరిగి చూచిరి. మొదట రూపవతియు దానిననుస రించి భీమ దేవుఁడును వచ్చుచుండిరి. ఇచ్చిని భీము నిదివటి

టామె కెఱుఁగమిచే నేనంలో పురుషుఁడు నచ్చుచున్నాఁ డని తలంచి దాసి నడుగఁగా నంహిలపుర భీమ దేవుఁ డతఁడే యని యది తెలిపెను, ఆమాట వినగానే యారాకుమారికిఁ గలవర పాటు హెచ్చయ్యెను, గాలి తాకునఁగదలు తీగేవ లెను, వాటిన వీణాతంత్రివడువునను నొకమాటామె కంప మొందెను. భీముని వెర్రితన మిదివరలో వినియుండుట చే నాఁ డతనివలనఁ దన గౌరవమున కెక్కడ భంగముగల్గునోయని మిక్కిలి పరి తపింపఁ దొడగెను. అయిన నామె యొక్కంచుక ధైర్యమును జక్క ఒట్టి "మేల్ముసుఁగును సవరించుకొని వకుళను మాటు గొని యుండెను,

అంతట రూపవతీయు, భీముఁడును నచ్చటికి వచ్చిరి. భీముఁ డచట నున్న స్ఫటిక శిలా వేదిక పై నుపవిష్టుఁ డయ్యెను. రూపవతీ యుతని చెంత నిలువఁబడి యిచ్ఛినీకుమా రిని గొనివచ్చుట గుఱించి మనవి చేసికొనుచుండెను. భీముఁ డా మెమాటలను వినుచున్నట్లు నటించు చుండెను. కాని, యవి యతని చెవిని బడ లేదు. అతనిమనస్సు చూపులతోఁ గూడ బోయి వకుళ చాటుననున్న యిచ్ఛిని పై విహరించుచుండ దానిమాట లెట్లు వినఁగలఁడు ? రూపవతి యిఁకఁ దనప్రసం గము. కట్టి పెట్టి యిచ్ఛినీకుమారి చెంతకుఁ బోయి "యెదుట మోకరించి 'అమ్మా ! భీమ దేవుఁడు వచ్చి నీకరుణా కటాక్ష లేశము నొంద వేచియున్నాడు. పరిపూర్ణ చంద్రబింబ మఃను మేఘమండలమున లె నీసుందర వదనము నావరించియున్న మేల్ముసుఁగు నొకించుక యొత్తిగించి నీకడకంటిచూపులచే నతనిఁ దానమాడించి యతనిఁ గృతార్థునిఁగాఁ జేయుము. అమ్మా! నీవు చక్కఁగాఁ బరిశీలింపుము. ఈ రాజువంశ మాక్షత్రియకులములలో నుత్తమమగు చాళుక్యవంశము! ఇతనిరాజ్యమా యనంతమైనది! పరాక్రమమా, శత్రురాజులను గడగడలాడింపఁజాలినది! సైన్యములా సముద్రమువలె నతిభయంకరమైనవి! సకలసంపదలకు నిధియగు నీతని వరించుట కేల సంశయింతువు! తల్లీ! నామనవి వినుము. ఇతరుల కెవ్వరికిని లోఁబడక వీరాధివీరు డనిపించుకొనియున్న యీరాజకుమారుని ఘూర్జరరాజ్యలక్ష్మితోఁగూడ నీదాసునిగా నేలుకొమ్ము' అని పలికెను.

రూపవతి మాటలాడుచున్నంతసేపును భీముఁడు ఱెప్ప వాల్పకుండ నారాజకుమారినే చూచుచుండెను. అంత మృదువుగా, నంత మధురముగా, నంత సరసముగా, నంత చమత్కారముగా, నంత వినయముగాఁ బలికిన రూపవతివాక్యముల కామె యేమి సమాధానము చెప్పునో యని యతఁడు కనిపెట్టుకొని యుండెను.

త న్నన్యాయముగా మోసపుచ్చి తెచ్చి యిట్టి యిక్కట్టులపాలు గావించిన రూపవతి కంటఁబడినప్పు డిచ్ఛినికిఁ బొడమినకోపమునకుఁ బారము లేదు. ఆకోపాగ్నికి దానిప్రసంగ మాజ్యధార యగుడు నాకుమారి యిఁక సహింపలేక తనయెదుట మోఁకరించియున్న రూపవతిగుండెలపై గాలితో

గట్టిగాఁ దన్నెను. పిడుగు దెబ్బవంటి యాతన్నుఁ దిని యా దాసి దూరముగాఁ దూలిపడెను. ఆ తాపువలన గుండె బరు వెక్కి బాధించుచున్నను నది యెట్లో సహించి లేనినగవుఁ దెచ్చికొని మెల్లగా లేచి భీమునిఁ జూచి 'అయ్యా ! ఈ యువతిని మీరే వశపఱచి కొనుఁడు. నే నీమె చెంత మాటాడ లేను. మాటాడిన నీమె యూరకుండదు. ఈ తాపున కే నా గుండె కందిపోయి మిక్కిలి బాధించుచున్నది. ఇంకను నీమెకు హితోపదేశము చేసిన నాప్రాణములు దక్కవు' అని పలికెను, భీముఁ డందులకు నవ్వుచు నిచ్ఛినీకుమారికి వినఁబడునట్లు 'రూపవతీ ! నీ పల్కు లసందర్భములు. పూలబంతితోఁ గొట్టిన శరీరము కందునా ! నొప్పి చెందునా ! పూలబంతికంటె నతి మృదువగు నీ మెపాదతల మెక్కడ ? అది తాకినంతమాత్ర మున నీకు నొప్పి జనించు టెక్కడ ? వట్టిమాట ! అట్టి మృదు పద తాడనము లభించినందులకు నీ వెంతయో యానందింప వలసియుండఁగా విచారింతు వేల ? ఆపాదఘాతము నాగుండె యం దే తగిలిన ' నే నపరిమి తానందమును జెందుదును. కృతా ర్థుఁడ నగుదును. కాని, నా కట్టి భాగ్యము లభింప లేదు.నీ వెంత భాగ్యవంతురాలవు !' అని పల్కుచుండ రూపవతి విని 'అయ్యా ! నాభాగ్యము మండిన జేయున్నది. మోహాంధు లై యున్న మీ కీమె పాదతలము పుష్పముకంటె నెక్కుడు మృదువుగా నున్నట్టు తోఁపవచ్చును. కాని, నా కిది వజ్రము కంటెను గొంచెము గట్టిగా నున్నట్లే యున్నది. ఈమె పాద

తాడనములు మూకుఁ బూలబంతి దెబ్బలవ లె నుండునని తోఁచి నచో మీ రే యామె కుప దేశము చేసి యాభాగ్యము నొం దుఁడు.జన్మము కృతార్థతనొందించుకొనుఁడు' అని చెప్పెను,

భీముఁ డప్పు డా రాజకుమారిని గొంచెము సమీపించి 'యువతీ ! నీ మృదుపాదముతో నీదీనురాలినిగాక నన్నే తన్ని నచో నెంతో యానందింతును గదా ! ఎంతో కృతార్థుఁడ 'సగుదును గదా ! నిన్ను మోసపుచ్చి తెచ్చుట చేఁ గృతాప రాధుఁడ నగు నాగుండెలపై ఁ దన్నుము. నీ బాహు పాశముల చే బంధింపుము. నీకడగంటి చూపులను తూపులచే నాహృదయ మును జీల్పుము. పాప మేమియు నెఱుఁగని రూపవతిని దన్ని తి వేల ! సుందరీ ! చిర కాలమునుండి నీ సౌందర్యమునుగూర్చి వినుచు నీ సుందర రూపమును జూడ లేకపోవుటచే నెడ తెగని తాపముఁ జెందుచుఁ గాలమును గడుపుచుండ నీయస్త్ర విద్యా నై పుణ్యమును దెలుపు నీ బాణము కంటఁ బడినది. అప్పటి నుండియు నామనస్సు చెందుచున్నసం తాపమున కంతము లేదు. నా కస్త్ర విద్యయందుఁ బ్రీతి హెచ్చు. దాని నభ్యసిం చిన వారియందు నా కెంతో గౌరవము. ఇట్లుండఁ, బవిత్రమగు పరమారువంశమునఁ బొడమి సౌందర్యమునకును, సద్గుణము లకును నిధానమనై ప్రాయమునఁ జిన్న దానవయ్యు నస్త్ర విద్యాభ్యాసమునందు-అభ్యాస మన్నఁ జాలదు. అస్త్ర విద్యా చాతుర్యమునందు - అందులోను నావంటి వీరుహృదయము మెప్పొదవించిన చాతుర్యమునందుఁ- పెద్దనై యున్న నీయందు నా కెట్టి గౌరన ముదయించునో, యెట్టి యనురాగము మొక లెత్తునో చెప్పవలయునా ? నీకడగంటి చూపులు నా పైకి మలపి నన్ను వరించి కృష్ణునకు సత్యభామవ లె యుద్ధరంగము లందు నీవు నా కెన్నఁడు బాసట నై యుందువో యని కొండం తాస పెట్టుకొన్నాను. కోమలీ ! సొమనోరథము లీ డేర్పుము' అని పలికెను.


ఇదివఱకు భీమునిచర్యలు విన్నయిచ్ఛినీకుమారి గా పలుకులు మిక్కిలి చూశ్చర్యమును గలిగిం చెను. అతనిమాటల యందుఁ దా ననుకొన్నట్లు దుందుడుకుఁదనముగాని, మోటుఁ దనముగాని యా మెకు జూ పట్ట లేదు. అతఁ డంత పొందిక గాను సరసముగాను మాటాడునని యామె యనుకొన లేదు. తన కట్టి యిక్కట్లు గల్గించినందుల కతనిపై సామెకు గోపము హెచ్చు పెరుగుచున్నను నతఁ డంత మృదువుగా మాటాడుచున్నపుడు గఠినముగాఁ బ్రత్యుత్తర మిచ్చుట తగవు గాదని తలంచి వీణాస్వరమువంటి మృదు మధురమగుకంఠముతో నతని కిట్లనియె. 'ఓ రాజా ! నీకు నా యం దనురాగముజనించిన జనింపవచ్చును. మానవస్వభా నము నెవరు కాదనఁగలరు ! కాని, మాతండ్రి నన్ను నీ కీయనని స్పష్టముగాఁ జెప్పినను, నాకు నీయం దనురాగము లేనట్లు నీపరిచారిక యగురూపవతివలనఁ దెలిసియున్నను విముఖుఁడవు కాక మొండి పట్టుపట్టి మోసపుచ్చి నన్ను గొనివచ్చుట నీ కెంతమాత్రమును దగదు. నీవు నాయస్త్ర చాతుర్యమును వలచినట్లే నేనును నొక రాజకుమారునియస్త్ర నైపుణ్యమునకుఁ బట్టునడి నలచితిని. ఇదివఱ కే నామన స్సతని కర్పించితిని. ఇక నీవు నీ పట్టుదల విడిచి నన్ను విడుదల చేసి సగౌర నముగాఁ బంపి వేయుము. అట్లయిన నీనుఁ బెద్ద గౌరవ మును గీర్తియును గల్గును."

ఆమాటలు భీముఁడు విని 'నీవు వరించిన రాజు నెఱుఁ గుదును. అతఁడు నాకుఁ బరమశత్రువు. వాని నిఁకఁ గొలఁది దినములలోఁ జంపెదను. అట్టి వానిని జేపట్టి యేమి సుఖంచె దవు ? కావున, నీమనస్సు మరలించి నన్ను వరింపుము' అని పలికెను.

ఇచ్చి: -నిజముగా నీ వాతనిఁ జయింప లేవు. అయి నను నతఁడే నాకు భర్త'

భీ: -యువతీ ! నీవు మొండిపట్టుపట్టి వ్యర్థముగాఁ జెడి పోకుము. నీమూలమున నీ తండ్రి రాజ్యమున కపాయము గల్గింపకుము. నీవు నన్ను వరింపని చో మీతండ్రిని నిముసము లో నేజయించి, పృశ్వీరాజునుజంపి యా రాజ్యమును నావశము గావించుకొందును. అప్పుడు నీవు చేయునది - లేక నన్నె వరింతువు.

ఇచ్చి: —అది వట్టిమాట! నీ వేమి చేయ్యగలవో చేయుము. శక్తి గల్గిన చో వారినందఱను జయించి సామా జ్యము స్థాపించుకొనుము. నీవు సార్వభౌముఁడ వైనను, ముల్లో కముల కధిపతి వైనను నిన్ను వరింపను. ఎదు అట్లయిన నీ వెన్నటికిని నిందుండి విముక్తి జెంద లేవు. నీ విం తేనియు సుఖంప లేవు.

ఇచ్చి: ——విముక్తి లేకున్నఁ బోనిమ్ము, నాహృదయము నందున్న నాపతిని నారాధించుకొనుచు సుఖముగాఁ గాలము గడి పెదను.

భీ: బల్మిని వరించిన నేమి చేయుదువు ?

ఇచ్ఛి: — ఉత్త మస్త్రీలను బలాత్కరించిన వారిగతియే నీకును బట్టును.

భీముడా వచనములు విని పక పక నవ్వుచు 'ఓ వెర్రి దానా ! మంచిమాటలచేఁ దప్పించుకోనిపోవ లె నని తలంచు చున్నావు. భీమ దేవుఁ డంత యమాయికుఁడుగాఁ' డని పలికి రూపవతితో నచ్చోటు గదలిపోయెను.

ఇరు వ ద వ ప్రకరణము

ఆబూగడము - అభయసింగు

రూపొందిన రాజ్యలక్ష్మివలెఁ దన భవనమునఁ జరిం చుచుఁ దన సత్ప్రవర్తనము చే నెల్ల రహృదయముల కానం దముఁ గోలు పుచుఁ దన చతురవచనముల చేతను, యుక్తుల చేతను యుక్త సమయములఁ దండ్రికిఁ దోడుపడి యతనివలన నెక్కుడు గౌరవము చెందుచునుండు నిచ్ఛినీకుమారి మాయ మైనప్పటినుండియు జై తపరమారుఁడు రేయింబవళ్ళు దుఃఖిం


చుచు నాహారముఁగొనక , నిద్రవోవక , రాజ్యవ్యనహారములు చూడక, యాప్తులతో నై నను భాషింపక క్రమక్రమముగాఁ జిక్కి శల్యమై గుర్తింపఁదరముగాని యవస్థను బొంది భూతము సోఁకిన వానిభంగి వికార చేష్టలు చేయుచు నర్తించుచుండెను. ఇచ్ఛినీకుమారి జాడలు దెలిపి పరమారునివలనఁ బెద్ద బహుమానముఁ బొందవ లెనని తలంచి దేశమును వెదకఁ బోయినవా రొక్కరొక్కరే నచ్చి యాబూగడమును జేరిరి. మార్గాయాసము దక్క వారికి వేటికలాభము లేక పోయెను. ఆహారసంపాదనార్థము నలుదిక్కులకుఁ జెదరిపోయిన పక్షులు తిరిగి తమకులాయములు చొచ్చునట్లు సులభముగా నే యిచ్ఛినీ కుమారిని వెదకి తెచ్చెద మని ప్రగల్భములు పలికి పోయిన వారిలో, బెక్కండ్రు చాటుచాటున వచ్చి తమతమగృహము లను జేరిరి. అంతియ కాని యొక్కఁడును నిచ్ఛినివార్తను దెలి పిన వారు లేకపోయిరి.

అంత నొకనాఁడు కొందఱు పురుషు లొక పురుషుని భుజములపై నై చికొని వచ్చి పరమారునిముందుఁ బడ వేసిరి. ఆపురుషుఁడు మిగులఁ గృశించిపోయెను, చుట్టునున్న వా రతనిఁ జూచి యతికష్టముచే గుఱుతించి 'అభయసింగు, అభయసింగు' అని కేకలు వేయనారంభించిరి. అది విని ప్రజ లందజు నాశ్చర్యపడి యభయసింగు వృత్తాంతముఁ దెలిసి కొనఁ గుతూహలులై గుంపులు గుంపులుగాఁ గూడి వచ్చి యభయసింగుచుట్టును మూఁగిరి. పరమారుఁ డతనిజూడగానే మెల్లని యతనివలనఁ దనకూతుజాడ లేమయినను దెలియవచ్చునని యనుకొని యత్యాతురతతో నతని సమీపించి 'అభయ సింహా ! ఈరూప మేమి ! నీ కిట్టియాపద యెట్లు సంభవించెను? ఇచ్ఛినీకుమారి యెక్కడ ? నీ వామె కేమయిన నపకారము చేయఁదలంచితివా ! నీవృత్తాంత మున్న దున్నట్లు చెప్పి వేయుము. లేనిచో నీ ప్రాణములు నీకుఁ దక్కవు' అని పలికెను. అది విని యభయసింగు చేతులు జోడించి మెల్లని కంఠస్వరముతో 'మహాప్రభూ ! నాతప్పు మన్నింపుఁడు. నే నిందుఁ జేసిన నేర మేమియును లేదు. ఇచ్చినీకుమారిని బెం డ్లాడవలె నను తలంపు నా కుండెడిది. ఆ రాజకుమారియొద్ద మిక్కిలి చనవు వర్తించుచున్న రూపవతితో నేను స్నేహముఁ జేసి నాయం దామె కనురాగము జనించునట్లు చేయవ లెనని కోరితిని. మాయలాడి యగు నాదుష్టురా లట్లే చేసెద నని చెప్పి నావలన ధనమంతయు లాగి తుదకు నన్ను మోసపుచ్చి యచ లేశ్వరాలయమునకుఁ బోవనున్న రాజ కుమారి కీరాత్రి నీవు సాయము చేయు' మన నే నందుల కంగీక రించితిని. రాజకుమారి సవారీతో వెడలి స్వామిదర్శనార్థము వెళ్ళినది, ఆమె క పాయముగలుగకుండుటకై నేనును ఖడ్గ పాణి నై యామెను 'మెంబడించితిని. స్వామి దర్శనము చేసికొని బై రాగిని జూడఁ దలంపుతో నామె తన్మఠమునకుఁ బోయెను. నేనును బోయితిని. కాని, నన్నుఁ జూచి యామె సిగ్గుపడు నేమో యని తలంచి నేను లోపలి కరుగక ద్వారమునోద్ద నే నిలిచిపోయితిని. లోపల నేమిజరిగెనో నా కేమియు బోధపడ లేదు. కొంత సేపటికి నేను బై రాగి చెంత కేగితిని . అచ్చట నిచ్ఛిని కనపడ లేదు. రూపవతిమాత్రమే యుండెను. బై రాగిమాటలవలన రాజకుమారి లోపల 'నేమియో జపించు చున్నట్లుమాత్రము గ్రహించితిని. ఆ బై రాగి రూపవతితో నిచ్ఛినీకుమారిని దుర్గమునకుఁ గొనిపొమ్మని చెప్పి 'యొక వనమూలిక యిచ్చెదను నాతో రమ్మని నన్నొడఁబఱిచి తన వెంటఁ గొనిపోయెను. ఆ రాజకుమారి నొంటిగా విడిచిపోవు టకు సందేహించితిని. కాని, రూపవతి రాజకుమారి కేమియు భయము లేదు నీవుపోవచ్చునని యనుటచే నతని వెబడించి పోయితిని. రూపవతీ - రాజకుమారుల తరువాత వృత్తాంత మేమియో నాకు దెలియదు. ఆదుర్మార్గుడగు బైరాగి యాకొండ పై నన్నుఁ గొంతదూరము గొనిపోయి యొక రాతి పై గూర్చుండఁ బెట్టి 'ఇదిగో! నిప్పుడే వచ్చెద' నని చెప్పి వెడలిపోయెను. అతఁడు వెడలిపోయిన యొక నిముసము న కే పదుగురు మనుజులు వచ్చి నన్నుఁ బట్టుకొని బంధించి యొక కొండగుహలోఁ బడ వైచిరి. అప్పుడు బై రాగి వచ్చి నన్నుఁ జూచి 'ఓయీ ! నిన్ను వదలినచో నీ వాబూగడము నకుఁ బోయి నల్వుర తోను జెప్పి రాజకుమారిని దీసికొని పోకుండ నేదోయాటంకముఁ గల్పింతువు. నీ విట్లే యుండుము' అని పల్కి . నే నేదో మొఱ పెట్టుకొనుచున్నను వినక యా మనుజులతో వెడలిపోయెను, నే నట్లేపడియుండి యాఁకటి చే బ్రాణములు విడుచుటకు సిద్ధముగా నున్న సమయమున వీరు వచ్చి నాకట్లు విప్పి నాయాఁకటిని దీర్చి బ్రతికించిరి. “రా జేంద్రా ! ఆ బై రాగియు, రూపవతియుఁ గలసి మోసము చేసి యా రాజకుమారి నెచ్చటికో గొనిపోయినారు. దుష్టు రాలగు రూపవతియు నాధనమంతయు లాగికొని తుదకు నా కెట్టియవస్థ గల్గించినదో చూడుఁడు. నేను జేసినయపరాధమును సైఁపుఁడు' అని ప్రార్థించెను. పరమారుఁ డది విని యం దతనియపరాధ మేమియు లేక పోవుట చే నతని క్షమించి 'ఓ యభయసింహా! నీ వాబై రాగిని, రూపవతినిఁ గూడ బాగుగా నెఱుఁగుదువు. కావున, నీవు స్వస్థుఁడ వైనపిమ్మటఁ బోయి వారిజాడ లరయు' మని చెప్పి యింటికిఁ బంపి వేసెను. అది మొద లభయసిం హుఁడు రూపవతీని, బైరాగిని బట్టుకొనుటకై ప్రయత్నము సలుపుచుండెను.

ఇరు వ ది య క ట వ ప్రకరణ ము

ఈ శ్వర భట్టు

ఇచ్ఛినీకుమారి వృత్తాంత మరసివచ్చేద " నని చెప్పి పోయిన యభయసిం గింకను రాక పోవుట చేఁ బరమారుఁడు సంతతవిచారముచే దిగులొంది యతికష్టము చేఁ గాలము గడపుచుండెను. తనకూతును మోసపుచ్చి కొనిపోయిన దురాత్ముఁ డెవఁడో తెలిసిన చో నొక క్షణమున నే వానిని గడిఖండములు గావించి యాకన్యను సాధించి "తేవలె నని సైన్యమును సిద్ధపఱచుకొని యుండెను. అభయసింగు సూచించినట్టు లాదురాత్ముఁడు భీమ దేవుఁడే యైనచో మహా బలిష్ఠుఁడగు నతని జయించుట పరమారున కసాధ్య మే! అయి నను, నతఁడు మిగులఁ గుపితుఁ డైనందునఁ గన్యాపహర్త భీముఁడే యైనను, లేక పినాక పాణియగు సోముఁ డే యైనను, దనకు జయమే లభించినను, నపజయమే లభించినను, దుద కేమైనను నాశత్రువు నెదుర్కొనవలెననియె నిశ్చయించు కొనెను. ఒక నాఁడు జై తుఁడు తగు పరివారముతో నొక చోఁ గూర్చుండఁగాఁ బదుగురు మనుష్యులు బద్ధుఁడగు నొక పురు షునిఁ గొనివచ్చి రాజు సన్నిధి నుంచిరి. అందులకు రా జూశ్చర్యముతో వీఁ డెవఁ డని వారి నడుగఁగా 'అయ్యా! వీఁ డెవఁతో మే మెఱుంగము, ఈశ్వరభట్టుగారు దీనిని దమ సన్నిధికిఁ గొనిరావలయునని మా కాజ్ఞయిచ్చుటచే మాపని మేము గావించుకొంటిమి' అని వారు మనవి చేసికొనిరి.

'అట్లయిన నీశ్వరభ ట్టెచ్చట !' అని పరమార్కుడు మరలఁ బ్రశ్నింప వారింట నున్నారు. ఇప్పుడే వచ్చెద మని యన్నారు' అని పలికిరి, పరమారుఁ డీశ్వర భట్టువచ్చునంత కును మనస్సును బట్టియుంప లేక సమాచార సేమియో తెలిసి కొననలె నని బద్ధుఁడగు నాపురుషునిఁ జూచి 'ఓరీ ! నీ వెవఁ డవు ? ఎవని సేవకుఁడవు ! నాకుమారిక నపహరించిన దురా త్ముఁడ వీవు కావు గదా ! చెప్పుము చెప్పుము' అని పలు మాఱు గద్దించి యడిగెను. ఎన్ని మాు లడిగినను వాఁడు మౌనియై మిన్నక చూచుచుండెనే కాని యొక ప్రశ్న మునకుఁ బ్రత్యుత్తర మీయ లేదు. డతనిఁ గాంచి నమస్కరించి యుచితమర్యాదలు చేసి కూర్చుండ బెట్టి 'అయ్యా! ఈశ్వర భట్టూ' ! బద్ధుఁడగు నీపురుషుఁ డెవఁడు? వీఁ డెక్కడ లభించెను ! వీఁ డేమియపరాధము చేసెను ? మనయిచ్ఛినిని మోసపుచ్చిన వాడు వీఁడేనా ! ఇచ్చినీ వార్తలు నీ కేమయినఁ దెలిసినవా ? తెలిసినచో నాశుభ వార్త చే నాకు వీనుల విందొనర్పుము' అని మిగులఁ గుతూహ లుఁడై యడుగుచున్న రాజుం గాంచి యీశ్వరభట్టు‘ రాజేందా ! ఇచ్ఛినీకుమారి కనఁబడనినాఁడు తా మనుభ వించుచున్న దుఃఖమును జూచి సహింపలేక యెట్లయినను శక్తి కొలఁది నీయాపత్సమయమునఁ దమకుఁ దోడుపడవ లే' నని యెంచి నల్వురతో పాటు నేను నిచ్ఛినిని వెదకుటకును వెడలి తిని, ఇదివఱలో నిచ్ఛినీకుమారి దన కీయవ లెనని కోరి విఫల మనోరథుఁడయినవాఁ డనైలపుర భీమ దేవుఁడే; కావున, మాయావియగు నతఁడే యీ కన్యాపహరణము చేసియుండు నని యూహించి నేను ఘూర్జర దేశమున కరిగి యందలి పట్ట ణములనృత్తాంతము లరయుచు మధుమంత నునుదుర్గమున కరిగితిని. పగటిపూట నచ్చట నుండి పరిశీలించితిని. కాని, యిచ్ఛినిజాడలు చెప్పువా రెవ్వరును లేరయిరి. నేను విఫల

బహు దిన మెల్ల మనోరథుఁడ వై యారాత్రి ధర్మసత్రములో విడిసి 'తెల్లవాజుఱు జామున లేచి వేఱొక పురమునకుఁ బోవుచుంటిని. నాకంటే ముందుగాఁ గోన్ని గజములదూరమున నడచుచున్న యీ పురు షునితో నితని భార్య 'తా మొనర్చిన ఘన కార్యమునకు రాజు గొప్ప బహుమానము చేయును' అని చెప్పఁగా నది నేను విని ‘ వీరు చేసిన ఘన కార్య .మేమైయుండును ? రాజువలన బహు మాన "మొందఁదగిన కార్య మేమైయుండును ?' అని 'నే నను మానించి యది యేదియో కనుఁగొనవలెనని తలంచి యా వీని ననుసరించి స్నేహము చేసి నాయందు వీనికి నమ్మకము కలుగునట్లు చేసితిని. వీఁడు తనమూటనున్న యీ యుత్త రమునుదీసి నా కిచ్చి తన కం దెంత బహుమాన మిమ్మన్న ట్లున్నదో చెప్పు మని కోరెను. నే నది చదివికొని లోలోపల నమందానందము జెంది వీని నా రాత్రి సౌమిత్రుని యింటికిఁ గొనిపోయి యతనిసాయమున వీని బంధించితిని. వీఁడు గొనిపోవుచున్నం యుత్త రము నమర సింహుఁడనువాఁడు భీమ దేవునకు వ్రాసినది. అని చెప్పి రాజున కి చ్చెను. 'పర మారుఁడు దాని నందుకొని యిటు చదివెను. యన్డిలపుర భూషణమా ! తమయాజ్ఞను శిరసావహించి బై రాగి వేషమున నాబూగడమునకుఁ బోయి రూపవతి సాయమునఁ దమకుఁ బ్రియు రా లగు నిచ్ఛినీకుమారిని గోనినచ్చితిని. ఈ మధుమంత మున రాజభవనములో నామెను బ్రవేశింపఁ జేసి జాగరూక తతోఁ గాచుచున్నాము. ఈ వృత్తాంతముఁ దెలిసి పరమారుఁడు సై న్యసమేతుఁడై నచ్చి దీనిని ముట్టడించు నేమో యన్న భీతి వొడముచున్నది. కావున, మీరు సేనాసమేతులై త్వరగా వచ్చి యీ పురినిగాపొడి రాజకుమారిని వరింతురుగాక ! నే నీదినమున నే రెండవ కార్య మాచరించుటకు ఢిల్లీ కిఁ బోయి మన వారితో మాటాడి వ చ్చెదను. దానినిగూడ సులభము గా నే నెఱ వేర్చి వత్తును. ఈమధుమంతుఁ డిచ్ఛినీకుమారిని గొనివచ్చుటలో మిక్కిలి తోడుపడిన వాఁడు గాన నితనికి రెండు వేలరూకలకుఁ దక్కువ కాకుండ బహుమానము చేయఁ గోరుచున్నాను. మీ రతిశీఘ్రముగ నే మధుమంతమునకు వత్తురుగాక !

ఇట్లు,

భవన్మిత్రుఁడు, అమర సింహుఁడు.

పరమారుఁ డాయు శరవృత్తాంత మరసి యిచ్చిని మధుమంతమున నున్నట్లు విని యానందించుచుండ నీశ్వర భట్టు లేచి యొక ముత్యాలహారము నతని కిచ్చెను. జై తుఁడు దాని నందుకొని యెగాదిగ చూచి యీశ్వర భట్టుతో ఓయీ! ఇది మాయిచ్ఛినీకుమారిది. నే నామె నిమిత్త మతి ప్రయత్నము చేసి యీ పెద్దము త్తెములు సంపా దించి యపూర్వపద్ధతినీ దీనిఁ గట్టించితిని, ఇది నీ కెక్కడ లభించె నని యడుగ నతఁడు చేతులుజోడించి 'మహారాజా

ఈ మధుమంతుని నిచ్చటికిఁ బంపవలె నని నామిత్రునితో 'జెప్పి రాజకుమారిని జూచి రావలయునని మధుమంతము నకుఁ బోయి బిచ్చగాని వేషమును దాల్చి యాదుర్గములోనికి బోయి యిచ్ఛినికి మిక్కిలి ప్రియమగు నొక శ్లోకమును జదువనారంభించితిని. లోపలనున్న యామె సంగీతము చే హరిణకిశోరమువలె నా శ్లోకము చే నాకర్షింపఁబడి నన్ను గుఱుతించి యచ్చటనున్న చెలికత్తెల కనుమానము తట్టకుండు సట్లు మాటాడి నాకు దీని నిచ్చినది. . ఆకుమారి నాకు దీని నానవాలుగా నిచ్చిన దని నేను గ్రహించితిని. “రాజేంద్రా! ఇచ్ఛినీకుమారిని నేను జూచితిని.గృశించి యున్నది. ఆమె దుర్గశ \చూడ నాకు మిక్కిలి దుఃఖమువొడమెను. కావున, నామెను గొనివచ్చుటకుఁ దగిన ప్రయ త్నముచేయవలెను. నాకొక యుపాయము తట్టు చున్నది. అమర సింహుఁ డిచ్ఛినిని మధుమంతమునఁ బ్రవే శింపఁ జేసి - యాశుభ వార్తను భీమున కుత్తర ముఖమునఁ దెలుపుచు నేదో పని సాధించుటకుఁ బోయియున్నాఁడు, ఆయుత్తరమును గొనిపోవుచున్న వీనిని మనము బంధించి తిమి. కావున, భీముఁ డిచ్ఛినీకుమారి మధుమంతమునకు వచ్చినట్లెఱుఁగఁడు. మధుమంతమున నిపుడు సామాన్య సైన్యము లున్నవి. మనము వెంటనే సై న్యసమేతులమై పోయి యాదుర్గమును ముట్టడించినచో సులభముగా నే కార్యము నేఱ వేఱునని తోచుచున్నది. భీముఁ డచ్చటికి రాకము న్నె మన మచటికీ బోవుట ముఖ్య కార్యము,

ఇందువిషయమై మీరుగూడ యోజించి కార్యనిశ్చయము చేయుఁ" డని పల్కి యూరకుండెను.

పరమారుఁ, డీశ్వర భట్టు తనకొనర్చినయుప కారమున కానందించి యతనిఁ జూచి 'ఓ మహానుభావా! నీ వొనర్చిన ఘన కార్యమునకు 'మెచ్చితిని.నీయుప కార మెప్పటికిని మజవను. ప్రాణపద మగు నాకూఁతువృత్తాంతమును దెచ్చి నాజీవములను నిల్పితివి, ఆఘన కార్యమునకు బహుమతిగా నీము త్యాలహారము నిచ్చుచున్నాను. స్వీకరింపుము' అని పల్కి యీశ్వర భట్టు మెడ నలంక రించి యతనిని సంతసింపఁ జేసెను.

అనంతరము రాజు మధుమంతునిఁ గారాగారమున నుంప నాజ్ఞాపించి మంత్రులం జూచి 'ఈశ్వర భట్టు చెప్పినది యు క్తమని నాకుఁ దోఁచుచున్నది. భీముఁ డచ్చటికి రాక మున్నే మనము సైన్యములతోఁ బోయి దానిని ముట్టడింప వలయును. అందులకు మీ యభిప్రాయము తెలుపు' డని వారంద జందుల కేకగ్రీవముగా నంగీకరించిరి. జైతు డామఱునాఁడే దండుతో మధుమంతమున కరిగెను.

ఇరు వ ది రేరెం డ వ ప్ర క ర ణ ము

లక్ష్య భేద న ము

ఉన్నత ప్రదేశమునుండి పల్లమునళుఁ బాఱునదీప్రవా హమువలేఁ బరమారుని సైన్యము లాబూగడమును వెడలి'. .

మహా వేగముతో నెడ తెగని ప్రయాణము లొనర్చి నిరాటంక ముగా మధుమంతమును సమీపించెను. కాని, వానికష్టము నకుఁ దగినంత ఫలమును బొంద లేదు. పరమారుఁ డనుకొను న టచ్చట సామాన్య పై న్యములు లేవు. భీమ దేవుఁ డంతకు మున్నే చతురంగ సై న్యములతో వచ్చి యాపురమును రక్షించుచుండెను. మహాసముద్రమువలే ముందుఁగన్పట్టు నాసై న్యమును జూచి పరమారుఁడు చేయునది లేక తనబల ముల నక్కడ విడియిం చెను, మధుమంతము నంటి పెట్టుకొని మూర్జర సైన్యమును, దానికి సమీపముగా నాబూగడ సైన్య మును నిలిచి యొక దాని నొకటి చూచుకొనుచు వర్షకాల మందు జలపూర్ణము లగు కలమ క్షేత్రములన లెఁ దొణఁకు లాడుచున్నను దమయధిపతులయాజ్ఞలు గట్లన లె నడ్డుట చే నెక్కడి వక్కడ నుండిపోయిన వే కాని యుద్ధమునకు దలపడ లేదు. ఇసుము పాతరవ లె: దుగని మూర్జర సైన్యముతో బోరాడిన చోఁ బ్రాణనాశముతప్పవేౠ లాభము గలుగదని పరమారుఁ డెఱుఁగును. అందుచేఁ గుపితహృతయుఁ డైనను, భీమ దేవునితోఁగూడ నతని సై న్యముల నొక్క ముద్దఁ జేసికొని యొక్క మా ఱె మింగవలె నని కోరుచున్నను యుద్ధ మొనర్పం దన వారి నాజ్ఞాపింప లేదు, పరమారుని సైన్యము నవలీల జయింపఁగల నను ధైర్యమున్నను భీమ దేవుఁ డందులకుఁ బ్రయత్నింప లేదు. కాఁగల మామగా రగు పరమారునిఁ దాను బరాభవించినచోఁ దన

ప్రియురా లగు యిచ్ఛినీకుమారి మనస్సున దుఃఖించి తన మనోరథ మెక్కడ వ్యర్థముగావించునో యనెడు భీతిగల యతఁ డాసాహసమున కెట్లంగీకరించును ? వెనుకటి సంభాషణమునఁ దా నతని వరింపనట్లు స్పష్టముగా నిచ్చిని చెప్పినది. అయినను భీముఁడు నిరాశుఁడు గాలేదు. లేఁబాయపు బాలికలు సిగ్గు భరమునఁ దన్నుఁ గోర వచ్చిన వారిని మొదటి పర్యాయమున నిరసించినను గ్రమముగా దర్శన సంభాషణాదులచే మచ్చిక పడి యాపురుషునం దనురాగము వహించి పెండ్లియాడక మాన రని యతనియభి ప్రాయము.

భీమ దేవుఁ డొకనాఁ డిచ్ఛినీకుమారిని జూడ నామె మందిరమున కేగెను. కాని, యామె యచ్చట లేదు. వకుళతో గూడఁ గైలాసశిఖర మనెడి సౌధ మెక్కి తనతండ్రిగారి సైన్య ములను, భీముని సై న్యములను జూచుచుండెను. భీముఁ డది యెఱిఁగి మెల్ల మెల్ల నా సౌధమునకుఁ బోయెను. ఇచ్చిని భీమ దేవు నల్లంత దూరముననే చూచి మన స్సులో నిందించుకొనుచు మేల్ముసుఁగు సవరించుకొని వకుళ చాటున నిలువఁబడెను. అతఁడు వారిని సమీపించి 'వకుళా' ! ఇట 'నేమి చేయుచున్నారు ? ' అని యడిగెను.

వకు: మహాప్రభూ ! అమ్మగారు చల్ల గాలికై వచ్చి. నారు. ఆమె వెనుక నేనును వచ్చితిని,

భీమ: అంతియేనా ? లేక , ' యాబూగడ ఘూర్జర సైన్యముల బలాబలములఁ బరిశీలించుచున్నారా ? వకు: - రాజేంద్రా ! వానిని జూచినంతనే గడగడ వడకు మావంటి భీరువుల కంతశక్తి యెక్కడ ?

భీమ:: ఓసీ ! వెట్టి దానా ! నీవు వాస్త వముగా నట్టి 'దానవే కావచ్చును. కాని, యా రాకుమారి యట్టిది కాదు. ఇట్టి సైన్యముల నిముసమాత్రమున నుఱుమాడ శక్తి గలది. విలువిద్య చే భీమ దేవునంత వాని నే వశపఱచుకొన్న యీ యువతి యెంతకు సమర్థురాలు కాదు !

అది విని వకుళ యూరకుండెను. ఇచ్ఛినీకునూరి తనలో ' ఈ దురాత్ముఁడు మంచిచూటలాడి నన్నుఁ బొంగించి లో బఱుచుకొనఁ జూచుచున్నాఁడు. ఇచ్ఛినీకుమారి వీనిముఖ స్తుతులకుఁ బొంగిపోవునది కాదు. వీనిమంచి మాటలకు లొంగు నది కాదు. వీని భీకరవచనములకు జంకునది కాదు' అని తలం చుచు నూరకుండెను.

అపుడు భీముఁ డిచ్ఛినీకుమారినిఁ జూచి “రాజపుత్రీ ! చూడుము. నీతండ్రి సైన్యమునకును, నా సైన్యమునకును నెంత వార గలదో చూడుము, యుద్ధమునకుఁ దలపడినచో దాని జయించుట నా కెంతపని ! అయినను నాకుఁ బాణప్రియు రాలవగు నీమనస్సు కలతఁ జెందు నేమో" యని వెనుదీయు చున్నాను' అని పలికెను.

తనవచనములు విని యాయువతి తనతండ్రి సైన్యము లను గాపాడవలె నని పార్థించుననియు, నామె ప్రార్థించు నట్లు చేసి తన్మూలముగా నా మె దయను సంపాదించుకొన

వచ్చుననియుఁ దలంచి యామెవచనమునకై ప్రతీక్షించి యుండెను. కాని, యెంత సే ఫూరకున్నను బ్రత్యుత్తరము రాలేదు. భీముఁ డామెను జూచి 'రాజపుతీ! ఊరకుందు వేల? నీ విప్పుడు చక్కఁగా నాలోచింపవలసిన సమయము. కార్యము మించిపోయిన పిమ్మట నేమనుకొన్నను లాభము లేదు. మీతండ్రి గారికిఁ బాణాపాయము సంభవించుచున్న పుడు దానిఁ దప్పించుట నీకు విహితకృత్యము. అది నీ కశక్యము కాదు. అది నీ చేతిలో నే యున్నది. కన్న తండ్రి వంతలఁబడుచుండఁ జూచి నీవు సహింపఁగలవా? చెప్పుము, చెప్పుము' అని యడిగెను.

అందుల కొమె 'సహింపలే' నని యుత్తరమిచ్చు నని యతఁ డనుకొ నెను, కాని, యాయువతి యేమియును మాటాడ లేదు. భీముఁ డంతతో నూరకుండక 'యువతీ ! మాటాడ 'వేమి? నేఁ దలంచిన నొక్క క్షణములోనే నీతండ్రిని, నీ సైన్య ములను జయించి యాబూగడమును మంట గలుపుదును. అయినను నే నాపని చేయనక్కఱ లేదు. నే నిక్కడనుండి చేసైగ జేసినఁ బాలును. నా సైన్యములే సర్వమును జక్క పెట్టుకొనును. కావునఁ గార్యనిశ్చయముఁ జేయుము. నీ మూలమున నీతండ్రికి పెద్దయపాయము వచ్చుచుండ గూతురనగు నీవు తప్పింపవలదా? నిన్నుఁ గని పెంచి పెద్ద జేసిన తండ్రి నిట్టియాపత్సమయమున విడుచుట నీవంటి యు త్తమురాలికిఁ దగునా? నిన్నుఁ గన్నందులకు నీతండ్రికి నీవు గల్గించు మతిఫలమిదియా? ఆలోచింపుము, మివారిని రక్షింపఁ గంకణముగట్టుకొనుము' అని హితోప దేశముఁ "జేసెను.

ఆ వచనము లిచ్ఛిని విని లోలోపలఁ బొంగివచ్చు కోపమును నతికష్టముచే నడంచుకొని తా నతనికిఁ దగిన సమాధాన మిచ్చి నోరుగట్టింపకున్న నిక నతఁ డిట్లే మాటాడుచుండు నని భావించి మెల్లగా 'మావిషయమై జాలిపడనవరము లేదు. ఇదివఱకుఁ గల్గించిన కష్టముకంటెఁ బెద్దకష్టమును మీరు గల్గింప లేరు. చేయవలసినది చేసి కొనుఁడు. ఉత్తమ క్షత్రియులకు వీరమరణము శ్లాఘనీయము. మా తండ్రిగా రట్లు చేసి మరణబాధకంటే మిగులఁ దీవ్ర మయిన యిహలోక దుఃఖములను విడిచి శాశ్వతసుఖ మనుభ వింతురుగాక ! వాయిష్టమువచ్చినట్లు చేసికొనుఁడు' అని పలికెను.

భీ:- యువతీ! మీతండి నట్టిదుఃఖములపాలు చేయుట తగునా! ఇచ్ఛి: — శత్రీయునకు యుద్ధమరణము దుఃఖకరముగా దని చెప్పితి నే!

భీమ: — తప్పింప నన కాశము నీకుఁ గల్గియు నట్టి మెట్ట వేదాంతపు వచనములాడెద వేల? |


|


ఇచ్ఛి: – ఆఁడు దానివలన రక్షణ మొందుటకు తండ్రి యంత పౌరుష హీనుఁడు కాడు. అంత వివేకశూన్యుఁడు కాఁడు. కానున్నది కాక మానదు, మీరిఁకఁ బోల్లుమాట లాడక చేయఁదలఁచినది చేసికొనుఁడు.

భీముఁ డది విని తన హితోపదేశము వ్యర్థమైన దని తలంచి కొంత సేపూరకుండి యిట్లనియె. “ఓ రాజపుత్రీ ! మీతండ్రియందు నీ వంత క్రూరత వహించినను నేను సహింప లేను. యుద్ధమున నతని నెదుర్కొన సాహసింపఁగలనా?' అని పలికెను.

ఇచ్ఛి: — ఇంత దయార్ద్రహృదయు లగుటనే కాఁ బోలు మా కుటుంబము నింతగా సుఖింపఁ జేయుచున్నారు.

భీ-: యువతీ ! నాకు మీయందు ద్వేషము లేదు. మిమ్ము బాధింపవలెనని లేదు.

ఇచ్చి:- అట్లయిన 'మోసపుచ్చి స న్ని చ్చటి కెందు లకుఁ దెచ్చినారు !

భీ: నిన్ను బాధించుటకుఁ దీసికోని రా లేదు. నీయస్త్ర విద్యా నై పుణ్యమును జూచి యానందించుటకు.

ఇచ్చి: -- అదియే సత్యమైన నీస్వల్పమునకు న న్నీ దుర్గమున బంధించి బాధింపవ లెనా ?

భీ: -నీ కది స్వల్పమైనను సా కది ఘన మే ! నీయస్త్ర విద్యాప్రవీణతం 'జూపు దేని చూచి యానందించి నిన్ను విడిచిపుచ్చెదను.


ఇచ్చి: విలునమ్ముల నిటు తెండు, భీ: - 'ఇచ్చును." ఇచ్ఛి: - వకుళ చే వానిని చెప్పించుకొని నిముసములో నావింటి నెక్కిడి బాణముసంధించి 'ఓ రాజా ! ఈ బాణముతో నీ శీరమును దెళ్ళ నేసిన నేమి చేయుదువు ! ” అనెను.

భీమ దేవుఁ డామెభీక రాకారమును జూచి ' నివ్వెఱపడి స్తంభాకృతివహించి యుండెను. అది చూచి యారాకన్నియ “ఓ రాజా! ఈ బాణమున నీశిరమును ఖండించిన నీకు దిక్కు- లేదు. అయినను, నిరాయుధుని జంపుట వీరధర్మము కాదు. మఱియు, నీవంటి దుష్టహృదయుఁడు వెంట నే మరణించుట మంచిది కాదు. కుళ్ళి కుళ్ళి చావవలయును. ఇదిగో ! బాణము సంధించితిని. దీనితోఁ గోటగోడ పై నున్న నీటెక్కెమును బడ గొట్టెదను చూడుము' అని గుఱి చూచి కొట్టెను, వెం ట నే యది తెగి నేలఁ బడెను. ఆమె యతనిఁ జూచి 'నా చాతుర్యమును గాంచితివి ! ఇఁక నన్ను విడిచి పెట్టుము' అని పలికెను,

భీముఁ డది చూచి యాశ్చర్యపడి 'ఇంత చాతుర్యము నే నెక్కడను జూడ లేదు. అమ్మయ్యో ! ఇట్టి నిన్ను విడువఁ గలనా ?' అని పల్కుచు నచ్చోటువాసి చ నెను.

ఇరు వ ది మూడవ ప క ర ణ ము

అశ్ర కౌశలము

మధుమంతమున కొక పక్క గోటగోడనంటి పెట్టు కొని యున్న తమగు నొక కొండ గలదు. దానికింది చఱియ లిసుముచల్లి నరాలనంత దట్టములగు వెదురు టడవులచేఁ గప్పఁ బడియుండుటవలన గాలికైనను జొరఁ దరముగాకుం డెను. అట్లుండ మనుష్యు లాయరణ్యమును భేదించుకొని యాకోట నెట్లును ముట్టడింపఁ జాలరని నమ్మకముండుట చే సైన్యములు తక్కినమూఁడుదిక్కులందునుమాత్రమే నివసించి గాపాడుచుందురు. ప్రస్తుతము భీముని సై న్యములుగూడ న దే విధమునఁ గాచికొని యుండెను. కైలాసశిఖర మను సౌధము మిగుల నున్నతమైన దని చెప్పితిని. అది యాప్రక్కనున్న పర్వతమునకు సోదరునివ లెం గన్పట్టుచుండెను. దానియు పరిభాగముననుండి యాపర్వతా రణ్యము నెల్లను గన్ను లవిందుగాఁ జూడవచ్చును. మఱియు, నటఁ గూర్చుండి యాకొండచఱియలయందుఁ దిరుగుమృగము లను లక్షించి వేటాడుట కనువగుట చే నా సౌధశిఖరము మృగయావినోదమునకుఁ దగినస్థలమని కూడఁ జెప్పవచ్చును. నాడు భీముఁడు విలునమ్ము లచ్చట నే విడిచి పోయి నప్పటినుండియు నిచ్ఛినీకుమారి వానిని దాల్చి, యాసౌధోపరి భాగముననిలిచి యాయరణ్యమును జక్కఁగా బరిశీలించి డామె ఎవరో మనుష్యులు యే దేనిమృగము గనఁబడిన దానిని వేటాడుచుఁ గాలము గడపుచుండెను.

ఒక నాడామె యా సౌధశిఖరమునఁ గూర్చుండి మృగముల సరయుచుండెను. ఆమె యాయరణ్యమును దదేక దృష్టితోఁ జూచుచుండఁగా నొక చెట్టుకొనయం దొక తెల్లని వస్తువు గానవ చ్చెను. 'ఆవస్తు వేమైయుండును? ఆ చెట్టుకొన యం దటుండుటకుఁ గారణ మేమి?" అని ప్రశ్నించుకొను చుండ నావస్తు విట్టటుఁ గదలనారంభిం చెను. అది యామె కొక తెల్ల పతాక వలెఁ బొడచూపెను.

తెల్లని పతాక పట్టుకొని యా చెట్టున నున్నా రని గ్రహించి యామే యాశ్చర్యపడుచుండ నింతలో నొక పురుషుఁడు గాన వచ్చెను. ఆమె యటనుండి కదలక మెదలక యాపురుషు నట్లే చూచుచుండ పొడువగు నొక వింటి నెక్కిడి యందు బాణమును సంధించు చుండెను. 'ఆహా! ఏమి! వీఁ డెవఁతో, విలున మ్ములు దాల్చియున్నాఁడు. మఱియు, వింట బాణము ' సంధించుచున్నాఁడు. నన్నే గురిగాఁ జూచి కొట్టు టకుఁ బ్రయత్నించుచున్నట్టు లున్నది. వీఁ డెవఁ డై యుం డును? నిరపరాధనగు నన్ను వీఁ డెందులకుఁ గొట్టును? ఏమి జరుగునో చూచెదనుగాక! ' యని యామెయు నట్లే యుండెను. ఇంతలో నొక బాణము రివ్వున వచ్చి యామెకు సమీపముగా బడెను. ఆమె యాబాణమును దీసికొని ఇ దేమి? వింతగా నున్న దే! ఇది మిగుల వాడి టెగయుట బాణము. ఇది నాకుఁ దగిలిన చోఁ దప్పక ప్రమాదించునే! వాడెవఁడో లక్ష్యశుద్ధిగలవాడును, విలువిద్యయందు నేర్పుగలవాఁడును, దూరస్థములగువ స్తువుల నేయఁ జాలుబలము గలవాఁడును గాని సామాన్యుడు కాఁడు,కాక పోయిన నీ బాణము నింత నిరపాయముగా నా చెంతఁబడున ట్లెగయుట. యసంభవము. మఱియు, వానికి నన్నుఁ గొట్టుఁదలం పున్నట్లు తోఁపదు. కానిచో, నంత లక్ష్యశుద్ధిగలవాఁ డాశరమును నాపైఁ బఱప లేక పోవునా ! పూర్వ మర్జునుఁడు శత్రుబలము సడుమనున్న భీష్మ ద్రోణులను సమీపించి నమస్కార కుశలప్రశ్నములు చేయ వలను పడక దూరమునుండి యె బాణ ములు పఱపి వారిని గౌరవించె . నని వినియున్నాను. అట్లే వీఁ డెవఁడో నాశుఁ గుశలప్రశ్న బాణములను బఱపుచున్నా డేమో!' అని యనుకొనునంతలో మఱియొక బాణము రివ్వున వచ్చి యామె చెంతఁ బడెను. ఇచ్చిని దాని కచ్చెరువందుచు దానిని దీసికొని పరిశీలింప దాని కొక యుత్తరము బంధింపఁ బడియుండెను. దాని నాత్రతో దీసికొని తనలో నిట్లు చదువుకొనెను.

'కన్యకామణీ! నీకు సంభవించిన కష్టమునకు మే మెంత యును విచారించుచున్నాము. అందులో నీతండ్రి దుఃఖము నకు 'మేర లేదు. ఆనాఁడు బిచ్చగాని వేషమున , వచ్చి నీజాడ లను నీజనకునకుఁ దెలియఁ జెప్పి నీవిచ్చినహారము నతనికి జూపి కొంతదుఃఖమును దగ్గించితిని. భీమ దేవుఁ డచ్చటికి రాకముం దే వచ్చి యీదుర్గమును సాధించి నిన్ను గొని పోవ లెనని యనుకొన్నాము. కాని, దైవము మాకోర్కి- వ్యర్థ ము గావించెను.మే మిచ్చటికి వచ్చినప్పటినుండియు నెట్లయినను నీదర్శనము చేసి మావృత్తాంతము నీకుఁ దెలుప వలెవని యెంత యో ప్రయత్నించితిని. కాని, భీముని సైనికులు రాకాసులవ లెం గాచి కొనియుండుట చే దుర్గప్రవేశము నా క సాధ్యమయ్యెను. అందుల కేదైనను పాయ మాలోచింపవ లె నని తలంచి యీ పర్వతము నెక్కి యీదుర్గమంతయు నవ లోకించుచుండ నీవు నాకుఁ గాన వచ్చితివి. 'ఒరులకుఁ జొర శక్యము కాని యీదుర్గమందున్న నీకు మావృత్తాంతమును దెలుపు టెట్లని యాలోచించి తుద కీయుపాయమును బన్ని అపార సైన్యములతో గూడిన నీభీముని జయించుట యసాధ్యము, మఱి నిన్నీ చెఱనుండి యెట్లు తప్పించుటయో మాకుఁ దెలియకున్నది, ఈసమయమున మాయోపాయము తప్ప వేటొకటి పని చేయదు, బుద్ధిమంతురాలవు గదా ! నీ వేదైన నుపాయము చెప్పుము. నీకస్త్ర విద్యయందు మిక్కిలి నేర్చుగలదు. కావున, నీవును నావ లెనే బాణమునకు నీయభి పాయముఁ దెలుపును త్తరమును గట్టి నాకుఁ బంపుము. నేను రేపు మరల వచ్చెదను. అప్పటికి నీవు సిద్ధురాలనై యుండ వలయును.

ఇట్లు చదువుకొని యిచ్చిని యమి తానందము నొంది యీశ్వర భట్టుబుద్ధిని శారదత్వమునకును, సమయస్ఫూర్తి కిని, దమకులుంబమునందున్న ప్రేమకును మెచ్చుకొనుచు మరల జెట్టు వైపు చూచెను. కాని, వెనుక టి చోట నెవ్వరును గన్పడ లేదు. ఇచ్ఛినీ కుమారి కొంత సేపేమియో యాలోచించుచు నందు విహరించు తన్ను వెదకుకొనుచువచ్చిన వకుళను గూడి తనమందిరమున కరిగెను.

ఇరువది నాల్గవ ప్రకరణము

సందేశము

తన పినతండ్రి యగు కరుణ రాజు ప్రతాపసింహుని, నాతని తమ్ముని నిష్కారణముగాఁ జంపె నన్న విచారము పృథ్వీ రాజును సంతతమును బాధించుచుండెను. ప్రతాప సింహాదులు చేసిన నేర మేమియును బై కిఁ గనఁబడ లేదు' కరుణ రాజు చూపిన యపరాధము ప్రాణములను దీయఁదగి నంతది కాదు. కావునఁ, గరుణ రాజు చేసినది మిగులఁ గ్రూర కార్యమనుటకు సందియము లేదు. కార్యము మించిన పిమ్మట విచారించిన నేమి ప్రయోజనము ? .చేతులుగాలిన పిమ్మట నాకులు పట్టుకొనిన లాభమేమి ? ఇఁకఁ గరుణ రాజును నిం దించినను, లేక సంహరించినను జచ్చిన ప్రతాపసింహాదులు బతికి రారు గదా ! ఆశ్రితులఁ జంపించె నన్నయపవాదము తనకుఁ బోదు గదా ! ఇక నేమి చేయుట ! పృథ్వీరా జీవిష యమై యాలోచించి యిఁక మిగిలిన వారి నైనను దగువిధమున నాదరించి వారిభ్రాతృ దుఃఖమును దొలఁగించి సంతసింపఁ జేసి నచోఁ దనసన్నిధిని వర్తిల్లిన క్రూర కార్యమునకుఁ గొంత శాంతి కలుగునని మనస్సులో నిశ్చయించి పలుమాఱు వారి యిండ్ల కరిగియుఁ బ్ర త్యేకముగా వారిని దనయింటికిఁ బిలిచి గౌరవించియుఁ, బెద్ద యుద్యోగముల నిచ్చియు వారిని బలు విధముల నాదరించి సంతుష్టులనుగాఁ జేసెను. వారును రాజు చేయుచున్న గౌరవమువలనఁ గ్రమక్రమముగా భ్రాతృదుఃఖ మును మఱచి సంతుష్టు లైనట్లే పైకి వర్తించి యరమర లేకుండ నా రాజసత్త ముని గొలుచుచుండిరి.

ఒక నాఁడు పృథ్వీరాజు నిండుకొలువుం డెను. సభామం డపము జనుల చేఁ గిక్కిఱిసియుండెను. అంత ద్వారపాలకుఁ డొక పురుషుని రాజసన్నిధిని సిలువఁ బెట్టి వెడలిపోవ వాడు రాజునకు నమస్కరించి యొక్క యుత్తర మతని పాద సన్నిధిని బడ వైచెను. రాజు దాని నందుకొని యిట్లు చదువుకొనెను.

రాజేంద్రా! నేను మిమ్మును విధిప్రకారముగాఁ బెండ్లాడక పోయినను జిరకాలమునుండి మోసద్గుణములను వినుచు, మీపాద సేవ నొనర్చుటకే మదిలోఁ గాంక్షించుచు, మీ సుందర రూపము నే నాహృదయపీఠమున నిల్పి పూజించుచు, నాప్రాణముల కంటెను నెక్కుడు ప్రియముగాఁ జూచుకొను. చున్న మిమ్మును 'ప్రాణవల్లభా' అను పవిత్రాక్షరములతో- కాదు, అమృతమయాక్షరములతోఁ బిలిచి యానందించుట కాజ యిండు. ఓ ప్రాణవల్లభా ! నే నుత్త మమగు పరమారు వంశమునఁ బొడమితిని. ' అందులో నన్ని విధములను వాసి గాంచిన జై తపరమారుని కుమారికను. భవదీయగుణ సంప దను విని నాహృదయకమలము నిదివఱకే యర్పించుకొని యున్నాను. మనమున నిశ్చయించుకొన్న పురుషుఁడు భర్త యగుననుటకు సందియము లేదు. ఇట్లుండ నీ భార్య నగు సన్ను మూర్జర భీమ దేవుఁడు మోహించి మాయోపాయ ముచే దనపురమగు నీ మధుమంతమునకుఁ గొనివచ్చి చేటు పెట్టెను. మాతండ్రిగారు నన్ను విడిపించుటకై సైన్యసమే తులై వచ్చియుఁ బ్రబలుఁడగుభీమ దేవు నెదుర్కొన వెను దీయుచున్నారు. వా రొక వేళఁ దెగించి పోరినను యుద్ధమున మడియుట తప్ప భీముని జయింప లేరు. నన్ను విడిపింప లేరు. కావున, మహాపరాక్రమశాలి వగునీవు . వచ్చి శత్రువును జయించి నీ భార్యను విడిపించుకొనుము. ఏవిధమునం జూచి నను నే నీ పట్టున మీకు పేక్షింపదగిన దానను గాను, త్రికర ణములలో మనస్సే ప్రధానమగుట దానిచే వరింపఁబడిన మీరు భర్త లే యనుకొన్న చోఁ బరగృహీత నగునన్ను రక్షింపవలసినదని వేఱ చెప్పవలయునా ? రావణుఁ డపహ రించిన సీతను విడిపించుటకై రాముడెంత కష్టపడెనో, యెట్లు విడిపించెనో దేవరకుఁ దెలియని విషయము కాదు. ఒక వేళ నేను మిమ్మును ప్రేమించినను నన్ను మీరు ప్రేమింపక భార్యనుగాఁ జేసికొనుటకు మీ కిష్టము లేక పోయి యుండ వచ్చును, అయినను నేను పేక్షింపఁదగినదానను గాను: శత్రువుల చేఁ బీడితయగుచున్న రాజకుమారిక తన్ను రక్షింప సమర్థుఁ డైన యొక రాజసత్తముని కొక పట్టుతోరమును బంపి శరణు జొచ్చుటయు, నారా జాతోరమును జేతికి బంధించి కొని శత్రువుని జయించి యాకన్యకను విడిపించుటయు రాజపుత్రా చారము. ఆ యాచారము చేత నైనను నేను రక్షింపఁదగిన దాననే ! మనక్షత్రి యాచారమును బాటింపకున్నను శరణా గత నగునన్ను విడుచుట పాడిగాదు. శరణాగత రక్షణము మీవంటి యుదార పురుషులకు విహితకృత్యము గదా ! మఱియు, నేను పాలవంటి క్షత్రియవంశమునఁ బొడమిన దానను. హిందూ యువతిని, ఇట్టి నన్ను జైనమ తావలంబి యగు యొకడు బలాత్కరించి వరించి ధర్మసంక్షయము చేయఁ జూచుచుండ మీవంటి ధర్మజ్ఞులు నాధర్మవ్య త్యాసమును దొలఁగింప సమర్థులయ్యు నట్లు చేయకపోవుట న్యాయము కాదు. కావున, రాజేంద్రా ! ఒక కన్నియను రక్షించుటకై బహుప్రాణనాశము గల్గించు యుద్ధమున కెలపూనవలయు సని యోజింపక సనాతనమగు ధర్మమును స్థాపించుటకు బద్ధకంక ణుఁడ వై శత్రువులం దునుమాడి నన్ను రక్షింపుము.

ఇట్లు

,

మీ దాసురాలు,

ఇచ్ఛినీకుమారి,

ఆయు శరమును జదువుకొనుచున్నవుడు పృథ్వీరాజు నకుఁ గల్గినయానందమునకు మేర లేదు. ఏయువతీమణి సద్గుణ ములను జిరకాలమునుండి వినుచు మనసారఁ బ్రేమించియు నా మెయను రాగ మెటు ప్రాకుచున్నదో తెలియక వెనుక దీయు చుండెనో యాకుమారి స్వహ స్తముతో నను రాగరసమును సవించుచున్న యట్టియు త్తరమును | వాసి దీనాతిదీనముగాఁ బార్థించుటయే కాక ధర్మస్థాపనము చేయ నుప దేశించు రా జందులకు విముఖుండగునా? పృథ్వీరాజు శరణాగతులను రక్షింపను, శత్రువులను శిక్షింపను, సనాతన ధర్మమును స్థాపింపను నెంతమాత్రమును జంకు వాఁడు గాఁడు. ఈసమయమున నతని హృదయాకాశమున నొక పూర్వవృత్తాం తము మేఱపువలె మెఱుసెను. తనతండిని జంపి తనతో దీజని వైర మవలంబించియున్న భీము నెదుర్కొని కసిదీర్చు కొనుట కంతకంటె మంచి సమయ మింక దొరకదని యతఁడు నిశ్చయించు కొనెను. భీముని వృత్తము స్ఫరింపఁగా నే యతని హృదయమునఁ బుట్టినక్రోధాగ్ని జ్వాలలకు ద్వారములో యనున ట్లతనికన్ను 'లరుణ కాంతులను గురియింపసాగెను. ఆయగ్ని జ్వాలలకు మీదుగా నెగయుచున్న ధూమ రేఖలవలె నొప్పుచుఁ గనుబొమలు ముడిపడఁ జొచ్చెను. తనయాత్మ నంటు కొనియున్న శాంతగుణము వదలించు కొనుటకోయన శరీ రము కంప మొందఁజొచ్చెను. వెంటనే యతఁ - డాతోరమును జేతికి బంధించుకొని సభ్యులను జూచి గంభీర భాషణముల నిట్లనియె. 'మంత్రులారా! సేనాధిపతులారా! హీతులారా! వెంటనే పోయి యాయువతినిఁ గాంచుట మన కవశ్యకర్త వ్యము. దానివలన మన కెన్ని యో లాభములు గలవు. శరణాగతురాలిని రక్షించిన వార మగుదుము. రాజపుత్రా చారమును బాటించిన వార మగుదుము. సనాతన ధర్మమును స్థాపించిన వార మగుదుము. హృదయశల్యమువంటి భీముని జయించి కసిదీర్చుకొన్న వార మగుదుము. పిత్రూణమును దీర్చుకొన్న వార మగుదుము. భీమునిఁ బరిమార్చుటకు దగినసమయ మెప్పుడు లభించునా యని యోజించుచుండ దైవము నా కిట్టి యుక్తసమయమును ఘటింపఁ జేసెను. కావున వెంటనే రణ భేరుల మాయింపుఁడు, ఆయుధములను ధరించి సేనలను గదలింపుఁడు' అని యాజ్ఞాపించి సభ చాలించెను.

ఇరు వ ది యై ద వ ప్రకరణ ము

ప్రతీకారము

పృథ్వీరా జపార సైన్యములతో మధుమంతమునకు సమీపముగా - నాబూ సై న్య నివేశమున కొకతట్టు విడిసి యుండెను. జైతపరమారుఁడు పృథ్వీరాజున కెదురుగా బోయి యెక్కుడుగా గౌరవించెను. పృథ్వీశ్వరుఁడును పరమారుఁడొనరించినమర్యాదలకు మిగుల సంతసించెను. అపుడు పరమారుఁడు పృథ్వీ రాజుతో " రాజేంద్రా! నీవు సైన్యస మేతుఁడవై మాకుఁ దోడుపడ వచ్చినందుల కెంతయు సంతసించుచున్నాము. 'ఇఁక భీముని వలన మా కెంతమాత్ర దేదియు క్తమో మును భయము లేదు. మాయిచ్ఛిని నీదయకుఁ బాత్రురాలగు టచేధన్యురాలయినది. మాయావిని మాయ చేత నే జయింప వలెనని పెద్ద లందురు. మాయచే మనల వంచించి యిచ్ఛినీ కుమారిని భీముఁడు గొనిపోయెను. ఆభీముని మనము మాయచేఁ గన్ను గప్పి యిచ్చినిని గొనివచ్చుట యుచితము గాదా! మనకు భీమునితో నిప్పట్టున యుద్ధము తప్పదు, ముందుగా నిచ్ఛినీకుమారి నెట్లో మన శిబిరమునకు రప్పించి యుద్ధ మొనర్చుటయా? మొదటిపక్ష మును మనమవలంబించి నచో ముందుగా మనమే సమరమునకు దిగవలెను. రెండవ పక్షు మైన చో నిచ్ఛినిని విడుచుట కిష్టము లేక భీముఁ డే ముందుగా యుద్ధ మారంభించును. ఇందేది యుక్తనో యోజింపుము." అని పల్కెను. అది విని పృద్వీ రాజు 'భూపాలా ! భీముని సై స్యములు సామాన్యములు కావు. మనము ముందు యుద్ధమునకే కడంగినచో సెన్ని దినములు పట్టునో యెవ్వరు చెప్పఁగలరు. ఈలోపున మాయావి యగు భీముఁ డాకుమారి కెట్టియాపద పుట్టించునో; యెట్టిపరాభ వముఁ గల్గించునో; రాకుమారిని విడిపించుట యే మనకు ముఖ్య కార్యము, ఆమె 'చేజిక్కి-న పిమ్మట మన మేమి చేసినను విచారముండదు. . తగిన యుపాయ మలవడిన చో నామెను విడిపించి తెచ్చుటయే యుచితము.' ” అని ప్రత్యుత్తరము చెప్పెను. అందుచే నొక మూల నాబూ సైన్యములును, నొక తట్టు ఢిల్లీ బలములును విడిసియుండిన వేకాని యుద్ధ మారంభింప

లేదు: ఆబూ రాజునకు ఢిల్లీ రాజు సహాయుఁడై వచ్చియున్నం దున భీమరాజు మిగుల జాగరూకుఁడై దురములో నుండియే పోరుసల్ప నిశ్చయించి శత్రువులు త మమెదిరించినప్పుడే యుద్ధము చేయుఁడని సైనికుల కాజ్ఞాపించుటచే నాఘూర్జరు లాయుధపాణులై కంటికి తెప్పవలె నాదుర్గమును గాచు కాని, యుద్ధ మారంభింప లేదు. ఇట్లా మూఁడు సై న్యములును నానావిధ యుద్ధపరికరములను దాల్చి వర్ష కాల మున నాకసముల బారులుదీర్చి స్వకీయమగు నీలకాంతులచే జగము నంధ కారముగ నొనర్చుచు, నడుము నడుమ మెఱపు లచేఁ చూపఱకు మిరుమిట్లు గొలుపుచు వర్ష ప్రారంభ కారి యగుచల్ల గాలి కెదురుచూచుచున్న మేఘబృందములవ లె మిగుల గంభీరము లై రాజాజ్ఞ కెదురుచూచుచుండెను. శత్రు సై న్యములు తనదుర్గమును సమీపించి విడిసియున్నను ముట్టడి ప్రారంభింపక శిబిరములం దట్లేలయుండి పోయినవో యని యాలోచించియు సరియగు కారణ మరయ లేక భీముఁడు సై న్యములు దుర్గమును ముట్టడించుటకుఁ బూర్వమే గుజ రాతునుండి మఱికొంత సైన్యమును రప్పించుకొన నిశ్చ యించి యచ్చట కాజ్ఞాపత్రమును బం పెను. తనయనుమతి లేకుండఁ బై నున్న వారిని లోనికిఁగాని, లోని వారిని బైకిఁగాని పోనీయరాదని ద్వార పాలకులను గఠినముగా శాసించి దుర్గ ద్వారములు మూయించి భీమ దేవుఁడు మిగుల జాగ రూకుఁడై యుండెను.

ఒక నాడతం డిచ్ఛినీకుమారినిఁ జూచుతలంపుతో నా మందిరమునకు బోయెను. ఆమె వకుళ తో నేదియో సంభాషించుచు నాక స్మికముగా నటఁ బ్రత్యక్షమయిన భీమునిఁ జూచి చటాలున లేచి మేల్ముసుఁగు సవరించుకొని నిలువఁ బడెను. అపుడు భీముఁ డామెను జూచి 'యువతీ ! నీవు లేచి ప్రత్యుత్థానము చేయ నవసరము లేదు. నీవు నిలునఁబడియుండి యుండుటను జూచి చిగురువలె నతికోమలములగు నీ పాదము లెక్కడఁ గందునో యని నామనస్సు కుందుచున్నది. కూర్చుం డుము, కూర్చుండుము. నిలువఁబడిన నేమి ? కూర్చుండిన నేమి ? సంతోష పూర్వకముగా నాతో సంభాషించినఁ జాలును. యువతీ ! నిన్ను విడిపింప ఢిల్లీశ్వరుఁడు గూడ వచ్చి యున్నాడు. వచ్చుఁగాక ! ఏమిలాభము ? ఈ చాళుక్య భీము నకు శత్రుభయంకరుఁడగు నలపురమునకు_చేఁ జిక్కిన వస్తువును విడిపింప ఢిల్లీశ్వరునకుఁ గాదు, సురగణములతో గూడివచ్చిన సురేశ్వరునకై నను దరమా ! ప్రమథగణ సహితుఁడైన - మహేశ్వరునికై నను దరమా ! నాపరాక్రమ మును నెదుటి వారిప రాక్రమమును బరిశీలింతువు గాక ! ఢిల్లీశ్వ రుకంటే నెక్కుడుపరాక్రమ శాలినైనచో వరింతువా ? చెప్పుము. పోనిమ్ము, నీవు నన్ను వరించినను సరియె. లేక పోయినను సరియె, ఏదీ నీధనుర్విద్యా పాండిత్యమును మఱి యొక సారి చూపుము. ఆనాఁడు సులభముగానే నా టెక్కె మును బడఁగొట్టితివి. నీలక్ష్యుశుద్ధికి మిగుల నానందించితిని, హస్త లాఘవమునకు మెచ్చుకొంటిని. సుందరీ! నీ కింత నేర్పు- మావంటి వీరులుగూడ మెచ్చుకొనఁదగినంత నేర్పు-నీ కే ట్లలవడెను ! మఱియొక మాఱు వింటిని మో పెట్టి బాణమును సంధించి లక్ష్యమును భేదించి నా కానందముఁగూర్పుము' అని పలికెను.

ఇచ్ఛిని యాతని పలుకులు వీని 'రాజా ! నీగంభీరవచ నములకు జంకుదానను గాను. నిన్ను వరించు దానను గాను. నీదుర్గమున నన్ని టైంత కాలము నిర్బంధింతువో నిర్బంధిం పుము. పుష్పకోమలగాత్రి నగు నన్నిట్లెంత కాలము బాధిం తువో బాధింపుము. నా పురాకృతకర్మ మిట్టిదిక దా యని తలంచుచు నీవొనర్చు బాధల ననుభవింతును. కానిమ్ము. యువతీజనమును బలాత్కరించి తెచ్చి నిర్బంధిం చెడు నీ రాక్షసకృత్య మీస్మొటికి క్షత్రియ వంశసంభవుఁడు, అందులోఁ చాళుక్యవంశసంభవుఁ డొనర్చెనని విని తోడిరాజు లంద ఱానందింతురుగాక ! త్రేతాయుగమునందువలె నీకలియుగ మందును స్త్రీ జనకంటకుఁ డొకఁ డున్నాఁడన్న ప్రఖ్యాతి నీవలనఁ గలుఁగాక ! ' అని పల్కుచుండ --

భీ: ఆఁ, ఏమేమో ! నేను స్త్రీ జనకంటకుఁడనా ?

ఇచ్ఛి: -స్త్రీలను బాధించువారు మ రెవ్వరు ?

భీ: నిన్ను బాధించుచున్నానా ?

ఇచ్చి: — కాక, నాకు సుఖమే కల్గించుచున్నా వా ! భీ: సం దేహ మేమి? విహరించుటకు దివ్య సౌధములు, శయనించుటకు మృదుతల్పములు, కట్టుటకు దివ్యవస్త్రములు, తినుటకు మృష్టాన్నములు; ఇవి యన్నియు సుఖక రములా? దుఃఖకరములా?

ఇచ్ఛి: —మనస్సు స్వస్థముగా లేనప్పుడు దుఃఖకరము లే! సుఖమునకు మన స్సే కారణము కాని తక్కిన దివ్య సౌధాదులు కావు.

భీ: నీవు మనస్సు నేల పదిలపఱుచుకొనరాదు ?

ఇచ్ఛి: — ఇచ్చట నుండ నది నా కసాధ్యము.

భీ: మఱియెట నున్న సాధ్యమగును ?

ఇచ్చి: మా తండ్రి గారి గృహమున.

భీ : నిన్ను విడిచి యుండ లేను.

ఇచ్చి: —స్వసంతుష్టి కై యితరులను బాధించుట న్యాయమా?

భీ: బాధింపవలే నన్న తలంపు నాకు లేదు. నేను బాధింపను లేదు. డాని కేమి ! అది యట్లుండనిమ్ము, నీయస్త్ర విద్యావి శేషమును మఱియొక పరి ప్రదర్శించి నా కానందముఁ గూర్పుము.

ఇచ్ఛి:--నీ వానందింపకపోయిన నా కేమి ?

భీ: -నీ వట్లు చేయుదాఁక నే నీచ్చటనుండి కదలను. ఏమీ చేయుదువో చూచెదనుగాక ! ఇచ్ఛిని కొంచె మూరకుండి యతనియభిలాషము దీర్ప నిచో నతఁ డక్కడనుండి కదలఁ డని తలంచి యెట్లో యా పిశాచమును వదలించుకొనుట యే మేలని యతనిఁ జూచి “ రాజా! అస్త్ర విద్య పురుషులది. పురుషులు చేయుపను లొనర్చునపుడు పురుష వేష మే యుండవలెను. నా కట్టిదుస్తులు తెప్పింపుము' అని పలికెను.

భీ: __యువతీ ! నీవిట్లు యువతి వై యుండి విల్లెక్కు వెట్టిన పుజీ నాకు మిగుల దర్శనీయవుగా నుందువు, ఇచ్చి: అగుగాక నే నీ వేషముతో వింటిని దాల్పను.

భీ - పోనిమ్ము, నీ 'వన్నట్లే కాని' మ్మని పల్కి యొక భటుని చే దుస్తులు తెప్పించి యామె కిచ్చెను. ఆయిచ్ఛిని యావస్త్రములను గ్రహించి లోనిక రిగి ధరించి యీవలికి నచ్చెను, మీసములు రాని రాకుమారునివలె నున్న యిచ్ఛినిని జూచి రా జాశ్చర్యము చెంది “యువతీ ! నీవు పురుష వేషముఁ దాల్చినను నీరూపము నాకు మోహజనక మే యగుచున్నది. అచ్చముగా రాకుమారునివలె నున్నావు. లెమ్ము, వింటి నెక్కిడుము' అని పలికెను.

అనంతర మిచ్ఛిని వింటి నెక్కిడి బాణము సంధించి యతఁడు చూపినలక్ష్యములను సరిగా గొట్టెను. భీముఁ డామె నేర్పునకు సంతోషించి తనలో “ఈమె యిం తేనియు దప్పకుండ లక్ష్యమును భేదించుచున్నది. ఒకప్పుడు నా కేమయి నను ప్రమాదము సంభవించు నేమో ? మఱియుఁ బురుష వేష ముతో నీమే వింటిని దాల్చినప్పుడు నాకు సంతోష మే కాక భయముఁగూడ నంకురించినది. ఈమె సొమాన్యురాలు కాదు, ఈమె కోరిన ట్లాయుధములు చేతి కిచ్చి నేను జేంతనున్న చో సింగపుఁగొదమవలె నా పై కిలంఘించి ప్రమాదముఁ గల్గింపక మానదు. కావున, నే నిఁక జాగరూకుఁడ నై వర్తి పవలెను. అంతఃపురమున నున్నయీయువతి చెంతకు వచ్చినప్పుడు యుద్ధ మునకుఁ బోవ నట్లు సకలాయుధములను దాల్చి వచ్చుట యే 'మే లని తలంచుకొనుచు నచ్చోటు గదలిపోయెను.

ఇరువది యా ఱవ ప్రకరణము

ప్రతీ కా ర ము

తామరకొలఁకునడుమ నెట్ట తామర పూవువ లే సూర్యుం డాకాశ మధ్యమున వెలుఁగుచు క్షమ యను పేరు వహిం చిన భూ దేవి యోర్పును బరీక్షించుటకో యన మిడుఁగురుల నంటి కిరణములు లోకము పై బఱపుచుండెను. ఆ వేఁడిమిచే మిగుల సంతప్తు రాలయి భూ దేవి విడుచు చున్న నిట్టూర్పులో యనునట్లు వెచ్చనిగాడ్పులు వీచుచుండెను. ఆతీవ్రతకుఁ దాళ లేక ప్రాణికోటి చెట్లనీడలను, పొదరిండ్లలోను, గృహాం తర్భాగములందును, జలాశయములలోను, భూవివరముల లోను విశ్రమింపఁజొచ్చెను. అట్టిసమయమున నొక పురుషు డెచ్చటనుండియో మధుమంతమువకు వచ్చుచు చుండెను. పండు తమలపాకువంటి యతనిశరీం మెండ వేడిమికి మిగులఁ గందిపోయి యుండెను. అతని ముఖము మిక్కిలి కాంతిదక్కి, యుండెను. వర్షానంతర మునం గొండ శిఖరమునుండి ప్రవహించు సెలయేళ్ళన వలె జెమ్మట లతనిశిరోభాగమునుండి కాలువలుగట్టి పాఱుచు. గట్టువస్త్రములను బూర్తి గాఁ దడిపి వైచెను. అతఁడు దీర్ఘ ప్రయాణము చేసినట్లు మిక్కిలి బడలియుండెను. అతఁ డేదో య త్యావశ్యక మగుపనిని నిర్వహింపఁ బోవుచున్నాఁడని నిశ్చ యింపగలము. లేనిచో నట్టి భయంకర సమయమునఁ బ్రయా ణము చేయునా ? అతఁడు దుర్గ ద్వారమును సమీపించి పెద్ద గొంతుతో అయ్యా ! రక్షకభటులారా ! తలుపుఁ దీయుఁడు . నేను ప్రభువుగారిని దర్శింపవలెను. ఒక యాపద్వార్త మోసి కొనివచ్చితిని. దానిని రాజుగారికిఁ దెలుప వలెను. మీ రెంత మాత్ర మాలస్యము చేయ రాదు. చేసితీ రేని మీకును, నాకును గూడ మాటవచ్చును' అని కేక వేసెను.

రక్షక భటు లది విని యేదో యాపద సంభవించియుండు సని నిశ్చయించి తొందర పడి రాక పోకల కనుకూలముగా దుర్గక వాటమున కమర్పఁబడిన చిన్న తలుపును దెఱచి యత నీట్లు సంభాషించిరి.

భ: --అయ్యా ! నీ నెవ్వఁడవు ?

వు: - నే నొక సందేశహరుఁడను. భ: — ఎక్కడనుండి వచ్చితివి ?

పు: -అనిహి లపురమునుండి.

భ: -ని న్నె వరు పంపిరి ?

పు: -మధుమంతుఁడు.

భ: -(ఆశ్చర్యముతో) మధుమంతుఁడా !

పు: -అవును, మధుమంతుఁడు

భ: _అతఁడు పరమారునికారాగృహమున నున్నా డని వినియున్నా మే!

పు : —అది నిశ్చయమే ! కాని, మాయోపాయము చేఁ దప్పించుకొనెను.

భ: - అట్లయిన నతఁ డిచ్చటికి రాక యనీహిలపురమున కేల పోయెను?

పు: -(విసివికొనుచు) మీకు సమాధానము చెప్పునప్ప టికి నాకు నోరు నొచ్చుచున్నది. అదంతయు మీ కేల ? 'నన్ను రాజసన్నిధికిఁ. బోనిండు.

భ: -ప్రభువుగారి సెల వైనఁ గాని నిన్ను లోనికి విడువ వలనుపడదు.

పు: అట్లయినఁ ద్వరగాఁ బోయి విన్న వింపుఁడు. ఆభటులలో నొకఁడు వేగముగా రాజును సమీపించి 'మహాప్రభూ ! అనిహలపు రమునుండి ' యొక భటుఁడు వచ్చి నాఁడు. మధుమంతుఁ డేదో యుత్త రమిచ్చి పంపె నఁట. ఏని యదరిపడి తమదర్శనము చేయఁగోరుచున్నాఁడు. ఏదో యాపద్వార్తను దెచ్చె నఁట !' అని మనవి చేసెను.

ఇచ్ఛినీకుమారిని వశముగావించుకొనుట కుపాయము లనుగూర్చి రూపవతితో సంభాషించుచున్న భీమరా జామాట విని యదిరిపడి “ఆఁ, ఏమీ! మధుమంతుఁడు పంపెనా! అతఁడు శత్రువుల కారాగారమును దప్పించుకొని వచ్చెనా! అట్లయిన నది సంతోషవార్తయే కాని యాపద్వార్త యెట్ల గును? అతని వృత్తాంతము తప్పక యరయవలయును. రూప నతీ! అతని విడిపింపవలయు నని నీవు న న్నెన్నోమారులు ప్రార్థించియున్నావు. మనము ప్రయాసపడకుండ నతఁడే తప్పించుకొనివచ్చెను. లెమ్ము; ఇట్టి బుద్ధిమంతుఁడు, ఇట్టి మాయావిశారదుఁడు శత్రువుల కెట్లు చిక్కిపోయినాఁడో నా కాశ్చర్య మగుచున్నది' అని పల్కి భటునితో సం దేశహరుని లోనికిఁ బంపు మని యాజ్ఞాపింప వాడు వెడలిపోయెను.

రూపవతి మహా రాజును “ఓ మహాప్రభూ! ఈ వార్త విన్న ప్పటినుండియు నాగుండె దడదడ కొట్టుకొను చున్నది. మునుపటికంటెను నాకు భయము హెచ్చుచున్నది. అతని కెట్టియాపద సంభవించెనో యని నామనస్సు మిగులఁ బరితపించుచున్నది. ఏలినవారు చెప్పినపని సులభ ముగా నిరపాయముగా నెఱవేర్చుకొనివచ్చితి మని యానం దించుచుండ భగవంతుఁడు మా కెట్టి యాపదను దెచ్చి పెట్టెనో చూడుఁడు. ఎట్టి చెడువార్త వినవలసివచ్చునో యని యడలుచున్నాను' అని స్త్రీ జనమునకు స్వభావసిద్ధ కన్నీటిధారలు కపోలములందుఁ గాలువలుగట్ట నేడ్చుచుఁ బలికెను.


భీమగా జామాటలు వీని జాలిపడి యేవోమాటలు చెప్పి యోదార్చుచుండ నాసం దేశహరుఁడు వచ్చి రాజు నకు నమస్కరించి నిలిచెను. రాజును, రూపనతియును నతని వికృతాకారమును జూచి గొప్ప యాపద యేదో తటస్థించియుండు నని యడలుచు సందేశహరునితో 'ఓరీ! నీ వెక్కడ నుండి వచ్చితివి? అన్దిలపురమునుండి యా? మధుమంతుఁడు పం పెనా? అతఁడు కుశలియే కదా! ” అని యాత్రముతో నడిగిరి. అతఁ డది విని 'మహారాజా! నన్ను మధుమంతుఁడు పంపియున్నాడు. అతఁడు కొన ప్రాణముతో నున్నాఁడు. ఇదిగో! నీయుత్త రమున నంతయు వాయించియున్నాఁడు. అతని భార్య రూపవతి యిచ్చట నున్నదఁట! అవసానకాల మున వచ్చి కంటఁబడి తృప్తినొందింపు మని యామితో జెప్పుమని యతఁడు నన్ను మఱిమఱి ప్రార్థించెను. ఇంతకంటే నా కేమియును జెప్ప లేదని పల్కి యుత్తర మిచ్చెను. ఆ మాట విన్నతోడ నే కెవ్వునఁ గేక వేసి యేడ్చుచున్న రూప వతి నూఱడించి యాయుత్తరమును విచ్చి రాచదువం దొడఁగెను.

మహారాజా! దేవర వారి పూర్ణానుగ్రహమునకుఁ బాత్రులగు సేవ కులలో నోక్కడ నై నను నందులకుఁ దగినఘన కార్య మాచ రించి ప్రభుభక్తిని వెల్లడింప లేకపోయినందులకు విచారించు చున్నాను. ఇచ్ఛినీకుమారిని సాధించుటలో నే నమర సింహు నంతపని చేయకపోయినను గొంత చేయకపోలేదు. అయిన నేమి యందులకుఁ బదింతలు పెద్ద నేరము చేసితిని. అమర సింహుఁడు తమ కిమ్మని నా చేఁ బంపిన యుత్తరము శత్రు వులపాలఁ బడ వైచితిని. ఈ నా యపరాధమును సహింపుఁడు, మహాప్రభూ! ప్రస్తు తాంశమును జిత్తగింపుఁడు. ఈ సం దేశ హరుడు నాకుఁ బియమిత్రుడు. ఇతనిసాయమున నే శత్రువుల కారాగారమునుండి తప్పించుకొంటిని. దుస్సహ రోగ పీడితుఁడ నగుట చే నడచుటకు శక్తి లేక పలు పొట్లుపడి యేట్లో నాపురమును జేరుకొంటిని, నేను 'మొదట మధుమంతమున కే రాఁదలంచితిని. కానీ, యాబూ సైన్యము మార్గమధ్యమున నుండుటచే మరల నెట్టియిక్కట్లు మూడునో యని భయపడి యట్లు చేయ లేదు, కడకాలమునం దమ దర్శన భాగ్యము లభింపనందులకు విచారించుచున్నాను. నే నీరోగమునుండి విముక్తుఁడ నగుదునన్న నమ్మకము నాకు లేదు. మిమ్ము నీ కన్ను లతో మరలఁ జూతునన్న నమ్మకము లేదు. ఇవియే నా కడపటి నమస్కారములు. వెంట నే నా ప్రియురాలగు రూపవతి నంపుఁడు. మరణకాలమున నామెను అయినను జూచిన చో నాకుఁ గొంతమనశ్శాంతి కలుగును. మఱియొక మనవి. ఈపురుషుఁడు - జై తపరమారునిశత్రువు. ఇతనికి విశ్వాసార్హుడయిన యొకవీరుని సాయముగాఁ బంపుదు రేని పరమారుని బంధించి తెచ్చెదనని చెప్పుచున్నాఁడు. ఆ రాజును గూడ జెఱ నుంచినచో దండ్రి దుఃఖము నరయ లేక యిచ్ఛిని మిమ్ము వరించుట కంగీక రించును. ఈరూపవతి యాబూరాజునకు మహాపకారము చేసినది. అది వారి బారి! బడకుండ నొక వీరుని సాయమిచ్చి పంప వేఁ డెదను. ఆ వీరుఁడే యితనితో గలసి పోయి పరమారుని సాధించి తెచ్చును.

ఇట్లు విన్నవించుపాద సేవకుఁడు,

మధుమంతుఁడు.

భీమరా జిట్లు చదివి 'ఓయీ, మధుమం తా! నీ ప్రభు భక్తికి మిగుల నానందించితిని. చావ సిద్ధముగా నుండియు. నా సౌఖ్యమున కుపాయముల నరయుచు నే యున్నావు'. అని ప్రశంసించి కంటికి మంటికి నేక ధారగా నేడ్చుచున్న రూపవతి 'యువతీ! విచారింపకుము. మధుమంతుఁడు దైవాను గ్రహమువలన రోగ విము క్తుఁ డగును. నీవుపోయి మందిప్పించి యుపచారములు చేయుదు.వేని నతఁ డవలీలగ నే యారోగ్య వంతుఁ డగును.విచారింపక యీ రాత్రియే నీవు బయలు దేరి యన్డిలపురమునకుఁ బొమ్ము. మధుమంతుఁడు చెప్పిన యాలోచనము నాకు నచ్చినది. పరమారుని బంధించి తెచ్చి నోదార్చి బాధించిన చోఁ బితృ భక్తిగల య రాజకుమారి తండ్రి బాధ లను దప్పింప నన్ను వరించిన వరింపవచ్చును. నీ వింటికి బోయి ప్రయాణమునకు సన్నద్ధవుకమ్ము' అని చెప్పి రూప వతిని బంపి వేసెను. అనంతరమున భీమ దేవుఁడు భూయాదుఁ ఢను నొక రాజకుమారుని బిలిచి యన్డిలపు రమునకుఁ బోయి మధుమంతుఁడు చెప్పినట్లు చేసి కార్యము సాధించుకొనిరమ్ము. ఈసం దేశహరుఁడును నీవును గలసి రూపవతిని నిర పొయ ముగా సన్స్టిలపురమునకుఁ జేర్పుం' డని యాజ్ఞాపింపఁగా నాతఁడు సం దేశహరుని సమీపించి కొంత సేపు సంభాషించి యింటికిఁ బోయెను, సందేశహరుఁ డచ్చట నే విశ్రమించి యుండెను.

ఇరు వ ది యే డ ప ప్ర క ర ణ ము

మో సము

సూర్యుఁ డప్పుడే తూర్పు కొండ శిఖరమునఁ జూప ట్టెను. అతని కిరణములు ముందుగా నున్నత ప్రదేశములందుఁ గుంకుమపూత పూయుచుండెను. జ్ఞానులు సంసారముక్తులై స్వస్వరూపము నొందినట్లు ప్రజలు నిద్రాముకులై చైతన్య మును వహించి నిజకార్యాసక్తులయి పోవుచుండిరి. ఇట్టిసమ యమున మధుమంతమున కొక తట్టుననున్న కొండ పైకి జను లొక్కరొక"రే పోవుచుండిరి. ఏదో యపాయము సంభవించి

నట్లు వారందఱును మిగుల రభసముతో నే పోవు చుండిరి. వారిలో గొందఱకుఁ దత్కారణ మేమియో తెలియక పోయినను ముందు పోవువారి ననుసరించుచుండిరి. పది బారల దూరము పోఁగా నక్కడ పెద్ద చెట్టొకటి యుండెను. ప్రజలు దానిచుట్టును మూఁగి యుండిరి. ఒక రి నొకరు త్రోసికొని చెట్టువంక ఁ జూచుచుండిరి. క్షణకాలములో నే యాప్రదేశము ప్రజలచే నిండిపోయెను. భీమరాజు దుర్గమంతయుఁ జుట్టి వచ్చుచు జనులంత ప్రోవై యుండుటకుఁ గారణ మేమై యుండునో యని యరయుచుండెను. ఒక యువతి యా చెట్టున కంటఁగట్టఁబడి యుండెను. అది యింకను బ్రతికియే యుండెను. తాళ్ళతోఁ జెట్టునకు బంధించుట చే దాని కాలు సేతు లాడ లేదు. నోట గుడ్డలు క్రుక్కుటచే నది మాటాడ లేకుండెను. అది తన బాధ నంతను జూపుల చేత నే ప్రజ లకుఁ దెలుపుచుండెను. ప్రజ లాలస్యము చేయక వెంట నే దానిబంధములు విప్పివై చిరి. బంధనములచే నవయవములు నలఁగిపోయి బాధించుట చే నాయువతి నిలువ లేక భూమిపై గూలఁబడెను. ఆయువతి యెవ్వరు? భీమ దేవుని యనుగ్రహ మునకుఁ బాత్రు రాలగు రూపనతి. హారాజువలన విశేష గౌరవము నొందుచున్న రూపవతి కేమి, ఇట్టి దుర్దశ రా నేమి యందఱును విచారింపఁజొచ్చిరి. కాని, యేమి చేయుదురు? దాని బాధను దొలఁగింప లేరుకదా! వెంట నే దానిని భుజముల పై వైచికొని భీమ దేవు నెదుటఁ బెట్టిరి. మిగుల నలఁగిపోయిన పూవుదండవలెఁ గాంతి దక్కి వికృతా కారముతో నున్న రూపవతిని జూచి యత్యాశ్చర్యము సూచించుచు భీమ దేవుఁ డిట్లనియె. రూపవతీ! నీ కిట్టి యాపద గల్గించిన దురాత్ము లెవ్వరు? నిన్నిట్లు బాధించిన క్రూరు లెవ్వరు ! పూలదండ కఱకుదర్భ త్రాళ్ళ చేవ లె నీనంటి యోగ్యురాలిని, నీవంటి సుకుమారి నిట్లు బంధించిన కఠిన హృదయు లెవ్వరు? అన్దిలపురమునకుఁ బోయెడు నీ వీ చెట్టున కేల బంధింపఁబడితివి? సందేశహరుడేమయ్యెను? నీకు రక్షకుఁడుగా వచ్చిన భూయాదుఁ డేమయ్యెను? నీ విట్టి దురన స్థకుఁ జిక్కుచుండఁ జూచి యాకఠినాత్ముఁ డెట్లూరకుం డెను? నీనృత్తాంత మేమియో చెప్పు మనఁగా నది పొంగి పొరలి వచ్చుచున్న దుఃఖమును గొంచెము తగ్గించుకొని చెక్కిళ్ళయందుఁ గాలువలుగట్టుచున్న కన్నీటిని దుడుచు కొని చెదరిన కేశపాశమును మెలన ముడి వేసికొనుచు హీన స్వరమున నిట్లు చెప్పెను.

'ఓ మహా రాజా! నాదురవస్థ నేమని చెప్పుకొందును? ఇట్టి కష్టము లనుభవింప భగవంతుఁడు నానుదుట వ్రాయ నది యేల తప్పును ! నిన్న దమయొద్ద సెలవు దీసికొని వస్తువు లన్నియు సవరించుకొని భుజించి మన వారందఱుతోను జెప్పి జాము రాత్రి యగునప్పటికి సం దేశహరుఁ డున్న చోటికిఁ బోయితిని. వాఁ డెవ్వరితోనో భాషించుచుండెను. చీకటిలో రెండవ వాఁ డెవ్వడో నేను బోల్ప లేదు. కాని, యతఁడు భూయాదుఁ డని యనుకొంటిని. నేను వారిని బ్రయాణము నకుఁ ద్వర చేసితిని. వారును బయలు దేతీరి. దుర్గ ద్వారమును సమీపించితిమి. ఇంతలో నన్డిలపురమునకుఁ గొనిపోవలసిన వస్తు వింట మఱచుట చేఁ దెచ్చికొందునని చెప్పి నేను వెను కకుఁ బోయితిని. నేను మరలినచ్చులోపల వారు దుర్గ ద్వార మును దాఁటి యచ్చట నిలువఁబడిరి. తమయాజ్ఞ యగుట చే ద్వార పాలురు వారి నడ్డ లేదు. నేను ద్వారమును సమీపించి సం దేశహరుఁ డేఁడి యని రక్షకభటుల నడిగితిని. వారు ద్వారమావల నీనిమి త్త మెదురుచూచుచున్నా రని చెప్పిరి. అది విని నేను ద్వారము దాఁటగా నే సం దేశహరుఁడు నన్ను ఁ జూచి 'అమ్మా! రా, రా; నీ నిమిత్తమే యెదురుచూచు చున్నా' మని చెప్పెను. నేను నామూటను సం దేశహరుని కిచ్చి నడవఁజొచ్చితిని. చీకటి దట్టముగా వ్యాపించి యుండెను. అయినను జుక్కల వెలుతుకు చే దారి కొంచెము గానవచ్చుచుండెను. సం దేశహరుఁడు ముందు దారి చూపుచు నడచుచుండెను. తరువాత నేను నడచుచుంటిని. నా వెనుక . భూయాదుఁడును నడచుచుండెను. "మేము పది బారలదూర మేగునప్పటి కొక పురుషుఁడు మాకుఁ దార సిల్లెను. అతఁ డెవఁడని నేను సం దేశహరు నడిగితిని. అనిల పురమునకుఁ బోవు నొక బాటసారి యని యతఁడు బదు లిచ్చెను. రాత్రిసమయమున మఱియొకబ్డు తోడుగా నుండిన నిరపాయముగాఁ బోవచ్చునని తలఁచి సంతసించి వారిని ముందుదారి వెంబడించి పోవుచుంటిని, వారు దారి తప్పించి యీకొండ మీఁదికి నన్ను గొనిపోవసాగిరి. ఈ కొండమీఁదికిఁ గొనిపోవు చున్నా రే మని వారి నడిగితిని. ఇది యన్డిలపురమునకు దగ్గజ త్రోన యని వారు పలిరి. సత్య మే యనుకొని వారిసనుస రించి మఱికొంతదూరము నడచితిని. ఇంతలో నీ చెట్టును సమిపించితిమి. అపుడు నా వెనుక నడచుచున్న వాఁడు నన్ను గట్టిగా నొక దెబ్బకొట్టెను. నేను మొర్రో మొర్రో యని యేడ్వనారంభించితిని. భూయాదుని బిలిచితిని. కాని, భూ యాదుఁడు మాటాడ లేదు. మరల నే నతని గట్టిగాఁ బిల్చు చున్న సమయమున నాసం దేశహరుఁడు నన్నుఁ బడద్రోసి నోట గడ్డలు క్రుక్కెను. వారు మువ్వురును నన్ను గట్టిగాఁ దన్ని చెట్టునకు బంధించి నిర్దయు లై పోయిరి. భూయాదుఁడు నన్నుఁ గాచు నేమో యని యనుకొంటిని. కాని యత డేమియు నాకుఁ దోడుపడ లేదు, ఆసం దేశహరుఁ డెవఁడో పెద్ద మోసగానివ లె నున్నాఁడు, మహాప్రభూ ! భూయాదుఁ డేమయినాఁడో నాకుఁ దెలియదు. నాతో నడచిన రెండవ వాఁడు భూయాదుఁడు కాఁడేమో యని నా కిప్పుడు తట్టు చున్న ది. అతఁడే యైనచో నా కట్టి యాపద సంభవించి యుండఁ జూచి యూరకుండునా ? ప్రాణముపోయినను నతఁడు మన యెడ విరుద్ధముగా నడచువాఁడు కాఁడు. నా వెనుక వచ్చినవాఁడు భూయాదుఁడు కానిచో వేఱొకఁ డెవఁడై యుండును ? మనదుర్గము ప్రవేశింప వాని కెట్లు. వీలైనది ? యను సందేహము బాధించుచున్నది. ఇదంతయు నా కింద్ర జాలమువలె నున్నది. ఆలోచింపఁ బరమారుభటులు మారు వేషముతో నచ్చి మనలను మోసపుచ్చినారు. ఇచ్ఛినీకుమా రిని మేము మోసపుచ్చి తెచ్చినట్లు వారును మనల 'మోస పుచ్చి నన్నుగొనిపోయినారు. మన మిచ్ఛినిని బువ్వులలో బెట్టి పూజించుచున్నాము. వారు నన్ను జెట్టునకు విఱిచికట్టి పూజించినారు. మనకును వారికిని గలవ్యత్యాస మిది' అని యూమె చెప్పి యూరకుం డెను. భీముఁ డిది యంతయు విని చిత్త రువు బొమ్మవలె నిశ్చేష్టితుఁ డయ్యెను. సందేశహరుఁడు శత్రువని నిశ్చయించుకొ నెను. కాని, భూయాదుఁ డేమయి నాఁడో యతనికి బోధపడ లేదు. అతఁడు ద్వార పాలకులను బిలిపించి యిట్లు ప్రశ్నించెను.

భీ: -నిన్న రాత్రి మన పురమునుండి యెందఱు వెళ్ళినారు?

భ: . -ముగ్గురు. కాదు కాదు, నల్వురు.

భీ: రెవ్వరో యెఱుఁగుదువా ?

భ: సందేశహరుఁడు, రూపవతి, భూయాదుఁడు, నాల్గవ వాఁ డతని యనుచరుఁడు,

భీ: ఆవీరుఁడు భూయాదుఁడేనా ?

భ. -యోధ వేషముతో నున్న యాపురుషుఁడు భూయాదుఁడే యని తలంచితిని. భీ: నిన్న సం దేశహరుఁడు గాక మఱియెవ్వ రైన మనదుర్గములోనికి నచ్చిరా ?

భ" లేదు, మహాప్రభూ !

భీ: నిజము చెప్పుఁడు. లేనిచో మీతలల నజకిం చెదను.

భ: -మహా రాజా ! నిన్న సం దేశహరుఁడు తప్ప మ రెవ్వరును రాలేదు. తమ సెలవు లేని దే మే మెవ్వరిని విడువలేదు. లోనికిరానీయ లేదు. నిన్న రాత్రి నాల్గవ వానిని లోనికి బోనీయ మని మే మెంతో నిర్బంధించితిమి. "కాని,సం దేశహరుఁడు 'భూయాదుననుచరుని విడువక పోయినమాప్రభువుగా రిందుల కంగీకరించినా ' రని చెప్ప నూరకుం టీమి. ఆ పురుషులు మున్వురును ముందుగాఁ బోయిరి. తరువాత రూపవతి వచ్చి ద్వారము దాఁటిపోయినది, అంతకుఁ దప్ప మా కేమియును దెలియదు.

భీ: - యువతీ ! నాల్గవ వాడు వచ్చినట్లు నీ వెఱుఁగుదువా

రూ: మహారాజా ! నాకుఁ దెలియదు. నాతోరాలేదు. వచ్చుచున్నాఁడని కూడ నెఱుఁగను.

భీ: నీవు పోల్చుకో లేక పోతివి. కాని, మార్గమధ్యమున మిమ్ముఁగలసికొ నెనని చెప్పితి వే ? ఆతఁడు భూయాదుని ననుచరుఁ డే కావచ్చును !

రూ: వా రిరువురును సత్యముగా భూయాదుఁడు, నతనియనుచరుఁడును నైనచో నన్ను శత్రువులనుండి రక్షిం

చుటకు మాఱుగా మున్ముందుగా వారే నన్ను దన్నుటకు యత్నింతురా?

భీ: - అట్లయిన నీయభిప్రాయ మేమి ?

రూ: ఏమియును లేదు. సం దేశహరునితో పాటు మఱి యిర్వురు శత్రువు లెట్లో మనదుర్గమును బ్ర వేశించియున్నారు. వారే సం దేశహరునితోఁగూడి నా కిట్టిబాధ కల్గించి యుందు రని,

భీ: రూపవతీ ! నీవు చెప్పునది యెట్లును సరిపో తున్నది. నాయాజ్ఞ లేకుండ నితరులు మనదుర్గమును జొచ్చుట యసాధ్యము. సం దేశహరుఁడుమాత్రమే శత్రువు, తక్కిన వారు మనవారే కావచ్చును. - మఱియు వారందఱు శత్రు వులే యనుకొందము. అట్లయిన నాయజ్ఞను బొంది నీతో వచ్చుటకు సిద్ధమయిన భూయాదుఁ డేమయియుండును? అతఁడు పయనమై రాకముం దే శత్రువులు నిన్ను 'మోసపుచ్చి తీసి కొనిపోయినా రనుకొన్నను భూయాదుఁడు నీవు కనఁబడక పోవుట చే నా చెంతకు వచ్చి నిజస్థితి చెప్పకుండునా ? కావున, భూయాదుఁడు లోలోపల శత్రువులవలన లంచముఁ గొని వారిలో నైక్యమైయుండుట నిజము,

అని పల్కి భీమ దేవుఁ డంతతో నూరకుండక ఒక భటుని బిలిచి భూయాదునింటికిఁ బోయి యతనివృత్తాంతము తెలిసికొనిర'మ్మని చెప్పఁగా వాఁడు పోయి వచ్చి 'మహా రాజూ ! భూయాదుఁడు పయనమై రాత్రియే యిల్లు విడిచి 21] ప్రకరణ ము -27 161 యన్డిలపురమునకుఁ బోయిన ట్లింటివారు చెప్పి'రని మనవి చేసెను. భీమదేవుఁ డది విని 'భూయాదుఁడు శత్రువులలోఁ జేరి యున్నాండని నిశ్చయించి వారినంద ను బంపి వేసి రూపవతిని జూచి 'సుందరీ ! నీకుఁ బెద్ద కష్టము సంప్రాప్త మైన ' దని పల్కెను.

రూ: మహారాజా ! ఇచ్ఛినిని మోసపుచ్చికొని వచ్చి నందుల కిది ప్రతిఫలము. ఫలమును దెచ్చి నోటిముందుంచి నను దేవరవా రనుభవింప లేకున్నారు. ఇచ్ఛినిని దీసికొని వచ్చుటవలనఁ గష్టము తప్ప మజేమియును ఫలము లేక పోయెను.

భీ: మరి న న్నేమి చేయుమందువు ?

రూ: రాజేంద్రా ! నీ వా మెను బాధింపవ లెను. లేనిచో నామె నీకు లోంగదు.

విని భీమ దేవుఁడు కొంచెము యోచించెను. రూపవతి చెప్పిన యుపాయమే యుచితముగా నున్నదని నిశ్చ యిం చెను. అతఁడు రూపవతి నింటికిఁ బుచ్చి వెంట నే లేచి యాయుధమును దాల్చి యిచ్ఛినీకుమారి భవనమువంక నడవ 'సాగెను. ' అట్లు పోవునపుడు భీమ దేవుఁడు 'నాఁ డెంతటి ఘోరకృత్య మొనరించియైనను నా రాజకుమారిని వశపఱచు కొనిఱవ లె' నని నిశ్చయించుకొనెను. అతఁడు సరభసగమన ముతో నొకనిముసములో నిచ్ఛినిభవనమును, జేరెను, కాని,

యచ్చట నెవ్వరును లేరు, భీమరాజు వకుళను బిల్చెను. కాని, యామెకూడ నక్కడ నున్నట్లు తోఁప లేదు. వా రిరు వురును గలసి కైలాసశిఖరమునకుఁ బోయియుందు రని మా సౌధమునకుఁ బోయెను, రచ్చటను గానఁబడ లేదు. అతఁడు మగిడి వెనుకటి భవనమునకు వచ్చెను. కాని, వారి జాడ లేమియుఁ గాన రాలేదు. అతని హృదయమున నాశ్చర్య తరంగము లెగయనారంభించెను. అతఁడు నిశ్చేష్టితుఁ డై ‘వీ రేమయి యుందురు ? ఎచ్చటికిఁ బోయియుందురు ? వకుళ కూడఁ గాన రా 'దేమి ? నేను వచ్చుచున్నట్లు విని వీ రీమం దిరములలో నెచ్చట నై న దాఁగియుండవచ్చునని యాలో చించి యొక్కొక్కమందిరమే వెదక నారంభించెను. అత డట్లు వెదకు చుండఁగా నొక గదిలోనుండి యెవ్వరో పిల్చు చున్నట్లు వినఁబడెను. తోడ నే యారాజు శబ్దముననుసరించి యామందిరము నొద్దకుఁ బోయెను. కాని, మాయింటి తలుపులు బంధించియుండెను. ఇంతలో మరల లోపలనుండి ధ్వని వచ్చినందున నెవ్వరో యున్నా రని నిశ్చయించి పైని బం ధింపఁబడిన బీగమును దీసి తలుపులు తెఱచెను. వెంట నే లోపలనుండి యొక పురుషుఁడు వచ్చెను. అతనికి జూడఁగా రాజున కాశ్చర్యము తలమునుక లయ్యెను. ఇంతలో నాపురు షుఁడు భయమున గడగడవడకుచు రాజు కాళ్ళ పై బడెను. రా జతనిఁ జూచి భూయాదా ! లెమ్ము, నీ విచ్చట కేల వచ్చితివి ? " ఇది యంతయు నింద్రజాలమువలెఁ గన్పట్టు

చున్నది. ఇట నిచ్ఛినీకుమారియు, వకుళయుఁ గనఁబడ రేమి ? నీ వృత్తాంతము స్పష్టముగాఁ జెప్పు మని పల్క నాతఁడు చేతులు జోడించి యిట్లు చెప్పనారంభించెను.

'ఓ మహాప్రభూ ! 'నేను నిన్న దమయాజ్ఞను దాల్చి యనిహ లపురమునకుఁ బోవఁ బయన మై సం దేశహరుఁ డున్న తావునకుఁ బోయితిని. సం దేశహరుఁడును భుజించి కూర్చుండి యుండెను. రూపవతి యింకను నచ్చటకు రాలేదు. రాత్రి భుజించి సం దేశహరుఁడున్న 'తావునకు వచ్చెద' నని రూపవతి నిన్న సాయంసమయమున నే చెప్పుట చే నామెయింటికి నేను వెళ్ళ లేదు. ఆదూతయును, నేనును మాటాడుకొనుచుంటిమి. ఇంతలో వకుళ యచ్చటకు వచ్చి 'రాజకుమారా ! మీ రనిహలపురమునకుఁ బోవుదు రని తెలిసినది. అక్కడ మా సోదరుఁ డున్నాఁడు. అతని కొక వస్తువును బంపవలసియున్నది. మీరు నాయందు దయయుంచి యీవస్తువు నతనికిఁ జేర్పఁ బ్రార్థించుచున్నాను. నాకు మీ రీయపకార మొనర్తు రేని మీమే లెన్నఁడును మఱవను. అవి పెద్దబరువుగలవస్తువులు కావు. బంగారునగలు' అని మరి మరి ప్రార్థింప నే నందుల కంగీకరించితిని. ఈ చీకటిలోఁ గాదు, మీరు నామందిరము సకు దయ చేయుదురేని దీపపు వెలుఁగున మీ కప్పగిం చెదను. అట్లయిన మీకును నాకును గూడఁ జిక్కుండ' దని చెప్పఁగా నేను గొంచెము 'యోజించి యందేమితప్పున్నది, అని నిశ్చ యించి సందేశహరునితోఁ జెప్పి యామె వెంట నీ మందిరము

నకు వచ్చితిని. నేను వచ్చునప్పటి కీగదిలో దీపము వెలుఁగు చుండెను. ఆవకుళ నన్ను : జూచి 'అయ్యా ! ఈయాసనమునఁ గూర్చుండుఁడు. మారాజకుమారి యొద్దనున్న వస్తువులు గొని వచ్చెద' నని. వెడలిపోయెను. నే నాదీపపు వెలుఁగున నిందున్న చిత్రపటములను జూచుచుంటిని. ఇంతలోఁ దలుపు వేయఁ బడినట్లు చప్పుడయ్యెను. నే నాతలుపువంకఁ జూచితిని . తలుపు బంధింపఁబడెను. నేను దటాలున ద్వారమునొద్దకు బోయి పిలిచితిని. బొబ్బలు పెట్టితిని. కాని, నాయత్నమంతయు వ్యర్థ మయ్యెను. నారోదన మరణ్యరోదన మయ్యెను. ఇంతకుఁ దప్ప నా కేమియుఁ దెలియదని మనవిచేసికొనెను. భీముఁ డది విని వెనుక ముందుసంగతు లాలోచింప నాసం దేశహరుఁడు శత్రువనియు, రాజకుమారి యతనిసాయమునఁ దప్పించుకొని పోయెననియుఁ బొడకట్టెను. వెంటనే భీమ దేవుఁడు వీఁపు విఱిగి నేలఁగూలఁబడి వికృతస్వరముతో 'అయ్యో ! ఇచ్ఛినీ కుమారి పోయినది. తప్పించుకొని పోయినది. ఆహా ! ఇంక నేమున్నది! నారాజ్యలక్ష్మి పోయినది. నామనోహారిణి పోయి నది. నా కిఁక నీజీవన మేల ? ఈ రాజ్య నేల ? ఈధనసంపద లేల? ఈ సై న్యము లేల ! ఈదాసదాసీనివహ మేల! చీ ! నాకీ తుచ్ఛ దేహ మేల ?' అని పలికి వెంట నే కోపోద్దీపితుఁడై భూయాదునిఁ జూచి - 'ఓయీ ! ఇంకను నిల్చి చూతు వేల ? లెమ్ము, పొమ్ము, రణ భేరులను మొయింపుమనుము, సైన్య ములఁ గదలింప సేనానాయకులతోఁ జెప్పుము, పొమ్ము,

పొమ్ము' అని యతనిఁ బంపి వేసి చటాలున నచ్చోటు గదలి పోయెను.

ఇరు వ ది యె ని మి ద వ ప్రకరణ ము

యుద్ధము

చాళుక్య భీమునకు 'భోలా భీముఁ డను పేరు గల దని యిదినఱకు వ్రాసితిని. అనఁగా వెర్రి భీముఁ డని దాని యర్థము, ఇతర కాలములం దావెర్రితనము చూపట్టదు. కాని, కోపము వచ్చినపుడు మాత్ర మది యతనిచర్యలందుఁ బూర్తి గాఁ బ్రతి ఫలించును. పృథ్వీరా జన్నను, బరమారుఁ డన్నను భీమ 'దేవుఁడు మండిపడుచుండును. అందులో వా రిరువురును దన పై కి దాడి వెడలి వచ్చి తన రాజ్యపు టెల్లయందు విడిసియున్నా రని విన్నపు డతని కెంతకోపముదయించునో చెప్పవలెనా ? అయినను ఇచ్ఛినీకుమారిని స్వాధీనము గావించుకొను యత్న ములలో మునిఁగియుండుట చేత భీముఁడెట్లో సహించి యుండెను. ఇచ్చిని తన్ను మోసపుచ్చి తప్పించుకొనిపోయి నట్లు గ్రహించినపు డదివఱకే యుదయించి హృదయమను తటాకమును నిండించియున్న కోపరస మొక్కమాఱు విజృం భించెను. అప్పటి యతనిరూపమును, చర్యలను వర్ణింప నలవి కాదు. భూయాదునిచే నతఁ డట్లు వార్త పంపి వెంట నే యుద్ధ పరికరములను దాల్చి భయంకర రూపములతో సేనాని వేశము

నకుఁ జోయి నిల్చెను. అదివటికే సన్నద్ధు లైయున్న యుద్ధ భటు లతనిఁజూచి జయజయనాదములు చేయుచు సమరో త్సాహమును సూచించిరి. భీముఁడు వారినిఁ జూచి చేయెత్తి పెద్ద యెలుంగుతో “ఓ వీరభటులారా ! మీరాజునకు సహా యము చేయవలసిన సమయ మింతకంటే మఱొకటి లేదు. అతి ప్రయత్నము చేసి సంపాదించుకొన్న నారత్నము సపహరించి యీపరమారుఁడును, నీపృథ్వీరాజును నా ప్రాణములను స్వస్థా నములనుండి కడలించినారు. ఆరత్నము నాకు మరల లభించినఁ గాని ప్రాణములు గుదుటఁబడవు. మీరంద జేకీభవించి సము త్సాహముతోఁ బోయి యాశత్రువును జంపి యారత్నమును గొనివచ్చి మీ ప్రభువు ప్రాణములు నిలుపుఁడు. లెండు సమర మున వెనుకంజ వేయకుఁడు. సాహసము వదలకుఁడు. ఖడ్గము లను దాల్పుఁడు. శత్రువులశిరో నాళములం దున్న నెత్తుటి చే భూ దేవికి బలియిండు. రెండు, లెండు' అని వెర్రి కేకలు వేయ నారంభిం చెను. తోడ నే రణ భేరులు మ్రోయింపఁబడెను. తదీయధ్వనులు దశ దిశలును నిండించెను. ఆధ్వనులతోఁగూడ సైనికుల పాదఘాతములచే నెగ సినధూళులు దిశాంతములవటి కును వ్యాపించెను. సముద్రము పొంగిపొరలి ప్రవహించునట్లు ఘూర్జర పై న్యములు దుర్గమును విడిచి ముందునకు నడచి పోవుచుండెను.

అది చూచి యదివఱకే కృతసన్నాహు లైన 'యాబూ సైనికులును, ఢిల్లీ సైనికులును ' వ్యూహములు పన్ను కొని ధైర్యముతో నిలిచి యుండిరి. అతి వేగముతోఁ బ్రవహించు ' నదీప్రవాహము తన కెదురుగానున్న వస్తువును దాఁకినట్లు ఘూర్జర సైనిక లు రిపు సై న్యముల నొక్క పెట్టునఁ దాఁకిరి. ఆయాటోపమున కాగఁజాలక యాబూ ఢిల్లీ సై న్యములు వెనుక కొరగి యాశత్రుసై న్యమను ప్రవాహమునఁబడి కొట్టు కొనిపోవలసిన దేకాని యవి యతి ధైర్యముతోఁ బర్వతము వలె నిలిచియుండుట చే ఘూర్జరులే ముందునకు మాటుగా వెనుకకుఁ బోనలసివచ్చెను. అయిన వారు వెటనే సేనాధి పతి ప్రోత్సాహము చే మరల ముందున కరిగి యుద్ధమునకుఁ డలపడిరి, అబూ ఢిల్లీ సై న్యములుగూడ ధైర్యముతో వారి నెదుర్కొని పోరాడసాగెను. ఇరుపక్షములవారును బలవంతు లును, ధైర్యవంతులును, సాహసవంతులను నగుటచేఁ బోరు మిగుల భయంకరముగాఁ బరిణమిం చెను. ఆదొమ్మి యుద్ధమున నాయుధము లొండొంటితో దాఁకి యగ్నికణములను రాల్చుచు మెఱపులవలె మెరియుచుండెను. వానిధ్వను లురు ముల ననుక రించుచుండెను. ఇంతలోఁ జిమ్మన గొట్టములతో జిమ్మినట్లు యోధులశరీరములనుండి రక్త ధారలు పైకెగసి పాదఘాతములవలన నెగయుచున్న ధూళుల నడఁగించు చుండెను. వీరభటులశిరములు బంతులవ లెఁ దూలుచుండెను. అవయనములు తుత్తుమురై నేల రాలుచుండెను. చెవులు చెవుడ్పడునట్లు సింహనాదములు ప్రబలుచుండెను. హృదయ మున జాలిపుట్టునట్లు నేలం బడిపోయి ప్రాణములువిడుచు


వీరుల హరినామస్మరణము లంతటను వ్యాపించుచుండెను. ఒక ఘడియలో యుద్ధభూమి పీనుఁగు పెంట లయ్యెను. యోధులు నలుగడలకుఁ జెదరిపోయిరి. రంగమున భటులు పలుచనై చూపట్టరి. ఇట్లు చెదరిపోయిన బలములు రెండును మరలఁ గూడు కొని పోరు సమయమున సమర సింహుఁ డభయసింగున కగ పడెను. అతఁ డగపడఁగానే యభయసింహుఁడు మిక్కిలి కుపితుఁడై 'ఓరీ ! మాయావీ ! అమరసింహా ! నీవు నాకు వన మూలికావైద్యము నుప దేశించి గురువవై తివి. అందులకు గురుదక్షిణ యొసఁగవలెను. నీవంటి గొప్ప వాని కల్పదక్షిణ చాలదు. పరపదమునకుఁ బట్టాభి షేకము గావించెదను. ఇచ్ఛినీకుమారిని నాకుఁ గూర్ప మిగులఁ బ్రయత్నించితివి. అందులకుఁ బ్రత్యుపకారముగా దేవ తా కాంతను నీకు సమ కూర్చెదను' అని పలికి కత్తిని గిరగిరఁ ద్రిప్పుచు లేడి పైకి లంఘించు పెద్దపులి వలె నాతని పై బడి పట్టుకొని శిరము ఖం డించుటకు సిద్ధపడి యుండ దూరమునుండి భీమ దేవుఁ . డది. చూచి యొక పర్వున వచ్చి యభయసింగు నెదుర్కొనెను. ఆ రాజకుమారుఁడును వెనుదీయక యతనితో యుద్ధము చేయ నారంభించెను. ఇ ట్లిరువురును - జిత్రగతులతోఁ గొంతవడి భీకరయుద్ధ మొనర్చిరి. ఇరుపక్షముల వారును వారి యుద్ధ చాతు ర్యమును బొగడఁజొచ్చిరి. కాని, కొంతవడి కభయసింగు భీమబలుఁడయిన భీమ దేవునిప రాక్ర మముసకుఁ దాళలేక


క్రమముగా క్షీణబలుఁడై వీరస్వర్గము చెందెను. అయినను నతని సాహసమును, శౌర్యమును, ధైర్యమును బొగడనివా రిరుపక్షములందు నొక్కరును లేరు. భీముఁడుగూడఁ దనతో నంత సేపు కడుఁజూతుర్యముతోఁ బెనంగిన యభయ సింగుని మెచ్చుకొనకపోలేదు.

ఇంతలోఁ బరమాదం ఉభయసింగుదురవస్థను జూచి మిగులఁ గ్రుద్దుఁడై భీమ దేవు నెదుర్కొనెను, అబూ సైన్యము లును దమప్రభువునకు బాసటయై నిలిచెను.అది చూచి భీముని సై న్యములుగూడ నతనికిఁ దోడై నిలిచెను. మరల మారసంగ్రామ మారంభమయ్యెను. కాని, కొంత సేపటికి భీమునిపరాక్రమమున కాగఁజాలక పరమార్కుడును నతని సైనికులును వెనుకకు మరలి పోవుచుండిరి. పృథ్వీరా జది చూచి తన సై స్యములను మరలించుకొని వచ్చి పరమారునకు భాసట యై నిలి చెను. ఈసాయము చేఁ బర్విడిపోవు నాబూ సైనికులు ధైర్యము తెచ్చుకొని మరల శత్రువుల నెదిరించిరి. పృద్వీరాజు మిగులఁ బరాక్రమించి ముందునకుఁ బోయి వాఁడి శరములచే భీముని సై నికులఁ దెళ్ళ నేయుచుండెను, విలువిద్య యం దతి చాతుర్యముగల యా రాజు నెదుర నిలువ లేక ఘూర్జర సై నికులు వెనుకకుఁ బాఱిపోవుచుండిరి. ఢిల్లీశ్వరుండును, నతని సైనికులును వారిని వెంబడించి తఱుమఁజొచ్చిరి. ఇంతలో భీముఁడు తన సైన్యములను ప్రోత్సాహించి మరలించి పృథ్వీ రాజు సేనలతో యుద్ధ మొనర్చుచుండెను. పృథ్వీరాజు తన దళముల పై ఁ గవియుచున్న భీమునిఁ జూచి చిర కాలమునుండి హృదయమున రవుల్కొనుచున్న కోప మొక్క పెట్టునఁ బ్రజ్వ లింపఁ బోయి వాని నెదుర్కొని వాడి బాణములచే నొప్పించి వానిని దనవంకకు మరలించెను. భీముఁడు వృద్వీరాజును జూచినంత నే క్రోధోద్దీపితుఁడై విల్లెక్కిడి బాణవర్షము , గురి యింపఁ జొచ్చెను. ఒకరి నొక రెదుర్కొని ద్వంద్వయుద్ధమున కారంభించిరి. పరాక్రమశాలులును, ధనుర్విద్యయందుఁగుళలు లును నగు వారి యుద్ధ చాతుర్యమును జూచుచు నిరుపు ములవా రట్లే నిలిచిపోయిరి. బాణములు వింటఁ గూర్చునపు డును, బ్రయోగించునపుడును న తిలాఘనమును జూపుచు నా వీరులు చూపటి కాశ్చర్యమును గొల్పుచుండిరి. నాఁ డా యుద్ధమును జూచిన వారు భారత యుద్ధమునందు మిగుల వాసి గాంచిన కర్ణార్జునుల యెక్కటి కయ్యమును స్మరింపక పోరు.. ఇ ట్లొక గడియకాల మగునప్పటికీఁ బృద్వీరాజు తన తీవ్ర బాణము లచే భీముని మూర్ఛిల్లఁ జేసెను. భీమునిదుర వస్థను జూచి మావటీఁడు తన యేనుఁగును యుద్ధభూమినుండి మరలించెను. భీముఁడు మూర్చిల్లి నతోడ నే ఘూర్జరులు ధైర్యము విడిచి పారి పోవఁజొచ్చిరి. ఢిల్లీ సైనికులు వారిని దుర్గముచొచ్చునంత వఱకును దఱిమితరిమి కొట్టిరి. నాఁటిమహాయుద్ధమునఁ బృథ్వీ రాజును జయలక్ష్మి వరించెను,

తొమ్మి ద ప ప క ర ణ ము

రాజద్రోహము

యుద్ధము ముగిసిన నాఁటి రాత్రి రెండుజాముల కాలము గడచిన పిమ్మటఁ బృథ్వీరాజు సేనాని వేశమునకుఁ బది బారల దూరమందున్న యొక చెట్టు క్రింద నొక మనుష్యుఁడు కూర్చుండి యెవరి నిమిత్తమో యెదురు చూచుచుండెను. కొంత సేపటికి సేనాని వేశమునుండి బయలు వెడలి యైదుగురు మనుష్యులు

నిశ్శబ్దముగా నా చెట్టు వైపునకు వచ్చిరి. అదివఱకచ్చటనున్న పురుషుఁడు వారికెదురుగాఁ బోయి వారిని మఱికొంతదూరము గొనిపోయి యొక చోఁ గూర్చుండఁ బెట్టి యిట్లు ప్రసంగించెను.

పు: -- రాజకుమారులారా ! మీరు చెప్పినట్లు చేయ లేదు. భీముఁడు మీకు వాగ్దానము చేసినట్లు పదవుల నీయఁ డేమో యను ననుమాన మున్నదా యేమి? అట్లయిన నాతో రండు. ఇప్పుడే మీ కాబహుమానముల నిప్పిం చెదను.

రాజ: ఓయీ! మా కాసందియము లేదు. నేఁడు దొమ్మి యుద్ధమునఁ బృద్వీరాజును నఱక నెన్నోమాఱులు ప్రయత్నము చేసితిమి. కాని, కరుణరా జెల్లప్పుడు నాతని చెంత నే యుండెను. మా కవకాశము చిక్క లేదు. -పోనిండు, ఇప్పు డాపని చేయుఁడు

రాజ: - ఏమి చేయుమందువు ?

పు: నేటి యుద్ధమున సైన్యములు మిక్కిలి యలసి యుండుట చే గాఢముగా నిద్రించుచున్నవి. రాజుగూడ నేఁడు గాఢనిద్ర చెందియున్నాఁడు. కావున నతని గుడారమును బ్రవే శించి సాధ్యమైనచో నతనిని గట్టి తీసికొనిరండు, లేనిచో జంపుఁడు, ఇదియే మీరు చేయవలసిన కార్యము. ఇది నేఁడు కానిచో నది మీ కసాధ్యము. అతఁడు దుర్గమును ప్రవే శించినచో విశ్వప్రయత్నములు చేసియైనను మీ రతనిని జంపలేరు.

రాజ: అవును, నీవు చెప్పినది సత్యమే ! మే మీ రాత్రి నారాజు నెట్లయినను జంప వలెనని యోజించుచు నే యున్నాము. ఈసాయంసమయమున నాబూ సైనికు లిరువురు

రాజమన వచ్చి కరుణ రాజు నెచ్చటకో తీసికొనిపోయినారు. అతఁడు మరలివచ్చినట్లు లేదు. నేఁడు పృథ్వీరాజును జంపుట 'మన కనుకూల సమయము, మేము పోయి ప్రయత్నింతుము. నీ విచ్చట నుండుము.

పు: సంతోషమే ! పోయిరండు. సాధ్యమైనంతవఱకు బంధించి ప్రాణములతోఁ గొనివచ్చుటకే ప్రయత్నింపుఁడు,

రా: మన మండఱ మొక్కమాటు పోరాదు. ఒక్కర నే పోయి రాజుగుడారమును బ్రవేశింపవలెను. గుడారము వెనుక భాగమునుండి దారి చేసికొని పోవుట మేలు. ఎవరైన నడిగిన చోఁ బృశ్వీ రాజు నాజ్ఞ చొప్పున గస్తు తిరుగు చున్నా మని నిర్భయముగాఁ జెప్పుఁడు. నేను ముందుగాఁ బోయెదను. నే నచ్చటికిఁ జేరుదు ననఁగా మీలో నొకఁడు వచ్చుఁగాక . ఇట్లే యందఱును రండు. ఆ రాజును బంధించి తెచ్చుటయో లేక చంపుటయో యప్పటి స్థితిగతులఁబట్టి యాలోచించుకొందము.”

అని యుపాయము చెప్పి యొక వీరుడు వారి నందు లకు సమ్మతింపఁ జేసి యటనుండి బయలు వెడలి పృథ్వీరాజు గుడారమునకు వచ్చుచుండెను.

ఆగుడారము మిగులఁ బెద్దది. రాజభననమువ లె నానాలంకారశోభితమై యది యొప్పులు గులుకుచుండెను. ఆ రాజవీరుఁడు గుడారము వెనుక భాగమునకు మెల్ల మెల్లగా వచ్చి తాను లోపలికరుగుటకుఁ దగిన ద్వారము , చేయనారంభించెను. కాని, యది యసాధ్యముగాఁ జూప ట్టెను. ఆపట భవనమునకు నిలువెత్తు గలబల్ల లు చుట్టును గోడవ లె నమర్చ బడియుండుటచే దానిని భేదించుట యసాధ్యమయ్యెను. అతఁ


డాలోచించి భూమిని దవ్వి ద్వారము చేసికొనుట యే మంచి దని నిశ్చయించి ఖడ్గముతో భూమిని ద్రవ్వఁ జొచ్చెను. అది యిసుక నేల యగుట చే నతఁడు విశేషము శ్రమపడకుండఁ గనే భూమికి నాబల్ల లకును నడుమ మనుష్యుఁడు దూఱి పోవు నంతటిరంధము చేయఁగలిగెను. ఆ రాజవీగుఁడు లోనికిం బోవ నారంధ్రములోఁ దూఱెను. వాఁడిట్లు లోపలికిఁ బోవు చున్న సమయమున రెండు ప్రక్కలనుండి రెండు కత్తి దెబ్బలు తగిలి వానిశిరము భిన్న మయ్యెను. వాడు కిక్కురుమనకుండఁ జ చ్చెను. గుడారములో నెవ్వరో యిర్వురు వీరు లుండి యీ కార్యము నాచరించినట్లు తోచుచున్నది. ఆయిర్వురు వీరు లును, వాని మొండెమును లోని కీడ్చి వేసి యూద్వారము చెంత నట్లె కాచుకొనియుండిరి. అంతట మఱియొక పురుషుఁ డా ద్వారమునఁబడి లోనికి రాఁబోయెను. వాఁడును లోనికిఁ వచ్చియు రానిసమయమందే యీ వీరులు వానిశిరమును ఖం డించిరి, తక్కిన మువ్వురు వీరులుగూడం గ్రమముగా నచటకు వచ్చి తమవారు తమనిమిత్తము గుడారమునఁ గాచియుందు రన్న తలంపుతో లోకిఁ బోవ సమకట్టి లోపలివీరులచే హతులై “శతాంఛారి కూపం ప్రవిశంతి" యను పండితోక్తిని సార్థకము గావించిరి. ఇట్లా యైదుగురును జంపఁబడిన తరువాత నావీరులు మికొంత సే పచ్చట వేచియుండిరి. మఱి యెవ్వరై నను వత్తు రేమో యని వారితలంపు. కాని, యెవ్వరును రా లేదు. అంత వారిలో నొకఁడు రెండవవానితో "అయ్యా ! ఈ రాజద్రోహు, లంతమందినారు. పై నిఁక నెవ్వరైన నున్నా "రేమో చూచివ చ్చెదను. మా రిందు జాగరూకులయి యుండి యీమార్గమున నెవ్వరైనను వచ్చినచో సంహరింపుఁ" డని

పల్కి యాద్వారమునఁ బడి యావలకుఁ బోయెను. అతఁ డటు సేనాని వేశమును దాఁటి పోయెను. అతని కాచీకటిలో నెవ్వరు గనఁబడ లేదు. శత్రువు లిక నెవ్వరును నట లేరని - తలంచి సేనాని వేశమును జుట్టివచ్చుచుండ నొకఁ డతని కెదు రుగాఁ బోయి ఓబూ ! ఏమయినది ? మన కార్యము నెర వేరినదా ? లేదా ? పృద్వీరాజును మన వారు జంపినారా ? లేదా ? నీ వెందుల కిట్లు నచ్చితివి ! నాయున్న ప్రదేశమును గుఱుతింప లేక వేఱొక స్థలమునకుఁ బోవుచున్నట్లు గ్రహించి నానిమిత్త మే నీవు వచ్చియుందు వని తలంచి యిటు పర్విడి వచ్చి తిని, ఏమయినది ? మన కార్యము నెఱ వేఱిన దా ? లేదా? ముందామాట చెప్పుము” అని యాపురుషుఁ డావచ్చువాఁడు తనవాడే యనుకొని యాతురతతోఁ బ్రత్యుత్తరమున కెదురు చూడక యిట్లు ప్రశ్నింపజొచ్చెను. ఈవీరుఁ డాతని ప్రసంగము ముగియులోపునఁ గత్తిని మెల్లగా నంకించుకొని యొక్క వేటున నతని నఱికి 'దురా త్మా ! చావుము. మా వంటి సాధువుల నన్యాయముగా బాధించిన పాపమూరక పోవునా' అని పల్కి యచ్చోటు గదలి పో యెను.

ము ప్ప ద వప్రకరణము

పరిసమాప్తి,

మరు నాఁ డుదయమునఁ బృథ్వీరా రాజు తనగుడారము నకు వచ్చి చూచెను.అది శవములతో నిండియుండెను. అతఁడు వారిని బరిశీలించి చూచి వారు త న్నాశ్రయింపవచ్చిన చాళుక్యులని నిశ్చయించి మిక్కిలి విచారింపఁ జొచ్చెను. తన పినతండ్రి వారితో నిదివఱకు ద్వేషముపూనియుం డెను గాన

నాతఁడే వారిని జంపియుండునని నిశ్చయించి మిగులఁ గుపితు డై తన పినతండ్రిని బిలువ నొక - భటుని: బంపెను, కరుణ రాజును వెంట నే పృథ్వీరాజు భవనమున కరిగెను. రాత్రి యందు నర్తిల్లిన యాఘోరమును విని యాశ్చర్యముతో నాబూ సైనికులు ఢిల్లీ సై నికులును గూడ వచ్చియుండిరి. జై త పరమారుఁడుగూడ, నావింతఁ జూడ ప చ్చెను. పృద్వీరాజు కరుణ రాజుతో 'బాబాయీ ! మీరు చేయు చర్యలన్నియు మిగుల విపరీతములును, మన కప్రతిష్టాకరములును, నామన స్సునకు రోత పుట్టించునవియు వై యున్నవి. ఈ చాళుక్యులను జంపిన వారెవ్వరై యుందురు . ఇది వఱకు వారిలో నిర్వురను జంపినందుల కే మిగుల విచారించుచుండ నిప్పుడు వీరిని జంపి నామసస్సునకు మఱంతసం తాపమునుగూర్చినవా రెవ్వరు ? మీరు తప్ప వీరిని దెగటార్పసాహసించువారు మన సైన్యమున లేరు. మఱియు, నిన్న రాత్రి నన్ను మోసపుచ్చి మీపట భవనమునకుఁ దీసికొనిపోయి యిచ్ఛినీకుమారిని గొనివచ్చెద నని చెప్పి వెడలిపోయితిరి. మఱి నా కగపడ లేదు, ఇచ్చినిజాడ యే లేదు. 'నేను మీనిమిత్త ము వేచియుండి యచ్చట నే నిద్రించితిని. ఈ చాళుక్యులను జంపుట కే నన్నిచ్చటికిఁ బంపి వేసితిరాయేమి ? మీరు నాకుఁ బూజ్యులై నను నిట్టి ఘోర కృత్యములు చేయునప్పుడు సామాన్యముగా విడుచువాఁడను గాను, ఇందులకుఁ దగినసమాధానము చెప్పుఁడు. ఈచాళు క్యులజోలికి ,బోవలదని యిదివఱక నేక పర్యాయములు మీకు బోధించినను నావచనములు తృణప్రాయముగాఁజూచి నన్ను. లక్ష్యపెట్టకున్నారు.మీ రింత నిరంకుశముగా వర్తించుచుందు రేని నే నందులకు సమ్మతింపను. చెప్పుఁడు, నే నడిగిన దానికి