ఇచ్ఛినీకుమారి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Approved by the Text Book Committee for Nondetailed Study vide Fort St George Gazette Page 20 D/14-5.46.

ఇచ్ఛినీకుమారి

గ్రంథకర్త:

కేతవరపు వేంకట శాస్త్రి

ప్రకాశకులు:

|

శ్రీ తిరుపతి వేంకటేశ్వర బుక్కు డిపో,

రాజమండ్రి

మూల్యము రూపాయ

ఇచ్ఛినీకుమారి

( చరిత్ర విషయక నవల )

ఇది
రాయచూరు ముట్టడి, బొబ్బిలి ముట్టడి, తారాబాయి,
దిలారామ, లక్ష్మీప్రసాదము మున్నగుగ్రంథముల
రచించినవారుమ, విశాఖపట్టణమందలి
మిస్సెస్ ఏ. వి. యన్. కళాశాలా
ప్రధానాంధ్రపండితులును నగు

కేతవరపు వేంకట శాస్త్రిగారిచే

రచియింపఁబడినది.

ఎనిమిదవ కూర్పు

ప్రకాశకులు:

శ్రీ తిరుపతి వేంకటేశ్వర బుక్కు డిపో,

రాజమండ్రి.

సర్వహక్కులు
ప్రకాశకులవి.

మెజస్టిక్ ప్రెస్,
రాజమండ్రి.

FOREWORD


I esteem it a pleasure and privilege to write a foreword to this book. I have read through the whole book and may state without the least hesitation that it is very interesting. The author has succeeded in a large measure in breathing life over the dry bones of a few historical outlines gathered from the history of the XI century in Northern India. He has exhibited commendable skill in the delineation of characters. The heroine Ichineekumari, stands out as the type of a Hindu maiden always docile and at times spirited and bold to a degree. Her deep devotion to and unswerving loyalty and attachment for her future Lord are shown by the utter scorn with which she treats the overtures of a passionate but powerful monarch-Bheemadeva. Her constancy to Prithviraj is unparalleled. The other minor characters have been managed with wonderful dexterity.

The style is all that could be desired, simple sustaining and the language by no means bad. The book abounds in descriptions, both historical and geographical and let me frankly add that in most cases they are faithful, accurate and graphic.

I am quite confident that this novel will go a great way in meeting the modern requirements of Telugu in Secondary Schools and may therefore be safely prescribed as a Suitable Text-book, for non-detailed study in IV, V and VI Forms.

Cocanada,

M. HANUMANTHA RAO, B A.,L.T.,

1-5-19

P.R. College.

కథా ముఖము

తెలుఁగునాఁట వెలసిన తొలినాఁటి 'నవలా' రచయితలలో శ్రీ . కేతవరపు వేంకట శాస్త్రిగారు మహోత్తమమైన స్థాన మలంకరించిరి. విశ్లేషించి, వా రేరుకొన్నవి కోరుకొన్నవి యగుగాథలు చారిత్రకములే. రాయచూరుముట్టడి, బొబ్బిలిముట్టడి; ఇత్యాదులు పెక్కు లరయునది. ప్రకృతము, ఈ 'ఇచ్చినీకుమారి' యుఁ జారిత్రకమే. ఇందలి కథ ' రాసమాల' యను ఘూర్జరదేశచరిత్రమునుండి సంగ్రహింపఁబడినది. అయిదాఱు పాత్రములు మాత్రము కల్పితములు. చరిత్ర-అచ్చముగా నున్నటులే వ్రాసికొనుచు వచ్చినచో నందమే యుండదు. కొన్ని మార్పులు చేర్పులు రచయిత చేయవలయును. శాస్త్రిగారు కూడ నీదారి నాశ్రయించినారు. కనుక నే యీ 'నవల' సుందరముగా నున్నయది.

ఇచ్ఛినికి నిజమైనహృదయము పృథ్వీరాజుమీఁద. భీమరాజు ఇచ్ఛినిని మోహించి, ఆమెను వలపింపఁజేయుటకుఁ బన్నుగడలు పన్నెను. ఎన్ని చేసినను, ఇచ్చినీ-పృథ్వీరాజుల వలపులే కడకు ఫలవంతములయినవి.

ధారావాహికమైన రచనతో నెంతో సంతనగా రసవంతముగా నున్న యీనవల క్లిష్టపదములు దీర్ఘసమాసములు లేక, ఉన్నతపాఠశాలావిద్యార్థులు పఠించుట కెంతయు ననుగుణముగా నున్నది.

రాజమహేంద్రవరము:

మధునాపంతుల సత్యనారాయణ

విరోధి: మధుమాసము:

శాస్త్రి