ఆ నలిన ముఖి - అందమదేమి
స్వరూపం
(ఆ నలిన ముఖి అందమదేమి నుండి మళ్ళించబడింది)
పల్లవి:
ఆ నలిన ముఖి - అందమదేమి
దానికి నీకు - తగుసామి ॥ఆ నలిన ముఖి॥
చరణం1:
మందుల మారుల - మాపసగడె
బందములాయె - బళిబళిసామి ॥ఆ నలిన ముఖి॥
చరణం2:
తంతర గత్తెల - తక్కులు మిగుల
సంతసమాయె - సరిసరి సామి ॥ఆ నలిన ముఖి॥