Jump to content

ఆరోగ్య భాస్కరము/21-30 పేజీలు

వికీసోర్స్ నుండి
21
శా|| చాలుంజాలు వృథాపవాదములు. నీ సత్పత్రిక౯ నీవు బి

ట్లేల౯ లేక నను౯ శపింతె యన కోవేదేవు నారోగ్యదు౯

గా లోకుల్ వచియింత్రొ చెప్పవలెము౯. కానం గటాక్షించి నా

కాలుం గీలును జక్కఁజేయు మెపుడుం గైమోడ్చెద౯ భాస్కరా!

శా|| కాలు౯ నీవు కుదుర్పకున్న నిఁకనే@, గావించు కార్యంఁబె లే

దీల్ఫ్కంబున. పత్రిక౯ మఱియు నాయిల్లాలినిం బిల్లల౯

బాలింపంగ ననర్హుఁడ౯ సరికదా! నాకడ్పె నేఁ బూడ్చుకోఁ

జాలఁ. జోలియదారికేని వలదే సంచార మోమోభాస్కరా! ౧౪౧

శా|| కించిద్దూరపుటూళ్ళలోపలి సుహృద్గేహంబు లింకంతకు౯

కించిద్దూరపు గ్రామబాహ్యములె పోఁ గృచ్ఛ్రంబుగానుండ నా

సంచారంబెటు దూరదూరములకు౯ సౌఖ్యంబుగా సాఁగు? ఈ

కొంచెంపు౯ స్థితికన్నను౯ మృతియెమేల్ కొంచెంబిఁక౯ భాస్కరా!

మ|| కవితాకాంత యనారతంబునిడు సౌఖ్యం బాస్థఁ గైకోకయు౯

స్వవధానంబులుచూపి యెల్లకడల౯ వ్యాప్తుండఁగాఁ బోకయు౯

వివిధాస్థానములం జరించి పెలుచ౯ విత్తాడ్యుఁడం గాకయు౯

భవసాఫల్యమె పత్రికావనముగా భావించితి౯ భాస్కరా! ౧౪౩

శా|| కర్మత్యాగులవ్రాఁతలిందు మిగుల౯ ఖండించితిం బేర్చి. బి

ట్టోర్మి౯ నాగరఖండమాదియగు పెక్కుద్గ్రంథముల్ వ్రాసియు౯

పేర్మిం బ్రాక్తనసత్ప్రబంధములఁగొన్నింటి౯ సమార్జించియు౯

ధర్మిష్ఠంబగు దీన ముద్రితములుం గావించితి౯ భాస్కరా! ౧౪౪

శా|| తాదృక్పత్రిక నాఁపఁగావలసె నా దౌర్భాగ్యపుం బేర్మిమై

ఈదానంగల దుఃఖ మాఁపుకొన నా కేదారి గన్నట్ట. దా

మోదం బేది సదా యిటు ల్పనవఁగా ముఖ్యంపుబీజంబెయౌ

పాదవ్యాధిఁ గుదిర్చి పత్రికను నం బాలింపనే భాస్కరా! ౧౪౫

శా|| పాదాధారము లల్ల పిక్కపిఱుఁదుల్. పాదంబు నారెండును౯

మీఁద౯ లేనిది యూఁద దుర్వి. కనుక౯ నేఁ బాదశబ్దంబె యీ

బాద౯ వాడుచునుంటినంచుమదిలో భావించి వేవేగ నా

పాదవ్యాధిఁ గుదిర్చి పత్రికను నం బాలింపవే భాస్కరా! ౧౪౬
22
శా|| పాదం బాది సమస్త దేహమునకు౯. పాదంపుఁ గండ్ల౯ వినా

ఈ దేహంబను తేరు సాఁగ దిల నొక్కింతేనియుం గాన స

ర్వాధారంబయి నాకునెప్పుడు తనూయాత్రంబ్రసాదించు నీ

పాదం బాది గుదిర్చి పత్రికను నం బాలింపవే భాస్కరా! ౧౪

ఉ|| శంఖమునూఁదిచెప్పెడిని శాస్త్రము లెల్లెడల౯ 'శరీర మా

ద్యంఖలు ధర్మసాధన' మటంచు సదా. అటుగాన నట్టిమే౯

ప్రేంఖితమైనపక్షమునఁ బెద్దయనర్థము సంభవించు. త

ద్రింఖణ మబ్బకుంటకె నుతించుచునుంటిని నిన్ను భాస్కరా!

ఉ|| కాలునఁ దీఁపు. గుండె దడ. కంఠమునందునఁగళ్ల. చక్కగా

కాలమున౯ విరేచనము గామి. సమృద్ధబలంబు లేమి. అ

ద్దాలు ధరింపకున్నయెడ దవ్వులఁ జూపులు పోమి. ఇట్టివే

బోలెడువ్యాధుఁ లిట్టిమెయి పుణ్యసుసాధనమౌనె భాస్కరా!

ఉ|| వేమఱుఁ గళ్లకళ్లయని పేర్కొనుచుంటిని నిందు నొక్కరు.

క్కామవివృద్ధియంచు గదహారులు చెప్పుచునుంద్రు దాని. త

న్నామము శాస్త్రమందటు కనంబడుచున్నది, శ్లేష్మవృద్ధిగ౯

పామరవైద్యులంద్రు. విను బాధవిధంబు వచింతు భాస్కరా!

చ|| ప్రథమము జీర్ణకోశమును బర్వు నపక్వపదార్థ మొయ్యన౯

పృథునయి గ్రీవకెక్కి కడుబిఱ్ఱుగ గఱ్ఱను నద్దుతోడఁదా

పృథివిఁ బ్రవిష్టమౌవఱకుఁ బీడితుఁజేయుచునుండునన్ను. త

త్కథయిది. అద్ది యెప్పుడును గల్గుచునుండును నాకు భాస్కరా!

ఉ|| ఎచ్చటఁగూరుచుండినను నెంతటికార్యములోన నుండిన౯

క్రచ్చరనేగి యావలకుఁ గంఠగతామముతుట్టె మీఁదికి౯

వచ్చుట కోకరించి మఱివచ్చుటతప్పకవచ్చె. దానిని౯

చెచ్చెర మచ్చమాపఁగదె చేతులుమోడ్చెద నీకు భాస్కరా!

ఉ|| కండ్లు కుదుర్చుకొంటినెటొ కాంచుచునుంటిని దూరగంబుల౯.

పండ్లు నమర్చుకొంటినెవొ. భక్షణసేయుచునుంటి నన్నియు౯.

కండ్లకుఁ బండ్ల కింక నిను గట్టిగవేడను. తక్కువ్యాథు లిం

కేండ్లునుబూండ్లు పుచ్చ కిపుడే తెగటార్ప నుతింతు భాస్కరా!
23
ఉ|| ఎన్నిదినంబులైనయది యే నమలాపుర మేగుదెంచి? ఇం

కెన్నిదినంబులీయఁగలఁ డిట్లు మహౌషధముల్ ప్రసాదరా?

వెన్నిదినంబులుంచి తనయింటఁ బ్రసాదము పెట్టనోపు? అ

న్నన్న! అనామయంబునిడి యన్నియుఁ దీర్పఁ గదయ్య భాస్కరా!

చం|| విలువగలట్టిమందులను వేళ కొసంగుటెకాక స్వీయమౌ

నిలయమునందె నిల్పుకొని నేఁటికి మాసయుగంబునుండి ని

ర్మలుఁడు ప్రసాదరావు తన మంచిని వెల్లడిచేయుచుండె. ఆ

వలఁతి సదుద్యమంబు ఫలవంతముఁ జేయఁ గదయ్య భాస్కరా!

ఉ|| రెండు నెల ల్గతించినను బ్రేముడి పెంచుచునున్న వాఁడిఁకా

తండు. రవంతయు౯ విసుకు తద్ధృదయంబునఁ గల్గ. దిక్షునం

దుండెడితీపి యగ్రముననుండి క్రమంబుగ హెచ్చునట్లు ప్రా

జ్ఞుండగువాని చెల్మియును క్షోణిఁ గ్రమంబుగ హెచ్చు భాస్కరా!

ఉ|| ఒక్కప్రసాదరావె కడుయోగ్యుఁడనం బనియేమి? తమ్ములు౯

మిక్కిలిమంచివారు. బుధమిత్రము తత్పిత. అట్టివారియిల్

చిక్కెను నన్నుఁజుట్టుకొను చిక్కులుదీఱఁగ. వేయునేల? నీ

యెక్కప్రసాదమే యటుల నుత్తమరూపముదాల్చె భాస్కరా!

చం|| తమిని బ్రసాదరావె యగదంబిడ నక్కఱలేదు. తమ్ములౌ

రమణయ రాజె యెక్కు డనురాగముతోడ నొసంగువార. లీ

క్రమమున మందులిచ్చుచును గమ్మనియోదన మింటఁ బెట్టుచు౯

తమ సుగుణాళిఁజూపు తదుదారులు ధన్యులుగాదె భాస్కరా!

శా|| సద్యస్స్ఫూర్తిగ వేదశాస్త్రములును౯ శ్రౌతంబు సాధించి యా

విద్యారణ్యులునా వశీకృతచతుర్వేదార్థుఁడై ధాత్రి స

త్పద్యల్ తీర్చిన బుల్సుపాపయసుధీపంచాస్యుదాయాదు లీ

విద్యావత్సుకుటుంబికుల్ పెరనుడుల్ వేయేటికి౯ భాస్కరా!

శా|| ధన్యంబైమను తత్కుటుంబ మిటు నం దన్పంగనే చూడు. నే

దైన్యంబూని యిఁ కెంతకాలమిటులం దత్రత్యుఁడం గావలె౯?

శూన్యాన్యవ్యవహారత౯ మనములో శోకించుచుండ౯వలె౯?

మాన్యత్వన్నుతిసేయుచుంటి నిఁకనే౯ మన్పంగదే భాస్కరా!
24
ఉ|| ఒక్కనియాకృతింబడసి యుగ్మలిని౯ హరియింపఁగోరిన౯

గ్రక్కున నీవె శుద్ధఘుటికల్ మఱి పుష్పున? కట్లుగాక నే

పిక్కపిఱుందులందుఁగల పీఁకుడుపోకను గోరినం గటా!

ఉక్కివమూని చేత నొకయుండయుఁబెట్ట వదేమి భాస్కరా! ౧౬౧

ఉ|| పుష్పుఁడు మేనికండలను బూర్తిగఁ గోసి స్ఫుటాగ్ని వేల్చెఁబో

దుష్పథమంచు నీవె యది దూషణఁజేసితి. వట్లుగాక నే

పుష్పసదృక్షపద్యములఁ బూజితుఁజేయుచునుంటి నిన్ను. నా

బాష్పములూడ్చి పాదరుజఁ బాపపదేల రయంబ భాస్కరా! ౧౬౨

ఉ|| ఉండలకేమి? ఈయఁగలఁ డుత్తమజాయువులే ప్రసాదరా.

వండగనుండెనాతఁ. డిఁక నందులకై భయమందఁ. గాని నీ

దండిప్రసాదమున్నపుడె తర్బుధుఁడిచ్చెడిమందు రోగము౯

చెండును లేదదేమొద లిసీ! ఇఁక నేమనువాఁడ భాస్కరా!

ఉ|| దైవబలప్రవృత్తములు తామగుచుండును గొన్నివ్యాధు. ల

ప్డీవొ మఱొక్కదైవతమొ యీష దనుగ్రహదృష్టి వెట్టిన౯

పోవును. లేకయున్నఁ బొరిపుచ్చుఁ గ్రమ్ంబుగ దేహిఁ. గావున౯

తావకమౌ ప్రసాదమది తప్పక కవలెనాకు భాస్కరా!

ఉ|| ఏమనుజన్ముమయము లేబలలీలఁ బ్రవృత్తమైనను౯

మామకమైన పాదరుజమాత్రము దైవబలప్రవృత్త. మే

ధీమహితుండునుం దనదు దివ్యతరౌషరాజిచేత నీ

ఆమయ మాఁపఁజాలమియె యందులకున్నకతంబు భాస్కరా!

శా|| దుష్టంబైన మదామయంబు సరవిం దున్మాడి న౯ బంపఁగా

ఇష్టుండైన ప్రసాదరావు తగఁడే? ఈఁడే యనేకౌషధాల్

దిష్టంబొక్కడె తక్కువైనది యిట౯. దేవుండవౌ నీవు నా

కష్టంబుం బరిమార్చి నష్టగదుఁడం గావింపవే భాస్కరా! ౧౬౬

ఉ|| సన్నుతిఁజేసి పూర్వ మొకసస్మతి కుష్ఠగదంబునుండియే

క్రన్న విముక్తిఁ గాంచఁడొకొ? కష్టములొంది యిఁకెంతమంది ని౯

తిన్నగఁ బూజసేయ నవి తీరిచిపంపవు? నన్నుమాత్ర మి

ట్లెన్నినుతు ల్పొనర్చినను నేఁచనెచూచెదదేల భాస్కరా! ౧౬౭
25
ఉ|| కుష్ఠమువంటి ఘోరమును గ్రూరమునై మను పెద్దవ్యాధియే

నిష్ఠ నిను౯ భజించు నవనీప్రజ డగ్గఱ. దంతకంటె న

ల్సిష్ఠము నాదుపాదరుజ. ప్రీతినడంపుము. నీదుకీర్తి బం

హిష్ఠముఁ జేయ గ్రంథమునె యే లిఖియించుచునుంటి భాస్కరా!

మ|| కరుణ౯ నీవు మదీయపాదరుజ పోకార్తేని యారోగ్యభా

స్కరమ౯ పేర విరచ్యమాణమగు నీగ్రంథం బగు౯ సార్థకం.

బెఱుఁగంగాఁబడు నీమహామహిమ మఫ్డేవారిచేత౯ ధర౯ .

నిరతం బిద్ది పఠించి భూప్రజ యగు౯ నీరోగ మో భాస్కరా.

శా|| రెండేడుల్ పయి రెండుమాసములు నీరీతిం బదవ్యాధికి౯

నిండె౯. మొండిజ్వరం బొకండు మఱి దానింగూడియే యుండె. ఈ

రెండబ్దంబులనుండి యెంతయును నీరెండింటికిం జిక్క నే

బెండైపోయితి. చెండవయ్య యిఁక నీపీడ౯ వడి౯ భాస్కరా!

ఉ|| మొండిదె యౌనుగాక. జ్వరము౯ సహమూలముగం బెకల్చె వై

ద్యుండు ప్రసాదరావె. ఇఁక నున్నవి చిన్నవి కొన్నిరోగముల్.

ఖండిత మయ్యెడిం గ్రమముగా నవియేనియు. ఉండుఁగాక. ఆ

కొండిక వానికి౯ జడియ. ఘోరము పాదగదంబె భాస్కరా! ౧౭౧

చం|| అదె ననుఁ గ్రుంగఁదీసెడిని. అయ్యదియే వ్యథపెట్టెడి౯ సదా.

అదియె సమస్తకార్యముల కడ్డయి నాదు మదిం గలంచె. ఇం

కదియె కతంబు నాదు తనుయాత్రలు సాగమి. కేరికేని య

య్యదె యనివార్యమౌనటుల నాత్మఁదలంచుచునుంటి భాస్కరా!

మ|| అనివార్యంబని నేనె బాధపడలే కంచుంటినిం గాని యా

ఘనవైద్యుండు ప్రసాదరావు నెదియుం గావింపకే యూరకుం

డెనె? ఇంజక్షను లిచ్చియేని యెదొమాడ్కి౯ దానిఁ బోకార్పఁదా

తనశక్తి౯ వినియోగపెట్టు నతఁ డేతన్మాత్రుఁడే భాస్కరా!

శా|| ఇంజక్ష౯ బొనరింప నెంచుటయు నప్ణెందుండి యేతెంచెనో

పుంజీభూతములై మొగుళ్ళు కురిసెంబో కుంభవృష్టి౯ సదా.

నిం జూడం బదియైదునాళ్ళదనుక౯ నే నోచఁగానైతి. హా!

సంజ౯ నీదునుపస్థితు ల్కనకయే సల్పంబడె౯ భాస్కరా! ౧౭౪
26
శా|| మేఘాచ్ఛాదనలేక తీక్ష్ణకరుఁడై మిన్వీది నీవుండఁగా

నౌ ఘస్రంబునఁ జేయఁగావలయునం టాచేయు నింజక్షనుల్.

మోఘంబౌనఁట యట్లకానియెడ. తన్మూలంబునంజేసి యా

ద్రాఘిష్టేక్షణుఁ డాచికిత్స యునిచెం దర్వాతికి౯ భాస్కరా!

శా|| వర్షం బించుక తగ్గి యాతపము నల్వంకల్ రహిం గ్రమ్ముడు౯

హర్షంబొంది ప్రసాదరావు మఱి నా హార్టుం బరీక్షించె. దు

ర్ధర్షంబై యట స్పంద మెక్కుడగుచుం దానుంట గన్పెట్టె. నా

శీర్షంబందలి వ్రాఁతకై మనములోఁ జింతించెఁదా భాస్కరా!

మ|| హృదయస్పందన మెక్కుడైనయపు డాయింజక్షను ల్సేయుచో

ఒదవంగాఁగలదంట ప్రాణములకే యోజ౯ మహోపద్రవం.

బదియోజించి ప్రసాదరావు మదిలో నద్దాని నట్లుంచి నా

హృదయస్పందము తగ్గుకై సలిపె ముం దేమేమియో భాస్కరా

శా|| భైషజ్యం బిడుచున్నవాఁడు. మఱి స్వల్పంభైన యింజక్షనుల్

భూషల్ చేయుచునున్న వాఁడు చెయికి౯. పోకాడ దింకద్ది. నా

వేషం బీగతినున్న. దేమియనదు౯? విశ్వాతిశాయి త్వదు

న్మేషద్వీక్షణ మించుకంత విడు నామీఁద౯ నడి౯ భాస్కరా!

ఉ|| ఈవిధ మాత్మవంచన మొకింతయు లేక ప్రసాదరావు న౯

కావ నొనర్చుచుండఁడొకొ గట్టిప్రయత్న? మిఁకేల దీనిదౌ

చేవ నశింపకుండవలె? చేకురఁగావలె నిన్నివిఘ్నముల్?

దైవబలప్రవృత్తమె యిదంగద. మేటికి శంక? భాస్కరా! ౧౭౯

ఉ|| దైవము నేనగాదు. మఱి స్థాణుజనార్దనముఖ్య ముఖ్యదే

వావళి యుండియున్నదని యడ్డముచెప్పకు. నిద్రలేచి నే

నావల కేగుదేరఁగనె యక్షులలోఁబడు దేవుఁ డీవె. ఏ

దేవులుఁ గానరారు ప్రయతించినయేనియు నాకు భాస్కరా!

ఉ|| స్థాణుజనార్దప్రముఖ తత్తదఖిఖ్యలె వారివారి వి

న్నాణముఁ జాటుచున్నతవి నాపద మీగతినుండ వారి మా

గాణముగూర్చియేగు టతికష్టముగావున దేవుఁడన్న దృ

క్కోణముల౯ సదా పడెడి కోణునితండ్రివి నీవె భాస్కరా!
27
ఉ|| అల్పులఁజూడనేను. మహదాశ్రయమందె వసించువాఁడ. ము

వ్వేల్పులయిక్కవంచు నిను వేడుచునుండినవాఁడ. నాస్థితి౯

తెల్పుము నీవె వారలకు. తెల్పుదొ తెల్పకయుందొ మామకా

నల్పపదామయంబునకు హర్తవు కావలె నీవె భాస్కరా! ౧౮౨

ఉ|| చిన్నలె యా త్రిమూర్తులన? అఋష్టియు రక్ష లయంబె చేయువా

రన్ననుసృష్టియు౯ లయము నక్కఱెలే. దిఁక రక్షసేఁత కా

వెన్నుని వేడఁబోవ నల వెన్నువి కన్నె భవత్స్వరూప. మా

కన్ను ప్రసన్నమైనఁగద కాచెడి నాతఁడు నన్ను భాస్కరా! ౧౮౩

ఉ|| అల్ల త్రిమూర్తులు౯ లలిఁ ద్వదాశ్రయమందె వసించుచున్నవా.

రొల్ల నిఁకం దదాశ్రితుల యొద్దకెపోయి సమాశ్రయింపఁగ౯ .

త్వ ల్లలితాకృతి౯ మదిని దద్దయుఁ జేర్చి సమాశ్రయించెద౯ .

తెల్లము. నాదుపాదరుజ తీర్పకతప్పదు నీకు భాస్కరా!

చం|| ఇఁకనొక నేనె యెప్డు భవదీక్షణగోచరుఁ డౌటలేదు. పా

వకముఖ పంచభూతములు భప్రభు భౌమ బుధేజ్య శుక్ర మా

మకసుత ఋక్షముల్ నయనమార్గమునం బడుచుండునంచు వే

ఱొకనుడి యాడెదేని విను ముత్తరము౯ వచియింతు భాస్కరా!

శా|| భాగ్యంబాదిగఁ దత్తదర్థములనే భక్తాళికిం బ్రీతి నీ

యోగ్యుల్వారు. మదీఫ్స్యమానమును నం దొక్కండు నీలేఁడు. నే

రుగ్యుక్తుండ. ఆనామయార్థిని తదారోగ్యంబు నీద్రవ్య. మా

రోగ్యం భాస్కరయ౯ బుధోక్తి మనదే రూఢంబుగా భాస్కరా!

శా|| ఇట్లారోగ్యదుఁడన్న ఖ్యాతి భువి నీకే కల్గియుండంగ నిం

కెట్లర్థింతుఁ ద్రిమూర్తుల౯ మఱియుఁ జంద్రేంద్రాదులన్ దీనతన్?

పోట్లాడన్ గమకింతెకాని గదముం బోకార్పఁగం జూడ వె

ప్పట్లన్. నా గ్రహచారమా యిది? ఇఁకం బ్రారబ్ధమా భాస్కరా!

మ|| గ్రహనాథుండవు నీవె యౌదు. కనుకం గావింపఁగాలేవె ని

గ్రహమున్? తద్గ్రహచారముం గుదురుపంగాలేవె? అత్యంతదు

స్సహమైయుండెడి నాదు పాదరుజ యీషచ్ఛేషమున్ లేక యే

వహి నాశిల్లునొ యవహిన్ సలిపి ప్రోవన్ లేవె?యోభాస్కరా!
28
ఉ|| సప్తమమైన మేషమునఁ జంద్రయుతుండయి యుండె రాహు. వి

ప్డాప్తము తన్మహాదశయె. ఆదశయాదిని గల్గె విత్తసం

ప్రాప్తి గయాప్రయాగగమనాదిశుభంబులు. కాని దీర్ఘసం

సుప్తినిజెందెఁ దొంటిసతి. శోకము చిత్తముఁ జిందె భాస్కారా!

చం|| స్థితుఁడు కళత్రమం దతఁడు. చేసెను జేయఁగఁదగ్గ కార్యము౯

ద్రుతముగ వెండి పెండిలియుఁ దోడనె పెండిలియాడఁబడ్డ యా

పతిరతయందు సంతతియుఁ బంటవలంతియుఁ గూర్చెఁ గాని యీ

స్థితి స్వదాశావసానమునఁ జేకురఁజేసె నదేమొ భాస్కరా! ౧౯౦

ఉ|| నిర్దయుఁడై విధుంతుదుఁడు నిన్నె గ్రసించుచునుండుఁగాన నా

దుర్దముమా టటుంచుము చతుర్థనిజాలయవ ర్తియయ్యు సౌ

హార్దముఁజూపఁడయ్యె భవదాత్మజుఁడౌ నసితుండు. వాని యం

తర్దశయే మదార్థికమున౯ విషమించె నొకింత భాస్కరా! ౧౯౧

మ|| అలరాహుండు కళత్రవర్తియగుట౯ స్వాంతర్దశావేళలో

సలిపెం దాను గళత్రమారణ. మిఁకేసంతాపముంగూడఁదా

కలిగింపం. డటుపైఁ ద్రిషష్ఠపతియై కన్య్౯ వ్యయంబందె వ

ర్తిలియు౯ గీష్పతి మేలెచెసిచనె. తద్ధీఁజూడు మోభాస్కరా!

ఉ|| వచ్చె భవత్సుతుండు నటుపైని. సుతాధిపుఁడౌటఁజేసి తా

ఇచ్చె సుతు౯ . నుతింపవలె నిందుల కాతని. కాని యెంతయున్

హెచ్చు మదార్ధికంబునకు నించుక మాంద్యము తెచ్చిపెట్టెఁబో

ఇచ్చపడెన్ స్వమాంద్యమునె యెల్లెడ నుంచ నతండు భాస్కరా!

మ|| అదియేమాంద్య మిఁకింతహెచ్చినది సౌమ్యాంతర్దశన్. తద్బుధుం

డదయుం డయ్యెను భాగ్యనాథుఁడయి రాజ్యంబందు విత్తేశు తో

డొదవన్ వర్తిలికూడ. లాభపతి వీవున్నాఁడ వచ్చోట సం

పద నిప్పింపఁగలేకపోతి హితుచే. భావ్యంబొకో భాస్కరా!

మ|| ధనలాభేశులతోడ రాజ్యగతుఁడౌ తత్సౌమ్యుఁడే యంతగా

ధనముం గూర్పకయుండఁ గేతువె యిఁకందాఁగూర్చువాఁ డాతఁడు

దనుభావస్థుఁడు. దానఁజేసి తనువే తద్దృష్టులన్ మున్ బడెన్.

తనుసౌఖ్యంబు హరించె. వేఁకిమొలకన్ స్థాపించెఁబో భాస్కరా!
29
శా|| అక్రూరుం డెదొ చెసినాఁడు. చనినాఁడామీఁద నాయాతుఁడౌ

శుక్రండే పడఁద్రోసెఁ బూర్తిగ ననుం హూ. భార్గవుండౌట జా

తక్రోధుండయి యుండఁబోలు నిటులం దా. అష్టమాధీశుఁడౌ

ఈక్రవ్యాద్గురుఁ డింతకెక్కుడుశుభం బీనేర్చునే భాస్కరా! ౧౯౬

ఉ|| శుక్రున కష్టమాధిపత జ్యోతిరభిజ్ఞులు కాదు దోషమం.

ద్రేక్రమమయ్యె దోషి యిఁక? ఏఁగవిఁ దాఁగవియా యటంచున౯

సక్రుధుఁడై కనంగనగు. సాగ్రహ మాగ్రహ మాచరించు నీ

అక్రమ మాఁపఁజాలవొకొ యై గ్రహరాజవుకూడ భాస్కరా!

చం|| ఎవరు స్వజాతిపట్ల వహియిం త్రభిమానము. గాన నట్లె తా

కవి కవికి౯ సహాయపడఁగాఁ దగియుండ నిటుల్ రచించెఁ గా

కవిత నితండు. కాకవియుఁ గాంచు స్వజాతిని బ్రీతితోడ. ఈ

అవని స్వజాతివైరు లొక యా భషకంబులెకాదె భాస్కరా! ౧౯౮

చం|| ద్విజులకు జాతివైరమది తీఱక వర్తిలుచుండు నెంతయు౯.

స్వజనమునాక యోరుపులు స్వాంతమునందున లేక యొండొరుల్

విజితులఁజేయుపొంటెఁ గల వేరము పెంచుచునుంద్రు. కాన నీ

ద్విజుఁడు ద్విజుండనైన నను ద్వేషమునం గనఁబోలు భాస్కరా!

మ|| తనుభావేశ్వరుఁడౌచు లాభముననే తానుండుచు౯ నాకుఁ ద

త్తను సౌఖ్యాదికలాభ మీక తనువే తార్మారు గావించెడి౯.

తనుజాతాంతరలాభకృత్త్వ మొకమేల్ తప్ప౯ విచారింఓ నీ

తనికావించిన వేఱుమేలు గలదే తథ్యంబుగా భాస్కరా! ౨౦౦

ఉ|| కాలికి నొప్పిగూర్చె. అది కాల్కదలింపకయుంచనేర్చె. సు

శ్రీలవిధంబు మార్చె. జ్వరశేషము వీడనిలా గొనర్చె. పా

పాలకు నెల్ల భైరవుఁడు భార్గవుఁడన్నను. అట్టి క్రూరుఁ దా

మేలొ శుభగ్రహంబుగను నెంచెడి జ్యౌతిషికాళి భాస్కరా!

మ|| స్వదశారంభమునుండి యీతఁ డిటులే సౌఖ్యంబు వోకార్చి క

ష్టదశల్ తారుచుచున్నవాఁడు. గడచె౯ సంవత్సరద్వంద్వమా

కుదశ౯. వత్సర మింకనున్నయదియు౯. కోణుండు త్వత్సూనుఁడే

విదశానాథుఁడు ప్రస్తుతంబు. శుభము౯ వేకూర్పవే భాస్కరా!
30
చం|| గ్రహపతివౌట నీదునుడి కాదనఁడాతఁడు. తండ్రి వింక. తా

సహితము యోగకారుఁడుగ శాస్త్రవిదీరితుఁ డట్లుగాన నా

కు హితముసేయుపొంటె ననుకూలము కాలము. వేగఁ బాదరు

గ్రహితునిజేయుమంచుఁ గృప గట్టిగఁ బట్టికిఁ జెప్పు భాస్కరా!

ఉ|| గ్రుడ్డిదియైనయెద్దు ససికోయనిచేనునఁ బడ్డరీతి నీ

గ్రుడ్డియు నేగుచుండె. ననుఁ గుందఁగఁ జేయుచునుండె. కాన మా

ఱొడ్డి మదీయపాదరుజ యోజ నశింపఁగఁజేయుమయ్య నీ

బిడ్డకుఁజెప్పి యీ విదశ. ప్రేముడిఁ జూపఁ గదయ్య భాస్కరా!

మ|| పగవాఁడైనను నీదుక్షేత్రమగు నా పంచాస్యమందేకదా

సగముంజచ్చివసించుచుండెఁ గవి తా. సంబోధ్యమానుండుగా

మొగమీయంగలఁ డప్డెనీకు. కనుక౯ బోధించి యెట్లేని నీ

విఁగ నన్నేఁచకయుండఁజేయఁగదవే యేంరొక్కెద౯ భాస్కరా!

మ|| మునుపే ముక్కిడి పైని దగ్గుపడిసెమ్ముం గల్గెనన్నట్లు నా

ఘనపద్వ్యాధికిఁదోడు ప్రస్తుతమునం గల్గె౯ శిరోవ్యాధి. నె

మ్మనము౯ నీపయిఁజేర్చి సంతతమునుం బద్యంబులంజెప్పు చీ

పెనువ్యాధిం గొనితెచ్చుకొంటి నెపుడుం బీడంప న౯ భాస్కరా!

ఉ|| అద్దమరేయియైనను రవంతయు నూఱటఁ జెంద దింతయు౯

నిద్దురపట్టనీదు మది. నిద్ర యొకించుక పట్టినం గల౯

పద్దెముల౯ రచించుపని మానదు. వేసర దించుకేని. నా

హృద్దశ యిట్టులున్నయది. ఏమగునో యిఁక దీన భాస్కరా! ౨౦౭

ఉ|| పంచదశాబ్దమందె ననుఁ బట్టెఁ గవిత్వపుభూత. మెంతయు౯

సంచలనంబుగూరిచె మనంబున. కార్యులు మెచ్చునట్లు వ్రా

యించెను బెద్దగ్రంతహ్ములె. ఎన్నడెఱుంగ శిరోభరంబు. ని

న్నెంచిరచించుపదూముల నిట్లుఘటిల్లె నదేమొ భాస్కరా! ౨౦౮

శా|| తానంబుం బొనరించుపట్ల మఱి సంధ్యావందనప్రక్రియ౯

బోనంబుం దినువేళఁ బండుకొనినప్డు౯ శౌచవిధ్యాదుల౯

దాన౯ దీన ననంగనేల యెపుడుం ద్వత్పద్యసంధానమే

ధ్యానంబైనది నాకు. ఏమియగునో తర్వాత నో భాస్కరా! ౨౦౯