Jump to content

ఆధునిక రాజ్యాంగ సంస్థలు/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

రెండవ ప్రకరణము.

రాజ్యాంగ విధానపు చట్టము

1

ఆధునిక ప్రపంచమందు అనేకవిధములగు రాజ్యాంగ విధానములుకలవు. ఇప్పటికిని కొన్ని దేశములు నిరంకుశ

సవరణచేయు
మార్గములు,

పాలనమునకు లోనైయున్నవి. ఆఫ్‌ఘనిస్థానము, భారత దేశపు స్వదేశసంస్థానములు, అబిస్సీసియా, బల్గేరియా, ఇటలీ, దక్షిణ అమెరికా ఖండమందలి తాష్ట్రములు యిట్టి రాజ్యపాలనమును బొందియున్నవి. కాని యట్టి రాజ్యాంగవిధానము సక్రమమైనది కాదనియు, ప్రజాసామాన్యమునకు లాభకరము కాదనియు, దేశాభివృద్ధికారకము కాదనియు రాజకీయజ్ఞులం దెక్కువమంది యొక్కయభిప్రాయమైయున్నది. అప్పటికెప్పుడో శ్రీ అరిస్టాటిలుగారే యీరాజ్యాంగపుపద్ధతి శాశ్వతముగాజాలదని ఆ కాలపుటనుభవముబట్టియే నిర్ధారణ జేసియుండెను. ఇప్పటివరకు కల్గిన చరిత్రానుభవముబట్టియు ఈపద్ధతిశాశ్వతముకాదనియు, అభిలషణీయము కాదనియు నిరూపణయగుచున్నది.

అల్పసంఖ్యాకులకే చెందిన రాజ్యాధికారమును సాధ్యపరచు రాజ్యాంగముకూడ తాత్కాలికమైనదనియు, దేశారిష్టదాయకమనియు, అశాంతికి కారకమనియు, ప్రజాసామా న్యపుక్షీణతను కల్గించుననియు చరిత్రతెల్పుచున్నది. రోమను సెనటరులు తమస్వార్థపరత్వము, సంకుచిత స్వభావములవల్ల చక్రవర్తుల నిరంకుశపాలనమును దెచ్చిపెట్టిరి. ఇంగ్లాండు నందు, ప్రభువులు (సామంతభూస్వాములు) ప్రజలహింసించి, తుదకు, ప్రజాందోళనమునకు తలయొగ్గిరి. ఫ్రాన్సునందు, రషియాయందు ప్రభువులు (సామంతభూస్వాములు) తమ చక్రవర్తులతోబాటు అధ:పతితులై విప్లవములకు దారిదీసిరి. మనదేశమునందు తమవక్రమార్గములచేతను, అప్యక్తవ్యవహారములవలన, మహమ్మదీయుల రాజ్యపాలనము దెచ్చిపెట్టిరి.

తుదకు ప్రజాస్వామిక రాజ్యాంగమే ప్రజలకు శరణ్యమగుచున్నది. దాదాపు అన్నిముఖ్యదేశములందును ఇప్పటికి ప్రజాస్వామిక రాజ్యాంగమేస్థాపితమైనది. ఐతే పురాతన కాలమునుండి వచ్చియున్న నిరంకుశ రాజ్యమేలిన రాజవంశకులు, సామంతభూస్వాములుగా నున్నవారు, కొన్నికొన్ని రాజ్యాంగములం దిప్పటికిని కొంతవరకు రాజ్యాంగాధికారమును పొందియున్నారు. ఇంగ్లాండునందు ఐదవజార్జిప్రభు నిప్పటికిని రాజ్యాంగమునందు ప్రధానాధికారిగానున్నాడు. బ్రిటిషువారి అధినివేశపురాజ్యములందింకను అతని ప్రతినిధులే ప్రధానాధికారులుగా వ్యవహరించుచున్నారు. ఇంగ్లాండునం దిప్పటికి కొలదిగా శాసననిర్మాణాధికారముకల్గిన ప్రభువులసభ యందు భూస్వాములు వంశపారంపర్యాయతాసభ్యత్వముల బొందియున్నారు. ఇటులనే జపానునందు చక్రవర్తి యొకరుకలరు. ప్రభువుల సభయందు భూస్వాములు శాశ్వతపు సభ్యత్వముల కల్గియున్నారు.సయామునందు రాజు, పర్షియాయందు షా, ఇటలీయందు రాజు కలరు. కాని పురాతన కాలపు రాజ్యాంగముల లాంఛనము లిప్పటికి నీరీతిగా కొన్ని రాజ్యాంగములందు మిగిలియున్నను వెనుకటి కాలమందు వీనికి గల ప్రాముఖ్యత యిప్పుడు లేదు.

ఏదేశమున కెట్టి రాజ్యాంగవిధానముకలదో దెల్పుటకు, రాజ్యాంగవిధానపు చట్టమొకటి స్థిరపరచుట యీదినములందు వాడుకయైనది. కాని, రాజ్యాంగవిధానపు చట్టములనేర్పరచుట ఆదిమకాలపు గ్రీసుదేశపురాజ్యములకుకూడ తెలిసియుండెను. ఏథెన్సునగరరాజ్యమునకుమూడు మారులు రాజ్యాంగవిధానపు చట్టములేర్పడెను. కాని, పురాతనపు హిందూదేశమునందువలెనే, రోమనుప్రజాస్వామిక రాజ్యమందును, రాజ్యాంగ విధానస్వరూపము ఆకాలపు ఆచారముల వలనను, కట్టుదిట్టములవలనను, పవిత్రముగా పరిగణింపబడుచుండిన కొన్ని శాసనములవలనను మాత్రము నిర్ణీతమగుచుండెనేకాని చట్టరూపము పొందలేదు. మనసూత్రకాలమందలి రాజ్యమునందు, భారతయుద్ధకాలము వరకుండిన రాజ్యము లందును ఋషిప్రోక్తములగు ధర్మసూత్రసముదాయమే రాజ్యాంగవిధానముగా యుపయోగపడుచుండెను.

ఇదే విధముగా ఇంగ్లండునందును రాజ్యాంగవిధానపు చట్టమనునది యొకటి లేదు. క్రీ. శ. 1215 వ సంవత్సరము నందేర్పడిన రాజకీయ యొడంబడిక "Magna Charta" ప్రకారము కొన్నిలక్షణములు క్రీ. శ. 1589 వ సంవత్సరమున అంగీకరింపబడిన "ప్రజాస్వత్వముల" చట్టముప్రకారము మరికొన్ని లక్షణములు క్రీ. శ. 1832, 1867, 1872, 1885, 1914, 1918, 1928 సంవత్సరములం దేర్పఱచబడిన శాసనములద్వారా మరికొన్ని లక్షణములు నిరూపింపబడినవి. కాని వీనియన్నిటి జేర్చినను ఇప్పుడమలునందున్న ఇంగ్లాండుయొక్క రాజ్యాంగవిధానపు సంపూర్ణస్వరూపము కానరాదు. ఎన్నో యాచారములవలన, ఎన్నో న్యాయమూర్తులతీర్పులమూలమున, ఎన్నో పార్లమెంటుశాసనములద్వారా వివిధగతుల కొంచెము, కొంచెముగా ఇంగ్లీషువారి రాజ్యాంగవిధానము తన రూపును బహిర్గత మొనర్చుచున్నది. చారిత్రక కారణముల వలన, ఇంగ్లీషుప్రజల ప్రత్యేకావసరముల ననుసరించి మరితర బాధ్యతాయుతరాజ్యాంగవిధానముల యనుభవము బొందుటకు సాధ్యముకాని దినములందు వారి రాజ్యాంగ విధానము పెరుగవలసివచ్చెను. కనుక దానిని యిదమిద్ధమని తేల్చి చూపెట్టుటకు చట్టమొకటి నిర్మింపబడదాయెను. రాజ్యాంగవిధానపు చట్టమేమియు లేకుండా మరియేయితర ప్రాముఖ్యమగు దేశము కాని, ప్రజాస్వామిక రాజ్యాంగము పొందినది కానరాదు.

రాజ్యాంగ విధానపుచట్టము, ఆధునిక యుగమందు ప్రప్రథమమున, ప్రపంచదృష్టి నాకర్షించురీతి క్రీ. శ. 1781 నందు, అమెరికాయందేర్పఱచబడినది. ఆచట్టముప్రకారము, ఇంగ్లీషువారి రాజ్యాధికారమునుండి విడివడి, తమస్వతంత్రత నిల్పుకొనుటకై అమెరికారాష్ట్రములు, తాత్కాలిక సమ్మేళన మేర్పరచుకొనుచూ, చట్టము నంగీకరించినవి. తుదకు తమస్వతంత్రత నిలబెట్టుకొని ఇంగ్లీషువారి నోడించినపిమ్మట ఇప్పటికిని అమలునందున్న రాజ్యాంగవిధానమ్ము చట్టమును క్రీ. శ. 1789 వ సంవత్సరమున "నేషనల్ -------" వారంగీకరించి అమలునందు బెట్టిరి. అంతకుముందే వివిధరాష్ట్రములందు ఇట్టిచట్టములు అమలునందున్నమాట నిజమేకాని పిమ్మట, ఫ్రాన్సుదేశమందు విప్లవము జరిగినతరువాత రాజ్యవిధానపుచట్టమొక్కటి నిర్మింపబడెను. విప్లవరాజ్యానంతరము పదునెనిమిదవ లూయీప్రభువుగారొక చట్టమును క్రీ. శ. 1814 నందును, శ్రీలూయీఫిలిప్పుగారొక చట్టమును క్రీ. శ. 1830 యందును నిర్మించిరి. కాని, యిప్పటికిమలునందున్న ఫ్రెంచివారి రాజ్యాంగ విధానము నిర్ణయించుట కే యొక్కచట్టమునుప్రత్యేకముగ లేదు. క్రీ. శ. 1874 వ సంవత్స రమందంగీకరీంపబడిన మూడుచట్టములు ఆరాజ్యాంగవిధానమునకు ప్రాతిపదికలని మాత్రము చెప్పవచ్చును. పిమ్మట, అవసరముబట్టి యేర్పడిన సవరణలుకూడా జేర్చబడుచో రాజ్యాంగవిధాన మిదమిద్ధమని చెప్ప సాహసింపవచ్చునేమో కాని, రాజ్యాంగవిధానపు చట్టమియ్యదియను నిర్ణయముమాత్రము సాధ్యముకాదు.

ప్రసిద్ధిబొందిన స్విట్జర్లాండునకు క్రీ. శ. 1815 నందు చట్టమొకటి సృష్టించబడినది. ఇటలీదేశమునకు 1848 లోను, జర్మనీసామ్రాజ్యమునకు 1871 యందు, యుద్ధానంతరము బాల్కనురాష్ట్రములకు జర్మనీదేశమునకు రాజ్యాంగవిధానపు చట్టములు ప్రసాదించబడెను. జపానుకు 1890 నందు, చైనాకు 191- నందు చట్టములు సవరించబడెను. మన దేశమునకు 1908 లో నొక్కటి, 1919 లో మరొక్కటిరాజ్యాంగ విధానపుచట్టము లేర్పరుపబడెను. త్వరలో మరొక్కటిరానై యున్నది.

అవసరము కల్గునప్పుడెల్ల కాలగతిననుసరించి ప్రజాభిప్రాయమున కనుకూలముగా నీచట్టమును సవరణజేయు టగత్యము. కానిచో, ఎప్పుడో ప్రజాప్రతినిధులెల్లరుజేరి తమదేశమునకు తమకాలావసరములబట్టి యెట్టి రాజ్యాంగ విధానము అవసరముగా, లాభకరముగా నుండునో అద్దానిని నిర్ణయించుకొనుచో కాలావసరములుమారి ప్రజల ఆచార వ్యవహారములు, జీవితవిధానము మార్పుజెందినపిమ్మట ఆచట్టము నిరుపయోగమగుటయే కాక, బాధాకరమై అభివృద్ధినాపి జాతినినాశనకరము గావచ్చును. ఋషిప్రోక్తములగు ధర్మసూత్రములు అతిపవిత్రమైవని మన పూర్వులేకాక గ్రీసు, రోమనుదేశస్థులును నమ్మియుండిరి. కాని మనదేశమందు వానిని మార్చుట దుస్తరమగుచుండెను. గ్రీసునందు రాజ్యాంగవిధానపు చట్టమునందు మార్పులు జేయవలెనని సూచించు నాయకులు ప్రజలచే రాజ్యాంగవిద్రోహులని ధూషించబడుటకుకూడ తయారైననే సవరణల ప్రతిపాదించి పౌరసభవారిచే ఆమోదింపజేయుటకు సాధ్యమగుచుండెను. ఇందువలన సనాతన భారతదేశపు రాజ్యాంగవిధానము కాల పరిణామముల ననుసరించి తగురీతి మార్పు బొందకుండుట వలన తుదకు మనప్రజలు దానిమఱచి తమకుతోచినరీతి రాజ్యము సాగించుకొనజొచ్చిరి. రోమనురాజ్యమందును, గ్రీసు యొక్క నగరరాజ్యములందును ఒకప్పుడు కాకపోయిన మరొకప్పుడైన సవరణలు చేయుటకు సాధ్యమగుచుండెను.

కాన రాజ్యాంగవిధానపు చట్టముల నేర్పరచుచో వానిని సవరించుట దుస్సాధ్యమేమోయని కొందరు సందేహించిరిగాని, అట్టిసందేహమునకు తావులేదని ఈ కాలపు రాజ్యాంగపు చట్టముల జూచినవారికి తెలియగలదు. రాజ్యాంగవిధానమును నిరూపించుటకొక చట్టము లేకున్ననే ఆవిధాన మును చులకనగా మార్పుజేయుచుండుట కడుంగడు సులభమనియు, చట్టమేర్పడినచో అత్యంత కష్టసాధ్యమనియు కొందరు పొరపాటభిప్రాయము నందుచున్నారు. ఇంగ్లండుదేశపు రాజ్యాంగవిధానమునకు చట్టమొక్కటి లేకున్నను దానివలన యేర్పడిన ప్రభువులసభను సంస్కరించుట కెన్నో వత్సరములు పట్టెను. ఇప్పటికొక శతాబ్దమునుండి ఈసభాసభ్యులెల్లరు ఇప్పటివలె జీవితాంతమువరకు వంశపారంపర్యాయ హక్కుతోసహా సభ్యత్వము బొందుటకుమారు ఎన్నుకొనబడునట్లు చేయవలెనని యెన్నోప్రయత్నములు జరిగెను. కాని యిప్పటివర కవి అపజయమందుచున్నవి. రాజ్యాంగ విధానపు చట్టము బొందియున్న ఇటలీదేశమందె సవరణ యగత్యము లేకయె శ్రీముస్సోలీనీగారి నిరంకుశపాలనమేర్పరుపబడినది. కనుక రాజ్యాంగవిధానముల సంస్కరణ సౌలభ్యత వాని స్వరూపములపై యాధారపడి యుండదు.

కొన్ని రాజ్యాంగవిధానముల మార్చుట కడుంగడు సులభము. మరికొన్నిమార్చుట కష్టతరము. సమావేశమందున్న పార్లమెంటుసభ్యులు అధిక సంఖ్యాకముగా ఏదేనొక్క రాజ్యాంగవిధానపు సంస్కరణ నపేక్షించుచో అద్దాని నంగీకరింపగల్గు శక్తి వారికున్నయెడల అట్టి రాజ్యాంగవిధానమును "మెత్తనిదని" (flexible) చెప్పెదరు. సాధారణముగా శాసనముల నిర్మించు పద్ధతినిగాక ప్రత్యేక పద్ధతి ననుసరించి రాజ్యాంగ విధానమును సవరణచేయుట సాధ్యమగుచో అట్టివిధానము "పెళుసు" (Rigid) పొందినదందురు. ఇంగ్లాండు దేశముయొక్కయు, ఇటలీ దేశము యొక్కయు, న్యూజీలాండు యొక్కయు, ఫిన్ లాండు యొక్కయు రాజ్యాంగవిధానములు ప్రధమతరగతికి జెందినవి. ఫ్రాన్సు, అమెరికా, స్విట్జర్లాండు, కెనడా, ఆస్ట్రేలియా, ఐరిషుఫ్రీస్టేటు దేశముల రాజ్యాంగ విధానములు రెండవతరగతికి జెందినవి.

ఇంగ్లాండునందిప్పటివరకు సాధారణముగానుండు శాసనముల పార్లమెంటు యెట్లు నిర్మించుచున్నదో అటులనే రాజ్యాంగ

1. ఇంగ్లాండు
యొక్క
రాజ్యాంగము.

విధానమునందలి మార్పులనుకూడ గల్గించుచున్నది. అట్టిమార్పుల జేయుటకు ముందుకాని, పిమ్మటకాని ప్రజాభిప్రాయము కన్గొనుటకై "రిఫరెండము" నేర్పరచుట కగత్యము లేదు. ఆమార్పుల నంగీకరించుటకు సాధారణ పరిస్థితులం దెట్లు అధికసంఖ్యాకుల కుమ్మక్కి యవసరమో అటులనే తప్ప అంతకుమించిన ప్రత్యేక ఆమోదప్రదర్శన మగత్యము లేదు. ఏది శాసనము, ఎయ్యది రాజ్యాంగవిధానము నేమార్పు జేయు సవరణ, యను విచక్షణ ప్రత్యేకముగా పార్లమెంటుచేయ నక్కరలేదు. ఇందువలననే రాజ్యాంగాధికారము భూస్వాముల నుండి పట్టణవాసులకు, పిమ్మట కార్మికులకు, అంతట యుక్తవయస్కులగు పురుషులెల్లరకు, యుద్ధానంతరము యుక్తవయ స్కులగు స్త్రీపురుషులెల్లరకు ప్రసాదించుట కేర్పరుపబడిన శాసనములన్నియు సాధారణ పద్ధతుల ననుసరించియే పార్లమెంటు అంగీకరించియున్నది. రాజుయొక్క పెత్తనమును సంకుచితపఱచచూ ప్రజలయొక్కయు, పార్లమెంటుయొక్కయు హక్కుల నిద్ధారణజేయు 1689 వ సంవత్సరపు శాసనమును; ప్రభువులసభకు అప్పటివరకు కామన్సు సభవారితోపాటు సమానముగాయుండిన శాసననిర్మాణాధికారమును తగ్గించిన 1911 వ సంవత్సరపు శాసనమును; పార్లమెంటుచే సాధారణ శాసనములవలెనే నిర్మింపబడినవి. ఇటుల సవరణలను కాలానుగుణముగా జేయుటకు సంపూర్ణ సౌలభ్యతను ఇంగ్లీషువారి రాజ్యాంగవిధానము సాధ్యపరచుచున్నది.

న్యూజీలాండుయొక్క రాజ్యాంగవిధానము కూడ యీవిధముగనే, సాధారణ శాసననిర్మాణపద్ధతుల ననుసరించియే, శాసనసభాసభ్యులు తలచుకొనుచో అతిసులభముగా, ప్రత్యేకపు టేర్పాటులేమి యగత్యము లేకనే, సవరింపబడుటకు అవకాశముకలదు. క్రీ. శ. 1852 సంవత్సరమందు బ్రిటిషుపార్లమెంటువారిచే నిర్మింపబడిన శాసనము ప్రకార మీదేశపు రాజ్యాంగవిధానము యేర్పడెను. అప్పటికి అమలునందున్న రాష్ట్రీయప్రభుత్వములు, వానిశాసనసభలు, ఈ చట్టము ననుసరించియే తమ కార్యములనడపు చుండెను. ఈచట్టమునందే, న్యూజీలాండుదేశపు కేంద్రశాసనసభకు రాజ్యాంగవిధానమును సవరణజేయుట కధికారము ప్రసాదించబడెను. ఈయధికారరీత్యా 1876 వ సంవత్సరమందు రాష్ట్రీయరాజ్యముల నెత్తివేసి, న్యూజిలాండుకు కంతకొకేరాజ్యము నేర్పరచుచూ, ఆదేశపు శాసనసభవారు శాసించిరి. ఈవిధముగా న్యూజీలాండుదేశపు "ప్రతినిధిసభ" వారు బ్రిటిషువారి పార్లమెంటువలెనే రాజ్యాంగవిధానమును మార్పుజేయుటకు సంపూర్ణధికారమును పొందియున్నారు.

ఇటలీసంగతి ప్రత్యేకముగా చెప్ప నగత్యమే కానరాదు. ఆదేశపు రాజ్యాంగవిధానమును, సాధారణశాసనము ద్వారా

2. ఇటలీ.

'శాసనసభ' వారు మార్చివేయవచ్చును. రాజ్యాంగవిధానపు చట్టముయొక్క ప్రధమ నియమముప్రకారము, రోమను కాధలిక్కుమతమే రాజ్యాంగపుమతమైయుండ, దానికి వ్యతిరేకముగా అనేక మార్పుల కల్గించుచూ, పార్లమెంటు శాసనముల నిర్మించెను. నిరంకుశాధికారము స్థాపించిన శ్రీముస్సోలినీగారి పెత్తనము వారిచే నిరూపింపబడిన నూతన రాజ్యాంగ విధానము ఫార్లమెంటుయొక్క సాధారణశాసనములద్వారా యేర్పరుప బడినవి.

"పెళుసుదనము" గానుండు రాజ్యాంగ విధానములగురించి క్లుప్తముగా విచారింతము. ఇట్టి రాజ్యాంగవిధానముల మార్చుటకు ఈక్రింద పేర్కొనబడిన నాల్గుపద్ధతులలో, ఏ యొకటి, లేక, రెండు, లేక మూడుమార్గములగా నైన, ఈతరగతియందు జేరు రాజ్యాంగ విధానములు మార్పు జెందవచ్చును:- (1) కొన్ని ప్రత్యేకనియమముల ననుసరించి, ఇప్పటి పార్లమెంటు ద్వారానే సవరణచేయబడవచ్చును. (ఫ్రాన్సు) - (2) ప్రజలయొక్క అభిప్రాయమును "రిఫరెండము" ద్వారా కనుగొనుటచేత (జర్మనీ, స్విట్జర్లాండు, ఆస్ట్రేలియా, ఐర్లాండు) - (3) సమ్మేళనమందు జేరిన సభ్యరాష్ట్రములం దధిక సంఖ్యాకము లంగీకరించినచో (అమెరికా, జర్మనీ) - (4) ప్రత్యేకముగా సవరణ చర్చించుటకై యేర్పడు "కన్వెన్షను" ద్వారా (అమెరికా), ప్రధమ పద్ధతికి జెందిన దేశములలో కొన్నిటి యందు (బెల్జియము, రుమేనియా, జర్మనీ) సవరణబిల్లును ప్రతిపాదించుటకు నిర్ణీతమగు సభ్యులు ముందుగా ఆమోదించవలెననియు, అంగీకరింపబడుటకు నిర్ణీతమగు (సాధారణముగా నాల్గింట మూడులేక, మూడింట రెండువంతులు) మెజారిటీ యుండవలెననియు యేర్పాటుకలదు. ఇందుకుతోడు, అట్టి బిల్లు అంగీకరింపబడిన పిమ్మట, శాసనసభను అంత మొందించి తిరిగి ఎన్నికలనుబెట్టి, అట్టి సవరణచట్టముపై ప్రజల యభిప్రాయము కన్గొనుటకూడ కొన్నిదేశములందు (నార్వే, స్వీడను) కలదు. ఇంగ్లాండునందైనను, ప్రాముఖ్యమగు రాజ్యాంగ విధాన సవరణ బిల్లును సాధారణముగా పార్లమెంటు నూతన ముగా ఎన్నుకొనబడినపిమ్మట, ఎన్నికలయం దట్టి సవరణపై ప్రజలకు చర్చుంచుట కవకాశమిచ్చినపిమ్మటనే, పార్లమెంటుయందు ప్రవేశపెట్టుట కలదు. మరొకవిధముగా 'శాసనసభ' యే రాజ్యాంగవిధానమును సవరణచేయుట కలదు. ఫ్రాన్సు, దక్షిణాఫ్రికాలయందువలె, రెండుశాసనసభలవారు కలసి సమావేశమై అధికసంఖ్యాకుల సమ్మతిపై నట్టి సవరణ బిల్లు నంగూకరింపవచ్చును.

శ్రీ రూస్సోమహాశయుని శిష్యులగు శ్రీ దాంతే, మిరాబో రాబెస్సెరీ, లఫాయతు ఆదిగాగల విప్లవనాయకులు ప్రధమరాజ్యాంగ

3. ఫ్రెంచివారి
రాజ్యాంగ
విధానము.

విధానపు చట్టమును నిర్మించిరికాని, విప్లవముతో నయ్యదియు అంతమొందెను. మూడవ నెపోలియను చక్రవర్తి, జర్మను వారిపై యుద్ధమునకు వెడలి అపజయమంది పదభ్రష్టుడై పారిపోయినప్పుడు, ఫ్రాన్సు దేశము జర్మనుదేశమునకు పూర్తిగా లొంగిపోయియుండెను. తిరిగి దేశమునకు ప్రాణముపోసి జర్మనువారి యాధిపత్యమును బోగొట్టుకొని దేశమునందు ఏదో యొక విధముగా శాంతినెలకొల్పుటకై శ్రీధియార్చ మహాశయుడు 1871 సంవత్సరమున "నేషనల్ అస్సెంబ్లీ"ని సమావేశపరచెను. ఆ అస్సెంబ్లీద్వారా నాల్గు వత్సరముల పర్యంతము ప్రభుత్వమును నడపి, తుదకు 1875 నందు మూడు రాజ్యాంగవిధానపు చట్టములను అస్సెంబ్లీచే నిర్మింపజేసెను. ఆసమయమందు కొన్నిపక్షములవారు తిరిగి పురాతన రాజవంశీయులగు బూర్బనువారి రాజ్యమేర్పరచ వలెననియు, మరికొందరు నెపోలియను వంశీయుల గద్దెపైనెక్కించ వలెననియు, మిగతా వారురిపబ్లికు నేర్పరచవలెననియు ఉత్సాహులైయుండిరి. అందరు తాత్కాలికావసరములకొరకే ఈ మూడుచట్టముల నంగీకరించిరి. తుదకు ఆరాజ్యాంగ విధానమే శాశ్వతమైనది. అప్పటి పార్టీలవారు ఎప్పుడు తమకు వీలుకల్గిన అప్పుడు తిరిగి తమకిష్టమగు రాజును దెచ్చుకొనుటకు వీలగుటకై రాజ్యాంగవిధానమును సవరణచేయుటకు సులభమార్గము నేర్పరచిరి. శాసనసభలు రెండును (డెప్యూటీలసభ, సెనెటుసభ) వర్సైల్సు పట్టణమందు సమావేశమై అధిక సంఖ్యాకులగు సభ్యుల యామోదముపై రాజ్యాంగ విధానమునందు సవరణల జేయవచ్చుననిరి. కాని 1884 వ సంవత్సరమున అంగీకరింపబడిన సవరణప్రకారము రిపబ్లికును మార్చుటకు వీలు లేకుండ జేయబడినది.

పోలాండు కడుంగడు పురాతనమగు దేశము. క్రీ. శ. 1791 పూర్వము ఎన్నుకొనబడిన రాజుల పాలనము సాగుచుండెను.

4. పోలాండు
రాజ్యాంగము

ఆసంవత్సరమున రాజ్యము వంశ పారంపర్యాయమగు హక్కుకలరాజులపాలాయెను. పిదప రషియా, జర్మనీ, ఆస్ట్రేలియా రాజ్యముల మధ్య పంచబడి బానిసత్వము ననుభవింపవలసి వచ్చెను. తుదకు యుద్ధానంతరము స్వాతంత్ర్యముపొంది 1920 వ సంవత్సరమున రిపబ్లికుగా నేర్పడి రాజ్యాంగవిధానపు చట్టమును నిర్మించుకొనెను. ఈచట్టముప్రకారము ప్రజాస్వామిక మేర్పరచబడినది. బాధ్యతాయుత ప్రభుత్వము స్థాపించబడెను.

ఈరాజ్యాంగపు చట్టమందే ప్రతీ ఇరువదియైదు సంవత్సరముల కొకమారు రాజ్యాంగ విధానమును సవరించుటకు ప్రయత్నము చేయనగునని ఖండితముగా తెలుపబడియున్నది. సవరణ ప్రతిపాదించుచూ ప్రజాప్రతినిధి సభా సభ్యులలో నాల్గవవంతు మంది దరఖాస్తుపెట్టవలెను. పిమ్మట సెనెటు, ప్రజాప్రతినిధి సభలయందలి సభ్యులలో మూడింట రెండువంతులు మంది అంగీకరించినచో, నాసవరణచట్టముగా ప్రకటింపబడును. ఏలనో 'రిఫరెండము' ఈ రాజ్యాంగ నిర్మాతలు తలపెట్టరైరి. దురదృష్టవశాత్తు ఇప్పటికారు వత్సరములక్రిందటనే పిల్ సూడ్స్కిగారి నిరంకుశాధిపత్యముక్రింద కీదేశము వచ్చినది. ఒకవైపు జర్మనులు, మరొకవైపు రషియనులు పెట్టు రాజకీయ నిర్భంధములకు ప్రజాస్వామిక రాజ్యాంగము తాళజాలదాయెను. తిరిగి యెప్పటికి బాధ్యతాయుత ప్రభుత్వసంస్థలు స్వతంత్రించి వ్యవహరింపగలవో?

యుద్ధమునకు పూర్వము అమలునందున్న సామ్రాజ్యపు రాజ్యాంగవిధాన చట్టమును సవరించుట కడుంగడు

5. జర్మను రాజ్యాంగ
విధానము.

దుస్తరమాయెను. ఏసవరణనైనను పదునల్గురు బందెస్రాతు (రెండవశాసనసభ) సభ్యులెదిరించిన అయ్యది నిరర్ధకమగు చుండెను. ప్రషియా రాష్ట్రమునకే పదునేడుగుర సభ్యత్వము "బందెస్రాతు" నందుండుటచే దానికి అంగీకృతముకాని సవరణలు ఉపసంహ రింపబడవలసినదే! అటులనే తదితర సభ్యరాష్ట్రముల కయిష్టమగు సవరణలును నిరర్ధకములయ్యెడివి. ఆచట్టము ప్రకారము ప్రజాప్రతినిధి సభయగు "రైష్‌టాగ్" కంటె సభ్యరాష్ట్ర ప్రతినిధులచే నిండియుండిన "బందెస్రాత్" చాల ప్రాముఖ్యత వహించియుండెను.

యుద్ధానంతర మేర్పడిన రిపబ్లికునందు ప్రజాప్రతినిధి సభయగు 'రైష్‌టాగ్‌' అత్యంత ప్రాముఖ్యస్థాన మలంకరించుచున్నది. యుద్ధమునకు ముందు రాజ్యాంగవిధానపు సవరణల చర్చుంచుటకే యీసభవారి కర్హత లేదయ్యెను. కాని యిప్పుడు ఈసభవారి సభ్యులలో మూడింట రెండువంతులు మంది అట్టిసవరణ నంగీకరింపవలెను. పిమ్మట సభ్య రాష్ట్రముల ప్రతినిధులచే కూడు 'రైష్‌రాత్‌' యందలి సభ్యులు సమావేశమైనవారిలో మూడింట రెండువంతులమంది అట్టిసవరణను అంగీకరించ వలయును. ఈ రెండు సభలిట్లు సవరణబిల్లు నంగీకరించినపిమ్మట పౌరులలో పదవవంతు మంది ప్రజాభిప్రాయమునకై దానిని "రిఫరెండము"కు పెట్టవలెనని కోరుచో "రిఫరెండము"నందు వోటరులందదిక సంఖ్యాకులు దానిని అంగీకరించిననే శాసనమగును. వారు నిరాకరించుచో అయ్యది నిర్జీవమగును. సభ్యరాష్ట్రములకు సం బంధించిన "రైష్‌ రాత్" వారట్టి సవరణబిల్లును అంగీకరింపనిచో పక్షముదినములలోగా నాసభవారు "రిఫరెండము"ను ఆబిల్లుపైకోరుచో, అయ్యది ప్రజలముందు వారి అంగీకారానంగీకారములపై పెట్టబడవలయును. ఈవిధముగా రెండు శాసన సభలు నిర్ణీతమగు పద్ధతిప్రకారమంగీకరించుచో సవరణబిల్లు చట్టమగును. కాని దానిని ప్రజలముందు "రిఫరెండము"నకు తెచ్చుటకై ప్రజలకు "రైష్ రాత్" వారికి హక్కుకలదు.

ఆస్ట్రియాసమ్మేళన రాజ్యాంగము 1918 వ సంవత్సరము నందమలునకు వచ్చెను. సమ్మేళనరాజ్యాంగపు అధికారములు

6. ఆస్ట్రియా
సమ్మేళన
రాజ్యాంగము.

పేర్కొనబడెను. మిగతా యధికారములు సభ్యరాష్ట్రములకు చెందుచున్నవి. సమ్మేళన రాజ్యాంగమునకు పూర్తిగాచెందిన యధికారము లేకాక శిస్తులు, వ్యాపారము, సాంఘిక వ్యవహారములందు ప్రభుత్వమునకు కల్గుజోక్యమునను; కార్మికులు, వ్యవసాయము, సివిలు సర్వీసు ఆదిగాగల విషయములందు కేంద్రశాసనసభ వారుశాసనముల నిర్మించుటకును; అవసరమగు కార్యనిర్వాహకతను రాష్ట్రీయ ప్రభుత్వములు నడుపుటకును యేర్పాటు చేయబడినది. జర్మనీయందువలెనే కొన్ని వ్యవహారములందు రాష్ట్రీయ శాసనసభలతోబాటు కేంద్రశాసన సభవారు శాసననిర్మాణము చేయనగును. కేంద్రశాసనసభవారి శాసనములు జర్మనీయందువలెనే పరమప్రామాణ్య మైనవి. వానిని సుప్రీమ్‌కోర్టువారు ధిక్కరించుటకు వీలులేదు. రాజ్యాంగవిధానపు చట్టమును సవరించుటకు శాసనసభయందు సగముమంది సభ్యులైన సమావేశమై వారిలో మూడింట రెండు వంతులు సమ్మతించవలెను. అంత నాసవరణబిల్లును "రిఫరెండము"నకు పెట్టవలెను. వోటులిచ్చినవారిలో మెజారిటీ వారు సుముఖులైనచో ఆసవరణబిల్లు చట్టమునందు జేరును.

కెనడా సమ్మేళనము యొక్క రాజ్యాంగ విధానపు చట్టము 1867 నందు బ్రిటిషు పార్లమెంటుచే నిర్మింపబడినది. అప్పు

7. కెనడా
రాజ్యాంగ
విధానము.

డాసమ్మేళనమందు నాల్గు రాష్ట్రములు చేరెను. ఇప్పటికి తొమ్మిది రాష్ట్రములు చేరినవి. ఈ చట్టమునందు వివిధసభ్య రాష్ట్రముల కొసంగబడిన సభ్యత్వములు నిరూపింపబడినవి. మిగతా రాజ్యాధికారమంతయు సమ్మేళనప్రభుత్వమున కొసంగబడెను. కనుక సభ్య రాష్ట్రముల సంపూర్ణ సమ్మతిలేనిదే వానికొసంగబడిన యధికారములలో దేనినైన మార్పుచేయుటకు సమ్మేళన రాజ్యాంగమున కధికారము లేదు. కాని 1931 సంవత్సరమున బ్రిటిషుపార్లమెంటుచే నిర్మింపబడిన "వెస్టు మినిష్టరు" శాసనము ప్రకారము సమ్మేళన రాజ్యాంగపు విధానమును, కెనడా పార్లమెంటు సాధారణ శాసనముల నిర్మించు ఫక్కిననుసరించియే, సవరణచేయుట కదికారము పొందుచున్నది. తన రాజ్యాంగ విధానమును సవరణ చేసుకొనుటలో మాత్రము కెనడాదేశపు సమ్మేళన రాజ్యాంగము ప్రథమతరగతికి జెందుచున్నను, సభ్యరాష్ట్రములకు ప్రసాదించబడిన యధికారముల తగ్గించుటకు హక్కునొంద లేదు గనుక ఈ రెండవతరగతికిని జెందుచునేయున్నది.

దక్షిణాఫ్రికా రాజ్యాంగమందు నాల్గు రాష్ట్రములు కలవు. వీనిలో రెండు బ్రిటిషు ప్రజలచేతను, మరి రెండు డచ్చివారి

8. దక్షిణాఫ్రికా
రాజ్యాంగ
విధానము.

(బోయరులు) చేతను నింపబడియున్నవి. దక్షిణాఫ్రికా యుద్ధము నందు, డచ్చిప్రజలు బ్రిటిషు ప్రజలతో యుద్ధముచేసి వోడిపోయిరి. పతితులైరిగదా యని వారిని నిరసించక డచ్చివారిని కూడ జేర్చి, దక్షిణాఫ్రికాకు అధినివేశ స్వాతంత్ర్యమును బ్రిటిషుప్రభుత్వము ప్రసాదించుచూ, దక్షిణాఫ్రికాకు రాజ్యాంగ విధానచట్టమును 1909 లో నిర్మించెను. (ఈయుదారకృత్యము గాంచియే మహాత్ముడు బ్రిటిషురాజనీతియందు నమ్మకము పొందెను). ఈచట్టముప్రకారము, అప్పటివరకు సర్వస్వతంత్రత బొంది యుండిన రాష్ట్రములయొక్క రాజ్యాధికారమును చాలవరకు తగ్గించి వానిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమునకు లోబరచిరి. ఈచట్టమునందలి మూడు భాగములుతప్ప మిగతాభాగములన్నిటికిని, అవసరము గల్గినప్పుడు, కేంద్రశాసనసభవారు సాధారణపద్ధతుల ననుసరించి సవరించుట కధికారము ఈచట్ట మొసంగుచున్నది. సవరింపరాని మూడుభాగములీ విధముగా నున్నవి:- ఒకటి - నీగ్రో ప్రజలహక్కులు, రెండు - డచ్చి ప్రజలయొక్కయు, ఇంగ్లీషు ప్రజలయొక్కయు భాషలకు, రాజ్యాంగమందు సమానగౌరవము, ప్రాముఖ్యత నొసంగుట, మూడు - నీగ్రోలకు జెందిన బసోటోలాండు, బెచునాలాండు, స్వాజీలాండు రాష్ట్రముల పాలించుటకు నిర్నీతమైన నియమములు. ఈమూడు భాగములం దేసవరణయైన చేయవలెనన్న, కేంద్ర రాజ్యాంగ మందలి రెండు శాసనసభలొకచో కలసి సమావేశమైనప్పుడు తమసభ్యులందరిలో మూడింట రెండువంతుల మంది అట్టిసవరణ నంగీకరించవలసి యుండును.

జూగోస్లావియా దేశమందు మ్రోటులు, సర్బులు, స్లోవెనులను త్రివిధజాతులు కలవు. వీరికి వేరు వేరు భాషలు కలవు.

9. జూగోస్లావియా
రాజ్యాంగము.

ఒకప్పుడు వీరు ఆస్ట్రియా, రషియా, టర్కీ, జర్మనీ రాజ్యములకు చెందియున్నను, యుద్ధానంతరము తమప్రత్యేక రాజ్యాంగము నేర్పరచుకొనిరి. పేరునకు రాజు నేర్పరచుకొన్నను, బాధ్యతాయుత ప్రభుత్వసంస్థల నేర్పరచిరి.

వీరిరాజ్యాంగవిధానపు చట్టమును సవరించుటకు, మంత్రులసలహాపై రాజునకధికారము కలదు. ప్రజాప్రతినిధి సభవారు ప్రతిపాదించుచో, ఆసవరణ పదింట మూడు వంతుల మందిచే నంగీకరింపబడవలెను. రాజుయొక్క ప్రతిపాదనము పైగాని, సభవారి ప్రతిపాదనముపైగాని, ప్రజాప్రతినిధిసభ యంతమొంది, క్రొత్తసభకు ఎన్నికలుజరిగి అయ్యది సమా వేశముకావలెను. ఈక్రొత్తసభయందును సభ్యులందరిలో సగముమందికిమించి మరొక్కసభ్యుని యామోదముబొందుచో నట్టిసవరణబిల్లు చట్టమగును. పోలాండునందువలెనే, ఈదేశమందును, వివిధభాషల, జాతుల ప్రజలమధ్య సామరస్యము కలుగు కుండుటచేతను, ప్రజలకు రాజకీయవిజ్ఞానము లేక పోవుటచేతను నిరంకుశ రాజ్యమేర్పడినది. ఇచ్చటశ్రీకారులె రాజుగారే నిరంకుశాధికారియైనాడు.

ఈరాజ్యాంగము 1922 వ సంవత్సరమున, ఇంగ్లీషు వారికి ఐరిషు వారికి జరిగిన సంధిపత్ర పర్యవసానముగా యేర్పడినది.

10. ఐరిషు ఫ్రీస్టేటు
యొక్క రాజ్యాంగము.

ఆసంధిపత్రము ద్వారా, దక్షిణ ఐర్లాండు అధినివేశ స్వాతంత్ర్యము బొందినది. క్రీ. శ. 1932 నందు, జరిగిన యెన్నికలలో జయమందిన శ్రీ డీవెలరాగారి, రిపబ్లికను పార్టీవారు బ్రిటిషువారి రాజునకులోబడి యుండరాదని తలంచి రాజభక్తి ప్రమాణమును రద్దుజేయుటకై బిల్లును శాసనసభలచే నంగీకరింప జేయ ప్రయత్నించుచున్నారు. ఈబిల్లు అంగీకరింపబడి, శాసనరూపము దాల్చుచో, బ్రిటిషుసామ్రాజ్యమునుండి, ఐర్లండు విడివడును. ఈరాజ్యాంగ విధానపు సవరణను ప్రథమమున రెండుశాసనసభలు అంగీకరింపవలెను. అంతటది ప్రజలకు 'రిఫరెండము' కై పంపబడవలెను. వారొప్పుకొనుచో నయ్యది శాసనమగును. (వోటరులందు అధిక సంఖ్యాకులుగాని, వోటుచేసిన వారిలో మూడింట రెండువంతులమందిగాని దానినంగీకరింప వలెను). కానియీ "రిఫరెండము" పద్ధతిని 1928 లో తీసివేసిరి. సంధిపత్రమునకు విరుద్ధమగు సవరణ నెద్దానిని ప్రతిపాదింపరాదు. కాని "ప్రమాణనిరాకరణ" బిల్లు సంధిపత్రమునకు విరుద్ధమని వాదించువారు కొందరుకలరు. "రిఫరెండము" తీసి వేయబడినపిమ్మట, ఈదేశపు రాజ్యాంగవిధానము, ప్రథమతరగతి రాజ్యాంగములకే చెందును.

ఆస్ట్రేలియాదేశపు సమ్మేళన రాజ్యాంగము బ్రిటిషు పార్లమెంటుయొక్క 1920 వ సంవత్సరపుచట్టము ప్రకారమేర్పరుప

11. ఆస్ట్రేలియా
రాజ్యాంగము.

బడినది. కొన్ని రాజ్యాధికారముల మాత్రము సమ్మేళన ప్రభుత్వమునకిచ్చి మిగిలిన రాజ్యాంగాధికారమంతయు సభ్య రాష్ట్రములకీ చట్టముప్రసాదించెను. ఈసమ్మేళనమందిప్పుడు ఆరుసభ్య రాష్ట్రములుకలవు. ఈరాజ్యాంగవిథానపు చట్టమును సవరించుటకు సమ్మేళనరాజ్యపు శాసనసభలు రెండును అంగీకరించవలెను. పిమ్మట ప్రజాప్రతినిధిసభకు సభ్యులనెన్నుకొను వోటరులందరు తమ 'రిఫరెండము' ద్వారా తమతమరాష్ట్రములందు తమయిష్టాయిష్టముల నాసవరణపై తెలుపవలసి యున్నను, ఈవిధముగానందరిచే నంగీకరింపబడిననేకాని ఏసవరణయు చట్టభాగముగా పరిగణింపబడదు. ఒక వేళ రెండు శాసనసభలమధ్య భేదాభిప్రాయముగల్గి, ఒక సభవారు వివా దగ్రస్థమగు సవరణబిల్లును నిరాకరించుచో రెండవసభ వారాబిల్లును మూడు నెలలపిమ్మట తిరిగి ఆమోదించిపంపుచో దానిని ప్రతిఘటించు సభవారి సవరణలుగల్పిగాని అవ్వేవియు లేకుండనే కాని గవర్నరుజనరలుగారు 'రిఫరెండము' నకు పెట్తవలెను. అంతనా 'రిఫరెండము'నందు అధికసంఖ్యాకమగు సభ్యరాష్ట్రములందలిప్రజలు వోటరులందరియందును అధిక సంఖ్యాకులు నాబిల్లునంగీకరించుచో అయ్యది చట్టమగును. ఏరాష్ట్రమునకు చెందిన యధికారమును తగ్గించుటకు కాని, రాష్ట్రముయొక్క పరిమితులు మార్చుటకుగాని దానికి కేంద్రశాసనసభలయందు నియమితమైన సభ్యత్వముల తగ్గించుటకుగాని, సవరణబిల్లు యేదైనప్రవేశపెట్టబడుచో, అయ్యది రెండుసభలచేతను, వివిధరాష్ట్రములప్రజల చేతను పైనియమములననుసరించి అంగీకరింపబడుటయే కాక వివాదగ్రస్థమగు రాష్ట్రమందలి వోటర్లలో అధిక సంఖ్యాకులచే కూడ ఆమోదింపబడవలయును.

క్రీ. శ. 1926 వ సంవత్సరమున కేంద్రప్రభుత్వమునకు వర్తక వాణిజ్యములనడపుట కధికాధిపత్యమును కోరుచు యొక సవరణ ప్రజావసరములకు సంబంధించిన వాణిజ్యముల అసాధారణపరిస్థితులందు ప్రభుత్వమే నడపుటకధికారము కోరుచు మరొకసవరణ ప్రతిపాదింపబడెను. కాని, ఈ రెండును శాసనసభలయందు ప్రజలమధ్య మెజారిటీలబొంద జాలక వీగిపోయినవి. ఈవిధముగ నీదేశపు రాజ్యాంగ విధానము సవరించుటకు దుర్ఘటమైయున్నది.

ఇప్పుడు స్విట్జర్లాండునందు అమలునందున్న రాజ్యాంగవిధానపు చట్టము 1874 వ సంవత్సరమందు నిర్మింపబడెను. ఈ

12. స్విట్జర్లాండు
రాజ్యాంగ
విధానము.

సమ్మేళనమందు యిరువది రెండు సభ్య "కాంటను"లు కలవు. వానిలో మూడు రాచకీయ వ్యవహారములకుగాను ఆరుగాపరిగణింపబడుచున్నవి. కాన మొత్తము ఇరువది ఆరు "కాంటను"లుకలవు. సమ్మేళన రాజ్యాంగపు టధికారములు ఆస్ట్రేలియా, అమెరికాలందువలెనే ఇదమిద్ధమని తేల్పబడియున్నవి. మిగిలిన యధికారములన్నియు సభ్య 'కాంటను'లకు చెందియుండును. సమ్మేళన రాజ్యాంగమందు రెండు శాసనసభలు కలవు. రాజ్యాంగవిధానపుచట్టమును సవరించ వలయునన్న సవరణబిల్లును సమ్మేళనరాజ్యపు రెండుశాసనసభలయొక్కయు, వోటుచేయు వోటరులయొక్కయు కాంటనులందలి అధికసంఖ్యాకుల యామోదమును బొందవలయును. అటుల కాక, ఏబది వేలమంది పౌరులు రాజ్యాంగవిధానపు సవరణ యగత్యమని తలంచి తమసవరణను ప్రభుత్వమునకు పంపించినచో దానిని 'రిఫరెండము' నకు ఆప్రభుత్వము తేవలసియుండును. అప్పుడును ఎప్పటివలెనే ఎన్నికయందు పాల్గొనువోటరులం దధిక సంఖ్యాకులును, కాంటనులందు దధిక సంఖ్యయు ఆ సవరణ నంగీక రించవలసి యుండును; లేక, ఆ ఏబదివేల పౌరులు తమకు వాంఛితమగుపద్ధతి ననుసరించి కేంద్రశాసనసభలను, సవరణను తయారుచేసి 'రిఫరెండము'నకు పెట్టమని కోరవచ్చును. అంత శాసనసభలు ఆసవరణసూత్రమును బిల్లురూపముగా తాము పెట్టవలయునా? యని ప్రజాభీష్టము తెలుసుకొనుటకై 'రిఫరెండము'నకుబెట్టి ప్రజలు తమయామోదమును (రెండు మెజారిటీలద్వారా) తెల్పుచో అంతనాసభలు సవరణబిల్లును తయారుచేసి మరల 'రిఫరెండము'నకు దానిని ప్రజలముందు పెట్టవలయును. ఈవిధముగా ప్రజల యిష్టముపై సవరణబిల్లును దెచ్చుటకుకూడ యీదేశమందు వీలుకలదు. ప్రతిరాజ్యాంగ విధానపు బిల్లును శాసనసభలే కాక, సమ్మేళన మందలి పౌరులం దధికసంఖ్యాకులేకాక, సభ్య కాంటనులం దధికసంఖ్యకూడ యామోదించుయవసర మేర్పరచబడినది.

అమెరికా సంయుక్తరాష్ట్ర సమ్మేళన రాజ్యాంగము 1789 వ సంవత్సరమం దమలులోనికివచ్చెను. ప్రథమపదిసవరణలు

13. అమెరికా
సంయుక్త
రాష్ట్రములు..

1791 లోను, పదకొండు, పన్నెండు సవరణలు 1798, 1804 లలోను, నీగ్రో ప్రజలకు సంబంధించిన మూడుసవరణలు 1865, 1868, 1870 సంవత్సరములందును, మిగిలిన నాల్గుసవరణలు 1913 నుండి 1920 సంవత్సరములలోపలను అంగీకరింపబడినవి. అనగా క్రిందటి శతాబ్దమందు అరువది వత్సరముల పర్యంతము ఒక్క సవరణకూడ అంగీకరింపబడలేదు. క్రిందటి 142 సంవత్సరములందు పందొమ్మిది సవరణలు మాత్రమే అంగీకరింపబడెనన్న ఆరాజ్యాంగ విధానమును మార్చుట యెంత దుర్ఘటమగుచున్నదో వేరుగ చెప్పవలెనా? ఈ రాజ్యాంగ విధానమందును, నియమితమగు రాజ్యాధికారములను మాత్రము సమ్మేళన ప్రభుత్వమున కొసంగి, మిగతారాజ్యాధి కారమునంతను సభ్యరాష్ట్రముల కొసంగవలెను. సమ్మేళనమందు జేరినపిమ్మటకూడ తిరిగి విడివడి స్వతంత్రత బొందవలయునని దక్షిణపురాష్ట్రములు 1864, 1868 సంవత్సరములందు ప్రయత్నముచేసి దేశాంతర్గత యుద్ధముదెచ్చి పెట్టెను. కాని శ్రీ ఆబ్రహాములింకను గారినాయకత్వముక్రింద ఉత్తరాదిరాష్ట్రములు సమ్మేళనరక్షణకై సకలప్రయత్నములు జేసి, తుదకు జయమందెను. ఆయుద్ధఫలితముగా, "ఏసభ్య రాష్ట్రమునకు సమ్మేళనమునుండి వెడలిపోవుటకు వీలు లేదు" అనుసవరణ అంగీకరింపబడెను.

రాజ్యాంగవిధానమును సవరించుటకు, ప్రతిపాదనజేయుటకు, 'కాంగ్రెసు' అను రెండుసమ్మేళన రాజ్యపుశాసనసభలు తమసభ్యులందు మూడింట రెండువంతులు మంది అంగీకరింపవలెను. లేదా, సభ్యరాష్ట్రములందు మూడింట రెండువంతులు సవరణ అవసరమని పిటీషనుపెట్టుచో వివిధ రాష్ట్రముల ప్రతినిధులయొక్క 'కన్వె న్షను'ను కాంగ్రెసు సమావేశపరచవలెను. ఇటుల ప్రతిపాదించబడిన సవరణ లను సభ్యరాష్ట్రములందు నాల్గింట మూడువంతులు వానిని అంగీకరించవలెను. ఈవిధముగా నియమముల పాటించి, సవరణలు ప్రతిపాదించి, వానినంగీకరింపజేయుట బ్రహ్మాండమగు కార్యమగుచున్నది. కనుకనే ఇంతకాలమునందు పందొమ్మిదికంటె హెచ్చుసవరణలు అంగీకృతముగా లేదు.

II

ఇంగ్లాండాదిగాగల దేశములందువలె, రాజ్యమునకంతకు మూలాధారమె ప్రజలెల్లరకు పరమప్రామాణమగు రాజ్యాంగ

పౌరసత్వ
హక్కు
బాధ్యతలు.

విధానమును, సాధారణశాసనముల మార్చురీతినే మార్చుటకు పార్లమెంటున కధికారమిచ్చుట, ఈకాలపుప్రజల వైఖరినిబట్టి చూడ ధనికుల, భూస్వాముల నిరంకుశాధికార ప్రేమ గమనించిన, శ్రేయోదాయకముగా గన్పట్టుట లేదు. చాలాకాలమునుండి బాధ్యతాయుత సంస్థలద్వారా రాచకీయవిజ్ఞానముబొంది, వెనుకముందుల గమనించి వ్యవహార మొనర్చు ఇంగ్లీషుప్రజల కిట్టిసంపూర్ణ స్వాతంత్ర్య మొసంగుటవలన, విపరీతపరిస్థితులు కల్గుట లేదుగాని, ప్రజాస్వామిక సంస్థల నడపుటలో హెచ్చుయనుభవము లేక, దాస్యపు బుద్ధిని దూరముచేసికొన లేక, స్వత: రాచకీయరంగమున త్యాగముచేసి విజ్ఞానముబొంద నిచ్చగింపని ఇటాలియను ప్రజలు, తమరాజ్యాంగము నిరంకుశ పాలకుల హస్తగతమ గుచుండ, గ్రుడ్లుమిటకరించి యూరకుండిరి. తుదకు ఇంగ్లాండునందైనను 1919 లోను, 1925 లోను, 1931 లోను, ప్రజలు తమతత్వము తామే యెరుంగక, వేలంవెర్రిగా, ఒకేపార్టీవారి నత్యధిక సంఖ్యాకులుగా యెన్నుకొని తమపై నిరంకుశాధికారపు పెత్తనము దెచ్చిపెట్టుకొని, మూల్గజొచ్చిరి. క్రీ. శ. 1931 లో నిర్మితమగు పార్లమెంటునకు రాజ్యాంగ విధానమునే మార్ప సర్వస్వాతంత్ర్యము, ఏయడ్డంకులు లేకుండ యుండుట ప్రజలకు నష్టదాయకమని వేరుగా చెప్పవలెనా? మంత్రివర్గమునకు చెందిన పార్లమెంటు సభ్యులు పదింట తొమ్మిదిమందియు, ప్రతికక్షికిజెందిన వారు. మిగతాఒక్కరిని పొందియున్నంత కాలము, రాజ్యాంగవిధాన సంస్కరణ న్యాయబద్ధముగ జరుగునని యెవ్వరునమ్మగలరు?

మొత్తముమీద సాధారణశాసనముల నిర్మించుటకంటె రాజ్యాంగవిధానపుచట్టమును సవరించుట కష్టతరమై యుండుట అవసరమేకాని, అమెరికాయందును, ఆస్ట్రేలియా యందును, తుదకు స్విట్జర్లాండునందు నేర్పరుపబడిన ప్రత్యేకపు ఆటంకములుమాత్రము, సక్రమమును అవసరమునగు సవరణలు, ప్రజలచే అంగీకరింపబడకుండునట్లుచేసి, ప్రజల సహజాభివృద్ధి కాటంకకరములుగా నుండుటకుకూడ అభిలషింపదగిన పద్ధతి కాదు. ఈదినములందు సామాన్య శాసనమును నిర్మించుటకే సంస్కారులు, పదివత్సరములపాటు కష్టించవలసివచ్చుచున్నది. అమెరికాపద్ధతుల బట్టిచూడ, రాజ్యాంగవిధానమునందు సవరణజేయింపవలెనన్న, కొన్ని తరములపర్యంతము, సంస్కారులు, అమితమగు బాధలకులోనై, సంస్కరణలకై కృషి చేయవలసియుండును. ఇట్టి కఠినమగు అగ్నిపరీక్షకు తాళుట దుస్తరము. కొందరు సంస్కారులు సక్రమాందోళనమే కూడదని, విప్లవకారులుగా మారవచ్చును. మరికొందరు, ఆశాభంగముచే స్వకార్య తత్పరులు కావచ్చును. తుదకు అమెరికాయందైనట్లే, ప్రజాసామాన్యము రాచకీయపరిణామములయెడ పూర్తిగా యుదాసీనులు కావచ్చును. విప్లవమెంతయనర్ధదాయకమో, ప్రజలు రాచకీయప్రపంచమున నిర్జీవప్రతిమలగుటయు అంత నష్టదాయకమే ! కనుక, రాజ్యాంగవిధానమునకు సంబంధించిన సవరణలు, శాసనసభలచే సాధారణపద్ధతి ననుసరించి కాని, మూడింట రెండువంతులమంది సభ్యులచే కాని, ఆమోదించబడినపిమ్మట, "రిఫరెండము"నందు ప్రజలయందు హెచ్చుమందిచే నంగీకరింపబడుట చాలును. అప్పటికే, అవసరమగు సవరణలు తప్పక వీగిపోవును. అవసరమగు సవరణలు, అంగీకరింపబడుసరికి, ఎన్నో వత్సరముల వయస్సు ప్రజాప్రచురజీవితమందు, ప్రతిబిల్లును పొందియుండును. రాజ్యాంగవిధానముయొక్క సౌష్టవము ఎల్లప్పుడును, అసాధారణ పరిస్థితులం దగత్యమగు సవరణల స్వీకరింపజాలు శక్తి గల్గి, స్వవినాశనకరమగు సవరణలను విప్లవముకల్గింపకయే నిరాకరించు శక్తికల్గి యుండుటయందే గాననగును. అపారమును, అపురూపమునగు రాజ్యాంగ సంస్కరణలు, ఇంగ్లాండునందు, రాజ్యాంగవిధానము మూలమునను, సక్రమపద్ధతుల ననుసరించియు మాత్రమే ఏర్పరుపబడినవన్నచో, ఆరాజ్యాంగవిధానపు సమర్థతయు, సౌష్టవమును కొనియాడతరమా? సక్రమరాజ్యాంగాందోళనమునం దంతగా నమ్మికలేని లేబరు పార్టీవారుకూడ, ఆస్ట్రేలియాయందు రాజ్యాంగవిధానమును గౌరవించుచున్నారన్నచో రాజ్యాంగవిధానమును సవరించుటకు అనువైయున్నదను నమ్మకమే అందులకు ముఖ్య కారణము.

తనస్వరూపమును తానే తనవృద్ధికారకముగనే మార్చుకొనుశక్తి ప్రతి రాజ్యాంగవిధానమునకు నుండుట అత్యంతావశ్యకమని జూచితిమి. ఇక నిప్పుడట్టి రాజ్యాంగవిధానపు చట్టమునందు ఏయే ముఖ్యభాగము లగత్యమో చూడవలసియున్నది. ఆధునిక రాజ్యములందును ప్రజాస్వామికరాజ్యములందును, 'మెజారిటీ' యందున్న పార్టీవారు అల్పసంఖ్యాకులయొక్క స్వత్వముల గౌరవించుటకు, వారి సంస్థల రక్షించుటకు అంతగా ఆతురతజూపుట లేదు. గ్రీసు దేశమందు ప్రత్యర్థిపక్షపు నాయకుల దేశమునుండి వెడల నంపుచుండుట యిప్పటికిని కలదు. మనదేశమందలి పాండి చెర్రిపట్టణమందలి ప్రత్యర్థినాయకులు తరిమివేయబడిరి. అమెరికాయందలి కార్మికసంఘములందొక్క విధమైన సంఘ నాయకులను వెదకి వెదకి చెరసాలయందు పెట్టుట కలదు. ఈనాటికిని కమ్యూనిస్టుపార్టీల రాచకీయాందోళనము నాపుట కనేకదేశములందు ప్రబల ప్రయత్నములు చేయబడు చున్నవి. ఐర్లాండునందిప్పటికి స్వతంత్రాలోచనను పురిగొల్పు గ్రంథములు బహిష్కరింపబడుటయు, స్వతంత్రరచనాకౌశలులగు గ్రంథకర్తలు అవమానింపబడుటయు జూడనగును. మనదేశమందు పంచముల కింకను సాధారణసాంఘిక, నైతికస్వత్వములు దక్కకున్నవి. అమెరికాయందు నీగ్రోజాతివారు, దక్షిణాఫ్రికాయందు భారతీయులు, నీగ్రోలు ఈనాటికిని కడుంగడు కడగండ్లకు లోనగుచున్నారు. బాల్కనురాష్ట్రములందలి రాష్ట్రేతరభాషలకు జెందిన ప్రజలకు, వారిభాషాప్రచారమును, ఆయాప్రభుత్వము లిప్పటికిని ఆటంకపెట్టుచున్నారు. జపానునందు కార్మికసంఘముల స్థాపనను ప్రభుత్వము ప్రతిఘంటించుచున్నది. ఇట్టి అపకారములు ప్రజలకు జరుగకుండుటకై, రాజ్యాంగవిధానపు చట్టమునందే తగునియమముల నేర్పరచు టగత్యము.

నిరంకుశులగు చక్రవర్తు లెట్లు అజ్ఞానులై ప్రజల కపచారములు చేయదొరకొందురో, అల్పసంఖ్యాకులగు రాజ్యాధికారులు తమకు పెరజాతివారగువారిపై నిర్భంధ ముల నెట్లుమోపబ్రయత్నింతురో, అటులనే, ప్రజాస్వామికమందును, అధికసంఖ్యాకుల నాయకులుకూడ తదితరులపై నిర్భంధములమోపి కష్టములదెచ్చిపెట్టుటకు సందేహించరు. నిరంకుశాధికారుల నరికట్టుట అంతకష్టసాధ్యమైన పనికాదు. కాని, ప్రజాస్వామికమందలి 'మెజారిటీ' యొక్క నిరంకుశత నాపుట దుస్తరమైన కష్టకార్యము. "తాము పల్కినదే బ్రహ్మవాక్కు, తాముచేసినదే దైవకార్యము" అను సంపూర్ణవిశ్వాసము, మెజారిటీవారికి కడుసులభముగా కల్గుచుండును. కనుక, అట్టి ఆత్మవిశ్వాసముచే తన్మయతబొందువారు, తదితరుల భేదాభిప్రాయములందు, భేదమగు ఆచారములందు అసహనముజూపుట సర్వసాధారణము. పొంగిపొరలివచ్చు మెజారిటీవారి ఆగ్రహము నాపుటకు, అనాలోచనము నరికట్టుటకు, విప్లవములైనను కార్యకారులు కాజాలవేమో? కనుకనే, అసాధారణము,అనుల్లంఘనీయమును, అఖండము నగు నీ 'మెజారిటీ' యొక్క నిరంకుశతనుండి, ప్రజాసామాన్యమును, వారిసంస్థలను, స్వాతంత్ర్యములను, సంరక్షించు టగత్యము. ఏది మెజారిటీకీ జపసత్వముల కల్గించుచున్నదో, ఎయ్యది ప్రజాస్వామ్యమును స్థాపించుచున్నదో, ఎద్దానివలన రాజ్యాంగసంస్థలు తమస్థానమును బొందుచున్నవో, అట్టి రాజ్యాంగ విధానపుచట్టమునందే వివిధప్రజాసమూహములకు, వివిధప్రజాసంఘములకు, వివిధవ్యక్తులకు, నైతిక, ఆర్థిక, సాంఘిక, రాచకీయజీవితపథములం దేయేసాధారణ స్వాతంత్ర్యము లెల్లప్పుడు లభ్యపడనగునో నిర్ణయించు టగత్యము. ఆ స్వాతంత్ర్యములకు భంగము లేకుండనే, ప్రజల యందొక్కక్కరికి, వారివారిస్వరక్షణ, స్వపోషణ సముదాయములకు, జీవనాధారమగు స్వత్వముల గౌరవించుచునె, ప్రజాజీవితమందు, దేశజీవితమందు ఆస్వత్వముల మినహాయించగా మిగిలియున్న భాగమునందే వ్యవహరించుటకు రాజ్యాంగసంస్థల నియమించునట్లును, అట్లు ప్రత్యేకింపబడినట్టియి, రాజ్యాంగసంస్థల యధికారమున కతీతమైనట్టియు ప్రజాజీవనమును, ఆసంస్థలు రక్షించునట్లును, రాజ్యాంగవిధానపుచట్టము నిర్ణ యించుట శ్రేయోదాయకము.

ప్రజాస్వామికము జయప్రదమై, సుస్థిరమై, కలకాలము ప్రజలకు శ్రేయోదాయకముగా నుండవలయునన్న ప్రథమప్రకరణమందు వివరింపబడిన సదుపాయములు అగత్యము. వానిని ప్రజలు తమంతతామే కల్గించుకొనుటకు బ్రయత్నించుట శుభప్రదమేకాని, వానిని సంపూర్తిగా వారు స్వయంకృషివలన నేర్పరచుకొనుటదుస్తరము. అట్టిసదుపాయముల కల్గించుటకై రాజ్యాంగవిధానము, తన రాజ్యాంగసంస్థలకు విధికృత్యముగా నేర్పరచు టవసరము. ప్రజలు విజ్ఞానులగునట్లు ప్రజలకు తినుటకుతిండి, త్రాగుటకు పానీయములు కొదువ లేకుండునట్లు జూచుట, అనారోగ్యము బాపుకొనుటకు, ఆప దలగడచుటకు, స్వాభివృద్ధిబొందుటకు సావకాశములకల్పించుట, ప్రజాసామాన్యము తమవారసత్వపుహక్కును సర్వస్వతంత్రతతో నుపయోగించుకొనుటకవసరము. మతస్వాతంత్ర్యము, అభిప్రాయప్రకటనాస్వాతంత్ర్యము, స్వశక్తుల ప్రకటించు స్వాతంత్ర్యము, స్వయంనిర్ణయత సూచించుసంస్థలస్థాపించు స్వాతంత్ర్యము, ప్రజలెల్లరికి సంపాదితమైననే ప్రజాస్వామికము శోభాయమానమగును. సాంఘికముగాగాని, రాచకీయముగాగాని, ఆర్థికముగాగాని, ఎట్టివారైనను, అసహాయులైనను ప్రజలకు నూతకల్గించి, స్వయంసహాయశక్తి ప్రజలందరకు ప్రసాదించిననే ప్రజలు తమయందంతర్గర్భితమగు పాలనాశక్తిని, ఇహపరలోకకళ్యాణప్రదమగునట్లు ప్రదర్శించగలదు. ఇట్టి సదుపాయములనన్నిటిని స్వరక్షణకును, స్వవృద్ధికిని, ప్రజాస్వామిక రాజ్యాంగములోని ప్రజలందరికి కల్గించుట అగత్యము, వీనినిప్పటికిని సంపూర్ణముగాగాని, సంతృప్తికరముగాగాని, అనే ప్రజాస్వామిక రాజ్యములు స్థాపించుట లేదు. వీనిని అనుభవమునకుదెచ్చు విధ్యుక్తధర్మము, ప్రతిరాజ్యాంగసంస్థపైనను, రాజ్యాంగవిధానపుచట్టము నిర్ణయించు టత్యంతావశ్యకము. ఈచట్ట మీరెండవధర్మమును పాలించవలసి యున్నది.

రాజ్యాంగవిధానపుచట్టమునందు రాజ్యాంగవిధానపు మూడవధర్మముకూడ ఇప్పుడిప్పుడు పేర్కొనబడుచున్నది. రాజ్యాంగసంస్థల యధికారమునకుమించి, ప్రజల కేయేస్వాతం త్ర్యములుండదగునో నిరూపించుట మొదటిధర్మము. ప్రజలు యోగ్యులగు పౌరులగుటకుగాను ప్రభుత్వము నెరవేర్చవలసిన కార్యక్రమమును సూచించుట రెండవధర్మము. ఏయేవిధముల, ఏయేశుభకార్యనిర్వాహణమునకై, ప్రజాస్వామిక రాజ్యాంగ మేర్పరుపబడుచున్నదో తెల్పుట మూడవధర్మము. శ్రీఅరిస్టాటిలుగారు, ప్రజలజీవితము శోభాయమానముగా జేయుటయే ప్రభుత్వధర్మమనిరి. వారిగురువగు శ్రీప్లేటోగారు, ప్రజలను వారివారివృత్తులందు, ధర్మసూత్రముననుసరించి యుంచుటయే ప్రభుత్వవిధికృత్యమనిరి. మనమిప్పుడు ధర్మార్థకామముల పెంపొందించి, ప్రజలకు మోక్షప్రాప్తికల్గించుటయే, ప్రభుత్వపుధర్మమనిబోధించిరి. ఈకాలపు సాంఘికవాదులు, సమిష్టి వాదులును, ప్రజలనభివృద్ధికి దెచ్చి, వారికి ఆధ్యాత్మిక జ్ఞానసంపాదన కగత్యమగు యవకాశములకల్పించుటయే ప్రభుత్వపునీతియని వాదించుచున్నారు. ఎల్లరును ఈ కాలమందు ప్రజల భాగ్యభోగ్య ఆధ్యాత్మికజ్ఞానాభివృద్ధికై తనసర్వశక్తుల నుపయోగించుటయే, ప్రభుత్వముయొక్క గమ్యస్థానమని అంగీకరించుచున్నారు. ఇట్టి గమ్యస్థానము జేరుట కెట్టిచర్యల, ఏసూత్రములను ప్రభుత్వమవలంబించవలయునో, ప్రజలెల్లరి కామోదనీయముగా నుండునటుల రాజ్యాంగ విధానపు చట్టమందు తెల్పుట శుభప్రదమే యగును. ప్రతిరాజ్యాంగవిధానమునందును, ఈమూడుధర్మములు పేర్కొనబడినవని చెప్పనలవికాదు. స్విట్జర్లాండు, అమెరికా, మెక్సికో, జెకోస్లావాకియా, జర్మనీ, ఎస్తోనియా, డెన్మార్కు, ఆస్ట్రియా, పోలండు, జుగోస్లావియా, బెల్జియము, ఐరిషు ఫ్రీస్టేటులయొక్క రాజ్యాంగవిధానముల చట్టములయందు ప్రథమరెండుధర్మములును పేర్కొనబడియున్నవి. జుగోస్లావియా, జర్మనీ, ఎస్తోనియా, రాజ్యాంగపుచట్టములందుమాత్రము మూడవధర్మము కొంతవరకు సూచింపబడుచున్నది. ఇంగ్లాండు, ఫ్రాన్సు, దక్షిణాఫ్రికా, కెనడా, ఆస్ట్రేలియాల యొక్క రాజ్యాంగవిధానములం దీరాజ్యాంగము యొక్క ధర్మములు ప్రత్యేకముగా పేర్కొనబడలేదు. ఇందులకు రెండుకారణములుకలవు. ఒకటి యుద్ధమునకు పూర్వము ఈశతాబ్దారంభమున యేర్పడిన రాజ్యాంగవిధానపుచట్టములందు, ఈధర్మములను (పౌరసత్వపు హక్కులని వీనినె అందురు) పేర్కొనుయలవాటు సర్వసాధారణము కాదాయెను. మరియు, బ్రిటిషువారి ప్రజాస్వామిక రాజ్యాంగములందు పౌరసత్వపుహక్కులిట్టివి అనుజ్ఞానము, ఆచారవశాత్తు ప్రజలకు కల్గియుండుటయు, ఆచారానుగతముగా నట్టిహక్కుల నాయాదేశముల రాజ్యాంగములు గౌరవించుచుండుటయు సర్వసాధారణమైయుండెను. ఇంగ్లాండుయొక్క రాజ్యాంగవిధాన మీనాటికిని చట్టరూపముదాల్చకున్నను దానియొక్కరూపు రేఖలు, వన్నెచిన్నెలు సంపూర్ణముగా పెంపొందియేయున్నవి. ఆ రాజ్యాంగవిధానమునందే పౌరసత్వపు హక్కులు యిమిడియున్నవి. ఆసాంప్రదాయమునే బ్రిటిషువారి ప్రజాస్వామిక రాజ్యములన్నియు పొందియున్నవి. కనుకనే ప్రత్యేకముగా నట్టి పౌరసత్వపుహక్కులు ఆయాదేశముల రాజ్యాంగవిధానపు చట్టములందు పేర్కొనబడలేదు. రెండవకారణమేమనగా, ఫ్రాన్సునందు అకస్మాత్తుగా కల్గిన రాజ్యాంగవిపత్తు బాపుకొనుటకై త్వరితగతి రాజ్యాంగవిధానమును నిర్మించుటకై ప్రయత్నము జేయబడుటచే ఈరాజ్యాంగవిధానపు ధర్మములందు బేర్కొనబడలేదు.

ఇప్పటివరకు పాశ్చాత్యదేశములందేకాక, ఆథునిక ప్రపంచమందంతటను ప్రజలయొక్కయు, పౌరులయొక్కయు, హక్కులగూర్చియే, రాజకీయజ్ఞులు శ్రద్ధవహించుచున్నారు. ఇందులకు గారణములేకపోలేదు. నిరంకుశాధికారులక్రింద నవసియపని మెజారిటీల దుష్పరిపాలనముక్రింద యవస్థపడియున్న ప్రజలకు, తాము తమ ప్రభుత్వమునెడల జూపవలసిన బాధ్యతనుగురించికాక (తామెల్లప్పుడు ప్రభుత్వాజ్ఞలకు తల యొగ్గుచునేయుండుటచే) తమయెడల ప్రభుత్వము జూపెట్టదగు దయను, శ్రద్ధనుగురించియే పట్టుదలకల్గియుండుటలో ఆశ్చర్యమేమికలదు! కాని యిప్పుడిప్పుడు, ప్రజాస్వామిక రాజ్యాంగము స్థిరపడుచున్నకొలది, ఆరాజ్యాంగవిధానము స్థిరస్థాయి యగుటకు, ప్రజలు దానియెడ జూపదగు ధర్మముల గురించి రాచకీయజ్ఞులు శ్రద్ధజేయుచున్నారు. ప్రజలెల్లరు తమ రాజ్యాంగవిధానమును రక్షించుకొనుటకును, నిలబెట్టకొనుటకును సకలప్రయత్నములజేయ సంసిద్ధులుకానిచో, ఇటలీయందు ప్రజాస్వామిక మదృశ్యమైనటుల, జర్మనీయందు నిరంకుశపుపెత్తనము రానైయున్నటుల, పోలండు, బల్గేరియాలందు ప్రజాస్వామికము అంతమొందినటుల, ప్రజలకు ప్రజాస్వామికరాజ్యాంగమే దక్కకుండునని, రాచకీయ నాయకులు, రాచకీయజ్ఞులు కన్గొనుచున్నారు. కనుకనే జర్మనీ, పోలండు, రాజ్యాంగవిధానచట్టములందు పౌరులు, తమ రాజ్యాంగముయెడ, తమ సంఘముయెడ నెఱపవలసిన ధర్మములు పేర్కొనబడుచున్నవి. ఆదిమకాలమందు మనఋషులు ప్రజలు రాజునెడజూపదగు బాధ్యతలను నిరూపించిరి. అటులనే శ్రీప్లేటోగారును, పౌరులెల్లరికి తమతమ బాధ్యతల నిర్వర్తించు విధానము నేర్పరచవలెననిరి. క్రైస్తవప్రపంచసౌర్వభౌమత్వమువహించిన పోపుగారును, పౌరుల బాధ్యతల పేర్కొనిరి. కాని, ఆకాలపువారు పౌరులయెడల రాజ్యాంగము నెఱపవలసిన ధర్మములను సంపూర్ణముగా నిర్వచింపరైరి. పోలండు, జర్మనీదేశముల రాజ్యాంగవిధానపు చట్టములు, రాజ్యాంగవిధానముల హక్కు బాధ్యతలను, పౌరులయొక్క హక్కుబాధ్యతలను పేర్కొని, ఇరుపక్షములయెడ సమానాదరతజూపి, రాజ్యాంగతత్వపు ప్రౌడత్వమును, ప్రజాస్వామిక రాజ్యాంగముయొక్క సార్థకతనుఋజువు చేయుచున్నది.

ఎట్టెట్టిబాధ్యతల రాజ్యాంగము నిర్వర్తింపవలయునో పౌరుల స్వత్వముల నెంతవరకు గౌరవించవలెనో, సంపూర్ణముగా విచారించుట కిదియదనుకాదు. "అమెరికా ప్రభుత్వము", "జర్మనుప్రభుత్వము"లపై వ్రాయబడిన గ్రంథములందు, అయాప్రభుత్వము లేయే పౌరసత్వహక్కుల సురక్షితపరచి రాజ్యాంగబాధ్యతల నెరవేర్పవలసియున్ననో, సంపూర్ణముగ వివరములొసంగ బడినవి. రాజ్యాంగవిధానపుచట్టము నెరుంగని ఇంగ్లాండుదేశమునందు, ఏయేపౌరసత్వపుహక్కులు ఆచరణయందు అనుభవనీయమగుచున్నవో యీక్రిందనుదహరింపబడినది.

(1) పౌరులెల్లరు తమతమసంఘముల నేర్పరచుకొనుటకు, తమయభిప్రాయముల పత్రికలవలన, కరపత్రముల రూపకముగా, సభలద్వారా తెల్పుటకు స్వతంత్రతకలిగియున్నారు. (2) వార్తాపత్రికాప్రచురణ స్వాతంత్ర్యముకలదు. (3) మతస్వాతంత్ర్య మేర్పడినది. (4) ఆర్థిక జీవితరక్షణకై కార్మికులు సమ్మెకట్టుటకు స్వాతంత్ర్యము బొందియున్నారు. వీనికితోడు రాజ్యాంగ మీక్రింద నుదాహరింపబడిన బాధ్యతలను, పౌరుల స్వతంత్ర్యతకై సర్వసమానత్వలబ్ధికై నెరవేర్చుచున్నది:- (1) నిర్భంధ ప్రారంభవిద్యను చు ప్రజలకు ప్రసాదించి, బీదలబిడ్డలపోషించి క్రమక్రమముగా హెచ్చుచున్నపౌరులకు వయోజన విద్యాప్రాప్తికల్గింప బడుచున్నది. (2) ప్రజల రాచకీయ విజ్ఞానాభివృద్ధికై రాచకీయకక్షలు సర్వస్వతంత్రతబొంది తమప్రచారముజేయుటకు హక్కుబొందియున్నవి. (3) కృషిచేసి జీవనోపాధి నొందుయవకాశము ప్రతిపౌరునకు, ప్రభుత్వము కల్గించుటకు కంకణముగట్టుకొని, నిరుద్యోగనివారణ కార్యక్రమమవలంబించి, నిరుద్యోగులకు రక్షణకల్గించుచున్నది. వృద్ధులకు, అనాధలకు, అట్టివారికి శరణ్యము కల్గించుచున్నది. వీరందరికి, పౌరసత్వపుహక్కును ప్రసాదించుచున్నది. (4) పుట్టుకతో సంబంధము లేకుండా, అర్హులగువారిని ప్రభుత్వోద్యోగులుగా నియమించుటకు బ్రయత్నించుచున్నది. ప్రజలు తనయెడ జూపదగు ధర్మములగూర్చిన చింతలేకయే ఆప్రభుత్వమున్నది. క్రిందటియుద్ధమందును, 1926 నందు సభవించిన "జనరలుస్ట్రైకు" నందును, ప్రజలు ఆ దేశపు రాజ్యాంగము రక్షించుటచే నడుముగట్టి నిలబడిరి.

తమరాజ్యాంగవిధానములను చట్టరూపముగా బొందియున్న దేశములలో పోలాండుయొక్కచట్టమే, పౌరులహక్కు బాధ్యతలగురించి నిండువివరముల నొసంగుచున్నది. కనుక ఆదేశపురాజ్యాంగ విధానమునందలి విశేషములకొన్నిటినిచ్చట పేర్కొన్నచో, ఈకాలపు రాజ్యాంగవిధానపు చట్టము లందు పేర్కొనబడు, పౌరులకు, రాజ్యాంగములకు పరస్పరముగానుండు హక్కు బాధ్యతలకు సంబంధించిన సూత్రముల రీతి తెలియనగును. (1) పోలాండు రాజ్యాంగమందు పౌరుడుగానున్న వ్యక్తి మరేయితర రాజ్యాంగమునకు చెందరాదు. (2) పోలాండు రిపబ్లికునకు విశ్వాసులైయుండుట, పౌరుల ప్రధానధర్మము. (3) రాజ్యాంగచట్టము, దానిననుసరించి నిర్మింపబడు శాసనములు, ప్రభుత్వనియమముల ననుసరించియే పౌరులెల్లరు ప్రవర్తించుకొనవలయును. (4) ప్రతిపౌరుడును సైనికశిక్షణమును బొందవలయును. (5) శాసనబద్ధముగానుండు శిస్తులను ఆతడు చెల్లింపవలెను. (6) రాజ్యాంగసంస్థలదెద్దియైన కోరు సహకారముచేయుటకును, రాజ్యాంగసేవ, అగత్యమైనప్పుడు చేయుటకును అతడు సంసిద్ధుడైయుండవలెను. (7) బిడ్డలందరకు ప్రైమరీవిద్యనైననొసంగి పౌరసత్వముబొందుట కర్హతకల్గించుట పౌరులధర్మము.

రాజ్యాంగవిధానము, ప్రజలయెడజూపదగు బాధ్యతను, జర్మను రాజ్యాంగవిధానపుచట్టము సమగ్రముగా నిరూపించు చున్నది. (1) కుటుంబముల యభివృద్ధినికాక్షించి, గొప్పకుటుంబములరక్షించుట రాజ్యాంగపుధర్మము. (2) తల్లి దండ్రులు తమబిడ్డల సలక్షణముగా పెంచునట్లు జాగ్రత్తపడి, బిడ్డలందరి ఆరోగ్యవిద్యాభివృద్ధికల్గుటకు, రాజ్యాంగము శ్రద్ధచేయవలెను. (3) తగు శాసననిర్మాణముచే, తండ్రిలేని బిడ్డల రక్షించవలెను. (4) బాలబాలికల నైతిక, ఆర్థిక, సాంఘికజీవితమునందు సురక్షితపరచవలెను. (5) విద్యాభివృద్ధి, కళలప్రాపకము కల్గించవలెను. (6) చారిత్రక సంబంధమగు, కట్టడముల, సృష్టివైచిత్ర్యముల గల్గినసంస్థల రక్షించవలెను. (7) దేశపుఆర్థికసంపద సాధ్యమైనంతవరకు ప్రజలందరియందు సమానముగా విభజింపబడునట్లు చేసి, వర్తక వాణిజ్యములు, సత్యమార్గములననుసరించి, కార్మికులక్షామమునకు భంగకరముకాకుండా, సంఘసామరస్యము కల్గునట్లు, రాజ్యాంగము శ్రద్ధచేయవలెను. (8) కార్మికులను రాజ్యాంగము, ప్రత్యేకముగా రక్షింపబూనుకొనవలెను. (9) స్వతంత్రభావ కల్పితమగు అన్ని విధములగు నూతన ఆలోచనలు, వస్తుజాలములు, యంత్రములును, రాజ్యాంగముయొక్క సాయము బొందు అర్హతకల్గియుండవలెను. (10) నానాజాతులకు సమానమగు శాసననిర్మాణమును, కార్మికులరక్షణకై చేయవలెను. ఈవిధముగనే, నూతనముగా స్థాపించబడిన, ఎస్థోనియా, బల్గేరియా, పోలాండు, ఆస్ట్రియా రాజ్యాంగముల యొక్క చట్టములందుకూడ రాజ్యాంగముయొక్క ధర్మములు పేర్కొనబడుచున్నవి.

వ్యక్తులకు, వారికి సంబంధించిన సంస్థలకు సాంఘికార్థిక, రాచకీయ, మత, స్వాతంత్ర్యములను రాజ్యాంగవిధానమున రక్షణ (Safe gaurds) గావించుటవసరము. ఈస్వా తంత్ర్యములెట్టివో చెకోస్లావాకియా రాజ్యాంగవిధానపుచట్టమందు పేర్కొనబడియున్నవి. (1) స్త్రీపురుషభేదముల గమనింపరాదు. మతము, గ్రామము, జాతి, భాషాభేదముల గమనించక, ప్రజలయొక్క జీవారక్షణ కల్గించి వారికి స్వాతంత్ర్యము ప్రసాదించుట రాజ్యాంగముయొక్క ధర్మము. (2) ఉద్యోగముల ననుసరించి మాత్రమే బిరుదులనివ్వవలెను. (అన్ని రిపబ్లికులందును ఈనియమముకలదు).(3) శాసనబద్ధముగా తప్ప, ఏవ్యక్తియొక్క స్వాతంత్ర్యమును తగ్గింపరాదు. (4) ప్రభుత్వ కార్యనిర్వాహణమునకై నిర్భంధించరాదు. (5) ప్రతిపౌరుడును దేశమందెచ్చోటనైన ఆస్థి సంపాదించుకొని గృహమునిర్మించుటకు హక్కుకలదు. సంఘావసరములకే, శాసనబద్ధముగానున్నప్పుడు అట్టిహక్కును సంకుచిత పరచనగును. (6) వ్యక్తిగతమగు ఆస్తిని శాసనబద్ధముగనే సంకుచితపరచవచ్చును. అట్టిఆస్తిని ప్రభుత్వము వశపరచుకొనుచో ప్రతిఫలము ఆయావ్యక్తులకు చెల్లింపవలెను. (జర్మనీయందు నిట్లే) రాజ్యాంగవిధానపు చట్టసవరణద్వారా తప్ప వేరువిధమున ఈహక్కును తగ్గించుటకు వీలు లేదు. (7) విదేశములకు వెళ్లుటకు పౌరులకుండు హక్కు శాసనముద్వారానే తగ్గింపవీలగును.(8) ప్రభుత్వముచే వేయబడు శిస్తులు రుసుములు శాసనబద్ధముగ నుండవలెను. (9) నివాసమునకై నిరూపింపబడు గృహముల నెవ్వరును ఆగృహస్థుని యాజ్ఞ 3 ^^"C4 i^r

'

,-O

-

"ti

'

,

V

'.

,

"

.

-,^

V r,


0-

t')

-

(

14) /

i

M

L,

o

o

Co రియొక్క మతాచారములపైనను అధికారముండదు. రాజ్యాంగమునకు అన్నిమతములును సమానమగు గౌరవార్హములే ! దేశశాంతికి, నైతికజీవనమునకు భంగకరమైనతప్ప, మతస్వాతంత్ర్యము సంకుచితపరుపరాదు. (17) పౌరులు తమకు అలవాటైన అనాదిసిద్ధమగు లేక యిష్టమగు భాషలనుపయోగించవచ్చును. మత, భాష, జాతి, ఆచారభేదముల పాటించక అందరిని సమానముగా రాజ్యాంగము ఆదరించవలయును. (18) బస్తీలయందు, 'చెకోస్లావిక్‌' భాషకాక, తదితరభాషలకు జెందినప్రజల విద్యాభివృద్ధినిమిత్తము ఆభాషలద్వారానే విద్యాప్రచుర మొనర్చుటకు విద్యాలయములను రాజ్యాంగమువారు స్థాపించవలెను.

ఈవిధముగా మూడుధర్మములు రాజ్యాంగవిధానపు చట్టములు నిర్వర్తించుట యుక్తము. వ్యక్తులువారిసంస్థల స్వాతంత్ర్యములు ప్రభుత్వముయొక్కయు పౌరులయొక్కయు బాధ్యతలు నిర్ణయించుచు రాజనీతిసూత్రముల రాజ్యాంగవిధానపు చట్టములందు జేర్చుట శ్రేయోదాయకమని రాజ్యాంగ వేత్తల యభిప్రాయమైయున్నది. మన కాంగ్రెసువారుకూడ మనప్రజల సాధారణహక్కుల నిర్వచించుటకు ప్రయత్నించుట కిదియే ముఖ్యకారణము. రౌండుటేబిలు కాన్పరెన్సునందుకూడ ఇట్టిపౌరసత్వపు హక్కు బాధ్యతలగూర్చి హెచ్చుగా శ్రద్ధచేయబడినది. ఈరాజ్యాంగవిధానపు చట్టములం దు లిఖింపబడినట్లు ప్రభుత్వములుగాని, ప్రజలుకాని ప్రవర్తించకపోవుట సాధ్యమే ! జర్మనీయందు రాజ్యాంగవిధానపు చట్టముయొక్క మూలసిద్ధాంతములకే భంగకరముగా నుండునట్లు శ్రీ ప్రెసిడెంటు హిండెన్ బర్గుగారు వారిప్రధానమంత్రులు శ్రీ బ్రూనింగు, శ్రీపెపిరుగారలు శాసనసభల నంత మొందించి ఆర్డినెన్సుల నిర్మించి, ప్రషియారాష్ట్రపు మంత్రాంగవర్గమును పదభ్రష్టతనొందించి, తమకిష్టమగు నాజీపార్టీవారిని బలపరచుట అనుభ వైక వేద్యము. అటులనే పోలాండునందును చెకోస్లావాకియాయందును, తదితరబాల్కనురాష్ట్రములందును తమరాజ్యాంగవిధానపు చట్టములందేకాక, నానాజాతిసమితివారిచే చేయబడిన రాజీపత్రములందుకూడ ఖాయపరచిన అల్పసంఖ్యాకుల పౌరసత్వపుహక్కుల నాయాదేశముల ప్రభుత్వములు సంకుచితపరచుచున్నవి. ఫ్రాన్సు నందును అమెరికాయందు నిట్టే రాజ్యాంగవిధానపు చట్టములకు విరుద్ధముగా, ప్రభుత్వములు ప్రవర్తించుటకు సాహసించినవి.

ఇట్టి పౌరసత్వపు హక్కు బాధ్యతలు చెక్కుచెదరకుండా అనుభవములోనికి రావలెనన్న వానిరక్షణార్థమై పౌరులును, వారిసంస్థలును తమలో కల్గుచుండు వివాదములమరచి అట్టిహక్కులపై దాడియెత్తు ప్రభుత్వముల, ఉద్యోగుల తగురీతి నెదుర్కొనుటకు పూనుకొనియుండవలెను. అప్పుడప్పుడు ఇట్టిచట్టములందు నిర్ణయింపబడు పౌరసత్వపుహక్కు బాధ్యతలను ప్రభుత్వము సంకుచితపరచినను, వానిలో అనేకబాధ్యతల ప్రభుత్వము ------------ ప్రజలు ఆశాభంగముబొందక, తమ -------------- చట్టమును జర్మనీయందువలెనే -------------------జెప్పి, దానియొక్క ప్రధానసూత్రములను --------- బోధించి, ప్రభుత్వముయొక్క ధర్మములు, పౌరుల స్వాతంత్ర్యములు, సంస్థలహక్కులు, పౌరులబాధ్యతలు మున్నగువాని గురించి, తగునట్లు ప్రచారమొనర్చుట యుత్తమము. పౌరసత్వపుహక్కు బాధ్యతలగురించి ప్రజలెంతశ్రద్ధచేయ ------- తృప్తికరముగ, ప్రభుత్వము ఏదేశమందైన ---------- నిర్వర్తించుటకు ప్రయత్నించును.



_______________