Jump to content

ఆధునిక రాజ్యాంగ సంస్థలు/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము.


ప్రభుత్వాంశముల పరస్పర బాధ్యతలు. నాయకుల నెన్నుకొనుచు, యాన్యాయముల విచారించుటకై ప్రత్యేకన్యాయాధిపతులుగా సమావేశమగుచుండిరి. ఇటులనే రోమన్ రాజ్యమందు కూడ క్రమముగా శాసననిర్మాణముజేయుటకొక సమాహము, కార్యనిర్వాహణము నెరపుటకు మరికొందరు ప్రజానాయకులు, న్యాయస్థానములందాధిపత్యమువహింప కొందరు ప్రముఖులు నియమింపబడుచుండిరి. పెట్రిషియనులకే ధర్మమాత్రజ్ఞానముండుటవలన, ప్రజలందరు వారిపైననే ఆధారపడియుండుట ప్రజలకు క్షేమముకాదని, ఏబదిమంది పెద్దలసంఘమువారిచేత పన్నెండు 'టేబుల్సు' అనుధర్మసూత్రసముదాయములను గ్రంథస్తముచేయించిరి. అప్పటి నుండియు, శాసననిర్మాణముచేయుసంస్థలు కార్యనిర్వాహక వర్గమునుండియు, న్యాయమూర్తులవర్గమునుండియు వేరుపరచియుండిరి. మనదేశమందును, చైనాదేశమందును ఆదిమకాలమందే కుటుంబపెద్దలనుండి 'కుదురు'ల పెద్దల పెత్తనమువచ్చువరకు, ఒకేయధికారికి యీమూడుపెత్తనములు చెందియుండెను. క్రమముగా గ్రామపంచాయతీ జిల్లాపంచాయితీల కీమూడుపెత్తనములు దక్కెను. రానురాను మనదేశమందు ధర్మసూత్రసముదాయము ప్రాముఖ్యతకొచ్చినకొలది, వానిజ్ఞానము బ్రాహ్మణులకే సమగ్రముగా కల్గియుండుటచే, వారిసలహాలపైని సహకారతో రాజులు న్యాయాన్యాయ పరిపాలనముచేయుచుం డెడివారు. కాని, శాసననిర్మాణాధికారము భారతకాలమువరకు రాజులకు లేదాయెను. కార్యనిర్వాహణాధికారము, న్యాయాధిపత్యము మాత్రము రాజ్యాంగమునకు చెందియుండ, కార్యనిర్వాహణము బ్రాహ్మణులసలహాలపైనను, న్యాయాధిపత్యము బ్రాహ్మణుల సహకారముతోడను, రాజులు నెరపుచుండిరి. అటులనే చైనాదేశమందు కూడ కార్యనిర్వహణము, న్యాయాధిపత్యము జిల్లారాష్ట్రీయ జాతీయనాయకుల సలహాలననుసరించి, ఆదేశపు చక్రవర్తులు నెరపుచుండిరి.

ప్రపంచమందెల్లయెడలను, క్రీస్తుశకారంభమునకు సంపూర్ణనిరంకుశాధికారము రాజులకుదక్కుటయు, వారియందే యీ మూడువిధములగు పెత్తనములు అంతర్గర్భితమగుటయు, తన్మూలమున ప్రజలకు యిబ్బందులనేకము కల్గుటయు అనుభవముకాజొచ్చెను. ప్రజాస్వామిక రాజ్యాంగవిధానము బొందియున్న హాలాండుపట్టణములు, ఇటలీ పట్టణములలో కొన్నిటియందు తప్ప, ప్రజలకు ఈమూడు పెత్తనముల నడపురాజుల పాలనముక్రింద, ఎన్నో కష్టనష్టములు కల్గెను. ఏపౌరునైనను నిందితునిగా దూషించి, వానిని శిక్షార్హునిగా పరిగణించి, వానిపై శిక్షనుప్రయోగించు యధికారము రాజులకా కాలమున యుండెడిది. కనుకనే అలెగ్జాండరు చక్రవర్తినుండి అక్బరుచక్రవర్తివరకు, oo

76

e

41

J649

1889 ప్రజాప్రతినిధులచే కూడిన పార్లమెంటునధికారము కలదని స్థిరపరుపబడెను. ఈవిధముగ కార్యనిర్వహకవర్గపు ప్రధానాధికారినే ప్రజాప్రతినిధు లెన్నుకొనుట కధికారముకల్గెను. రాజు తన యిష్టమువచ్చినట్లు, తనకార్యనిర్వాహకవర్గ మేర్పరచుకొని, వారిచే రాజ్యాధికారమును ప్రజలపీడించుట కుపయోగింపకుండుటకై ప్రభుత్వనిర్వహణమునకు వలయుధనమును సంవత్సరమునకొకమారు పార్లమెంటుయొక్క అనుమతిపై నిర్ధారణకాబడు శిస్తులద్వారా పొందవలసివచ్చెను. ప్రజల నస్వతంత్రులుగాజేసి నిరంకుశాధికారమును సైనికబలగములసాయముతో రాజు నేర్పరతురేమో యనుభయముచే సైన్యము నెట్లు నడుపనగునో నిర్ణయించు నియమములబిల్లును ప్రతివత్సరము పార్లమెంటు అంగీకరింపవలయునని నిర్ణయింపబడెను. న్యాయాధిపతిగానుండి "స్టారుఛేంబరు" అను కౌన్శిలుద్వారా ఏడవ హెన్రీరాజుగారు, ప్రజలను, వర్తకులను తనయిచ్చవచ్చినట్లు కోర్టులకీడ్చి, జుల్మానాలకు లోనుగాజేసి, నానాయిబ్బందుల గల్గించుచుండెను. ధనలోపముచే బాధబొందుచుండిన ప్రధమఛార్లెసుగారి నిరంకుశ అశాస్త్రీయ "స్టారుఛేంబరు" న్యాయాధిపత్యమును వహించిరి. ఇట్టి దుర్మార్గమును అరికట్టుటకై "రక్తరహితవిప్లవము" (1688) "హబీసుకార్పొసు ఆక్టు" అను శాసనము కూడా నిర్మింపబడినది. దీనిప్రకారము ఏపౌరుడైనగాని తప్పులేనిదే, ఏదే నొకశాసనముప్రకారము తప్ప, నిర్భధింప బడరాదనియు, అట్లు నిర్బధింపబడినను, ఇరువదినాల్గుగంటలలోపల "హబీసు కార్పొసుఆక్టు" నమలు పరచమని యెవ్వరైన పిటీషనుబెట్టుచో, అట్లు నిర్బంధితుడైన పౌరుని మాజిస్ట్రేటు యెదుటకు తెచ్చి, అతడుచేసిన తప్పేమియో నిరూపించి, శాసనబద్ధముగామాత్రమే ఆతనిని ఆపిమ్మట నిర్బంధముగా నుంచవలయునను సూత్రము నిర్ణయింపబడెను. క్రమముగా ధర్మదేవతముందు ప్రజలెల్లరు, వారియందరి ఆర్థిక, సాంఘిక, రాచకీయ విభేదములతో నిమిత్తము లేకుండా సర్వసమానులే యను విశ్వాసమును ప్రజలుపొందుటచే ప్రభుత్వోద్యోగులు కూడ తాముచేయు అక్రమకార్యములకు తదితరులతోబాటు సమానముగా బాధ్యులగుట తటస్థించెను. ఇందువలన అశాస్త్రీయముగా, శాసనవిరుద్ధముగా ఏయుద్యోగియు సాధారణ పరిస్థితులం దేపౌరునైనను నిర్బంధించుటకు సాహసింపడు.

ఇటుల రాజునకు జెందియున్న మూడుపెత్తనములను ప్రజల యాధిపత్యముక్రిందకు తెచ్చి ఒక పెత్తనము మరొకపెత్తనముతో

శ్రీమాంటెన్క్యూగారు.

కుమ్మక్కియై ప్రజలస్వాతంత్ర్యమును మ్రింగివేయకుండ జేయబడెను. పార్లమెంటునకు మాత్రమే శాసన నిర్మాణాధికారము కల్గెను. మంత్రివర్గమునకే కార్యనిర్వాహకాధికారము సంప్రాప్తమయ్యెను. న్యాయాధిపతులకే న్యాయాన్యాయవిచా రణచేయు అధికారము కల్గెను. రాజు ఈమూడుసంస్థలతో సహకారము చేయుటకు అధికారముబొందియున్నాడు. ఈరహస్యమును, ఫ్రెంచివారి రాచకీయవేత్తయగు శ్రీ మాంటెన్క్యూగారు గ్రహింపక, తనకు గురుప్రాయుడును, ఇంగ్లీషు రాజ నీతిజ్ఞుడునగు శ్రీబ్లాకుస్పనుగారి ఆలోచనననుసరించి, ఈమూడుసంస్థలును పరిపూర్ణముగా ఒకదానినుండి మరొకటిభేదించి పరస్పర సంబంధము బొందక, పరస్పరసహకారమునకు తావివ్వకుండెనని తలంచెను. పార్లమెంటు, కార్యనిర్వాహకవర్గముపైకాని, కార్యనిర్వాహకవర్గము పార్లమెంటు న్యాయాధిపతులపైకాని, న్యాయాధిపతులు మిగతా రెండుసంస్థలపైకాని యేమాత్రము పెత్తనము పొందుట లేదని ఆయన భావించెను. ఇట్టి పరస్పర సంబంధములేక, ఏసంస్థ కాసంస్థ పరిపూర్ణతబొందియుండుటవలననే బ్రిటిషుప్రజలయొక్క స్వాతంత్ర్యజీవితము సాధ్యమగుచున్నదని ఆయన తీర్మానించుకొనెను.

శ్రీ మాంటెన్క్యూగా రిట్టి భ్రమ ప్రమాదము బొందుటకు కారణములు లేక పోలేదు. ఆయనకాలపు (1786) ప్రాంతపు

వారి భ్రమ ప్రమాద
మునకు కారణము.

ఫ్రెంచివారి పదునాల్గువ లూయీ చక్రవర్తి నిరంకుశ ప్రభువై శాసననిర్మాణాధికారమును, కార్య నిర్వాహణాధికారమును, న్యాయవిచారణాధికారమును తానే చెలా యించుచుండుటవలన, ప్రజలెల్లరు అస్వతంత్రులై యుండుటేకాక, నానాఅవస్థలకు లోనై, అనుదిన మొకగండముగా భావించుచు భయభ్రాంతులై యుండిరి. ఇంగ్లాండునకుగూడ రాజున్నను, ఈమూడుపెత్తనములు ప్రత్యేక ప్రత్యేకముగా జేయబడుచుండుటవలననే, అప్పటియింగ్లీషు ప్రజలస్వాతంత్ర్యత సిద్ధిబొందుచుండెవని వారునమ్మిరి. కనుకనే, ప్రజల స్వాతంత్ర్యత స్థిరపడవలయునన్న, ప్రజలు స్వతంత్రులై యుండవలెనన్న, ప్రభుత్వాంగములు పరస్పరముగా ప్రత్యేకించి యుండవలెను" (Separation of powers ) అనుసూత్రమును వారు నిర్వచించిరి.

దాదాపుగా ఆకాలమునందే అమెరికాదేశమునకు స్వాతంత్ర్యము సంపాదించ బ్రయత్నించుచుండిన శ్రీజార్జి వాషింగ్టను,

అమెరికా రాజ్యాంగ
నిర్మాతల భావములు..

మెడిసను, జానుఆడమ్సు, హామిల్టను వగైరాలు, తమ్ముహింసించి, తమదేశమును నిరంకుశముగా పాలనము జేయదలచుకొన్న శ్రీమూడవజార్జిప్రభుని ప్రభుత్వ పద్ధతులమాత్రమే, అట్లాంటికు మహాసముద్రమున కావలిప్రక్కనుండి విచారించి, పొరపాటభిప్రాయములబొందిరి. పార్లమెంటుయొక్క సభ్యుల లంచములవలన నేమి, బిరుదులు, తదితర రాజలాంఛనముల మూలముననేమి, తనకులోబరచుకొని అధికసంఖ్యాకులగు కామన్సు మెంబరులకు జెందిన మంత్రాంగవర్గము ను, తనయిష్టమువచ్చినట్టేర్పరచి, తనయిచ్చవచ్చినట్లు మూడవజార్జిప్రభువు, మంత్రాంగ సభద్వారా, కామన్సుసభపై పెత్తనము జేయుచూ దేశమునుపాలించుచుండెను. ఆయనకు పార్లమెంటు యెందుకులొంగియుండెనో యదార్థము గ్రహించక, ఆయనమంత్రులు కామన్సుసభయందు సభ్యులైయుండుటవలనను, కార్యనిర్వాహకవర్గమునకు పార్లమెంటులొంగి యుండుట చేతను, ఆకాలపుదుస్థితి కల్గుచుండెనని వారుభ్రమజెందిరి. మరియు బాధ్యతాయుత రాచకీయసంస్థలద్వారా ఆప్రభువు తననిరంకుశాధికారమును సాగించుకొనుచుండెనని గ్రహింపరాయెను.

శ్రీమాంటెస్క్యూగారి గ్రంథపఠనముచే ఇంగ్లాండునందు, ఆకాలమునకింకనునిల్చియున్న వనుకొనబడు ప్రజా స్వాతంత్ర్యములు, స్వత్వములు, ప్రభుత్వాంగములు పరస్పరముగా ప్రత్యేకింపబడి యుండుటవలన వారు తలంచిరి. శ్రీమాంటెస్క్యూగారు వాదించినట్లు, ప్రజలస్వత్వములు, స్వాతంత్ర్యములు నిలబడవలయునన్న, అటుల వివిధప్రభుత్వాంగము పరస్పరముగా ప్రత్యేకింపబడవలయునని వారునునమ్మిరి.

కనుకనే అమెరికాసంయుక్త రాష్ట్రముయొక్క సమ్మేళన రాజ్యాంగమునందు, రాష్ట్రీయ రాజ్యాంగములందు, ఈత్రివిధ

అమెరికా రాజ్యాంగపు
విపరీతసౌధము.

ప్రభుత్వాంగములు పరస్పరముగా ప్రత్యేకింపబడునట్లుగా, రాజ్యాంగనిర్మాత లేర్పాటుచేసిరి. సమ్మేళనరాజ్యాంగపు తలమాణిక్యమగు ప్రెసిడెంటుగారుగాని, వారిమంత్రులు గాని, శాసనసభలయందు సభ్యత్వములు బొందుటకు వీలులేదు. వారాసభలకు బాధ్యతజెంద నగత్యములేదు. ఇటులనే కాంగ్రెసునకు అతీతమై, ప్రెసిడెంటుతో సంబంధము లేకయే, న్యాయస్థానము లేర్పరచబడియున్నవి. ఈవిభజన వలన కల్గుబాధలు "అమెరికా ప్రభుత్వము" నందువివరింపబడినవి. కాంగ్రెసుపై ప్రెసిడెంటు ఆధారపడకుండుటవలన, కాంగ్రెసువారు తగినంతబాధ్యతకల్గి, తాత్కాలికావసరములకు వలయు శాసననిర్మాణము జేయుటకు, ప్రభుత్వావసరములకు అవసరమగు శిస్తుల వేయుటకు, ఉత్సాహపడజాలరు. అటులనే, తాము ప్రతిపాదించు శాసనముల కాంగ్రెసువారు అంగీకరింతురను నమ్మకము లేదు. శాసననిర్మాణకార్యక్రమునకు ప్రభుత్వము పూనుకొనదు. తాను తలపెట్టుకొన్న కార్యక్రమవిధానమును సాగించుటకు వలయుపన్నులను కాంగ్రెసు వేయునను ఆశ లేకుండుటచే, ప్రెసిడెంటెల్లప్పుడును నూతనకార్యనిర్వహణమునకు పూనుకొనజాలడు. పైగా ప్రెసిడెంటును, కాంగ్రెసు ప్రజలచే యెన్నుకొనబడును కనుక ఒకరిజూచిన మరొకరికి ద్వేషాసూయలుపెచ్చు పెరుగును. ఈ యిబ్బందుల తగ్గించుటకు, అప్పటినుండి (1800) యిప్పటివరకు వృద్ధిజెందుచుండిన రెండు రాచకీయపార్టీలు చాలవరకు సాయపడినవి. ఇంగ్లాండునందెట్లు రాజు, మూడుప్రభుత్వాంగములపై సమానమగు యాధిపత్యమువహించియు న్నాడో, అటులనే, అమెరికా యందును ప్రెసిడెంటుయొక్క పార్టీకిచెందినవారు కాంగ్రెసుయొక్క రెండుసభలయందును కొలదిగనో గొప్పగనో యుందురు. ఈకాంగ్రెసుసభ్యులకు, ప్రెసిడెంటునకు, సహకారముకల్గుట సులభసాధ్యము కనుక కార్యనిర్వాహకవర్గము కాంగ్రెసుయొక్క సభలలో సభ్యులుకాకున్నను, వారిమాట కొంతవరకు నుపయోగపడును. వారి ప్రతిపాదనలను చాలవరకాసభలయందలి సోదరపక్షీయులు బలపరతురు. ఈవిధముగా, ఈరెండుప్రభుత్వాంగముల మధ్యను సహకారము సాధ్యపరుపబడుచున్నది.

కాని మొత్తముమీద చరిత్రయొక్క యనుభవము ఈమూడుప్రభుత్వాంగములు నొకే అధికారియందుగాని, ఒకే

శాసనసభయందే
మత్రాంగవర్గము ఒక
భాగముగానుండుట.

సంస్థయందుగాని కేంద్రీకరింపరాదని జూపెట్టుచున్నది. తిరిగి, అమెరికాదేశమందువలె బొత్తిగా నేమాత్రపు సహకారము లేకుందా, ఈప్రభుత్వాంగములు పరస్పరముగా ప్రత్యేకింపబడుటయు నష్టదాయకము. బాధ్యతాయుత ప్రభుత్వవిధానము నేర్పరుచుచో, మంత్రాంగవర్గము పార్లమెంటునకు బాధ్యత వహించి యుండునంతకాలము కార్యనిర్వాహకవర్గము, శాసనసభల పరస్పరసంబంధమును అవినాభావముగా కల్గియున్నను నష్టమేమియు లేదు. ఇంగ్లాండునందువలెనే పార్లమెంటుయొక్క అనుమతిపై ప్రభుత్వ కార్య ముల నిర్వహించునంతవరకు మంత్రాంగవర్గముతో పార్లమెంటు సహకారమొనర్పవచ్చును. అటులనే, తన పెత్తనము నడపుటకువలయు శాసనాధికారమును నిర్మించి, ధనాగారమును నింపుటకు పార్లమెంటు సంసిద్ధతజూపువరకు, కార్యనిర్వాహకవర్గము పార్లమెంటుతో సహకారముచేయవచ్చును. ఈరెండు అంగములు పరస్పరముగా సహకారము చేసుకొనుచున్నంత కాలము, కార్యనిర్వాహకవర్గము పార్లమెంటుయొక్క ఆజ్ఞలకు కట్టుపడువరకు, బాధ్యతాయుత ప్రభుత్వము సాధ్యమగుటయేగాక ప్రజలకు క్షేమమాపాదించును. అమెరికాయందుకూడ పార్టీలమధ్యవర్తిత్వముతో కార్యనిర్వాహక వర్గమునకును, కాంగ్రెసునకును, పరస్పరతోడ్పాటు, ఆధారముకల్గుచున్నది. ఇందువలన శాసనముల నిర్మించుటకు మంత్రివర్గమును, కార్యనిర్వహణమునకు పార్లమెంటును, ఇంగ్లాండులో పూనుకొనవచ్చునని తలంపరాదు. ఏసంస్థ కేధర్మములు ప్రత్యేకముగా విధింపబడినవో, వానినే నిర్వర్తించ వలయును. కాని, వానికిమించి అనేకవిషయములందు రాజ్యాంగసౌష్టతకై వివిధసంస్థలు సహకారమొనర్చుకొనుచుండుట మేలుకాదా ! శాసననిర్మాణము చేయుటలో పార్లమెంటునకు మంత్రాంగవర్గమువారు సూచనలిచ్చి, తోడ్పాటు కల్గించి, తమయనుభవమును ధారవోసి, తమ నాయకత్వమును ప్రసాదించుటవలన ఎంతోలాభముకలదు! అటులనే ప్రభుత్వకార్య నిర్వహణమునకు వలయు శాసననిర్మాణమును నియమముల శాసించుటయు, ఎప్పటికప్పుడుచేయు పార్లమెంటుయుండుట కార్యనిర్వాహకవర్గమునకు లాభకరము కనుకనే అప్పటినుండి యేర్పడిన ప్రజాస్వామిక రాజ్యాంగములందు పార్లమెంటరీ బాధ్యతాయుతప్రభుత్వపద్ధతి యవలంబింపబడుచున్నది. అమెరికనుపద్ధతి నెవ్వరును అనుకరింపరైరి. అమెరికాయందిట్టి యవకాశములు సంపూర్ణముగా లేకుండుటచే అనేకయిబ్బందులు కల్గుచున్నవి. అప్పటికిని ప్రెసిడెంటుగారు తన సందేశములద్వారా కాంగ్రెసునకు శాసననిర్మాణము నందు దారిజూపెట్టుచున్నారు. మంత్రులు కాంగ్రెసుయొక్క కమిటీసమావేశములందు వివిధబిల్లులు చర్చకువచ్చునప్పుడు, తమయనుభవమును ధారవోయుచున్నారు.

పార్లమెంటుయొక్క ఆమోదము బడయునంతవరకే మంత్రాంగవర్గము అధికారమునందుండుటయు, సభలయొక్క అవిశ్వాసము ప్రకటితమైనంతనే రాజీనామా నిచ్చుటయు, ఇంగ్లండులోని "మెజారిటీ" పార్టీల ఆచారమైయున్నది. ఇందువలన, పార్లమెంటు మంత్రివర్గములమధ్య అన్యోన్యసహకారము సాధ్యమగుచున్నది. అమెరికాయందట్లుగాక, నాల్గువత్సరములవరకు, ప్రెసిడెంటు, స్థిరముగా అధికారమునందుండుటయు, అటులనే రెండువత్సరములవరకు అస్సెంబ్లీ సభ్యులు తమస్థానములందుండుటయు తటస్థించుచున్నందువలన, ఒకరి పైనొకరు ఆధారపడకుండుటచే, అన్యోన్యసహకారము దుస్సాధ్యమగుచున్నది.

న్యాయాధిపతుల విషయమున కూడ, తదితర ప్రభుత్వాంగములనుండి, న్యాయాధిపత్యము విభేధించియుండుటే శ్రేయము.

న్యాయాధి
పతులు.

మంత్రాంగవర్గమువారి యిష్టముననుసరించి, కోర్టులు తీర్పులజెప్పునంత కాలము, ప్రజలకు స్వతంత్రము మృగ్యమగునుగదా? నిరంకుశరాజుల పాలనమందుకల్గుచుండిన యిబ్బందులు తిరిగికల్గును. కార్యనిర్వాహకవర్గముపైకాని, శాసనసభపై కాని ఆధారపడక, స్వతంత్రించి, తమకు న్యాయమనితోచినరీతి, ధర్మసూత్రములనేకాక, రాజ్యశాసనములకూడ విచారించి, తీర్పుల జెప్పుకోర్టులగత్యము. కనుకనే, శ్రీమాంటెస్క్యూ కాలము నుండియు, రాచకీయజ్ఞులెల్లరు, న్యాయమూర్తులు తమయధికారమునడపుటకు, తమయుద్యోగముల నిల్పుకొనుటకు, మంత్రాంగవర్గముపై ఆధారపడియుండరాదనియు, వారికి ప్రభుత్వమునుండి సంపూర్ణమగు స్వాతంత్ర్యము కలుగవలెననియు వాదించుచున్నారు. కనుకనే అమెరికాయందు, రాజ్యాంగ నిర్మాతలు, సుప్రీముకోర్టుయొక్క న్యాయమూర్తులు, జీవితాంతమువరకు, ఎవ్వరియాజ్ఞలకు లోనుగాక, సర్వస్వతంత్రులై అధికారము వహించుటకర్హులని నిర్ణయించిరి. అదేవిధముగ ఇంగ్లాందునందును, ఉద్యోగముబొందిన పిదప ప్రతిన్యాయమూ ర్తియు, ప్రభుత్వముపై నేవిధముగను ఆధారపడక, స్వతంత్రుడై యుండునట్లేర్పాటుచేయబడెనది. న్యాయమూర్తులం దెవ్వరైన ఘోరకృత్యములజేయుచో, వారిని శాసనసభవారు, తమతీర్మానముద్వారా నిందితులగా పరిగణించిననేకాని మంత్రివర్గము, వారినిపదభ్రష్టులచేయరాదు. ఈనియమములనే, తదితర బాధ్యతాయుత రాజ్యాంగములన్నియు అవలభించుచున్నవి. కనుకనే, పెత్తనమందున్న ప్రెసిడెంటుయొక్క చర్యలకు విరుద్ధముగా, అమెరికా సుప్రీముకోర్టుతీర్పు చెప్పగల్గుచున్నది. ఈమధ్య (1932 సంవత్సరమున) న్యూ ఫౌండులాండునందు, ప్రధానమంత్రి శ్రీ "లాంగు"చే నడుపబడిన ప్రభుత్వచర్యలు, అశాస్త్రీయములని, సుప్రీముకోర్టువారు తీర్పుచెప్పుటబట్టి, అతడు పదభ్రష్టుడైనాడు.

బ్రిటిషువారి అధినివేశపు రాజ్యాంగములన్నిటి యందును, న్యాయమూర్తులు, కార్యనిర్వాహకవర్గపు పెత్తనమున కతీతులై యున్నారు. జర్మనీయం దింతకుమించి మరికొన్నియధికారములు, న్యాయమూర్తులకొసంగబడుచున్నవి. వారిని సక్రమమగు కారణములపైననే, వారియనుమతిచొప్పుననే, ఒకచోటనుండి మరొకచోటకు బదలీచేయుటకు, ఆదేశమందు వీలుకలదు. అమెరికా రాష్ట్రప్రభుత్వములందు మాత్రము న్యాయమూర్తులు పురాతనపు ఏథెన్సునందువలెను, మన గ్రామపంచాయతీ లందువలెను, ప్రజలచే ఎన్నుకొనబడుచు న్నారు. ఈపద్ధతి నగరరాజ్యములందును, గ్రామపంచాయితీలయందును, ఆకాలావసరములబట్టి అంతనష్ట దాయకముకాకున్నను, ఇప్పటిరాజ్యములందు మాత్రమెంతయు అనర్ధదాయకమగును. న్యాయశాస్త్రజ్ఞానములేనివారు న్యాయమూర్తులగుటయే అభిలషణీయముకాదు. పైగావారు ప్రజలచే, ప్రతిరెండు లేక నాల్గుసంవత్సరముల కొకమారెన్నుకొనబడుట మరింత అసంతృప్తికరము . ఫ్రాన్సునందు సాధారణ న్యాయస్థానములందలి న్యాయమూర్తులందరు న్యాయశాస్త్రపారంగతులై, యుద్యోగములందు ఖాయపరచబడియున్నారు. కాని, ప్రభుత్వమునకు ప్రజలకుమధ్యకల్గు వివాదముల వారు దీర్పనేరరు. "అడ్మినిస్ట్రేటివుకోర్టు"ల న్యాయమూర్తులు మాత్రము, ప్రభుత్వమున కేదో యొకవిధముగ లోబడియున్నారు. ఇది చాలయసంతృప్తికరమగు పర్యవసానముల కల్గించుచున్నది. ఇప్పటికన్ని దేశములందును, న్యాయమూర్తులు సక్రమవర్తనులై యుండునంతకాలము, తమ ఉద్యోగములందు సుస్థిరముగా నుండవలెననియు, వారిపై ప్రభుత్వమున కేలాటిపెత్తనము యుండరాదనియు, వారికి తమధర్మనిర్వహణమందు సంపూర్ణ స్వాతంత్ర్యము అవసరమనియు, వారిని ఒకచోటనుండి మరియొక చోటకు బదిలీచేయునప్పుడుకూడ వారి యిష్టాయిష్టముల గమనించవలెననియు రాచకీయజ్ఞులెల్లరు అంగీకరించుచున్నారు. ప్రభుత్వపు యీమూడుఅంగములు పరస్పరము సాధ్యమైనంతవరకు స్వాతంత్ర్యము బొందియుండవలెనన్నచో, ఒకకరికి

ఈమూడు అంగముల
మధ్య
వలయు సహకారము.

మరొకరితో నేలాటిసంబంధముండరాదని తలంపవలదు. ప్రజాస్వామికమేర్పరచబడిన దేశములందు స్విట్జర్లాండు, అమెరికాతప్ప, మిగతా అన్నిచోట్ల బాధ్యతాయుత ప్రభుత్వమే కలదు. అనగా మంత్రాంగవర్గము శాసనసభలో నొక్క కమిటీయైయుండి, ఆసభవారి యాజ్ఞాబద్ధమైయుండుచున్నది. అన్నిదేశములందును న్యాయమూర్తులు (అమెరికాసభ్య రాష్ట్రములందుతప్ప) కార్యనిర్వాహకవర్గము (ప్రభుత్వము) చే నియమింపబడుచున్నారు. న్యాయమూర్తులు ఎల్లయెడల శాసనసభవారి శాసనములను, కాలావసరముల ననుసరించి సాంఘికార్థిక, రాచకీయపరిస్థితులకు తగినట్లు తమవద్దకు విచారణార్థమై తేబడు వివాదములకు సంబంధించినంతవరకు అర్ధముజేసి చెప్పుచు, తమభాష్యములను తయారుచేయుచుందురు. ఆభాష్యములు న్యాయశాస్త్రమునందొక్క భాగమై, శాసనముల కనుబంధములగును. న్యాయమూర్తులు తమ శాఖయందు సక్రమవర్తనము ప్రచారితమగునట్లుజూచు కార్యనిర్వాహకాధికారముపొందియే యున్నారు. కార్యనిర్వాహకవర్గముకూడ ఈదినములందు కొంతశాసననిర్మాణాధికారము బొందుచున్నది. శాసనసభ అనేకవిషయములందు ప్రధానసూత్రములమాత్రము జేర్చి శాసనములనిర్మించి, మిగతావివరముల జేర్చుటకు మంత్రివర్గమునకు హక్కునిచ్చుచున్నది. ఇందువలన అనేకవందలనియమములు ప్రతివత్సరము ప్రభుత్వము ప్రకటించుచున్నది. ఇవన్నియు శాసన సమానమగుచున్నవి. ఈపద్ధతిహెచ్చుగా ఫ్రా\న్సు, జర్మనీలయందు, ఇప్పుడిప్పుడు, ఇంగ్లాండునందు ప్రచారితమగుచున్నది. మరియు, కార్మికసాంఘికవిషయములందు మంత్రాంగవర్గము తనయుద్యోగస్థులను కొందరిని న్యాయమూర్తులుగా నియమించి, ఏయేకార్మికులకు నష్టపరిహారమివ్వవలెను, ఎవ్వరు నిరుద్యోగపోషణకర్హులు, ఎవ్వరికి ఆరోగ్యరక్షణ కల్గించవలెను, ఆదిగాగలవిషయముల తీర్మానించుచుండును. కాని, శాసనసభయాజ్ఞల ననుసరించియే మంత్రివర్గము అనుబంధశాసనముల జేయును. కనుక అట్టివి శాసనములకు విరుద్ధమని న్యాయస్థానములు తీర్మానించనగును. మంత్రివర్గము, న్యాయస్థానములు సక్రమముగా ప్రవర్తించునట్లు న్యాయమూర్తులు చూడవలసియున్నది. మంత్రాంగవర్గపు అనుమతిపైననే న్యాయమూర్తులు తమశాఖాపరిపాలనమొనర్చుచుందురు. న్యాయమూర్తుల శాసనానుబంధములు శాసనసభయొక్క యిష్టాయిష్టములపై నాధారపడియుండును.

కనుక, ఈప్రభుత్వపు మూడుఅంగములు పరస్పరముగా సహకారము చేసుకొనుచునేయున్నవి. అట్టి పరస్పర సహకారము కడుంగడు అభిలషణీయము. కాని, ఒక్కొక్క అంగమునకు, ఒక్కొక్కవ్యవహారముపై సంపూర్ణాధికారముండుట మాత్రము లాభకరము. శాసనసభయొక్క శాసన నిర్మాణాధికారమునకు లోబడి, తదితర రెండు అంగములు, అవసరముబట్టి శాసనముల నిర్మించియు, మంత్రివర్గపు అధికారమునకు లోబడి, మిగతా రెండు అంగములు కార్యనిర్వాహకాధికారము చెలాయించుటయు, న్యాయమూర్తుల యాజ్ఞలకు లోనై కార్యనిర్వాహకవర్గమువారు అప్పుడప్పుడు న్యాయాన్యాయవిచారణచేయుటయుమాత్రము సాధ్యమగును. అట్లు పరస్పరముగా ఈమూడు ప్రభుత్వాంగములు ఇంగ్లాండునందు సంపూర్ణముగా సహకార మొనర్చుకొనుచున్నవి.పార్టీయొక్క మధ్యవర్తిత్వముద్వారా, కొంతవరకు అమెరికాయందు ఆసహకారము సాధ్యమగుచున్నది. బ్రిటిషువారి అధినివేశపుదేశములందు ఇంగ్లాండునందువలెనే సంతృప్తికరమగు పరిస్థితు లేర్పడినవి. జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీలందుమాత్రము న్యాయస్థానములు మంత్రివర్గపు ఆధిపత్యముక్రింద కొంతవరకు మూల్గుచున్నవని చెప్పకతప్పదు.

మనదేశమునందింకను ఈ మూడుప్రభుత్వాంగములు సంపూర్ణప్రత్యేక స్వాతంత్ర్యమును పొందనే లేదు. శాసనసభల

భారతదేశము.

నధిగమించి, గవర్నరు గవర్నరుజనరలుగారలు శాసన నిర్మాణాధికారము బొందియున్నారు. కార్యనిర్వాహకవర్గము వారు ఆర్డినెన్సులను తఱచుగా నిర్మించుచున్నారు. న్యాయమూర్తులపై, కార్యనిర్వాహకవర్గమువారు చాలా పెత్తనముచేయుచున్నారు. అందును, క్రిమినలు కోర్టులపై, కార్యనిర్వాహకవర్గమునకు అత్యధికమగు పైపెత్తనముకలదు. కార్యనిర్వాహకవర్గపుయుద్యోగులే క్రిమినలు కోర్టులందు మేజస్ట్రేటులుగానుండుటవలన ప్రజలకు, ప్రభుత్వముతో వివాదముకల్గినప్పుడు ప్రభుత్వముతరపుననే తీర్పులు సంపాదితమగుచున్నవి. మనకు వివిధప్రభుత్వాంగముల యొక్క స్వాతంత్ర్యసిద్ధి చాలయవసరముగానున్నది. అప్పుడే ప్రజలస్వాతంత్ర్యములు సురక్షితములగును. ప్రజలస్వాతంత్ర్యమును ప్రభుత్వము నిరోధించుచున్నచో న్యాయమూర్తులు ప్రభుత్వమును ప్రతిఘటించుచుండవలెను. న్యాయమూర్తులు తమకిష్టమున్నట్లు అనర్ధదాయకమగు భాష్యముల జెప్పుచున్నచో యాశాసనముల శాసనసభవారు సవరించవచ్చును. ప్రజలకు కంటకముగా నుండు ప్రభుత్వమును శాసనసభవారు పద భ్రష్టతనొందించవచ్చును. తుదకు శాసనసభయే, ప్రజలసహకారముతో, రాజ్యాంగమందు సంపూర్ణ రాజ్యాధికారమును, ప్రజలతరపున పొందియుండును. అప్పుడే భారతీయులకుగాని,తదితరులకుగాని, స్వతంత్రరక్షణ కల్గును. ఇట్టి సంపూర్ణాధికారము, శాసనసభల కొసంగుట యుచితముకాదనియు, మెజారిటీలు ప్రజలహింసించుటకై శాసనముల నిర్మించవచ్చుననియు, కనుక అట్టి శాసనసభయొక్క అధి కారమును కొంతవరకు నియమబద్ధము చేయవలెనని కొందరు రాచకీయజ్ఞులు వాదించుచున్నారు. కనుకనే రాజ్యాంగవిధానచట్టమునందు శాసనసభవారిపై కొన్నియంకుశములు నిర్ణయింపబడుచున్నవి. ఎప్పుడు శాసనసభ యేయంకుశమును అధికమించుచున్నదో నిర్ణయించు యధికారము, న్యాయమూర్తుల కివ్వబడుచున్నది. అప్పుడైనను, న్యాయమూర్తులు నిరంకుశముగా, శాసనసభవారి శాసనముల చట్టవిరుద్ధమని తీర్మానించకుండునట్లు చేయుటకై, నియమితమైన, మెజారిటీవలననే, న్యాయమూర్తులు, శాసనసభవారి శాసనములయొక్క సభ్యతగూర్చి తీర్మానించవలెనని రాచకీయజ్ఞులభిప్రాయపడుచున్నారు.



_________________