ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర/యూరోపియన్‌ల రాక

వికీసోర్స్ నుండి

చేసి చంపాడని రాయలకు తెలిసింది అందువల్ల తిమ్మని, తిమ్మరుసును బంధించి వారి కళ్లు పీకించి వేశాడు. ఈ పరిణామాల వల్ల శ్రీ కృష్ణదేవరాయలు తన చివరిరోజుల్లో అశాంతికి గురయ్యాడు. తన సవతి తమ్ముడైన అచ్యుతరాయల్ని రాజుగా ప్రకటించి క్రీ. శ 1529 సంవత్సరాంతంలో మరణించాడు.

రాయల గొప్పతనం

దక్షిణ భారతాన్నేలిన రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒక విశిష్ఠ స్థానాన్ని ఆక్రమించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప యుద్దవీరుడుగా, సమర్దుడైన పాలకుడుగా, కళాసాహిత్యాల ఉదారపోషకుడుగా, శ్రీకృష్ణదేవరాయలు కీర్తిని గడించాడు ఆయనే ఒక ఇతిహాసంగా మారిపోయాడు. చదవులు రాని గ్రామస్థులు, పిల్లలు కూడ రాయల విజయాల్ని గూర్చి నెమరు వేసుకుంటారు రాయల సామ్రాజ్యానికి కేంద్రస్థానంగా ప్రస్తుత ఆంధ్రదేశంలోని రాయలసీమ జిల్లాలు ఉండేవి

ఒక యుద్ధవీరుడుగా రాయలు తన పరాక్రమాన్ని శత్రురాజులైన దక్కను సుల్తానులకు, ఒరిస్సా పాలకులకు చవిచూపించాడు బహమనీ రాజ్యంపై రాయలు చేసిన దండయాత్రలు అతని సైనిక శక్తిని, యుద్దవ్యూహాన్ని స్పష్టం చేస్తాయి దక్కను ప్రాంతంలో రాజకీయ సుస్థిరతను కాపాడటానికి రెండుసార్లు బహమనీ రాజవంశాన్నే సింహాసనంపై అదిష్టింపచేశాడు ఇదే విధంగా పోర్చుగీసువారితో రాయలకున్న స్నేహసంబందాల వల్ల 16వ శతాబ్దిలోని రాజకీయ పరిస్థితిని రాయలు క్షుణ్ణంగా అర్దం చేసుకున్నట్టు మనకు అర్దమవు తుంది. రాయలు జరిపిన ఒరిస్సా దండయాత్రలు ఆ కాలం నాటి సైనిక చరిత్రలో గొప్ప విజయాలుగా మిగిలిపోయాయి.

పాలకుడుగా రాయలు తన సామర్ద్యాన్ని నిరూపించుకున్నాడు విస్తృతమైన విజయనగర సామ్రాజ్యాన్ని మండలాలుగాను, నాడులుగాను, సీమలుగాను విభజించి చిన్నచిన్న గ్రామాలు కూడ ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందేటట్టు చూడగల్గాడు

కళాసాహిత్య రంగాలకు ఆశ్రయమిచ్చి వాటిని పోషించడంలో రాయలకు మించినవారు లేరు తెలుగు సాహిత్య చరిత్రలో రాయల యుగాన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు ఇంగ్లాండులో ఎలిజబెత్తు యుగానికి గ్రీసులో 'పెరిక్లీను' యుగానికి రాయల కాలాన్ని పోల్చవచ్చు. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే ఉద్దండ కవులుండేవారు. వీరిలో మనుచరిత్ర కారుడైన అల్లసాని పెద్దన సాటిలేని మేటి కవిగా ప్రసిద్ది చెందాడు ఈయన్నే ఆంధ్రకవితాపితామహుడని కూడ అంటారు. పారిజాతాపహరణ కావ్యాన్ని వ్రాసిన నందితిమ్మన మాదయగారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామలింగ కవి అష్టదిగ్గజాల్లోని మిగిలిన కవులు. రాయలు కూడ స్వయంగా గొప్ప కవిత్వాన్ని ఛెప్పగల్గాడు. ఆయన రచించిన 'ఆముక్తమాల్యద' అనే గ్రంధం తెలుగు సాహిత్యంలో ఎన్నదగిన ప్రబంధంగా గుర్తింపబడింది. రాయలు సంస్కృత కన్నడ సాహిత్యాల్ని కూడ పోషించాడు

శ్రీకృష్ణదేవరాయలు గొప్ప కట్టడాలు నిర్మించాడు విజయనగరంలోని హజార రామాలయం, విరలస్వామి ఆలయం రాయలు నిర్మించినవే. తన తల్లి జ్ఞాపకార్ధం నాగలాపురమనే పట్టణాన్ని నిర్మించాడు ఒక మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయలు ఆసియా, ఐరోపా దేశాల్లో విరాజిల్లిన గొప్ప చక్రవర్తులతో సమానుడని చెప్పవచ్చు.

విజయనగర సామ్రాజ్య పతనం

శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఆయన సవతి తమ్ముడు అచ్యుతరాయలు క్రీ శ 1530 నుండి 1542 వరకు రాజ్యపాలన చేశాడు అచ్యుతరాయలు కౄరమైన మనస్తత్వం కలవాడు కావడంతో రాజ్యపాలనం సక్రమంగా చేయలేకపోయాడు. అధికారాన్నంత తన మంత్రియైన ఆరవీడు రామరాజు చెలాయించేవాడు. ఆరవీడు రామరాజు కృష్ణదేవరాయల అల్లుడు అచ్యుతరాయల తర్వాత ఆయన కుమారుడు మొదటి వెంకటరాయలు రాజ్యాదికారానికి వచ్చాడు కాని అనతికాలంలోనే మరణించాడు. తర్వాత రామరాయలు అచ్యుతరాయల తమ్ముడి కుమారుడైన సదాశివరాయల్ని క్రీ. శ 1543లో రాజుగా ప్రకటించి ప్రభుత్వాన్ని తానే నిర్వహించాడు.

తాళికోట యుద్ధం (క్రీ. శ. 1565)

తన అధికారాన్ని, కీర్తిని పెంచుకునేందుకు రామరాయలు దక్కను సుల్తానులైన బిజాపూరు, అహమ్మదు నగరు, గోల్కొండ పాలకుల వ్యవహారాల్లో తలదూర్చేవాడు 1543లో రామరాయలు అహమ్మదు నగరు, గోల్కొండ సుల్తానులతో చేతులు కలపి బిజాపూరు రాజ్యంపై దండెత్తాడు పదిహేను సంవత్సరాల తర్వాత (1558) బిజాపూరు సుల్తానుతో చేతులు కలపి అహమ్మదు నగరుపై దండయాత్ర చేశాడు. ఈ పరిస్థితుల్లో ముస్లిం రాజ్యాలు కూడ పల్కుకొని తమ మధ్యగలవైరాన్ని విస్మరించి కలసికట్టుగా రామరాయలపై యుద్ధాన్ని ప్రకటించడానికి నిర్ణయించాయి దీని ఫలితమే తాళికోట యుద్దం

రాక్షస తంగడి అని కూడ వ్యవహరింపబడే ఈ తాళికోట యుద్ధం జనవరి 25, 1565న జరిగింది మొదట విజయనగర సైన్యానికి విజయం చేకూరినా, ముస్లింల కాల్బలం ముందు వారు నిలువలేకపోయారు. ముస్లింల బందీగా చిక్కిన రామరాయల తలను అహమ్మదు నగరు సుల్తాను హుస్సేను నిజాంషా నరికి వేశాడు

తాళికోట యుద్దం తర్వాత ముస్లిం రాజ్యకూటమి మరల విడిపోయింది యధాప్రకారం అంతఃకలహాలు మొదలయ్యాయి ఈ పరిస్థితి రామరాయల తమ్ముడైన తిరుమల రాయల పాలనలో విజయనగరం తిరిగి కోలుకోవడానికి దోహదపడింది 1570లో తిరుమల రాయలు నామమాత్రంగా సాగుతున్న సదాశివరాయల్ని పదవీచ్యుతిని చేసి సింహాసన మదిష్టించాడు ఈ విధంగా ఆరవీడు వంశరాజుల పాలన మొదలయింది విజయనగరాన్నేలిన చివరి రాజవంశం గూడ ఇదే రెండవ వెంకట రాయల కాలంలో విజయనగర రాజధానిని చిత్తూరు జిల్లాలోని చంద్రగిరికి మార్చారు ఆరవీడు వంశం క్రీ.శ 1675 వరకు తన అధికారాన్ని కొనసాగించగల్గింది

కుతుబ్‌షాహి వంశం గోల్కొండ‌ రాజ్యం ( 1512 1687)

విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన తొమ్మిది సంవత్సరాలకు (క్రీ. శ 1347 లో) అల్లాయుద్దీన్‌ జాఫర్‌ ఖాన్‌ బహమనీ దక్కను ప్రాంతంలో బహమనీ రాజ్యంగా వ్యవహరింపబడే ఒక ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. ఈ బహమనీ రాజ్యం రాయచూరు ప్రాంతంపై (కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం) పట్టు సంపాదించడం కోసం విజయనగర రాజ్యంతో అనేక యుద్దాలు చేసింది. చివరికి 1526లో పతనమయింది. పతనమయిన ఈ బహమనీ రాజ్యంలో మరల అయిదు కొత్త సుల్తానుల రాజ్యాలు లేచాయి. అవి 1.ఇమాద్‌ షాహి వంశం పాలించే బేరారు 2 నిజం షాహి వంశం పాలించే అహమ్మదు నగరు ౩ ఆదిల్‌ షాహి వంశం పాలించే బిజాపూరు 4 కుతుబ్‌షాహి వంశం పాలించే గోల్కొండ 5 బరిదుషాహి వంశం పాలించే బీదరు రాజ్యాలు.

కుతుబ్‌షా (1512-1543)

సుల్తాను కులి షియా జాతికి చెందినవాడు క్రీ శ 1514లోను, 1530లోను బీదరు, బీజాపూరుల మధ్య జరిగిన కలహాల్లో ఈయన బీదరుకు సహాయాన్ని అందించాడు దాదాపు 98 సంవత్సరాలు జీవించి తన కుమారుడైన జంషిద్‌ చేత చంపించబడ్డాడు

జంషిద్‌ (1543-1550)

జంషిద్‌ ఏడు సంవత్సరాలు మాత్రమే పాలించినా బీజాపూర్‌ లో అనేక యుద్దాలు చేశాడు క్రీ శ 1550లో శైశవదశలో ఉన్న తన కుమారుడైన నుబాన్‌‌ను రాజుగా ప్రకటించి ప్రాణాలు వదిలాడు కాని సుబాన్‌ మామయై న ఇబ్రహీం అతనిని పదవీచ్యుతుణ్ణి చేసి సుల్తానుగా తన్ను తాను ప్రకటించుకున్నాడు

ఇబ్రహీం (1550 -- 1580)

ఇబ్రహీం అహమ్మదునగరు సుల్తాను మొదటి హుస్సేను నిజాంషా కుమార్తెను వివాహమాడాడు. విజయనగర రాజ్యానికి వ్యతిరేకంగా ముస్లిం కూటమిని ఏర్పాటు చేయడంలో ఇబ్రహీం నాయకత్వం వహించాడు. ఈ కూటమే 1565లో జరిగిన తాళికోట యుద్ధంలో విజయగనర సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసింది ఇబ్రహిం కాలంలోనే వరంగల్లు శాశ్వతంగా గోల్కొండ రాజ్యంలో కలిపివేయబడింది.

ముహమ్మదు కులి కుతుబ్‌షా (1580-1612)

హైదరాబాదు నగర స్థాపకుడుగా పేరుగాంచిన ముహమ్మద్‌ కులి కుతుబ్‌ షా 1589లో గోల్కొండకు పది మైళ్ళ దూరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు ఈ నగరానికి తన హిందూ ప్రేయసియైన భాగమతి పేరు మీదుగా 'భాగ్యనగరు' అని పేరు పెట్టాడు. తర్వాత కాలంలో ఈ భాగ్యనగరాన్నే హైదరాబాదు అని వ్యవహరించడం జరిగింది హైదరాబాదులోని ముఖ్య కట్టడమైన చార్మినార్‌ ఇతని కాలంలో నిర్మింపబడ్డదే. ఈయన తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన ముహమ్మదు క్రీ. శ 1612 నుండి 1626 వరకు రాజ్యపాలన చేశాడు

అబ్దుల్లా కుతుబ్‌షా (1626-1672)

క్రీ. శ. 1635లో మొగలు చక్రవర్తియైన షాజహాన్‌ ఆధిపత్యాన్ని అబ్దుల్లా అంగీకరించవలసి వచ్చింది. ఈ సంఘటనకు ముందే 1634లోతూర్పు ఇండియా కంపెనీకి ఆంధ్రతీరప్రాంతంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఒక 'సువర్ణ ఫర్మాను'ను అబ్దుల్లా జారీ చేశాడు. అబ్దుల్లా ప్రధాన మంత్రియైన మీర్‌‌జుమ్లా ప్రభుద్రోహిగా మారి ఔరంగజేబుతో రహస్యంగా మంతనాలు జరిపాడు. దీని ఫలితంగా దక్కను ప్రాంతానికి మొగలు రాజప్రతినిధి అయిన ఔరంగజేబు 1655లో గోల్కొండపై దాడిచేసి హైదరాబాదు నగరాన్ని దోచుకున్నాడు. దీంతో అబ్దుల్లా పెద్ద మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించి ఔరంగజేబుతో సంధి కుదుర్చుకోవలసి వచ్చింది అబ్దుల్లా తర్వాత ఆయన మేనల్లుడు అబుల్‌ హసన్‌ తానీషా అధికారాన్ని చేపట్టాడు.

అబుల్‌ హసన్‌ (తానీషా) 1672-1687

అబుల్‌ హసన్‌కు ప్రధానమంత్రిగా వైష్ణవ బ్రాహ్మణుడైన అక్కన్న ఉండేవాడు. ఇతని తమ్ముడు మాదన్న సర్వసైన్యాధిపతిగా ఉండేవాడు. ఫిబ్రవరి, 1677 లో ఔరంగజేబుకు వ్యతిరేకంగా శివాజీతో అబుల్‌ హసన్‌ సంధి కుదుర్చుకున్నాడు మార్చి, 7, 1677న శివాజీ హైదరాబాదును సందర్శించాడు ఆ సమయంలో శివాజీని తానీషా విశేషంగా ఆదరించి సన్మానించాడు ఇది పసిగట్టిన ఔరంగజేబు 1687 లో గోల్కొండపై దండెత్తి వచ్చాడు. మతోన్మాదులైన కొందరు ముస్లింలు అక్కన్న, మాదన్నల్ని చంపేశారు. అబ్దుల్‌ రజాక్‌ అనే సేనాపతి గోల్కొండ దుర్గాన్ని సమర్దవంతంగా కాపాడాడు. ఏడునెలల ముట్టడి తర్వాత కూడ గోల్కొండ దుర్గం ఔరంగజేబు వశం కాలేదు దీంతో ఔరంగజేబు విశేషంగా లంచమిచ్చి కోటలోనికి ప్రవేశించగలిగాడు. అబ్దుల్‌ రజాక్‌ ధైర్యసాహసాలతో పోరాటం జరపినా ఫలితం లేకపోయింది. కాని రజాక్‌ ఔరంగజేబు క్రింద పనిచేయడానికి ఒప్పుకోలేదు. తానీషా బందీ అయ్యాడు దౌలతాబాదులోని చెఱసాలలో ఉంచబడ్డాడు. 1687 అక్టోబరు నెలలో గోల్కొండ రాజ్యం పతనమయింది. దీంతో కుతుబ్‌షాహి వంశపాలన అంతమయింది. గోల్కొండ మొగలు సామ్రాజ్యంలో విలీనం చేయబడింది.

మొగలుల దక్కను ఆక్రమణ

తాళికోట యుద్ధం (25 జనవరి 1565) తర్వాత దక్కను సుల్తానులు పూర్వంలాగే‌ పరస్పరం కలహించుకోవడం ప్రారంభించారు. వీరి కలహాల్ని ఆసరాగా తీసుకొని దక్కనులో తన ఆధిపత్యాన్ని స్థాపించాలని మొగలు చక్రవర్తి అక్బరు ప్రయత్నించాడు మొదట క్రీ. శ 1695లో అహ్మదునగరును ముట్టడించాడు. రాణి అయిన చాంద్‌ బీబీ నగరాన్ని రక్షించడానికి సర్వశక్తులా ప్రయత్నించింది. అయినా లాభం లేకపోయింది. మొగలుల ఆధిపత్యాన్ని అంగీకరించి, బీరారును వదలుకోవలసి వచ్చింది క్రీ శ 1600లో రెండవసారి మరో దండయాత్రని ఎదుర్కోవలసి వచ్చింది. తర్వాత షాజహాను కాలంలో ఈ రాజ్యం మొత్తాన్ని మొగలు సామ్రాజ్యంలో విలీనం చేయగల్గారు.

షియా తెగకు చెందిన గోల్కొండ, బిజాపూరు రాజ్యాలంటే షాజహానుకు వ్యతిరేక భావం ఉండేది. అందువల్ల క్రీ శ 1636లో ఈ రాజ్యాలపై దండయాత్ర చేసేందుకు తన సెన్యాన్ని దక్కను ప్రాంతం వైపు నడిపించాడు

గోల్కొండ ప్రభువైన కుతుబ్‌ షాహి వంశస్థుడు అబ్దుల్లా, షాజహాన్‌ ఆధిపత్యాన్ని అంగీకరించి ప్రతిఏటా కప్పం కట్టడానికి ఒప్పుకున్నాడు ఔరంగజేబు దక్కను ప్రాంతానికి మొగలుల రాజప్రతినిధిగా నియమించబడ్డాడు అప్పటికి దక్కను ప్రాంతంలో ఖాందేష్,‌ బేరారు, దౌలతాబాదు, తెలంగాణా కొంతభాగం మొగలుల ఆధీనంలో ఉండేవి. 1644లో ఔరంగజేబు ఆగ్రాకు తిరిగి వచ్చాడు. మరల 1653లో జౌరంగజేబు దక్కను ప్రాంత రాజప్రతినిధిగా రెండవసారి వచ్చి నాలుగు సంవత్సరాల పాటు గడిపాడు

గోల్కొండ పతనం

క్రీ. శ. 1682లో ఔరంగజేబు మహారాష్ట్రుల ఆధిపత్యాన్ని, బిజాపూరు, గోల్కొండ రాజ్యాల్ని అణచివేయడానికి చక్రవర్తి హోదాలో స్వయంగా వచ్చాడు. 1686లో బిజాపూరును స్వాధీనం చేసుకున్నాడు. 1685 జూన్‌ భారత దేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడంలో పోర్చుగీసు నావికులు ముందంజ వేశారు. పోర్చుగల్‌ రాజైన హన్రీ గొప్ప నావికుడుగ ప్రసిద్ధి చెందాడు. ఆయన భారత దేశానికి సముద్రమార్గాన్ని కనుగొనేందుకు పోర్చుగీసు నావికుల్ని ప్రోత్సహించాడు. హెన్రీ ప్రయత్నాలు క్రీ. శ 1498లో సఫలీకృత మయ్యాయి. వాస్కొడిగామా అను పోర్చుగీసు నావికుడు 1498 లో భారత దేశపు పశ్చిమ తీర ప్రాంతమైన కాలికట్‌ కు చేరుకున్నాడు. దీంతో చిరకాలంగా ఎదురుచూచిన కొత్త సముద్ర మార్గం కనుగొన బడింది.

కాలికట్‌ రాజైన జమోరిన్‌ పోర్చుగీసు వారికి హృదయ పూర్వకంగా స్వాగతం పల్కాడు. మరికొంత కాలానికే కాలికట్‌, కొచ్చిన్‌, కన్ననూరు ప్రాంతాల్లో పోర్చుగీసువారు తమ వ్యాపార కేంద్రాల్ని స్తాపించారు. భూమార్గం మీదుగా యూరపులో సాగుతున్న ఆసియా వ్యాపారాన్నంతా ముస్లింల నుండి కైవశం చేసుకుని తాము కనుగొన్న కొత్త సముద్ర మార్గానికి మళ్లించడం, ఇండియాతోనేగాక తదితర తూర్పు దేశాలైన ఆగ్నేయాసియా, చైనా వంటి దేశాలతో కూడ తమ వ్యాపారాన్ని విస్తృత పరచడం వంటివి పోర్చుగీసువారు తమ ప్రదాన లక్ష్యాలుగ పెట్టుకున్నారు.

క్రీ. శ. 1500 - 1509 సంవత్సరాల మధ్య కాలంలో హిందూ మహా సముద్రంపై తమ ఆధిపత్యాన్ని స్థాపించడంలో పోర్చుగీసువారు సఫలీకృతులయ్యారు. క్రీ. శ. 1503లో వారు కొచ్చిన్‌ వద్ద ఒక నౌకా స్థావరాన్ని ఏర్పరచుకొన్నారు ఆ తర్వాత సంవత్సరములోనే ఇండియాలోని పోర్చుగీసు ప్రాంతాలకు రాజప్రతినిధిగా నియమింప బడ్డ ఫ్రాన్సిస్‌ది ఆల్మైడా కొచ్చిన్‌ చేరుకున్నాడు. ఆయన తన కున్న వనరుల్ని భారతదేశంలో వలస రాజ్యాన్ని స్థాపించడం కోసం వినియోగించ కూడదనుకున్నాడు. సముద్రంపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ వ్యాపారాన్ని వృద్ది చేసుకోవాలని భావించాడు. అందుకే పోర్చుగీసువారు తమ కార్యకలాపాల్ని వ్యాపారం వరకే పరిమితం చేసుకున్నారు. ఆల్మైడా అనుసరించిన ఈ పద్ధతినే 'నీలి నీటి విధానం' (Blue Water Policy) అని వ్యవహరిస్తారు.

ఆల్మైడా తర్వాత రాజ ప్రతినిధిగ వచ్చిన ఆల్పన్సోడీ అల్బూకర్క్‌ నీలి నీటి విధాన్ని పూర్తిగా త్రోచిపుచ్చి భారతదేశంలోని భూభాగాల్ని ఆక్రమించడానికి ఉపక్రమించాడు. క్రీ. శ. 1510లో గోవాను, 1511లో మలక్కా దీవిని ఆక్రమించాడు. శ్రీ కృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో స్నేహ సంబంధాల్ని ఏర్పరచుకొని గోవా పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేందుకు అంగీకరించాడు పోర్చుగీసువారు మలక్కాదీవిని ఆక్రమించడమేగాక ఆగ్నేయాసియాలోని దీవుల్ని కూడ స్వాధీనం చేసుకున్నారు

తూర్పు దేశాలతో నిరాటంకంగా సాగుతున్న పోర్చుగీసు వ్యాపారానికి క్రీ శ 16వ శతాబ్ది చివరి కల్లా డచ్చి దేశీయుల నుండి పోటీ ఎదురయింది లిస్బన్‌ వంటి నౌకా కేంద్రాలనుండి సుగంద ద్రవ్యాలు మొదలగు తూర్పు దేశపు వస్తువుల్ని కొనుగోలు చేసి డచ్చివారు ఉత్తర యూరపులో అమ్మేవారు కాని 1594లో స్పెయిన్‌ - పోర్చుగల్‌ రాజైన రెండవ ఫిలిప్‌ తన రాజ్యంలోని లిస్బన్‌ మొదలగు నౌకాకేంద్రాలలోకి డచ్చివాళ్ళ ప్రవేశాన్ని నిషేదించాడు దీంతో సుగంధ ద్రవ్యాలు డచ్చి ప్రజలకు అందకుండా పోయాయి. తూర్పు దేశాల వస్తువుల్ని నేరుగా కొనుగోలు చేయడానికి డచ్చివారు నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో తూర్పు దేశాలతో వ్యాపారం నిర్వహించేందుకు డచ్చివారికి అనుకూలవాతావరణం ఏర్పడింది

వాన్‌‌లిన్స్‌ కొటన్‌ అను డచ్చి ప్రయాణీకుడు ఆగ్నేయాసియాలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడపి క్రీ శ 1592లో మాతృభూమిని చేరుకున్నాడు. ఆయన తన అనుభవాల్ని రెండు పుస్తకాల రూపంలో వెలువరించాడు. వీటిలో 1595లో వెలువడిన Rcvsgeschrift అనే పుస్తకం మొదటిది. 1596 లో వెలువడిన Itincrario అన్నది రెండవది. మొదటి పుస్తకం తూర్పు సముద్రాల నావికా మార్గాల్ని సూచించేది కాగా, రెండవది తూర్పు దేశాళ్లో తాను జరిపిన ప్రయాణపు అనుబవాల్ని గురించి చెపుతుంది ఈ రెండు పుస్తకాలు యూరోప్‌పై విపరీత ప్రభావాన్ని చూపాయి. మొదటి సారిగా తూర్పు దేశాల్ని గురించిన నిజమైన వివరాల్ని యూరోపియనులు తెలుసుకో గల్గారు. హాలండు దేశ వర్తకులు 1595లో వర్తక సంఘాన్ని (Campaignie Van verrc) ఏర్పాటు చేసుకొన్నారు. కార్నెలిస్‌ ది హాట్‌ మాన్‌ నాయకత్వంలో వారు ఆగ్నేయాసియాకు వ్యాపార సాహస యాత్రకు ఉపక్రమించారు. క్రీ. శ. 1596 జూన్‌ నెలలో జావాకు వాయవ్య తీరంలో వున్న 'బాంతమ్‌' ఓడ రేవుకు చేరుకున్నారు. ఈ వ్యాపార యాత్ర విజయవంతం కావడంతో 1595-1601 మధ్య కాలంలో పోటీ మనస్తత్వంగల కొన్ని స్వతంత్ర బృందాలు దాదాపు 15 యాత్రలు నిర్వహించాయి క్రీ. శ 1600 నాటికి ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు కావడంతో డచ్చి నెదర్లాండు పాలకులు కూడ వివిధ బృందాలుగ వున్న వ్యాపారస్థులందర్ని కలిపి ఒకే వర్తక సంఘాన్ని ఏర్పాటు చేయ దల్చారు. తూర్పు దేశాలపై తమకున్న వ్యాపార పరమైన ఆది పత్యాన్ని నిలుపుకోవాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంవల్లే క్రీ శ 1602లో నెదర్లాండ్‌ యునైటెడ్‌ ఈస్టిండియా కంపెనీ అనే వ్యాపారసంస్థప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడింది

సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని తమ గుత్తాదిపత్యం క్రిందికి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో డచ్చివారు మొదట భారత దేశంపై కంటె తూర్పు దీవులపైన్నే తమ దృష్టిని కేంద్రీకరించారు. డచ్చి ఈస్టిండియా కంపెనీ మొదట విల్‌ బ్రాండ్‌ వాన్‌ వార్విజిక్‌ నాయకత్వంలో 15 వ్యాపార నౌకల్ని పంపింది తూర్పు దీవుల్లోని జావా, సెలిబస్‌ మొదలగు ప్రాంతాల్లో ఫ్యాక్టరీల్ని స్థాపించింది ఇండియాలో సూరత్‌, మచిలీపట్నం, పేటపోలి (కృష్ణా జిల్లా) ప్రాంతాల్లో డచ్చి ఫ్యాక్టరీలు వెలశాయి నాగపట్నం, నరసాపురం, బీముని పట్నం, చిన్సురా (బెంగాలు) మొదలగుచోట్ల కూడ డచ్చివారు ఫ్యాక్టరీలు స్థాపించారు.

ఆంగ్లేయుల రాక

ఇంగ్లాండు దేశం కూడ ఇతర యూరపు దేశాల వలెనే సుగంధ ద్రవ్యాల్లాంటి తూర్పు దేశపు వస్తువుల్ని ఇటలీ వ్యాపార నౌకల ద్వారా తమ నౌకా కేంద్రాలకు తెచ్చుకునేవారు. తాము వుత్పత్తి చేస్తున్న ఉన్ని దుస్తుల్ని ఆసియాదేశాల్లో విక్రయించి, ఆసియాలో వ్యాపార సంబంధాల్ని వృద్ది చేసుకునేందుకు ఇంగ్రండు కూడ మక్కువ చూపింది కాని క్రీ శ 17వ శతాబ్ది వరకు వివిధ కారణాలవల్ల తూర్పు దేశాలతో వ్యాపారాల్ని ఇంగ్లాండు చేపట్టలేక పోయింది సుదూర సముద్రయానానికి తగిన నౌకా సంపత్తి లేకపోవడం, అట్లాంటిక్‌ సముద్రం భౌగోళికంగా ఇంగ్లాండు దేశాన్ని మధ్యధరా సముద్రంలో సాగే యూరపు వ్యాపారానికి దూరంగా వుంచడం ఈ వెనుక బాటు తనానికి ముఖ్య కారణాలుగ చెప్పవచ్చు. కాని 16వ శతాబ్దాంతానికి ఇంగ్లాండు తనకు కల్గిన అవరోధాల్ని అధిగమించ కల్గింది తన నౌకాయాన సామర్థ్యాన్ని పటిష్టం చేసుకో కల్గింది హిందు మహాసముద్రం, అట్లాంటిక్‌ సముద్రాల్లో ప్రవేశం అవరోధ రహితం కావడంతో సముద్రాంతర మార్గాల విషయంలో తన భౌగోళిక స్థితిని వుపయోగించుకోడానికి సకల విధాల ప్రయత్నించింది

స్పెయిన్‌ దేశంతో విరోధం వల్ల తద్విరుద్దమైన విదేశీ విధానాన్ని పాటించేందుకు ఇంగ్లాండు వలసరాజ్యస్థాపకు, వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు ప్రయత్నించింది క్రీ శ 1574లో ఇంగ్లీషు నావికుడైన ఫ్రాన్సిస్‌ డ్రేక్‌ మొలుక్కస్‌లోని టెర్నేట్‌ను సందర్శించాడు ఇతడు తన ప్రయాణంలో ఉపయోగించిన అతివేగంగా నడిచే తేలిక పాటి నౌకలు సముద్రయానానికి అనువైనవని తేలడంతో ఇంగ్లాండుకు ఆత్మస్థైర్యం కల్గింది దీనికి తోడు లండను వర్తకులు తూర్పు దేశాలతో వ్యాపారానికి తమ సంస్దిధతసు వ్యక్త పరిచారు. కాని గుడ్‌ హోప్‌ అగ్రంగుండా సముద్ర ప్రయాణం ప్రమాద పూరితమైంది కావడంతో మొదటి ఎలిజబెత్తు రాణి తన అనుమతిని ఇచ్చి తగిన విధంగా ప్రోత్సహించలేక పోయింది

1583లో రాల్ఫ్‌ ఫిల్స్‌ అను ఆంగ్లేయుడు పర్షియా గల్ఫ్‌ ప్రాంతం చేరుకున్నాడు. ఇతనిని పోర్చుగీసువారు బందించి గోవాకు తీసుకువచ్చారు. కాని ఇతడు చెరనుండి తప్పించుకుని మలక్కా_ దీవికి వచ్చి అక్కడినుండి మాతృభూమికి చేరుకున్నాడు. భారత దేశ సంపదను గురించి ఇతడు అందజేసిన వివరాలతో తూర్పు దేశాలతో వ్యాపారం నిర్వహించాలన్న బ్రిటీషు వర్తకుల వాంఛ ద్విగుణీకృతమైంది. క్రీ శ 1588లో స్పెయిన్‌ దేశంపై ఇంగ్లండు విజయం సాధించడంతో ఈ వర్తకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. డచ్చి ప్రయాణీకుడైన వాన్‌ లిన్స్‌ కొటెన్‌ ప్రచురించిన రెండు పుస్తకాలు అందజేసిన వివరాలతో బ్రిటీషు వర్తకులకు సముద్రయానాన్ని గురించిన భయాలు తొలగిపోయాయి. దీంతో లండను వర్తకులంతా కలసి తూర్పు దేశాలతో వ్యాపారం నిర్వహించేందుకు అనుమతిని ఇవ్వవలసిందిగా ఎలిజబెత్తురాణికి విన్నవించుకొన్నారు. దీనికి రాణి అంగీకరించడంతో 1600 సంవత్సరపు చివరి రోజున ఇంగ్లీషు ఈస్టిండియా వర్తక సంఘం ఏర్పాటయింది. గుడ్‌ హోప్‌ అగ్రంనుండి మెగల్లాక్‌ జలసంధి వరకు గల ప్రాంతంపై వ్యాపార నిర్వహణలో 15 సంవత్సరాలపాటు గుత్తాధిపత్యం లభించింది కంపెనీ పాలనా వ్యవహారాల్ని నిర్వహించేందుకు ఒక గవర్నరు, 24 మంది సభ్యులు గల ఒక కమిటీని నియమించడం జరిగింది కాని తర్వాత ప్రతి సంవత్సరం కంపెనీ పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/41 పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/42 పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/43 పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/44 పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/45 పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/46 పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/47 పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/48