Jump to content

ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక/సంపుటము 24/సంచిక 5/సుకవి

వికీసోర్స్ నుండి

ఆంధ్ర సాహిత్య

పరిషత్పత్త్రిక.

కాకినాడ.

రెండునెలల కొకసారి ప్రకటింపబడును.



సంపుటము 24.

యువనామసంవత్సరము.
మార్గశిరపుష్యమాసములు.

సంచిక 5.



సుకవి.

జయంతి స్వామినాయనగారు, ముమ్మిడివరము.

గీ. విశ్వమెల్లను నీలోన వెలయు నేమొ, వెలయుచున్నావ్? నీవె యీవిశ్వ మెల్ల
విశ్వమే నీవొ నీవ యీ విశ్వ మేమొ, లేశ మైనను భావింపలేము కాని
యేము “నిదమిద్ద”మని చెప్ప లేము కాని, నీమహృదయంబువిశ్వంబునిండియుండు
నీవిమలబుద్ధి నిశితమై నెగడుచుండు, నీయమృతబోధ సత్యమై నిలిచియుండు
నట్టి నీకెన యెవ్వ రీయవనియందు, సర్గఃణోద్దామ! సత్కవిసార్వభౌమ!
నీవు గనరానితావులు లేవు భువిని, నీ వెఱుఁగరాని కృత్యముల్ 'లేవు జగతి
గానిచోఁ బోతుటీఁగకు నైనఁ దూఱ, రాని రాజులు యంతిపురంబులందుఁ
గలవి
శేషంబు లెట్లు నీగ్రంథముల య, థాగతిం 'దెల్పనేరు? విద్వత మీద!
ప్రకృతిసృజియించునట్టి సద్బహ్మ వీవ, ప్రకృతిఁజ త్రించు చిత్ర కారకుఁడ వీవ
ప్రకృతి గానంబు సేయు గాయకుఁడవీన, ప్రకృతి నలరించు సత్యనీశ్వరుఁడ వీన
ప్రకృతి సౌందర్యమునుజూపుసుకృతివీవ, ప్రకృతి కాంతకుముద్దుపుత్ర కుఁడవీవ
యట్టినీ కివె జోహారు లందుకొనుము, ప్రథితగుణసాంద్ర ! సత్యవి రాజ చంద్ర !
అఖిలనిగ మేతిహా సరహస్యములను, అఖిలశాస్త్రపురాణరహస్యములను
అభిలగ్రంథార్థత త్వరహస్యములను, బలుకుపలుకుననమృతంబుచిలుకునటులఁ

బదము పదమున రస ముట్టిపడెడు భౌతి, మించు వేడను జవులు జనించురీతి
రాజితా నేక భావపరంపరలను, మహితసహృదయహృదయంగమంబుగాఁగ
గ్రంథజాలంబులందుఁ జోక్రముగ వ్రాసి, యజ్ఞులను విజ్ఞులను జేయునట్టి నీకు
సాటి యెవరయ్య యీప్రపంచంబునందు, సరసగుణధామ! సత్యవిసార్వభౌమ!
సమయము లెఱింగి సంఘదోషము లెఱింగి, దేశము నెఱింగి ధర్మంబు తెరు వెఱింగి
జనముల నెఱింగివారియాశయము లెఱిఁగి, ప్రకృతితత్త్వంబెఱింగికర్తవ్య మెఱిఁగి
యఖలబుధసమ్మతముగ నయ్యెవిధములు, నయవినయముల నుద్బోధనంబొనర్చి
గ్రంథముల ధర్మసూత్రముల్ పొందుపఱచి, సకలజనులకు మార్గదర్శకుఁడవై న
నీ కివే వందనములు గోమా! కమీడ!
భావనాతీతశఒక పంచమునకుఁ, గనై భర్త వై పూర్త నగుచు
ధర్మసురక్షణం చె కర్త్య మరుచుఁ, బ్రుమలపదార్థ నిర్ణయప్రొ &ఁ జూపి
కలమె ఖడ్గంబుగాఁగ నిష్క్రలు షుబూ, బ్రాంచితా నేక వరవర్ణ పాలనంబుఁ
జతురతనొనర్చుసుక విరాట్సార్వభౌమ! మామక సమశ్శతంబుగొమామ త్మ!
తావకోజ్జ్వలదివ్య సందర్శనంబుఁ, చేయునాతఁడు సద్యఃః స్త్రీల నొందుఁ
దావకీనమనోహరోద్యత్ప్రబంధ, సంచితార్థంబులెల్ల గ్రహించునతఁడు
దివ్యభోగసుఖాంభోధిఁ దేలియాడు, నీకనట్లైననయవిద్య నేర్చునాతఁ
డఖిలడంపై వక్తుం డగుచు నెగడు; సీమనోజ్ఞ విజ్ఞాన బోధామృతంబు
స్త్రీలు నాతఁడు మోక్షముంగోనితరించు; సహహసీమహామహిమ లెంతనినుతింతు
సరసగుణధామ! సత్యసిసార్వభౌమ!
అవనిఁ దాపత్ర మాముల చే సవయుమాకు, సమలమణీమయభర సౌధాంతరముల
రమ్యభూషణరత్నా బకములఁ దాల్చి, కాలము వినోదలీలలం గడుపుచుండు
కువలయాక్షులఁ జూపించి కొంతసేపు; రమ్యతరలతా గేహాంతరముల వేడ
దీఁగేయుయ్యాలలందుననూఁగియాడి, యమృత మయమంజులోక్తులనాడుచుండు
కొదమజవరాండ్ర ఁ జూపించికొంత సేపు, సమల వారి పూర్ణ జల జూకరముల చెంత
విమలతర వాతపోతముల్ వీచువేళ, నెలడలువ వెన్నెల బయళ్ల ఁ గలసిమలయు
కొమరుదంపతులను జూపి కొంతసేపు; సరసఫలకుసుమాస వాస్వాదన ప్ర
మత్తశుక పిక మధుకర మధురకూజి, తములఁ గోలాహలఁబయి తనరునట్టి
సుందరోద్యానవనముల నందునంను, ఠీవిమై సంచరించు విటీవిటులను
వారి మురిపంపుస్వేచ్ఛావిహారములను, వారి మంజుల మధుర సంభాషణముల

}} వారిసుమనోజ్ఞ హావభావంబులెల్ల, వివిధరీతుల వర్ణించి వేడ తోడఁ

గట్టెదుటఁ జరుగుచున్నట్లు కన్నుఁగవకుఁ, గూరిదళుకొత్తఁ జూపించి కొంత సేపు చిత్తవికలతఁ బాపి రంజిల్లఁ జేయు, యుషదుద్యత్ప్ర్పభావ మీ యుర్వీయంకు సస్మవానలు లు పొగడ శక్యమై ! కమీద్ర! టి కాముకునకుఁ

విమలమై యొప్పు మెఱుపుఁ దీవియల నలకు, సురభిళాంచితకుసుమ మంజరుల నరసి యతులితానందమునఁ దేలునటి శక్తి, వెలఁది కెమోవి చివురున వెలయుచుండు మహితము జులనవసుధామధురిమంబు, గ్రోలి తజ్ఞ్మయత్వముఁ జెందు గొప్పశక్తి నీక కలుగుట తావకానేక పూర్వ జన్మకృతపుణ్య ఫల మెనూ! సచ్చమీంద్ర!

నిరతిశయమైన మోహవార్నిధిని మునిఁగి, యఖలధర క్రియాపరిత్యక్తుఁ డగుచుఁ గలికిపై ఁట చెఱంగునఁ గట్టువడుచుఁ, బడఁతికుచ్చెళ్ళ కొంగునఁ బుడుకొనుచు మోహ నాంగి యెస్వర్గంబు మోక్షమనుచు, నుర్వి యెల్లనుగాంతతోనున్న దనుచు నన్యము ల నెల్ల వ్యర్థంబులనుచు నెంచి, కాలముంబుచ్చుచున్నట్టి గాంత యనిన నసహ్యత గలుగునటులఁ, గనక మనిన విరాగంబు గలుగునటుల వాని నీతోడ దండకావనికి నైనఁ గాక హిమవన్న గా గ్రభాగమున కైన టెక్షలంగట్టి కొంపోయి రేఁబవళ్లు, నిరుపమానందమూర్తులై నెగడునట్టి యనుపమోజ్జ్వలగాత్రులై యలరునట్టి, పవనపర్ణాంబుభులై వఱలునట్టి బ్రహ్మనిష్ఠాగరిష్ఠులై పరఁగునట్టి, యాగతానా గతములెల్ల నరయునట్టి విజిత కామాదిగుణులౌచు వెలయునట్టి, సర్వలోకైక పూజ్యుల సత్యరతుల శమదమాదిగుణాఢ్యుల విమలమతుల, నఖిలభోగవిరాగుల శధికయశుల నిగమసూత్రార్థ వేదుల నిఖిలఋషులఁ, జూపి కావాలోలు పతను బాపి నీవు సాధనచతుష్టయంబుల బోధ చేసి, కర్మవిజ్ఞానభక్తియోగములఁ దెల్పి యన్నిటికిఁ గల్గుసామరస్యమును జూపి, విహగసోపానమార్గముల్ విశదపఱచి తత్త్వమస్యాదినిగమసూత్రముల వెలయు, ప్రథిత జీవేశ్వరైక్యభావము వచించి జగ మనిత్యము నిత్యుఁ డీశ్వరుఁడటంచు, నుర్వి నన్నిటఁ బరమాత్రయున్న దనుచు నలపరంజ్యోతి నీయందుఁ గలదటంచు, నీవ బహంబ వఖిలంబు నీవ యనుచు విమల పరతత్త్వ భావంబు విప్పి చెప్పి, మోక్షమార్గముఁ జూపెడి పుణ్యపురుష ! మామకా నేక వినయనమశ్శతములఁ, గైకొనఁ గదయ్య సుగుణసాంద్రా! కవీంద్ర!