Jump to content

ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక/సంపుటము 24/సంచిక 5/ప్రాచీనకవి ప్రతిభా విశేషము

వికీసోర్స్ నుండి

ప్రాచీనకవి ప్రతిభా విశేషము.

'ప్రాచీనకవి ప్రతిభావి శేషము' అనుశీర్షిక నెత్తికొనుటలో నాయాశయ మాకవి చంద్రుల య ప్రతిమాన ప్రతిభాదులు లోక మెఱుగ దని కాదు. ఆంధ్ర వాఙయమును సృష్టించి, తగురీతిఁ బోషించి, వివిధనియమ ప్రసాధనసామగ్రీ సమగ్రంబుగ బంధుర ప్రబంధ సౌధంబులు గారవించి యత్యున్నతస్థితికిఁ దెచ్చిన యే తన్మహనీయుల మనీషాశక్తు లాధునికాంధ్ర కవులయం దెల్లవిధములఁ బ్రతిబింబించుచునే యున్నవి. అట్టికవి బ్రహ్మల యనిర్వచనీయ ప్రతిభం గూర్చి ముచ్చటింపఁ బూనుట నాయట్టి యల్పజ్ఞునకు సాహసకార్య మగుటం తెలిసియు దేవాలయంబున దేవునికి నమోవాకస్తుతులు యధామతి నర్పించునట్టు లీయాంధ్ర సాహిత్య పరిషన్ముఖంబునఁ దదధిష్టాన దేవత లగువారి స్మరియించి తన్మూలమున 'కహ్వాశుద్ధిఁ గ్రాపింపఁ దలంచుటయే.

వర్తమానమున నాం ధ్ర భాషాసాహిత్య మలవఱిచికొనినవారి కెల్లరకును, గద్యపద్యాదికూపంబుల భాషాసేవ యొనర్చు నాధునికాంధ్ర కవులు కందఱకును, బ్రాచీనక వికృత గ్రంథ రాజంబులే గదా యాధారములు. వివిధనిఘంటు నిర్మాతలకు మాత్రము మాతృక యేది? ప్రాచీనకవులు ప్రయోగించిన శబ్దజాలమే గదా ! ఇన్ని విధముల నాంధ్ర వాఙ్మయము పెంపొంది చిరస్థాయిగా నుండుటకుఁ బ్రాచీన కవులే శరణ్యమై యుండ నేతాదృశ ప్రతిభాదు లాకవులయం దునికికిఁ గారణం బూహింపఁజాలక కొంద శ్రీకాలమునఁ బ్రాచీనక వులకు సంసృతము రా దనియు, శాస్త్ర పరిచయము లే దనియు, నొరుల సనుకరించుటయే గాని స్వకపోలకల్పనా శక్తి మృగ్య మనియుఁ, బ్రకృతిపరిశీలనము, ప్రపంచజ్ఞానము శూన్యము లనియు మున్న గునజ్ఞానమూలకము లగు వాక్యములు పలుకుట వినవచ్చుచున్నది.

కేవలసు సృతభాషానిష్ణాతులై యాంధ్ర భాషాస్వరూపము నెఱుంగని వారు ప్రాచీనకవులకు సంసృతజ్ఞానము తక్కువ యనియును శాస్త్ర పరిచయము దనియు, నుండినచో సంసృతముననే గ్రంథనిర్మాణ మొనరించి యందు రని యు వింతవాదము లొనర్చుటకుఁ గారణము వారికాంధ్ర భాషాజ్ఞానము లేకుం డుటయే. ఆంధ్రకవితానిర్మాణమునకు వలయు వస్తుసామగ్రి యంతయు సంసృ తమునుండియే గ్రహింపఁదగియున్నది. పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/7 పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/8 పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/9 పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/10