ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)4

వికీసోర్స్ నుండి
అనంతపురము


శ్రీపతిపండితుడు). అనంతపాలదండనాధుని శాసనములు క్రీ.శ.1100 మొదలుకొని 1123 సంవత్సరముల వఱకు గాంపించుచున్నవి.

అనంతపురము -

1. మైసూరురాజ్యమునందలి యొక పల్లె. షిమోగాజిల్లాలోని సాగర్ తాలూకాలోనిది. షిమోగాకు 29 మైళ్ళమీద నుండును. అంధాసురు డన్న రాజుచే నెనిమిదవ శతాబ్దియం దీగ్రామము కట్టింపబడియె. పదకొండవశతాబ్దియం దిది చాళుక్యుల యాధీనమునం దుండెను. ఇది 'సహస్రవిషయము ' (మండలము) లోనిది. 1042లొ నిది 1200 బ్రాహ్మణుల కగ్రహారముగ నీయబడెను. 1079లో నిది రాజధానిగ జెప్పబడెను. పదినేడవ శతాబ్దియందు, కేలడిరా జయిన వేంకటప్పనాయకు డీగ్రామమునందు శివాచారమఠమును స్థాపించెను. చంపకసరసు అను చెరువు త్రవ్వించెను. గ్రామము పేరు 'ఆనందపుర ' మని మార్చెను. అదియే తరువాత ననంతపురముగ మాఱెను. హైదరు, టిప్పులు ఈ గ్రామముపై పెక్కుసార్లు దాడివెడలిరి. 1830లో తిరుగబాటుకాలమున నీ గ్రామము దోపిడికి లోనయ్యెను.

2. అనంతపురము జిల్లాకు ముఖ్యపట్టణము. ఇది చెన్నపట్టణమునకు వాయువ్యమూలగ 216 మైళ్ల మీద నున్నది. ఇది చెన్నపురి దక్షిన మహారాష్ట్రపు ఇనుపదారి యొక్క గుంతకల్లు - బెంగుళూరుశాఖమీద నొకస్టేషను.

ఈ గ్రామము చిక్కప్ప ఒడయార్ అనునతడు కట్టించె నని చెపుదురు. ఈతడు విజయనగరరా జయిన ప్రధమబుక్కరాయలకు మంత్రిగనుండెను. ఈ యొడయార్ ఒక పెద్ద చెఱువు కట్టించి, దానికి రెండు అలుగులనుండి యెక్కువైన నీరు పోవుటకు రెండు కత్వాలును, వానికి సమీపమున రెండు గ్రామములను కట్టించెను. అందొక గ్రామమునకు రాజుపేరిట బుక్కరాయసముద్రము అని పేరు పెట్టి, రెండవదానికి దనభార్య యైన అనంతమ్మ పేరిట అనంతసాగర మని పేరు పెట్టెను. ఆ పేరే అనంతపురమని మాఱెను.

1800లో దత్తమండలములు కంపెనీవారి క్రిందకురాగా, ఆ ప్రదేశమునంతకునూ మన్రో అను వానిని కలెక్టరుగా నియమించిరి. అతడు అనంతపురమునందే తన కచ్చేరీ యేర్పఱుచుకొనెను. 1822లో కలెక్టరు కచ్చేరీ బళ్ళారికి తీసుకొనిపోయిరి. 1823లో మరల ఆ కచ్చేరి అనంతపురమునకు వచ్చెను. 1840లో కలెక్టరు కచ్చేరిని బళ్ళారికి మార్చి, అనంతపురములో సబ్‌కలెక్టరు ఉండజొచ్చెను. 1869లో ఈకచ్చేరి కూడ గుత్తికి బోయెను. 1882లో అనంతపురము స్వతంత్రముగా జిల్లా ఆయెను. అప్పుడిచట మరల కలెక్టరు కచ్చేరి వచ్చెను.

ఇచట జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు, ఫారెస్టు ఆఫీసరు, లోకల్ ఫండ్ ఇంజినీరు, అనంతపురము డివిజనును పాలించు హెడ్‌క్వార్టరు డెప్యూటీకలెక్టరు, అనంతపురము తాలూకా తహసీలుదారులవారల కార్యస్థానము లుండును. ఇచట డి.పి.డబ్ల్యు అసిస్టెంటు ఇంజినీరు, సాల్టు - అబ్కారీ - కస్టము ఇన్‌స్పెక్టరు, సబ్‌రిజిస్ట్రారు, ఎష్యూరెన్సుల రిజిస్ట్రారు, విద్యాధికారి, ఇంకంటాక్సు ఆఫీసరు, జిల్లా ఆరోగ్యాధికారి (ఆఫీసరు), పోలీసు డెప్యూటీ సూపరింటెండెంటు, సహకార సంఘముల (కో ఆపరేటీవ్ సొసయిటీలు) అసిస్టెంటు రిజిస్ట్రారు కూడ నుందురు. జిల్లాకోర్టు, సెషన్సుకోర్టు కూడ గలవు. ఇవి యన్నియు కాక గవర్నమెంటు ఫస్టుగ్రేడు కళాశాల, ప్రైమరి మ్రాయిట్లస్కూలు - వీనితో దీనికి ప్రాముఖ్యము మరియు ___నది. జనసంఖ్య 15,099. ఈ గ్రామమున చెప్పదలచినవి 'రాబర్ట్ సన్ స్క్వే' రను చౌకము. అనంతపురమున కలెక్టరు. 1838న అచ్చటనే మరణమునొందిన రాబర్ట్ సన్ అనువానికి ఈ చౌకము నిర్మితమయినది. రాబర్ట్ సన్ బ్రతికియున్నప్పుడు యీ చౌకము నేర్పఱచి నడుమనున్న కోట, కందకము పూడ్చి, నడుమ మండపము గట్టించి, చుట్టు తన చేతితో చెట్లు నాటెను. వీనిలో దాదాపుగ అన్నియు అశించిపోయినవి. గుడికెదురుగ విశాలమైన పెద్దచౌక మిప్పుడు దానిచుట్టుపట్లగల పాఠశాల విద్యార్థులకు క్రీడారంగముగ నుపయోగపడుచున్నది. 'రాబర్ట్ సన్ స్క్వేరు ' చుట్టు నున్న కట్టడములలో గవర్నమెంటు ఆఫీసులు, ఉపధ్యాయులకు ఉపాద్ధ్యాయినులకు బాధనాభ్యాసన కళాశాల (Training Schools), బాలబాలలకు ఉన్నత పాఠశాలలు చెప్పదగినవి. ఈ చౌకమున కుత్తరమున ప్రాతకోట యుండెను. దాని బురుజుల విశేషములును, కందకము పల్లములును ఇప్పటికిని చూడవచ్చును. ప్రాతకోట యున్న ప్రదేశమున నిప్పుడు 'జూబిలీ పార్కు ' అను పౌరోద్యా నమున్నది. వారమువారము జరుగు సంత యిచట జరుగును. అనంతపురము పరిశుద్ధముగను, చక్కగను ఉండును.

3. అనంతపురంజిల్లా ___ తాలూకాయందలి గ్రామము. జనసంఖ్య 1413 (1931).

4. అనంతపురంజిల్లా [మడక]శిర తాలూకాయందలి గ్రామము. జనసంఖ్య 893 (1931).

5. చిత్తూరుజిల్లా మ___ తాలూకాయందలి గ్రామము. జన సంఖ్య 60 (1931).

6. కడపజిల్లా జమ్మల[మడుగు] తాలూకాయందలి గ్రామము. జనసంఖ్య 535 (1931).

7. కడపజిల్లా ప్రొ[ద్దుటూరు] తాలూకాయందలి గ్రామము. జనసంఖ్య 1195 (1931).

-- (రాళ్ళ) అనంతపు[రంజిల్లా] కల్యాణదుర్గం తాలూకాయందలి గ్రామము. జనసంఖ్య 618 (1931).

-- (లక్కిరెడ్డిపల్లి) ___ జిల్లా రాయచోటి తాలూకాయందలి గ్రామము. జనసంఖ్య ___ (1931). ఫిబ్రవరి మాసమున జరుగు గంగజాతరకు జను[లిచటకు] వచ్చెదరు.