ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
అనంతదీక్షితుఁడు - అనంతదేవుఁడు


తండ్రి సింహసేనుఁడు. తల్లి సుయశ. ఇతని 'చవణతిథి' (?గర్భప్రవేశతిథి) శ్రావణకృష్ణసప్తమి. జన్మతిథి వైశాఖ కృష్ణత్రయోదశి. ఇంచుమించుగ ఎనిమిది నెలలకుపైగా గర్భము నందుండెను. కృత్తికా నక్షత్రమున నుండి మీనరాశి నిగ్గతమగు సమయమున నిత్ఁడు అయోధ్యా నగరమున జన్మించెను. ఇతని శరీరపుమాన మేఁబదిధనువులు. ఆయుర్మానము ముప్పది లక్షల వర్షములు. దేహవర్ణము బంగారమువలె మెఱయుచుండెను. ఇతనికి రాజా అను ఉపాధి ఒసంగఁబడినది. ఇతనికి వివాహమైనది. కాంపిల్యానగరమున నితనితోపాటు వెయ్యిమంది సాదువులకు దీక్ష దొరికినది. మాఘశుక్ల చతుర్దశినాఁడితనికి దీక్ష ఇయ్యఁబడినది. ఇతనిది ఇక్ష్వాకుకులము. ఇతని గణధరులేఁబదిమంది. 66 వేలమంది సాధువులు. కేవలులు 5 వేలు. శ్రావకులు 4 లక్షల 13 వేలు. వైశాఖ కృష్ణ చతుర్దశి ఇతని జ్ఞానతిథి. కాంపిల్యమితని జ్ఞాననగరము. ఇతని దీక్షావృక్షము అశోకము. ఇతఁడు కాయొత్సర్గమోక్షాసనస్థుఁడై చైత్రశుక్ల పంచమీ దినమున ముక్తుఁడయ్యెను. ఇతని మోక్షస్థానము సమేతశిఖరము. ప్రథమగణధరుఁడు-యకుఁడు. ప్రథమ భార్య పద్మ.

అనంతదీక్షితుఁడు — విశ్వనాథదీక్షితుని కుమారుఁడుః వేదవిదుఁడు. ఇతఁడాశ్వలాయనమతానుసారముగ సంస్కృతమున ప్రయోగరత్నము (స్మార్తానుష్ఠానపద్ధతి), మహారుద్రప్రయోగపద్ధతి యనుగ్రంథములను రచించెను.

అనంతదేవుఁడు

1. ఇతని కనంతపాలుఁడనియుఁ బేరు కలదు. కొంకణదేశపాలకుఁడు. ఆఱవవిక్రమాదిత్యిని సామంత ప్రభువులలో నొకఁడు. ఇతనిజనకుని పేరు నాగార్జునుఁడు. ఇతఁడు క్రీ.శ. 1094వ సంవత్సరమున సింహాసన మెక్కెను. ఇతనికిఁ బశ్చిమసముద్రాధిపుఁ డను బిరుద ముండెను. స్థానకము, నాగపుగము (నాగామ్), సూర్పరకము (సోపారము), చమాలీ (చౌల్) మొదలగు కొంకణమందలి రేవుపట్టణములకు వచ్చు బండ్లమీఁదిపన్ను ఇతని సమయమునఁ దీసివేయఁబడెను. దురదృష్టవశమున, బంధువర్గముల పైర కారణమున జనించి శక్తిమంతమైన కొంకణభూమిని నాశనము గావించి దేవబ్రాహ్మణుల నిడుములకుఁ బాలుచేసిన ఘోరపాపసమూహము నితఁడు తన ఖద్గధారా సముద్రమున ముంచి రూపుమాపె నని యితని శాసనములం దితఁడు కీర్తింపంబడినాఁడు. ఇందువలన అనంతదేవునుకి పూర్వము వీరివంశములో నంతఃకలహము జనింప దానిని సందు చేసికొని గోపకపట్టణము (గోవా) పాలకులు కాదంబులు కొంకణములోని కొంతభాగమును జయించినట్లును, దరివాత నితఁడు ప్రబలుఁడై శత్రువులఁ బాఱదోలి, కోలుపోయిన భూమిని గొంతవఱకుఁ దనవశము చేసికొనినట్లు ఊహింపదగియున్నది.
2. సుప్రసిద్ధుఁడగు భాస్కరాచార్యుని తమ్ముని పాత్రుఁడు. ఇతఁడు చాలిస్ గ్రామమునందు భావానీదేవి పేర నొకదేవాలయమును గట్టించెను. ఇతని తండ్రి పేరు గణపతి. తాత శ్రీపతి భాస్కరాచార్యుని తమ్ముఁడు. ఇతఁడు, 1132-7 శకమున సింహాసన మెక్కిన దేవగిరియాదవరాజులలో నొకఁడగు సింహణిని సంస్థానపు జ్యోతిష్కుఁడుగనుండెను.
3. ఇతఁడు సంస్కృతమునందు 'సిద్ధాంతత్త్వము', 'స్మృతికౌస్తుభము', 'సంస్కారకౌస్తుభము' మొదలయిన గ్రంథములను రచించెను. సిద్ధాంతతత్త్వమనునది వేదాంతగ్రంథము. నాశ్రితుఁడుగ నుండెను. ఈరాజు 1644 మొదలు 1664 వఱ కుండెను. ఈ గ్రంథకర్త తండ్రి ఆపదేవుఁడు; ఆపదేవి (న్యాయప్రకాశః) అను పూర్వమీమాంస సంబంధియైన యుద్గ్రంథమునకుఁ గర్త.
4. ఇతఁడు బ్రహ్మగుప్తుని సిద్ధాంతమండలచ్ఛండశ్చిత్యుత్తర మనునధ్యాయముమీఁదను, బృహజ్జాతకముమీఁదను టీక వ్రాసినవాఁడు.
5. కాశ్మీరదేశపురాజు. ఇతఁడు క్రీ.శ. 1028 మొదలు 1063 వఱకును ముప్పదయిదు సంవత్సరములు రాజ్య మేలెను. ఇతఁడు సంగ్రామరాజు (1003 - 1028) చిన్నకుమారుఁడు. ఇతనియన్న హరిహరరాజు 22 దినములు రాజ్యము చేసి గతించినతోడనే ఇతనితల్లి దుర్మార్గవృత్తిగల శ్రీలేఖ రాజ్యము నాక్రమించుటకుఁ బ్రయత్నించెను. కాని రాజభటులీతనినే సింహాసనముపైఁ గూర్చుండఁబెట్టిరి. ఇతని పినతండ్రి కుమారుఁడగు విగ్రహరా జీతనిమీఁదికి దండెత్తి వచ్చెను గాని గతప్రాణుఁ డయ్యెను. ఇతని రాజ్యప్రారంభదశయందు శాహీవంశజులయిన రుద్రపాల, దిడ్డపాలురనువారు రాజునకుఁ బ్రియులై మిక్కిలి బలవంతులైరి. రుద్రపాలుఁడు ఇందుచంద్రుఁడను జలంధరరాజు యొక్క పెద్దబిడ్డను బెండ్లిచేసికొనెను. అనంతదేవుఁ డా ఇందుచంద్రునియొక్క చిన్నకూఁతురగు సూర్యమతిని బరినయమాడెను.
ఊవరు లనువారు రాజుపైఁ దిరుగఁబడిరి. కంపనాధిపతి యగత్రిభవనుఁడు వారికి నాయకుఁడుగ నుండెను. అనంతుఁడు యుద్ధమునకుఁ బోయి శౌర్యమును జూపి స్వయముగ త్రిభవనుని జంపెను అట్లే అచలమంగలుఁ డనురాజు ఏడుగురు మ్లేచ్ఛభూపాలురతో గలసి ఎత్తిరాఁగా రుద్రపాల దెడ్డపాలురు మరణము నొందినపిదప ననంతుఁడు తన భార్యయైన మార్యమతి సాహాయ్యమున రాజ్యము చేయుచుండెను. ఈమె మిక్కిలి ధర్మాత్మురాలు. పెక్కు దేవాలయములను గట్టించి దానములు చేసెను.
రాజు మాత్రము గుఱ్ఱములు మొదలయినవానియం దెక్కువయాసక్తిగలవాఁడై ధన మెక్కువగాఁ గొల్లవెట్టుటవలన అప్పులపాలాయెను. డల్లకుఁ డను నర్మసచివుఁడు రాజానుగ్రహమును సంపాదించి ప్రజలను