ఆంధ్ర రచయితలు/వేదము వేంకటరాయశాస్త్రి
వేదము వేంకటరాయశాస్త్రి
1853-1929
పుదూరు ద్రావిడ బ్రాహ్మణులు. తల్లి: లక్ష్మమ్మ. తండ్రి: వేంకట రమణశాస్త్రి. పుట్టుక మదరాసులో. పూర్వుల జన్మస్థానము నెల్లూరు జిల్లా కావలి తాలూకాలోని మల్లయపాలెము. జననము: 1853 డిసెంబరు 21 తేదీ. (ప్రమాదీవి సంవత్సర మార్గశీర్ష బహుళ సప్తము బుధవారము. నిర్యాణము. 1929 జూన్ 18 తేదీ ఉదయము 5-45 ని.కు. రచిత గ్రంథములు: ప్రక్రియా ఛందస్సు, అలంకారసార సంగ్రహము 1886- ఆంధ్రకథాసరిత్సాగరము 1891 - నాగానందము 1891 - ఆంధ్రాభిజ్ఞానశాకుంతలము 1896-ప్రతాపరుద్రీయ నాటకము 1897 - ఆంధ్ర ప్రసన్నరాఘవ నాటక విమర్శనము 1898 - ఉషా నాటకము 1901 - బొబ్బిలియుద్ధ నాటకము 1916 - మాళవికాగ్ని మిత్రము 1919 - ఉత్తరరామచరిత్రాంధ్రీకరణము 1920 - విక్రమోర్వశీయ, రత్నావళి, సాహిత్య దర్పణాంధ్రీకరణములు 1921 - శారదా కాంచిక శృంగారనైషధము సర్వంకషవ్యాఖ్య 1913 - ఆముక్తమాల్యద వ్యాఖ్య 1920 - రఘువంశము, కుమారసంభవము, ఆమరు కావ్యము, విజయవిలాసము, సారంగధర, కావ్యాలంకార చూడామణి మున్నగునవి టీకలతో- 1910లో వెలువరించిరి. జనవినోదినీ పత్రిక ప్రకటించిరి.
కవి పండితుడు కాడు. పండితుడు కవి కాడు అని కొందఱి వాదము. కాళిదాసుడు కవికుల తిలకము. అతని పాండిత్వము భువనవిదితము. భవభూతి మహాకవి. అతడు పదవాక్య ప్రమాణజ్ఞానమున బేరు మోసిన వాడు. కవి పండుతుడు కాడనుటలో సొగసులేదు.
వేదము వేంకటరాయ శాస్త్రిగారు మహోపాధ్యాయులు సర్వతంత్ర స్వతంత్రులు. కళా ప్రపూర్ణులు. వ్యాఖ్యానమల్లినాథులు. వీరు వ్రాసిన పద్య కావ్యములు లేవు గాని కాళిదాస భవభూతులవలె వీరును మూడు నాటకములు రచించిరి. ఇవి మూడును మూడు రత్నములు. వానిలో ప్రతాప రుద్రీయ మనర్ఘరత్నము. ఉష, బొబ్బిలి నాటకములు రమ్యములై 103
రంగస్థలముల కెక్కికీర్తిగనినవి. ఈ నాటకములు మూడిటికిని పాత్రౌచిత్యపోషణము పెద్దవన్నె దెచ్చినది. మహానుభావము గల వేంకట రాయ శాస్త్రిగారు గ్రాంధిక గ్రామ్యములు పాత్రోచితములుగా జిత్రించి ప్రతాప రుద్రీయమునకు బేరు దెచ్చిరి. నాగానందాంధ్రీకరణమునను ప్రతాపరుద్రీయమునను వీరు క్రొత్త మార్గము త్రొక్కుట జూచి కొందరు కేవల గ్రాంధిక వాదులలు గోపకారణమైనది. విమర్శనములు వెలువడ జొచ్చినవి. అంతకుమున్నే యిది కనిపట్టి 'ప్రతాప ' లో శాస్త్రి గారిట్లు వ్రాసికొని నటిచే జదివించిరి.
అంకెకు దార్చె నేరసికు నంగలభారతి ప్రౌఢనీతి, నా
కింకిరినాంధ్రి ద్రావిడియు గేరుచు దైవియు గూడి రెవ్వనిన్
జంకు కళంకు లేని కవి చంద్రుడు తోషిత కోవిదేంద్రుడా
వేంకటరాయ శాస్త్రి కృతి వెంగలిమూక కెఱుంగ శక్యమే?
ప్రతాపరుద్రీయమున దురుష్కునిచేతను, బొబ్బిలిలో సిపాయి చేతను శాస్త్రిగారు సందర్భసుముచితమగు సంభాషణము చేయించిరి. వేంకట రాయ శాస్త్రి తండ్రి గారు వేంకటరమణ శాస్త్రి గారు సంస్కృతాంధ్రములలో గొప్ప పండితులు. వీరు పరవస్తు చిన్నయసూరికి సహపాఠులు. తండ్రి గారు పెక్కు పట్టనములలో నుద్యోగములు చేసి యుండుటచే వేంకట రాయ శాస్త్రిగారు కూడ వారితో పాటనేక మండలములలో దిరుగుట, త్తన్మండల వ్యవహార భాషాసంప్రదాయము లెఱుగుట తటస్థించినది. బాహు బాల్యముననే ప్రతాపరుద్రీయ కథ వేంకట రాయ శాస్త్రిగారి నాకర్షించినది. అది 1896 లో నాటక రూపమునకు వచ్చి యాంధ్రి కాభరణమైనది. ఈ విషయము తన్నాటకావతారికలో నిటు లున్నది. ఓరుగంటి ప్రతాపరుద్ర మహారాజును తురకలు ఢిల్లీకి ఖయిదు గొనిపోయినకథ లిఖితముగాని ముద్రితముగాని నాకెచటను దొరకలేదు. నే నెమిదేండ్లునయనున నుండగా మానాయన 104
గారు వేదము వేంకటరమణ శాస్త్రులవారు తమ తిత్త్రబృందములో నీకథను బ్రస్తుతించునపుడు నేనును వింటిని. వారు చెప్పుటలో నీకథ అరగంటకూడ పట్టలేదు. ఇటీవల నేను ఆంధ్రజనవినోదినీముద్రణాధి కృతుడనై యుండగా 1883 సం:న జూలై నెలలో దానిని నాటకోచితముగా రూపు చేసి, ఈ నాటకమునందలి గద్య భాగమును మాత్రము వ్రాసి నామిత్రులకు జూపితిని.
శాస్త్రిగారి తండ్రి గారికడ నలుగురు శిష్యులు వేదాంత గోష్ఠి తఱచు చేయు చుండువారట. వారిలో నొకడు బ్రాహ్మణుడు. రెండవ వాడు చాకలి, మూడవవాడు ముసల్మాను, నాలగవ వాడు క్రైస్తవుడు. వారి గోష్ఠి శాస్త్రి గారు వేడుకపడి వినుచుండువారట. ప్రతాప చరిత్రలోని మహమ్మదీయ పాత్ర మంత మనోహరముగా జిత్రింపగలుగుటకు నాటి మహమ్మదీయ శిష్యుని మాటలు వినియుండుటయే కారణమని శాస్త్రిగారు రనుచుండెడి వారని చెప్పుకొందురు.
ఈయన చోడవరము బడిలో గొన్నాళ్ళు బ్రధానోపాధ్యాయులుగా నుండిరి. నాటి యొక విచిత్రగాధ నిట్లు చెప్పుదురు. ఆబడిలో 'పేరిగాడు ' అను నొక నౌకరు యుండువాడు. బడి పనులు లేవియు ముట్టుకొనక మూడు ప్రొద్దులు 'సెక్రటరీయింటనే గృహకృత్యములు చేయుట, ఎప్పుడో వచ్చి బడియరుగుమీద బరుండుట - ఇది వాని దైనిక చర్య. మన శాస్త్రులు గారికి వీని చర్య చూడ నరకాలిమంట నెత్తికెక్కి యొక్క నాడు వీని కిదిపని కాదని యొక చింతబరికె చేతబుచ్చుకొని నపాళమంటునట్లు నాలుగు చుఱుకలు తగిలించి మెల్లగా దప్పుకొనిరట. వాడు 'మొఱ్ఱో ' అని లేచి 'సెక్రటరీ ' తో శాస్త్రులుగారి యన్యాయము చెప్పికొనెను. సెక్రటరీ శాస్త్రి గారిని రమ్మని నౌకరును పంపెను. 'మీయింటికి వచ్చు నవసరము నాకు లేదు. పనియున్నచో మీరు రావలయును.' అని శాస్త్రిగారి ప్రత్యుత్తరము. నిరంకుశాః కవయః | 105
ఈ పేరిగాడే ప్రతాపరుద్రీయములోని పేరిగాడు. శాస్త్రులుగారిచెవికింపుగా నేదేని చక్కని పలుకుబడి గాని నామవాచకముగాని వినబడినదో, అది సందర్భోచితముగ గ్రాంధికము చేయవలసినదే. ప్రతాపరుద్రీయములో వెఱ్ఱివాడు నేను కండచీమను. ఏమనుకున్నావో. పట్టుకుంటే వదలను. అనెను. శాస్త్రులుగారు విశాఖపట్టనములో నున్నపుడు పొరుగింట ముసలిమగడు పడుచుభార్యను జీటికిమాటికి నీకండ చీమ పదము నుపయోగించి తిట్టుచుండువాడట. అది జ్ఞప్తికిరాగా నిచటబ్రయోగించిరని వారి సన్నిహితులు చెప్పుడురు.
బొబ్బిలి నాటకమున నయిదవయంకములో సారాయిదుకాణము పెట్టిన వాని పేరు 'బొడ్మిన్ ' అనిరి. ఇది వీరు విశాఖపట్టనములో నున్నపుడక్కడి దుకాణదారునిపేరటే. ఇంకను నిట్టియనేక స్వానుభవములు తమ నాటకములో నుద్ఘాటించిరి. వీరికి జంగము పాటలు, పడవ పాటలు, ముష్టిపాటలు వినుటయం దాన్థపెద్దది. ప్రతాప నాటకమునకు ముఖ్యముగా బ్రఖ్యాతి గొని తెచ్చినది పాత్రోచితభాష. కవి చెప్పినటులీనాటకము 'పండితమానుల గండెనీరు ' గా నున్నది.
ఉషాచరిత్రము నెఱ్ఱాప్రెగడయు, సోమనాథుడును దమ కావ్యములలో రసోత్తరముగా జిత్రించిరి. ఎఱ్ఱన బాణుని రాక నాలోకించిన యుషచే నొక సీసము చదించినాడు. సోమ నాథుడు కలగని లేచిన యుషచే నొక సీసము పఠించినాడు. వేంకటరాయ శాస్త్రి గారి నాటకములో భ్రాంతిద్వీపమున నక్షత్ర ప్రాసాదమున బంధితయుష చెలి చిత్ర రేఖతో నిట్లనుచున్నది.
ఒడిలోన నేనులే కోలగంబుండని
తండ్రికినే బగదాననైతి
నన్ను గైనేయించి కన్నదే దినమైన
తల్లికి నే విషవల్లినైతి
ప్రాణంపు బ్రాణంబువగిది నన్నోమెండు
నన్నకే తలవంపు న్యాధినైతి
ననుగోరి తన ప్రాణమునకు దెగించిన
దయితుని కే బంధధాత్రినైతి
బ్రాణనాథుని నేగొల్చి బందినైతి
దప్పులేక కుశీలవతాకనైతి
ఎదెప్పరము మాని సకి నీవ చెప్పవమ్మ
మానమేదిన వెలదికి బ్రాణమేల?
ఉత్తరోత్తర రనభావనిష్యందములగు నీమువ్వురుకవుల సీసములు నొకమాఱు చదువుకొని యభిజ్ఞలు రసతత్త్వమును జూఱలాడవలయును.
శాస్త్రిగారు నిరుపమానవర్ణనా సన్నివేశ సంధానధౌరేయులు. ఒక యెడ గాళిదాసుని దలపింతురు. ఒకయెడ భవభూతిని మఱపింతురు. అనిరుద్ధునకు స్వప్నములో బ్రియురాలు గనబడెను. ఆమెయే యుష. సఖునితో నాసంగతి చెప్పుచు స్వప్న దృష్టయగు ప్రణయిని వర్ణింప వలసి వచ్చినది. అతడు పూదోటలో నున్నాడు. అది వెన్నేలరేయి. మంచు కురియుచున్నది. అట్టి సన్నివేశమున నిటులు వర్ణన.
ఉషకై పరితపించుచున్న యనిరుద్ధున కప్పటికి దెలియకున్నను ప్రియయునుషయే యైనదట. అతి మాత్ర ప్రజ్ఞా సంపన్నులగు శాస్త్రి గారి భావనా శక్తి నీపద్య మొక్కటియే తార్కాణించు చున్నది. కనుకనే నాటక కర్త "యుషావివాహము" 'సిద్ధసుధా ప్రవాహ ' మనుకొనినాడు.
బొబ్బిలి నాటకములు మఱికొంద ఱిటీవలి కవులు కూడ వ్రాసిరి. వానియన్నింట వేంకట రాయ శాస్త్రి గారిది రసవత్తరము. 'ఆడుబురువు 107
లేదు హతమయ్యె మగకూన కోటపాడయ్యె నింకేటి కిచట ' ఇది చదువుకొని కంటనీరు పెట్టుకొను రసిక శూరులు నేడు పెక్కండ్రు కలరు. శాస్త్రిగారు శ్రవ్య కావ్యము వ్రాయలే దనువెలిగతి లేదు. వీరి యీపై మూడు నాటకములలోను గొప్ప కవిత్వమున్నది. పిండిలేని వారికి వీరి కవిత యెటులుండినను, పండిత కవులకు బండువు పండితుడు కవికాడు అను వాదమిపుడు నిలువదేమో.
వేంకట రాయ శాస్త్రి గారి యఖండపాండితికి దార్కాణముగా వారి అముక్తమాల్యదా, శృంగార నైషధ వ్యాక్యలు చూప వచ్చును. అముక్తాదులలోని పాఠములు కొన్ని వీరు స్యయముగా నవరించిరి. అది కొంత వీరిలో గల లోప మనక తప్పదు. ఆముక్త వ్యాఖ్య వీరు కొన్నేండ్లు చదివి నాలుగు నెలలలో వ్రాసిస్రట. 24-6-1920 నాడు ప్రారంభించి 20-10-1920 నాటికి బూర్తి చేసిరని వారి చరిత్రము చెప్పుచున్నది. అందులకే యవరమల్లి నాధ బిరుదము వారి యెడ నన్యర్థమైనది.
శ్రీవీరేశలింగము పంతులు గారు 'విధవావివాహ ' ప్రచారము బాఢముగా జేయుచున్న సమయమున శాస్త్రులు గారు "శ్రీపునర్వివాహదుర్వాదనిర్వాపణ గ్రంధము బహు పరిశ్రమమునకు బాల్పడి బహు గ్రంధములు పరిశీలించి ప్రకటించిరి. అప్రకటనమే శాస్త్రిగారి జీవితమునకు నూత్గన ప్రకరణమైనది. వారి ప్రతిభయు బాండిత్యము లోకమునకు దెలిసినది యీఘట్టమే. పునర్వివాహవాదఖండనోపన్యానములవలననే శాస్త్రి గారికి బెక్కు మంది మదరాసు మహాశయుల మైత్రి కలిగినది. ఆవర్టు, మిల్లరు మున్నగు హౌణులకు వీరి గీర్వాణభాషా పాండిత్యము విదితమైనది. తత్ప్రతిఫలముగా 1887 నవంబరులో క్రైస్తవ కళాశాలా సంస్కృతోపాధ్యాయపదము శాస్త్రి గారికి లభించినది. ఈ యుద్యోగముతో నూరకుండక యపారమగు భారతీ సేవ గావించిరి. చెన్న పుర జీవితము శాస్త్రులు గారికి గ్రంధ రచనోత్సాహము హెచ్చించినది. 1890 లో జ్యోతిష్మతి ముద్రాలయము నెలకొలిపి కధాసరిత్సాగ 108
రాది గ్రంధములు తెలుగున వెలయించిరి. కొక్కొండ వేంకటరత్నము పంతులు గారును వీరును హోరాహోరి బోరిరి. శాస్త్రి గారు పంతులు గారి ప్రాన్న రాఘవమును బ్రత్యక్షరము విమర్శించి విడిచిరి. ఆ వాదము ముదురు పాకమున బడి పండితులకు బాధయనిపించినది. దూషణ వాక్యములు తొలగించినచో 'ప్రసన్న రాఘవ విమర్శనము ' ఆంద్రికి స్వర్ణభూషణము. అప్పుడు ప్రసిద్ధిలో నున్న 'అముద్రిత గ్రంధ చింతామణి ' పత్రిక యీభాషా వివాదములను ప్రకటించినది. చింతా మణి సంపాదకులు పూడ్ల రామ కృష్ణయ్యగారు గొప్ప పండిత విమర్శకులు. వేంకటరాయ శాస్త్రి గారికి వీరికి నొకటే ప్రాణము.
శాస్త్రి గారు నాటక రంగమునకు బ్రశస్తి దెచ్చిన కళాహృదయులు. ఇంచుమించు ముప్పది యేండ్లు సంస్కృతాంధ్ర నాటకములు తమ శిష్యులచే బ్రదర్శింప జేసిరి. వీరి సర్వాధ్యక్షతతో నెల్లూర 'ఆంధ్ర భాషాభిమాని సమాజము ' నడచి రజతోత్సవము జరిపించుకొన్నది. పూండ్ల రామకృష్ణయ్యగారు మరణించుటయు, చింతామణి ఆగిపోవుటయు వేంకట రాయ శాస్త్రి గారికి హృదయావేదన హేతువు లైనవి. క్రైస్తవ కళాశాలలో నిరువది నాలుగేండ్ల నుండి పని చేయుచు 1910 లో నా యుద్యోగమునుండి తప్పుకొనిరి. జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను బునరుద్ధరించి యెన్నో ప్రాక్తన గ్రంధములు సవ్యాక్యముగా వెలువరించి హాషా సేవ గావించిరి. వేంకట రాయ శాస్త్రిగా రాంధ్రభాషా మధుమధనులు. ఆయనను మించిన పండితులుందురుగాక, ఆయనను కాదనిపించు కవులుండిరిగాక, ఆయన వలె భారతీ పూజ గావించిన మహాభక్తుడు మాత్రము లేడు. ఆయన దెబ్బది యాఱేండ్లు బ్రతికెను. కొన్ని శతాబ్దులు నిలుచు వాజ్మయసేవ చేసెను. అహోరాత్రము లదేపనిగా వ్రాసినవాడు వ్రాసినట్లే యుండెను. చది `109
వినవాడు చదివినట్లే యుండెను. ఆపరిశ్రమము, దానికిదగిన యారోగ్యము, ఆ పాండిత్యము, దానికి దగిన భావనాశక్తి మఱొకనియందు జూడము. ఆయన మాటలాడిన మధు వొలికెడిది. ప్రతి పక్షిని చల్లగా గొంతుకోయువాడు. సభలో నిలబడినచో సింహము. ఆయన రసవత్సంభాషణములు వ్రాయుచో నొక మహాకావ్యము. స్వాతంత్ర్యము నెన్నడు చంపుకొనలేదు. పని లేక యెవరిని దూలనాడలేదు. ఆమేధ, ఆ ప్రతిభ, ఆ హాస్యవిలాసము, ఆ సమయస్ఫూర్తి యితరున కందవు. అవసరమునుబట్టి పెంకితనము జూపెను. ప్రాచీనాచారముల కతీతుడుడు. అట్లని నవీనాచారముల నాశ్రయింపను లేదు. సందర్భానుసారముగా బోయెను. భాషా విషయమునను నిదియేత్రోవ. పాత్రోచితమని వ్యావహారికము వాడెను. గ్రాంధికమును సమర్థించెను. గిడుగువారి వలెగాక వీరు నియమసాపేక్షముగా గ్రామ్యము ప్రయోగింపవలెనని యందురు. భాషా విషయికముగా గొంచె మభిప్రాయభేదమున్నను గురుజాడ అప్పారావు గారి వీరిని కడు గౌరవించిరి. రజ్ఝుల చినసీతారామ స్వామి శాస్త్రిగారును వీరి యభిప్రాయముల నామాతించిరి. బహుజనపల్లి సీతారామాచార్యులవారు వీరి కాచార్యులు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారికి వీరాచార్యులు. కట్టమంచి రామలింగారెడ్డి ప్రభృతులు వీరికి శిష్యులు. అల్లాడి కృష్ణస్వామి ప్రముఖులు వీరి కాప్తులు.
ఈపుంభావసరస్వతికి లక్ష్మీ ప్రసన్నత తక్కువ. శ్రీనాధుని వలె జివరికాలమున జిక్కులుపడినారు. ఎంతచిక్కుపడియైనను సరస్వతిపూజ నేమఱలేదు. ఇట్టి మహానీయచరిత్రునకు 1927 లో నాంధ్రవిశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుమునిచ్చి సత్కరించుటలో విశేషములేదు.
నెల్లూరుమండలమున కెల్ల దిక్కనవలె గీర్తిదెచ్చిన కవిపండితుడీయన. శాస్త్రులుగారికృతులను బోషించిన రెడ్డివంశీయులయశము శాశ్వతము.వేంకటరాయశాస్త్రిగారు 1919 లో ఆంధ్రసారస్వత సభవారిచే 110
సన్మానితులైమహోపాధ్యాయ బిరుద మంది తమ వాగ్దేవతాపూజా విధాన మిట్లు నొడివిరి.
ఆవాహనము స్త్రీపునర్వివాహదుర్వాద నిర్వాపణము - ఆసనసమర్పణము కథాసరిత్సాగరము - అర్ఘ్యము ప్రతాపరుద్రీయ నాటకము - పాద్యము మేఘ సందేశాంధ్రటీక - అలంకారము ఆంధ్ర ప్రసన్న రాఘవ నాట్జకాది విమర్శ కింకిణీ గణ శింజాన శారదా కాంచిక - నైవేద్యము శృంగార నైషధ సర్వంకష వ్యాఖ్య.
ఉషా నాటకమున వీరు జీవిత విషయ మిట్లు చెప్పించి కొనినారు.
చాత్ర సహస్త్ర ప్రచారంబుగా నాట
కములు దన్నిగమంబు గఱపినారు
సర్వజ్ఞసింగమ సార్వ భౌముని గద్దె
యెక్కినదొర మది కెక్కినారు
హూణరూపకరసంబుదరంబు నిండార
ద్రావి గుఱ్ఱున ద్రేచి తనిసినారు
టాటోటు గవులు పటాపంచలై మాయ
గాంచిక వాణి కర్పించి నారు
బల్లారిభ కవి పండిత సంఘంబు
మదరాసులో రూపు మాపినారు
కాళిదాసు శకుంతల నేలినారు
మించిన ప్రతాపకృతిని నిర్మించినారు
తగదోకో శాస్త్రిగారి గ్రంధమును గోర
మహిత వస్తు పరాయణ మానసులకు.