Jump to content

ఆంధ్ర రచయితలు/వారణాసి వేంకటేశ్వరకవి

వికీసోర్స్ నుండి

వారణాసి వేంకటేశ్వరకవి

1820

వెలనాటి వైదిక బ్రాహ్మణుడు. ఆపస్తంబ సూత్రుడు. విశ్వామిత్రగోత్రుడు. తల్లి: లచ్చమాంబ. తండ్రి: కామయార్యుడు. గోదావరీ మండలములోని పీఠికాపుర ప్రాంతమున గల ' క్రొత్త యిసుకపల్లి ' ఈకవి నివాసమని చెప్పుదురు. 1850 ప్రాంతమున గ్రంథరచన గావించినటులు తెలియుచున్నది. జననము: 1820 ప్రాంతము. రచించిన గ్రంథము: రామచంద్రోపాఖ్యానము (ఆరాశ్వాసముల కావ్యము 1911 ముద్రితము.)

రామాయణములోని కథను సంక్షేపించి యాఱుకాండములకు నాఱు ఆశ్వాసములుగా 'రామచంద్రోపాఖ్యాన' మనుపేర గద్య పద్యాత్మకమగు కావ్యము రచించిన యీ వారణాసి వేంకటేశ్వరకవి సంస్కృతాంధ్రములలోఁ జక్కని ప్రవేశము కలిగి శివారాధకుడైన పండితుఁడు. ఈ గ్రంథమునకు శ్రీ పురాణపండ మల్లయ్యశాస్త్రి గారు పీఠిక వ్రాయుచు నీ వేంకటేశ్వరకవి నివాసము పీఠికాపురపరిసరమున వెలసిన క్రొత్త యిసుకపల్లి యనియు, దత్రత్యులవలన విన్నది విస్పష్ట పఱిచిరి. కూచిమంచి తిమ్మకవి వలెనే యితఁడు శివభక్తుఁడై యీ కృతి "శ్రీ పీఠాఖ్యపురీ మహేశ్వరుఁ" డగు కుక్కుటేశ్వరున కంకితము గావించెను. రామోపాఖ్యానము రచించి యీశ్వరున కిడుటలో నితని యద్వైత మతాభిమానము వెల్లివిరిసినది. సంస్కృత సీసములో నీ కవి రచించిన కుక్కుటేశస్తవము వినుఁడు.

సీ. శ్రీమ ద్వచోమానిసీ మహశ్చక్రాణి
నాకలోకేభ విభాకులాని
దుగ్ధపాథోధి సమ్యగ్ధామయాధాని
పుండరీక ప్రభామండలాని

బృందారకాపగా మందభా బృందాని
               కైలాస శైల రుగ్జాలకాని
మహనీయ సురమహీగుహ దీప్తిజాతాని
              విపుల శుభ్రచ్ఛదోస్రపటలాని
వ్యాళనాయక రుచి చక్రవాళకాని
క బు విస్ఫార శోభాకదంబకాని
భువి విజిత్వా విరేజిరే తవయశాంసి
మారమదభంగ! కుక్కుటాకారలింగ!

ఏతద్ గ్రంథాంతగద్యమున "ఇది శ్రీమ త్కుక్కుటేశానుగ్రహ ప్రభూతకవిత్వ విశ్వామిత్ర గోత్రపవిత్ర వారణాసివంశపారావార కైరవమిత్ర విద్వన్నుతచరిత్ర కామయార్య పుత్ర సుకవి జనవిధేయ శ్రీ వేంకటేశ్వర నామధేయ ప్రణీతంబైన...." యనియున్నదిగాని, కృత్యాది పద్యములో నీగ్రంథనిర్మాణమునకు దనసొదరులైన లక్ష్మీపతి, జోగన్న యనువారలు తోడైరని కలదు. ఆ పద్య మిది :

శా. ప్రీతింబుట్టితి మవ్వధూవరులకున్ శ్రీ వెంకటేశుండా నే
నేతద్ గ్రంథనిబంధనంబునకు నాకెంతోనియుం దోడుగా
జేతస్ఫూర్తి రచించి పొల్పసగు లక్ష్మీవత్సభిఖ్యుండు వి
ఖ్యాతప్రజ్ఞఉడు జోగనాహ్వయుడు నార్యశ్లాఘ్యసంశీలతన్.

గ్రంథపీఠికాకారులు మల్లయ్యశాస్త్రిగా రీవిషయము గురుతించి యిటులు వ్రాయుచున్నారు.

"...ఇట్లున్నను నీగ్రామమున నున్న వారొకరు వీరు తమకు సన్నిహిత బంధువు లనియు, వీరిమువ్వుర నెరుగుదు మనియు, వేంకటేశ్వరకవి దీనిని రచింపనారంభించి మిక్కిలి కొలదిభాగమును రచియించి యేకారణముచేతనో మాని తరువాత గొలదిదినములలో మృతిజెందెననియు, బిమ్మట లక్ష్మీపతియే దీనిని సాంతముచేసి యన్నయందలి భక్తిచే నాయన చేసినట్లే ప్రచురించెననియు జెప్పిరి. వీరు రచించిన యితర గ్రంథము లేవియు లేమింజేసియు, శైలి యన్నిభాగముల సదృశ మగుటంజేసియు నిందేది యెవరు రచించిరో తెలియుట దుస్సాధ్యము...."

ఏది యెటైన నీ గ్రంథ మొక్కటేతీరున ధారాళమైన కవిత్వముతో రాజిల్లినదనుట వాస్తవము. వేంకటేశ్వరకవి పితామహుడు ".....అజస్రాంభోరుహాప్తాను కం, పాసంప్రాప్త సమస్తదేశ విలసద్భాషా కవిత్వాది, విద్యాసంపాదితతరత్న హేమ వసనక్ష్మారామ భూషాముఖ, శ్రీ సత్కారుడు" అయిన వేంకటేశ్వరకవి యని గ్రంథములో జెప్పికొనెను. ఇతని తండ్రి రాజాధిరాజ నభాంతరార్యలోక సంశ్లాఘ్య సకల కలాకలాపనిధి" యట. ఆయనపేరు కామకవిరాజు. తండ్రికడనే మన వేంకటేశ్వరకవి చదువులు సమస్తము చదివెనట. ఇతని పితృసోదరుడు కూడ నుభయభాషాకవిత్వ విశారదుడనియు, రాజానుగ్రహ పాత్రుడనియు గ్రంథాదినున్నది. మేనమామయు గొప్పభక్తుడు, నీతిశాస్త్రవేత్తగ జెప్పబడెను. ఈరీతిని దండ్రియు, బినతండ్రియు, బితామహుడు, మాతులుడు ప్రఖ్యాతు లైనటులును, మహారాజ సత్కారము లంది నటులును వేంకటేశ్వరకవి కృతిప్రారంభ పద్యములో ఘనముగ స్తుతించుకొనెను గాని, వారి వారి గ్రంథములుగాని, వారినిగురించిన కథలుగాని కనబడవు, వినబడవు.

ఈ రామచంద్రోపాఖ్యానము నందలి కవిత యందచందములు కలిగి ధారావిషయమున బూర్వకావ్యములతీరు స్మరింప జేయుచున్నది. ఎక్కుకపోయె, చేతును మున్నగు ప్రయోగములు కొన్ని వ్యాకరణము ననుసరించనివి కలవు. మొత్తముమీద ద్రాక్షాపాకము, నడుమ నడుమ నారికేళపాకముగ గవితసాగినది. మచ్చుపద్యములు:

చ. ఒక పలుగాకి కాకి యమితోన్మద మొప్ప ధరాకుమారికం
జికమన నొందజేయ రఘుశేఖరు డారసి దాని కాత్మలో

బృందారకాపగా మందభా బృందాని

కైలాస శైల రుగ్జాలకాని

మహనీయ సురమహీరుహ దీప్తిజాతాని

విపుల శుభ్రచ్ఛదోస్రపటలాని

వ్యాళనాయక గుచి చక్రవాళకాని

క బు నిస్పార రోభా దంబకాని

భువి విజిత్వావిరేజిరే తనయశాంసి

మారమదభంగ!కుక్కుటాకారలింగ!

ఏతద్ గ్రంథాంతగద్యమున "ఇది శ్రీమ త్కుక్కుటేశానుగ్రహ ప్రభూతకవిత్వ విశ్వామిత్ర గోత్ర పవిత్ర వారాణాసివంశపారా వార కైరపమిత్ర విద్వన్నుతచరిత్ర కామ యార్య పుత్ర సుకవి జనవిధేయ శ్రీ వేంకటేశ్వర నామధేయ ప్రణీతంబైన......" యనియున్నదిగాని, కృత్యాది పద్యములో నీగ్రంథనిర్మాణమునకు దనసోదరులైన లక్ష్మిపతి, జోగన్న యనువారులు తోడైరని కలదు. ఆపద్యమిది:

శా. ప్రీతింబుట్టితి మవ్వధూపగులకున్ శ్రీ వెంకటేశుండు నే

నేతద్ గ్రంథనిబంధనంబునకు నాకెంతేనియుం దోడుగా

జేతస్ఫూర్తి రచించి పొల్పెసగు లక్ష్మిసత్యభిఖ్యుండు వి

ఖ్యాతప్రజ్ణుడు జోగనాహ్వయుడు నార్యశ్లాఘ్యసంశీలతన్.

గ్రంథపీఠికాకారులు మల్లయ్యశాస్త్రిగా రీవిషయము గుఱుతించి యిటులు వ్రాయుచున్నారు.

"...ఇట్లున్ననునీగ్రామమున నున్న వారొకరు వీరు తమకు సన్నిహిత బంధువు లనియు, వీరిమువ్వుర నెఱుగుదు మనియు, వేంకటేశ్వరకవి దీనిని రచింపనారంభించి మిక్కిలి కొలదిభాగమును రచియించి యేకారణముచేతనో మాని తరువాత గొలదిదినములలో మృతిజెందెననియు బిమ్మట లక్ష్మీపతియే దీనిని సొంతముచేసి యన్న యందలిభక్తిచే నాయన చేసినట్లే ప్రచురించెననియు జెప్పిరి. వీరు రచించిన యితరగ్రంథము లేనియు లేమింజేసియు, శైలి యన్ని భాగముల సదృశ మగుటంజేసియు నిందేది యెవరు రచించిరో తెలియుట దుస్సాధము...."

ఏది యెటైన నీగ్రంథ మొక్కటేతీరున ధారాళమైన కవిత్వముతో రాజిల్లినదనుట వాస్తవము. వేంకటేశ్వకవి పితామహుడు"......అజస్రాంభోరుహాస్తాను కం,పాసంప్రాప్త సమస్తదేశ విలసద్భాషా కవిత్వాది, విద్యాసంపాదితరత్న హేమ వసనక్ష్మారామ భూషాముఖ, శ్రీసత్కారుడు" అయిన వేంకటేశ్వరకవి యని గ్రంథములో జెప్పికొనెను. ఇతని తండ్రి "రాజాధిరాజ నభాంతరార్యలోక సంశ్లాఘ్య సకల కలా కలాపనిధి" యట. ఆయనపేరు కామకవిరాజు. తండ్రికడనే మన వేంకటేశ్వరకవి చదువులు సమస్తము చదివెనట. ఇతని పితృసోదరుడుకూడ నుభయభాషాకవిత్వ విశారదుడనియు, రాజానుగ్రహ పాత్రుడనియు గ్రంథాదినున్నది. మేనమామయు గొప్పభక్తుడు, నీతిశాస్త్రవేత్తగ జెప్పబడెను. ఈరీతిని దండ్రియు, బినతండ్రియు, బితామహుడు, మాతులుడు ప్రఖ్యాతు లైనటులును, మహారాజ సత్కారము లందినటులును వేంకటేశ్వరకవి కృతిప్రారంభపద్యములో ఘనముగస్తుతించుకొనెను గాని, వారి వారి గ్రంథములుగాని, వారినిగుఱించిన కథలుగాని కనబడవు, వినబడవును.

ఈ రామచంద్రోపాఖ్యానము నందలికవిత యందచందములు కలిగి ధారావిషయమున బూర్వకావ్యములతీరు స్మరింప జేయుచున్నది. ఎత్తుకపోయె, చేతును మున్నగు ప్రయోగములు కొన్ని వ్యాకరణము ననుసరించనివికలవు. మొత్తముమీద ద్రాక్షాపాకము, నడుమ నడుమ నారికేళ పాకముగ గవితసాగినది. మచ్చుపద్యములు:

చ. ఒక పలుగాకి కాకి యమితోన్మద మొప్ప ధరాకుమారికం

జికమక నొందజేయ రఘుశేఖరు డారసి దాని కాత్మలో నక నక నొంది క్రన్నస దృణం బొకటేయ మహాస్త్రమై కరం

బొకసరి బీరువోక సకలోర్వర ద్రిప్పిన గాకి భీరుతున్.

తృతియాశ్వాసము.

శా. కాంతా రాంతర సంచర జ్జనకరాట్కన్యా మణీ నిస్ఫుర

త్కాంత శ్యామల కేశపాశ విలస త్కాలాంబుదాలోక నా

త్యంతామోద సటత్కలాపిచయకేకా రావ సంపూరితా

శాంతం బయ్యెను వింటి కాని యెడ గేక్యాఘంబు లిట్లుండునే?

తృతీయాశ్వాసము.

మ. కలళీ నూను మహోపదేశమున సర్కస్వామి నెంతే విని

ర్మల భక్తిం బ్రణుతించి బాహుబలసామగ్రిన్ విజృంభించి యీ

కలుషాత్మున్ వధియించెదం గలన నింకన్ బంకజాతాసనా

దులు నడ్డంబుగ వచ్చి నిల్చిన సుధాంధో బృంద మీక్షింపగన్.

షష్టాశ్వాసము.

                    -------------------------