ఆంధ్ర గుహాలయాలు/ఆంధ్ర గుహాలయాల పరిణామ దశలు, నిర్మాతలు

వికీసోర్స్ నుండి

ఆంధ్ర గుహాలయాల పరిణామ దశలు, నిర్మాతలు :

ఆంధ్రుల వాస్తు పరిణామ చరిత్రలో గుహాలయాల పరిణామ దశలు ఒక ప్రముఖ స్థానమును కలిగి యున్నది. అర్థిక పురోభి వృద్ధి, సాంస్కృతిక ఔన్నత్యములు అతి ప్రాచీన కాలము నుండి ఆంధ్రలో ఏర్పడిన కారణముగా ఇతర ప్రాంతాల ప్రభావములకు కూడ ఇది లోనగుచుండినది. శాత వాహనుల తరువాత ఇక్ష్వాకులు, వారి తరువాత కంచి కేంద్రముగా గల పల్లవులు ధాన్యకడ (అమరావతి) లో ప్రతినిధిని గలిగి కృష్ణా నదీ పరిసర ప్రాంతాలను పరి పాలించిరి. పల్లవులు తూర్పు ఆంధ్రలోని కృష్ణా తీరముననే గాక పశ్చిమాంధ్రలోని 'శాతవాహాని రట్ట ' యనెడి నేటి బళ్ళారి ప్రాంతమును కూడ పాలించిరి. బహుశా ఈ బళ్ళారి పల్లవుల స్వాధీన మందుండిన కాలముననే పల్లవులు దక్కన్ లో వీరికి పూర్వపు రాజ వంశాల వారు రూపొందించిన గుహాలయాల గూర్చి తెలుసుకొనుట జరిగి యుండవచ్చును. ఈ వాస్తు రీతినే (గుహాలయాల నిర్మాణము) సింహ విష్ణు వంశజుడైన నవీన పల్లవ రాజు మొదటి మహేంద్ర వర్మ తమిళ ప్రాంతమున కఠిన గ్రనైట్ శిలలో ప్రారంభము చేసేను. ఈ ఘనతకు తగ్గ రీతిలో ఇతడు తన 'మదగన్నట్టు ' శాసనములో చెప్పబడి నట్లు 'విచిత్ర చిత్త ' మొదలగు బిరుదులు ధరించినాడు.

ఆంధ్ర రాష్ట్రములోని కృష్ణా, గుంటూరు జిల్లాలలోని విజయవాడ, మొగల్ రాజ పురము, ఉండ వల్లి ప్రాంతాల లోని గుహాలయాలు, నెల్లూరు జిల్లాలోని భైరవ కోన గుహాలయాలు, పల్లవ నిర్మాణాలుగా గొందరు, మరి కొందరు విష్ణు కుండిన రాజులు లేక క్రీ.శ. 6 వ శతాబ్దమున దిగువ కృష్ణా నదీ ప్రాంతాలలో పరిపాలించిన (చాళుఖ్య రాజైన రెండవ పులకేసి తీరాంధ్ర ముట్టడికి పూర్వము) తెలుగు చోడ రాజులు లేక తూర్పు చాళుక్యులు నిర్మించి యుందురని భావించుట కలదు. నిజమేదియో తెలుసుకొన వలసి యున్నది. కాని ఈ రాజ వంశాలు ఇకరి నుండి మరొకరు వాస్తు రీతులను స్వీకరించుట మనకగుపడును.

విష్ణుకుండినులు దక్కన్ లోని వాకాటక రాజ వంశాల సమకాలికులుగా యుండుటే గాక వారితో శత్రుత్వము కలిగి యుండుట వలన అయుద్ధాల కాలాలలో వారి వాస్తు శిల్ప రీతుల గూర్చి తెలుసుకొనెడి అవకాశము ఏర్పడి అట్టి నిర్మాణాలను వీరు పై ప్రాంతాలలో నిర్మించి యుండవచ్చును. విష్ణు కుండినులు హైందవ మతాభిమానులు. అంతే గాక ఈ వంశజులలో మొదటి మాధవ వర్మ, మూడవ మాధవర్మలు అశ్వమేధ, అగ్నిష్టమ, హిరణ్య గర్భ యజ్ఞములను, మహాదానములను చేయుటే గాక తమ వంశ (కుటుంబ) మంతయు శ్రీ పర్వత స్వామికి అంకిత మైన భక్తులుగా (నల్లమల కొండలలోని శ్రీ శైల మల్లికార్జున స్వామి) చెప్పుకొనుట కూడ ఈ గుహాలన్నియు వీరే నిర్మించి యుండవచ్చునని అభిప్రాయము గలదు. ఇదే నిజమైతే ఇవి రెండవ పులకేసిచే కునల (కొల్లేరు సరస్సు) ప్రాంత యుద్ధమున ఓడి పోయిన వేంగీ రాజ్యాధిపతి మూడవ మాధవ వర్మ (C. 556- 616 A.D.) లేక అతని కుమారుడు వీటి నిర్మాతలై యుండ వచ్చును. కాని యుద్ధమొక ప్రక్క చేయుచు ఇది సాధించ గలిగి యుండెడి వారా యని సందేహ మేర్పడును.

పల్లవులే ఆంధ్ర లోని గుహాలయ నిర్మాతలనుటలో కూడ ఇదే సందేహ మేర్పడును. మొగల్ రాజ పురము గుహాలయాలు పల్లవ మహేంద్ర వర్మ నిర్మాణాలుగా (ఐదవ గుహలోని పూర్ణ ఘట రూపము, నాల్గవ గుహలోని ప్రక్క నిర్మాణాల రీతులు మినహా) మనకు తోచును. ఉండవల్లి గుహాలు పల్లవేతర నిర్మాణాలుగా, బహుశా చాళుక్య నిర్మాణాలుగా తోచును. భైరవ కోన గుహలు పరిణతి చెందిన గుహాముఖ భాగముతో పల్లవ మామళ్ళ రీతికి దగ్గరగా అగుపడును. కానీ ఇచట గుహాలయాల ముందు ఏక శిలా నంది రూపణ పల్లవేతర రీతిని సూచించును. కాని ఇచటి పల్లవ గ్రంథ లిపిలోని క్లుప్తశాసనములును, త్రిమూర్తులలోని శివునికి దేవగృహంలో శివలింగరూప స్థానము, గుహ వెలుపలి ఇరువైపుల విష్ణు బ్రహ్మలకు స్థానములు కల్పించుటను పరిశీలించినచో పల్లవ రీతిని స్పస్టముగా తెలుపు చున్నవి. అంతేగాక విజయవాడ వద్ద గల అక్కన్న మాదన్నల గుహాలయంలోను, ఉండవల్లి లోని ఒక గుహాలయంలోను భైరవకోన గుహాలయంలోను, మహారాష్ట్ర లోని ఔరంగాబాదు జిల్లాలోని ప్రాచీన భోగవర్థన ప్రాంతమైన నేటి భోకార్థన్ లోని గుహాలయాలలోని ప్రాచీన తెలుగు, కన్నడ లిపిగా చెప్పబడు చున్న క్రీ.శ 7 వ శతాబ్ద కాల లిపిలో గల ఉత్పతిపిడుగు గా పలుక బడుచున్న ఒక బిరుదు బట్టి ఈ గుహలు గల ప్రాంతాలన్నింటినీ ఒకే రాజు ఆక్రమించి అతనిచే ఈ గుహాలయ వాస్తు రీతి ప్రవేశపెట్ట బడినట్లు భావించుట గలదు. ఈ కాలమున ఈ ప్రాంతాలాక్రమించిన ఘనత సాధించిన వాడు పల్లవరాజు ఒకటవ మహేంద్ర వర్మయని చెప్ప వచ్చును. పల్లవరాజ్యము మొదలుకొని చాళుక్యుల రాజధా ని బాదామి(వాతాపి) వరకు క్రీ.శ. 7 వ శతాబ్దమున ఆక్రమణ చేసిన వాడు ఇతడే.

కాబట్టి వాస్తు రీతుల ఆధారముగనే పై గుహాలయాల నిర్మాతల గూర్చి నిర్ణయించ వలయును. ఒక నిర్మాణము యొక్క కాలాన్ని ఆ నిర్మాణము లోని స్తంభములు, కార్బెల్స్, కార్నిస్, శిల్ప రూపణ, గ్రౌండ్ ప్లాన్, గుహాలయాల అంకితము కాబడిన దేవతలు మొదలగు వాటి ఆధారముగా నిర్ణయించవలెనని లాంగ్ హర్ట్స్ వంటి పురావస్తు శాస్త్రజ్ఞులు భావించినారు. పైరీతిలో పరిశీలించినచో తమిళ ప్రాంతాలలో వలె అంతస్తులేని గుహాలయాల వలే నిర్మింప బడినమొగల్ రాజపురము, భైరవ కోన గుహాలయాలు పల్లవ నిర్మాణాలుగాను, అంతస్తులు గల గుహాలయాలాతో కూడిన ఉండవల్లి గుహలు, దక్కన్ ప్రభావములో గల చాళుక్య నిర్మాణాలుగాను భావించ వచ్చును. కాని భైరవ కోనలో గుహాలయాలు పాక్షికముగా అంతస్తులతో నిర్మించుట జరిగి నట్లు అగుపడును. ఒక్కొక్క స్థాయి లోని ఈ గుహలు వేటికవి ప్రత్యేకముగా ఇచట అగుపడును. స్తంభాలు, కేపిటల్. కార్నిస్, ఆర్కిట్రేవ్ మలి(later) పల్లవ (మామల్ల) రీతిలో అగుపడును. కాని వీటి స్థంభ కాండమునకు (pillar shaft) కి (fluted character) లేదు. కాండము పైన 'తడి ', 'ఫలక ' లేదు కాని చాళుక్య రీతిలో వలే 'కలశ', 'కుంభ ' యుండుటయే గాక ఇవి ఒక nuxes loca' genesis మరియు మామల్ల తరువాతి రీతికి దగ్గరగా యున్నవి.

భైరవకోన రెండవ, ఐదవ గుహాలయాలపై గల క్లుప్త శాసనాలు కూడ ఈ గుహలు పల్లవులచే నిర్మించ బడినవిగా భావించుటకు అవకాశ మిచ్చుచున్నప్పటికీ ఇవి వేంగీ చాళుక్యులు లేక తెలుగు చోడులచే నిర్మించబడి యుండవచ్చునని భావించుటకు అవకాశము గలదు.

మొగల్ రాజ పురములోని ఐదవ గుహలోని పూర్ణఘట రూపణ పల్లవేతర రీతిని తెలుపు చున్నది. ఇది శాతవాహన, ఇక్ష్వాకుల కాలమునాటి బౌద్ధ నిర్మాణాలలో యున్నటు వంటి పూర్ణఘట వలెను, క్రీ.శ. 6 వ శతాబ్దము రెండవ అర్థ భాగమునకు చెందిన తొలి (పశ్చిమ) చాళుక్యుల ఐహోలెలోని దేవాలయములోను, తరువాత ఒక శతాబ్దానికి నిర్మించ బడిన ఔరంగాబాద్ గుహాలయముల లోను అగుపడెడి పూర్ణ ఘట రూపణ వలె యున్నది. ఇచటి ద్వార పాలురు కూడ తమిళ ప్రాంతములోని పల్లవ ద్వార పాలుర కన్న తక్కువ రమ్యత (suave ) కలిగి యున్నారు. అంతే గాక వారి very stance is different . ఇచటి నాల్గవ గుహాలయ ముఖభాగముపైన, పైకప్పు భాగాన తాండవ శివుని శిల్పరూపణ చేయ బడియున్నది. ఇది క్రీ.శ. 7 వ శతాబ్ద ప్రారంభమున చాళుక్య దేవాలయాలలో సుకనాస భాగమున నిర్మింప బడెడి తాండవ శివుని రీతిని స్ఫురింపజేసి ఈ గుహ చాళుక్య నిర్మాణముగా తెలుపు చున్నది. భైరవకోన గుహాలయాలు పైకి పల్లవరీతి కలిగి యున్నట్లగుపడును. కాని కార్నిస్ భాగములోని నాసికలు శిఖ, (crest) భాగమున వ్యాళను కలిగియున్నవి. ద్వారపాలురు langorous మరియు గుండ్రటి(rotund) రూపముల (figures)ను కలిగి కీలు(joint) భాగాలలో బిరుసు(stiffness) ను అననుకూల(disproportionate) అవయవములను కలిగి యున్నవి. స్తంభాలుకూడ పల్లవ, చాళుక్య(early 7th century A D.) రీతి మిశ్రమాన్ని కలిగియున్నవి. ముఖ్యముగా కాండము, 'కలశ', 'కుంభ' భాగాలలో ఇది అగుపడును. కుంభ భాగమున అష్టకోణాకృతి గల (kattu) సంగమ ప్రాంతమున చతురస్రాకార కాండము పై భాగమైన 'సందురం' పై విభాగమున గల 'పద్మబంధ' పుష్పముల ఉంగరాకార(loops) వివరాలలో ఇది అగుపడును. ఇవన్నియు చాళుక్య వాస్తు రీతి ప్రభావమును తెలుపు చున్నవి. గుహాలయ ముఖ భాగములు కూడ అటు పల్లవ రీతిని గాని ఇటు చాళుక్య రీతిని గాని పూర్తిగా చూపుట లేదు.

అంతే గాక తమిళ ప్రాంతాలలో గుహాలయాల నిర్మాణాలకు మహేంద్ర వర్మ కఠినశిల ఉపయోగించగా, మొగల్ రాజపురము, ఉండ వల్లి గుహాలయాలు మెతువు రాయి (sand stone)లో రూపొంచబడగా భైరవ కోన గుహాలయాలు schistose లో రూపొందింపబడి యున్నవి.

కాబట్టి మొగల్ రాజపురము, ఉండవల్లి, భైరవ కోన గుహాలయాలు పల్లవ ప్రభావాన్ని కలిగియున్నప్పటికి పల్లవేతర నిర్మాణలుగా భావించుటకు కూడ అవకాశ మిచ్చు చున్నవి. ఈ గుహాలయాల ప్రభావము తరువాతి నిర్మాణాలపై మన కగుపడదు. కాని తమిళ ప్రాంత గుహాలయాలు తరువాత నిర్మాణాలపై తమ ప్రభావాన్ని చూపినవి.

ఇవి క్రీ.శ. 7 వ శతాబ్దము రెండవ అర్థ భాగము నుండి క్రీ.శ. 8 వ శతాబ్దంతపు పూర్వ కాలమున నిర్మించబడినవిగా చెప్పబడు చున్నవి. ఈ కాలముననే ఆంధ్రలోని అలంపూర్ దేవాలయాలు చాళుక్య, రాష్ట్రకూట ఒరిస్సా దేవాలయాల ప్రభావముతో నిర్మించబడినవి.