Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/వెలగపూడి వెంగనార్యుడు

వికీసోర్స్ నుండి

క్షణసారమునం దనేకలక్షణములు చేకొనబడినవి. కవిత్వరీతిని జూపుటకయి లక్షణగ్రంథములనుండి పద్యములను జేకొనుట న్యాయము కాకపోయినను సులక్షణసారమునుండి రెండుపద్యముల నిం ధుహరించుచున్నాను.


మ. వినుమీరీతియటంచు గావ్యకరుడై వెల్లంకి తాతప్ప చె
    ప్పినసూత్రంబులు కల్లగా గనబడెన్ వీక్షింప నెట్లన్నచో
    మునుదీర్ఘంబులపై ఱకారములకే పూర్ణస్థితప్రజ్ఞ గా
    దనియెన్ లింగమగుంట తిమ్మకవి నే దర్కింతు నిప్పట్టునన్.


చ. అనుచు నదేమొకో మును రయంబున లక్షణసారసంగ్రహం
    బెనయ వచించె జిత్రకవిపెద్దన లెస్సవువోడు వోడృ శ
    బ్దనయతగానరో వినరో దద్ఘను లెంతయు ధన్యు లయ్యు మే
    ల్గన భ్రమ గాంతు రాత్మల నొకానొక చోట బరాకు గ్రమ్మగన్.



49. వెలగపూడి వెంగనార్యుడు


ఇతడు శ్రీలీలాశుకయోగి విరచితమైన కృష్ణకర్ణామృతమును మూడాశ్వాసముల గ్రంథముగా దెనిగించెను. ఈకవి యాఱువేల నియోగిబ్రాహ్మణుడు; పెద్దనామాత్యునిపుత్రుడు. ఇతడేకాలమునం దుండినవాడో నిశ్చయముగా దెలియదుగాని యీతని కృష్ణకర్ణామృతములోని పద్యమొకటి సులక్షణసారమునం దుదాహరింపబడి యుండుటచేట నితడు 1930వ సంవత్సరమునకు బూర్వమునం దుండెనని మాత్రము తెలియును. ఈతనికవిత్వము నిర్దుష్టమయి శ్రావ్యముగా నున్నది. కృష్ణకర్ణామృతములోని పద్యములు మూటి నిందు జూపు చున్నాను

శా. బాలు న్మంజులతాలవాలచపలాపాంగోల్లసల్లీలునిం
గాళిందీపులినాంగణప్రణయశృంగారై కఖేలున్ శుభ
శ్రీలోలుం గరుణావలోకనసుధాశీలున్ వినీలప్రభా
జాలుం గొల్చెద రామణియకరసస్వారాజ్యపాలు న్మదిన్. ఆ. 1.

చ. ఉదరము నింపగోరి ఖలు లుండెడితావులు చేరి వారిక
ట్టెదుట నశాంక నిన్ను నటియింపగ జేసిన పాతకంబులన్
సదయత నోర్వగావలె బ్రసన్నమతిన్ ననుగన్నతల్లి శా
రద యదువంశనాయకుని ప్రస్తుతి నిష్కృతి నే నొనర్చెదన్. ఆ. 2.

ఉ. చల్లనివాని నవ్వు వెదజల్లెడువాని దయారసంబు జొ
బ్బిల్లెడువాని గెంపుజిగిపెంపు చెలంగెడుమోవివాని సం
ఫుల్ల సరోజనేత్రముల బొల్చినవాని బయోధివీచికా
వేల్లి తనీలనీరదనవీనతనుద్యుతివాని గాంచెదన్. ఆ. 3.


50. రెంటూరి రంగరాజు

ఇతడు భానుమతీపరిణయమను నాలుగాశ్వాసముల ప్రబంధమును రచియించి వేంకటగిరి ప్రభువగు వెలుగోటి రామభూపాలున కంకితము చేసెను. ఈకవి యారువేలనియోగిబ్రాహ్మణుడు; శ్రీవత్సగోత్రుడు; చినగంగనామాత్యపుత్రుడు. కృతిపతి తన్ను గూర్చి పలికినట్టుగా కవి తనశక్తిసామర్ధ్యాదులను భానుమతీపరిణయమునం దిట్లు తెలుపుకొని యున్నాడు -

సీ. వ్యస్తాక్షరీధుర్యవిస్తీర్ణభావంబు క్రముకసంఖ్యాఖ్యాన కౌశలంబు
నారోహణావరోహణలేఖనప్రౌఢి యగ్రపద్యగ్రహణాభిరక్తి
యనవలోకితశారికాభిఖేలనరీతి వరసమస్యాపూర్తి వైభవంబు
సముదగ్రవీక్షితచతురంగబలకేళికావిలాసము నేక కాలముననె