ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/మరింగంటి సింగరాచార్యులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మరింగంటి సింగరాచార్యులు.


ఈకవి దశరధరాజనందనచరిత్ర యనెడు నిరోష్ఠ్యరామాయణమును రచియించెను. ఇతడు శ్రీవైష్ణవబ్రాహ్మణుడు; మౌద్గల్యగోత్రుడు; తిరుమలాచార్యపౌత్రుడు; వేంకటాచార్యపుత్రుడు. ఈకవి తా నేకైకదినప్రబంధరచనాధురీణుడ ననియు, ఆంధ్రభాషా నిరోష్ఠ్యారివింశతి ప్రబంధనిర్మాణుడ ననియు, వ్రాసికొనెను గాని యితడు రచియించిన యితరగ్రంథము లేవియు నిప్పుడు గానరావు. ఇతడు నూటయేబది సంవత్సరముల క్రిందటనుండిన ట్లీతని వంశమువారు చెప్పుచున్నారు. ఈకవి వాసస్థలము దేవరకొండసీమ. ఈతని కవిత్వము సలక్షణమై హృదయంగమముగానున్నది. దశరధరాజనందనచరిత్రములోని కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను--