ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/భైరవకవి
అనంతనార్యుడు.
ఈకవి గాధేయోపాఖ్యానమును నేకాశ్వాసశృంగారప్రబంధమును రచియించి కామాంబకును జిన్నప్రభువుకు బుత్రుడగు కృష్ణభూపాలుని కంకితము చేసెను. ఇతడు తాళవలింగకవి కుమారుడు. ఈకవినిగూర్చియు నీతనికాలమును గూర్చియు మఱేమియు దెలియరాలేదు. ఇతడు నూఱేండ్లకు లోపలివాడుకాడు. ఈతని కవిత్వము హృద్యమయి యనపద్యమయియున్నది. కవితామాధుర్యమును జూపుటకై గాధేయోపాఖ్యానములోని పద్యముల రెంటి నిందుక్రింద బొందుపఱుచుచున్నాను--
భైరవకవి.
ఇతడు రత్నశాస్త్రమును దెనుగున బద్యకావ్యమునుగా రచియించెను. ఇతడు గౌరనసుతుడు. ఇతడు భ్రమరాంబికా వరప్రసాదముచేత దనకు గవిత్వము వచ్చిన ట్టీక్రిందిపద్యములలో జెప్పుకొనియుండుటచేత కర్నూలుమండలము లోనివా డయినట్టు తోచుచున్నది. పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/200 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/201 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/202 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/203 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/204 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/205 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/206 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/207 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/208 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/209