ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/వికీసోర్స్ కూర్పు ముందుమాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వికీసోర్స్ కూర్పు ముందు మాట[మార్చు]

వికీసోర్స్ లో ప్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్ స్థాపించినతరువాత, దాని వాడుకకు ఆదర్శముగా నుండుటకు ఒక పుస్తకము పూర్తిగా తయారుచేయవలెనని సంకల్పము కలిగినది. దీనికి స్వేచ్ఛానకలుహక్కులు గల పుస్తకము కావలసి వచ్చినది. ఆంధ్రుల చరిత్రము -ప్రథమ భాగము తెలుగు నాట ముద్రణ తొలి దశలో ముద్రించబడిన పుస్తకము కావున, దీనిలో పేజీలు అధికముగా నున్నను ఎంపికచేయటము జరిగింది. ముగ్గురు వికీ సభ్యులు, చాలా కాలం దీక్షగా దీనిటైపు పూర్తి చేయటం జరిగింది. చరిత్ర పాఠాలు చదివిన వారు దీనిలో గల కష్టాన్ని గుర్తించగలుగుతారు. ఈ పుస్తకం టైపు పూర్తయిన తరువాత నాలుగైదు పుస్తకాలు వికీసోర్స్ లో ప్రవేశపెట్టడం మరియు ఇంకా పదులకొలది పుస్తకాలు వికీసోర్స్ లో టైపు చేయుటకు సిద్ధం చేయటం జరిగినందున ఈ ప్రయత్నం నెరవేరిందని తలచవచ్చును. ఎక్స్టెన్షన్ స్థాపనలో సహకరించిన వాడుకరి:Billinghurst కు ధన్యవాదాలు.

మూల ప్రతి ముద్రణలో తెలుగు రూప అంకెలు పాఠ్యములో వాడగా ఆంగ్ల-అరబిక్ అంకెలు పేజీపైన వాడారు. అలాగే అరసున్నలు, బండి ఱలు వాడడం జరగంది. ఈ నాటి పాఠకుల సౌకర్యంకొరకు, యూనికోడ్ రూపం చేయునపుడు తెలుగు రూప అంకెలను ఆంగ్ల-అరబిక్ రూప అంకెలుగా మార్చాలని నిర్ణయించడం జరిగింది. అలాగే పద్యము కాని పాఠ్యములో అరసున్నలు వాడుకను తొలగించి ప్రస్తుతవాడుకలో అవసరమైతే పూర్తి సున్న రూపం వాడడం జరిగింది. కొన్ని సార్లు బండి ఱ ను సాధారణ ర గా వాడడం జరిగింది. యూనికోడ్ చేయటంలో గమనించిన ముఖ్యవిషయాలు.

  • పాఠ్యంలో పదాల విరుపు ఇప్పటి భాష కంటె విరుద్ధంగా వున్నది. వాక్య మధ్యలో పదాలు అచ్చుతో ప్రారంభం కాదనే నియమము పాటించినట్లున్నది.
  • పదాల నిడివి ఎక్కువగావున్నది.
  • పాఠ్యంతీరు రెండు అంచులకుతాకుతున్నందున, ఒక్కొక్క సారి వరుసలో అంతమయ్యే పదం నిజమైన అంతమో కాదో తెలియదు.

మొత్తం 435 పేజీల నిడివిగల ఈ గ్రంథానికి ప్రతి పేజీ టైపుకు ఇంచుమించు 15 నిముషాలు ( వికీ పేజీ పరిమాణం 3000-4000 బైట్లు ( utf-8))), మొదటి సారి అచ్చుదిద్దటానికి 5 నిముషాలు,రెండవసారి అచ్చుదిద్దడానికి3 నిముషాలు పట్టినట్లు తెలిసింది. అందువలన 1.5MB పరిమాణము గల ఈ ప్రాజెక్టుమొత్తానికి 200 గంటలు (166 టైపు దిద్డడానికి మరియు దానిలో 20శాతం అనగా 32గంటలు సమన్వయం, బొమ్మలు, విషయసూచిక తయారీ లాంటి వాటికి)షుమారుగా పడుతుంది. దీనిని అధారంగా మొత్తం వికీసోర్స్ కృషి అంచనా వేయవచ్చు.డిసెంబర్ 2013 నాటికి తెలుగు వికీసోర్స్ పరిమాణం 77MB కావున, ఈ ప్రాజెక్టులో 10266 గంటలు అనగా 64 నెలలు లేక 5 మానవ సంవత్సరాల పని పట్టిందని చెప్పవచ్చు. ఇంకొన్ని సాంకేతిక వివరాలు పరిశీలిస్తే ఈ పబ్ రూపం షుమారు 3.3 MB (3,317,212 బైట్లు) పరిమాణం కలిగివున్నది. అదే స్కాన్ పిడిఎఫ్ రూపం దాదాపు పది రెట్లు పరిమాణం కలిగివుంది.

ఈ కృషి తెలుగుభాషాభివృద్ధి కొరకు వివిధ రకాలుగా వుపయోగ పడుతుంది. OCR ఉపకరణాలు పనితీరు మెరుగుపరచడానికి, అచ్చుదిద్దు ఉపకరణాల తయారీకి ఉపయోగపడే తెలుగు భాష పదాల నిల్వ గాను, అలాగే ఇంకా మరయంత్రం ద్వారా పాఠ్యాన్ని ధ్వని రూపంలోకి మార్చగలిగే ఉపకరణం మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని భావిస్తాము.

దీని మూలప్రతి స్కాన్ నాణ్యత లో కొంత లోపాలున్నందున, అక్కడక్కడ స్వల్ప దోషాలుండవచ్చు. మూల ప్రతి అందుబాటులోవున్నవారు వాటిని సరిచేయమని (స్కాన్ లో లేని పేజీతో సహా)కోరుతున్నాము.

ఇట్లు

వికీసోర్స్ సభ్యుల తరపున

అర్జున, పుస్తకము వికీసోర్స్ కూర్పు సమన్వయకర్త

2014-05-09