ఆంధ్రకామందకము
చతుర్ధాశ్వాసము
క. |
శ్రీకర రఘురామగుణా
నీకస్తుతిచతురనీతినిర్ణయనిపుణా
కోకహితవంశతిలకశు
భాకర కొండ్రాజు వెంకటాద్రి నరేంద్రా॥
| 1
|
మండలయోని ప్రకరణము
గీ. |
బలము భండారమును గల్గు పార్థివుం డ
మాత్యులను మంత్రులను గూడి సుతుల లెస్సఁ
గా విచారింపవలయు దుర్గమున నుండి
మహిమ పెంపొందుచుండెడు మండలముల.
| 3
|
క. |
పరిపూర్ణమండలుండై
ధరి రంజిలఁ జేయుతుహినధామునిమాడ్కిన్
బరిపూర్ణమండలుండై
నిరతము విజిగీషువైన నృపతి దనర్చున్.
| 4
|
క. |
జనపతి విశుద్ధమండల
మున మెలఁగిన రథికుచందమున నెల్లపుడుం
దనరు నవిశుద్ధమండల
మున మెలఁగ రథంబు చక్రముంబలె నలఁగున్.
| 5
|
వ. |
ఇట్టి విజిగీషు వైనట్టి రాజునకు నమాత్యుండును రాష్ట్రంబును
దుర్గంబును భండారంబును బలంబును నియ్యైదును బందప్రకృతు
లని నీతిజ్ఞులైన వారలు పలుకుచుండుదురు. మఱియును
బృహస్పతిమతంబువార లీ పంచప్రకృతులకు రాజును మిత్రుం
డునుం గూడ సప్తప్రకృతులం గలిగినది రాజ్యంబని పలుకు
చుండుదు రిట్టి ప్రకృతులతోడం గూడికొని మహోత్సాహుండై
యిన్నిటియందును నభ్యాసంబు గలిగినవాఁడై శత్రువులం గెలువ
నిశ్చయించినరాజు విజిగీషు వనంబరగు నట్టి విజిగీషువైన
రా జెట్టివాఁ డనిన.
| 6
|
కౌలీన్యాది విజిగీషు గుణములు
సీ. |
కులమును బుద్ధియున్ గలిగి యుత్సాహియై
చిత్తజ్ఞుఁడై వృద్ధసేవి యగుచు
కడు నియ్యనేర్చి ప్రగల్భుఁడై సత్యంబు
సడలక పనులందు జడతలేక
కలఁగక వినయంబు గలిగి స్వతంత్రుఁడై
దేశకాలజ్ఞుఁడై దిటము గల్గి
యన్నియు నెఱిఁగి మాటాడగా నేరిచి
దక్షుఁడై గుప్తమంత్రంబు గలిగి
|
|
గీ. |
మిగులఁ బోటరియై బత్తి మే లెఱింగి
పాపకర్ములు గాకుండు బంట్లు గల్గి
శాస్త్రదృష్టనిజాచారచతురుఁడైన
యతని విజిగీషు వండ్రు మహాత్ములెల్ల॥
| 7
|
సీ. |
బహుళరాజ్యాంగుఁడై బడలికలను గెల్చి
జాడ్యంబుఁ జపలత జాఱవిడిచి
చతురుఁడై రిత్తయై దనని కోపము గల్గి
శరణాగతులను వత్సలతఁ బ్రోచి
|
|
|
వందనాపూర్వకవాక్యముల్ వదరుచు
నలమటలకు నోర్చి బలిమి గలిగి
దూరకార్యజ్ఞుఁడౌ దొరఁ గెల్చు దొరయగు
గుణము లన్నియునుఁ జేకూడెనేని
|
|
గీ. |
కడుఁ బ్రతాపగుణంబైనఁ గలుగవలయుఁ
దెలిసి చూడఁ బ్రతాపంబు గలుగువాని
రఖిలశత్రులు వెఱతు రియ్యవనిలోన
మృగపతికి నోడి యొదిఁగెడి మృగము లనఁగ.
| 8
|
క. |
అతులప్రతాపనిధియగు
పతి నేకొనుచుండు నెపుడు బలువగు సిరి నీ
క్షితిఁ గావున నుత్సాహము
గతినేచేతఁ బ్రతాపగుణమె కైకొనవలయున్.
| 9
|
క. |
ఇల నేకార్ధప్రీతిం
గలహించిన శత్రు వగుచుఁ గనఁబడు నందున్
బలవజ్జిగీషుగుణముల
నలరిన వెడిదంపుఁ బగతుఁ డండ్రు నయజ్ఞుల్.
| 10
|
గీ. |
పిఱికి సోమరి క్రూరుండు పిసిఁడి చంచ
లుండు మూఢుండు సత్యహీనుండు మోస
పోవునాతండు యోధులఁ గావరించి
పలుకునతఁడును సాధ్యుండు పరుల కెందు.
| 11
|
మండలస్వరూపము తద్భేదములు
వ. |
మఱియు మండలస్వరూపం బెట్లన్నను బరాశరుండు విజిగీషువు
సిరియు నన్యోన్యజయేచ్చ గలవారగుటంజేసి వీర లిరువురకు
నేకప్రకృతియ కావున నీప్రకృతియ మండలంబని బలుకు
| 12
|
|
చుండు, వెండియు నతండే విజిగీష్వరులకు భేదం బగుటం
జేసి వీరలిరువురు దొరల గలయది మండలంబని పలుకుచుండు.
మఱికొన్ని మతంబులవారు విజిగీష్వరి మధ్యము లనియెడి
మువ్వురు దొరలంగల యది మండలంబని పలుకుచుండుదురు.
మఱియు మయమతంబువారు విజిగీష్వరి మధ్య మోదాసీను
లనియెడి నలువురు దొరలం గల యది మండలంబని పలుకు
చుండుదురు. మఱియుఁ గొన్నిమతంబులవారు విజిగీషునకు
వెనుకటి పార్ష్ణిగ్రాహాక్రందు లిరువురును ముందరి యరి మిత్రు
లిరువురునుం గూడి విజిగీషువుతోడ నేవురు దొరలంగలయది
మండలంబని పల్కుచుండుదురు. మఱియుఁ బులోమేంద్రులు
విజిగీష్వరి మిత్రపార్ష్ణిగ్రాహ మధ్య మోదాసీను లనియెడి
యార్వురు దొరలంగలయది మండలంబని పల్కుచుండుదురు.
మఱియుఁ గొన్నిమతంబులవారు విజిగీష్వరి మధ్యమోదాసీను
లనియెడి నలుగురు దొరలకును నలుగురు మిత్రులం గూడి
యెనమండ్రు దొరలం గలయది మండలంబని పల్కుచుండు
దురు. మఱియుఁ గొన్నిమతంబులవారు విజిగీషునకు
ముందరి యరిమిత్రాదు లేవురును వెనుకటి పార్ష్ణిగ్రాహాదులు
నలువురును విజిగీషువును గూడి పదువురు దొరలం గలయది
విజిగీషుమండలం బనుపేరఁ బ్రసిద్ధంబుగాఁ బలుకుచుండుదురు.
మఱియు శుక్రమతంబువా రిట్టి విజిగీషుమండలంబు రాజులు
పదుగురును మధ్యమోదాసీను లిరువురునుం గూడి పన్నిద్దరు
దొరలఁ గలయది యగుటం జేసి ద్వాదశరాజమండలంబునకే
తొలుతఁ జెప్పఁబడిన యమాత్యాది పంచప్రకృతిభేదంబుల
వలనను స్వామ్యాది సప్తప్రకృతిభేదంబుల వలనను విజిగీష్వ
రులకుఁ గార్యంబువలన నయ్యేడు నుభయార్యుభయ మిత్ర
|
|
|
భేదంబులవలనను నన్నియుఁ బ్రత్యేకంబుగాఁ గూడుకొన
మున్నూట యిరువది నాలుగు మండలంబుల పర్యంతంబు
గలిగిన మండలభేదంబులు బహుప్రకారంబులుగా బహుమతం
బులవారలు పలుకుచుందు రయినను సకలమతసమ్మతంబును
సకలలోకప్రసిద్ధంబును సకలలోకవిజ్ఞాతంబునైన యది
యీ ద్వాదశరాజమండలంబే యగు నది యెట్లనిన.
| 12
|
ద్వాదశరాజమండలము
సీ. |
అరియును మిత్రుండు నరిమిత్రుఁ డవ్వల
నహిత మిత్రామిత్రుఁ డహితమిత్ర
మిత్రుండు ననఁగ భూమీపతులైదుగు
రల విజిగీషువు నగ్రమునను
వెనుకఁ బార్ష్ణిగ్రాహుఁ డనియెడు నాతండు
నాక్రందుఁ డనురాజు నవలి వంక
యందుఁ బార్ష్ణిగ్రాహకాసారుఁ డాక్రంద
కాసారుఁడన నల్వు రవనినాథు
|
|
గీ. |
లరిజిగీషులభూములయండనుండు
మధ్యముఁడు వారిచెంతను మనుపఁ గట్ట
కడ నుదాసీనుఁ డన్నిట ఘనుఁడు దీనిఁ
దెలియ ద్వాదశరాజమండల మటండ్రు.
| 13
|
గీ. |
మఱియు మిత్రుఁ డుదాసీనమనుజపతియు
నరియునన నింతమాత్రనే యగుచు నుండు
మండలము పతి కీరితి మండలంబు
సొరిది గెలుచుటె మండలశుద్ధి యండ్రు.
| 14
|
శ్లో. |
అష్టశాఖం చతుర్మూలం షష్టిపత్రం ద్వయేస్థితం।
షట్పుష్పం త్రిఫలంవృక్షం యోజానాతి స నీతివిత్॥
|
|
గీ. |
అకు లర్వదియును విరు లాఱు కొమ్మ
లెనిమిదియు మూఁడుదలములు నునికి రెంటి
యందు వేరులు నాలుగు నమరు మ్రాను
నెఱుఁగువాఁ డిట్టి నయగతి నెఱుఁగువాఁడు.
| 15
|
సీ. |
అరివిజిగీషువు లిరువురి కగు మిత్రు
లెనమండ్రు నను శాఖ లెనిమిదియును
మధ్యమోదాసీన మానవేంద్రులు నరి
విజిగీషువును నన వ్రేళ్ళు నాల్గు
మహిని ద్వాదశరాజమండలమున కెన్న
నై దేశప్రకృతుల నమరుఁ గూడ
రమణ నర్వది మండలము లగు నదియును
షష్టిపత్రంబులు షడ్గుణములు
|
|
గీ. |
ననెడి విరులు నయానయయత్నయుగళి
నెపుడు నునికి క్షయస్థానపృద్ధులనఁగ
నలరు త్రిఫలంబులును గలయట్టి మ్రాను
నెఱుఁగువాఁ డిట్టి నయగతి నెఱుఁగువాఁడు.
| 17
|
సీ. |
గనులును గృషులాదిగాఁ గలయష్టవ
ర్గంబనునట్టి శాఖలును గల్గి
సామంబు మొదలైన చతురుపాయము లనఁ
బొలుపొందునట్టి వేరులును గల్గి
|
|
|
యల విజిగీషుమండలమున కైదేసి
ప్రకృతులతో నెనుబదియు నవియు
రమణ నర్వదిమండలము లగు నవియును
షష్టి పత్రమ్ములు షడ్గుణములు
|
|
గీ. |
ననెడి విరులు నయానయయత్నయుగళి
నెపుడు నునికి క్షయస్థానవృద్ధు లనఁగ
నలరు త్రిఫలంబులును గల యట్టిమ్రాను
నెఱుఁగువాఁ డిట్టి నయగతి నెఱుఁగువాఁడు.
| 18
|
వ. |
కావున నందు నీ చెప్పిన ద్వాదశరాజమండలంబుల యుద్ధ
క్రమంబుఁ గ్రమంబున వివరించెద.
| 19
|
మండలచరితప్రకరణము
సీ. |
అలవిజిగీషువై నట్టి రాజునకును
వెనుకఁ బార్ష్ణిగ్రాహుఁ డనెడి రాజు
నవలఁ బార్ష్ణిగ్రాహకాసారుఁడను రాజు
శత్రువు లగుదు రీజగతిలోన
నాక్రందుఁడను రాజు నాక్రందకాసారుఁ
డను రాజు మిత్రులై యొనరుచుండ్రు
కావున నచ్చోటఁ గలిగిన మిత్రభూ
వరులచే శత్రుభూవరుల కెపుడు
|
|
గీ. |
గదలఁగా రాక యుండఁ బో రొదవఁ జేసి
తనకు ముందరఁ గల్గు శాత్రవుల మీఁద
దండు గదలంగవలయు నుద్దండలీల
వినుతు కెక్కుచు జయముఁ జేకొనెడికొఱకు.
| 20
|
సీ. |
అటులనే విజిగీషువై నట్టి భూపతి
రసికుఁడై నీతిమార్గంబు మెఱసి
తనశత్రుమీఁదటఁ దనమిత్రభూపతి
దనశత్రుమిత్రుపైఁ దనదుమిత్ర
మిత్రుఁడై నట్టి భూమీపతిఁ గవియింప
నగు వారి కందఱ కవలనుండఁ
దనయరిమిత్రమిత్రుని గదలకయుండ
నటఁ గృతకృత్యుఁడై యధికుఁడైన
|
|
గీ. |
యుభయమిత్రుల రేఁచి పో రొదవఁ జేసి
తనకుఁ బిమ్మటఁ గల్గు శాత్రవులమీఁద
దండు గదలంగవలయు నుద్దండలీల
వినుతి కెక్కుచు జయముఁ జేకొనెడికొఱకు.
| 21
|
వ. |
మఱియు నిట్టి విజిగీషువగు రాజు దనమిత్రులుం దాను నిద్ద
రిద్దరుఁ గూడి యెడనెడనయుండెడి తనశత్రువుల నిరుదిక్కు
లను జిక్కించక యుక్కడంచి జయించి మిందు తెఱంగు
వివరించెద.
| 22
|
సీ. |
తానును నాక్రందధారుణీపతియుఁ బా
ర్ష్ణిగ్రాహు నొవ్వఁగాఁ జేయవలయు
నాక్రందు నాక్రందనాసారు ననికంపి
పార్ష్ణిగ్రహాసారుఁ బఱుపవలయుఁ
దనదుమిత్రుండును దానుఁ గూడుక తన
యరిరాజుఁ బెకలించి చెఱుపవలయుఁ
దనమిత్రుచేతను దనమిత్రమిత్రుచేఁ
దనయరిమిత్రునిఁ దఱుమవలయు
|
|
ఆ. |
నుభయమిత్రుచేత నొగి మిత్రమిత్రుచే
శత్రుమిత్రమిత్రుఁ జదువవలయు
నిటుల నహితవరుల నిరుగడ గదుముచు
గెలువవలయు నల జిగీషువునకు.
| 23
|
క. |
ఈరీతి రెండుగడలన్
నేరుపుతో గెలువఁగోరు నృపతి గదిమనన్
వైరులు మెత్తురు లేదా
వారు దనుం గొలిచి నిలిచి వర్తింతు రిలన్.
| 24
|
చ. |
తనకును వైరికిన్ సమతఁ దాల్చిన చుట్టపువంక బారి నే
యనువుననైనఁ గూర్చుకొని యందఱినిం దనవారిఁ జేసికోఁ
జను నటులైన చుట్టములె చాల నలంచినయట్టిశత్రునిన్
జనపతి దా జయించుటకుఁ జాలఁగ శక్తుఁ డగున్ సుఖస్థితిన్.
| 25
|
ఆ. |
కారణములచేతఁ గాదె లోకులు శత్రు
లగుచు నున్కి మిత్రు లగుచు నున్కి
నటులు గాన శత్రు లయ్యెడికారణం
బులను విడువవలయుఁ బుడమిఱేఁడు.
| 26
|
క. |
దొర తాఁ బ్రధాన మగుచున్
ధరఁ గలిగిన ప్రజలనెల్లఁ దనవారలుగా
బరగింపందగు నటువలెఁ
బరగిన సర్వాంగరాజ్యపదవిం జెందున్.
| 27
|
ఉ. |
దూరమునందె యుండి పరదుర్గనివాసుల మండలేశులన్
గూరిమిఁ జూపి మిత్రులుగఁ గూర్చుకొనందగు న ట్లొనర్చినన్
వారలు ప్రాణబంధువులు వశ్యులునై వినయంబు పెంపునన్
దారె యొనర్పుచుండుదురు తక్కినమండలముల్ వశంబుగన్.
| 28
|
చ. |
పటుబలుఁడైన మధ్యముఁడు పైఁ దగ దం డొనగూడి వచ్చినన్
గుటిలత మాని తాను నరికూటువఁ గూడుచునుండు టొప్పుఁ దా
నటువలె శక్తుఁడై నిలుచునంతటి పూనిక నూనకుండుచోఁ
చటుకున సంధి సేయఁదగు దానవిధాననిదానలీలలన్.
| 29
|
గీ. |
అధికుఁడైన యుదాసీనుఁ డడరినపుడు
సకలమండలనాథులు నొకటి యగుచు
సంఘధర్మంబుమై నుండఁ జనునపుడును
బలిమి లేకున్న శరణొంది బ్రతుకవలయు.
| 30
|
సంఘధర్మస్వరూపము
క. |
ఘనముగ నాపద లొదివిన
జనపతు లందఱును గూడి స్వార్థముకొఱకై
యొనఁగూడి యవి యడంచుట
యనుపమగతి సంఘధర్మ మనఁగాఁ బరగున్.
| 31
|
శత్రుమండలమును గుఱించిన వైశేషికవర్తనప్రకారము
క. |
సహజుఁడు కార్యజుఁ డనగా
మహి నిరువురె శత్రు లరయ మానవపతికిన్
సహజుఁడు దాయాదుండౌ
నహితుఁడు కార్యజుఁడు వాని యన్యుం డెందున్.
| 32
|
గీ. |
అరియెడఁ జరింపవలసిన యట్టి నడక
లయ్యె నాలుగు నుచ్ఛేద మపచయంబు
గాలమునఁ జేయు పీడన కర్శనంబు
లనుచు నయవిద్య లెఱుఁగువా రండ్రు ధరను.
| 33
|
సీ. |
ప్రకృతుల నన్నింటిఁ బరిమార్చుట దలంప
నదియుఁ దా నుచ్ఛేద మనఁగఁ బరగు
బలిమి భండారంబు గలిమి రిత్తఁగఁ జేయు
నదియుఁ దా నపచయం బనఁగఁ బరగు
సరవి మహామాత్యసంహార మొనరింప
నది కర్శనంబని యనఁగఁ బరగు
దుర్గరాష్ట్రాదులఁ దొడరి ఖండించుట
యది పీడనం బని యనఁగఁ బరగు
|
|
గీ. |
నిట్టి నాలుగు తెఱఁగులు నెఱిఁగి యరుల
యందుఁ గావింప నేర్చిన యట్టి ఘనుఁడు
సకలధాత్రీతలంబును బ్రకటలీల
నేలువై రుల నెల్ల జయించి మించు.
| 35
|
గీ. |
ఆశ్రయవిహీనుఁడై యుండి యడరెనేని
హీనబలుఁ డగుపతి నాశ్రయించెనేని
యెందుఁ బలువురితో వైర మందెనేని
యపుడు భూపతి గడి శత్రు నడపవలయు.
| 36
|
ఉ. |
ఎందు సమాశ్రయం బనుచు నెంతురు దుర్గము మిత్రు వీనితోఁ
జెంది మహాభిమానమును జెందిన శత్రుని వేళయందె వే
టందగఁ జేయఁగావలయు నాతనిఁగొల్చు నమాత్యుఁ జంపియుం
గ్రందగు రాష్ట్ర దుర్గముల రాయిడిచేఁ గడుఁ బీడ సేసియున్.
| 37
|
క. |
తనమర్మము తన ఛిద్రము
దనవిక్రమ మెఱిఁగి చెఱుచుఁ దనవాఁ డగుచున్
దనరిన శత్రువు లోపల
మనికొందినయగ్ని యడ్డు మ్రాకులబోలెన్.
| 38
|
ఉ. |
మాటికి సర్వతంత్రముల మర్మముఁ దెల్పెడువాఁడు గల్గు నె
చ్చోటను శాత్రవుం దునుమఁ జొప్పడుఁ దొల్లి రఘూద్వహుండు దా
మేటి విభీషణుండు నలమిత్రసుతుండును గల్గఁ బట్టి యె
ప్పాటును లేక రావణునిఁ బట్టి వధింపఁడె వాలిఁ ద్రుంపఁడే.
| 39
|
సీ. |
బలవంతుతోడుతఁ గలహింపుచును దన
యరి ప్రయాసంబున నంది నప్పు
డతనిభండారంబు నతనిబలంబులఁ
జెఱుపఁగాఁ దగుఁ దనుఁ జెఱుపకుండ
నొకశాత్రవునిఁ బట్టి పెకలించివైవ పై
నొకబలవద్వైరి యొదవెనేని
మునుపటి పగఱనే తనవానిఁగా జేసి
కొని నేర్పుతోఁ గూడికొనఁగవలయు
|
|
గీ. |
కులమువారల తోడుతఁ గూడి బలియు
దండఁ గొని యుండువైరి నాతని కులంబు
వాని కొకశత్రుఁ గల్పించి వాని మిగులఁ
బెంపు సేయుచు విధుఁ డరి నొంపవలయు.
| 40
|
సీ. |
విసముచేతనె యెందు విసము నాశము నొందు
వజ్రంబుచేఁ దెగు వజ్ర మెపుడు
మీలు మీలను బట్టి మ్రింగుచు నుండును
గరియును గరిచేతఁ గట్టుపడును
దాయాదియును దనదాయాదిచేఁ జెడు
నటుగాన రావణు నడచు నప్పు
డల విభీషణుఁ బూజ నందించి పట్టె శ్రీ
రామచంద్రుండు గౌరవము జయము
|
|
గీ. |
నిట్టి నయరీతి నెంతయు నెఱిఁగి నృపతి
వైరిఁ జెఱిపెడికొఱకునై వైరికులజుఁ
డైనవానినె పట్టి తా నాప్తుఁ జేసి
కొనుచు మెలపున జయముఁ గైకొనఁగవలయు.
| 41
|
క. |
ఏకార్యముఁ జేయంగాఁ
జేకొనఁ దనమండలంబె చెడుబా టగుఁ దా
నాకార్య ముడుగవలయున్
గైకొన్నధరాతలంబుఁ గడు రంజిల్లన్.
| 42
|
క. |
దానమున సామమున స
న్మానమున న్మెలగఁ జేయఁదగుఁ దనవారిం
బూనుకొని భేదదండవి
ధానమ్ములచేతఁ బరులఁ దండిపఁ దగున్.
| 43
|
వ. |
ఇది శత్రుమండలవర్తనప్రకారం బింక మిత్రమండలవర్తన
ప్రకారంబు వివరించెద.
| 44
|
మిత్రమండలవర్తనప్రకారము
క. |
క్రమమున హితాహితుల లో
కము నిండుచునుండు సములు గలరే యిది ని
క్కమపో 'సర్వస్స్వార్థం
సమీహతే' యనఁగఁ బరగు శాస్త్రముకల్మిన్.
| 45
|
గీ. |
భోగ మంది వికారంబుఁ బొందెనేని
యెంచి చుట్టంబునైన నొప్పించవలయు
మిగులఁగఁ వికార మొందినఁ దెగి వధింప
వలయు నిలఁ బాపకర్ముండు వైరి గాన.
| 46
|
క. |
మిగుల నుపకారియైనను
బగవానిన్ మిత్రుఁగాఁగఁ బాటింపఁ దగున్
మిగుల నపకారియైనను
దగుఁ జుట్టమునైన విడువఁ దగు జనపతికిన్.
| 47
|
క. |
తనయెడఁ దనశత్రునియెడ
ననిశంబును బక్షపాతియై మెలఁగెడు మి
త్రునిఁ గూల్పవలయు నింద్రుఁడు
కినుకన్ మును విశ్వరూపుఁ గెడపిన మాడ్కిన్.
| 48
|
గీ. |
అహితునకు హిత మొనరించునట్టి మిత్రు
నైన విడువంగఁ దగుఁ దనయహితుమాడ్కి
హితుల పట్టున నెవ్వాఁడు హితము సేయు
వాఁడె పో మంచిమిత్రుఁ డివ్వసుధలోన.
| 49
|
క. |
అనురక్తుండు విరక్తుఁడు
ననవల దుపకారకారి యగుమిత్రునిఁ దా
ననువుగఁ దెలియుచు దోషం
బునఁ జెందినమిత్రు విడువ భూపతి కొనరున్.
| 50
|
క. |
కడుదొసఁ గొందని మిత్రుని
విడిచినచో నర్థధర్మవితతియు నడఁగున్
బుడమిం గావునఁ బతి యె
ప్పుడు సద్గుణములను దోషములఁ దెలియఁ దగున్.
| 51
|
క. |
తానె నిజంబుగ నేరమిఁ
గానక మఱియాజ్ఞ సేయఁగాఁ దగ దేరిం
దానే నేరమిఁ దెలిసిన
చో నుచితపుటాజ్ఞచేతఁ జొప్పడుఁ బతికిన్.
| 52
|
క. |
నేరము లేవియుఁ బొరయని
వారిని దండించునట్టివసుధావిభునిం
గ్రూర మగుపాముఁ జూచిన
తీరునఁ బ్రజలెల్లఁ జూచి తిట్టుదు రెపుడున్.
| 53
|
క. |
తగ నధికమధ్యమాధము
లగుమిత్రులతారతమ్య మరయఁగ వలయున్
దగ నధికమధ్యమాధము
లగువారలపనియుఁ దెలియనగు నధిపతికిన్.
| 54
|
గీ. |
తెలియ కెవ్వరినైన నిందింపరాదు
లేనినిందలు గట్టెడువానిపలుకు
దగిలి వినరాదు మిత్రభేదములు పూని
సేయువారలఁ బతి చేరనీయరాదు.
| 55
|
క. |
పాటించి తెలుప నోపని
మాటయు మచ్చరపుమాట మధ్యస్థంబౌ
మాటయును బక్షపాతపు
మాటయుఁ బతి లెస్సఁ దెలిసి మఱి సేయఁదగున్.
| 56
|
క. |
తనచుట్టములకుఁ బోరొం
దిననొక్కనిఁ బట్టి వాదు నెఱపక వేగం
బున వారలలో వారికిఁ
గినుకలు మాన్పంగవలయు క్షితిపతి యెందున్.
| 57
|
ఉ. |
కాలముపేర్మిఁ దా ఘనము గౌరవ మొందుచు నుండుఁ గానఁ ద
త్కాల మెఱుంగురాజు గుణకల్పన కొంత ఘటించి నీచునిన్
జాలఁగ సంస్తుతింపఁ దగు సారెకు నాతని దుర్గుణంబు లె
వ్వేళను గప్పి పెట్టుచు వివేకవిలోకనచాతురీగతిన్.
| 58
|
క. |
తనవారినిఁ బెఱవారినిఁ
దనవారినె చేసికొనఁగఁ దగు జనపతి యెం
దును దా బహుమిత్రుం డై
నను వైరులు సెప్పినట్లు నడతురు పుడమిన్.
| 59
|
క. |
తన కాపద యగువేళను
దనమిత్రుండైన కరణిఁ దన బంధువులుం
దనతండ్రియుఁ దనయన్నలు
దనతమ్ములు హితముఁ జేయఁ దా రోపుదురే.
| 60
|
క. |
క్షితిలోపల నతులదృఢ
వ్రతులై తగుతనదుమిత్రవర్గముచేతన్
బ్రతివీరు లైనవారలఁ
జతురతమై నిగ్రహింప జనపతి కొనరున్.
| 61
|
మ. |
ఇల నీరీతుల నీతిమార్గమునఁ దా నేప్రొద్దు వర్తించి ని
శ్చలితోద్యోగమునన్ జయేచ్ఛ గలరాజన్యుండు పెంపొందు మం
డలశుద్ధిం దగి శుద్ధమండలమునన్ వర్తించు నాశారదో
జ్జ్వలచంద్రుం డన భూప్రజావితతికిన్ సంతోషముం జేయుచున్.
| 62
|
వ. |
ఇది మండలశోధన ప్రకారంబు. ఇంక సంధ్యాది షడ్గుణంబుల
స్వరూపంబుఁ గ్రమంబున వివరించెద.
| 63
|
సంధివికల్పప్రకరణము
క. |
బలియుఁ దగువైరి గదిమిన
బలువగునాపదలఁ జెంది ప్రతి సేయఁగ నే
ర్పులు లేనిరాజు కాలం
బలవడఁ గడపుచును సంధి యమరించఁ దగున్.
| 64
|
వ. |
అదియు గొన్నిమతంబులవారు కపాలసంధి, యుపహారసంధి,
సంతానసంధి, సంగతసంధి, యుపన్యాససంధి, ప్రతీకారసంధి,
సంయోగసంధి, పురుషాంతరసంధి, యదృష్టనరసంధి, యాదిష్ట
సంధి, యాత్మామిషసంధి, యుపగ్రహసంధి, పరిక్రియసంధి,
యుచ్ఛిన్నసంధి, పరదూషణసంధి, స్కందోపనేయసంధి, యనం
బదునాఱువిధంబులుగాఁ బలుకుదురు. ఇవి కొన్నిమతంబుల
వారు పరస్పరోపకారసంధియు, మైత్రసంధియు, సంబంధ
సంధియు నుపహారసంధియు నన నాల్గుతెఱంగులే యని
పల్కుచుందు రైనను నిందులో నుపహారసంధి యొక్కటియ
యీకామందకమతంబునకు సమ్మతంబు. అది యెట్లనిన
నెందును దనమీఁద దండెత్తివచ్చిన బలవంతుం డగుశాత్రవుం
డెందైన నొకటిఁ గానుకఁ గొనక మగుడి చనండు కావున
మైత్రిచే నైనసంధి యొక్కటి దక్క దక్కినసంధు లన్నియు
నియ్యుపహారసంధిలోని భేదంబులే యగు నైన నీపదియాఱు
సంధుల స్వరూపంబుఁ గ్రమంబున వివరించెద.
| 65
|
సీ. |
సమసంధియ కపాలసంధియై పొలుపొందు
నుపహార మీఁగిచే నొనరుచుండు
సంతానసంధి నాఁ జనుఁ గూఁతు నిచ్చినఁ
గడుమైత్రి నెనయ సంగతపుసంధి
కలకాల మది యొక్కగతిఁ బ్రవర్తింపుచు
సమకార్యములు గల్గి చాల మించి
యాపదలందును నధికసంపదలందు
భేదంబు చెందక పెంపుఁ జెంది
|
|
గీ. |
యల మనుష్యముఖాంతరమందునైనఁ
గట్టి కొట్టుచుఁ గాఁకలం బెట్టునెడల
నది సువర్ణంబులీలచేఁ జెదరకుండుఁ
గనుక కాంచనసంధి నా వినుతిఁ గాంచు.
| 66
|
సీ. |
మంచికార్యము నిద్ద ఱెంచి సేయుటకునై
యడరుట యది యుపన్యాససంధి
యితనికి నుపకార మే నొనర్చితి మున్ను
నతఁడు నా కుపకార మటులఁ జేయు
నుపకార మిపుడు నే నొనరించుచున్నాఁడ
నిఁకమీఁద నా కుపకృతి యొనర్ప
గలఁ డీత డని రాముఁ డెలమి సుగ్రీవున
కొనరించినట్లుగా నొప్పు నిదియు
|
|
గీ. |
ననెడు నదియును బ్రతికార మనెడిసంధి
యిరువు రొకయాత్రఁ గూర్చి తా రింపు మీఱ
సంధి సేయుట సంయోగసంధి యనఁగఁ
పరగు నీరీతు లెఱుఁగ భూపతికిఁ దగును.
| 67
|
సీ. |
మనయిరువుర యోధలును గూడి మాకార్య
మిది యొనగూర్చిన నింత ధనము
మీ కిత్తుమని తాను మేకొన్నసంధి తా
నది పురుషాంతర మనెడుసంధి
మాకార్య మిది మీర చేకూర్చినను మీకు
నిట్టివస్తువులు మే మిత్తు మనిన
నది యదృష్టపురుషమనఁ దనరెడు సంధి
దేశాంశ మియ్య నాదిష్టసంధి
|
|
గీ. |
తనదు సైన్యంబుచేతనే తగ నొనర్చు
సంధి యాత్మామిషం బనుసంధి యండ్రు
ప్రాణరక్షణమునకు సర్వంబు నొసఁగి
కలసియుండుట యది యుపగ్రహ మటండ్రు.
| 68
|
సీ. |
భండారమం దొకపా లిచ్చి యైన నం
దెచ్చదాఁకినసొమ్ము లిచ్చియైనఁ
దనదుభండార మంతయు నిచ్చియైనను
సంధించి ప్రకృతిరక్షణ మొనర్ప
నిది పరిక్రియసంధి యనఁ జెలువొందును
దనభూమిమే లెంచి తనపగఱకు
నొనగూడి యిచ్చిన నుచ్ఛిన్నసంధి యౌ
దద్భూమిఫల మింత ధన మటంచు
|
|
గీ. |
నమర నిచ్చిన ఫలదూషణాఖ్యసంధి
ఫలమె విభజించి కందాయముల నొసంగ
నిర్ణయించుట స్కంధోపనేయసంధి
యిట్టిమార్గంబు నరవరుఁ డెఱుఁగవలయు.
| 69
|
సీ. |
బాలుండు వృద్ధుండు బహుదీర్ఘరోగుండు
నిజబంధుదాయాదనిందితుండు
పిఱికి యైనయతండు పిఱికిబంటై యుండు
పిఱికిబంట్ల యతండు పిసిడివాఁడు
విరసరాజ్యాంగుఁడు విషయసక్తుండును
బహుచిత్తమంత్రుండు బహువిరోధి
కరుపులు వ్యసనముల్ గలిగినయతఁడును
వ్యసనముల్ గలుగుసైన్యములవాఁడు
|
|
ఆ. |
దైవహతుఁడు సత్యధర్మహీనుఁడు లావు
విడిచినతఁడు సురల ద్విజుల నెపుడు
గడవ నాడువాఁ డకాలయోధియు దైవ
చింతకుండు సంధి సేయఁ దగరు.
| 70
|
వ. |
అది యెట్లనిన నిట్టియిరువదితెఱంగులవారును సంధానార్హంబు
గాకుండుటకుం గారణంబులు గలవు వివరించెద.
| 71
|
సీ. |
బాలుం డెదురు గాఁగఁ జాలనికతమున
నని సేయఁగాఁ బూన రతనిబంట్లు
తానును నని సేయలేనివానికి నుప
కారార్థ మెవ్వండు పో రొనర్చు
ముసలివాఁడును రోగములు గల్గువాఁడు ను
త్సాహశక్తులులేమి తమజనంబు
చేతనే భంగంబుఁ జెందుదు రెందును
విరసుఁడై జ్ఞాతుల విడచినయతఁ
|
|
గీ. |
డరికిఁ గైవసమై యుండు నట్టిజ్ఞాతి
జనులచేతనె మున్నుగాఁ జంపఁబడును
గాన వీరెల్ల సుఖసాధ్యు లైనవార
లిట్టివారలతో సంధి నెనయరాదు.
| 72
|
సీ. |
కోఁచవాఁ డని సేయఁ గొఱఁగానికతమునఁ
దనుఁ దానె వెఱచి నాశనముఁ జెందు
కడుఁగోఁచబంటులఁ గలధీరుఁడైన నా
బంట్లచే నాజి నిప్పాటుఁ బొరయు
|
|
|
నరిచేత లంచంబు లంది పిచ్చతనంపు
బంటులు పతిఁ గీడుపఱతు రెపుడు
లోభి జీతము లీయ లొంగెడుకతమున
బంటులు మొగియరు బవరమునకు
|
|
గీ. |
విరసరాజ్యాంగుఁ డరులతోఁ దుర మొనర్ప
విసివి రాజ్యాంగములు వాని విడిచిపెట్టు
విషయసక్తుని గడుసుఖవృత్తి గెలువ
వచ్చుఁ గావున వీరితో వలదు సంధి.
| 73
|
సీ. |
బహువిచారంబులు బహుచిత్తములు గల్గు
పతి మంత్రులకు నెల్లఁ బగతుఁ డగుచు
దలచిత్త మందుటవలనఁ గార్యంబుల
యెడ వారిచేతనే విడువఁబడును
పెక్కుడేగలయందుఁ జిక్కుపావుర మన
బహువైరి యగువాఁడు పదరి చెదరి
యెట్టిత్రోవలఁ బోవు నట్టిత్రోవలయందె
స్రుక్కి శాత్రవులచేఁ జిక్కువడును
|
|
గీ. |
కరువు వ్యసనంబులును జెంది కలఁగువాఁడు
కోలుకోలేక తనుఁ దానె కూలుచుండుఁ
గాన వీరెల్ల సుఖసాధ్యు లైనవార
నిట్టివారలతో సంధి నెనయరాదు.
| 74
|
సీ. |
వ్యసనముల్ గలిగినయట్టిబలంబులు
గలవాఁడు పోటు కెక్కంగలేఁడు
దైవోపహతకుఁడు తనుఁ దానె చెడుచుండు
సత్యంబు ధర్మంబు సడలినయతఁ
|
|
|
డనువుగా సంధి గైకొనినమీఁదట నైనఁ
బదరునుఁ దా మల్లబడి కలంగు
తలము దప్పినయట్టి దంతావళము నీటఁ
గొంచెపుమొసలిచే గుదిసినట్లు
|
|
గీ. |
నెలవు దప్పినయాతండు సెలఁగి క్షుద్ర
శాత్రవునిచేతనైనను సమయుచుండుఁ
గాన వీరెల్ల సుఖసాధ్యు లైనవార
లిట్టివారలతో సంధి నెనయరాదు.
| 75
|
సీ. |
దేవుళ్ళఁ నావలఁ దిట్టునాతఁడు ధర్మ
హీనుండు గావున నీల్గుచుండుఁ
గనుఁగొనలేక చీఁకటిలోనఁ గాకంబు
ఘూకంబుచేతను గూలినట్లు
కాల మెఱుంగక కలహించునాతండు
గాలజ్ఞయోధచేఁ గూలుచుండు
నాపదలకు మఱి యధికసంపదలకు
దైవంబె కద నిమిత్తం బటంచు
|
|
గీ. |
దైవచింతకుం డన్నియత్నములు మాని
యూరకుండియ చెడుచుండు నుర్విలోనఁ
గాన వీరలతో సంధి గాదు తలఁప
నిట్టిమార్గంబు నరవరుఁ డెఱుఁగవలయు.
| 76
|
సంధి కర్హు లగువారు
గీ. |
ఆర్యుఁడును ధార్మికుండు ననార్యుఁ డధిక
బలుఁడు దాయాదవర్గంబు గలుగునతఁడు
సత్యవంతుండు బహుజయశాలి సంధి
కర్హులని పల్కుచుండ్రు నయజ్ఞు లెందు.
| 77
|
వ. |
అది యెట్లనిన, నిట్లు సంధానార్హులైన యేడుగురితెఱఁగును
గ్రమంబున వివరించెద.
| 78
|
సీ. |
ఆర్యుఁడై తగువాఁడు ప్రాణబాధలయందుఁ
దనమంచితనమె వదలక యుండు
ధార్మికుం డెందును దనధర్మమహిమచేఁ
గడుఁ బ్రజారాగంబు గలుఁగుకతన
నతఁ డెదిరించిన నతనికై యందఱు
నని యొనర్తురు కాన నతఁ డసాధ్యుఁ
డగు ననార్యుండైన యతఁడు గూడకయున్న
నతఁడు శత్రులఁ గూడి యడఁగఁజేయు
|
|
గీ. |
మొదలు ముట్టంగఁ బరశురామునివిధమున
నిట్టివార లసాధ్యు లౌ టెఱిఁగి యందు
సంధి గావించవలయు నీజగతిలోన
నీతిమార్గం బెఱింగిన నృపవరుండు.
| 79
|
సీ. |
అధిరుఁ డెంతయు నల్పు నాక్రమించినచోట
నెన్నియత్నంబుల నెనసియైన
నతఁడు దా బలుసింహ మాక్రమించినలేఁడి
లీల నెందును దిక్కు లేక యుండు
నధికుతో నేమాత్రమైనను గినిసిన
నల్పుండు మొదలంట నపుడె చెడును
బలవంతుతోడుతఁ గలహించుమని నీతి
శాస్త్రంబు బలుకు టెచ్చటను లేదు
|
|
గీ. |
మొనసి పెనుగాలి కెదురని మొగిలు కరణి
నధికుతో నల్పుఁ డెదురలేఁ డటులఁగాన
|
|
|
బ్రతుకవలసిన భూపతి బలియుతోడ
సంధి సేయంగవలయు నిశ్చయము గాఁగ.
| 80
|
ఆ. వె. |
అధికుఁ డెదుర నమ్రుఁడై వేళయైనచో
విక్రమించునట్టివిభునిసిరులు
చెంది వెలయు గట్టుచెంతఁ నమ్రతఁ జెంది
యవలఁ బ్రబలునదులయంద మొంది.
| 81
|
సీ. |
దాయాదవర్గంబు దనకు గల్గినవాఁడు
కడుమూఁకఁ జెందిన కారణమున
భేదింపరాకుండుఁ బెనుముండ్లు బలసిన
వెదురులపొదలోని వెదురుమాడ్కి
సత్యవంతుఁడు దనసత్యంబు నడుపుచు
సంధికృత్యంబుల జారకుండు
గెలుపు లెయ్యెడఁ బెక్కు గలవాఁడు దొరకెనా
పరశురామునిఁ బ్రతాపమునఁ వోలి
|
|
గీ. |
యతనిశౌర్యంబుచేతనే యఖిలదిశల
మించుభూపతులెల్లఁ గంపించియుందు
రిట్టివార లసాధ్యులౌ టెఱిఁగి విభుఁడు
సంధి సేయంగవలయు నీజగతిలోన.
| 82
|
క. |
పెక్కుజయంబులు గల దొర
నొక్కటిగా సంధి గూడు నుర్వీవిభునిం
దిక్కని గొల్తురు వైరులు
చక్కనగాఁ దత్ప్రతాపసంతాపితులై.
| 83
|
ఆ. వె. |
సంధి యయ్యె ననుచు సత్యవంతులనైన
నమ్మియుండఁజనదు నరవరునకుఁ
|
|
|
జేయరానిబాస సేసియు నింద్రుండు
వృత్రుఁ జంపినట్టివిధ మెఱింగి.
| 84
|
ఆ. |
తనయుఁడైన ననుఁగుదండ్రియైనను రాజ్య
మంది యొకనిభార మొందుఁ గాన
లోకజనముచర్యలోనిది గాకుండ
ధరణిపతులనడకఁ దలఁపవలయు.
| 85
|
క. |
బలవంతుఁ డెత్తివచ్చిన
నలుకక దుర్గమున నిల్చి యంతటికంటెన్
బలవంతుఁ దెచ్చి తఱుమఁగ
వలయుఁ బటాపంచముగ నవారితశక్తిన్.
| 86
|
క. |
తనయుత్సాహము బలిమియుఁ
గనుఁగొని యరిమీఁద కుఱికి కలహింపఁదగున్
ఘనసింహ మెదిరి మదకరు
లను వెంటాడంగఁ బూనులాగున నెందున్.
| 88
|
క. |
ఉదుటుగల సింహ మొక్కటి
మదగజసంఘములఁ గెల్చుమాడ్కిఁ బగఱపైఁ
బొదలిన తనయుత్సాహము
నుదుటుం గని గమకమునన నుఱుకఁగవలయున్.
| 89
|
క. |
కడునల్పసైన్యునైనను
బడలికఁ బడి యొక్కశత్రు భంజించినచోఁ
బొడవైన తత్ప్రతాపము
కడిమినె యిల నితరశత్రుగణముల బొగడున్.
| 90
|
క. |
సముతోడ నైనసంధియు
నమరుల గెలుపోటమియును ననిలో సందే
హముగన నిట్లనె పలుకఁడె
యమరగురుఁడు నిశ్చితార్థ మది కాదంచున్.
| 91
|
చ. |
బలియఁగఁ గోరురాజు దనబల్మికి మున్ను సమానవైరితోఁ
జలమునఁ బోరఁగాఁ జనక సంధియె చేయుట మేలు కానిచో
నలవడఁ బచ్చికుండ మెరయంబడి రెండుగ వ్రీలుకైవడిన్
బొలియుటె కాక గెల్పులను బొందుట లెందును జెందనేర్చునే.
| 92
|
ఆ. |
సముల మనుచు బదరి సంధి సేయక మీఱి
పోరి యిరువు రొకట బొలియరైరె
పందలై నయట్టి సుందోపసుందులు
గాన సములు సంధిఁ బూన మేలు.
| 93
|
ఆ. |
తనకు వ్యసనమైనతఱి హీనుఁ డెత్తిన
సంధి సేయఁడేని చాలఁగీడు
తడిసినట్టివానియొడలిపై నొకమంచు
బొట్టు బడిన వడఁకు పుట్టకున్నె.
| 94
|
క. |
హీనుఁడగు వైరి యెడలం
దా నెందును వ్యసన మెడలుతఱి సంశయము
న్మానుచు నిర్దయుఁడై పతి
వానియవిశ్వాస మెఱిఁగి వధియింపఁదగున్.
| 95
|
సీ. |
అరి కడుబలవంతుఁడైన సంధియుఁ జేసి
చేరి విశ్వాసంబుఁ జెంద నడచి
తాను నమ్మినయట్టివానికైవడి నుండి
తనయింగితాకృతుల్ గనఁగనీక
|
|
|
దగుప్రియంబులె పల్కి తనదుశౌర్యము తన
కనువైనవేళ సేయంగ వలయు
నది యటులన్న న ట్లనుసరింపుచుఁ దొల్లి
విశ్వాస మందించి వేళ యెఱిఁగి
|
|
గీ. |
ఘనుఁడు దేవేంద్రుఁడు దితి కడుపుఁ జొచ్చి
కడుపులోనున్న పగఱ వ్రక్కలుగఁ జీఱి
యల మరుద్గణకర్తయై యతిశయిల్లె
నిట్టిమార్గంబు నరవరుఁ డెఱుఁగవలయు.
| 96
|
సీ. |
బలవంతుఁడగురాజు చలమునఁ బై నెత్త
నాతనియువరాజు నతనిమంత్రి
తోనైనఁ దాను సంధానంబు గావించి
వారిలో వారికిఁ బోరుఁ బెట్టి
యదియును గాకున్న నతనిప్రధానున
కెంతయుఁ దా ధన మిచ్చియైన
వలయు నర్థముల లేఖల నిచ్చి యైనను
బరునియత్నంబులు సెఱుపవలయు
|
|
గీ. |
నిన్నిరీతులఁ గార్యంబు లెసఁగకుండఁ
జేయఁ గడునుగ్రుఁడై వైరిచెంత నుండు
వారిపై నెల్లను గడువిశ్వాస మొంది
యతఁడు సేసినయత్నంబు నతఁడె మాను.
| 97
|
క. |
అరియత్నము లుడుపఁగఁ దగు
నరిమిత్రుల సంధి చేసియైనను లేదా
యరివైద్యుల భేదింపుచు
నరిఁ జెఱుపఁగవలయు రసవిషాదులనైనన్.
| 98
|
వ. |
ఇట్టియత్నంబులు చేసినను బెట్టిదుండగునట్టిపగఱ మట్టుఁబడక
బిట్టు గదిమినయేని వెండియు.
| 99
|
సీ. |
బహువేషభాషలఁ బరగినవారలై
యాభిచారికనిమిత్తాదు లెఱిఁగి
యాశత్రుదేశంబు నందె కాపుర ముండి
సంచరించెడుఁ దనచరులచేత
నొకకొన్నిప్రశ్నలు నొకకొన్నిశకునముల్
కడు నిదర్శనములు గాఁగఁ దెలుపఁ
జేసి శత్రుల విశ్వసింపఁ గావింపుచు
వారిచేతనె బహువ్యసనములును
|
|
గీ. |
భీకరోత్పాతములును గల్పింపఁజేసి
యిట్లు శత్రునియుత్సాహమెల్లఁ జెఱచి
వానిఁ దోఁదోలవలయు నవార్యమహిమ
నీతిమార్గం బెఱింగిన నృపవరుండు.
| 100
|
గీ. |
పుత్రమిత్రకళత్రాప్తమారువిత్త
వాహనాదులు గదనంబువలన నొక్క
నిమిషమున వ్యర్థమగుట లో నృపతి యెఱిఁగి
మిగులఁ గలకాంబులకుఁ బూని మెలఁగరాదు.
| 101
|
క. |
బలమును ధనమును జుట్టం
బులు నిజదేహంబు రాజ్యమునఁ గీర్తితతుల్
దలఁకుచు సంశయడోలా
కలితముగాఁగనె వివేకి కదన మొనర్చున్.
| 102
|
సీ. |
తనసరిదొరయైనఁ దనమీఁద దండెత్తి
తనతోడ సంధి గైకొనకయున్నఁ
దా నటమీఁద నాతనితోడ సంధి గా
వలసినవాఁడెయై వైర ముడిగి
|
|
|
కాలోచితంబైన క్రమమున సామదా
నంబులచేత భేదంబుచేత
నటు మట్టుఁ నడ నుండి యామీఁదఁ దా మించి
యరి కసాధ్యంబైనయచట నిలిచి
|
|
గీ. |
చతురగతిఁ బొల్చి సన్నాహసహితసైన్య
పటలిచేతను జీకాకుపఱుపవలయు
నతఁ డెటులఁ దప్తుఁడై కూడు నటుల విభుఁడు
'తప్తయోస్సంధి' యనెడి శాస్త్రం బెఱింగి.
| 103
|
క. |
ఈరీతి సంధికార్యము
దారు వచింపుదురు మునులు తత్సంధి బలా
త్కారముననైనఁ గార్యము
గౌరవలాఘవము లెఱిఁగి కావింపఁదగున్.
| 104
|
వ. |
ఇది సంధిస్వరూపంబు. ఇంక విగ్రహస్వరూపంబు వివరించెద.
| 105
|
విగ్రహవికల్పప్రకరణము
క. |
తమలోఁ దా రెప్పుడు కో
పముల నసూయలను బెరసి పలుమరు నపకా
రములె యొనరించుటలచే
నమరంగాఁ బొడము విగ్రహము మహిలోనన్.
| 106
|
ఆ. |
ఫలముగోరువాఁడు పగవారిచేతను
వెతలఁ జెందువాఁడు చతురుఁ డగుచు
నహితుతోడ విగ్రహము సేయవలయును
బలము దేశకాలబల మెఱింగి.
| 107
|
వ. |
ఇట్టి విగ్రహంబు స్థానాపహారంబువలనను రాజ్యాపహారంబు
వలనను, వనితాపహారంబువలనను, గ్రామాపహారంబువలనను,
|
|
|
నర్ధవిఘాతంబువలనను, ధర్మవిఘాతంబువలనను, జ్ఞానాప
హారంబువలనను, జ్ఞానశక్తివిఘాతంబువలనను, మిత్రార్థంబు
వలనను, నవమానంబువలనను, నభిమానంబువలనను, బంధు
నాశనంబువలనను, నేకార్ధప్రీతివలనను, ధనాపహారణంబువలనను,
గృతానుగ్రహభేదంబువలనను, దైవంబువలనను, బ్రకృతి
క్షోభంబువలనను, దేశపీడనంబువలనను, బహుజనద్వేషంబు
వలనను, గలుగుచునుండు నిందుకు శమనప్రకారం బెట్లన్నను
గ్రమంబున వివరించెద.
| 108
|
సీ. |
స్థానరాజ్యములకు సతులకు మఱియు దే
శములకుఁ గా వచ్చు జగడమెల్ల
పుచ్చుకొన్నవి మళ్ళ నిచ్చుటచే నొరుల్
గైకొన్నదమయుక్తిఁ గనుటచేత
నర్థంబు ధర్మంబు నడపఁబో రొదవఁ దొ
ల్తటియట్ల యిచ్చి యేర్చుటలచేత
జ్ఞానాపహారంబు జ్ఞానశక్తివిఘాత
ముల నైన జగడంబు చలము కొనక
|
|
గీ. |
పట్టునర్థంబు వదలి చొప్పడుటచేతఁ
దనకొనర్ప నుపేక్షచేఁ దాల్మిచేత
మందటిలఁ జేయవలయు నెమ్మదిఁ జెలంగ
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 109
|
సీ |
ద్రోహం బధర్మంబుతోఁ గూడుమిత్రుని
కలహంబుఁ దనయుపేక్షణముచేత
నెనసినమంచిమిత్రుని కైనజగడంబుఁ
దనదిగా వహియించుకొనుటచేత
|
|
|
అపమానమునఁ గల్గు నావిగ్రహం బను
నయముతోఁ గూడుమానంబుచేత
అభిమానమునఁ బుట్టినట్టి వైరంబు సా
మంబుచేతను బ్రణామంబుచేత
|
|
గీ. |
బంధునాశంబువలనఁ జొప్పడినపోరు
దగిన యట్టి రహస్యవర్తనముచేత
మందటిలఁ జేయవలయు నెమ్మదిఁ జెలంగి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 110
|
సీ. |
ఏకార్థమునకుఁగా నిరువుర కగుపోరు
తనకోర్కి వదలి వీడ్కొనుటచేత
ధనముఁ గైకొనుటచే నొనరినజగడంబు
క్రోధంబుఁ జాలించుకొనుటచేత
నడరి చేయుననుగ్రహము మాన నగుపోరు
మగుడి యనుగ్రహమహిమచేత
దైవికగతిచేతఁ దనకైనజగడంబు
దైవంబు గూర్చుయత్నంబుచేత
|
|
గీ. |
మండలక్షోభముననైన మచ్చరంబు
నందు కొనఁగూడి తగునుపాయములచేత
మందటిలఁజేయవలయు నెమ్మదిఁ జెలంగి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు॥
| 111
|
సీ. |
మించి దేశంబు బాధించఁగానైనపో
రతనిదేశముఁ గూల్చు నందుచేత
బహుజనంబులతోడఁ బరగినజగడంబుఁ
దగుసామదానభేదములచేత
|
|
|
మానుపఁగావలె మఱి యిట్లు పొడమెడి
కలహముల్ దా మాన్పఁగడఁగఁడేని
సర్వంబు నొకవేళఁ జాలనాశన మొందుఁ
గావునఁ గడు విచక్షణత మించి
|
|
గీ. |
యేయుపాయంబుచేఁ బీడ యెసఁగకుండ
నాయుపాయంబుచే విగ్రహంబు లెల్ల
మందటిలఁ జేయవలయు నెమ్మదిఁ జెలంగి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 112
|
వ. |
మఱియుఁ గొన్నిమతంబులవారు శత్రువర్తనమువలనను,
గ్రహంబులవలనను, వనితలవలనను, వాగ్దోషంబువలనను,
నపరాధంబువలనను, బుట్టెడి వైరంబు లైదువిధంబులే యని
పల్కుచుండుదురు. బాహుదంతతనూజుండు భూమియోర
లడ్డగించుటవలనను, భూమిబాధ గలుగుటవలనను, శక్తి
చెఱుచుటవలనను, గడిరాజువలననుం బొడమెడి వైరంబులు
నాలుగువిధంబులే యని పలుకుచుండు. మనుమతంబువారు
కులమువలనను నపరాధంబువలననుం బొడమెడి వైరంబులు
రెండువిధంబులే యనియును బలుకుచుండుదు రైన నందుఁ బూన
రాని విగ్రహంబులు బదియాఱువిధంబులు గల వవి యెట్లనిన.
| 113
|
సీ. |
అల్పఫలంబైనయది నిష్ఫలంబును
ఫలము నిశ్చయలీలఁ బరగునదియు
నపుడు దోషము గల్గి యామీఁద ఫల మిచ్చు
నదియును దోషంబు లపుడు లేక
యటమీఁద ఫలయుక్తి నలరకుండెడునది
యపుడు మీఁదట దోష మందునదియుఁ
దా నెఱుంగనిశూరతను మించువానిది
పరులు ప్రేరేపఁ జొప్పడునదియును
|
|
గీ. |
నొరుల కొఱకైనయదియును దెఱవకొఱకుఁ
గాఁగ వచ్చినయది దీర్ఘకాలముదియు
నైనవిగ్రహముల నెల్ల మానవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 114
|
సీ. |
బ్రాహ్మణోత్తములతోఁ బరగిన నదియును
వేళ గాకుండెడివేళ నెందు
దైవబలంబుచేఁ దగువానితోడిది
కలహంబునకె నిచ్చఁ గాలు ద్రవ్వు
చెలికాండ్రు గల్గిన క్షితిపతితోడిది
తత్కాలఫలయుక్తిఁ దగుచునుండి
యామీఁద నిష్ఫలమై వచ్చునదియును
తత్కాలఫలయుక్తిఁ దగులనీక
|
|
గీ. |
యంతమీఁదట ఫలయుక్తి నమరునదియు
ననఁగఁ దగినట్టి పైపదియాఱుతెఱఁగు
లైనవిగ్రహముల నెల్ల మానవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 115
|
గీ. |
చేయునప్పుడు మీఁదటఁ జేటులేని
నిగ్రహమ్ములె యెపుడుఁ గావింపవలయు
నవియ కా వన్నిపనులందు నటులఁ గాఁగఁ
దలఁచి మెలఁగంగవలయు నిచ్చలు విభుండు.
| 116
|
ఉ. |
అప్పుడు మీఁదటన్ ఫలము నందఁగఁ జేయు విశుద్ధకర్మముం
దప్పక యాచరించు జననాథుఁడు నిందలఁ జెందకుండుఁ దా
నెప్పుడు నట్లు కావున మహీస్థలిలో నిహముం బరంబుఁ దాఁ
జొప్పడఁ గూర్చునట్టిపని సొంపునఁ జేయఁగ నొప్పుఁ బ్రాజ్ఞుఁడై.
| 117
|
చ. |
ఒకయిసుమంతయర్థమున నుండెడు లోభముచేఁ బరంబుఁ జెం
దక డిగ నాడఁగావలదు తత్పరలోకవిరుద్ధకర్ములం
బ్రకటము గాఁగ దవ్వులనె పాయుట మేలగు నిట్టు లాగమ
ప్రకరము పల్కుఁ గావున నృపాలుఁడు సత్క్రియఁజేయుటే తగున్.
| 118
|
సీ. |
బలము పోషణ మంది చెలఁగియుండెడివేళ
ననురక్తిమై ప్రజల్ దనరువేళఁ
దాను జూచినచూపు దైవ మీడేర్చుచోఁ
దనమిత్రు లతిభక్తిఁ దనరువేళ
సకలసామంతులు సంధిఁ గోరెడివేళ
నాప్తమంత్రులు గలయట్టివేళ
ధనధాన్యములు చాలఁ దన కొనఁగూడుచో
నుత్సాహ మాత్మలో నుబ్బువేళఁ
|
|
గీ. |
బరుల కిటువంటి వెల్లఁ జొప్పడనియట్టి
వేళ నొనరింపఁగాఁదగు విగ్రహంబు
ధనము మిత్రుండు భూమి నాఁ దగినమూఁడు
గతుల ఫలముల నొకటైనఁ గలుగఁ దెలిసి.
| 119
|
ఉ. |
మేలు ధనంబు ధాత్రిపయి మించు సువస్తులకన్న నంతకున్
మేలు దలంప మిత్రుఁ డలమిత్రునికంటెను భూమి మేలగున్
మేలగుభూమిచేతఁ గడుమేలగు సంపద గల్గు సంపదన్
జాలఁగ బంధుమిత్రులును సద్గుణజాలము గల్గు నెప్పుడున్.
| 120
|
క. |
తనతో సమసంపదచే
ననువొందెడిశత్రుజనుల నప్రతిహతమై
తనరునుపాయముచేతనె
జనపతి శిక్షింపవలయుఁ జతురుం డగుచున్.
| 121
|
క. |
కలహంబైన నుపాయ
మ్ములచేతనె తాళి శాంతిఁ బొందింపఁదగున్
గెలుపులు దలఁప ననిశ్చయ
ములు గావునఁ ద్వరితగతుల మొనయక నృపతుల్.
| 122
|
క. |
బలవంతుండగు శాత్రవుండు గినుకన్ బై వచ్చి బోధించినన్
గలఁగన్ బాఱక నిత్యసంపదల నాకాంక్షించుచున్ బుద్ధిని
శ్చలతన్ వైతసవృత్తిచే వినతుఁడై శత్రుం బ్రసన్నాత్ముఁగా
నలరింపందగు సర్పవృత్తు లటు పాయంబెట్టి నేర్పొందుగన్.
| 123
|
ఆ. |
పామురీతిఁ గ్రూరభంగిఁ జరించిన
విభుఁడు నాశ మందు వేగ జగతి
సిరులఁ జెందుచుండుఁ దిరముగాఁ బ్రబ్బళ్ళ
లీల వినయవృత్తి వాలునతఁడు.
| 124
|
ఆ. |
మత్తురీతి వెఱ్ఱిమాడ్కిఁ దా నూరక
యుండి వేళఁ బైకి నుఱికి సింహ
మటులఁ గ్రమముచేత నందినయది జాఱ
కుండఁ బట్టి విజయ మొందవలయు.
| 125
|
సీ. |
తాఁబేటిలీల యెంతయును ముడుంచుక
తనమీఁద వచ్చు బాధలకుఁ దాళి
గట్టుకైవడి నిల్చి కదలక యోర్చుచు
ననువు గాకుండెడియట్టివేళ
యరిని మూపునఁ బెట్టియైన మోపఁగ నేర్చి
ప్రియభాషణంబులఁ బేలుపఱచి
కడుబ్రసన్నాత్ముఁడై పుడమివార్త లెఱింగి
యరియంతరంగంబునందు నిల్చి
|
|
ఆ. |
సమయ మెఱిఁగి కృష్ణసర్పంబుగతిఁ జిఱ్ఱు
మనుచు నొడిసి యగ్నియటుల భగ్గు
రనఁగ నెగసి నీతియనుచేత ముందలఁ
బట్టి తివియవలయుఁ బరులసిరుల.
| 126
|
చ. |
నిలుకడఁ గాంచి మేలెఱుఁగునేర్పు వహించి పరాక్రమంబునన్
గులమున మించి సత్య మొనఁగూడఁగ ధైర్యదయాతిదానస
త్కళల వరించి యూర్జితుఁడు గౌరవశాలియునైనరాజు ని
చ్చలు నిల శత్రురాజుల కసాధ్యుఁ డగున్ మది నెంచి చూడఁగన్.
| 127
|
చ. |
పరుసముఁ బల్కి మేల్మఱచి బాసలు దప్పి భయంబుఁ జెందుచున్
గరువము దుఃఖ మోపమియుఁ గల్గి ప్రమాదము జాగుచందమున్
విరసముఁ జెంది జూదముల వేఁటల నింతులఁ బానలీలలన్
నిరతము నాచరించు నవినీతుఁడు సంపదఁ జెందనేర్చునే.
| 128
|
చ. |
గెలువగఁ గోరునట్టి దొర కీడుగుణంబులు గల్గుశత్రుపై
నలవుమెయిం ద్రిశక్తియుతుఁడై చనఁగాఁదగు నట్లుగాక ని
శ్చలగుణశాలియై తనరుశత్రునిమీఁదట నెత్తువాఁడు నే
ర్పులఁ దనుదానె చంపుకొనఁ బూనుచునుండును నింద కర్హుఁడై.
| 129
|
చ. |
ఘనమగు రాజ్యసంపదలు గైకొను నిచ్చఁజెలంగి బుద్ధిచే
ననువగుమండలక్రియల నన్ని యెఱింగి దృఢప్రయత్నుఁడై
పనివడి విగ్రహస్థితులఁ బాగులఁ జెందుచుఁ గార్యసిద్ధికై
యనిశముఁ బూనఁగావలయు నద్భుతశౌర్యసమగ్రచర్యలన్.
| 130
|
వ. |
ఇదియు విగ్రహస్వరూపంబు. ఇంక యానప్రకారం బెట్లనిన.
| 131
|
యానప్రకరణము
గీ. |
అధికబలవిక్రమంబుల నలరి ప్రకృతు
లాత్మగుణముల ననురక్తి నంది కొలువ
విజయ మందుట కలమహీవిభుఁడు రిపుల
నడఁచుటకు దండు వెడలుట యానమండ్రు.
| 132
|
వ. |
అదియును విగృహ్యయానంబును, సంధాయయానంబును,
బ్రసంగయానంబును, సంభూయయానంబును, నుపేక్షా
యానంబు నని యైదుతెఱంగు లయ్యె వానిస్వరూపంబులు గ్రమం
బున వివరించెద.
| 133
|
సీ. |
బలవంతుఁ డరిప్రధానుల నిగ్రహించి దం
డెత్తుటయును దనహితులచేత
నరిమిత్రులను నొంచి యరిమీఁద దండెత్తు
నదియును విగ్రహయాన మండ్రు
వెనుక శత్రులసంధి నొనరి యన్యులమీఁద
నరుగుటయును దను నడ్డకట్టు
విమతులు సంధించి వేఱొక్కయరిమీఁద
నరుగుట సంధాయయాన మందు
|
|
గీ. |
రొక్కచోటికిఁ గదలి వేఱొక్కయెడకు
శల్యురీతిఁ బ్రసంగవశంబుకతనఁ
జనిన యది ధాత్రియందుఁ బ్రసంగయాన
మండ్రు నయశాస్త్రవిదు లైనయార్యు లెందు.
| 134
|
సీ. |
శౌర్యశక్తుల మించి చాలమూఁకల గూల్పఁ
గలిగిన సామంతగణముతోడఁ
గలసి శాత్రవులను గదుమ నుద్యోగించి
కదలిపోవుట చూడ నదియుఁగాక
ఫల మిత్తునని ప్రతినలు పల్కి కొంచెపు
దొరలతోఁ గూడుక యరుగునదియుఁ
దమప్రకృతుల నొంపఁ దా రిరువురు గూడి
యిరువురు శత్రుల నే పడంప
|
|
గీ. |
మునుపు సూర్యాంజనేయులు సనినరీతి
నరుగుటఁ దలంప సంభూయయాన మండ్రు
రిట్టి యానప్రకారంబు లెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 135
|
సీ.. |
శత్రుపై దండెత్తి చనుచోట నహితున
కపుడు సహాయుఁడై యతనికంటె
బలవంతుఁడగురాజు పై నెత్తి వచ్చిన
మునుపటిశత్రుపైఁ జనక తాను
వాని నుపేక్షించి వానిసహాయుపైఁ
జన నుపేక్షాయాన మనఁగ బరగు
వాసవసూతి నివాతకవచులపైఁ
జని యుపేక్షాయానముననె తొల్లి
|
|
గీ. |
ప్రబలులై మించినట్టి హిరణ్యపురని
వాసులను గెల్వఁ గదలినవైపు దనర
నిట్టియానప్రకారంబు లెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 136
|
గీ. |
అరికి వ్యసనంబు గల్గినయట్టివేళ
నరికి దైవంబు దోడుగానట్టివేళ
నదనుఁ జేకొని దండెత్త నర్హ మండ్రు
నీతిమార్గం బెఱింగిననృపవరునకు.
| 137
|
ఆసనప్రకరణము
క. |
అరియును విజిగీషుధరా
వరు లిరువురు బలికికలిమి వడి నొండొరులన్
దెరలింపలేక యుండుట
ధర నాసన మనఁగఁ బరగుఁ దజ్‌జ్ఞులచేతన్.
| 139
|
వ. |
అదియును విగృహ్యాసనంబును, సంధాయాసనంబును, బ్రసంగా
సనంబును, సంభూయాసనంబును, నుపేక్షాసనంబును నన నైదు
తెఱంగు లయ్యె వానిస్వరూపంబులు గ్రమంబున వివరించెద.
| 140
|
సీ. |
ఒక్కరొక్కరిసీమ లొండొరుల్ గైకొని
మెందొడ్డి యెత్తిపోకుండుటయును
గడువైరితోడ విగ్రహ మంది వాఁడు దు
ర్గస్థుఁడై సాధ్యుండు కానివేళ
ధాన్యాదికము మిత్రతతులను గట్టియల్
గసవును జొరకుండఁ గాఁచియుండి
ముట్టడిగాఁ జుట్టుముట్టుకొనుచునుండు
నట్టిది మును విగృహ్యాసనంబు
|
|
గీ. |
వైరిపై నిట్లు ముట్టడి వైచి యెంచి
ప్రకృతు లన్నియుఁ బెడఁ వాపి వగలుఁ దనకుఁ
గైవసము చేసికొనఁదగుకాల మెఱిఁగి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 141
|
సీ. |
రావణాసురుఁడు పూర్వమున నివాతక
వచులతోఁ బోరాడి వారుఁ దాను
నలసి చతుర్ముఖు నంపి సంధి యొనర్చి
నట్టులు విజిగీషు నరియుఁ వోరి
యలసి సంధి యొనర్చి కలసియుండుటయు సం
ధాయాసనంబనఁ దనరుచుండు
నది గాక యరిమీఁద నలపునఁ గదరి వే
ఱొకప్రసంగము చెంది యొరునిమీఁద
|
|
గీ. |
కడఁగి దండెత్తిపోయి తా విడిసియుండు
నది ప్రసంగాసనం బన నమరుచుండు
నిట్టి చందంబు లెల్లఁ దా నెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 142
|
సీ. |
అరిజిగీషువులఁ దా నాక్రమించుటకు మ
ధ్యముఁడు పై దండెత్తఁ దలచినప్పు
డరియును విజిగీషు నన్యోన్యమైత్రిచే
నొనగూడి బల్మిచే నుండు టొప్పు
నదిగాక ఘనుఁడైన యల యుదాసీనుండు
గినిసిన నరివిజిగీషువులను
దక్కినవారెల్ల నొక్కటైయున్న సం
భూయాసనం బనఁ బొలుపు మీరు
|
|
గీ. |
నిట్టిభేదంబులెల్లను నెపుడు చిత్త
మం దెఱుఁగ నుండ నేర్చిన యట్టిరాజు
మదరిపుల గెల్చి సకలసంపదలఁ బొల్చి
జనులు వినుతించ మించి యిజ్జగతి నేలు.
| 143
|
సీ. |
బలియుఁడై కృష్ణుండు పారిజాతముఁ దెచ్చు
చోట నుపేక్షించి సురవిభుండు
పదరకయున్నట్లు పగతుఁడు బలియుఁడై
యున్నచోఁ దా నూరకుండునదియు
నొకహేతువునఁ జేసి యొకశాత్రవుఁడు పేర్చి
తను నుపేక్షించినదానిఁ గొనుచు
మును రుక్మి యుండిన యనువున నుండుట
యది యుపేక్షాసన మనఁగ దనరు
|
|
గీ. |
నిట్టిభేదంబు లెల్లఁ దా నెపుడు చిత్త
మం దెఱిఁగియుండ నేర్చినయట్టిరాజు
మదరిపుల గెల్చి సకలసంపదలఁ బొల్చి
జనులు వినుతించ మించి యీజగతి నేలు.
| 144
|
ద్వైధీభావప్రకరణము
వ. |
మఱియు ద్వైధీభావంబు స్వతంత్రపరతంత్రభేదంబున రెండు
దెఱంగు లయ్యె నందు స్వతంత్ర ద్వైధీభావం బెట్లనిన.
| 145
|
సీ. |
ఇరుదిక్కులకుఁ దన కిద్దఱుశత్రులు
బలవంతులై యున్నఁ గలఁకపడక
వారివారికిఁ జూడ వారివాఁడును బోలెఁ
దన్నుఁ దక్కోలుగా నెన్ని పల్కి
కాకాక్షివలె నిరుగడల వర్తింపుచు
నందుఁ జేరువదాన నధికయత్న
మున గడుపుచు నిద్ద రెనయక యొత్తిన
నందులో బలవంతు నాశ్రయించి
|
|
గీ. |
వార లిద్దఱు వదలిన వారియరులఁ
దాన బలవంతు నొక్కనిఁ బూని కొలిచి
నడపఁగా నేర్చి కాలంబు గడపెనేని
యది ద్విదాభావగుణ మని యండ్రు బుధులు.
| 146
|
క. |
సాధారుణుఁడై యిరుగడ
భూధవులకు నెనసి ధనముఁ బొరయుట యది దా
నీధారుణిఁ బరతంత్ర
ద్వైధీభావం బనంగఁ దగుఁ దజ్‌జ్ఞులచేన్.
| 147
|
సమాశ్రయప్రకరణము
వ. |
మఱియు సమాశ్రయగుణంబు బలవంతుడగు నితరునైనను
గాక తనశత్రువునైన నాశ్రయించుటంజేసి రెండు విధంబులై
యుండుఁ దత్క్రమం బెట్లనిన.
| 148
|
సీ. |
బలవంతుచే నొంపఁబడి నిరుపాయుఁడై
ప్రతిసేయఁగా లేక బడలినపుడు
కులమును సత్యంబు బలమును గల్గిన
యార్యుని నొక్కని నాశ్రయించి
వినయంబుతో నిత్యమును బొడగని చేరి
యతనిభావం బెల్ల నాత్మ నెఱిఁగి
చెప్పినకైవడిఁ జేసి వినీతుల
గతి గురువులఁ గొల్చుకరణిఁ గొల్చి
|
|
గీ. |
యతనిదయచేతఁ బరిపూర్ణుఁడై స్వతంత్ర
వృత్తిఁ జెందుచుఁ గ్రమమున వెలయు టొప్పు
నిట్టి యన్యసమాశ్రయం బెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 149
|
సీ. |
అహితులచే నొచ్చి యార్తుఁడై యాశ్రయ
హీనుఁడై తగు సంధి లేనివాఁడు
భండారమైనను బలమునైనను భూమి
యైనను దూఫలంబైన మఱియు
సకలంబునైన నిశ్చలతఁ జెందుచు నిచ్చి
యతివినయంబున నతనిఁజేరి
తా బల్మిచెందినతఱి నైన శత్రువుఁ
డాపదఁ జెందిన యప్పుడైన
|
|
గీ. |
వేళ యెఱిఁగి విజృంభించి విమతుఁ ద్రుంచి
యైనఁ గొలిపించికొనియైన నలరు టొప్పు
నిట్టి శత్రుసమాశ్రయం బెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 150
|
చ. |
తన కటు వేళగానితఱిఁ దాఁ బగవారల కెందు సర్వముం
గినియక యిచ్చి నిచ్చలును గ్లేశము వచ్చిన నైన నోర్చి యే
యనువుననైనఁ దాళికొని యన్యునినైనను జేరి క్రమ్మఱన్
మనుచు ధరిత్రిఁ గైకొనుట మంచిది యెంచగ ధర్మజుంబలెన్.
| 151
|
ఆ. |
కారణంబు లేక కదిసి కూడఁగరాదు
ఘనునినైన నీచజనునినైన
కారణంబు లేక కలసిన క్షయమును
వ్యయము దోషములును వచ్చుఁగాన.
| 152
|
మ. |
ఇలఱేఁ డొక్కొకకారణంబుననె తా నెవ్వారితోనైన నే
ర్పులఁ గూడందగుఁ గూడియుండిన యెడం బొల్పొంది చిత్తంబులో
పల నమ్మం గొఱగాదు తండ్రినయినం బాటించి దుష్టాత్మకుల్
దలఁప న్నమ్మినయట్టి సాదుజనులం దా రెందు హింసించుటన్.
| 153
|
వ. |
ఇది షడ్గుణస్వరూపంబు. వీనిం గొందఱు మతస్థులు ద్వైదీ
భావసమాశ్రయంబులు సంధిమూలంబులె కావున సంధిగుణం
బొక్కటియును దండు వెడలుటయును విడియుటయు విగ్రహ
మూలం బగుటంజేసి యానాసనంబులు విగ్రహభేదంబులే కావున
విగ్రహగుణం బొక్కటియునుంగూడ నిట్టి సంధివిగ్రహంబులు
రెండుగుణంబులే యని పలుకుచుండుదురు. మఱియు బృహస్పతి
|
|
|
మొదలయిన కొన్నిమతంబులవారు శత్రువునిచేత బాధింపం
బడినవాఁ డితరుని నాశ్రయించుటం జేసి సమాశ్రయగుణంబుఁ
బ్రత్యేకంబు గావున నాసంధివిగ్రహంబులు రెండును నిట్టి సమాశ్ర
యంబునం గూడి మూఁడుగుణంబులే యని పలుకుచుండుదురు.
మఱియుఁ గొన్నిమతంబులవారు సంధ్యాదిగుణపంచకంబును
విగ్రహమూలంబె కావున విగ్రహగుణం బొక్కటియ న్యాయం
బని పల్కుచుండుదు రైనను వీని కన్నిటికిఁ బ్రత్యేకంబైన
యవస్థాభేదంబులు గలుగుటం జేసి యీకామందకమతంబునకు
షాడ్గుణ్యంబె సమ్మతంబు.
| 154
|
క. |
ఈరీతి షడ్గుణంబుల
నేరుపుతోఁ దెలియునట్టి నృపవరుఁ డెలమిన్
వైరులను గెలిచి పారా
వారావృతమైన ధరణివలయం బేలున్.
| 155
|
చ. |
సరసవిహార సారయుతసద్గుణ సింధుగభీరనీతి సు
స్థిరరుచికీర్తిహార సుదతీజనమన్మథ సూర్యవంశభా
స్వరతర సేవితార్యజనసైన్యవిరాజిత సోమవారిభృ
చ్చరనిధిదాన సౌమ్యహితసంతతశోభన సర్వసన్నుతా.
| 156
|
క. |
మండలశోధన సాధన
పాండిత్యా షడ్గుణప్రభావజ్ఞధరా
మండల పాలనఖేలన
దండితమత్తారిభూప దానకలాపా.
| 157
|
భుజంగప్రయాతము. |
ధరాధార దోర్దండ దానప్రచండా
వరాభేద్యమంత్రప్రభావ స్వతంత్రా
|
|
|
స్ఫురద్గాంగ భంగాహిభూషాంగవాణీ
తురంగాబ్జ శీతాద్రితుల్య స్వకీర్తీ.
| 158
|
గద్యము. |
ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత
భారద్వాజగోత్ర జక్కరాజయెఱ్ఱనామాత్యపుత్ర సుకవిజనవిధేయ
శ్రీరామకృష్ణభక్తివైభవభాగధేయ వేంకటనామధేయప్రణీతం
బైన కామందకనీతిశాస్త్రంబను మహాప్రబంధంబునందు మండల
శోధనప్రకారంబును షడ్గుణప్రచారంబు నన్నది చతుర్థాశ్వాసము.
|
|