Jump to content

అశోకుడు/పందొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పందొమ్మిదవ ప్రకరణము


పరివర్తనము

ప్రియదర్శనుఁడగు నశోకుఁడు నవజీవనలాభానంతరమునుండియు బౌద్ధధర్మ స్థాపనము కోఱకు విశేష ప్రయత్నంములను గావించెను. బౌద్ధధర్మములను సంస్కరించునిమి త్తము మహాజనసభలఁ గూర్చి చర్చించుట యీ విధమగు ప్రయత్నములలో ముఖ్యమైనది. భగవానుఁడగు బుద్ధ దేవుని నిర్వాణానంతరమునఁ జాలమంది ప్రజలు సత్యధర్మముకొఱకును, శాంతిలాభముకొఱకును బుద్ధమతము నాశ్రయింపఁజోచ్చిరి. క్రమముగా నీ భారతవర్ష మున బౌద్ధధర్మమే ప్రబలమయ్యెను, దేశమునందలి గొప్ప వారందఱునుగూడ బౌద్ధులుగ నే యుండిరి. రాజానుగ్రహము, రాజ్యసుఖ శాసనములనుగూడ జాలవఱకట్టి బౌద్ధ మతావలంబులగు వారి కే యనుకూలములుగ నుండెను. లోకులందఱును బౌద్ధ శ్రమణులను మిగుల గౌరవించుచుండిరి. ఇట్టి సుఖానుభవముకొఱకును గౌరవము కొఱకును జాలమంది బౌద్ధధర్మము నాశ్రయించుచుండిరి. అనేక నీచ బ్రాహ్మణులు శ్రమణ వేషధారులైరి. అట్టివారు

తమ బుద్ధి కౌశల్యముచే బుద్ధమత ప్రవ ర్తకులగు జనులలో వికృతాచార వ్యవహారరీతిని వ్యాప్తము చేయసాగిరి. ఆ

పందొమ్మిదవ ప్రకరణము

69

కాలమున విశేషవ్యాప్తమైయున్న హిందూమతముకూడ నా బౌద్ధధర్మవిభేదము నించుకంత కనుపెట్ట నారంభించెను. అశోక సార్వభౌముని రాజ్యకాలమునందుఁ బ్రప్రథమమున బౌద్ధమత మీవిధముగా నుండెను. అప్పు డుపగుప్తుడను నాతఁడు బౌద్ధసమాజమున మతాధి కారిగానుండెను. ఆతఁడు నిష్టాగరిష్ఠుఁడును, బుద్ధభ క్తుఁడు నై యుండెను. బౌద్ధశాస్త్రమునం దాతని కసాధారణ ప్రజ్ఞ యుండెను. ఆతఁడు పవిత్ర బౌద్ధమతముంగూర్చి యితరులు చేయుచున్న యపచారములం జూచి మర్మాహతుఁడయ్యెను. ప్రచ్చన్నులగు దుర్వినీతుల దుర్బోధనములను మాన్పించుట కొఱ కాతఁడు సాధ్యమైనన్ని ప్రయత్నములను జేయ నారంభించెను. కాని, స్వార్ధపరాయణు లగునట్టి కపట వేషధారులనుబట్టి శాసించుట యాతనికి శక్యము కాకపోయెను. వారు చేయుచున్న విరుద్ధ కార్యములం గను పెట్టి శాసింపఁ జూచినప్పుడు వారు తమ వాక్చాతుర్యముం జూపి తప్పించుకొనుచుండిరి. ఇవి యంతయును జూచుచు వినుచు నేమియుఁదోఁపక యుపగుప్తుఁడు నిరాశవలనను విరక్తివలనను దనమ తాధి కారమును వదలుకొని యేకాంత వాసము చేయుచుండెను,

ఈసంగతు లన్నియు నశోకమహారాజునకు యుధాసమయమునఁ గర్ణ గోచరము లయ్యెను. అప్పుడాతఁడు బౌద్ధ భిక్షులను దురాత్ములనుండి యుద్ధరించుటకు సంకల్పించుకొని

70

అ శో కుఁ డు

యెను. కపట వేషధారులగు మతవిరోధులను రాజ్యమునుండి పొఱఁద్రోలినచో నప్పుడు నిష్కంటకముగ మత ప్రచారము కాఁగలదని యాతని కాశయు, విశ్వాసమును గలిగెను, ఈ యుద్దేశము ప్రకటించుటకై యామహారాజు తనయున్నతోద్యోగి నొక్కని భిక్షుమండల సాన్నిధ్యమునకుఁ బంపించెను. రాజోద్యోగి వారికి మహా రాజాభిప్రాయమును దెలియఁ జేసెను. కపటాత్ములగు మతవిరోధులు చాల భయపడిరి. రాజో ద్దేశమును నిరర్థకముగఁ జేయుటకో మఱియెందులకో గాని భిక్షుమండలమునఁ గొందఱుకొందఱు రాజో ద్దేశముం గూర్చి తీవ్రముగ నాలో చింపసాగిరి. ఇందువలన రాజోద్యోగి కి విషమక్రోధము కలిగెను. ఆ కారణముం బట్టి యా యుద్యోగి యాభిక్షులలోఁ గొందఱను వధించి వైచెను. ఒకటి చేయఁబోయిన మఱియొకటి యయ్యెను. రాజోద్యోగి చేసిన దుష్కార్య మశోకమహారాజునకుఁ దెలిసినది. ఆతఁ డిప్పుడు ధర్మాస క్తుఁడై యున్నాడు; ఈ భయంకర కార్యముంగూర్చి

మిగులఁ బరితపించెను; ఈయపరాధము తనదియే యని భావించుకొనియెను; ఏమనిన- తానే యాయద్యోగిని బిక్కు మండలము నొద్దకుఁ బంపియున్నాఁడు. అతనిఁ బంపక పోయినచో నిట్టీవిపరీతము కలిగియుండదుగదా యని మహా రాజగు నశోకుఁడు భావించుకొనుచు నస్థిర చిత్తుఁ డయ్యెను. అప్పుడాతఁడే స్వయముగఁ బోయి భిక్షుగణముం జూచి " ఈనర హత్యల విషయమున నపరాధ మెవ్వరిది?” అని ప్రశ్నించెను.

పందొమ్మిదవ ప్రకరణము

71

కొందఱు రాజోద్యోగి యప రాధియనిరి. మణికొందఱట్టి వానిని మాయొద్దకుఁ బంపుటచే మీరే యపరాధులనిరి.

ఇట్టి భిన్నాభిప్రాయముల మధ్యమున మణికొందఱు “ చేసిన పని మంచిదా చెడ్డదా? ఆ నిమిత్తమునదోషి ఎవ్వఁడు? అను విషయం గూర్చే విచారింపవలసివచ్చినచో నప్పుడు కర్త యభిప్రాయమును దెలిసికొనవల సియుండును.” అని చెప్పిరి. ఏమైననేమి? ఈవిషయమున సూక్ష్మ విచారణ చేయుటకు మహాత్ముఁ డగునుప గుప్తుఁ డే సమర్థుఁడు. మహా రాజు పూర్వమునుండియు నుపగుప్తు ని మిగుల గౌరవించుచుండెను. మఱియు భిన్నాభిప్రాయుల గుభిక్షులతోఁ దనయభిప్రాయ మేకీ భవింపక పోవుటవలన నుపగుప్తుఁడు తన మతాధికార పదమును వదలుకొని పోయిన సంగతి కూడ మహా రాజగు నశోకునకుఁ దెలియును. ఆయుపగుప్తుఁ డిక్కడకువచ్చినచో నెల్ల విషయములను సాధింపవచ్చు ననియెంచి యశోకుఁ డాతనిఁ దనయొద్దకుఁ దీసికొనివచ్చున ట్లాజ్ఞాపించెను. కొంత మందిపోయి యాతని కా సగతిఁ దెలియఁ జేసిరి. అప్పు డుపగుప్తుడు భిక్షు మండలము నొద్దకు మరల వచ్చు విషయమునఁ దనయనిష్టమును సూచించెను. పరితప్తహృదయుం డగుమహారా జంత మాత్రముతో నూరకుండ లేను. ఆతఁడు మరల నాతని బలవంతముగఁ దీసికొనివచ్చుట కాజ్ఞాపించెను.

అప్పుడు పగుప్తుఁ డేమియుం జేయఁజాలక త్వరలో నే వచ్చెదసని వార్తనంపించెను. అందువలన నశోకున కించుక యూరట

72

అ శో కుఁ డు

కలిగెను. తరవాత నుపగుప్తుఁడు నౌక పై నుండి వచ్చుచుండె నని విని యశోకుఁడు గంగా తీరమునకు వచ్చి యతి వినయముతో నుపగుప్తునిం దర్శించి నమస్కరించి యాతనిం దనతోఁ తీసికొని వచ్చి యొక సుసంపన్నం బగు సౌధమునం దాతని విడియించెను.

ఉపగుప్తుఁడు నగరమునకు వచ్చులోపల నే మేమి చేయవలయునో మహా రా జిదివఱకే యాజ్ఞాపించి యుం డెను. రాజాజ్ఞ ననుసరించి యెల్ల కార్యములు ను సంపూర్ణము లయ్యెను. ఇఁక నుపగుప్తుడు వచ్చుటయే మిగిలినపని, అతికష్టము చే నదియును బూర్తియైనది.

నిర్దిష్ట సమయమున కెల్ల వారును సభామంటపమునకు వచ్చి యుండిరి. విశాల చంద్రశాలా మంటపమున భిక్షుగణము కూడియుండెను. ఏవంకఁ జూచినను గాషాయవస్త్ర ధారులును ముండితశిరస్కులు నగుబిక్షు లే యగపడుచుండిరి. ఆ బుద్ధసన్యాసులకు మధ్య భాగమున నుపగుప్తుఁడు కూర్చుండి యుండెను. అతని పార్శ్వముసందే మహా రాజపీఠము వేయింపఁ

బడియెను. కాని యింకను నా పీఠము శూన్యముగ నే యుండెను. అక్కడి వారి దృష్టులన్నియు నాయుపగుప్తుని వంకను, నాశూన్య సింహాసనము వంకను బ్రసరించుచుండెను, అందఱు నుత్సాహముతో నుండిరి. ఆ యాలస్యము వారి యుత్సాహమున కంతరాయముం గూర్చుచుండెను. ఇట్టి

పందొమ్మిదవ ప్రకరణము

73

సమయమున నాసభామధ్యమునం దించుక చలన చిహ్నము గానవచ్చెను. ప్రశాంతజల రాశి మృదు వాయు వేగ సంచలిత మైనట్లుండెను. సంయత చిత్తము లగుభిక్షు మండలములు భావతరంగవిలసితము లగుండెను. వారి నిర్వికార వదన ఫల కంబులనించుక కుతూహలము, నించుక విస్మయము, నించుక యధైర్యమును గానవచ్చుచుండెను. క్రమముగ నాచంచలత రంగములు ప్రబలము లగుచుండెను. సభాసదులెల్లరును లేచి నిలువఁబడిరి. అందఱ వదనములనుండియు "మహారాజు! మహా రాజు! " అనుమాట లస్పష్టస్వరముతో వెలువడియెను. అందఱును మహా రాజుదర్శనమునకై తొందరపడుచుండిరి.కాని మహారాజెక్కడ? మణి భూషణవి రాజితుఁడును గిరీటా లంకృతుఁడును దండ పాణియునగు మహారా జేఁడీ? ప్రతినిమిషమును నిరాశా విస్మిత మగుచుండెను. ఆ సమయమునం దొక ప్రాచీన భీఱు పార్శ్వస్థుఁడగు నవీన భిక్షుని వ్రేలితోఁ జూపుచు నందఱును “ఇతఁడే! అతని పార్శ్వమునందున్న యీతఁడే!” అని యస్పష్టస్వరంబునఁ బలుక నారంభించిరి. విలక్షణా

కారుఁ డగునోక పురుషుఁడు సామాన్యాకృతితో నసంభ్రముఁడై యందఱకు నమస్కరించుచు నాశూన్యాసనము వైపునకు వచ్చుచుండెను. ఆ పీఠమును సమీపించి యాతఁడు ధర్మాచార్యుఁ డగుసభాపతి కభివాదనముం గావించెను. ధర్మాచార్యుఁ డగునుపగుప్తుఁ డప్పుడు లేచి యాతని నభినందించి యాశీర్వదించి తన పార్శ్వమునందున్న శూన్యాసన

74

అ శో కుఁ డు

ముపై గూరుచుండు మని చెప్పెను. సభాసదు లందఱునని మేషనయనులై యానూత నాగంతుక పురుషునిం జాడ నారంభించిరి. నీలవర్ణంబును, విలక్షణంబును నగునాతని యాకారము నెవ్వరు నానవాలుపట్ట లేదు. ఆనవాగత పురుషుని యపూర్వవదనశోభయు, నలోక సామాన్య తేజోవిలసిత నయనద్వయవిరాజితంబగు వదన మ ం డ ల ము ను జూచి యందఱును విస్మితులై పోయిరి. అపురుషుని ప్రతిదృష్టి శ్రేణి నుండియు నపూర్వరాజ తేజఃపుంజములు ప్రకాశితములగు చుండెను.—— మహారాజు పీఠము నలంకరిం చెను. సభ్యు లెల్లరును దమతమపీఠముల పై నిశ్శబ్దముగఁ గూర్చుండిరి.

పంచేంద్రియ వ్యాపారమంతయుఁ గనులలోనే నిలిచి యుండుటవలన సభ్యులం దెవ్వని శబ్దస్పర్శరసగంథాను భవమగుట లేదు. సర్వ దేహశక్తులును, సర్వమనశ్శక్తులును గూడ నప్పుడోక్క కన్ను లయందుమాత్రమే యే కీభవించి యుండెను. అందఱు నేకాగ్ర దృష్టితో మహా రాజును మహాత్ముఁ డగునుపగుప్తుని జూచుచుండిరి. అప్పుడశోకుఁ డుప గుప్తుని కెదురుగ లేచి నిలు వఁబడి వినయవచనములతో బూర్వో క్తభీభత్సవ్యాపారముం గూర్చి లేచి " ఈవిషయమున నేనెంతవఱక పరాధిని?" అని ప్రశ్నించెను. ధర్మాచార్యుఁ డాద్యో పాంతముగ నెల్ల సంగతులను విని యించుక'సే పాలోచించి “మహా రాజా! నీవు ధర్మప్రాణుఁడవు. ధర్మవి జయమును సాధించుట యే నీయుద్దేశము, ధర్మరక్ష

ఇరువదియవ ప్రకరణము

75

ణమే ప్రజారక్షణము; 'రాజ్య రక్షణము; ధార్మిక సంఘరక్షణము; ధర్మము ధార్మిక లను గాపాడును. నీయుద్దేశము మహత్తరమైనది; సాధుసమ్మతమైనది. దేవతలు మానవుల యభిప్రాయములను, నుద్దేశములను గ్రహించి వారివారి కర్మములం గూర్చి విచారణ చేయుచుందురు. నీవిషయమునఁ గూడ నీసనాతననీతి యే యుపయోగింపబడఁగలము, బాగుగ నాలోచించి చూడఁగా నీ దుఃఖకర హత్యాసంబంధమున నీవు సంపూర్ణముగ నిరపరాధివి” అనియెను.

మహారా జగునశోకుఁ డిప్పటికి కొంత చిత్తుఁడయ్యెను. అప్పుడాతఁడు ధర్మాచార్యులకును సభ్యులకును వందనము లాచరించి మరలఁ దనపీఠము నలుక రించెను. ధీమంతులును, బ్రాజ్ఞులు నగుభిక్షు లందఱు నుపగుప్తుని ధర్మనిర్దేశమునకు సంతుష్టచిత్తులైరి. ప్రియదర్శనుఁ డగునశోకుఁడు ను మేఘముక్త సుధాకరునివలె నధికతర ప్రియదర్శనుడై ప్రకాశించెను,


ఇరువదియవ ప్రకరణము


సంస్కరణ సభ

మహా రాజుహృదయమును గ్రహించినతోడనే భిక్షు మండలికిఁ గల సకల సందేహములును వదలిపోయినవి. అనంతరము వారందఱును నశోకుని సదుద్దేశముంగూర్చి సంతుష్టు