అశోకుడు/ఇరువదియవ ప్రకరణము
ఇరువదియవ ప్రకరణము
75
ణమే ప్రజారక్షణము; 'రాజ్య రక్షణము; ధార్మిక సంఘరక్షణము; ధర్మము ధార్మిక లను గాపాడును. నీయుద్దేశము మహత్తరమైనది; సాధుసమ్మతమైనది. దేవతలు మానవుల యభిప్రాయములను, నుద్దేశములను గ్రహించి వారివారి కర్మములం గూర్చి విచారణ చేయుచుందురు. నీవిషయమునఁ గూడ నీసనాతననీతి యే యుపయోగింపబడఁగలము, బాగుగ నాలోచించి చూడఁగా నీ దుఃఖకర హత్యాసంబంధమున నీవు సంపూర్ణముగ నిరపరాధివి” అనియెను.
మహారా జగునశోకుఁ డిప్పటికి కొంత చిత్తుఁడయ్యెను. అప్పుడాతఁడు ధర్మాచార్యులకును సభ్యులకును వందనము లాచరించి మరలఁ దనపీఠము నలుక రించెను. ధీమంతులును, బ్రాజ్ఞులు నగుభిక్షు లందఱు నుపగుప్తుని ధర్మనిర్దేశమునకు సంతుష్టచిత్తులైరి. ప్రియదర్శనుఁ డగునశోకుఁడు ను మేఘముక్త సుధాకరునివలె నధికతర ప్రియదర్శనుడై ప్రకాశించెను,
ఇరువదియవ ప్రకరణము
సంస్కరణ సభ
76
అ శో కుఁ డు
లైరి. విశ్వాసముగల నిస్థావంతులగు బౌద్ధులు స్వార్థపరులైన కపట వేషధారులను దమబౌద్ధసమాజమునుండి తొలఁగించి వేయుటకు బద్ధకంకణులైరి. కపటాత్ముల దురుక్తులచే గర్హితంబు లగుదురాచారములను రూపుమాపుటకు వారందఱును బ్రయత్నింపసాగిరి. భగవానుఁ డగుబుద్ధ దేవుని సదుప దేశము లన్నియు నేవిధముగ లోకమున సర్వొత్తమ స్థానము నల:కరించునో యావిషయముం గూర్చి బౌద్ధధర్మాసక్తులగు వారెల్లరు నాలోచింపసాగిరి. సార్వభౌముఁ డగు నశోకుఁడు పూర్వమునుండియు నిందుల కే ప్రయత్నించుచుండెను. ఇప్పుడు సామాగ్యముగనే ధర్మ ప్రచార మును సంస్కరణమును జేయ వచ్చునని తెలిసికొనియెను. కపటాత్ముల బోధనమువలన దురాచారులగు బౌద్ధులంగాంచి విర క్తుఁడై తనయాచార్యత్వమును ద్యజియించి మధురానగరమునకుఁ బోయియుండిన మహాత్ముఁ డగు నుపగుప్తుఁడు మరల నిప్పుడు పాటలీపుత్రనగరమునకు వచ్చియుండెను.
బౌద్ధ ధర్మమును, సంఘమును వర్ధిల్లుట కనుకూల దినములు వచ్చినవి. ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులు మూడు నొక్కచో సమ్మిళితములై యుండెను. ఆశోకమహా రాజు తన సదుద్దేశము నుపగుప్తునకు నివేదిం చెరు. నైష్ఠికులును, ధర్మైక జీవనులు నగు భిక్షులు తమతమ యభిప్రాయములను ధర్మాచార్యునకు విశదీకరించిరి. అందఱయభిప్రాయములను ఇరువదియవ ప్రకరణము
77
బట్టియు నాలో చింపఁగా మత ప్రవర్ధనమున కొకసంస్కరణసభ యేర్పఱుపవలయునని నిశ్చయింపఁబడియెను. ఇచ్ఛయు,సామర్థ్యమును, నుపాదానము నేకమైనప్పుడు కర్మానుష్టాన మునకు విలంబము కలుగఁబోదు. పాటలీపుత్రసగరమున బౌద్ధధర్మసమాజ సంస్కర ణార్థమై యొక్క గొప్పసభ కూడెను. ధర్మాచార్యుఁడగు నుపగుప్తుఁడు సభాధ్యక్షుఁ డయ్యెను. నియమవంతులును, శాస్త్రజ్ఞులును, సుధీరులు నర్హులు నగు వేయిమంది బౌద్ధ నైష్ఠికులతో నొక సమితి యేర్పఱుపఁబడి యెను. కార్యనిర్వహణ విషయంబున నట్టిసమితికిఁ దొమ్మిది మాసము లవధి యేర్పఱుపఁ బడి యెను.
ఈసభయం దనేక దేశస్థులగు బౌద్ధులు చేరియుండిరి. అశోక మహారాజుకూడ నీ మహాసభా సభ్యుఁడై యుండెను. మతాధికారియగు నుపగుప్తుఁడు మహారాజసమక్షమున సభా గణసమాగతులగు బౌద్ధులనందఱను వారి వారిధర్మమత విశ్వాసములం గూర్చి విచారణ చేయుచుండెను; వారునడుచు కొనవలసిన పద్ధతులనన్నిటిని వారికి బోధించుచుండెను. వారి
కార్యకలాపమల విస్పష్టముగఁ దెలిసికొనుచుండెను. ఈవిధముగఁ బరీక్షించుటవలన ననేకులగు కపటాత్ముల చరిత్రములు తెలియవచ్చుటచే ధర్మవిరుద్ధాచారానుష్టానముల సంగతులుకూడ విస్పష్టములు కాఁజొచ్చెను. సభాపరీక్షయం దెవ్వరు స్వార్థపరులును గపటాత్ములు నని నిశ్చయింపఁబడు 78
అ శో కుఁ డు
దురో యట్టివాడు బౌద్ధ సంఘమునుండి రాజాజ్ఞ చేఁ దరిమి వేయఁబడుచుండిరి. ఈ రీతిగా నాఱు వేలమంది కపట వేషధారులు బౌద్ధసంఘమునుండి తొలఁగింపఁబడినట్లు తెలియ వచ్చుచున్నది. పిమ్మట నాయర్హ సభ దురాత్ముల దురాచారములను రూపుమాపి భగవంతుఁడగు బుద్ధ దేవుని విశుద్ధ ధర్మసూత్రములను లిపిబద్ధములుగఁ జేయఁగలిగెను. ఈ పరిశుద్ధ సభా సాహాయ్యమున బౌద్ధధర్మపవిత్ర గ్రంథము(త్రిరత్న) వహ్ని సంస్కృతం బగుసువర్ణమువలె విశుద్ధమై మరల నందఱకును బరిగ్రహయోగ్యమయ్యెను.
ఆశోక సార్వభౌముని జీవితచరిత్రమునందును, బౌద్ధ ధర్మేతిహాసమునందును నీ మహాసంస్కార సభా విషయము చిరస్మరణీయమైనది.
ఇరువదియొకటవ ప్రకరణము
సద్గురువు
మౌర్యతిలకుఁ డగునశోక సార్వభౌముఁడు పూర్వాపర ధర్మాచారి యగునుపగుప్తుని యెడల భక్తిశ్రద్ధలు గల వాఁడై యుండెను. ఇప్పుడు మతము, సంఘసంస్కరణము మొదలగు వానియం దాతనితో గలసిపని చేయుటచే నశో