అశోకుడు/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

30

అ శో కుఁ డు

తండ్రి వై ముఖ్యము, సవతితల్లులయసూయ, సోదరుల తూష్ణీ భావము, గురువులబోధనము, ఉత్సాహసంకల్పనము, జననీ ప్రేమము, యత్నము, సాంత్వనము మొదలగువాని నడుమ నశోకుని శైశవ జీవితము గడచుచుండెను.


తొమ్మిదవ ప్రకరణము

అశోకుని భవిష్యత్తు

ఒక దినమున మహా రాజగు బిందుసారుడు తన కుమారుల విద్యాశిక్షణముంగూర్చి పరీక్షింపవలయునని తలంచెను. విద్యావిషయంబున నెవ్వ రెంతటి విజ్ఞానమును సంపాదించిరో తెలిసికొనుట యావశ్యక మని మహా రాజు భాంవి చెను. రూపగుణశీలంబుల నధికుండగు రాజకుమారుఁ డే భవిష్యత్ప్ర భుపదంబున కర్హుఁడై యుండునని యాతని యభిప్రాయము.

శక్తిమంతులును విత్తవంతులు నగువారి కోరికలు కార్యరూపమునఁ బరిణమించుటకు విశేషకాలము పట్టదు. మహా రాజు తన యుద్దేశమును బ్రకటించినతోడనే రాజ కుమారులను బరీక్షించుటకుఁ దగినస్థలమును, దగిన సమయమును గూడ నిర్దిష్టములయ్యెను. అన్నియును సంసిద్ధము లయ్యెను.

తొమ్మిదవ ప్రకరణము

నగరోపకంఠమున నొక విశాలో ద్యానమునందు రాజకుమారులను బరీక్షించుట కేర్పాటయ్యెను. రాజకుమారు లందఱు నాదినమున నచ్చట నే యుండవలయునని స్థిర పఱచిరి. ఉద్యానమధ్యంబున విశాలంబును, వివ్రతంబును నగు సమప్ర దేశమునఁ గౌముదీ ప్రభలు కన్నులపండువు సేయుచుండెను. ఆ వెన్నెలబయట విచిత్రాసనము లలంకరించబడి యుండెను. ఆ చుట్టును నవదూర్వాంకుర శ్యామంబును, వర్తులా కారంబును నగు భూతలము నయనాభిరామంబై యుండెను.

సూర్యోదయమైనది మొదలుగ నా సభాస్థలమునకు జనులు వచ్చుటకారంభించిరి. రాజకుమారులు కూడ నొక్కరొక్కరుగ నా యాసమయములయందు వచ్చి యాసీనులగు చుండిరి. రాజపుత్రులందఱును మనోజ్ఞ వేష భూషణాలంకృతులై యుండిరి. రథారూఢులై కొందఱును, తురగారూఢులై కొందఱును వచ్చి ప్రవేశించుచుండిరి. క్రమముగ నందఱును వచ్చిరి. మహా రాజును మంత్రులునుగూడ సభాస్థలమునకు విచ్చేసి యుండిరి. కేవల మొక్కఁడుమాత్ర మచ్చటికి వచ్చియుండ లేదు. రాజకుమారుఁడగునశోకునకు యథాసమయ మునందీసంగతి తెలిసినది కాదు. అందులకుఁ గారణము వేఱుగఁ జెప్పవలయునా? ఆ చంద్రశాలారంగమున—— ఆ సుందర కుమార మధ్యమునఁ గురూపియగు నశోకుఁడు ప్రవే

శించుటకు మహా రాజున కిష్టము లేదు. కాని యాతఁడంత

32

అ శో కుఁ డు

స్పష్టముగా నెట్లు చెప్పఁగలడు ? రాణియగు సుభద్రాంగి కెట్లో యీ వార్త తెలియవచ్చెను. తోడ నే యామె తన కుమారునిగూడఁ బరీక్షా పరిషత్తునకుఁ బంపించెను. సుభద్రాంగి తన కుమారుని బరీక్షా సభకుఁ బంపఁబోవునప్పటికి రాజాస్థానమునందలి సుందరామూల్య వాహనాదికముల నన్నింటినుపయోగించుకొని తక్కిన ప్రభుకుమారు లఁ దఱును సభకుఁ బోయియుండిరి. ఒక ముసలియేనుఁగు మాత్రము మిగిలియుండెను. అశోకుఁడు తల్లి యొద్ద సెలవు తీసికొని యా ఏనుగు పై నెక్కి బయలు దేరెను. అప్పటి కా సభారంగమంతయును జనసమ్మర్దముగ నుఁడుటం గాంచి యశోకుఁడాచంద్రాతప బహి ర్భాగమునఁ గోమల శాద్వలతలంబునఁ గూర్చుండి యుండెను.

సన్యాసి యగు పింగళవత్సజీవుఁడు పరీక్షుకుడుగ నియమింపఁబడియెను. క్రమక్రమముగా రాజకుమారు లందఱును పరీక్షింపబడిరి. విద్యాబుద్ధులయందు రాజకుమారు లందఱలోనను నశోకుఁడే యున్నత స్థానము నలంకరించినట్లు నిరూపితమయ్యెను. ఆతఁడే సుళీలుఁడును సూక్మబుద్ధియు నని యందఱకును బోధపడెయెను. కాని యాఁతడు కురూపి; శోభావిహీఁనుడు; జనకుని కప్రియుఁడు ! ! అప్పు డయ్యశోకుని యుత్తమత్వంగూర్చి యంత బహిరంగ ముగ సంత విస్పష్టముగఁ బ్రశంసించుట కెవ్వరును సాహ సింపఁజాలకపోయిరి. పరీక్ష కుడఁగు పింగళవత్సజీవుఁ డెల్ల విధముల బాగుగ నాలో

తొమ్మిదవ ప్రకరణము

33

చించెను. ఈ “యశోకుఁడు మహా రాజునకుఁ గేవల మప్రియుఁడు, సర్వవిధములను రాజసింహాసనమున కశోకుడే యర్హుడని చెప్పినచో నది యాతనికి మిగులఁ బ్రతికూలముగఁ బరిణమింపఁగలదు. కావున మిగుల నిపుణముగ మహా రాజునకు సత్యమును బ్రదర్శింపవలయును” అని నిశ్చయించుకొని "మహాప్రభూ ! నే నీ రాజకుమారుల నందఱను బరీక్షించితిని. వీరిలో నెవ్వరివాహనము సర్వవిధముల నున్నత మైనదో, యెవ్వరిపీఠ మెల్ల రీతుల నుత్కృష్టమైనదో, యెవ్వరి పానీయ మెల్ల భంగుల నుత్తమమైనదో వారే సర్వ విధములను భవిష్యత్ప్రభుత్వమున కర్హులు ” అని చెప్పెను.

ఆ మాటలనాలించి రాజకుమారులందఱును బ్రత్యేకముగఁ దమలోఁదా మాలోచించుకొని తమ తమ యాసన పానీయము లే యితడల వానికంటే శ్రేష్ఠములని నిశ్చయించుకొనుచుఁ దమ యిచ్చవచ్చిన తెఱంగున సిద్ధాంతము చేసికొనఁ జొచ్చిరి. కురూపియగు నశోకుఁడు సభ ముగిసిన తరువాతఁ దల్లి యొద్దకు వచ్చి పింగళవత్సజీవుఁ డొనరించిన నిర్దారణముంగూర్చి యెల్ల సంగతులను దెలియఁ జేసెను. అనంతర మశోకుఁడు తల్లి యెదుటఁ బింగళవత్స జీవుని వాక్యముల కీవిధముగ వ్యాఖ్యానముం గావించేను.—— నేను పితృపి తామహోచితంబగు వృద్ధ భద్రగజము నధిరోహించి పోయితిని; అదియే సర్వోన్నత వాహనము. నేను శ్యామల దూర్వాదళ

34

అ శో కుఁ డు

శోభితంబగు ధరణితలంబున నుపన సించితిని; అదియే సర్వోత్కృష్ట మృదులాసనము. నేను వినిర్మలస్నిగ్ధ పావన గంగాజలంబులఁ బానము చేసితిని; అదియే సర్వోత్తమ పానీయము. కావున మహాత్ముఁ డగు నా పింగళ వత్స జీవుని వాక్యములు సత్యము లే యైనచో నేనే భవిష్యత్కాలమునందుఁ బితృసింహాసనమును బొందఁగలుగుదును.

మాతాపుత్రుల ప్రియ సంభాషణ మీ విధముగ జరిగినది. అది మొదలుగ వారిహృదయము లాశాన్వితము లగుటచే భవిష్యత్సుఖసమయమునకై వా రిరువురు నెదురు చూచుచుండిరి.


పదియవ ప్రకరణము

జనకుని యాజ్ఞ

మహా రాజగు చంద్రగుప్తుడు తన బుద్ధి బలమునను బాహుబలముననుగూడ మగధ రాజ్యమును జాలదూరము వఱకును వ్యాపింపఁ జేసెను. ఆ కాలమునం దక్షశిల మగధ రాజ్యాంతర్గత మైయుండెను. చంద్రగుప్తుఁడు తా నెంతవఱకుఁదన రాజ్యమును విస్తరింపఁ జేసెనో యంతవఱకుఁ దన సత్య శాసనమునుగూడఁ బ్రసరింపఁ జేసెను - కాని ఎల్ల కాలము నొక్కరీతిగా నుండదు. ఎల్ల దినములు నొక్కలాగున జరుగవు.