అశోకుడు/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

26

అ శో కుఁ డు

గర్భముంగూర్చినమాటలే. ఆగర్భమే యామె జీవితమార్గమును నిష్కంటక ముగఁ జేసి వైచెను; ఇదియే యామెరాజ్ఞీ స్థానమును దేవతా స్థానముగఁ బరిణమింపఁ జేసెను!!

దేవత లెల్లప్పుడు నందఱ ప్రార్థనములను — అన్ని ప్రార్ధనములను సంపూర్ణముగ సిద్ధింపఁ జేయరు. సుభద్రాంగిసపత్నుల మనోగత ప్రార్థనములు సంపూర్ణముగ ఫలియింప లేదు. రాణియగుసుభ ద్రాంగి యొక శుభమూహూర్తమునం దొక కుమారుని గనియెను. కొత్త రాణి పుత్రవతి యయ్యెను. ప్రసనసమయమునందామె కెట్టి కష్టమును గలుగ లేదు, ఆ కారణముచే గుమారున కశోకుఁ డని నామకరణము గావింపఁబడియెను.


ఎనిమిదవ ప్రకరణము

అశోకుని శైశవము

రాజ్ఞీ రత్న మగు సుభద్రాంగిపుత్రముఖసందర్శనమున బరమానంద భరితహృదయ యయ్యెను. మహా రాజుకూడఁ దనవ లె నేయానవ కుమారసందర్శనమునఁ బరమానందరస

నిమగ్నుఁడగు నని యామె యనుకొనియెను. కాని యామెకోరిక యీ విధముగ ఫలియింప లేదు. మహారాజు యధా సమయమునందే పుత్రముఖావలో కనముంగావించెను. కాని

ఎనిమిదవ ప్రకరణము

27

యప్పుడాతనికన్నులలోఁ, జేమరసతరంగములు పొడసూపలేదు; ఆతనిముఖమండలమున నానంద కౌముదీవిలసన మగపడ లేదు. కేవలమప్పుడాతఁడు ధనర త్నాదికముల దానము చేసి కుమారుని నాశీర్వదించి మాత్రము వెడలిపోయెను. సుభద్రాంగి యిదియంతయును బరిశీలించి చూచుచు నే యుండెను. మఱికొందఱు పరిచారికలుకూడ నా భావమును గ్రహించియుండిరి.

ఒక్క నిముసములో నీ సంగతి యంతయును సుభద్రాంగి సవతుల చెవులఁ బడియెను. మహా రాజు దాసీనుఁడై యుండెనని వినుటవలన వారియీర్ష్యానల మించక శాంతిం చెను. ఆ రాణులలో నొక్కరొక్క రొక్కొక్క విధముగఁ జెప్పుకొన సాగిరి. తుదకు వారందఱు గర్వితురాలైన సుభద్రాంగికిఁ దగిన శాస్తియైనదని నిశ్చయించుకొనిరి. “ఎంతగర్వము !ఇంతటి గర్వము ధర్మా దేవి యెట్లు సహించినదో? ——దర్పహారి యగుమహారాజు సుభద్రాంగి దర్పభంగమును బాగుగఁ గావించినాఁడు—— ఇప్పటికిది ప్రథమసూచనామాత్రము” అని యనుకొనిరి. కాని ప్రకృత స్థితి యది కాదు. సుభద్రాంగియపరాధమేమనిన:- ఆమెకుమారుఁ డితర రాజకుమారులవలె సుంద రుఁడు కాఁడు, ఇంతియ కాక చూపులకు మిగులఁ గురూపియైయుండెను. అతని కంతగా నంగ సౌష్టవము లేదు. అతనిశరీరచ్ఛాయ గౌర వర్ణ విలసితమై యుండ లేదు.

ఈసకలకారణముల చేతను రాజప్రథమదృష్టి, యశోకకుమారునిపై ఁ బ్రేమప్రపూర్ణముగఁ బ్రసరించినది కాదు.

28

అ శో కుఁ డు


బిందుసారుని యేకాధిక శత పుత్రు లలోఁగూడ నాతని ప్రథమ మహిషీ తనయుఁడగు యువరాజు సుషీ ముఁ డొక్కఁడు మాత్రమే ప్రియతముఁడై యుండెను.

ఎవ్వ రేమనుకొన్న నేమి ? సుభద్రాంగి మాత్రము కన్నబిడ్డ యగునశోకునిం జూచి యెల్ల కష్టములను మఱచిపోయెను. ఆమె ప్రేమోపచారములచే నశోకుఁడు శుక్ల పక్ష చంద్రునివలె దినదిన ప్రవర్ధమానుఁ డగుచుండెను.బాలుఁడగునశోకుఁడు తనను 'రూపముంగూర్చి చెప్పుకొనువారి మాటలయర్థ మెంతమాత్రమును గ్రహియించియుండ లేదు, కేవలమాతఁ డెన్నఁడు నొక్కనిమిషమందైన దుఃఖించి యుండ లేదు, అశోకుఁడు రాజగృహమునం గలయెల్ల రాజ కుమారులతోడను సమా నానందముననే_ సమానోత్సాహమున నేయాట లాడుకొనుచుండెను. క్రమముగ నశోకునకుఁ బసితనము వదలుచుండెను. బాలకుఁడగున శోకున కప్పుడు విద్యాశిక్ష ప్రారంభ మయ్యెను. క్రమముగ , నాతనికి లోకజ్ఞానము కలుగుచుండెను. అప్పటినుండి యే బాలకుఁ డగునశోకుఁడు తనతండ్రిచర్యలయందలి పక్ష పాతమును గ్రహించియుండెను. ఆ రాజగృహంబున నాచఁద్రశాలామంటప మధ్యమున నవవికసితశతశతపత్రంబులం బోలి విలసిల్లుచున్న తన కుమారులనడుమ భ్రమర నీలవర్ణుండును, శోభా సౌరభహీ నుండును గురూపియు నగునశోకుని జూచినప్పుడు బిందుసారుఁడించుక యప్రతిభుఁ డై పోవుచుండెను—తుదకు విరక్తుఁడై .

ఎనిమిదవ ప్రకరణము

29

పోయెను. బాలకుఁ డగునశోకున కాసంగతి యంతయుం దెలిసి పోయినది. కాని యందులకుఁ గారణముమాత్ర మాతనికి బాగుగ బోధపడ లేదు. ఆశోకుడు తల్లి యొద్దకు వచ్చి యావిషయముఁ గూర్చి యడుగునప్పుడు సుభద్రాంగి మఱియొక ధోరణిలో నాతని కామాట మఱపించి వైచుచుండెను.

ఈసకల కారణముల చేతను సుభద్రాంగి భర్తృప్రియత ము రా ల య్యు ను, నిరంతర చింతా సంతప్తహృదయయై యుండెను. కుమారునియెడలఁ దండ్రికిం గల యింతటి యుదాసీనత-ఇంతటి యసహ్యభావము తుద కేవిధముగఁబరిణ మించునోయని యామె నిరంతరము విచారించుచుండెను.

అశోకునియెడల బిందుసారున కిట్టి యసహ్యభావమున్నదని తెలియనివా రెవ్వరును లేరు. ఏమైన నేమి? జనకుని యింతటి యసహ్యభావము కుమారుఁడగు నశోకుని కులోచిత విద్యాశిక్షణమునకుమాత్ర మెంతమాత్రమును వ్యాఘాతముం గల్పించి యుండ లేదు.అది యేమోకాని యశోకుఁడు తన వై మాత్రేయసోదరులకంటె నల్ప కాలము నందే యధిక విద్యావంతుఁ డగుచుండెను; సకలవిషయముల యందును విజ్ఞాన లాభము నందుచుండెను;

కుమారుని కుశాగ్రబుద్ధిం గూర్చిన ప్రశంసావచనముల ప్రతిధ్వనులు క్రమముగాఁ దల్లి చెవులఁ బడుచుండెను. అందు చే సుభద్రాంగి పరమానంద భరితహృదయ యగుచుండెను,

30

అ శో కుఁ డు

తండ్రి వై ముఖ్యము, సవతితల్లులయసూయ, సోదరుల తూష్ణీ భావము, గురువులబోధనము, ఉత్సాహసంకల్పనము, జననీ ప్రేమము, యత్నము, సాంత్వనము మొదలగువాని నడుమ నశోకుని శైశవ జీవితము గడచుచుండెను.


తొమ్మిదవ ప్రకరణము

అశోకుని భవిష్యత్తు

ఒక దినమున మహా రాజగు బిందుసారుడు తన కుమారుల విద్యాశిక్షణముంగూర్చి పరీక్షింపవలయునని తలంచెను. విద్యావిషయంబున నెవ్వ రెంతటి విజ్ఞానమును సంపాదించిరో తెలిసికొనుట యావశ్యక మని మహా రాజు భాంవి చెను. రూపగుణశీలంబుల నధికుండగు రాజకుమారుఁ డే భవిష్యత్ప్ర భుపదంబున కర్హుఁడై యుండునని యాతని యభిప్రాయము.

శక్తిమంతులును విత్తవంతులు నగువారి కోరికలు కార్యరూపమునఁ బరిణమించుటకు విశేషకాలము పట్టదు. మహా రాజు తన యుద్దేశమును బ్రకటించినతోడనే రాజ కుమారులను బరీక్షించుటకుఁ దగినస్థలమును, దగిన సమయమును గూడ నిర్దిష్టములయ్యెను. అన్నియును సంసిద్ధము లయ్యెను.