అశోకుడు/ఆఱవ ప్రకరణము
ఆఱవ ప్రకరణము
17
నంతఃపురమునకుఁ బంపవలయునని యాజ్ఞాపించెను. మంత్రి యగు రాధాగుప్తుఁడు రాజాజ్ఞను యధావిధిగఁ బ్రతి పాలించెను.
దరిద్ర బ్రాహ్మణు, రాజసందర్శన మీవిధముగా ఫలియించెను.
ఆఱవ ప్రకరణము
రాజాంతఃపురము.
బ్రాహ్మణుఁడు రాజాస్థానమునుండి తిరిగివచ్చి సుభద్రకు సమస్త వృత్తాంతమును దెలియఁ జేసెను. భవిష్యత్సుఖ చిత్రమతిమనోహర మైన దేయైనను జిర కాలము వఱకుఁ దండ్రి తనయను విడిచి యుండుటయును, బాలిక తల్లిదండ్రులను విడిచియుండుటయుఁ దటస్థించుటవలన నది విచారకరము గ నేయుం డెను. కన్నీరు భవిష్యత్సుఖ ప్రదర్శనమును దూరము నందుంచిన నుంచుఁగాక ! వ వర్తమానమునందైన నొండొరులు పరస్పరముఁ జూచుకొనకుండ నామార్గమున కడ్డము వచ్చి నిలిచినది !! కొంత సే పీవిధముగఁ గడచిపోయినది. పిమ్మట నియమిత సమయమున వాహనాదిక వైభవములతో సుభద్రాంగి రాజాంతఃపురమునకుఁ దీసికొనిపోఁబడియెను.
అనంతర మా బ్రాహణుఁడు పాటలీపుత్రమునఁ గొన్ని దినములుమాత్ర ముండి శూన్య హ్రుదయుఁడై తన ముద్దుబిడ్డ 18
అ శో కు డు
మహా వైభవముననుభవించుచు సుఖపడఁగలదను నాలోచనతో మరలఁ జంపక నగరమునకుఁ బ్రయాణమయ్యెను, సుభద్రాంగి యప్పటినుండి పితృగృహస్మృతి, కల్పనములు, కథలు మొదలగు వానిమూలమున సంతుష్టి' నందుచు 'రాజాంతఃపురమునందుండి తల్లిదండ్రులకించుక యూరటను గల్పించుచుండెను.
ఎక్కడీదరిద్రకుటీరము! ఎక్కడి రాజాంతఃపురము!!! చిన్ని గొరవంకను గులాయమునుండి విడఁ దీసిశోభనప్రమోదో ద్యానమందిరమున విశాలకనక పంజరమునందు బంధించినచో దానిమనో భావ మెట్లుండునో, సుభద్రాంగినోమభావముకూడ జాలవఱ కట్లేయుండెను. సుభద్రాంగి పుట్టిన యింటిముంగిటి వాకిలిచిన్నదియే- కానియదియా మెచిన్ని పాదములకును,లీలా తరళ నయన యుగళంబునకును బరిమిత స్థానమై యుండ లేదు, దానికిమారుగా నిప్పుడా బాలికకుఁ బ్రాకార వేష్టిత ప్రాసాదములును విశాల సరోవరంబులును, జలయంత్రములును, పుష్పలతా మనోహరవిశాల ప్రాంగణములును లభియించి
యున్నవి. కాని, యివియన్నియు నామె కూపిరి త్రిప్పుకొనుటకైన నవకాశము లేనంతటి పరిమిత స్థలములుగనే తోఁచుచుండెను. మానవప్రకృతులయెడల సహవాస ప్రభావ మనంతమైనది—క్రమముగ నా బాలికకు రాజాంతఃపురము నందలి దృశ్యము లన్ని టితోడను బరిచయమయ్యెను. అప్పుడామె చంచలహృదయము సుస్థిరమైన దయ్యెను. ఈ విధ ఆఱవ ప్రకరణము
18
ముగా బాలిక నవయౌవనవతి యయ్యెను. క్రమముగా యువతియయ్యెను. ఆమె రూపలావణ్యములు శుక్లపక్ష చంద్ర కళలవలె దిన దిన ప్రవర్ధమానములు కాఁజొచ్చెను. వానితో గూడ నా మెసపత్నీగణముల యీర్ష్యా ద్వేషములును వర్ధిల్లసాగెను. అప్పుడు వారందఱును మిగులఁ గౌశలముతో సుభద్రాంగి మహా రాజుకంటఁ బడకుండునట్టి ప్రయత్నములను జేయ నారంభించిరి.
పరమేశ్వరుని యజ్ఞాతనియమవశంబున మనుష్య హృదయములయందు విస్మృతి యుదయించు చుండును. ఈ నియమము చేతనే యొకప్పుడు సార్వభౌముఁ డగు దుష్యంతుఁడు శకుంతలను మఱచిపోయెను. మహారాజగు బిందుసారుఁడుకూడ నీ నియమమున కతీతుఁడై యుండ లేదు, అంతఃపుర వధూజనముల చాతుర్యమువలనను విస్మృతి' వశమునను బిందుసారుఁడు సుభద్రాంగి మాటయే మఱచిపోయెను. సుభద్రాంగిమాత్రము నిశ్చింతురాలైయుండ లేదు.
ప్రపంచమునందలి జనుల కందఱకును శత్రులును మిత్రులుఁగూడ నుందురు. సుభద్రసవతు లామె రూప
లావణ్యములంగాంచి యీర్ష్యా పరవశలై శత్రుత్వమును జూపుచున్న మాట సత్యమే--కాని యంతఃపుర పరిచారికలలోఁ జాలమంది యా సుభద్రాంగితో మైత్రి నెఱుపుచు 20
అ శో కుఁ డు
నామెయెడల సహానుభూతిం జూపుచు మంచి చెడ్డలను గూర్చి నివేదించుచుండిరి.
లోకమునం దనేకవిధముల గుజను లున్నారు, కొందఱు జరిగిపోయిన దానిం గుర్చి: విచారించుచుందురు. కోందఱు వర్తమానముం జూచుకొనుచు నానందించుచుందురు. మఱి కొంద ఱతీతవర్తమానములయందు విరక్తులై కేవలము భవిష్యత్కాలముకొఱకే తలయెత్తుకొని చూచుచుందురు. రాజాంతః పురమున యమున యను పేరుగల పరిచారిక యున్నది. ఆమెవయసు నలువదియేండ్లకు మించి యుండును. ఆమె రాజాంతః పురమునందలి యెల్ల సంగతుల నెఱుంగును. అనేకుల నామె బాగుగ నెఱుంగును; వారిస్వభావములఁ గూడ నెఱుంగును. మఱియు నామె రాజస్వభావమునుగూడ నామూలముగ నెఱుంగును. సుభద్రాంగి రూపలావణ్యమును గూర్చియు నామె గుణగణములను గూర్చియు నామె తనలో “ఇట్టిరూపమును, నిట్టిగుణములు నుగూడ నెప్పుడను వ్యర్థములు కాజాలవు. ఎప్పుడో యీమె కొకశుభదినము రాఁగలదు. కావుననే యిప్పటినుండియు నీమెతో మైత్రి
సంపాదించుకొందును. కష్టకాలమునందుఁ గావించిన యుపకార మెన్నటికి నెవ్వరును మఱచి పోఁజాలరు” అని యీ విధముగ నాలోచించుకొని యమున సుభద్రాంగిని ప్రత్యక్షముగను నప్రత్యక్షముగనుగూడ సేవించుచుండెను—— ప్రేమించుచుండెను; ఆమె కష్టసుఖములు తనవిగ భావించుకొను ఆఱవ ప్రకరణము
21
చుండెను. ఈవిధముగ నామె సుభద్రాంగికి సర్వవిధముల మంగళా కాంక్షిణియైయుండెను.
యమునా సుభద్రలు శుభసమయమున కెదురుచూచు చుండిరి. దినము గడచిపోవుచుండెను; రాత్రియును గడచి పోవుచుండెను. మాసములును వత్సరములు ను గూడఁ గడచి పోవుచుండెను. కాని శుభసమయచిహ్నమైనను వారి కగపడుట లేదు. తుద కొకనాఁడు మంచిసమయము దొరకెను.
అది ఫాల్గున మాసము- పూర్ణిమా రాత్రి రెండవజాము గడచిపోయినది. మందమంద మారుతములు వీ తెంచుచుండెను. ఆ వాతపోతస్పర్శనమున నోడలు పులకించుచుండెను. సమీప వ్రుక్షాంత రాళమునందుండి యొకకోకిలతనకలకుహూస్వరంబున నమృత సేచనముఁ గావించుచు దిగంతముల నమృతం సప్లావితములుగఁ జేయుచుండెను, పూర్ణ చంద్రుడు వెన్నెలలఁ గ్రుమ్మరించుచుండెను. ఆ మధుర కుహూనినాదమును, నావి నిర్మల కౌముదీ విలాసమును, నేకీభవించి తమ మోహినీదిశక్తిచే లోకమును ముగ్ధప్రాయముగఁ జేయుటకుఁ బ్రయత్నించుచుండెను—— మహా రాజాధి రాజులు మహా
వైభవసంపన్నులే యై యుందురు; కాని వారికొక్క విషయమున మాత్రము గర్భదరిద్రులకంటెను మించిన దారిద్ర్యము కలదు. ప్రకృతి సౌందర్యమును కాంచు భాగ్యము వారికిఁ దఱచుగ లభియింపదు. వారు చార ముఖంబున నెల్ల వార్త 22
అ శో కుఁ డు
లను వినుచుందురు, చాటు కారులవలన గుణపరిచయము గావించుకొనుచుందురు. చిత్రరూపముల మూలమున సౌందర్యమును భావించుకొనుచుందురు. ఒక్కరును సుఖముగ నుండుటకు వారి కెప్పటికో గాని సమయము దొరకదు. నిరంతరమును బార్శ్వచరుల చేఁ బరి వేష్టింపఁబడి వారికర్ణముల తోడ నే వినుచు వారి దృష్టులతోడ నే చూచుచు నుందురు- ఇప్పుడొక్కించుక సేపు మహా రాజగు బిందుసారుఁడట్టి పరాధీనతా హస్తములనుండి విడివడి యొక పుష్పారామమధ్యమునం బ్రచారము చేయుచు నే మేమియో భావించుకొను చుండెను.
ఆసమయమునం దాకస్మికముగ నొకయువతీమూర్తిచ్చటకు వచ్చెను. ఆమె యతిలోక సుందరీమణి—— మహారాజుదృష్టి యింకను నామె పై ఁ బ్రసరించియుఁ బ్రసరింపక మునుపే యారమణీమూర్తి మహా రాజపాదపద్మ సాన్నిధ్యమున సాష్టాంగపడి యుండెను. ఆ సందర్భమున సార్వభౌముఁడించుక యులికిపడియెనుగాని యొక్కింత సేపటిలో స్థిర హృదయుఁడై యామెనుజూచి " లెమ్ము ! నీ కోరిక యేమి యో తెలుపుము !" అని యాదరముతోఁ బలికెను. అప్పుడు సుభద్రాంగి తనచరిత్రమంతయు నాప్రభుచందునకు విన్నవించెను. బిందుసారున కప్పు డెల్ల సంగతులు నింతలో స్మృతికి వచ్చెను. ఆమెయెడలఁ దన భార్యల దఱును జేసిన మోసము ఏడవ ప్రకరణము
23
నప్పు డాతఁడు గ్రహింపఁగలిగెను. తానింతవఱకును సందే హించిన సంగతి వట్టి భ్రమ యని నిశ్చయించుకొనియెను—— బిందుసారుఁ డా బ్రాహ్మణకుమారీ రామణీయక విలాసములం బ్రత్యక్షముగఁ గన్ను లాఱఁ గనుంగొనియెను.
ఏడవ ప్రకరణము
పుత్రలాభము
మహారాజగు బిందుసారున కేఁబదిమంది రాణులు కలరు. ఇంత కాలమువఱకు వారిలో ధర్మాదేవి యొక్క తయే సార్వభౌమునకుఁ బ్రధానమహిషి యైయుండెను. మఱియు నామెయువ రాజగు సుషీమకుమారుని గన్నతల్లి – అందుచే నామె రాణులకందఱకు నధికారిణియై యుండెను. మహారాజు కూడనా మెమాటకు జవ దాట లేదు. ఈవిధముగఁజాల దినములు గడచినవి. బిందుసారుఁడు సుభద్రాంగిం జూచిన తరువాతనుండి యీ విషయమునం దించుక వ్యతిక్రమము గానవచ్చుచుండెను. రాజానుగ్రహము తీవ్రము గలనదీ ప్రవాహమువంటిది. అదియొకప్పు డొక తీరము నొఱసి భంగించు చున్నప్పుడు మఱియొక తీరమును బలపఱుచుచుండును. ఇప్పుడు మహారాజీ మణియగు ధర్మాదేవి తల తిరిగిపోవుచుండెను. క్రమక్రమముగా నిప్పుడామె ప్రభావ ప్రతిపత్తి తగ్గిపోవుచున్నది.