అశోకుడు/అయిదవ ప్రకరణము
అయిదవ ప్రకరణము
రాజదర్శనము
ఆ బ్రాహ్మణుఁడు తనకుమారీమణిని నౌకయం దుంచి తానొక్కఁడును బాటలీపుత్ర నగరముం బ్రవేశించెను. ఆ పట్టణమునందలి సుప్రశస్త రాజపథంబులను, సుందర సౌధమాలికలను, మనోహరవ స్తుప్రపూర్ణంబు లగు విపణి శ్రేణులను, నానా దేశ జనసమూహములను జూచి యాదరిద్ర బ్రాహ్మణుఁడు విస్మయ విభ్రాంతులకు లోనై పోయెను. ఎట్లో యాతఁడు నాలుగైదు దినములలో నగరమధ్యమునందొక చోట నాశ్రయమును సంపాదించుకొనియెను. క్రమముగ నెంతయో ప్రయత్నించి రాజమంత్రియగు రాధాగు ప్తుని దర్శించి మహా రాజసందర్శనము చేయింపవలయ నని ప్రార్థించెను. రాధాగు ప్తుఁడు సదయ హృదయఁ డై యాబ్రాహ్మణునకు రాజసందర్శన భాగ్యమును లభియింపఁ జేసెదనని చెప్పెను.
నిర్దిష్టదినమున శుభముహూర్తమునం దాబ్రాహ్మణుఁడు రాజసభాంత రాళమునఁ బ్రవేశించెను. ఆ బ్రాహ్మణుఁడు క్రొత్త వాఁడు. రాజసభయందలి యందఱు నాతని కపరిచితులు. ఒక్క మంత్రినిమాత్ర మాతఁడు కొంత సేపటికి అయిదవ ప్రకరణము
15
జూడఁగలిగెను. ఆ బ్రాహ్మణుఁడు గ్రంథములలో నింద్రసభా వర్ణనమును వినియుండెను. ఇప్పు డాతఁ డిఁ ద్రసభలోఁ బ్రవేశించితినని యనుకొనియెను. మహా రాజమణియగు బిందుసారుఁడు మయూర సింహాసనమున నధివసించియుండెను. అమాత్యు లమరులం బోలియయ్యాస్థానము నలంకరించి యుండిరి. ఇంద్ర చంద్ర వాయువరుణ ప్రముఖు లెల్లరు నాతనికొక్కచో నగపడుచున్నట్లుండెను. ఎవ్వరిని వదలి యెవ్వరిని జూడవలయునో యాతనికి బోధపడుట లేదు. ఎవ్వరినైనఁ దదేక దృష్టితో వింతగఁ జూచుచుండినచో నసబ్య జనో చితముగ నుండు నేమో యని యాతఁడు సంకోచించుచుండెను. అప్పుడా తఁడాశాదృష్టులతో మంత్రి యెచ్చటనుండెనో కను పెట్టవలయుననియు, నాతనికిఁ దన్ను గాన్పించుకొనవలయుననియు నలు దెసలఁ బరికించుచుండెను. పిమ్మట నాతఁడు మంత్రి చేసన్న చే నించుక స్వస్థచిత్తుఁ డై కూర్చుండియుండెను.
దైనిక రాజ కార్యములు పూర్తయిన తరువాత రాజాజ్ఞ చేమనవులఁ దెఱుపుకొనవలసినవా రొక్క రొక్కరుగమహారాజ సముఖమునకుఁ బోయి తమతమ ప్రార్థనములం దెలుపుకొని వెడలిపోవుచుండిరి. తుదకుఁ జంపక నగర బ్రాహ్మణుఁడు కూడ రాజసమీపమునకుఁ బోయి నిలువబడియెను. బ్రాహ్మణుఁడు యథావిధిగా సార్వభౌము నభినందించి, ధాన్యమును దూర్వా కురములను నోసంగి యీ విధముగ నాశీర్వదించెను. 18
అ శో కుఁ డు
“నిగమమంత్రార్థ సిద్ధి నీ | కగునుగాక !
అఖిలశత్రు వినాశన | మగునుగాక !
ఆ పబుధుమిత్రులకు మే | లగునుగాక !
ధనము, ధ్యానంబు, ధర్మంబు | ధరణితలము
చిరతరాయుష్యము, సుఖంబు, | వరయశంబు,
వారణతురంగయానాది | వైభవంబు
భాసురాపత్యసిద్ధి, సు | శ్రీసమృద్ధి,
అభిమతార్ధోపలబ్ధి నీ | కగునుగాక ! "
సార్వభౌముఁడగుబిందుసారుని యమూల్యమణిమయ కిరీటాలంకృతం బగునుత్తనూంగ మాదరిద్ర బ్రాహ్మణుని యాశీర్వాదపరిగ్రహణమునకై యించుక యవనతమయ్యెను, రాజాజ్ఞానుసారముగ నప్పు డాబ్రాహ్మణుఁడు "రాజపరమేశ్వరా ! నాకొకకన్యారత్న మున్నది. ఆమె పరమరూప లావణ్యవతి; సకలశుభలక్షణ సమన్విత - ఎందఱో దైవజ్ఞులీ మెరాజమహీషియగునని వాక్రుచ్చియున్నారు. మహా రాజా నేనీకన్యకు జనకుఁడను. ప్రేమవశమున నాశా లుబ్ధుడనై దేవరకు శరణాగతుఁడ నైతిని. ప్రభూ ! అనుగ్రహముంచి మా కన్యను బరిగ్రహింపవలయును. ఇదియే యీదరిద్ర బ్రాహ్మణుని వినయపూర్వక విజ్ఞాపనము” అనియెను.
చక్రవర్తియగు బిందుసారుఁడు : “స్త్రీ రత్నందుష్కలాదపి ” అను వాక్యమును స్మృతికిఁ దెచ్చుకొని యాకన్య ఆఱవ ప్రకరణము
17
నంతఃపురమునకుఁ బంపవలయునని యాజ్ఞాపించెను. మంత్రి యగు రాధాగుప్తుఁడు రాజాజ్ఞను యధావిధిగఁ బ్రతి పాలించెను.
దరిద్ర బ్రాహ్మణు, రాజసందర్శన మీవిధముగా ఫలియించెను.
ఆఱవ ప్రకరణము
రాజాంతఃపురము.
బ్రాహ్మణుఁడు రాజాస్థానమునుండి తిరిగివచ్చి సుభద్రకు సమస్త వృత్తాంతమును దెలియఁ జేసెను. భవిష్యత్సుఖ చిత్రమతిమనోహర మైన దేయైనను జిర కాలము వఱకుఁ దండ్రి తనయను విడిచి యుండుటయును, బాలిక తల్లిదండ్రులను విడిచియుండుటయుఁ దటస్థించుటవలన నది విచారకరము గ నేయుం డెను. కన్నీరు భవిష్యత్సుఖ ప్రదర్శనమును దూరము నందుంచిన నుంచుఁగాక ! వ వర్తమానమునందైన నొండొరులు పరస్పరముఁ జూచుకొనకుండ నామార్గమున కడ్డము వచ్చి నిలిచినది !! కొంత సే పీవిధముగఁ గడచిపోయినది. పిమ్మట నియమిత సమయమున వాహనాదిక వైభవములతో సుభద్రాంగి రాజాంతఃపురమునకుఁ దీసికొనిపోఁబడియెను.
అనంతర మా బ్రాహణుఁడు పాటలీపుత్రమునఁ గొన్ని దినములుమాత్ర ముండి శూన్య హ్రుదయుఁడై తన ముద్దుబిడ్డ