అమ్మ నిన్ను కొలిచితే
స్వరూపం
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
రాగం: సింధుభైరవి తాళం : తిస్రనడ పల్లవి : అమ్మ నిన్ను కొలిచితే అతరంగమందున అఖిల సుఖములందులే అదు నిందు నెందున ఆదిశక్తి వీవు తల్లి మూలశక్తివి ఇచ్చాజ్ఞాన క్రియలనే విపులశక్తివి బ్రహ్మ విష్ణు శివులనడుపు పరాశక్తివి సర్వశుభములందించెడు శైవశక్తివి పిండ మందు కుండలినీశక్తి వైతివి అండమందు నీవనంతశక్తివైతివి రెంటియందుగూడ ప్రాణ శక్తివైతివి వెంటనంటి యున్న చిత్త శక్తివైతివి నీవు కలసినపుడు శివుడు కదల గలుగును శివుని కలిసినపుడు నీవు శక్తివౌదువు అరసిచూడ శివశక్తుల గూఢతత్త్వము సచిదనంద కందమై తేజరిల్లును