అమ్మా అమ్మా రమ్మా రమ్మా కాపాడ
స్వరూపం
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
రాగం: బృందావని తాళం: ఆది పల్లవి: అమ్మా అమ్మా రమ్మా రమ్మా కాపాడా చూడాలమ్మా నువ్వే నువ్వే నా జాడా లోకంలోనే నీకయి చూచీ వేసారీ లోకం వీడీ డెందము దూరీ ఈసారీ శత్రువు చేతా చిక్కెను తల్లీ ఈ చిరు సంసారీ! యాగాలని యోగాలని దారులేవొ మారీ హాహాయని నిన్నేగని నీపదాలనే చొరీ సచిదానందా కృతినయి నీలో నిలిచితినో గౌరీ