అమ్మను కొలిచిన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు


పల్లవి :
అమ్మను కొల్చిన దక్కని దేమిటి
దుర్గను కొల్చిన దక్కని దేమిటి

దేవీపరుడౌ ధర్మధ్వజునకు
చక్కని సంతతి దక్కగలేదా
దేవీ యాగము చేసిన ఇంద్రున
కక్షయ సంపద లబ్బగలేదా

దేవిని కొల్చిన దుర్వాసనునకు
కమ్మని కైతలు కలుగగ లేదా
అంబిక కృపచే దైవత గురునకు
అద్భుత కీర్తియు అలవడలేదా

శంకర యతివరు ప్రార్థన మేరకు
బంగరు వర్షము కురియగలేదా
సర్వాత్మికయౌ చండిక మునులకు
సచిదానందము లిడలేదా?


ఈ పాట mp3