అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/శ్రద్ధాంజలి

వికీసోర్స్ నుండి


శ్రద్దాంజలి

శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి కనుమరుగు

బళ్ళారి. ప్రాంత తెలుగు సాహిత్యాభిమానులకు అత్యంత అప్తుడు, ఆత్మీయుడు, సన్నిహిత స్నేహబాంథవుడు, తెలుగు సాహితీసింధువు, తెలుగు కన్నడ భాషాసాహిత్యాల సేతువు - శ్రీ గుత్తి(జోళదరాశి)చంద్రశేఖరరెడ్డి గారు. “దేశభాషలందు తెలుగులెస్న” అని చాటి చెప్పిన, శ్రీకృష్ణ డేవరాయలనినా, రాయలవారు అభిమానించిన తెలుగుభాష అనినా, చంద్రశేఖరరెడ్డిగారికి ఎనలేని అభిమానం. చంద్రశేఖరరెడ్డి గారు పుట్టింది, బళ్ళారికి దగ్గరలోనే ఉన్న జోళదరాశి అనే ఊరిలో. తండ్రి నారాయణరెడ్డిగారు కూడా తెలుగు అభిమాని. తండ్రినుంచి తెలుగు అభిమానాన్ని తెలుగు ఆవేశాన్ని పుణికి పుచ్చుకున్న తనయుడు రెడ్డిగారు.

బళ్ళారిలో ఎల్లప్పుడూ తెలుగు కనిపిస్తూ వినిపిస్తూ ఉండాలి. బళ్ళారి తెలుగు కనుమరుగు కాకూడదు, అని ఎప్పుడూ ఆరాటపడుతుండేవారు రెడ్డిగారు. బళ్ళారిలోనూ కర్నాటకలోనూ తెలుగు రెండవ అధికార భాషగా గుర్తింపు పొందాలని, అందుకు తెలుగు కన్నడ ప్రభుత్వాలు రెండూ పూనుకోవాలని, తను పాలుపంచుకున్న వేదికలమీదంతా ఘోషించేవారు వీరు.

బళ్ళారిలోని రాఘవ స్మారక సమితి, ఆంధ్రకళాసమితి, బళ్ళారి కల్చరల్‌ అసోసియేషన్‌, తెలుగు సంస్కృత సమితి మొదలైన సంస్థలలో సన్నిహిత సంబంథాలను చివరివరకూ కొనసాగించారు. తండ్రిగారి పేరుతో “గుత్తి నారాయణరెడ్డి స్మారక పురస్కారం”ను ఏర్పాటు చేసి, ప్రతి ఏడాదీ, తెలుగురాష్ట్రాలకు బయట ఉండి తెలుగుకు సేవ చేస్తున్న వారిని గుర్తించి, జోళదరాశికి పిలిపించి, పురస్మారంతో గౌరవించేవారు.

హైదరాబాద్‌లో కుదురుకొన్నా ఆయన మనసు ఎల్లప్పుడూ బళ్ళారి చుట్టూ తిరుగుతుందేది. ఆరోగ్యం సహకరించకపోయినా చివరిదినాలలో ఆయన బళ్ళారికి వచ్చారు. అఖండ బళ్ళారి జిల్లా పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాళ్లు సహకరించకపోయినా వేదికలెక్కారు. గొంతు సహకరించకపోయినా చైతన్యాన్ని రగులుకొల్పే ఉపన్వాసాలనిచ్చారు. చివరిరోజున కొనవూపిరిదాకా బళ్ళారి తెలుగు గురించి కలవరిస్తూ, తెలుగు పలుకులను పలుకుతూ కనుమూశారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, చారిత్రక పరిశోధకుడిగా, అనువాద రచయితగా, నటుడిగా తెలుగన్నడ భాషాసాహిత్యాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయాలు.

“మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నడాంబకు మంగళారతులు” అంటూ ఉపన్యాసాన్ని మొదలు పెట్టే చంద్రశేఖరరెడ్డిగారి గొంతు, బళ్ళారిలో,కర్ణాటకలో, తెలుగువాళ్లు ఉన్నంతకాలమూ వినిపిస్తూనే ఉంటుంది. తెలుగును వదలిపెట్టవద్దని మా వెంటవడుతూనే ఉంటుంది.

కె.సురేంద్రబాబు, విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు, బళ్ళారి


22. ఉఱుకు +ఉవ ఉఱుకువ ఉద్గారం ఉఱుకు=ఉద్గతమగు.
23. ఉలుకు +ఉవ ఉలుకువ అసూయ ఉలుకు=అసూయపడు.
24. ఉసుగు+ఉవ ఉసుకువ సంగర్షణ ఉసుగు=నలుగు.
25. ఎదుగు +ఉవ ఎదుకువ అబ్యుదయం.
26. ఎమకు +ఉవ ఎమకువ శోదన ఎమకు=శోదించు.
27. ఎఱగు+ఉవ ఎఱకువ నమస్మారం ఎజగు=నమస్మరించు.
28. ఎసగు+ఉవ ఎసకువ విజ్బంబణం ఎసగు=విజ్బంభించు.
29. ఏకు +ఉవ ఏకువ శాపం ఏకు =తిట్టు.
30. ఒగ్గు+ఉవ ఒక్కువ వ్వాప్తి ఒగ్గు =వ్యాపించు.
31. ఒడుకు+ఉవ ఒడుకువ హాజరు ఒడుకు =ప్రవేశపెట్టు.
32. ఒదుగు+ఉవ ఒదుకువ విదేయత ఒదుగు=విదేయుడగు.
33. ఒరగు+ఉవ ఒరకువ శిదిలం ఒరగు =శిదిలమగు.
౩4. ఒలుకు+ఉవ ఒలుకువ స్రావం ఒలుకు=స్రవించు.
35. ఒసగు+ఉవ ఒసకువ అంకితం ఒసగు =అర్పించు.

“ఉవతో నూర్లమాటలను పుట్టించవచ్చు. అయితే అగవనికలకు మట్టుకే ఉవను చేర్చాలా అనే అరగలి వస్తుంది. పై మాటలన్నీ అగవనికలే కదా. పేరనికలకు కూడా ఉవను చేర్చవచ్చు అనడానికి కొన్ని మచ్చులు కనబడుతున్నాయి. వేగు+ఉవ = వేకువ; పెక్కు+ఉవ= పెక్కువ ; టెక్కు+ఉవ = టెక్కువ వంటివి. ఒక మచ్చు దొరికినా మనం అల్లుకుపోవాలి. చిక్కు+ఉవ= చిక్కువ = క్లిష్టం; ముక్కు + ఉవ = ముక్కువ = అనునాసికం వంటి మరిన్ని మాటలను పుట్టించవచ్చు ఈ ఉవతో” అని ముగించినాను.

(తరువాయి వచ్చే సంచికలో...)



తెలగువారందరూ తమ రోజువారీ వ్వవహారాలను తెలుగులో జరుపుకోగలగాలి. “కలగాలి” అంటే రెండు అర్థాలు: ఒకటి, తెలుగులో జరుపుకోవాలి అని ఎవరూ శాసించకుండానే, స్వచ్చందంగా (ప్రజలు అనుకొని జరుపుకోవడం. రెండు, అందుకు తగ్గ పరిస్థితులు, సదుపాయాలు మనకు మనం కల్సించుకోవడం.

నేను దీనికి ఇస్తున్న అర్ధం - మఱింత పదార్ధాన్ని సామగ్రినీ మీద పేర్చి బలోపేతం చేయడం 10 19010106.

ఈ అధ్యాయంలోని సూచనల్ని అనుసరించి ఈ క్రింద ఇచ్చిన అచ్చతెలుగు నామవాచకాల్ని క్రియాధాతువులుగా మార్చి మీరు అనుకుంటున్న అర్ధాన్ని జోడించండి :

1.అడి = అధికము, వ్యర్థము 2. అని = యుద్ధము 3. అబ్బ= తండ్రి 4. అబ్బి = మనిషి (మగవాడు) 5. అఱ = సగము 6.అరి = పన్ను 7. అఱ = ముసలి ఆవు 8. అల = చిఱుకెఱటం 9. అల్ల = మందము 10. అవ్వ = తాతభార్య 11. ఇడి = సేమియా 12. ఇట్టి = మగజింక 13. ఇల్లి = ఉపవాసము 14. ఉడ్డ = రాశి 15. ఉట్టి = కప్పుకు వేలాడదీసిన పాలకుండ మొ॥ 16. ఉల్లి = ఒక శాకము 17. ఉరి = ఉద్బంధనము 18. ఉమ్మ = అవిరి 19.ఉలి = శిల్పాలు చెక్కే పనిముట్టు 20. ఎడ = చోటు, అంతరం, మనస్సు, హృదయం, సమయం 21. ఎద = మనస్సు,హృదయం 22. ఎన = సాటి, సమం 23. ఎమ్ము = ఎముక 24. ఎర = బలి, ఆహారము 25. ఎల = లేత, యౌవనములోని 26. ఎల్ల = అన్నీ 27. ఎస = మిక్కిలి 28 ఒగి = వరుస, క్రమము 29. ఒజ్జ్ఞ =గురువు 30. ఒర = కత్తిని ఉంచే కోశం. 31. బరి = ప్రక్మన 32. గఱి = ఱెక్క 33.అల = చిఱుకెఱటం 34. ఆన = ఒట్టు 35. బాన= గుండ్రని కాగు 36. వాన = వర్షం 37. జేన (జాన) = వయోజనుల (20019) అరిచేతిని పూర్తిగా చాపినప్పుడు బొటనవేలి కొస నుంచి మధ్యవేలి కొస దాకా వచ్చే పొడవు ౩8 చెఱ = బంధనం 39. అర= కొయ్యసామగ్రిలోని గడి 40. మర = యంత్రం 41. వల = చేపలుపట్టడానికి వాడే అల్లికపని 42. కడ = అంతం 43. వడ =మినప్పప్పుతో చేసే ఒక భక్ష్యం 44 తెగ = ఉపజాతి 45. నగ = ఆభరణం 45. పగ = ప్రతీకారవాంఛ 46. గది = ఇంటిలో ఒక భాగం 47. రొద = రణగొణధ్వని 48 పొద (పొదరు) = మొక్కల గుబురు. 49. చెద = తెల్ల పురుగుల గూళ్ళు 50. వెల= మూల్యం


శ్రద్దాంజలి

అమ్మకు విప్లవ వందనాలు

ప్రభలకుమారికి కుమార్తె బీనాదేవి కన్నీటి వీడ్కోలు

తిరుపతి మావోగా ప్రసిద్ది పొందిన త్రిపురనేని మధుసూదనరావు సతీమణి(73) ఈ జనవరి 13న తీవ అనారోగ్యానికి గురై మరణించడం బాధాకరం. ఆమెకు కొడుకు విజయకుమార్‌ కుమార్తె బీనాదేవి వున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని నందివాడకు చెందిన ప్రభలకుమారి త్రిపురనేని జీవిత సహచారిగా ఆయన విప్లవ సాహిత్య రాజకీయ అడుగు జాడల్లో నడిచారు. ఎమర్షైన్సీ సమయంలోనూ, చిత్తూరు, సికింద్రాబాదు కుట్రకేసుల్లో త్రిపురనేని అరెస్టు అయి లెక్చరర్‌ ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయినప్పుడూ, ఇతర నిర్భంధ సమయాల్లోనూ ఆమె ఎన్నో కష్టాలు, బాధలు భరించారు. ఎన్నడూ థైర్యం కోల్పోలేదు. పశ్చాత్తాపం చెందలేదు. పిల్లల భవిష్యత్తును భర్త పట్టించుకోకున్నా కుటుంబం ఎంతో- విప్లవమూ అంతే అని నమ్మింది. ఆమె ఉద్యమంలో చేసే విద్యార్దులు, రచయితలు ఆమెకెంతో ప్రీతిపాత్రులు. వాళ్ళ బాగోగులు, ఉద్యమకార్యక్రమాల గురించి మాతో వెళ్ళినప్పుడంతా మాట్లాడేది ప్రభలకుమారి. సాధారణ గృహిణేకాదు అసాధారణ మహిళ కూడా. సంప్రదాయం ఆచారాలకు భిన్నంగా తిరుపతి గోవిందధామంలో ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ త్రిపురనేని కుటుంబంతో తనకు విడదీయరాని అనుబంధం వుందని గుర్తుచేసుకున్నారు. ప్రభలకుమారి భౌతికకాయంపై చంద్రశేఖర్‌, జ్యోతి, శ్రీరాములు ఎర్రజెండా కప్పి నివాళి అర్చించారు. దహనపేటిక మీద అమ్మను చూస్తూ బీనాదేవి 'మా అమ్మ లేకుండా మా నాన్న లేరు. అమ్మా నన్ను కన్నందుకు విష్లవాభినందనాలు" అని కన్నీళ్ళతో వీడ్కొలు పలికారు. -సాకం నాగరాజు

సీమ వాకిట... కథా నిలయం 'కారా 'బాటలో “అరా”!

మంచి పనుల్ని కొంతమంది మంచివాళ్ళు అందిపుచ్చుకుంటారు. అలాంటి మంచివాళ్ళలో జనవరి 31న కన్నుమూసిన అబ్బిగారు రాజేంద్రప్రసాద్‌ ఒకరు. కారా మాస్టారు “కథానిలయం” స్థాపించారని చాలా మందికి తెలుసు. అలా తెలుసుకున్న అబ్బిగారి రాజేంద్రప్రసాద్‌(అరా) ఓ కథానిలయాన్ని నందలూరులో స్థాపించి అందులో వేలాది పుస్తకాలను సేకరించి పెట్టారు. కానీ కాళీపట్నం కథానిలయంతో అబ్బిగారి కథానిలయానికి పోలిక తగని కార్యం. కథానిలయం పేరు - ఓ ముచ్చట అబ్బిగారికి. ఆ పేరు మీద 15 సం॥రాల పాటు కవుల జయంతులు, వర్థంతులు, పుస్తక ఆవిష్కరణలు, రచయితల సత్కారాలు, ఆవిష్మరణలు,.... లెక్కేలేదు. విద్యార్థి దశలో వామపక్షభావవైతన్యం, కడప ఆర్ట్స్‌ కళాశాల విద్యార్ధి సంఘం చైర్మన్‌ పదవి రాజేంద్రకు పేరు తెచ్చిపెట్టింది. ఎదుటి మనిషిని పలకరించడంలో ఆత్మీయత గుబాళించడం ఇంకో గొప్పదనం. పుస్తకాన్ని రచయితను నెత్తిన పెట్టుకాని ఊరేగిన వ్యక్తిగా గుర్తింపు ఫొందిన ధన్యజీవి అ.రా. 1962 జూన్‌ 15న పుట్టిన రాజేంద్రప్రసాద్‌ అరవై ఏళ్లలోపే కనుమరుగు కావటం సమాజంలో ఎంతో లోటును మిగిల్సింది. -సాకం నాగరాజు


శ్రద్దాంజలి

మాండలికాలకు మెరుగులద్దిన పోరంకి దక్షిణామూర్తి

ఒకరి భాష మాండలికం, మరొకరిది భాష అనుకొనేవారికి కౌశలం అనే పదం పుట్టుక తెలిసి వుండకపోవచ్చు. దాని అర్ధం “నేర్చుగా గడ్డి కోయడం” అనే. ఒకప్పుడు మాండలిక ప్రయోగంగా మొదలై ప్రామాణిక భాషలో విశిష్ట పదంగా పాతుకుపోయినదని తెలుసుకొంటే మాండలికాల పట్ల తప్పుడు అభిప్రాయాలను నిరసించడమేకాదు ప్రతి మాండలికమూ భాషే ప్రతి భాషా ఒక మాండలికమనే అవగాహానకు రాకపోరు. అంటే భాషలూ మాండలికాల మధ్య తేడా సామాజికపరమైన తేడాయే గానీ భాషాపరమ్టైనది గాదు. మాండలికానికి ప్రాంతీయ పరిధులు ఉంటాయి. ప్రాంతీయతను దాటగలిగితే భాషా స్థాయిని చేరుకున్నట్లే. ప్రామాణిక భాష అనేది అలాంటిదే. రాత నేర్చిన మాండలికం ప్రాంతీయత నుండి బైటపడుతుంది. అది అన్ని ప్రాంతాలవారికీ పరిచయమౌతుంది. వాడుకలోకి వస్తుంది. సందర్భాన్ని బట్టి అలాంటి వాడుక అనివార్యం కావొచ్చు. ఇలాంటి ఆలోచనలతోటే ఆచార్య పోరంకి దక్షిణామూర్తిగారు దశాబ్టాలుగా చేసిన ప్రయత్నాలూ ప్రయోగాలూ మాండలికాలకు ప్రాంతీయత నుండి బైటపడేసి సార్చజనికతను అందించేందుకే పాతికేళ్లు నిండకమునుపే వెలుగూ వెన్నెల-గోదారి అనే పేరుతో ఒక నవలనే గోదావరి తీర జానపదుల మాండలికంలో రాశారు. అంతటితో ఆగక, “ముత్యాల పందిరి” పేరుతో తెలంగాణ మాండలికంలోనూ, “రంగవల్లి " అనే పేరుతో రాయలసీమ మాండలికంలోనూ నవలలు రాశారు. ఇలా మాండలికాలలో రాసిన నవలలు బహుమతులు పొందాయంటే అందరి మన్ననలను పొందాయనేగదా. మాండలికంలో రాస్తే ఎవరు చదువుతారు? ఎవరికి అర్థమౌతుంది అన్న కొందరి మాటలను వమ్ము చేస్తూ మాండలికాలలో రచనలు ఇతర ప్రాంతాలవారికి బొత్తిగా అర్ధం కానంతగా ఉండవని నిరూపించారు. మాండలిక రచనలతోటే భాషలో ఉన్న పలుకుబడులన్నీ భాషాభివృద్ధికి తోడ్పడుతాయని నమ్మారు. భాషలో పరిభాష పెరగడానికి వీలుగలుగుతుందని అశించారు. అందుకనే ఆధునిక ప్రామాణిక భాషలో చేసిన రచనలకంటే మాండలిక భాషలో చేసిన రచనలే చదువురాని జన సామాన్యానికి చేరతాయనడంలో సందేహం లేదంటారు. సాహిత్యాన్ని చదువురానివాళ్లకు కూడా అందించే మంచి సాధనం మాండలికం అంటారు పోరంకివారు.

పోరంకి దక్షిణామూర్తిగారు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి దగ్గర భాషాశాస్త్ర శిక్షణ పొందిన మొదటి తరం సాహిత్యకారుల్లో ఒకరు. ఆచార్య భద్రిరాజుకృష్ణమూర్తిగారు తెలుగు భాషకు సమగ్ర నిఘంటు నిర్మాణం కోసం తలపెట్టిన అపురూప అధ్యయనంలో రెండో సంపుటంగా వచ్చిన చేనేత పదకోశ సంకలనంలో ప్రథాన పాత్ర పోషించి నేత వృత్తిలో వాడే పదజాల సేకరణలోనూ నిఘంటు నిర్మాణంలోనూ క్షేత్ర పరిశీలనకు కావలసిన భాషాశాస్త్ర పరమైన శిక్షణ పొందడమేగాక ఆ కోశ సంకలనంలో సహరచయితగా చేనేత పనిగురించి కథనాత్మక వివరణ అందించారు . ఈ శిక్షణే ఆ తరువాత మేదర పరిశ్రమకు సంబంధించిన మాండలిక వృత్తి పదకోశానికి సంపాదకులుగా 1991లో సంకలనం చేసి ప్రకటించడానికి ఉపయోగపడింది. మేదర వృత్తి పదకోశంలో మేదర వృత్తిలో వాడే కత్తులలో సుమారు పంతొమ్మిది రకాలను బొమ్మలతో సహా గీయించి అందించారు. ఉదాహరణకు, వాటిలో కొన్ని ఒడ్డుకత్తి, నరుక్కత్తి, మేదరికత్తి, మూపురంకత్తి, మచ్చుకత్తి, పడగకత్తి, చురకత్తి, గౌరసకత్తి, రేకత్తి, నిలువుకత్తి, పడకత్తిలాంటివి ఎన్నోతెలుగునాట వివిధ వృత్తులలో వాడే తెలుగు భాష విస్తృతికి ఆనవాళ్లు.

భాషకు సంబంధించినంతవరకూ ఆయనొక జాతీయవాది.జాతీయభాషల్లో ఒకటి గొప్పదీ మరాకటి తక్కువదీ అన్న దురభిప్రాయాలకు తావుండకూడదంటారు. ప్రయత్నిస్తే జాతీయ స్థాయిలో సర్వ జనామోదయోగ్యమైన పరిభాష రూపొందించు కోవచ్చునని నమ్మినవారు. అయితే అనువాదాల దగ్గర మాత్రం భాషల వైయక్తిక సహజ నిర్మాణ పద్ధతికి సడలింపు లేదంటారు. ఆధునిక వ్యావహారిక భాషస్థానే గ్రాంధిక భాషను బోధనాభాషగా కొనసాగించడాన్ని నిరసిస్తూ గురజాడ ప్రకటించిన అసమ్మతి పత్రాన్ని పోరంకివారు 'డిసెంట్‌నోట్ ' గా ఆంగ్లంలోకి అనువదించడంతో అది ఒక చారిత్రాత్మక పత్రంగా పేరు పొందింది.

ఫోరంకి దక్షిణామూర్తిగారు బహు గ్రంథకర్త. వందలాది కథలను ప్రకటించారు. కథానికకు ఒక ప్రామాణిక నిర్వచనాన్ని అందించే ప్రయత్నం చేశారు. వారు స్వయంగా రచయితగా రాసి ప్రకటించినవిగాక, అనువదించి ప్రకటించిన గ్రంథాలే ముప్పైకి పైగా ఉన్నై. తెలుగు సాహిత్యంలోనేగాక భాషాశాస్త్రంలో గూడా ఆధునిక అవసరాలకు అనుగుణంగా తమవంతు కృషి చేసి తెలుగు భాషను పరిపుష్టం చేశారు. కథలూ, నవలలూ, నిఘంటువులూ, అనువాదాలూ, సమీక్షలూ, తెలుగు బొధనలోనూ, సామాజిక భాషాశాస్త్రం, శైలీశాస్త్రం, మొదలైనవాటన్నింటిలోనూ ప్రవేశించి భాషపట్ల తాను నమ్మిన ఆధునికభాషాశాస్త్ర భావ ప్రేరణతో ఎన్నో వ్యాసాలను ప్రకటించారు. తెలుగు భాషలో భాషాసంబంధిరచనలేగాక “ఆధ్యాత్మిక వారసత్వం” పై వారు ప్రకటించిన వ్యాస పరంపర వారి వైవిధ్యభరితమైన వైయక్తిక జీవితానికి మరో కోణం. వేదాలతో మొదలెట్టి యోగవిద్యవరకూ భారతీయ ఆధ్యాత్మికతా తీరు తెన్నులనుఎత్తిచూపుతూ భిన్నత్వంలో ఏకత్వాన్నీ ఆధ్యాత్మిక గురుపరంపర ద్వారా మనకందిన ఆద్యాత్మిక చింతననూ గురించి వివిధ వ్యాసాలరూపంలో మనకు అందించారు.

ఇంతటి వైవిధ్యభరితమైన రచయితగా, రెండు పదులు నిండకమునుపే రచనా జీవితాన్ని మొదలుపెట్టి ఎనభైఆరేండ్ల వరకూ భాషావ్యవసాయం సాగించిన పోరంకి దక్షిణామూర్తిగారు భౌతికంగా మననుంచి దూరమైనా వారి రచనలు ఇంకెంతో కాలం మనని పలకరిస్తూనే ఉంటాయి.

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 98661 28846

శ్రద్దాంజలి

సీమ రైతు కథాకిరీటి సింగమనేని

అభ్యుదయ కథా రచయిత, మార్క్సిస్టు భావాల వారధి, ప్రముఖ సాహిత్య విమర్శకులూ సింగమనేని నారాయణ గారు 25.02.2021 మధ్యాన్నం అనంతపురం ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. వీరు 26.06. 1943లో అనంతపురం దగ్గర రాప్తాడు మండలంలోని బండమీడపల్లెలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి సంజీవమ్మ, తండ్రి రామప్ప. వీరికి ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు. వీరి ప్రాథమిక విద్వాబ్యాసం ఉండూరులో జరిగి పి.యు.సి.ని అనంతపురంలో ముగించి విద్వాన్‌ కోర్సును తిరుపతి ప్రాచ్య కళాశాలలో చదివి అనంతరం పండిత్‌ శిక్షణను కర్నూలులో పూర్తి చేసారు. 1969లో నార్పల జిల్లాపరిషత్‌ పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరి 2001లో రాప్తాడు ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విరమణ చేశారు.

బాల్యంలో తండ్రి రామప్ప మంచి కథల పుస్తకాలను చదివేలా చేసి తెలుగు భాషపట్ల సాహిత్యం వైపు మక్కువ పెంచాడు. పుస్తకాలు చదువుతూనే 17 యేళ్ల వయస్సులో “న్యాయమెక్కడ” అనే కథానిక రాస్తే దానిని కృష్ణాపత్రికవారు 02.07.1960 లో ప్రచురించారు. తరువాత విరివిగా నవలలు చదివి ఊహాలోకాల్లో విహరిస్తూ“ఆదర్సాలూ -అనుబంధాలు” “అనురాగానికి హద్దులు” “ఎడారి గులాబీ " అనే నవలలు(1964-1968 మధ్య) రాశారు. తరువాత వీరికి మార్క్సిజం పరిచయమయ్యింది. దానితో సింగమనేని నారాయణ చౌదరి అనే తన పేరులోని చౌదరి ని తొలగించుకొన్నాడు. కొన్నాళ్లు రాయడం మాని, మార్క్సి దృక్పథానికి సంబంధించిన పుస్తకాల్ని విస్త్రృతంగా చదివారు.

తాను మార్క్సి దృక్పథాన్ని వారి గురువు గారైన నాగసిద్దారెడ్డి గారు పరిచయం చేసిన శ్రీశ్రీ గారి “మహాప్రస్థానం” ద్వారానే ఆకళింపు చేసుకొన్నానని సింగమనేని చెప్పేవారు. అంతేకాక వీరు శ్రీశ్రీ తిలక్‌ల కవిత్వాల్ని పేజీలకు పేజీలు అనర్గళంగా తన ఉపన్యాసాల్లో సందర్భోచితంగా వినిపించేవారు.

ఇతని రచనలూ -తెల్లని మడత నలగని పంచెకట్టూ, అచ్చ తెలుగుతనానికి కొలమానాలు. బడిలో తెలుగుపాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడే కాక సీమ రైతుల సమస్యలపై కథారచనలు చేసిన అక్షరసేద్యగాడు. ఎంత సేపు ఉపన్యాసం చేసినా ఒక్క వ్యర్థం మాట లేకుండా చెప్పదలచుకొన్న విషయాన్ని అరటిపండులా వొలిచి చెప్పగల ఉపన్యాసకుడు. వాస్తు మూఢనమ్మకాల మూర్థత్వాలను దెప్పిపొడుస్తూ రచనలు చేయడమే కాక తన రచనలకు అనుగుణంగా సిద్ధాంతాలకు కట్టుబడి చివరిదాకా బతికిన సాహసి. తెలుగు కథానికా ప్రక్రియను సుసంపన్నం చేసిన రెండో తరం రాయలసీమ కథకుల్లో ముఖ్యుడు.

ఏ పత్రికలో కొత్తతరం రచయిత కానీ, నూతన భావస్పోరకం కానీ కనిపించినా ఫోనులో పలకరించికానీ, ఇంటికి పిలిచి కానీ మెచ్చుకొని వెన్నుతట్టడమో, అందులోని తప్పొప్పులను ఎత్తి చూపడమో చేసేవాడు. యువతరంలో ఎటువంటి పురాభావాలు కనిపించినా నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు ఖండిస్తూ కాలానుగుణమైన సామాజికస్పృహను ఎలా చెప్పాలో వివరించేవారు. ఆ విధంగా ఎందరో యువరచయితలకు మార్గదర్శకులైనారు(నాతో సహా).

వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు పరిశోధనలు చేసి పి. హెచ్‌.డి.లు పొందారు. కొన్ని యూనివర్సిటీలు వీరి కథల్ని పాఠ్యాంశాలుగా ఉంచాయి. వీరు రాయలసీమ నీటి సమస్యల మీద రచనలు చేస్తూనే “హంద్రీ నీవా జలసాధన సమితి " కి కన్వీనర్‌ గా వ్యవహరించారు. అనంతపురం జిల్లాలో తీవ్ర కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూ ఉండే సమయంలో జిల్లా అంతటా ఇతర రచయితలతో కలిసి “రైతు ఆత్మవిశ్వాసయాత్ర”లు చేసి వారిలో ఆత్మస్రెర్యం నింపారు.

వీరి కథలు (1)జూదం (2)సింగమనేని నారాయణ కథలు (3)సింగమనేని నారాయణ కథానికలు (4)జీవఫలం-చేదు విషం (5)నీకూ నాకూ మథ్య నిశీధి పుస్తకాలుగా వచ్చాయి.

వివిధ సందర్భాల్లో రాసిన వీరి వ్యాసాలు (1)సమయమూ-సందర్భమూ (2)సంభాషణం (3)కథావరణం(4)మున్నుడి పేరిట అచ్చయ్యాయి. (1)సీమ కథలు(2)తెలుగు కథకులు-కథన రీతులు (మూడు సంపుటాలు మధురాంతకం రాజారాం తో కలిసి)(3)విశాలాంధ్ర వారి తెలుగు కథ (4)ఇనప గజ్జల తల్లి పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. చాలా పుస్తకాలకు సమీక్షలు, ముందుమాటలూ రాశారు. ఆకాశవాణి కడప, అనంతపురం కేంద్రాల్లో వీరి ఎన్నో ప్రసంగాలు ప్రసారం అయ్యాయి. వీరివి సాహిత్యసేవలకుగాను ఎన్నో ఆవార్డులు లభించాయి.

రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లా గ్రామీణుల, రైతుల జీవన సమస్యలు....దురాశాపరులై మితిమీరిన ధన సంపాదనా పరులయిన నగరవాసుల కృత్రిమ జీవనము, ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల బతకనేర్చిన తనము, పరీక్షా ఫలితాల డొల్లతనమూ, పెత్తందార్లు దళితుల పట్ల మెలిగే విధానమూ, స్త్రీల అణచివేతల


రూపాలనూ ఎటువంటి దాపరికాలకూ పోకుండా కథలుగా మన కళ్లకు కట్టి చూపాడు.

నాకు వారితో సాహిత్య నేస్తమే కాక రోగానుబంధం కూడా ఉంది. వారికి మధ్య వయస్సులో ఆస్తమా జబ్బు ఆవహిస్తే, నాకు బాల్యం నుంచీ పీడిస్తూనే ఉంది. ఇద్దరమూ కలిసినప్పుడు మా జబ్బుల గురించే చర్చ జరిగేది. “ఇది జబ్బు కాదయ్యా ఒక వరం! ప్రపంచం లోని గొప్పవారంతా ఆస్తమా పీడితులే. కాబట్టి దాని గురించి ఆలోచించడం మాని, మంచి గ్రామీణప్రాంతం నేపథ్యంలో ఒక మంచి నవల రాయడానికి యత్నించు” అని చెప్పేవాడు. గత పది నెలలుగా వారి అనారోగ్యం గురించి తెలుసు. రోజూ ఫోనులో మందుల గురించి మాట్లాడుకొనేవారం. మొన్న జనవరి 25 నాడు వారిని పలకరించడానికే అనంతపురం వెళ్లడం జరిగింది. ఆ రోజుకూడా “సడ్లపల్లీ ఈ చలికాలం నన్ను బతకనీయదయ్యా! త్వరగా పోతే నయమనిపిస్తూ ఉంది అని డీలాగా మాట్లాడారు. నవల రాయడం మొదలు పెట్టావా?”అన్నారు. “లేదు లే సార్‌! ఈ నెల ఓపికపడితే ఎండాకాలం వస్తుంది మీరు కోలుకొంటారు” అన్నాను. అవే మా ఇద్దరి మధ్యన-చివరి మాటలు.

వారు భౌతికంగా మననుంచీ దూరమ్హైనా విలువైన, సామాజికస్పృహ కలిగిన ఎన్నో రచనల్ని వారసత్వసంపదగా సమాజానికి అందించి పోయారు. తెలుగుభాష ఉన్నంతవరకూ వారు తన రచనల రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు.

సడ్లపల్లె చిదంబరరెడ్డి 94400 73636 —————————————————————————————————————————————————————————————————————————————————————————————————————


మైదుకూరులో ఘనంగా మాతృభాషాదినోత్సవం 

పుస్తక పఠనం ద్వారా 'ప్రాపంచికజ్ఞానాన్ని అపారంగా పొందవచ్చునని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్ల సభ్యుడు, కథారచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి పేర్మాన్నారు. మైదుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు భాషోద్యమసమాఖ్య మైదుకూరుశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తవ్వా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ భాషాసంపదను, ప్రపంచజ్ఞానాన్ని ఇనుమడింప చేసుకోవచ్చునని చెప్పారు. సమాఖ్య గౌరవాధ్యక్షుడు టి. మహానందప్ప తెలుగుభాషలో పదసౌందర్యాన్ని వివరించారు. జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు ఎల్‌. సూర్యనారాయణరెడ్డి, ఎ. బాలగంగాధరరావు, ధర్మిశెట్టిరమణ. తెలుగుభాషోద్యమ గీతాన్ని ఆలాపించారు. కార్యక్రమంలో పాల్ళొన్న విద్యార్థులకు సామెతలు పోడుపుకథలు, తెలుగుపౌరుషం పుస్తకాలను బహుమతిగా అందజేశారు.