Jump to content

అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/పడమటిగాలితో నివురు తొలగిన తెలుగు భాషా సాహిత్య సంపద

వికీసోర్స్ నుండి

ధారావాహిక

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి 98481 23655


పడమటిగాలితో నివురు తొలగిన

తెలుగు భాషా సాహిత్య సంపద

తెలుగు భాషా సాహిత్యం తరతరాలుగా తరగని సంపదగా వర్దిల్లుతుంది. ఉన్న సాహిత్యం అంతా తాళపత్రాల మీదో, బూర్డు పత్రాల మీదో రాగిేరేకుల మీదో ఉందే తప్ప అచ్చుకాలేదు. అచ్చులోకి రాలేదు. దినదినాభివృద్ధి చెందవలనిన విజ్ఞాన సంపద అంతా బూజుపట్టి, చెదలు పట్టి, బూడిద పాలయిందే తప్ప తరతరాలకు తరాల నిధిగా నిలవలేదు. అటువంటి పరిస్థితుల్లో పాశ్చాత్యులు మన దేశానికి రావడం వ్యాపారం చేయడం ఒక ఎత్తయితే, మరో వైపు మన సాహిత్యం పునరుద్ధరణ గావించడం మరో ఎత్తయింది. క్షీణదశలోని సాహిత్య సంపదను లక్షణంగా ముద్రించి తరతరాలకు అందించిన పాశ్చాత్య దేశవాసులు ఎందరో ఉన్నారు.

1658లో డచ్‌ వారు ఆంధ్రప్రదేశ్‌ లోని పాలకొల్లు, జగన్నాయకపురం, కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం మొదలయిన ప్రాంతాల్లో వారు గిడ్డంగులను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేశారు. వారి వాణిజ్యం వ్యాపారలావాదేవీలు సరిగా లేనందువల్ల, డచ్‌ వారి స్థావరాలన్నీ ఇంగ్లీషు వారే కైవసం చేసుకున్నారు. ఫ్రెంచ్‌ వారు 1669 నాటికి తెలంగాణ ప్రాంతంలో వ్యాపారాభివృద్ధి చేసుకున్నారు. గోల్కొండ నవాబు నుంచి ఎగుమతి పన్నులేకుండా ఫర్మానా సంపాదించారు. మచిలీపట్నంలో 1693 నాటికి ఫ్రెంచ్‌ పేటనే నిర్మించి ఒక గిడ్డంగిని కూడా ఏర్పాటు చేశారు. వీరి గిడ్డంగులు యానాం, నరసాపురం, రాజమండ్రి, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంలో నిర్మించారు. ఫ్రెంచ్‌ వారి పలుకుబడి వల్ల తెలుగు భాష, సాహిత్యంలో ఆయా భాషాపదాలు చోటు చేసుకున్నాయి. కస్తూరి రంగ కవి రచించిన ఆనందరంగరాట్చందము, దిట్టకవి కృతమైన రంగరాయ చరిత్రము, చట్రాతి లక్ష్మి నరసకవి రచించిన పద్మనాభ యుద్దము మొదలయిన గ్రంథాల్లో ఫ్రెంచ్‌ వారి ప్రస్తావన, వారి పరిస్టితి, స్థితిగతులు వ్యాపారాలు కనిపిస్తాయి.

వీరి తర్వాత ఎక్కువకాలం పాలించినవారు ఇంగ్లీషువారు. వీరి కాలంలోనే వ్యాపారంతోపాటు సాహిత్య సంపద వెలుగులోకి వచ్చింది. దీనితో పాటు విద్య, వైద్యాలయాలవ్చద్ది బాగా కనిపిస్తుంది. విద్యతో గ్రంథ ప్రచురణ కూడా బాగా చోటుచేసుకుంది. దీనికో కారణం ఉంది. పాశ్చాత్య దేశాలు అంచెలంచెలుగా భారత భూభాగంలో అడుగుపెట్టి దేశమంతా వ్యాపించారు. అలా వచ్చిన వారికి స్థానిక భాష ఓ పెద్ద సమస్య అందుకోసం ఆనాటి సివిల్‌ సర్వెంట్లు అరబ్బీ పారశీకం, హిందూస్తానీ, సంస్కృతం, హిందీ, బెంగాలి, ఒరియా, మరాఠీ, గుజరాతి,తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం అనే పదమూడు భాషలతోపాటు ఆనాటి వ్యావహారిక పదజాలం నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ భాషలన్నీంటిలో వ్యాకరణాలు, నిఘంటువులు, పదకోశాలు ప్రాంతాల వారీగా తయారు చేయడం మొదలు పెట్టారు. ఇతర భాషల్లో వ్యాకరణాలు, నిఘంటువులు మొదలయినవి సిద్దం చేసిన పాశ్చాత్యులు చాలా మందే ఉన్నారు. వారిలో పారశీకం-రిచర్జన్‌, సంస్కృతం - కోల్‌ బ్రూక్‌, ఎల్లిస్‌, సదర్‌ లాండ్‌, మెక్‌ నాటన్‌, మొయనీర్‌ విలియమ్స్‌ హిందుస్తానీ, డాక్టర్‌ గిల్‌ క్రిస్ట్‌, బెంగాలి - డాక్టర్‌ విలియం కేరీ, ప్రొఫెసర్‌ హీటన్‌, తమిళం - బేషి (1728) రోట్లర్‌, ఆండర్సన్‌, తెలుగు-కాంబెల్‌, మారిస్‌, బ్రౌన్‌ మలయాళం - బెయిలీ, గుండర్ట్‌ కన్నడం - కిట్టెల్‌, మెక్కీరల్‌, రోల్ఫ్, మరాఠి - మేజర్‌ మోల్స్‌ వర్త్‌, ఒరియా - మేస్తర్‌ సట్టన్‌, గుజరాతి - డ్రమ్మండ్‌ మొదలయిన వారున్నారు. తొలినాళ్ళలో మనకు అందుబాటులో ఉన్న తెలుగు నిఘంటువులు.

విలియం బ్రౌన్ -ఎ వొకాబులరి ఆఫ్‌ జంటూఅండ్‌ ఇంగ్లీష్‌ మద్రాసు 1818, కాంబెల్‌, ఎ.డి- ఎ డిక్షనరీ ఆఫ్‌ తెలుగు లాంగ్వేజ్‌, మద్రాసు-1821, మోరిస్‌, జె.సి- ఎ డిక్షనరీ ఇంగ్లీషు - తెలుగు - మద్రాసు -1835, నికొలస్‌, జె- ఎ వోకాబులరి ఆఫ్‌ ఇంగ్లీష్‌ అండ్‌ తెలుగు, మద్రాసు -1841 బ్రౌన్‌, సి.పి - ఎ డిక్షనరి, తెలుగు అండ్‌ ఇంగ్లీషు, మద్రాసు - 1853, పెర్సివల్‌ (రెవ)సి - తెలుగు- ఇంగ్లీష్‌ డిక్షనరి మద్రాసు - 1862, హాలర్‌, పి- తెలుగు నిఘంటువు కంటైనింగ్‌ తెలుగు ఇంగ్లీషు అండ్‌ ఇంగ్లీషు - తెలుగు రాజమండ్రి 1900, మొదలయినవి ఎన్నో ఉన్నాయి. దేశీయులయిన వారు కూర్చిన నిఘంటువులు కూడా బాగానే ఉన్నాయి. రామకృష్ణ శాస్త్రులు - వొకాబులరి యిన్‌ ఇంగ్లీష్‌ అండ్‌ తెలుగు, మద్రాసు- 1841 వీరాస్వామి మొదలియార్‌: ది బిల్దర్‌ వాకాబులరి యిన్‌ ఇంగ్లీష్‌ అండ్‌ తెలుగు - మద్రాసు - 1841, శంకరనారాయణ, పి - ఎ స్మాలర్‌ ఇంగ్లీషు తెలుగు డిక్షనరి, మద్రాసు - 1804, -తెలుగు - ఇంగ్లీషు డిక్షనరి, మద్రాసు-1900 మొదలయిన వాటితోపాటు తెలుగు - తెలుగు శబ్ధకోశాలలో శబ్దరత్నాకరం, శబ్ధార్థ చంద్రిక, సూర్యారాయాంథ్ర నిఘంటువు, వావిళ్ళవారి నిఘంటువు, ఆంధ్ర వాచస్పత్యము, మొదలయిన వాటితోపాటు తెలుగు, ఉరుదు, హిందీ, మరాఠి, ఒరియా నిఘంటువులు ఇంగ్లీషు ప్రాతిపదికగా వచ్చాయి.

19వ శతాబ్ధి ప్రథమ పాదంలో దేశవ్యాప్తంగా కోశవ్యాకరణాలు, సాహిత్య గ్రంధాల ముద్రణ విరివిగా జరిగాయి. దీనికి బెంగాల్‌లోని సిరంపూరు కేంద్ర బిందువయింది. బెంగాలి భాషతోపాటు పలుభాషా గ్రంథాలు, నిఘంటువులు, వ్యాకరణాలు ముద్రించి భారతదేశంతోపాటు చైనా, జపాన్‌ తదితర దేశాలకు ముద్రించిన గ్రంథాలు సరఫరా చేసిన ఖ్యాతి రెవరెండ్‌ విలియం కేరి (17.8. 1761 -9. 6. 1834)కే దక్కుతుంది. విలియం కేరీ: విలియం కేరీ ఇంగ్లండ్‌లోని పాలెర్‌ స్పరీ అనే గ్రామంలో ఎడ్మండ్‌ కేరీ, ఎలిజబెత్‌ దంపతులకు 1761 ఆగష్టు 17న జన్మించాడు. తండ్రి పల్లెటూరి పాఠశాల ఉపాధ్యాయుడు. కొంతకాలం నూలు వ్యాపారం, వస్త


వ్యాపారం చేశాడు. విలియం కేరీ ప్రారంభంలో తండ్రి వద్దే చదువుకుని అనంతరం ఉన్నత విద్వపూర్తి చేశాడు. ఈ కాలంలోనే ఫ్రెంచ్, హిబ్రూ, లాటిన్‌, జర్మన్‌, అరబిక్‌, సంస్కృతం తదితర భాషలను నేర్చుకున్నాడు. ప్రారంభంలో బతుకు తెరువుకోసం చర్మకార వృత్తి చేశాడు. 1781లో డోరతిని వివాహం చేసుకున్నాడు. పెళ్ళయేనాటికి డోరతి నిరక్షరాస్యురాలు. వైవాహిక జీవితంలో 7గురు పిల్లలు పుట్టారు. అందులో యిద్దరు ఆడపిల్లలు బాల్యంలోనే చనిపోయారు. 1789 నాటికి ఒక సంఘానికి దైవబోధకుడయాడు. డేనిష్‌ మిషన్‌ పక్షాన భారత దేశానికి 1793 నాటికి కలకత్తా వచ్చాడు. కలకత్తాకు ఉత్తరంగా ఉన్న బండేల్‌ అనే పోర్చుగీసు స్థావరం అనుకూలంగా ఉంటుందని ఎంచుకున్నాడు. అక్కడ డాక్టర్‌ తామస్‌ అనే ఉపాధ్యాయుడితోను రాంబస్‌ అనే అనువాదకుడితోను పరిచయం అయింది. దేశం విడిచి వచ్చినందువల్ల, కొత్త ప్రదేశం అయినందువల్ల తెచ్చుకున్న డబ్బు అయిపోతున్నందువల్ల ఆర్ధికంగా కొంత బాధ ఏర్పడింది. అందువల్ల ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఉడ్నే అనే బెంగాలీయుడి సహాయంతో మాల్దా సమీపంలోని ముడ్నబాటి అనే గ్రామంలో నీలిమందుకర్మాగారంలో చిన్న ఉద్యోగం అభించింది. అది కేరీకి ఎంతో మేలయింది. సామాన్య ప్రజలతో సన్నిహితంగా ఉన్నందువల్ల బెంగాలి భాష త్వరగా నేర్చుకునే అవకాశం కలిగింది. భాష నేర్చిన అనంతరం తాను వచ్చిన సంస్థయిన లండన్‌ మిషనరి సొసైటీకి లేఖరాస్తూ స్థానిక భాషల్లో బైబిలు, వ్యాకరణాలు, భారతీయ భాషా గ్రంథాలు ముద్రించ వలసిన అవసరం ఉందని తెలియజేశాడు. కేరీ లేఖ ఆధారంగా లండన్‌ మిషనరీ సొసైటీ కేరికి తోడుగా జాషువ మార్షమన్‌, విలియం వార్ట్‌లను ఎంపిక చేసి కలకత్తాకు పంపించారు. మార్షమన్‌ భాషా శాస్త్రవేత్తగా, అనువాదకునిగా, సంపాదకునిగా, పుస్తక విక్రేతగా ముఖ్యంగా ముద్రణలో అనుభవమున్న వాడు. విలియం వార్డు అతి సామాన్యమైన వడ్రంగి కుటుంబానికి చెందినవాడు. ఐతే ముద్రణలో బాగా అనుభవముంది. అందువల్ల భారత దేశానికి మిషనరీగా, ప్రెస్ సూపరింటెండేంట్‌ గా గ్రంథముద్రణ చేయాలనే సంకల్పంతో వచ్చాడు.

మార్ష్‌మన్‌, వార్ట్‌లు భారత దేశానికి వచ్చేసరికి శ్రీరంగ పట్టణం బ్రిటీషువారు కైవసం చేసుకుని దాదాపు సంవత్సరం అయింది. ఆ కారణంగా బ్రిటీష్‌ వారి రహస్యాలు బయటకు చేరకుండా ఉండేందుకు దేశమంతా కట్టుదిట్టం చేశారు. ఈ కారణం వల్ల ముద్రణకుగాని, అచ్చు యంత్రస్థాపనకుగాని అనుమతి లభించలేదు. అదేకాలంలో సిరంపూరు డేనుల ఆధీనంలో ఉంది. కేరీకూడా డేనులకు సంబంధించిన వాడే కాబట్టి సిరంపూర్‌లో పాఠశాల స్థాపనకు,ప్రెస్‌ నిర్మాణానికి గవర్నరు అనుమతి లభించింది. ఆ వెంటనే 1800 ప్రాంతంలో పాఠశాల స్థాపించారు. పరిసర గ్రామాల నుంచి పిల్లలకు ఉచిత విద్యాబోధన ప్రారంభం చేశారు. మరికొంతకాలానికి బోర్డింగ్‌ పాఠశాల ప్రారంభం అయింది. ఇది ప్రస్తుతం కైైస్తవవేదాంత విద్యకు కేంద్రమయిన సిరంపూరు విశ్వవిద్యాలయంగా ఎదిగింది. దానికి తోడు 1801 నాటికి సిరంపూర్‌ ప్రెస్‌ స్థాపనకూడా జరిగింది. 1801 ఫిబ్రవరి 7 నాటికి బెంగాలి భాషలో కొత్త నిబంధన అచ్చయింది. ఇదేవారు ప్రచురించిన ప్రథమ ముద్రణ.

సిరంవూర్‌లో 1801 నుంచి 1832 వరకూ 47 భాషల్లో ముద్రణ జరిగింది. 40 భాషల్లో పోత అక్షరాలు తయారు చేసి భారత దేశమంతటికీ సరఫరా చేశారు. సిరంపూర్‌ మిషన్‌ ప్రెస్‌ ప్రింటింగ్‌లో అనుభవమున్న మార్ష్‌మన్‌, వార్డుల సహకారంతోపాటు స్థానికంగా ఉన్న గంగాకిషోర్‌ భట్టాచార్య సహాయం ఎంతయినా ఉందని వారి లేఖల్లో ప్రస్తావించారు. Katheine Smith Diehl రాసిన Early Indian Imprints page 64లో స్పష్టంగా ఉంది.

The Tenth momoir respecting the translations (1834) say that printing had been done at Serampore in forty seen languages for aboe forty of which types had been cast at Serampore. Serampore had also become the source of supply for entire country in the matter of types and Presses were started early where 1801 నుంచి 1832 వరకు బైబిళ్ళు, వ్యాకరణాలు, నిఘంటువులు, రామాయణం మొదలయినవి 47 భాషల్లో రెండు లక్షల 12 వేల గ్రంథాల ముద్రణ జరిగింది. ఐతే కేవలం బైబిలుకు సంబంధించినవి మాత్రం 33 భాషల్లో జరిగింది. సంస్కృతము హిందీ,బ్రిజ్‌ భాషా, మరాఠా, బెంగాలి, ఒడియా, తెలింగా, కర్నాటా, పుస్లీ పంజాబి, కాశ్మీరి, అస్సామి, బర్మా, పాలి, చైనీస్‌, ఖాసి, బిర్‌ కనీరాా ఉదయపురా, మార్వా, జయపూర, కున్‌కురా, తముళ్‌, సింగాలిస్‌, ఆర్మినియా, మాల్షివియన్‌, గుజరాతి, భోషి, సింధ్‌, పుచ్, నేపాల, మలయా, హిందుస్తానీ, పర్షియన్‌ భాషల్లో ముద్రణ జరిగింది. ఇదే కాలంలో నిఘంటు నిర్మాణం ముద్రణ కూడా జరిగింది. బెంగాలి, సంస్కృతం, మరాఠి భాషల్లో ముద్రించిన నిఘంటువులు నేటికీ కేఠీ గ్రంథాలయం, సిరంపూరులో ఉన్నాయి. 1815 నాటికి కేరీ 7 భాషల్లో వ్యాకరణాలు రచించి ముద్రించాడు. 1. సంస్కృతం 2. చైనా 3. బర్మా 4. బెంగాలి 5. మరాఠా 6. పంజాబి, 7. తెలుగు. తెలుగు వ్యాకరణం 1814లో ముద్రణ జరిగింది. ఈ ప్రతి ప్రస్తుతం నేషనల్‌ ల్లైబరీ కలకత్తాలో ఉంది. కేరీ స్థానికులయిన పండితులతో ఆయా వ్యాకరణాలు రూపొందించాడు.

ప్రతిభాషా వ్యాకరణం పీఠికలో ఆయా ప్రాంతీయ సహాయకులను, రచయితలను ప్రత్యేకంగా ఉటంక్కించాడు. కొన్ని సందర్భాల్లో సహాయకుల పేర్లు ఉదహరించని చోట్ల Natie Pundits, Learned pundits, learned Munshies, Natie assistants అని మాత్రమే పేర్మొన్నాడు. తెలుగు వ్యాకరణం 1814లో అచ్చయింది. ఇందులో తెలుగు సంస్కృత జన్యమనే వాదించాడు. దీనికి తోడు తెలుగు వ్యాకరణ రచనకు సహాయపడిన పండితుల్లో సుబ్బశాస్త్రి (Subba Shastree) అతని సోదరుడు నాగేశ్వరశాస్త్రి (Nageswar Sastree) సహాయం మరువలేనిదన్నాడు. పైగా వారు జ్ఞానంగల వ్యాకరణవేత్తలని కితాబు యిచ్చాడు.

ఇంతవరకు బాగానే ఉంది. 1812 మార్చ్‌ 12వ తేది సిరంపూర్‌ ఫైస్ అగ్నిప్రమాదానికి గురయింది. ఈ అగ్ని ప్రమాదంలో 14 భాషల్లోని పోత అక్షరాలు, 12 వందల రీముల కాగితం, ఎన్నో రాత ప్రతులు దగ్ధం అయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో కొంతవరకు కాలినా మిగిలిన భాగమయిన బెంగాలి రామాయణం, బహుభాషా సమానార్ధకపద నిఘంటువు (Polyglot dictionary) మాత్రం దక్కాయి. ఇవి నేటికీ సిరంపూరు కేరీ గ్రంథాలయంలో అముద్రితంగానే ఉన్నాయి.

కేరీ తయారు చేసిన బహు భాషా సమానార్థక పద నిఘంటువు (Polyglot dictionary) కొంత చర్చించవలసిన అవసరం ఉంది. బహుభాషా నిఘంటువు తయారు చేయడానికి ఏదో ఒక భాషను మూలంగా స్వీకరించి యితర భాషలలోని సమానార్థక అర్దం, సరయిన అర్ధం వచ్చేలా తయారు చేసే ప్రక్రియను బహుభాషా సమానార్థక పద నిఘంటు నిర్మాణం అంటారు. ప్రపంచంలో తొలి బహుభాషా సమానార్థక వద నిఘంటువు కార్టినల్‌ ఫ్రాన్నిస్కో (Cardiral Fransisco) నిర్వాహకత్వంలో 1522వ సంవత్సరం స్పెయిన్‌లో ఆరు సంపుటాలుగా అచ్చయింది. ఇది బైబిలు సంబంది పాతనిబంధన హిబ్రూ, గ్రీకు భాషల్లోను, కొత్త నిబంధన గ్రీకు లాటిన్‌ భాషల్లోనూ తయారయింది. సిరంపూరులో ఉన్న సమానార్థక పద నిఘంటువు 13 భారతీయ భాషల్లో సంస్కృతాన్ని మూల భాషగా గ్రహించి తయారు చేశాడు. దీనికి యూనివర్శల్‌ డిక్షనరీ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజస్‌ అని పేరుపెట్టాడు. (uniersal dictionary of Indian Languages) బహుబాషా సమానార్థక పదనిఘంటువు చేతితో తయారయిన కాగితం (hand made paper) పసుపు రంగులో దళసరిగా ఉంది. కాగితం, క్రిమిద్రష్టం కాకుండా క్రిమి సంహారక రసాయనాలతో ఆరబెట్టి భద్రం చేశారు. కాగితానికి ఒక వైపు మాత్రమే నల్లని సిరాతో రాసి ఉంది. పదమూడు భాషలు వేర్వేరు గళ్ళలో రాసి ఉన్నాయి. మొదటి పుటలో సంస్కృతంతోపాటు మిగిలిన భాషల పేర్లు బెంగాలి లిపిలో ఉన్నాయి. తరువాత పుటల్లో వరస క్రమంలో 1 నుండి 13 వరకు అంకెలు వేశారు. ప్రతి పుటకు 6నుండి 8 పంక్తులున్నాయి. ముఖ పత్రం లేదు. కాగితం ఫొడవు 52 సెం.మీ., వెడల్పు 20 సెం.మీ. మొత్తం పుటలు 312, పదాల సంఖ్య 2184. ఇందులో ముగ్గురిచేతి రాతలున్నాయి. ఒకటి కేరీది కావచ్చని ఆనాటి గ్రంథాలయాధికారి సునీల్‌ కుమార్‌ చటర్జీ (1976 ప్రాంతంలో) చెప్పారు. నిఘంటువు అంతా బెంగాలి లిపిలోనే ఉంది. చదివి అర్ధం చెప్పిన ఆనాటి సహాయ గ్రంథాలయాధికారి అనిల్‌ దాస్ కి కృతజ్ఞతలు. కొన్ని పుటల్లో కాలిన మచ్చలున్నాయి. ఇది పూర్తయే నాటికి హిబ్రూ, గ్రీకు పదాలు చేర్చాలనే తలంపు ఉందని ఒక లేఖలో కేరీ రాశాడు. ఈ గ్రంథంలోని 13 భాషల వివరాలు. సంస్కృతం, కాశ్మీరి,పంజాబి జలంధర్‌, మధ్య ప్రదేశ్‌ భాష పర్వతి భాష మైధిలి, బెంగాలి, ఒరియా, మరాఠీ, గుజరాతి, తెలుగు, కన్నడం, తమిళం.

ఇది గనక అవ్బుడు ముదించి నట్టయితే ప్రపంచంలో బహుభాషా సమానార్థక పదనిఘంటువు ముద్రించిన ఖ్యాతి విలియం కేరీకి ముద్రించిన దేశంగా భారత దేశానికి దక్కేది.

స్పందన

“అమ్మనుడి " గత పది నెలలుగా ప్రచురిస్తున్న ధారావాహిక “పడమటి గాలితో నివురు తొలగిన తెలుగుభాషా సాహిత్య సంపద” వ్యాసం- ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారిగారు అద్భుతంగా రాస్తున్నారు. ప్రతీ మాసం తప్పక చదువదగినది. తెలుగు భాష సాహిత్యాల ఘనమైన చరిత్రను వెలికితీసి అందిస్తున్నందుకు రచయితకు కృతజ్ఞతలు.

-ఆచార్య అవుటి జగదీష్‌ 'హైదరాబార్‌


కవిత

హోళీ -హోళికా

హోళీ హోలికా
దుర్గుణాల ప్రతీతి (ప్రతీక )
అరి షద్వర్థాల కూడిక
అంతఃశత్రువుల మాలిక
ఆ కామ క్రోధ మోహ మద మాత్సర్యాల కలయిక
అంతం చేయాలి ఆ మన్మధుని ఇక
ఆ ఫాల్గుణ శుద్ద పౌర్ణమి ముందుగా
ఆమని ఆగమనానికి నాందిగా
ఆలోకించి ఆడాలి మనమందరమిక
ఆ సప్త వర్ణ శోఖిత చన్టనమిక
ఆస్వాదించి ఆశ్లేషించాలిక
ఆహ్వానించి ఆహ్హాదపడాలిక
అదియే అదియే హోళిక
అవధి లేదు మన ఆనందానికిక
అందరం జరపాలి వేడుకగా
ఆబాల గోపాలం వాడుకగా
గుడికందుల ప్రకాశం
9550894025