Jump to content

అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/ఊరొచ్చేస్తాంది...!

వికీసోర్స్ నుండి

కధ

కరణం కళ్యాణ్‌ కృష్ణకుమార్‌ 9848428978


“ఓరేయ్‌ ఈరేశం.. కాస్త ఆగరా... కాళ్ళు పీకుతున్నాయ్‌.. ఈ కొండరాయి మీద కూకుందాం” అంటూ రోడ్డు ప్రక్కన ఉన్న ఎత్తైన కొండరాయి మీద కూలబడ్డాడు రాధయ్య... “సరే ఈన్నే ఉండుమావా కొంచెం ముందుకెళ్ళి నీళ్ళేమన్నా దొరుకుతాయో సూసొస్తా”... అన్న ఈరేశం మాట పూర్తికాక ముందే... “వద్దులేరా..రెండు నిముసాలు కూలబడు.. ఎల్లిపోదాం” అన్నాడు రాధయ్య. పిడచ కట్టుకు పోయిన నాలికని తడపాలని, ఊరని లాలాజలం కోసం ఎండిన గొంతు చెలమలో ఆరాటపడుతున్న రాధయ్య చూపుకు వీరేశం చేతిలో నేల చూస్తున్న ఖాళీ సీసా వెక్కిరిస్తున్నట్లు కనిపించింది.

తలకీ మూతికీ కలిపి కట్టుకున్న తువ్వాలు తీసి చెమటలు కక్ముతున్నమొఖం తుడుచుకుంటూ “ఎంత దూర మొచ్చుంటాంమావా, శానా ఊర్లు దాటినంగానీ మనూరిప్పుడల్లా వత్తదంటావా “అంటూనే చుట్టూ పరచుకున్న ఎర్రటి ఎండకు మెరుస్తున్న కొాండలు , ఎండిన మట్టి పెళ్ళలూ + చూస్తూ దూరంగా రోడ్డుపై మోసం చేయాలని తపిస్తున్న ఎండమావుల్ని చూసి తనలో తానే నవ్వుకున్నాడు వీరేశం.

“ ఏంటి ఈరేశం.. అట్టా నవ్వుతున్నావ్‌...” చేవ లేని ఆ నవ్వుని చూసి అడిగాడు రాధయ్య,. “ఏంలేదు మావా ఇవన్నీ ఒకప్పుడు అడవులే అంటావా కంటిసూపు ఎంత సారించినా నీడిచ్చేసెట్టే లేకబాయే... మనం ఏడున్నాం మావా ఎడారిలో గాదుగదా!” వీరేశం అనుమానానికి రాధయ్య కూడా చుట్టూ చూసి తనలో తాను నవ్వుకుని సర్లే పద ఇలా కూర్చుంటూ పోతే రోజులెల్లిఫోతాయ్‌... అని అప్పటికే చెమట తుడుచుకోవడానికి తీసిన తలపాగాని చుట్టుకుంటూ..కొసను మూతికి కూడా చుట్టుకుని వీరేశం వెనుకే కదిలాడు, ఎల్ల లేవో తెలియని అనంత ప్రయాణం కానసాగింపుగా.

రాధయ్య, వీరేశంలు ఇద్దరూ ప్రకాశంజిల్లాలోని కరువు ప్రాంతమైన కనిగిరి సమీపంలోని పామూరుకు చెందిన రైతులు. రాధయ్యకు యాభై రెండేళ్ళుంటాయి. రాధయ్య అల్లుడే వీరేశం. వీరేశానికి ఇరవే ఏడేళ్ళుంటాయి. గ్రామంలో కరువు తాండవించడంతో నమ్ముకున్న భుమి కడుపు నింపడం లేదని ఏదో ఒకటి చేసి పట్నం. వెళ్ళి బ్రహ్మాడంగా బ్రతకొచ్చని ఆశ మొలకెత్తి, భార్యా పిల్లలని సొంత వూర్లో వదిలేసి, హైదరాబాద్‌ వెళ్ళి బిల్టింగ్‌ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. అనుకోని పరిన్టితుల్లో మాయదారి రోగమేదో వచ్చిందని, పని లేక, పస్తులుండలేక సొంత వూరి బాటపట్టారు లక్షల్లో ఇద్దరై. ఏ ప్రకృతీ వారిని మెత్తగా పలకరించలేదు. ఏ పిల్లగాలీ వారి చెమటను తల్లి కొంగై తుడవలేదు. ఏ చినుకూ యాత్రికుడై తరలివస్తున్న వారి కోసం వారబోసి ముందరి నేల తడిపి స్వాగతం పలకలేదు. రోళ్ళు పగిలే రోహిణీ ఎండ .. పురి విప్పిన నెమలై నాట్యం చేస్తోంది. అయినా నడక.. నడక..నడక. .. ఎడతెగక సాగిపోతున్న వారెవ్వరినీ ధగధగమంటున్న ఎండ మాత్రం ఏం చేయలేక పోతోంది. వారి సహనం ముందు ప్రతి రోజూ ఓడిపోతూనే ఉంది. వారి కాలికింద అసహానంగా నలిగిపోతోంది. ఆ సమయమంతా వారిద్దరికీ కనిపిస్తోంది ఒక్కటే... వారి గమ్యం సొంతూరి పొలిమేర.


“ఒరేయ్‌.. ఈరేశం అదిగో దూరంగా ఏదో ఊరు కనిపిత్తాంది.. పొద్దు పొడుత్తాడంది.. ఆ ఊరెళ్ళి అడిగితే ఏ మంచి మనిషో మనకి సాయం చేయకపోడు. తినడానికి ఏం దొరక్క పోయినా. కాసిని నీళ్లన్నా దొరికితే కాస్త సత్తా వత్తది. ఏ గుడికాణ్ణొ పడుకుని పొద్దున్నే ఎలాదం” అన్నాడు రాధయ్య,. “అట్నే మావాా,... అటే ఎళ్లాం పదా”. అని అటుగా నడక మొదలెట్టాడు మామ రాధయ్యని అనుసరిస్తూ వీరేశం. నడిచి నడిచి చెప్పులు కరచి కాలిన బొబ్బల్లా మారిన పాదాలు పగిలి రక్తపుగూడు కట్టుకున్నాయి. అప్పటికే దాదాపూ రెండు వందల కిలోమీటర్లు వారం రోజులుగా నడుస్తున్న ఆ కాళ్ళు శ్రమని మరచిపోయాయ్‌.


కనిపించిన గ్రామంలోకి వెళ్ళామనుకుంటే.. గ్రామం మొదల్లోనే పెద్ద ముళ్ల కంచె వేశారు.. ప్రపంచం నుంచి తనని తానే వెలేసుకున్న ఆ గ్రామ పొలిమేర చూసి బాధేసింది ఇద్దరికీ. అంతలో అక్కడ కాపలా ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ “ఎవర్రా మీరు గ్రామంలోకి రావడానికి వీలులేదు వెళ్లండీ.. వెళ్ళండీ...” అని గదమాయించాడు.


“అయ్యా మంచినీళ్ళు కూడా దొరకలేదు పొద్దుటాల్నుంచి, కాస్త మంచిళ్ళు ఇప్పించండీ” అన్నాడు. వీరేశం. ఏమనుకున్నాడో గానీ ఆ ఖాకీ దుస్తుల్లోని పెద్దమనిషి వెంటనే “నాకూ నీళ్ళు లేవయ్యా పొద్దున తెచ్చుకున్న నీళ్లూ అడుక్కు వచ్చినయ్‌.. ఓ పని చేయండి ఈ మూలాటంగా ఎళితే మంచి నీళ్ళ 'సెరువుంది.. అక్కడికెళ్ళి నీళ్ళు తెచ్చుకోండి” అని సలహా ఇచ్చాడు... చెరువు అనగానే పని దగ్గరమినరల్‌ వాటర్‌ బబూల్స్‌ లోని నీళ్ళు తాగటం అలవాటైన ఇద్దరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు.” ఏం కాదు సామీ .. అది మంచి నీటి చెరువే మా ఊరోళ్ళు బాగు చేసుకున్నారీ మధ్య ఎల్లండి, త్వరగా నీళ్ళు తీసుకుని వెళ్ళిపోండి” అన్నాడు.


కానిస్టేబుల్‌ చెప్పినట్లే... కొద్ది దూరంలో ఉన్న చెరువు చూసి ఉబ్బి తబ్బిబ్బాయ్యారిద్దరూ..ఆ చెరువు నీరే పరమానందంగా తాగి ముఖాలు కడుక్కుని తమ వద్ద ఉన్న రెండు బాటిళ్లలో నీరు నింపుకుని కొద్ది దూరం వెళ్ళి హైవే పైకి ఎక్కి మరలా నడక మొదలెట్టారు. అంతలో వెనుక నుండి వెళ్తున్న రిక్షా వీరిద్దరినీ దాటినాక ఆగింది.ఎవరో ఇద్దరు ముసలోళ్ళు. రిక్షా తొక్కుతున్న చిన్న కుర్రోడు రిక్షా ఆపి దిగి పరిగెత్తుకుంటూ రాధయ్య వాళ్ల దగ్గరికి వచ్చాడు. " ఓ భయ్యా.. పీనేకా పానీ దోనా.. మేరా నానాం నానీకో ప్వాస్‌ లగే హై యే బంద్‌ కే వజైసే సుఖాసే పానీచ్‌ నై మిలా” అన్నాడు... వాణ్ణి చూడగానే ముచ్చటేసింది.. హైద్రాబాదీ హిందీ అలవాటైన రాధయ్యా..” క్యోం నహీ.. మీలేగా.. జరూర్‌.. ఆప్‌ లోగో కహాసే కహా తక్‌ జానే వాలే..?” అని అడిగాడు... ఎలా అర్ధమైందో వెంటనే “ఓ తెలుగు వాలా.. మేమూ ఉత్తరప్రదేశ్‌ నుంచి వస్తయ్‌.. తమిళనాడు వెళ్లై..” అని తెలిసీ తెలీని తెలుగు భాషలో ఎంచక్కా చెప్పాడు.. వాణ్ణి చూస్తూనే చేతికి బాటిల్‌ అందించాడు రాధయ్య. టమ మాత్రు భాష వారికి జీవితంలోని అత్యంత అవసరమైన పరిస్థితుల్లో ఎంతగ్గా ఉపయోగపడిందో.. ఆ పిల్లాడి కళ్ళను చూసే వారికి మాత్రమే అర్థమవుతుంది.


వాడు పరిగెత్తుకెళ్ళి రిక్షాపై పడిపోయి ఉన్న వాడి నాయానమ్మకు


బాటిల్‌ లోని నీళ్ళు తాగించాడు.. “ బంద్‌ కే వజైసే సబ్‌ లోగ్‌ చలే గయే. హం అకేలే హోగయే.. బచ్చే కే వజైసే హమారా ద చలా జారే..! అనీ చెప్పాడు ముసలాయన అప్పటికే రిక్షానీ సమీపించిన వీరిద్దరితో..! “ఘుడత్రియా.. అని దణ్ణం పెట్టి = క్రేలబ్రో యే ఫల్‌... “అనీ చేతిలో యాపిల్‌ ఇవ్వ బోయాడు.. “నై నై బహుత్‌ దూర్‌ జారే.. రథ్‌ బే భయ్‌..” అని చెప్పి వారిని పంపి .. తమ నడకను కొనసాగించారు. నీరాటంకంగా నవక కొనసాగిన కొన్నీ గంటల తర్వాత ఓ ఐస్‌ షెల్టర్‌ కనీపించదంతో అక్కడ పడుకుందామని నిర్ణయించుకున్నారు ఇద్దరూ.

“సరే మావా నేనుకూర్చుంటా నువ్‌ కాసేపు తాంగో..” అంటూ అప్పటికే ఆగిపోంఎన సెల్‌ వంక చూస్తూ “* తొందరగా ఇంటికాచ్చేయండయ్యా చంటిది ఎదురుచూస్తున్నాది” అన్న భార్య మాట్లాడిన చివరి మాటలు గుర్తు తెచ్చుకుంటూ తుండు. బస్టాండ్‌ అరుగుపై విధిలించి కూలబడ్దాడు. అప్పటికే మరో సిమెంట్‌ అరుగు మీద వాలిన రాధయ్యకు తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.. మనం ముందుకెళుతున్నామా.. ? వెనక్కా.? పదవ తరగతి రెండు సార్లు తప్పిన రాథయ్య, అల్లోచన వెల్లువలో కొట్టు మిట్టాడాడు.. తన చిన్నతనంలో చూసిన రోజులు ఇప్పుడు మరలా గమనీంచడం ఆశ్చర్యం వేసింది. (గ్రామాల్లో వెలేసిన కుటుంబాల పరిస్దితి గురొచ్చింది.. చెరువులో నీరు త్రాగటం... పచ్చని చెట్ల నీడలూ గురొచ్చాయ్‌.. ఆ ఆలోచనల వరదలో పొలం గట్టున బురద పూవై పూసిన నాయన గుర్తొచ్చాడు.

XXXX

“నాయానా... అమ్మా. నేనాచ్చాం.. ఆం తిందాం రా” అన్న గ ఏళ్ళ రాధయ్య పిలుపుతో “వచ్చున్నారయ్యా.. చెట్టుకిందకూకోండి.. వచ్చేచ్చున్నా.” అంటూ పచ్చని పొలాల్లోకి కాలువ నుంచి నీరాదిలి.. ఫారతో గాళ్ళు సర్ధి... కాలువ నీళ్ళతో చేతులు కడుక్కునీ వచ్చి పెళ్ళాం తెచ్చిన బువ్వ తింటూ కొడుకుని (పేమతో చూస్తూ... కళ్ళెగరేసిన వీరయ్యతో... “చేతికున్న మట్టి కడుక్కో నాయనా, కూల్లో అయ్యోరు సెప్తిరిగందా” అన్న రాధయ్య తో....”ఈ మట్టేరా మనకి అన్నం పెదతాంది.. మనకేమైద్ది.. ఏంగాదు నాయనా “* అన్నాడు వీరయ్య.

ఆశ్చర్యంగా చూస్తున్న రాధయ్యను.. “ఇదిగో చూడు సిన్నోడా.. బూమితల్లిని నమ్ముకున్నోడికి ఎప్పుడూ అన్నాయం జరగదురా.. కట్టాలంటావా వత్తంటయ్‌ ఫోతాంటయ్‌.. ఏం రమనమ్మా..” అన్నాడు మధ్యలో పెళ్ళాన్ని పలకరించి... “అవునయ్యా సత్తెం” అంది పెనివిటి పలుకే పరమాన్నమన్నట్లు. తానుతింటూ తింటూ మధ్యలో చెరో ముద్ద మెట్టాదు వీరయ్య..! రమణమ్మ సిగ్గుతో కొంగర్లు చుట్టుకుపోగా.. వీరయ్య బుజమెక్కి ఉప్పమ్మ ఉప్పు.. అనీ ఊగసాగాడు రాధయ్య,.

“సరే నేను సాయంకాలం వస్తా గందా.. మీరు ఇంటికి పోండి.. జాగ్రత్తగా సరేనా... నువ్‌ కాసేపు అయ్యోరు జెప్పింది సదువుకో... నువ్‌ సదువుకుంటే మనకట్టాలు దీరతాయ్‌” అన్న వీరయ్యతో క్త సరే నువ్‌ తారగా ఇంటికి రా నాయనా..”అంటూ నవ్వుకుంటూ వెళ్తూ తండ్రిని చూస్తూ.. “టాటా” అంటూ తల్లితో వెళ్ళిన రాధయ్య తం(డ్రి నవ్వుని మఠలా చూళ్ళేదు... పలుకు వినలేదు. అప్పటికే మార్కెట్‌కి పంపిన ధాన్యం గిట్టుబాటు రాలేదని తెలిసి .. అప్పుల వాళ్ళు వేధిస్తారని భయపడి పురుగుమందు తాగి బలవన్మరణం చెందాడు వీరయ్య. పొలంలోనే తరతరాలుగా వారి వంశం నమ్మిన భూమి ఒడిలోనే.

నాన్నజ్ఞాపకాలతో _ ప్రతిరోజూ పొలం గట్టున తచ్చాడి వెళ్ళే వాడు రాధయ్య. కాస్త ఊహ వచ్చాక తెలిసిందేంటంటే అప్పటికే అప్పులోళ్ళు ఉన్న పొలంలో ఎకరం మిగిల్చి అంతా లాగేసుకున్నారు.. అందుకే పొలం వనులంటే గిట్టదు దాధయ్యాకి. వీరయ్య మోతుబరిగా తిరిగిన ఊర్లోనే వ్యవసాయ కూలీగా ఏ నామూవష్షీ లేకుందా వెళ్ళిన రమణమ్మని చూసి ఎదిగాడు రాధయ్య. నాయన్ను మింగిన పొలం అంటే అసహ్యం పెంచుకున్నాడు. దీనికితోడు కరవు తాండవించడంతో రైతుల జీవితాలు అనేక ప్రాంతాల్లో దుర్భరంగా మారాయి. అందులొ విరి మండలం ఒకటి. చివరకు పట్నంలో అయితే బాగా సంపాదించవచ్చని వలస బాటపట్టాడు రాధయ్య.

“ఏంది మావా... కంట్ల నీళ్ళుగారుతున్నాయ్‌.. అత్తగాని

గుర్తొచ్చిందా ఏందీ..” అన్న వీరేశం మాటలతో స్పగతంలోకి వచ్చిన రాధలయ్యా.. లేదల్లుడూ మీ తాత గుర్తొచ్చాడు..”అనలు మనం అమ్మలాంటి ఊరాదిలి ఏదో బావుకుందామని వట్నం ఆ.. పాలీ...నగరం ఎల్లాం గందా.. ఏం సంపాదించినం.. సెప్పు... ఏరా మాట్టాడవ్‌..? నిజమే గందా..? ఏవన్నఎనకేసినమా.. ? లేకబాయె? మహో అయితే మత్తు కోనం ఎవ్చుదన్నా కాత్తంత మందు తాగినమంతేదప్ప.. ఏమన్నా సంతోషంగ గడివినమా ..? లేదే..! ఇదిగో ఇంతలో ఈ మాయదారి రోగమొచ్చింది ..ఏం రోగమ్రా అదీ. ??*

“కరోనా మావా..”

“ఆ అదే.. కరవనా అంటూ అది కరిసేసే సరికి తింటానికి తిండి లేక, ఉంటానీకి కొంపగోడు లేక, ఇంద ఇట్లా రోడ్డున బడుళ్లా.. ఎవరికి ఎవరూ పట్టనట్లు... మనిషికి మనిషిని దూరం చేసేసిన ఈ మాయదారి రోగం మంచే జేసిందో సెబరే చేసిందో... గానీ అందర్నీ ఊళ్లకి బంపిత్తాంది..

“ అదేందిమావా.. మనవొళక్మళ్లమా ఏందీ పెపంచకవేం గజగజలాడిపోతావుళ్ళా.. మనమే గందా కాస్త పుష్టిగుందాది”

“అవున్రా... ఈరేశం.. మనం మనూరాదిలి మన మట్టి మాలచ్చినొదిలి వడకనో బోతే ఎవడూ పట్టించుకోకుండా, ఎవడూ చుక్క మంచిళ్ళియకుండా వదిలేత్తే అమ్మే గదరా మనల్ని రారమ్మని విలుత్తాంది”.

“అవును మావా నిజమే...మానాయన పొలానికెళ్ళి పోగ్గాట్టి సచ్చిపోయిండనే గందా.. నేనూ నీ యెనకాలొచ్చినా. నాయన సానా సార్గు జెప్పుళ్ళా, ఉన్న ఊర్లో పొలం పనిచేసుకుని కలో గంజో తిన్నా బతికేయొచ్చురా, జనానికి బువ్వ బెట్టేటోళ్లం మనమే పంజేయకుంటే ఎట్రా కొడకా అనేవోడు నాయన. ఎంత అవసరమొచ్చినా ఏడికీ ఎల్లమాకా నేలతల్లిని నమ్ముకో అని జెప్పుళ్ళా.. మనసేడాగింది.. దబ్బు కోసం... నీకూతుర్ని. నా వీద్దని వదిలేసి ఊర్ల బడ్జా.. ఇగో ఇప్పుడు మనం సచ్చినా ఎవరికీ తెల్టుగా మావా.. ?” పది రోజుల్లో కనీసం పలకరించినోడు లేకబాయె నీళ్ళిచ్చినోడు లేదాయె ఎవరికెవరం మావా , తెల్లారిద్దో లేదో తెలియకుండె గందా..!” అంటున్న వీరేశం

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఉ పఏప్రిల్‌-2021 |

కళ్ళు వర్షాకాలం పంట కాల్పలయ్యాయి.. గొంతు... చలికాలం గాలి చుట్టుముట్టినట్లు వణకసాగింది.

అల్లుడికి సర్ది చెప్పి పడుకోబెట్టాదే గానీ.. రాధయ్య మనసు వముననులో లేదు..” అచ్చల మంది నగరాలకని బోతే.. ఫొలాలేడుంటాయ్‌.. అదవులేదుంటాయ్‌... నీళ్ళేడుంటాయ్‌... మన ఊరినీ మనవే పట్టించుకోకపోతే... యేేచే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవడంలో తప్పేముందీ” అనీ అనుకున్నాడు...

వళ్లు

ఆశల రేడు ఆది యోగి చీకట్ల నుంచి మరలా వెలుగు వైపు ప్రయాణం మొదలెట్టాడు. గబాగబా నడుస్తున్నారిద్దరూ. లక్ష్యం తప్ప వేరే ధ్యాస లేదిద్దరికీ. సచ్చే లోపు ఊరి పొలిమేర చూడాలి అదొక్కటే వారికి ఇప్పుడు కనీపిస్తోంది. బాధంతా పంటి బిగువున దాచేసి. భయం మొత్తం భుజానికి వేళాడుతున్న బ్యాగుల్లో నెట్టేసి జిప్‌ వేసి.. నడక... నడక... నడక. తమ ఊరు..తమని కన్నజఊోరు.. తమకి లాలపోనిన ఊరు.. తవముకి మాట నేర్పినఊోరు... ఆట పాట నేర్చినఊరు.. సదువు జెప్పిన ఊరు... పుస్తైలై ఎదురు చూస్తున్న ఊరు.. కళ్లు పిల్లలై గడపకి వేలాడిన ఊరు... ప్రతీ అడుగుళకూ పలకరింపుల ఊరు... భక్తి వసపోసిన ఊరు.. అదిగదిగో... ఊరి గుడి.. అదిగదిగో సదివిన బడి దూరంగా పొలిమేర నుంచి కనిపిస్తున్న పరిమళం. ఊరిలోంచీ వస్తున్న నేపాలీ గూర్ధా కనిపించాడు... “మనకి కనిపించని నేల అతణ్ణి ఎలా పోషిస్తోందీఅన్న ప్రశ్న ఇద్దరి గుందెల్నీ ఓసారి మెలిపెట్టింది. అడుగుల్లో వేగం పెరిగింది.

పరిగెడుతున్న రాథయ్య కళ్ల కాళ్ళు అకస్మాత్తుగా ఊరి పొలిమేరలో చచ్చుపడినట్లు ఆగిపోయాయి. పొలిమేరలో రాళ్ళు రప్పలతో నిండిన ఆనాటి పచ్చటి పొలం .. నాయన సోయాక ఎదారై నోరెళ్లవెట్టిన అన్నదాత.. నాల్రోజుల రోజుల క్రితం దాహంతో అల్లాడిన తన పరిస్థితి గుర్తొచ్చి భోరున ఏడుస్తూ ఎండిన నేలమీదకు పరిగెట్టి నేలపై పడి ముద్దు పెట్టుకున్నాడు రాధయ్య. నాయన నవ్వ కనీపించింది. నెత్తిన ముద్దు పెట్టుకున్న అనుభూతి తారసలాడింది. ఆగనీ దుఖం పొంగి ఆ నేల పాదాలను కడిగేస్తోంది.

“ఏమ్టైంది మావా.. అంటూ మావ వెనుకాలే పరిగెత్తుకొచ్చి నేలపై బడి కన్నీరు మున్నీరవుతున్న రాధయ్యను ఓదార్చే ప్రయత్నం చేన్తున్నవీరేశంతోబ” చూడరా బూమితల్లి గుండె ఎట్టా పగిలిపోయున్నాదో. మీ తాత కలల పొలంరయ్యా ఇది.. అని ఒకవైపు అల్లుడికి చెబుతూనే మరో వైపు నేలను ముద్దాడుతూ “నాయనా నీ మాటా దాటి ఏదకెళ్ళనయ్యా.. ఈ మట్టి మాలచ్చినొదిలి యాడికి బోనయ్యా” అంటూ బోరున విలపించసాగాడు.

రాధయ్య చేష్టలతో విస్తుపోయిన వీరేశానికి ఇంటి దగ్గర .”పెనివిటీ” అని ఎదురు చూస్తున్న పెండ్లాం గుర్తు రాలేదు... నెలల పనిగుదర్జా గుర్తు రాలేదు. వరిగెత్తి పరిగెత్తి వచ్చిన ఊరు గుర్తురాలేదు... తన పొలం గుర్తొచ్చింది... నాయన ప్రాణంలా చూసుకున్న మట్టి మారాణి గుర్తొచ్చింది. తన పొలాన్ని ఒక్కసారి చూడాలనిపించింది. అకస్మాత్తుగా ఫొలం వైపు గట్టున పడి పెద్దగా రోదిస్తూ. పరుగు లంఘించాడు. ఎండపిట్ట తనకి మబ్బుల రెక్కల్ని అడ్డు పెట్టుకుని... చిన్న చిన్న చినుకై ఆనంద బాష్టాఖి షేకం మొదలెట్టింది.