అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/ఈ చదువులు మాకొద్దు

వికీసోర్స్ నుండి

వారసత్వ సంపద

డా౹౹ పి. శివరామకృష్ణ 'శక్తి ' 94414 27977

'ఈ చదువులు మాకొద్దు '

భూగోళంలో అడవులు, బీళ్ళు, నీళ్ళు; ఈ సహజవనరులే అధికశాతం. సంపద సృష్టించటం అనే పేరిట మనం పెంచిన ఆస్తులు తక్కువే. కాని అవి చేస్తున్న హాని ఎప్పుడో హద్దులు దాటిపోయింది. ఈ సహజ వనరులలో ఉత్పత్తులు సేకరించుకుని పొట్టపోసుకునే అభాగ్యులను మనం తరిమేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న వినాశం అదుపులోకి రావాలంటే, రెండు డిగ్రీల ఉస్ణోగ్రత తగ్గాలంటే, మనం పారిశ్రామిక యుగం ముందు దశకు పోవాలని/చేరాలని ఒప్పందాలు, చట్టాలు, లక్ష్యాలు మొత్తుకుంటున్నాయి. ఆ లక్ష్యాలు అందుకోవాలంటే అ అభాగ్యుల జీవన విధానం నుండి నేర్చుకోవటమే ముక్తి మార్గం. ఆ దారి స్పష్టంగా కనిపిస్తున్నా,ఇంతకాలం పెడదారి పట్టిన మనబుద్దులు, చదువులు మారటం లేదు. అస్తి మీది మమకారంతో పాటు పేరు, పదవి, కొలువు, గుర్తింపు తాపత్రయం కొంతైనా వదులుకుంటేనే కాని అది సాధ్యం కాదు.'సమాజం దిగబెరుకుతుంటే, సాహిత్యం ఎగబెరకదు '(కొ.కు).మన కవిత్వం మేడిపండు-మనదరిద్రం రాచపుండు'అంటూ చిరకాలంగా హెచ్చరిస్తున్నా, మనం ఇంకా వేళ్ళు చీక్కుంటూ, ఎముకముక్క కొరుక్కుంటూ మన చదువులూ, అదిసృష్టించే ఉద్యోగాలు, మేధావులు, సాహిత్యగాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం.

కొత్త రూపాలలో పాత చదువులు.

పారిస్‌లోని ఇనాల్కొ లో ఆచార్యుడు డానియల్‌, హైదరబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని దళిత ఆదివాసీ అద్యయన కేంద్రంతో కలిసి, 'కొండకోనలలో తెలుగు గిరిజనులు చెంచు పాటలు 'గిరిగింజ గిరిమల్లెలు 'ఫ్రెంచ్‌లోకి అనువదించటానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందకాలం పొడిగింపుకు ఆయన వెళ్ళినపుడు, నన్నూ తీసుకోని వెళ్లారు. అక్కడ నుంచి ఆ ప్రాంగణంలోగల సెంటర్‌ ఫర్‌ ఈ -లెర్నింగ్‌లో భాషాశాస్త్రవేత్త జంధ్యాల ప్రభాకరరావుగారిని కలిశాం.

“ప్రతి చోటా ఇండిజినస్‌/మూలవాసుల మీద ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు; మీరేమన్నా సాయం చేయగలరా!” అని ఆయన అడిగారు. అంతకుముందే తెలిసిన మానవశాస్త్రశాఖలో విశ్రాంత ఆచార్యుడు శివప్రసాద్‌ అక్కడే ఉన్నారు...

ఈ మూలవాసుల జ్ఞానం, ఆయా స్థల కాలాలు ,వలసలతో ముడిపడి ఉంటుంది.కాబట్టి వారు తిరిగే స్థూల పేర్లు సంప్రదాయ సరిహద్దులు, వలసపోయే దారులు, అనుమతులు, పంపకాలు,తగవులు తీర్చుకునే ఏర్పాట్లు వీటిని చూపించటానికి, ఒక జాగ్రఫీ నిపుణుని సహాకారం కావాలి అని నేను ప్రతిపాదించిన వెంటనే ,సెంటర్‌ ఫర్‌ రీజనల్‌ స్టడీస్‌ లో ఆచార్యులు అరవింద్‌ సుసర్లను ఒప్పించారు.మేం పదిసార్లు పైగా కలిసి ఒక డిష్లామా కోర్స్‌ ప్రవేశపెట్టటానికి పాఠ్యక్రమం తయారు చేసాం. ఇంతలో నేడు “శక్తి 'లో నా బాధ్యతలు పంచుకుంటున్న ఉపగ్రహ అధ్యయనంలో యువ శాస్త్రవేత్త అల్లూరి వరుణ్‌ మాతో కలిసారు. అతడ విశాఖజిల్లా తీరంలో జాలర్లతో, నల్లమల అడవులలో చెంచులతో తిరిగి వారి దేశకాలాలను అర్ధం చేసుకున్నాడు. మేమంతా రాతపని మొదలెట్టే సరికి కరోనా అడ్డుతగిలింది. అయినా ఎవరి పని వారుచేనుకుంటూ ముందుకు వెళుతుంటే, చెంచులకు వీటిమీద దీర్జకాలం శిక్షణ ఇచ్చే కార్యక్రమం వచ్చింది.ఇంతలో ఈ చట్టాలు, విధివిధానాలను పక్కనపెట్టి, పోలవరం ప్రాజెక్ట్‌ కింద మునిగిపోతున్న గ్రామాలను కూల్చివేసి బలవంతంగా తరలింపును నిలిపివేస్తూ, మా పిటిషన్‌ పై, హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాజ్యం, ముందు ముందు ఈ చట్టాల అమలుపై మరింత స్పష్టత తీసుకుని రావచ్చు.

అచరణలోకి తేవలసిన అధ్యయనాలు, చదువులు.

గ్రామనామాల అధ్యయనానికి కేతు విశ్వనాథరెడ్డి గారి కడపజిల్లా ఊళ్ళ పేర్ల మీద చేసిన కృషి భూమిక. ఆయన కథా రచయిత. అరసంలో విశాలాంద్ర ప్రచురణలలో కీలక పాత్ర వహిస్తున్నారు. కాని “పోడు మాజన్మ హక్కు అని ఉద్యమాలు నిర్వహించిన వామపక్షాలు గిరిజనుల జ్ఞానం మీద ఆధారపడిన హక్కుల సమగ్ర గుర్తింపుకు కాక పోడు భూములకు పట్టాలిప్పించే పనికి పరిమితమ్హైనారు. విశ్వవిద్యాలయాలలో మానవ శాస్త్ర శాఖ తన విద్యార్దులను నెల రోజులపాటు మూలవాసులమీద క్షేత్ర కృషి చేయిస్తుంది కాని, ఇంతవరకు ఎక్కడా ఈ వైపు దృష్టి సారించలేదు. ఇటువంటి పరిస్థితిలో కొన్ని స్వచ్చంద సంస్థల వత్తిడితో ప్రభుత్వం అరకొరగా ఈ మూలవాసుల జ్ఞానాన్ని వారి హక్కులను గుర్తించే ప్రయత్నం చేస్తుంది.

కొత్త చదువులు - స్వానుభవాలతో రచనలు. కవితలలో స్పందనలు- ప్రశ్నించటం మరిచి పోయిన పిల్లలు.

కాని నూటికి నూరు శాతం ఫలితాలు సాధించటంలో మునిగి పోయిన ఉద్యోగులు, స్వానుభవాలు తప్ప సంస్కృతి పట్ల ఆసక్తిలేని వారి రచనల ప్రభావం గిరిజనులలో తమ సంస్కృతిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నాన్ని అణచి వేసింది. (కొన్ని కలలు, మెలకువలు - చిన వీరభద్రుడు. ఎమెస్కో) ఈ పోకడల పరిణామాలకు బాధపడుతున్న ఒక అధ్యాపకుని వేదన, ఈ చదువులు అడవిపిల్లలను మరబొమ్మలుగా మార్చిన తీరును చిత్రిస్తుంది.” గిరిజనపిల్లల్లో ఉండే పట్టుదలను ప్రిన్సిపాల్‌ channelise చేయగలిగాడు. అయితే ఈ పిల్లల్లో సృజన సామర్ధ్యాలను పెంచటంలో జరిగిన కృషి పెద్దగా ఏమీలేదు. పిల్లలు ఎంత మెటిరియల్‌ ఇచ్చినా చదివి పారేస్తారు తప్ప స్వయంగా అలోచించరు.ఫలితాల సాధన అనే మహత్తర లక్ష్యం వారిముందు ఉండటం చేత విద్యార్దుల creatiity ని ఆలోచించే వ్యవధిని వారు తీసుకోపోలేక పోయారు.

పిల్లలు ప్రశ్నించటం మరిచి పోయారు. జ్ఞాపకం ఉండటమే జ్ఞానం అనే స్టితికి చేరుకున్నారు. తరగతిలో పాఠం వింటున్న పిల్లలకు ప్రశ్నలు పుట్టటం లేదంటే వారి thinking faculties ఆగిపోయాయని ఒకవేళ ప్రశ్నించమని ప్రోత్సహించినా ఏం అడగాలో తెలీని పరిస్థితిలోకి పిల్లల మెదళ్ళు మూసుకుపోయాయి. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో ఫలితాలు సాధించిన కళాశాల సాధించిన దేమిటి? గిరిజన విద్యార్థులను వారి అభ్యసన పద్ధతులను జాగ్రత్తగా గమనిస్తే మనకొక సంగతి అవగతమౌతుంది. ఈ పిల్లల భాషా సామర్థ్యాలు కనిష్ట స్థాయిలో ఉన్నాయి. తమది కానిభాషలో వీళ్ళు విద్యనేర్చుకుంటున్నారు. మాతృభాష ప్రభావం ఈ పిల్లల మాధ్యమ భాషమీద బలంగా పడుతున్నది. మాతృభాషలో ఉండే కల్పనలు విద్యాభాషమీద ఉండటంతో ఈ భాష పిల్లలకు క్లిష్టంగా మారింది. ఈ క్లిష్టత వారిలో న్యూనతకు కారణమౌతున్నది? (కారేపల్లి కబుర్లు 2012 పుట 39-40 ) ఇంత బాధపడిన ఈ అధ్యాపకుడు “లంబాడి గేయసాహిత్యం” చదివి కొన్ని పలుకుబడులైనా పాఠం చెప్పేటప్పుడు వాడుతుంటే పిల్లలు కొంతైనా అల్లుకుపోయేవారు. ముందుమాట 'ఏ టిచర్స్‌ డైరీలో కూడా “విద్యార్దుల భాషాసాంస్కృతిక సామాజిక నేపథ్యాల పట్ల అధ్యాపకులకు అవగాహన ఉండాలి , వారి పూర్వ జ్ఞాన పరిశీలన చేసి అంచనా వేయాలి” అంటూ చిలక పలుకులు వల్లించారు. జిల్లాలో జరిగే సైన్స్‌ ఫెయిర్‌లలో గానీ, వార్షికోత్సవాలలో గాని గిరిజనుల ప్రతిభలను ప్రదర్శించే కార్యక్రమాలను ప్రొత్సహించలేదు. పిల్లలు వాళ్ళ ఆట పాటలేవో వాళ్ళు ఆదుకునేవారు. వాటిని ఎవరూ పట్టించుకోలేదు.

ప్రభుత్వం చెక్కిన బొమ్మలు-మూసుకున్న దారులు.

పల్లెప్రజలు, ముఖ్యంగా గిరిజనులు, “చట్టాలకు, ప్రభుత్వానికి కట్టుబడి ఉండే సమాజంగా పరిణామం పొందుతున్నారు. ప్రభుత్వ కేటాయింపులపైనే ఆధారపడే తెగలుగా, శతాబ్టాలుగా ఉత్పత్తి రంగంలో నిలదొక్కుకున్న ఒక సమాజం, దయారహితంగా ఆ రంగం నుండి బహిష్మరింవబడి, ఎస్టేట్‌లలో బానిసలుగా కాని, ప్రభుత్వరంగం అట్టడుగుపొరల్లో గుమస్తాగా గాని రూపాంతరం చెందుతున్నారు” (కొండదొరసాని. సాహిత్య అకాడెమీ2011 పుట13)అంటూ ముందుమాటలో విచారపడుతూ వారు తమదైన కొత్తమార్గం వెతుక్కోవాలని ఉద్బోధిస్తారు.

దిద్దుబాటు చర్యలు -

అభివృద్ది వికటించి పర్యావరణం ఘోరంగా దెబ్బతినటంతో ప్రపంచమంతా దిద్దుబాటు చర్యలు మొదలైనాయి. 2003లో వచ్చిన జీవవైవిధ్య చట్టం వనరులమీది సంప్రదాయ జ్ఞానానికి పట్టం కట్టింది. అప్పటివరకు ఆక్రమణ దారుగా చూసిన ప్రభుత్వం, అడవిలో ఆదివాసుల వాడుకలను గుర్తించటానికి 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం తెచ్చింది. ఇందుకోసం ఆయా స్థూల 'పేర్లతో సంప్రదాయ గ్రామపటం గీసి, అక్కడి ఉమ్మడి వ్యక్తిగత వాదుకలు పేర్కొని దరఖాస్తుకు జతచేయాలి అని నిర్దేశించింది.

కాని చదువుకున్న ఉద్యోగం చేసే గిరిజనుల, అది అమలు చేసే అధికారుల మెదళ్ళు మూసుకుపోయాయి. వారికి గిరిజన సంస్కృతి యొక్క వ్యక్త రూపాలు స్థూల పేర్లు మెట్టలు, బసలు, బాసలు, కొత్తలు గుర్తుచేసే జ్ఞాపకాలు, సామెతలు పలుకుబడులు తట్టటం మానేసాయి. తలో దారిగా తూతూ మంత్రంగా వీటి అమలు జరుగుతుంది. జీవవైవిధ్య చట్టం ప్రకారం బీల, తంపర భూముల రక్షణకోసం ఉదృతంగా ఉద్యమం జరిగింది. ఎంతో సాహిత్యం వచ్చింది. కానీ వీటి నమోదు మాత్రం అంతంతగా సాగుతుంది. అందువల్లనేనేమో 'విష్లవాల సంగతి అటుంచి చిన్న చిన్న సంస్కరణలను కూడా సాహిత్యం చెయ్యలేదు( పుట 96) అని కొ.కు నిర్వేదం చెందాడు. సాహిత్యం, ముఖ్యంగా సాహిత్య విమర్శ ఆలోచన రగిలించాలి. మునుముందుకు నడిపించాలి అనే ఆశ అడియాసగా మారుతున్న తరుణంలో సహజవనరులపై ఆధార పడిన బతుకుతెరువుల మీద కృషి పాతదే అయినా కొత్తరూపాలలో కొత్త ఆశలు కల్పిస్తున్నది.

అయితే దళితులు, ఆదివాసీలు, బహుజనులు ఈ కృషిలో పాలుపంచుకున్నప్పుడే ఈ కృషి సఫలమౌతుంది. దానికి ఇంతకాలం చదివిన చదువుల, కొలువుల డొల్లతనం అర్దం కావాలి. ఈ చదువులు మాకొద్దు అంటూ వాళ్ళు మూలాలు వెతుక్కోవాలి.

సమరసతా నానీలు

నీలోని
నీవు కూడా నేనను
“భావం సమరసం”
ఇంటి పేరు
ఒక్కటయితే చాలు!
నా కులమని
సంబరమెందుకు?
కులవివక్షతలకి
విరుగుడు
విద్వేషమా?
సమన్వయమా?
అంబేద్మర్‌
అనుసరణీయుడే!
అనుచరుల
అడుగుజాడలే!?
మనువాదం లేదు
మనుషులమే
రాజ్యాంగమే
మనకు నేటి స్మృతి
కొంచెపుబుద్దితోనే
కొట్లాటలు
సమరసభావముతో
సమైక్యత
కులపొత్తు
వివాహం వరకు!
కులాలపొత్తు
సమత్వం కొరకు!
అహం వీడితే
అందరు మనవారే
అయినా 'నేను”
విడువలేక పోతున్నం
అనుబంధాలు
పల్లెటూరిలో...
నగరంలోనేమో
బంధనాలు.....
కలిసి నడుద్దామన్నది
మన వేదం
విడగాట్టటమే
కొందరికి మోదం
సమత్వం
సాధించాలనుకుంటే
సంఘర్షణ కాదు
సమన్వయం దారి
కులాల కొట్లాటలన్ని
ఒక్కరి వల్లే
ఆ ఒక్కరు “నేను "తో
సహజీవులే
వృత్తిని బట్టి
పుట్టింది..కులము
ప్రవృత్తిని బట్టి
ఉంటుంది.. గౌరవము
విడగొట్టటమే
కొందరి సిద్దాంతం
వేలెత్తామా!?
మళ్ళీ రాద్దాంతం
మహనీయులకి
కులం వెతకటం
ఆధునిక
యుగలక్షణం..
పూర్వీకులు
జ్ఞానానికి విలువనిస్తే
అనాగరికుల్ని
చేసింది చరిత్ర
మేధావులై
కులగజ్జి రుద్దటమే
నేటి ఆధునిక
డెమోక్రసీ...
పక్కవాడు తొక్కేయటం
పాతమాట
అంతకన్నా ప్రమాదం
ఆత్మన్యూనత
ఆత్మన్యూనత
ఒక్కరినే బంధిస్తుంది
అహంభావం
అందర్నీ కాల్చుతుంది
నేను “ఎక్కువ
అనుకున్నావా!
నీ ఎదుగుదల
నీవే అడ్డుకున్నట్లు!
సమతా హృదయం
సాధించాలంటే
సమరస
టానిక్‌ తాగాల్సిందే
సమాజవృక్షం
బలపడాలంటే
గుండేవేర్లని
సమరసంతో తడపాలి

- సాకి 9949394688