Jump to content

అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/ఎరుకల భాష-మాతృభాషలో బోధన

వికీసోర్స్ నుండి

అమ్మనుడి పండుగ ప్రత్యేకం

డా. పి. వారిజారాణి

డా. వి. ఎం. సుబ్రహ్మణ్య శర్మ

ఎరుకల భాష-మాతృభాషలో బోధన


ప్రపంచంలో ఎన్ని భాషలున్నా దేని ప్రాముఖ్యత దానిదే. భాష మనిషి మనసులోని భావాన్ని వ్యక్తీకరిస్తుంది. ఇతర జీవులకు మానవులకు మధ్య వ్యత్యాసాన్ని చూపించేది భాషనే. ఎదుటి వ్యక్తి మాట్లాదే భాష శ్రొతకు అర్థమైతే చాలు. సంభాషణ కొనసాగి, భావాల ఆవిష్కారం జరుగుతుంది.

ఏ భాష ఐనా ఎక్కువ కాలం నిలిచి ఉండాలి అంటే, ఆ భాష తప్పకుండా వ్యవహారంలో ఉండాలి. భాషకు లిపి లేకపోయినా కనీసం మౌఖిక సాహిత్యమున్నా ఆ భాష కొంత కాలం నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడంటే, ఆభాషను పరిరక్షించే చర్యలను చేపట్టినప్పుడు మాత్రమే.

ప్రపంచీకరణ నేపథ్యంలో పురజన భాషలే వాటి అస్తిత్వాన్నీ క్రమేపీ కోల్పోతున్న తరుణంలో కొన్ని గిరిజన భాషలు వాటితో మమేకమైపోయి పురజన భాషా సంస్కృతినీ, సంప్రదాయాన్ని భాషను అవసరానికో లేదా ప్రతిష్ట కొరకు ఆశ్రయిస్తున్నాయి. అటువంటి భాషల్లో ఎరుకల భాష కూడా ఒకటి.

గిరిజన తెగలకు సంబందించిన భాషలను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయా భాషల గేయాలు, కథలు, సామెతలు, ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సంప్రదాయాలను తెలిపే అన్ని అంశాలనూ దృశ్య-శ్రవణ యంత్రాల ద్వారా సేకరించి, వాటిని నిక్షిప్తం చేయాల్చిన అవసరం ఉంది.

ఎరుకల భాష:

తెలుగు, తమిళ, కన్నడ భాషా పదాల మిశ్రమాన్ని కలిగి ఉన్నట్టుగా కనిపించినా ఎరుకల ఒక ప్రత్వేకమైన భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. తెలుగు ప్రాంతాల్లో దాదాపు అన్ని గ్రామాల్లో వీరు నివసిస్తూ ఉంటారు. పూర్వం కేవలం అడవి ప్రాంతాలకే పరిమితమై, ఇటీవలి కాలంలో జన సామాన్యంలో భాగంగా మారిన ఈ గిరిజన తెగను తెలుగు వారు ఎరుక, ఎరుకలు అని విలుస్తారు. తెలుగు ప్రాంతాల్లో ఎరుకల వారుగా వ్యవహరింపబడుతున్న ఈ గిరిజన తెగవారు తమను తాము “కుర్రు” గా పిలుచుకుంటారు.

ఏరుకలకు కొర, కుఱు, కొరవ, కొరచ అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. వేరు వేరు ప్రాంతాల్లో ఎరుకలను వేరు వేరు పేర్లతో పిలుస్తారు. మహారాష్ట్రలో కైకడీలు అని, పాండిచ్చేరిలో నిద్దనార్‌ అని , కర్ణాటకలో కోరమరాలు అనీ తమిళనాడులో కొరద, కొారచ అని శ్రీలంకలో వెల్లలు అనీ పిలుస్తారు. ఎరుకల పర్యాయ పదాల అర్ధాలను పరిశీలిస్తే జ్ఞానం కలవారని, భవిష్యత్తు చెప్పేవారని, సోదె చెప్పేవారని, త్రిప్పట జీవన విధానం కలవారని, పర్వత ప్రాంతంలో నివసించే వారని పాములను, పక్షులను పట్టేవారనీ, చాపను బుట్టలను అల్లేవారనే అర్ధాలు కనిపిస్తున్నాయి. ఎరుకల స్రీలు మాత్రమే కలిగిఉన్న వృత్తి సోదెచెప్పటం. ఇది ఈ తెగలో ప్రత్యేకంగా కనబడుతుంది.

ఇటీవలి కాలంలో మేము చేసిన ఎరుకల భాషా పరిశోధనలో అతి ముఖ్యమైన అంశం- దాదాపు 800 ఎరుకల పదాలను సేకరించడం. అ పదాల్లో 55% పదాలు మాత్రమే ఎరుకలవి, మిగిలినవి తెలుగు పదాలు. అంటే క్రమేపీ ఈ భాష తన పద సంపదను కోల్పోయి, వాటి స్థానంలో తెలుగు భాషా పదాలను వాడుతుంది. అంటే ఎరుకల భాషను మాట్లాడే పరిసరాలు, సందర్భాలు కుంచించుకుపోయాయి. ప్రస్తుతానికి ఇంట్లో తాత-తండ్రి - మనుమడు ఉంటే తాత-తండ్రి మాత్రమే ఈ భాషను ఉపయోగిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు 1. ఉమ్మడి కుటుంబాలు తగ్గి పోవడం 2. ఎరుకల భాషను ఉపయోగించ గల సందర్భాలు లేకపోవడం 3. ప్రతి ఊరిలో వీరు ఉన్నప్పటికి ఒకటో, రెండో కుటుంబాలు మాత్రమే ఉండటం 4 మాతృభాషలో విద్యాభ్యాసం లేకపోవటం 5. ముఖ్యంగా వారి భాష సంస్కృతి, చరిత్ర, వారికి మాత్రమే తెలిసిన వృత్తి నైపుణ్యాలు ఒక తరం నుండి ఇంకో తరం వారికి సరైన పద్ధతిలో అందక పోవడం 68. తమ భాష ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదనే భ్రాంతి 7. వారి భాష తక్కువది అనే అభద్రతా భావంతో ఉండటం.

మాత్చభాషలో బోధన: అవశ్యకత

భాష అనేది భావ వ్యక్తీకరణకు, జ్ఞాన నముపార్టనకు ఉపయోగపడుతుంది. ఏ వ్యక్తి అయినా ప్రతి అంశాన్నీ కూడా మొదట మాతృభాషలోనే అలోచిస్తారు. అలా ఆలోచించాలి అంటే ప్రతీ వ్యక్తికీ మాతృభాష ఉండాలి. ఆ భాష ఇంటా బయటా వాదబదాలి. జనవ్యవహారంలో ఉండాలి. కనీసం తన కుటుంబం, బంధువులు, స్నేహితుల్లో ఐనా వ్యవహారంలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ భాష ఆవ్వక్తికి మాతృభాషగా స్థిరపడుతుంది. ఏ విషయానికి సంబంధించిన ఆలోచనాధార అయినా మాతృభాషలోనే సాగుతుంది.

తరువాయి 25 వ పుటలో.......