అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/ఆంగ్ల విద్య

వికీసోర్స్ నుండి

విద్య-మాధ్యమం

మూలం : రవీంద్రనాథ్‌ ఠాగూర్‌


ఆంగ్ల విద్య

అత్యవసరం, అనివార్యం అయినదానికే పరిమితమవ్వడం మనిషి కర్తవ్యం కాదు. మనం ఒక హద్దువరకు అవసరాల సంకెళ్ళలో బందిలమై వుంటాం. కొంతవరకు స్వతంత్రంగానూ వుంటాం. మన శరీరం మూడు మూరల పొడవుగదా అని మూడున్నర మూరల యింటిని నిర్మిస్తే మనకి గడవదు. స్వేచ్చగా అటూ యిటూ తిరగడానికి పొడవు వెడల్చుగల విశాలమైన స్థలం కావాలి. అలా కాకపోతే మన ఆనందం, ఆరోగ్యాలకు అంతరాయం కలగవచ్చు. మనం స్వస్టతతో, ప్రసన్నంగా వుండలేం. విద్య విషయంలో కూడా అదే చెప్పవచ్చు. కేవలం అవసరాల మేరకు బాలబాలికలను బందీలుగా చేస్తే వారి మానసిక సాధన జరగదు. అవశ్యకమైన విద్యతోపాటు అంతగా ప్రయోజనంలేని అధ్యయన కార్యక్రమానికి మించి పాఠాలు భిన్న విషయాలు నేర్చకపోతే వారు పూర్తి మనుషులు కాలేరు. వయస్సులో పెద్దవారయినా వారు పిల్లలుగానే వుండిపోతారు.

కానీ దురదృష్టవశాత్తు మనవద్ద సమయం లేదు. సాధ్యమైనంత తొందరగా విదేశీ భాషలు నేర్చుకొని వాటితో యోగ్యతపరీక్షలో ఉత్తీర్ణత పొంది పనిముగించుకోవలసి వస్తోంది. పాఠాలు కంఠస్థం చేయడంలో యితరులకన్నా వెనక బడకుండా వుండాలని, చిన్నతనం నుండి గుర్రపుపందాలలో గుర్రాల మాదిరి పరిగెడుతుంటారు. మరింకే విషయానికి మనకు సమయం దొరకటం లేదు. అందువల్ల పిల్లల చేతుల్లో పాఠ్యపుస్తకాలు తప్ప మరే యితర మనోల్లాసకరమైన, ఉపయోగకరమైన పుస్తకాలు కనిపిస్తే వెంటనే వాటిని లాక్కొంటారు.

అసలు ఉపయోగకరమైన పుస్తకాలు ఎక్కడ అఖిస్తున్నాయి? మొదటగా మన భాషల్లో అటువంటి పుస్తకాలు లేవు. ఒకవేళ కాద్దోగొప్పోవున్నా అవి వున్నా లేకపోయినా ఒకటే. ఎందువల్లనంటే మన పిల్లలకు మాతృభాష నేర్పే విధానం వల్ల వాళ్ళు యింటి దగ్గర స్వతంత్రంగా ఏ పుస్తకమైనా చదివి ఆనందించగల స్థితిలో లేరు. ఆంగ్లంలో పిల్లల పుస్తకాలు చదివి అర్ధం చేసుకునేటంత ఆంగ్లభాషా జ్ఞానం కూడా వీరికి లేదు. పిల్లల కోనం రాసే పుస్తకాలలో ఉపయోగించే ఆంగ్లభాషలో ఆ భాషకు సహజమైన సామెతలు, పదబంధాలు, మాట్లాడే ఆంగ్లం బి. ఎ, యమ్‌. ఏ. లకు కూడా అర్ధం కానట్టు వుంటుంది.

వాస్తవానికి పరమాత్మ మన బిడ్డల నుదుట ఆంగ్లవర్ణమాల, పదకోశం, భూగోళం తప్ప మరేదీ లిఖించలేదు. వీరివంటి అభాగ్యులు ప్రపంచంలో మరెక్కడా వుండరు. యితర దేశాల పిల్లలు తమ వచ్చీరానీ దంతాలతో చెరకు ముక్కల్ని కొరికి రసాస్వాదన చేస్తూ ఉండే వయస్సులో మన పిల్లలు పాఠశాలల్లో బెంచీలమీద కూర్చొని తమ బలహీనమైన కాళ్ళను ఊపుతూ గురువుగారి కటువైన తిట్లు తప్ప మరేవిధమైన మనోరంజక మసాలా లేనీ జెత్తపు దెబ్బలు తింటూ వుంటారు.

తత్ఫలితంగా శారీరక, మానసిక ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. సరియైన భోజనం, మనస్సుకు నచ్చిన ఆట పాటలు లేక పిల్లల శరీరాలు దుర్చలంగా, పీలగా తయారవడమే కాక మనస్సులు కూడా బలహీనమై పోతున్నాయి. వారిలో ఆలోచనలు పుట్టి పెరిగేందుకు తగిన శక్తి పెంపొందటం లేదు. యీ రకమైన బలహీనత వల్ల బి.ఏ., యమ్‌.ఏ. లాంటి డిగ్రీలు పొందినా, పుస్తకాల గుట్టలు నమిలి మింగినా మన బుద్దిమాత్రం వికసించటం లేదు. బుద్ధి పరిపక్వం చెందటం లేదు! ఏ విషయాన్నయినా సమగ్రంగా అర్ధం చేసుకుని, స్వతంత్రంగా దాని గురించి చెప్పగలిగే యోగ్యత లేకుండా పోతోంది. మన నమ్మకాలు, మన అభిప్రాయాలు, మన మాట - నడత, కట్టు - బొట్టు, ఆలోచనలు మొదలైనవేవీ స్వతంత్రమైనవిగా, పద్ధతి ప్రకారంగా వుండడం లేదు. అందుకనే మన మాన సిక దౌర్చల్యాన్ని బాహ్వాడంబరంతో, ప్రదర్శనలతో, కుప్పిగంతులతో కప్పిపెట్టటానికి, దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.

చిన్నప్పటినుండీ విద్యాభ్యాసానికీ, ప్రసన్నతకూ, ఆనందానికి సంబంధం లేకపోవటమే దీనికి ముఖ్యకారణం. ఎంత అవసరమో అంతే కంఠస్థం చేస్తున్నాం. 6వా అభ్యాసం వల్ల మన పని జరుగుతోంది. కాని బుద్ధి వికసించటం లేదు. గాలి తింటే కడుపునిండదు. అన్నం తింటే కడుపు నిండుతుంది, కానీ భోజనం చక్కగా అరగాలంటే, శఠీరంలోకి గ్రహించుకోవాలంటే గాలికూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా పాఠ్య పుస్తకాలను, వాటి అర్ధాన్ని గ్రహించాలంటే యితర మనోరంజక సామాగ్రి కూడా ఎంతైనా అవసరం. మానసిక ఉల్లాసంతో చదివిన చదువువల్ల చదివేశక్తి వికసిస్తూ పోతుంది. మన ఆలోచన్నా అవగాహనా కూడా చక్కగా పెంపొందుతాయి. మానసిక శక్తులను నాశనం చేసే ఆనంద రహితమైన విద్య అనే పంజరం నుండి మన పిల్లలను ఎలా విముక్తులను చేయాలో ఎంత ఆలోచించినా మనకి తెలియటం లేదు. అంగ్లభాష మన భాష కాదు. విదేశీయులది. మన భాషాపదాలు అంగ్ల భాషావపదాలతో కలవవు. వారి భావాలు, అలోచనలు, విషయాలు విదేశీయమే. వారి విషయాలలో మనం అనఖిజ్ఞులం. మన ఆలోచనాశక్తి పుట్టకముందే వారి విషయాలన్నీ కంఠస్థం చేసే అగత్యం ఏర్పడుతోంది. అందుకనే అన్నం నమలకుండానే మింగేసేవాడి లాగా మన స్థితి ఉంది. ఉదాహరణకు ఒక ఆంగ్ల బాలుడు తన పాఠ్య పుస్తకంలో- పచ్చిగడ్డిని ఎండబెట్టి పశువుల చొప్ప తయారు చేయటం అనే అంశంపై ఒక కథ చదివితే చాలా ఆనందం పొందుతాడు. దాన్ని గురించి వాడికి బాగా తెలుసు. అదే విధంగా ఆంగ్ల బాలబాలికలు మంచు ముద్దలు అనే పాఠంలో ఛార్లీ కేటీల మధ్య సంభాషణని చాలా యిష్టంగా చదివి ఆనందిస్తారు. కానీ మన పిల్లలు ఒక విదేశీ భాషలో చదివితే వారికెటువంటి ఆనందమూ కలగదు. పైన ఉదహరించిన అంశాల గురించి వారి మనస్సులో ఎటువంటి భావాలూ కలగవు. వారి మనస్సులపై ఎటువంటి చిత్రమూ ఏర్పడదు. కళ్ళులేని వారి మాదిరి తడుముకుంటూ నడువవలసి వస్తుంది.

ప్రాథమిక తరగతులలో చదువు నేర్పే ఉపాధ్యాయులు కొందరు ఎంట్రన్స్‌ పాసయి వుంటారు. తక్క్మినవారు ఎంట్రన్స్‌ ఫెయిలయి వుంటారు. ఆంగ్లభాష, సభ్యత, ఆలోచన, ఆచార విచారాలతో వారికి చక్మ్కని పరిచయం వుండదు. పిల్లలకు మొట్టమొదటగా యిటువంటి వారే ఆంగ్లభాషను పరిచయం చేస్తారు. వీరికి మాతృభాష పూర్తిగా రాదు, అటు ఆంగ్ల భాషా రాదు. వీరు పిల్లలకి నేర్చటానికి బదులు ఉన్నది పోగొట్టడంలో సఫలీకృతమవుతారు!

కానీ పాపం యిందులో వీరి దోషమేముంది? “Horse is a noble animal" యీ వాక్యం ఆంగ్లంలో అతి సాధారణ వాక్యం. దీనిని మన భాషలోకి అనువదిస్తే బాగా రాదు సరికదా ఆంగ్లంలోని అర్ధం కూడా వికృతమైపోతుంది. గుర్రం ఒక గొప్ప జంతువు - గుర్రం ఒక ఉత్తమశ్రేణి జంతువు - గుర్రం మంచి జంతువు: ఏ విధంగా అనువదించినా రావలసినంతగా సరియైన అర్ధం రాదు. అధ్యాపకుడు అటువంటి సమయంలో ఏదో మసిపూసి మారేడుకాయ చేయక తప్పుదు. ప్రాథమిక స్థాయి ఆంగ్లబోధనలో ఎన్నోసార్లు యీ విధమైన గందరగోళం ఏర్పడుతూనే వుంటుంది. యీ స్థాయిలో నేర్పే ఆంగ్లం అతి సాధారణమైనదిగానూ, అస్పష్టంగానూ వుంటుంది. దీనిని అభ్యసించడంలో పిల్లలు రసాస్వాదన చేయలేరు. కానీ పిల్లలు అనందాన్ని పొందాలని ఎవ్వరూ ఆశించటం లేదు. ఉపాధ్యాయులు, విద్యార్థులూ చెప్పేదేమంటే మాకు రసంతో సంబంధం లేదు. ఏదో విధంగా అర్థం లాగితే పని జరిగిపోతుంది, పీడ వదులుతుంది. పరీక్షలో ఉత్తీర్ణులవటంతోనే నౌకరీ సిద్దంగా వుంటుంది.

యిక పిల్లల అద్బష్టంలో మిగిలినదేముంది? వారు మాతృభాష నేర్చుకుంటే కనీసం రామాయణాది మహా కావ్యాలన్నా చదువుకొని వుండేవారు. ఏమీ నేర్చుకోకపోతే కనీనం ఆటపాటలకయినా సమయం దొరికేది. చెట్లెక్కి యీతకాట్టి, పువ్వులేరుకొని, ప్రకృతిలో వేల ఆటలు ఆడి మానసిక ఉల్లాసాన్ని శాంతిని పొందగలిగేవారు. యీ ఆంగ్లభాషాభ్యాసంలో తలమునకలవ్వడం వల్ల అటు చదువు లేదు, యిటు ఆటలేదు. ప్రకృతి వాస్తవిక సామ్రాజ్యంలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతున్నారు, కావ్యానందానికి దూరమవుతున్నారు.


మన తోవలో (మనసులో) బయట కూడా తిరగటానికి విశాలమైన మైదానాలున్నాయి. ఆ మైదానాల్లో మనం ప్రాణశక్తిని, స్వస్థత అనే అమూల్య సంపదను పొందగలుగుతాం. అక్కడనుండే రకరకాల రంగులు, రకరకాల చిత్రాలు, ఆక్బతులు, భావాలు, సుఖసంతోషాలు పైకెగసి మన శారీరక, బౌద్దిక వికాసానికి దోహదం చేస్తాయి. అయ్యో! అభాగ్యులైన యీ పిల్లలు బాహ్య, అంతఃకరణాలనే తల్లిదండ్రుల ప్రేమకు నోచక విదేశీ బందీ గృహాలలో, సంకెళ్ళతో ఖైదీలవుతున్నారు. భగవంతుడు తల్లిదండ్రుల మనసులో ప్రేమ తరంగాలను సృష్టించి తల్లి ఒడిని రసవంతం చేశాడు. కానీ వారి పిల్లలు పసితనంలోనే తమ అమూల్య సమయాన్ని ఒక విదేశీ భాష వర్ణమాలను, పదకోశాన్ని గుర్తు పెట్టుకోవటంలో నష్టం చేసుకోవలసి వస్తోంది. దీనిలో జీవం లేదు. ఆనందానుభూతి లేదు. కొత్త విషయమూ లేదు. యిటూ అటూ కదలడానికి అవగింజంత చోటూ లేదు. వర్ణమాల, పదకోశం లోని నీరసమైన, కుళ్ళిన, రుచి రహితమైన ఎముకలు నమలటం వల్ల వీల్లల మనసు, మస్తిష్కం వికాసాన్ని పొందగలవా? వారిలో విశిష్టమైన యోగ్యత పెంపొంద గలదా? వారి శీలం నిర్మలంగా, దృఢంగా కాగలదా? పెద్దవారైనా కూడా తమ స్వబుద్దితో ఏదైనా పని చేయగలరా? తమ స్వశక్తితో ప్రగతి నిరోధక అటంకాలను దూరం చేసుకోగలరా? తమ సహజ తేజంతో ప్రతి స్థితిలోనూ తల ఎత్తుకుని ఉండగలరా? యీ బక్కచిక్కి పాలిపోంయిన ముఖాలుగల వీరు, సాహనహీనులైన బాలలు బతికుండగా మృత్యువును తప్పించుకోగలరా? లేదు. కేవలం అనుకరించడం, కంఠస్థం చేయడం, లేదా బానిసత్వం మాత్రమే వారు నేర్చుకోగలరు.

ఒక్కసారిగా ఏ పిల్లవాడు యువకునిగా మారలేదు. బాల్యావస్థనుండి మార్చు చెందుతూ కొద్దికాలం తరువాత యౌవ్వనంలోకి ఆడుగుపెదతారు. ఆలోచనాశక్తి, అధ్యయనశక్తి యీ రెండు అమూల్యమైన వస్తువులు - జీవిజానికి ఆశ్రయమిచ్చి రక్షించేవి యివే. యవ్వనంలో ఒక్కసారిగా యీ శక్తుల పనిపడ్డప్పుడు, కోరుకోగానే మనఎదురుగా వచ్చి నిల్పోవు - మన కాళ్ళు, చేతుల మాదిరి మన జీవితంతోపాటు క్రమంగా పెరుగుతూ వుంటాయి. అవేమీ ముందుగా తయారుచేసి పెట్టిన వస్తువులు కావు - కావలసినప్పుడు, మనస్సు పుట్టినప్పుడు బజారులో కొనుక్కోడానికి. ఆలోచనాశక్తి అధ్యయనశక్తి రెండూ జీవనయాత్రకు లాభదాయకమైనవి, అత్యావశ్యకమైనవి అని చెప్పటంలో నందేహం లేదు. యీ రెండు శక్తులు లేకుండా మానవులుగా తయారవ్వడం, మనుషత్వాన్ని పొందటం ఎంతమాత్రం సాధ్యంకాదు. బాల్యం నుండి యీ శక్తులను పెంపొందించకపోతే అ అవసరం కలిగినప్పుడు మనకు లభ్యం కావు,

కానీ మన వర్తమాన బోధన ప్రణాళికలో యీ శక్తులు పెరగటానికి మార్గం బహుశా పూర్తిగా మూసివేసి ఉంది. అంగ్రభాష అతి కఠినమైన విదేశీ భాష అని ముందే చెప్పాను. మన ఉపాధ్యాయులలో యోగ్యత ఎంత తక్కువ అంటే వారి మనస్సులో ఆంగ్ల పదజాలంతో పాటు దానికి సంబంధించిన భావాలు కలగవు. అందువల్లనే ఆంగ్ల భావాన్ని అర్థం చేసుకోటానికి మన అమూల్యమైన సమయాన్ని నష్ట పరచవలసి వస్తోంది. అంతవరకు మన ఆలోచనశక్తికి పనిలేక పోవడం వల్ల, ఖాళీగా పడివుండడంవల్ల అది అన్ని విధాలా నష్టమయి ఫోతోంది, నిరర్ధకమైపోతోంది. ఎఫ్‌.ఏ లేదా ఎంట్రన్స్‌ల వరకు మన నమయం కేవలం కనీస వ్యవహారానికి సరిపడే ఆంగ్లాన్ని నేర్చుకోవడంలో గడచిపోతోంది. దీని తరువాత బి.ఏలో ఒక్కసారిగా మన ముందు పెద్ద పెద్ద పుస్తకాలు, అవసరమైన, ఆలోచించదగ్గ విషయాలు ఉంచుతారు. అప్పుడు వాటిని అవగాహన చేసుకునేందుకు సమయం కాని, యోగ్యతకాని వుండవు. మరేమీ చేయలేక, అసహాయత వల్ల అవ్వన్నీ పెద్ద ఉండచేసుకుని ఒకే ముద్దలో మింగవలసి వస్తోంది.

మనం చదువుకుంటూపోతామే కాని దానితో పాటు ఆలోచించం, అర్థం చేసుకోం. యిటుకలు, సున్నం గుట్ట పెంచుకుంటూ పోవడమే కాని వాటిని ఉపయోగించడం మనకు తెలియదు. ఎండలో, వర్షంలో ఆశ్రయాన్ని విశ్రాంతినిచ్చే నివాస గృహాలుగా వాటిని మన స్వబుద్దితో తయారు చేసుకోవటం లేదు. యీ విధంగా యిటుకలు, సున్నం, సిమెంట్‌, స్తంభాలు, ఇనుము మొదలైన వాటి గుట్టలు పర్వతాలుగా పెరుగుతూ పోతాయి. అప్పుడు ఒక మహ విద్యాలయం నుంచో, విశ్వవిద్యాలయం నుంచో ఒక మూడు అంతస్తుల యింటికి కప్పు కట్టమని ఆదేశం వస్తుంది. యింకేముంది, ఆ ఆదేశాన్ని పాటించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఎలాగో ఆ గుట్టనెక్కి రెండు సంవత్సరాలలో దాన్ని కొట్టి, కొట్టి పై భాగాన్నీ సమతలంగా చేస్తారు. ఆ గుట్ట కప్పులాగా తయారవగానే అదుగో మూడు అంత స్తుల ఇల్లు తయారయ్యిందనీ చెబుతారు. కానీ అది భవ్యమైన భవనం అవుతుందా? గాలి, వెలుతురు తగినంతగా రావడానికి ఏమైనా మార్గం వుందా? ఏ వ్యక్తి అయినా ఆ భవనంలో కొద్దిసేపు వుండ గలుగుతాడా? తీక్షణమైన ఎండ నుండి, ప్రచండ వాయువుల నుండి, వర్షం నుండి ఆ భవనం మనని రక్షించగలుగుతుందా? ఈ నిర్మాణంలో నైపుణ్యం కానీ, సౌందర్యం కానీ ఉన్నాయా?

గుట్టల్లాగా ఇప్పటిదాకా పోగుచేసిన సామగ్రి చాలు. మనస్సనే భవనాన్ని నిర్మించటానీకి యీ ఇటుకలు, సున్నం, యిసుక, సిమెంట్‌ మొదలయినవి మనకు యింతకు ముందు లభ్యమయ్య్యేవి కావు. కానీ యివి పోగుచేసినంత మాత్రాన నిర్మించవచ్చుననుకోవటం పొరపాటు. వాస్తవానికి సామగ్రితో పాటు భవన నిర్మాణం కూడా జరిగితే సామగ్రి ఉపయోగపడడమే కాక పనికూడా దృఢంగా, పక్కాగా జరుగుతుంది. కానీ మన దేశంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. మనిషి ఒక వైపునకు సాగితే అతని విద్య మరొక వైపునకు సాగుతోంది. ఒకవైపు పెట్టుకోవడానికి చోటు లేనంతగా తిండి పదార్థాలు పెరుగుతున్నాయి, అకలీ పెరుగుతోంది, కడుపు తన తాపంతో మండుతూనే వుంది. యీ రకంగా మన దేశంలో చిత్రమైన తమాషా జరుగుతోంది.

అందువల్లనే మీరు మీ పిల్లలను మనుషులుగా తీర్చిదిద్దాలను కుంటే బాల్యం నుండీ అ రకమైన ప్రయత్నమే చేయండి. లేదా వారు ఎప్పటికీ పిల్లలుగానే వుండిపోతారు, మనుషులు కాలేరు. బాల్యం నుండి వారి స్మరణ శక్తి మీదే భారం మోపకుండా వారి అలోచనా శక్తి అధ్యయన శక్తి కూడా పెరగటానికి అవకాశమివ్వండి. విత్తు నాటడానికి భూమిని అనుకూలంగా చేయాలంటే కేవలం దున్ని రాళ్ళు రప్పలు ఏరి చదునుచేస్తే చాలదు. అదే విధంగా యీ విలువైన భూమిని సారవంతంగా చేయాలంటే కేవలం బట్టీ పట్టడం, పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వడమే చాలదు. యీ ఎండుమట్టితోపాటు, యీ నిరంతరం దున్నటంతో పాటు కొంతసారం కూడా వుండాలి. మట్టిలో సారం ఎంతుంటే ఆహార పదార్థాలు అంత బాగుంటాయి. యిదేకాక కొన్ని సమయాల్లో భూమికి వర్షం కూడా అవసరం. సమయం దాటిన తరువాత ఎంత వర్షించినా లాభం వుండదు. యవ్వనంలో జీవితాన్ని రసమయం చేసుకోవటానికి, సంస్కరించు కోవడానికి ఆలోచనాశక్తి ఎంతో అవనరం. సాహసోపేతమైన ఆలోచనలు, నిర్ణయాల ప్రభావం ఎంతో వుంటుంది. ఆ సమయంలో సాహిత్యాకాశం నుండి వర్షం కురిస్తే పని సిద్దిస్తుంది.

మనస్సు అప్పుడవ్వుడే మేల్మొని మాతృభూమిని దాటి యీ విశాల ధరిత్రిని అనంత ఆకాశాన్ని దర్శించినప్పుడు, బాహ్య ప్రపం చంతో అప్పుడే కొత్త కలయిక జరుగుతున్నప్పుడు, కొత్త కొత్త లక్షణాలు ఉబికే ప్రేమ, ఎగిసే కోరికలు నాలుగు వైపులనుండీ చుట్టు ముట్టి నపుడు, ఆలోచనలనే సుఖకరమైన వాయువులు ప్రసరిస్తున్నపుడు, శాశ్వతమైన ప్రసన్నత ఒడిలో వెలుగు, శాశ్వత ఆశీర్వచనాల కెరటాలు ప్రవహిస్తున్నపుడు ఆ విత్తనాల రెక్కలు జీవితమంతా సఫలమ్టై ఆనందాన్ని సంపూర్ణతను సంతరించుకొంటాయి. కానీ అదే సమయంలో ఎండిన మట్టితో, వేడి వేడి యిసుకతో కప్పివేస్తే ఆనంద రహితమైన పదావళిని, వర్ణమాలను వల్లించటం కంటే మరో పని లేనప్పుడు దాని తరువాత ఎంత వర్షించినా - సమస్త ఐరోపా ఆధునిక, సాహసోపేతమైన ఉదాత్త భావాలు ఎంత వర్షించినా-తగినంత సఫలత ఎంతమాత్రం కలగదు. సాహిత్యంలోని జీవశక్తి వారి జీవితాలపై కొద్దిగానైనా వెలుగును ప్రసరించలేదు.

కానీ మన అనందరహిత్క నీరసమైన, నిర్జీవమైన విద్యవల్ల అ జీవదాయక శక్తి వ్యర్థమయిపోతుంది. కొద్దిపాటి వల్లె వేసిన విషయాల బరువును మోసుకుంటూ మనం బాల్యం నుండి యవ్వనం లోకి ప్రవేశిస్తాం. బట్టే పట్టడంలోనే మన మనసులు విరిగిపోతాయి. యింత చేసినా మన మానవత బాగా పుష్పించి ఫలించదు. మనం ఆంగ్లభావభూమిలో ప్రవేశించినప్పుడు అక్కడ కూడా చక్కగా ఆట పాటలలో విహరించలేం. భావాలని మనం అర్ధం చేసుకున్నా మనసులో వాటిని ముద్రించుకోలేం. వాటిని మాటి మాటికి వల్లెవేస్తూ వుంటాం కానీ మన వాస్తవ జీవితంలో వాటిని ప్రయోగించలేం. అవి మన వెలుపలనే వుండిపోతాయి, లోపలికి చొచ్చుకోవు. మన మనస్సుతో వాటికి ఎటువంటి సంబంధమూ, సంపర్మమూ వుండదు.

యీ విధంగా 20, 22 సంవత్సరాల వరకు ఏ భావాలు నేర్చుకుంటామో వాటికి మన జీవితంతో ఏ విధమైన రసాయనిక సంయోగమూ సిద్ధించదు. దానివల్ల మన మనసు ఒక విచిత్రమైన రూపాన్ని దిద్దుకుంటుంది. ఆ విధంగా నేర్చుకున్న భావాలు బయట అంటించుకున్నట్లు వుంటాయి. కొన్ని అనతి కాలంలోనే ఎగిరిపోతాయి.

ఆటవికులు తమ శరీరాలకు రంగు రంగుల బొమ్మలు గీసుకునీ తమ సహజ సౌందర్యాన్ని మెరుగు పరచి, యీ కృత్రిమ సౌందర్యానికి గర్వపడుతూ వుంటారు. అదే విధంగా మనం యీ విదేశీ విద్య 'పైపూతలు పూసుకాని గర్వంతో తల ఎగరవేసుకుంటూ తిరుగుతుంటాం. మన వాస్తవ జీవితంతో వాటికెటువంటి సంబంధమూ వుండదు. అనాగరిక, అటవిక ప్రదేశాల రాజులు లేదా నాయకులు గాజు ముక్కలు మొదలైన చవకబారు విదేశీ వస్తువులను శరీరంలో అక్కడక్కడా తగిలించుకొని సభ్య సమాజం అపహాస్యం చేస్తుందని గమనించని విధంగా మనం కూడా తళుకు బెళుకుల విదేశీ విషయాలు నేర్చుకొని విర్రవీగుతూ వుంటాం.

విదేశీయుల గొప్ప గొప్ప భావాల్ని అనవసరంగా, సందర్భ రహితంగా ప్రయోగిస్తూ వుంటాం. మన అజ్ఞానం వల్ల ప్రపంచాన్ని నవ్వించే ఒక విచిత్ర నాటకం ఆడుతున్నామని గ్రహించలేం. మనయీ చేష్టలకి ఎవరయినా నవ్వుతూ వుంటే యూరపు చరిత్రనించి గొప్ప గొప్ప ఉదాహరణలు తీసి వారి ముందుంచటానికి తొందరపడుతూ వుంటాం. బాల్యం నుండి మన బాలలకు భాషాజ్ఞానంతో పాటు, భావబోధన కూడా కలిగిస్తూ వుంటే అవి జీవితంతో మేళవించి, దైనీక జీవితంలో ఒక భాగంగా మారి మన శీలంపై సరైన ప్రభావాన్ని కలిగిస్తే మన జీవితమంతా నిజమైన అనుకూలత ఏర్పడుతుంది. భాష భావం, తగు పాళ్లల్లో మేళవిస్తాయి.

ఏ భావాలతో ప్రభావితమై లేదా ఏ రీతిగా, ఏ పద్దతిలో జీవితం గడపాలో దానికి అనుకూలంగా మన విద్య లేదనీ మనం బాగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది. మనకు కావాల్సిన గృహ సుందర చిత్రమేదీ మన పాఠ్యపుస్తకాలలో లేదు. మనం జీవితం గడపాల్సిన సమాజం కోసం ఉన్నత ఆదర్శమేదీ మన పాఠ్యాంశాలలో దొరకటం లేదు. మన తల్లిదండ్రులను, సోదరీ సోదరులను, బంధువులను వాటిలో స్పష్టంగా చూడలేక పోతున్నాం. మన దినచర్యకు దానిలో స్థానం లేదు. మన అందమైన ప్రభాతాలు, సుందర సంధ్యా సమయాలు, పచ్చగడ్డి మైదానాలు వీటిలో కనిపించవు. దీన్నిబట్టి మన చదువుకీ జీవితానికి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. రెండిటి మధ్య ఒక పర్వతం అద్దంగా వుంది. యీ చదువు మన జీవిత అవసరాలను ఎప్పటికీ పూర్తి చేయలేదు. మన జీవితానికి ఎన్నో గజాల దూరంలో చదువు వర్పిస్తోంది. ఈ స్థితిలో అన్ని ఆటంకాలను తప్పించుకుంటూ కొంత ధార మనదాకా చేరుకున్నా అది మన జీవితంలోని నీరసతను తొలగించటానికి, జ్ఞానతృష్టను తీర్చటానికి చాలినంతగా వుండదు. జీవితమంతా వెచ్చించి నేర్చుకుంటున్న చదువు గుమాస్తాగా లేదా మరొక నౌకరీ చేసుకోవడానికి మాత్రం యోగ్యులుగా తయారుచేస్తోంది.

యింతకంటే ఎక్కువ మేలు దీనివల్ల కలగటం లేదు. మనం ఆఫీసుకు పోవడానికి గుడ్డలు మదత పెట్టి పెట్టుకునే అలమరాలోనే మన చదువును కూడా మూత పెడుతున్నాం. దానిని నిత్య జీవితంలో ఏమాత్రం ఉపయోగించటం లేదు. యిదంతా నేటి విద్వా ప్రణాళిక పెట్టిన భిక్ష దీనికి విద్యార్థులను దోషులు అనటం అన్యాయం. యిందులో వారి పాత్ర ఈసంతైనా లేదు. కారణం వారి చదువు ఒక వైపు, జీవితం మరాక వైపు వున్నాయి. రెండింటి మధ్య వర్ణమాల, పదకోశం, వ్యాకరణం అనే వంతెన వుంది. అందువల్లనే పాశ్చాత్య విజ్ఞానంతో ప్రవీణుదైన వ్యక్తి నీచమైన, అవమానకరమైన సంస్మారాలను, విధానాలను, మిధ్యాధోరణులను నిలబెట్టుకోవాలనీ ప్రయత్నించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఏ వ్యక్తి ఉపన్యాసాలతో స్వాతంత్ర్రపు ఉన్నత భావాలను, ఆదర్శాన్ని ప్రచారం చేస్తాడో అతడే పరాధీనత లేదా దాస్యత శృంఖలాలనే సాలెగూళ్ళలో తాను, తనతోపాటు యితరులు ఛిక్కుకునేలా చేసి బలహీనుడై పోతున్నాడు.

ఉత్తమ భావాలుగల సాహిత్యాన్ని పరిపూర్ణ స్వేచ్చతో అధ్యయనం చేసి కూడా తన భావాలను ఉన్నత శిఖరాలకు చేర్చలేక పోతున్నాడు. వారి జీవితం మరింత అధోగతిలో వుంది. కేవలం డబ్బు సంపాదనలో, లౌకిక బెన్నత్యాన్నీ పొందడంలో లీనమై వున్నాడు. అటువంటి వ్యక్తుల జ్ఞానానికి లౌకిక వ్యవహారానికి మథ్య ఎంతో వ్యత్యాసం కనబడుతోంది. తత్ఫలితంగా రెండూ సంయోగం చెందలేవు, పరస్పర వైరుధ్యం వుంటూ వుంటుంది. దీని పరిణామంగా రెండు వైపులా విరోధం పెరిగిపోతూ ఉంటుంది. మనకు లభించిన జ్ఞానానీకీ, మన లౌకిక వ్యవహారాలకూ మధ్య యుద్దం జరుగుతూనే వుంటుంది. అందువల్ల అటువంటి చదువుమీద ప్రారంభం నుండీ నమ్మకం, విశ్వాసం వుండవు. ఆ చదువు భ్రమాస్పదంగా ఉంటుంది. అదే పాశ్చాత్య సభ్యతకంతకూ ఆశ్రయమని అనుకుంటాం. చదువు మనకు మార్గం చూపుతున్న ఆ వైపు సభ్యత అనే విశ్వాసఘాతకురాలైన భయంకర దెయ్యం రాజ్యం చేస్తోంది. ఆ వైపు పోవటం మనకు హానికరం కానీ దురుదృష్టవశాత్తు మన దౌర్చాగ్యంవల్ల, ఇతర కారణాలవల్ల ఈ చదువు మనకు హానిచేస్తోందని తెలుసుకోవటం లేదు. పైగా విద్యలోనే సహజ దోషముందని పొరబడుతున్నాం.

మనం విద్యను ఎంతగా నిర్లక్ష్యం చేస్తే మన అవిశ్వాసం కూడా అంతగా పెరిగిపోతుంది. మన విద్య కూడా మన జీవితం నుండి, అవసరాల నుండి వెనక్కి మళ్ళి నిర్లక్ష్యధోరణి కూడుకున్న దవుతోంది. మన శీలంమీద, మన వ్యావహారిక జీవితం మీద ఎటువంటి ప్రభావమూ యీ చదువు కలగచేయటం లేదు. అంటే మన చదువుకూ జీవితానికీ మధ్య అంతరాలు, అగాధాలు పెరిగి పోతున్నాయి. యీ రకమైన అపూర్ణ జ్ఞానం, అపూర్ణ జీవితం దయవల్ల భారతీయుల జీవితం ఒక నాటకంలా, అనుకరణమాత్రంగా తయారవుతోంది.

మనం జీవితంలో మూడింట ఒకవంతు భాగం కేటాయిస్తున్న చదువుకూ మన జీవితానికీ మధ్య పొంతన లేనప్పుడు, మరొ విద్యను ఆర్జించటానికి కూడా అవకాశం కల్పించనప్పుడు మనం ఏవిధంగా పైకి రాగలమో చెప్పండి. మన చదువుకూ జీవితానికి మధ్య సమానత్వం ఏ విధంగా కలగచేయగలం అని ఆలోచించవలసిన, అత్యవసరమైన ప్రశ్న మన ఎదుట ఉంది. మన మాతృభాష, మాతృభాషా సాహిత్యమే అటువంటి సమానత్వాన్నీ నెలకాల్పగలవు. స్వర్గీయ బాబూ బంకిమ్‌ చంద్ర ఛటర్జీ “వంగ దర్శనం” నవ ప్రభాతంలా ఉదయించినప్పుడు వంగదేశంలో యీ చివరి నుండీ ఆ చివరిదాకా ఆనందం వెల్లివిరిసింది. యూరోపు విజ్ఞానంలో, ఆలోచనా ప్రవాహంలో, చరిత్రలో దొరకని నూతనాంశమేదైనా *'వంగ దర్శనంలో వుందా? 'వంగ దర్శనంలో అదేమీ లేదు. కాని ఒక ఉన్నత శ్రేణి రచయిత “వంగ దర్శనం ద్వారా అంగ్లభాష బోధనవల్ల ఏర్పడిన అగాధాన్ని నింపివేయగలిగాడు. దూరదేశాలకు వెళ్ళిన మన యింటి మనిషిని మళ్ళీ యింటికి తెచ్చి ప్రసన్నతను, ఆనందాన్ని కలగచేసాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళినందున 20, 25 సంవత్సరాల నుండి ఆయన దర్శనం కాలేదు. “వంగ దర్శనం” దూతగా మారి కృష్ణుడిని మళ్ళీ బృందావన ధామానికి తీసుకొచ్చింది. ఆ సమయంలో మన యిళ్ళలో, సమాజంలో, మన మనస్సులో ఒక కొత్త వెలుగు ప్రసరిం ఛింది. యీ వెలుగులో మన మనస్సులు ప్రకాశించాయి. మనం స్త్రీలను 'సూర్యముఖి 'గా, 'కమలకమణి'గా చూడగలిగాం. మనదేశ వాసులైన 'చంద్రశేఖర్‌ 'ను, 'ప్రతాప్ 'ను మన భావ సింవోసనంపై కూర్చోపెట్టాం. మన దైనందిన జీవనం వెలుగుతో నిండి అద్భుతమైన దృశ్యాలు కనబడసాగాయి.

వంగ దర్శనం సాటిలేని నవ్వ రసాస్వాదన చేసి బెంగాల్‌ లో విద్యావంతులైన వారు బెంగాలీ భాషలో తమ భావాలు వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఆంగ్ల భాష వ్యావహారికంగా ఉపయోగపడుతుంది గాని వ్యక్తిగత భావాలను వ్యక్తం చేయటానికి యీ భాష తగదు అని వారు తెలుసుకున్నారు. ఎంతో పరిశ్రమతో చిన్నప్పటి నుంచి అంగ్ల భాష నేర్చుకుంటున్నప్పటికీ వర్తమాన సాహిత్యం (చిరకాలం ఉంటుందని ఆశించేది) బెంగాలీ భాషలోనే వెలువడింది. భారతీయులు ఆంగ్లభాషలో తమ భావాలను వ్యక్తం చేయగలందుకు తగినట్లు మనసును ఆ భాషతో మేళవించలేకసోవటమే దీనికి ముఖ్యకారణం. ఒకవేళ అంగ్ల భాషతో చక్కని సంబంధం ఏర్పరచుకున్నప్పటికీ భారతీయ భావాలను స్పదేశీ భాషలో వ్యక్తం చేయగలిగినంత అందంగా అంగ్ల భాషలో చేయలేరు. మన మనసులకు ప్రేరణ కలిగించే విషయాలను, భావాలను విదేశీ భాషలలో బాగా స్వతంత్రంగా ప్రకటించలేం.

మన విద్యావంతులైన యువకులు తమని తాము వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు, దానికి మాతృభాషను ఆశ్రయించేటప్పుడు ఒక అలజడికి గురి అవుతున్నారు. యింత కాలం నించీ పొందిన నిరాదరణను, మానహానిని మరచి, పిలచిన వెంటనే విద్యాగర్వంతో మిడిసిపడేవారి ఎదుట తన సమస్త సౌందర్యంతో, గరిమతో చేతులు కట్టుకుని నిల్చొదు మన స్వభాష,

మీ స్వభాష వైభవాన్ని అర్ధం చేసుకోగలరా? దీని రహస్యాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారా?

మీరు మిల్‌, స్పెన్సర్‌ (18వ శతాబ్దపు ఆంగ్ల తత్వవేత్తలు) రచనలు అధ్యయనం చేశామని, పెద్ద పెద్ద డిగ్రీలు, సర్టిఫికెట్లు పొంచామని అనుకుంటూ వుండవచ్చు. అందువల్ల స్వతంత్రంగా ఆలోచించి అర్థం చేసుకునే యోగ్యత కలవారమని, పరిపూర్ణ విద్వాంసులమని భావించవచ్చు. దురదృష్టవశాన బహు పుత్రికలకు జన్మనిచ్చి ఆ భారంతో అణిగిపోయిన తల్లిదండ్రులు తమ కూతుళ్ళను, కోరినంత ధనాన్ని తెచ్చి మన యింటి ద్వారాల వద్ద మోకరిల్లినట్లే నిరక్షరాస్యులైన గ్రామీణుల అతి తక్కువవయిన దేశభాష మీ సంకేతమాత్రం చేత మీ శరణుజొచ్చి తన జీవితాన్ని సఫలం చేసుకుంటుందని మీరు భావిస్తున్నారు. జీవితమంతా ఆంగ్లభాషను నేర్చుకొని కూడా మాతృభాషలో రాయటానికి పూనుకున్నామంటే, ఆంగ్లభాషలో తేలికగా లభ్యమయ్యే ప్రతిష్టను తిరస్కరించి, ఉన్నత అమూల్యమైన తమ భావ ముత్యాలను యూ స్వదేశీ భాషపై ఎంతో విశాల హృదయంతో ఎంతో సాహసంతో వెదజల్లటానీకి తత్పరత చూపిస్తున్నామంటే యీ భాష భాగ్యమేనని అనుకుంటారు. మహారాజు విచ్చేయడం చూసి అత్యంత గౌరవంతో దారి తొలగి నిల్బొన్న నిర్ధనుడిలా తమ మార్గంలో వచ్చే అడ్డంకులు, కష్టాలు కూడా భయపడి తమ ముందు నుంచి తొలగి ఒక పక్క నిలబదడతాయనుకొంటారు. “దేశవాసులారా! ఒక్క క్షణం ఆలోచించి చూడండి, మేం మీ మీద ఎంత దయచూపుతున్నామో! మేం మీకు రాజకీయ ఆర్థిక సమస్యల గురించి ఎన్ని విషయాబైనా చెపుతాం. భూగోళం గురించి మేం నేర్చుకొన్న దాన్ని ఆది నుండి అంతం దాకా వినీపిస్తాం. ఏదీ దాచటానికి ప్రయత్నం చేయం, యితర దేశ భాషలలోని ప్రసిద్ధమైన, అవగాహనకు కఠినమైన పుస్తకాల నుండి ఆలోచించదగిన విషయాలు సంక్షిప్తంగా చెప్తుతాం. అనేక చారిత్రకమైన విదేశీ సాహిత్యంపై విద్వాంసులు, విమర్శకులు ఎటువంటి అభివ్రాయాలు వ్యక్తం చేశారో అదీ చెపుతాం. కానీ యీ నీ గ్రామభాష నీ స్వభాష ఆజ్ఞాపించగానే మా ఎదురుగా నిలబడక పోతే ఆ భాషలో ఒక్క శబ్దం కూడా రాయం. మేం ప్లీడరీ చేస్తాం, 'హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు అవ్వగలం, పోలీసు సూపర్నెంట్స్‌ న్యాయాధీశులు, డిప్టీ కలెక్టర్‌ ఏదైనా కాగలం. నచ్చితే ఆంగ్లపత్రికల్లో వ్యాసాలు రాస్తాం. కానీ స్వభాష పేరైనా ఎత్తం. ఆలోచించండి. దీనీ వల్ల ఎంత హాని జరుగుతుందో!” అని అంటారు.

ఇదంతా మన దేశదౌర్భాగ్యం కాకపోతే మరేమిటి? మన మాతృభాష ఆంగ్లభాషామోహితులైన యీ నవయువకులను గౌరవించదు. యీ యువకులు తమ మిధ్యా గర్వాన్నీ వదలి మాతృభాషతో మమేకం కావటానికి ప్రయత్నం చేయరు. వీరు కనీసం మాతృభాషలో ఒక ఉత్తరమైనా రాయరు. తమ మిత్రులను, ఆత్మీయులను కలుసుకున్నప్పుడు సాధ్యమైనంతవరకు ఆంగ్లంలోనే మాట్లాడతారు. స్వదేశీ భాషా గ్రంథాలను తమ యింటిలోకి కూడా రానీవ్వరు. దీన్నే చిన్నతప్పుకు పెద్దదండన అంటారు.

బాల్యంలో మనకు నేర్పే విద్యలో భాషాజ్ఞానంతో పాటు భావాలలో శిక్షణను ఇవ్వరు. సమయం మించిపోయిన తరువాత దానికి విరుద్దంగా జరుగుతోంది. భావాలు ఉత్పన్నమయ్యే సమయానికి మన వద్ద భాష వుండదు.

భాషాజ్ఞానంతో పాటు భావస్స్ఫూర్తిని కలగచేసే విద్య నేర్చడం లేదని ముందుగానే చెప్పాను. అందువల్లనే మన భావాలు, పాశ్చాత్య భావాల మధ్య సమానత వుండడం లేదు. యీ రోజు చాలామందివిద్యావంతులు పాశ్చాత్య విషయాలపట్ల విముఖత చూపుతున్నారు. అలా అని వారు తమ మాతృభాషలో సన్నిహిత పరిచయం ఏర్పరచుకోలేక పోతున్నారు. తమ స్వభాషకు కూడా వారు చాలా దూరమై పోయారు. తమ భాషపట్ల వారి మనస్సుల్లో అవహేళనాభావం చోటుచేసుకుంది. కానీ వారు తమకు మాతృభాషాజ్ఞానం లేదని కూడా ఒప్పుకోవటం లేదు. ప్రతి భావాన్ని వ్యక్తం చేసే శక్తి మన మాతృభాషకు ఉందా? అని ప్రశ్నిస్తూ యీ స్వభాష విద్యావంతులకు పనికిరాదు అని చెప్పి తమ బలహీనతను కప్పి పుచ్చుకుంటారు. అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్లు ఉంది ఇది. మనశక్తికి అలవికాని పనిని ప్రశంసించటానికి బదులు నిందించటం మొదలుపెడతాం.

తరువాయి 28 వ పుటలో.......