అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద
ధారావాహిక
ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, 9848123655
పడమటి గాలితో
నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద
మానవుడికి భాష ఎంత అవసరమో అక్షరాన్ని తరతరాలకు భద్రం చేయవలసిన అవసరం కూడా అంతే ఉంది. భాష ఏర్పడిన వేల సంవత్సరాలకు అక్షరం లిఖిత రూపంలో వచ్చిందన్నదీ అక్షరాక్షర సత్యం. తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాల చరిత్ర అసక్తి కలిగించే ప్రాచీన చారిత్రక గాథ. తొలి తెలుగు శాసనం (575) ఎర్రగుడిపాడు శాసనమాకాదా అన్నది కొంత వివాదాస్పదమే. అమరావతిలో దొరికిన భ్రష్ట్రశిలాఫలకం “నాగబు” అనే మాట తొలి లిఖిత తెలుగు పదమని వేటూరి ప్రభాకరశాస్త్రి (భారతీ జూన్ 1928) చెప్పేవరకూ మనకు తెలియదు. ఈ మాటనే ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో ధ్రువీకరించి అదే మాట తన పుస్తకం అగ్రభాగన ముద్రించిన విషయంలోక విదితమే. శాసనభాషా క్రమపరిణామ వికాసం అసక్తి కలిగించే అద్భుత సాహిత్య సంపద. భాష కావ్య రూపం దాల్చక ముందే శాసనాల్లో పద్య సంపద ఉందన్నా విషయం మనకు తెలిసిందే. అది నాణానికి ఒక వైపు మాత్రమే. ద్వితీయ పార్య్వంలో ముద్రణా వికాస విస్తరణ ప్రారంభమయిన తర్వాత సాహిత్యం, సమాజం బహు విధాలుగా వృద్ధి చెంది వికసించింది. ఈ నేపథ్యంలో భారతదేశానికి పాశ్చాత్యులు వాణిజ్యం పేర వచ్చిన కాలం విచిత్రమైన, వైవిధ్యమైన వ్యాపారం. ఇది ఐబహుముఖాలుగా విస్తరిల్లింది.
'దుబాసిలనబడే ద్విభాషీలూ: వాస్మోడిగామ 1498 మే 20న కోజికోడులో దిగిన తర్వాత బుడత కీచు (పోర్చుగీసు) వారి వ్యాపారం బాగా వృద్ధి చెందడం, ఆపై ఇతర దేశాలు భారత దేశంవైపు ఆకర్షించడం జరిగింది. దాంతో 1600లో ఇంగ్లండ్ తూర్చిండియా కంపెనీ భారతదేశంలో వర్తకం చేయడానికి గుత్తాధిపత్యం పొందారు. ఆపై 1602లో డచ్ వారు యునైటెడ్ ఈస్టిండియా కంపెనీ, 1616లో డెన్మార్మువారు, 1664లో ఫ్రెంచ్ వారు, 1665 ప్రాంతంలో బెల్లియం వారి ఆస్టంట్ కంపెనీ, 1712లో స్వీడన్ దేశీయులు తూర్చిండియా కంపెనీ. విడతలు విడతలుగా వ్యాపారం, ఆపై వాళ్ళ వాణిజ్య సంఘాలు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో 1622 నాటికి ప్రళయ కావేరిలోనీ డచ్ వారు బానిస వ్యాపారం కూడా చేశారు. నాలుగైదు వందలమంది బటేవియాకు తీసుకుపోతున్నట్లు తామస్ మిల్ అనే ఇంగ్లీషు వర్తకుడు బందరులోని తన అధికారులకు తెలియజేశాడు. ఇలా పాశ్చాత్య దేశాలు మనదేశంలో వాణిజ్య పంటలయిన సుగంధ ద్రవ్యాలు, మణులు, మాణిక్యాలతో పాటు బానిసలుగా మనుషుల వ్యాపారం సాగింది. ఐతే 1682లో బానిసల వ్యాపారం నిషేదిస్తూ కుంఫిణీ దొరతనం వారు ఇంగ్లీషు, తెలుగు, పోర్చుగీసు భాషల్లో ఆజ్ఞాపత్రాన్ని వెలువరించారు. ఈ పరిస్థితిలో తెల్లవాళ్లకి మనకు ద్విభాషీలు (దుబాసీ) కావలసి వచ్చింది. తొలినాళ్ళలో పోర్చుగీసు భాష అధికారికంగా రాజ్యం చేసింది. దినసరి లెక్కలు, వాది 'ప్రతివాదుల అభియోగాలు, ధర్మాసనం వారి తీర్పులు, ఆస్థి పాస్తుల క్రయవిక్రయాలు దాన ధర్మాలు మొదలయినవన్నీ బుదత కీచు భాషలోనే జరిగినట్టు (1670-1681) నాటి లేఖల వల్ల తెలుసుకోవచ్చు. ఈ కాలంనాటి దేశీయ గీయ ద్విభాషీయులు పెత్తనం అంతింతకాదు. దాదాపు వాళ్లే రాజ్యం చేసేటంతదాకా ఎదిగి అటు పాశ్చాతుల్ని ఇటు దేశీయుల్ని మోసగించే స్థితి కలిగింది. కొన్ని సందర్భాలలో దొరల ఆ(గ్రహానికి గురై శిక్షలు కూడా అనుభవించారు. తొలినాటి ద్విభాషీయుల మోసం, లంచగొండితనం గమనించిన తెల్లదొరలు స్వంత గ్రంధాలు తయారుచేసుకోవలనిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అత్యంత నమ్మకస్తులుగా ఏర్పడిన కాంద్రేగుల జోగిపంతులు 1763 ప్రాంతం, గోడె జగ్గారావు (1761) ఆనంద రంగపిళ్ళే (1747) లక్ష్మన్న (1750) మొదలయిన వాళ్ళు నమ్మకంగా పనిచేసి కొందరు జమిందారులు కూడా అయ్యారు.
తొలి తెలుగు పుస్తక ప్రచురణకర్త షూల్ద్:
పాశ్చాత్యులు భారత దేశానికి విడతలు విడతలుగా వివిధ దేశాల నుంచి వచ్చారు. ఇక్కడె స్థిరపడి వేర్వేరు పేర్లతో వ్యాపార కలాపాలు ప్రారంభించారు. నేటి తమిళనాడులోని తంజావూరు
సమీపంలో తరంగంబాడినీ (Tranqubar) డెన్మార్కు వారు 1616 నాటికే ఆక్రమించారు. అందువల్ల డెన్మార్కు రాజు ఆదేశానుసారం భారత దేశానికి వచ్చిన తొలి ప్రొాటస్టెంట్ లూథరన్ మిషనరీ బర్తలోమయి జిగెనాబాగ్ Barthalomoaus Ziegenbag. ఈయన తన సహచరుడైన హెన్రీఫుట్ షా Heinrich Pleulschauతో కలిసి 1705 నవంబర్ 29న డెన్మార్ము దేశపు రాజధానీ నగరమైన కొపెర్నఏం (Copernhagen)లో బయలుదేరి 1706 జులై 9 నాటికి తరంగంబాడి చేరుకున్నారు. వీరి రాకతో భారత దేశంలో ప్రాటస్టెంట్ క్రైస్తవ మత శాఖ ప్రారంభమయింది. తమిళ తెలుగు హిందుస్తానీ ముద్రణా వికాసం కూదా జిగెబాగ్ అనంతరమే జరిగింది. ఈ వివరాలన్నీ సెప్టెంబర్ సంచికలో చూడవచ్చు.
జిగెన్‌బాగ్ అనంతరం వచ్చిన రెండో జట్టులో ప్రజలభాషకు పట్టం కట్టిన బెంజమిన్ షూల్డ్ ముఖ్యుడు. షూల్డ్ భారతీయ భాషలయిన తెలుగు, తమిళం, హిందుస్తాని, ఉరుదుతోపాటు ఇంగ్లీషు, జర్మన్, పోర్చుగీసు, ఫ్రెంచ్, గ్రీక్, హిబ్రూ, సిరియన్, అరబిక్ భాషలు నేర్చిన బహుభాషా పండితుడు. బెంజమిన్ షూల్జ్ 1689 జనవరి 7వతేదిన జర్మనీ దేశంలోని సోనీబర్గ్Sonneeburg గ్రామంలో జన్మించాడు. లాండ్స్ బర్గ్ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతరం ఫ్రాంక్ ఫర్ట్, హలె (జర్మని) విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యపూర్తి చేశాడు. హలెలో అప్పటికీ ప్రధానాచార్యులుగా ఉన్న ఆగస్ట్ హెర్మన్ ప్రాంక్ (August Hermann Francke 22-3-1633-8-6-1727) హెన్రిక్ మైకెల్ నేతృత్వంలో మతతత్వం, మానవ జీవ శాస్త్రంతో పాటు లాటిన్, గ్రీక్, హిబ్రూ, సిరియన్, అరబిక్ భాషలు నేర్చుకున్నాడు. బహుభాషాధ్యయనం మానవుణ్ణి తేజోవంతుణ్ణి చేస్తుందన్న గురువుల మాటలు షూల్డ్ వంట బట్టించుకున్నాడు. ఆతనికున్న సూక్ష్మ పరిజ్ఞానాన్ని భాషాధ్యయన ఆసక్తిని గమనించిన గురువులు అనతికాలంలోనే భారత దేశానికి మత గురువుగా, భాషావేత్తగా, రచయితగా కవిగా గుర్తించి పంపారు. భారత దేశానికి వచ్చిన అతికొద్ది కాలంలోనే తమిళం తెలుగు నేర్చుకున్నాడు. అప్పటికే జిగెన్ బాగ్ తమిళ బైబిలు అనువాదం ప్రారంభించాడు. భారత దేశ కాలమాన మత పరిస్థితులను పూర్తిగా ఆకళింపు చేసుకున్న జిగెన్ బాగ్ తమిళ ప్రాంతపు దేవాలయాలు, వివిధ మతాలపై ఒక సాధికారిక గ్రంథం 219 పుటల్లో పూర్తి చేశాడు. తమిళంలో నీతివెణ్బా, కొందైవేందన్, ఉలగనీతి అనే కావ్యాలు రచించాడు. జిగె బాగ్‌కి తోడు జాన్ ఎర్బెఫ్ట్ (గుండ్లర్ (1677-1720) అనే మరో జర్మన్ పండితుడు కలిసి 1713 నాటికి ఒక తమిళ గ్రంధం సెప్టెంబర్ నెలలో ప్రచురించారు. ఈ నేపథ్యంలో షూల్డ్ రాక తరంగంబాడిలో జర్మన్ పండితులకు మరింతబలం చేకూరినట్టయింది. షూల్డ్ వచ్చిన అనతికాలంలోనే అంటే 1719లో జిగె బాగ్ మరణించాడు. జిగె బాగ్ మరణించే నాటికి 37 సంవత్సరాలు. ఆ బాధనుంచి తేరుకునేలోపే చురుకుగా ముద్రణా బాధ్యతలు కొనసాగిస్తున్న గ్రుండ్లర్ 1720 మార్చి 19వ తేదిన మరణించాడు. తరంగంబాడి బాధ్యతలన్నీ షూల్డ్ పైనే పడ్డాయి. షూల్డ్ మీద పడిన పెనుభారం, సహచరుల మరణం ప్రాంతీయ బాధ్యతలన్న ఒకవైపు కుంగదీసిన మరో వైపు కర్తవ్య నిర్వహణ బాధ్యతను, ఇంకోవైపు దేశీయ పాఠశాలల నిర్మాణం, వారికి కావలసిన పుస్తకాల తయారి క్షణంతీరిక లేకుండా చేసింది. ఈ పరిస్థితులలో పోర్చుగీసు, డేనిష్, తమిళ భాషల్లో ఇరవై పుస్తకాలను ఆరేళ్ళల్లో ప్రచురించాడు. 1721 నాటికి 48 కీర్తనలు సంకలనం చేసి ముద్రించాడు. 1728 నాటికి 160 తమిళ కీర్తనలను అచ్చు వేశాడు. ఆపై దేశీయ సంగీత బాణీల్లో 112 కీర్తనలున్న పుస్తకాన్ని అచ్చు వేశాడు. అంతకు ముందే జిగెనా బాగ్ అసంపూర్తిగా మిగిల్చిన తమిళ బైబిలు అనువాదం 1725నవంబర్ 25 నాటికి పూర్తి చేశాడు.
మరో కోణంలో 1725 నాటికి డేనిష్ వారికి అధీనంలో తమిళ గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించారు. గ్రామ వాసులందరూ కులమత తారతమ్యం లేకుండా మాతృభాషలో విద్వాబోధన చేయాలనే నియమం పెట్టారు. దీనికిగాను తమిళ పండితులకు మంచి జీతం యిచ్చి పాఠశాలలు నడిపారు. 1725 నాటి లెక్కల ప్రకారం ఉచిత పాఠశాలలు 21 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యప్తుకాలు అచ్చు వేయవలసిన అవసరం ఏర్పడింది. దానికి కావలసిన పాఠ్యపుస్తక ప్రణాళిక షూల్డ్ తోపాటు దేశీయ పండితుల సహకారంతో పుస్తకాలు తయారైనాయి. విద్యార్థులు రాయడం, చదవడం, లెక్కలు కట్టడం లాంటివి విధిగా నేర్చుకోవాలి. తమిళంతో పాటు ఇంగ్లీషు, పోర్చుగీసు భాషలు అధ్యయనం తప్పక చేయాలనే నియమం ఉంది.
మద్రాసులో 1726 నాటికి రెండున్నర లక్షలమంది దేశీయ జనాభా ఉంది. వారిలో తెలుగువాళ్లు కూడా అత్వధికంగానే ఉన్నారు. దానికో కారణం కూడా ఉంది. 1639 ప్రాంతంలో చెన్న పట్టణం పరిసర ప్రాంతాలు తెలుగు రాజుల ఏలుబడిలో ఉన్నందువల్ల తెలుగువారి ఉనికి, తెలుగువారి ప్రాభవం కొంత మెరుగ్గానే ఉంది. ఐతే తెలుగువారిని మాత్రం జెంటూలనీ, మలబారీలని, (తర్వాత మదరాసీలు) పిలిచేవారు. కోస్తా, తూర్పుకోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాలు ఇంగ్లీషు వారి అధీనంలో ఉండేవి. ఆనాటికే ఇంగ్లీషు వారి గిడ్డంగులున్నాయి. షూల్డ్ తెలుగువారి మధ్య ఉచిత పాఠశాలలు ప్రారంభించాడు. దీనికి డేనిష్ రాజుల సహకారం కూడా లభించింది. వెంటనే రెండు తెలుగు పాఠశాలల్ని మలబారీ తమిళులకి ఒక పాఠశాల 1726లోనూ పోర్చుగీసు పాఠశాల 1732లోనూ బ్లాక్ టౌన్‌లో ప్రారంభించాడు. బ్లాక్ టౌన్ లో ప్రారంభించిన తెలుగు పాఠశాలతోపాటు పోర్చుగీసు పాఠశాలల్లో తెలుగు ప్రత్యేక అధ్యయనంగా బోధించేవారు. తెలుగు పాఠశాల బోధనలో విద్యార్థులతోపాటు షూల్డ్ కూడా తెలుగు నేర్చుకుని తెలుగులోనే మాట్లాడేవాడు. మరో విశేషం ఏమంటే ఒక ఏడాదిలోనే తెలుగు అనర్గళంగా మాట్లాడి తెలుగులో తెలుగువాళ్ళ మధ్య పాటలు, ప్రసంగాలు చేశాడు.
1726 సెప్టెంబర్ 14వ తేదీన మలబార్ స్కూల్‌లో 12 మంది విద్యార్థులు చేరారు. వారికి విద్య ఉచితం. తెలుగు పాఠశాలలో కూడా అనేక మంది విద్యార్దులు చేరారు. కాని పాఠశాల నిర్వహణకు బ్రిటీష్ గవర్నర్ సహకారంతో నెలవారి గ్రాంట్ వచ్చే ఏర్పాటు జరిగింది. భారతదేశంలోనే గ్రాంట్-ఇన్‌ఎయిడ్ పాఠశాలకు ఇక్కడే అంకురార్పణ జరిగింది. అది తెలుగు పాఠశాలలో కావడం గమనించదగిన విషయం. పోర్చ్‌గీసు పాఠశాలలో 1932 నాటికి ఏడుగురు విద్యార్థులు చేరితే అందులో ఆరుగురికి ఉపకారం వేతనం యిచ్చారు. అదే ఏడాది మలబారు స్కూలులో (పాక్షికంగా తెలుగు తమిళ విద్యార్థులు కలిసిన పాఠశాల) 17 మంది విద్యార్థుల్లో 18 మంది బాలురు నలుగురు బాలికలు. వాళ్లలో తొమ్మిది మంది మిషన్ కాంపౌండ్ హాస్టల్‌లో ఉన్నారు. షూల్డ్ (ప్రారంభించిన ఉచిత పాఠశాల విద్యాబోధన (తెలుగు, తమిళం, పోర్చుగీసు భాషల్లో) వల్ల పేద వర్ధాల విద్యార్థుల జీవితాలకు ఒక వెలుగు కిరణం ఉదయించి నట్టయింది. షూల్త్ ప్రారంభించిన పాఠశాలల
ప్రారంభోత్సవంలో ఆగస్ట్ హెర్మన్ ఫ్రాంక్ ని గుర్తు చేసేవాడు. ఆయన మానస పుత్రిక అయిన ఉచిత విద్యాబోదన, మాతృభాషా బోధన, పేదలకు హాస్టల్ వసతి లాంటివి ప్రపంచానికి కొత్త నేత్రాలని స్మరించేవాడు. షూల్డ్ తరంగంబాడి నుంచి మద్రాసుకు వచ్చినందువల్ల తెలుగు బాగా నేర్చుకున్నానని చెప్పేవాడు. ఈ కాలంలోనే 1728 నాటికి మద్రాసులోనే గ్రమటిక తెలుగిక” పూర్తి చేశాడు. ఇదే తాలి తెలుగు ముద్రిత వ్యాకరణం. (వివరాలు అక్షోబర్ సంచికలో చూడవచ్చు) షూల్డ్ తెలుగు భాషతోపాటు తమిళ, హిందుస్తానీ, దక్కన్ ఉరుదు భాషల్లో బైబిలు తర్జుమా చేశాడు. భారత దేశంలో 23 సంవత్సరాలు పుస్తక ముద్రణ, అనువాదాలు, పాఠశాలలు, హాస్టల్ వసతి మొదలయినవన్నీ నడిపి అనారోగ్య కారణాల వల్ల 1743లో స్వదేశానికి తిరిగి వెళ్ళాడు. హాలే నగరంలో శేష జీవితం గడిపాడు. అక్కడ కూడా 1746-47 మధ్య కాలంలో నాలుగు శీర్షికల్లో ఆరు తెలుగుపుస్తకాలు ముద్రించాడు. ఇవి ప్రఖ్యాత జర్మన్ లూథరన్ తత్వవేత్త, పండితుడు అయిన జోహెన్ ఆర్నెడ్ (1555-1621) రచించిన నాలుగు గ్రంథాలకు అనువాదాలు.
1. ia Sie or do Saltis : మోక్షానీకి కొంచ్చు ఫొయ్యెదొవ - 1746 (ఈ శీర్షికలో రెండు వేర్వేరు పుస్తకాలున్నాయి)
2. Catechismus Telugious minor: సత్యమైన వెదంలో ఉండే జ్ఞానవుపదేశాల యొక్క సంక్షేపం.
3. Mores itamae Christiano dignam delonanres - బుద్ది కలిగిన తెలుగు వాండ్ల లోపలొక డొకడికి పుణ్యపు దొవ చూపించే నూరు జ్ఞాన వచనాల యొక్క చిన్న పుస్తకం (ఈ శీర్షికలో రెండు వేర్వేరు పుస్తకాలున్నాయి.)
4. Colloquim Religiosissimusm : వక గురువు అఇదు బ్రాహ్మల యొక్క నడమన కూచండి విండ్లతోను వాక్కొడి ఆకాసమున్ను భూమిన్ని ప్రప్పించిన 'పెద్దస్వామి మీద ప్రసంగించిన తక మిదె (ఈ పుస్తకం షూల్డ్ స్వీయ రచన) ప్రతి పుస్తకంలోనూ లోపలి మొదటి పుట లాటిన్ భాషలోనూ, ఆ తరువాతి పుట తెలుగు భాషలోనూ ముద్రించాడు. ఈ పుస్తకాల ప్రతులు బ్రిటీష్ మ్యూజియం, లండన్ లోను, కాపెన్ హగన్ లోనీ రాయల్ గ్రంధాలయంలోనూ ఉన్నాయి. భారత దేశంలోని, నిరంవూర్ తియోలాజికల్ సెమినరీ కేర్ గ్రంథాలయంలో రెండో పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని తొలి తెలుగు పుస్తకమని భ్రమించి రాజమండ్రి వారు ప్రచురించారు. ఇది 1747లో హాలేలో అచ్చయింది. ఈ పుస్తకం ప్రతి పొడవు 16 సెం.మీ. వెడల్పు 10 సెం.మీ మొత్తం పుటలు 73. ప్రతీ పుటలోనూ 20 పంక్తులున్నాయి. ప్రతి పంక్తికి 12 నుంచి 14 అక్షరాలున్నాయి.
శీర్షికలో పెద్ద అక్షరాలు 0.7 సెంమీ. పుటల సంఖ్య తెలుగు అంకెలున్నాయి. 45 పుటల వరకు ఒక పుస్తకం. తరువాత సత్యమైన వెదంలో వుండే జ్ఞానవుప్రదేశాల యొక్క సంక్షేపం” మొదలవుతుంది. ఇందులో మొత్తం 24 పుటలున్నాయి. లాటిన్ భాషలో ముద్రించిన పుటలో స్పష్టంగా 1747 అనే ఉంది. అందువల్ల ఇది షూల్ళి ప్రచురించిన రెండో పుస్తకం. తొలి తెలుగు ముద్రిత గ్రంధం మాత్రం “మోక్షానికి కొంచ్చుపొయ్యెదావా ఇది అనూదిత గ్రంథం 1746లో ముద్రణ జరిగింది. అదీ జర్మనీ దేశంలోని హాలె నగరంలో తొలి తెలుగు పుస్తకం భారత దేశంలో అచ్చుకాలేదన్నది స్పష్టం.
1747లో 0౦0౧౪౦ఆ౦1 [1162168 7910610౬] ౪౪18౦ ౭౦! 4౧9 అనే 12 పుటల గ్రంథం చిన్న పుస్తకం ప్రచురించాడు. ఇందులో తెలుగు వర్ణ సమామ్నాయం, గుణింతాలు సంయుక్త రూపాలు తెలుగులోనూ, లాటిన్ భాషలోనూ రాశాడు. తెలుగు భాషా స్వరూపం సమగ్రంగా చూపాలనే ప్రయత్నమిది.
1750లో ముఫై సంభాషణలున్న మరో పుస్తకం హాలి నుంచే ప్రచురించాడు. ఇది రోమన్ లిపిలో ఉన్న తెలుగు పుస్తకం దైనందిన వ్యవహారాలకు సంబంధించిన సంభాషణలు ఇందులో ఉన్నాయి. యజమానులు, సేవకులు, వంటవాళ్లు, చాకళ్ళు, దుకాణదారులు ఇతర పనివాళ్ళతో సంభాషించే పద్ధతులున్నాయి. మనకు పుస్తకాల విక్రేతల వద్ద 30 రోజుల్లో తెలుగుభాష, 30 రోజుల్లో హిందీ భాష అనే పుస్తకాలుంటాయి. వాటికి మూలం షూల్లి ప్రచురించిన సంభాషణల పుస్తకం తొలి ఆకరువు.
1728-32 మధ్యకాలంలో షూల్డ్ తెలుగు బైబిలు అనువాదం చేశాడు. ఇది పూర్తిగా చేతిరాత ప్రతి. ఇందులో 432 పుటలున్నాయి. దీని లాటిన్ టైటిల్ "OCABULARIUM - TELUGO -TAMULO - BIBLICUM - NOLTESTAMENT" అని పేర్మొన్నారు. కొత్త నిబంధనలో 260 చాష్టర్లు, పాత నిబంధన 659 చాష్టర్లున్నాయి. ప్రతిపుటలో తెలుగు పదాల ఉచ్చారణ ఆంగ్లంలోనూ, అర్జాలు ఇంగ్లీషు - లాటిన్ భాషలో ఉన్నాయి. తెలుగు బైబిలు - కం - నిఘంటువుగా దీన్ని పేర్కొవచ్చు. 10,500 పదాలకు అర్జాలున్నాయి. 1842లో గుంటూరుకు వచ్చిన లూథరన్ శాఖకు చెందిన జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ ఈ పుస్తకం తీసికొని వచ్చినట్టు ఆయా లేఖలు స్పష్టం చేస్తున్నాయి.
తెలుగు భాషను ప్రేమించి, తెలుగు భాషను తొలినాళ్లలో ముద్రించిన బెంజిమిన్ షూల్డ్ మహాశయుడి వివరాలు డాక్టర్ జోలెపాలెం మంగమ్మగారు “Book printing in India” అనే గ్రంథంలో వివరించడం మనభాగ్యం.