అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

డా. గంధం సుబ్బారావు 7901053537


పీవీ నరసింహారావు గారు బహుముఖ శేముష్షీవిలసితుడు. ఆయనలో కవితాగుణాలు, దార్భనికతా లక్షణాలు - రెండూ జంటగా పెనవేసుకొనివున్నాయి. ఆయన వృత్తి రాజకీయాలు. ప్రవృత్తి కవిత్వం. ఆయనలో బాల్యం నుంచి భావావేశం అనే సహజలక్షణం వుండినది. కళాత్మకంగా తాదాత్యానుభవం పొందే చిత్తస్ఫూర్తి అన్వేషణాశీలమైన సూక్ష్మవివేకం, ఆస్వాదనాశీలమైన (గగ్రవాణ ప్రకర్షణలతో పాటు, అవురూవమైన ధీవిభవం, స్వయం్రేరకమైన వక్తృత్వ వైశద్యం వంటి ప్రతిభానైపుణ్యాలు నిబిడీకృతమైవున్నాయి. ఏవీ గారు సహజకవి, రచయిత, భావుకుడు.

“అతడు మహాకవి కాలేదు. గొప్ప నవలారచయితా కాలేదు. సంగీత విద్వాంసుడు గానో, లేదా చిత్రకారుడు గానో రూఢీ చెందలేదు. తత్వవేత్తగానో, శాస్త్రపరిశోధకుడుగానో - లేక విఖ్యాత న్యాయవాది గానో కూడా పేరు పొందలేదు”. పీవీ గారి గురించి ఈ మాటలనే సాహసం చేసిన వ్యక్తి ఆయన ఆప్తమి[త్రుడు, కాకతీయ పత్రిక సంపాదకులు, కీ.శే. పాములపర్తి సదాశివరావు గారు. 1972 మార్చిలో “జనధర్మ” ప్రచురించిన పీ.వీ. నరసింహారావు అభినందన సంచికలో రాసిన వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

సదాశివరావు గారంటే, బాల్యం నుంచీ శరీరాలు వేరైనా ఆత్మ ఒకటిగా పీవీతో జీవించిన మహానుభావుడు. అందుచేత ఇవి పీవీ గారు తనను తాను అంచనా వేసుకున్న మాటలుగా భావించవచ్చు.

ఈ మాటల్లో గుర్తింపవలసిన ఒక చనత్మారంవుంది. ఇక్కడ “కాలేదు? 'చెందలేదు? “పొందలేదు” - అంటూ చెప్పబడినవన్నీ అట్లా కావడానికి, చెందడానికి, పొందడానికి తగిన ప్రతిభా సామర్ధాలు వీవీలో వుష్కలంగా ఉన్నాయని నిర్ధ్యంద్వంగా తెలియజెప్పటమే.

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఈ అక్టోబరు-2020 |

పీవీ వ్యాసంగ వైవిధ్యాన్ని వ్యాపకత్వాన్ని సువ్యక్తం చేయడమే. ఆ లక్షణాలన్నింటినీ ఒక చోటికి చేరిస్తే రూపుగట్టిన వ్యక్తిత్వం వీవీ గారిది.

పీవీకి గల పై అన్ని లక్షణాల్లో ఆయనకు రాజకీయ రంగం తరువాత, ఇంచుమించుగా అంతటి గుర్తింపును తెచ్చిన మరొక రంగం ఆయనకు గల సాహిత్యాఖినివేశం. కవిత్వం, కథ, నవలిక, అనువాదం, నాటకం, విమర్శ, వ్యంగ్యం - హాస్యం, జర్నలిజం వంటి దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ ఆయన తన ప్రతిభను సందర్భోచితంగా ప్రదర్శించారు.

కవిత్వం:

ఆనాటి హైదరాబాద్‌ రాజ్య రాజకీయ పరిస్థితిల్లో సంఘాలు పెట్టుకోవడం, రాజకీయ సమావేశాలు నిర్వహించడం నిషేధం. అందుచేత దేవుని పేరిట భజన మండళ్ళను ఏర్పాటు చేసుకుని, భజనల నెవంతో నమావేశాలను నిర్వహించుకోవడం, ఈ సమావేశాల్లో విద్యార్థులకు దేశ సమకాలీన రాజకీయ పరిస్థితులు, జాతీయోద్యమం వంటి అంశాలను బోధించి, వారిలో స్ఫూర్తిని రగిల్చి, చైతన్యవంతులను చేయడం జరుగుతుండేది. (గ్రంథాలయోద్యమం కూడా ఇదే వ్యూహంతో కొనసాగింది.

హనుమకొండ హైస్కూల్లో కూడా ఇటువంటి భజన మందలి ఒకటి ఏర్పాటైంది. ఆ ఏర్పాటులో పీవీ ది ప్రధాన పాత్ర. ఆ మండలి సమావేశాల్లో కవితావఠనం, కథావఠనం, విద్యార్థులు తాము రచించినవి చదవడం మొదలైనవి ఉండేవి. ఆ భజన మండలి, ఒక సమావేశంలో వీవీ “జయచంద్రా ! హైందవ విధ్వంసకా!” మకుటంతో రచించిన వద్యాలూ, వాటిని ఆయన చదివిన ఉద్విగ్నభరితమైన తీరూ అక్కడ వున్నవారినందరినీ ఉత్తేజితుల్ని చేశాయి. వృథ్వీరాజు పై వ్యక్తిగతమైన అనూయాద్వేషాలతో దేశద్రోహానికి పాల్పడిన జయచంద్రుని అధిక్షేపిస్తూ రాసిన పద్యాలివి. ఆనాడు నిజాంకు తొత్తులుగా వుండిన కొందరు ప్రజాభీష్టానికి వ్యక్తిరేకంగా చేస్తున్న చర్యలను నిరసిస్తూ రాసిన పద్యాలివి. కానీ ఆ పద్యాలిప్పుడు లభించడం లేదు. అయితే ఈ పద్యాలు మత్తేభ శార్జూల విక్రీడితాలని, విషయ వ్యక్తీకరణకు, అభివ్యక్తికి అనుకూలమైన వద్యాలని, పద్య రచనలో చేయి తిరిగిన తీరు “మకుటం” సూచిస్తున్నదని దా. కోవెల సంపత్కుమారాచార్య తమ వ్యాసం “పీవీ సాహిత్య వ్యక్తిత్వం” లో పేర్కొన్నారు.

పీవీ గారు కేవలం వృత్తాలను మాత్రమే కాక, ద్విపదలు, గీతాలు, గేయాలు కూడా విరివిగా ఆ రోజుల్లో రాసేవారని, ఆ రచనలు స్థూలంగా భావకవితాధోరణి అనిపించినా, సమకాలీన రాజకీయ, సామాజిక, సాంస్కృతికాంశాల స్పృహ, స్పర్శ వాటిలో దోబూచులాడుతూ ఉండేవని పాములపర్తి సదాశివరావు గారు పేర్మాన్నారు.

“నిర్మలాకాశం పై నుంచి ఒక “చుక్క చాన తనను ఆకర్షణతో మిలమిలా చూస్తున్న రమణీయ తరుణంలో - హఠాత్తుగా అది చూచి ఘూక కాంత యొకర్తు గొల్లున నవ్వె” అనే అనుభవం ఒక గీతికలో పొందుపరచబడింది. అలాగే, బాల్య స్నేపాతులను, వారితోడి ఆటాపాటలను, కేళీవిలాసాలను, వాటిలోని అమాయక అనుభూతి ఘడియలను తలచుకున్నప్పుడు - “కఠినునకునైనా నాగునే కంటినీరు” అంటూ మరొక గీతం రాశారు. యౌవనంలో (ప్రేమ అనీ ప్రణయం అనీ పీవీ ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహాసుందరిని తలపోసి, శృంగారంపై చక్కటి రొమాంటిక్‌ వేదనతో కవితలు, ఖండకావ్యాలు రాశారు. ఇంగ్లీషులో కొన్ని భావగీతాలు, 'ఆర్త గీతాలు” అన్న పేరుతో ద్విపదలు రాశారు. ఈ రాతప్రతులు ఎవరో మిత్రుడు తీనుకుని వెళ్ళి తిరిగి ఇవ్వలేదట. ప్రబంధ శైలిలో వర్ణనలు, ఉపాలంభనలు కూడా పీవీ కొద్ది రోజులు రాసేవారు. 'గ్యాదర్డ్‌ 'పెటల్స్‌' అంటూ కొన్ని ఇంగ్లీష్‌ భావగీతికలు కూడా ఆయన రాశారు.

ఒక బాలవ్మాయ పోటీకి వీవీ, షేక్సియర్‌ నాటకాలు నాలుగింటికి సంగ్రహ కథారూపాలను రాసి పంపారు. అందులో రెండు విషాదాంతాలు, రెండు సుఖాంతాలు. అయితే ఆ ఎంట్రీల ఫలితం ఏమైందో తెలియదు. ఇదే ఫక్కీలో ఒకటి, రెండు హిందీ సినిమా కథలు కూడా రాసి వంపారు. కాలేజీల్లో చదివే రోజుల్లో కాలేజీ మ్యాగజైన్లకు అనేక రచనలు చేశారు.

తదనంతర కాలంలో రాజకీయాలలో తలమునకలవుతున్న సమయంలో పీవీ లోని కవితాత్మ నిద్రాణమైపోయిందనవచ్చు. అయితే అప్పుడప్పుడు తనలోని భావోద్రేకం మిక్కుటమైపోయినప్పుడు అది కవిత్వం రూపంలో పెల్లుబికిన సందర్భాలూ వున్నాయి.

పీవీ నరసింవోరావు గారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1972లో దేశ స్వాతంత్ర్య రజతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంవత్సరం ఆగష్టు 15వ తేదీ ప్రవేశించిన అర్ధరాత్రి ఆయన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను సమావేశపరిచారు. ఈ సమావేశంలో తమ సందేశాన్ని కవితాగీతంగా ఈ విధంగా ఆలాపన చేశారు.

ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్మాంచినాడు
ఒళ్ళు విరిచి కళ్ళు తెరిచి ఓహో అని లేచినాడు
కటిక చీకటుల చిమ్మెడు కారడవిని పయనించు
నిజ జఠరాగ్ని జ్వాలల నింగినంత లేపినాడు
అదుగో, హిమనగ మిచ్చిన అశ్రుతర్చణమ్మనగా,
కడుపుమంట సెగ ఆవిరి గంగానది చేసినాడు
యుగయుగాల అన్యాయం నగుమోముల దిగమింగగ
సాంధ్యారుణ రౌద్రక్షితిజముఖుడై చెలంగినాడు
వాడొక విప్లవ తపస్వి, మోడుపడిన కాయముల
వాడిన నెమ్మనముల, సర్వం కోల్పోయిన దళగళముల
వాడి చెడిన చూపుల, బువ్వకు నోచని జనగణముల
వెతల బరువు మోసి మోసి విల్లుకు వంగిన నడుముల
జరాహటములై కృశించు జవ్వనంపు వల్లకాళ్ళ -
అన్నిటినీ కాయకల్పమా తపస్సు చేసినాడు,
నవరసాగర్ధ జీవితాల, నవోన్మేష మానసాలా
నవపల్లవ తరుశాఖల రవళించెడు పూజనాల
నవవిధ భక్తుల, రక్తుల, నవశక్తుల మేళవించి
నవనిర్మిత జుతి సంతరించినాడా విప్లవ తపస్వి,
పావు శతాబ్దము పొడుగున పాలకుల, అర్భకుల మధ్య
విభజన వికృతమైపోవగ, బావురుమనే జీవితాలు -
అటు సమృద్ధి, ఇటు దైన్యము, అటు పెంపు, ఇటు హైన్యము
ఒకడు మింటికెగయ, అసంఖ్యాకు లింకిరి భూతలమున,
అర్భకుని భుజాన మోయు అమ్మ, వాని పడద్రోయ
దారిచూపు కాగడాలు తలకొౌరివిగా పరిణమింప,
ధర్మకర్తలే ధనకర్తలుగా మారిపోయినారు.
పావు శతాబ్దము పొడవున - వెలుగు నీడలలాగాను
దాగిలి మూతలనుచు తలంచ
వెలుగు ముక్కు విదిచెను నీడల నలుపు తిరస్మరించి
తంత్రీనాదముల చెలిమి తరగదంచు భావింపగ
తీగల త్రెంచుచు నాదము తృణీకర మాలపించే
ఈ నిద్రాణ నిశీధిని
ఈ నీరవ వాయుతరంగిణిలో ఒరివిడివడి
దొర్లిన భావస్ఫుల్లింగములు వెలుగునిచ్చునా?
అటులని విశ్వసించునా పథికుడు?
మృగజలమును జలమని నమ్మి చనిన ఆ చిరపిపాసి
శీతోదక సేవనమున సేదతీరునా నేటికి?
మిన్ను మన్ను కలిసి చెలిమిచెన్నారెడు శివసుందర సీమ,
వచ్చెనంచు సంతసించవచ్చునా పాంథుడు?
భూమి దానవగ్రహమైపోవ రోదసిని మధించి
మానవతావాహనకై పూనుకున్న రాజ్యేందిర
జయదుంధుఖి విని ఉత్తేజనము పొందునా పౌరులు?
మోదమలరని చెర అరలో మూల్లిన భావ కిశోరికి
విహరణ స్వేచ్భాంతరిక్షవీధిని లభ్యమ్మవునా?
అవునని, అవునౌనని, అవునౌనౌనని జనవాక్యము
తనువులు పులకెత్త ప్రతిధ్వనితమయ్యె మన కంఠము
శాశ్వతమై నిలచెడు ప్రశ్నాపరంపర ఇది -

పృచ్ళకుదెనరో? ఇవ్వగజాలెడు నెవడో సమాధానము? నాకేల
విహంగమున కాకసంపు కాలతలేల?
చిన్ని అలకు ఒద్దు దూరమున్నదన్న చింత ఏల?
దీపము పెనుగాలికి భీతిల్లనేల ?
జీవితాత్మకు ఎన్నడూ బ్రహ్మము
చేరుదునన్న సందియమ్మదేల ?
నేనొక చైతన్యోర్మిని
నిస్తుల ప్రగతి శకలమును
ఇది నా సంతత కర్మ
మరే హక్కులు లేవు నాకు
ఈ నిద్రాణ నిశీధి మహిత జాగ్బతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ!

అలాగే తన ప్రియ మిత్రుడు కాళోజి నారాయణరావు షష్టి పూర్తి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీవీ ఈ క్రింది గేయం రాశారు.

ఆరు పదులు నిందెనంట నారయ! నీ కాయమునకు -
ఆరా? పదియా? మనస్సునకనెడు సందియము తోచును!

సూక్తులు శాపములును పునరుక్తి దోషమంటకుండ
జగత్తు నభిశంసించుచు శతవత్సరములు దాటుము!

నోటి కస్సుబుస్సుకు కన్నీటి వింత జతగూర్చుచు
అంతరంగ నవనీతము ననారతము పంచియిమ్ము!

బ్రహ్మ నీకు పొరపాటున పాపుల వయసిచ్చుగాక!
కాలుడు మా కాళయ్యను కలకాలము మజచుగాక!

పీవీ గారి ఒక ఖండకావ్యం “భర్సృన” లో భగవంతుడిపై సవాలు విసురుతూ, విశ్వరచనలోని లోపాలను అసమ[గ్రతను ఎత్తి చూపుతూ “నాకు నీ నైజం, శక్తి, సామర్థ్యం, ఐశ్వర్యం, విభవం వంటి వ్యర్థ భాండారం పూర్తిగా తెలుసు. కనుక నీ యొక్క ఆ ఘనతలన్నీ నీ వరకే వుంచుకో. నాకేమీ అవసరం లేదు. నువ్వు నన్ను నా స్థానంలో వున్నవాణ్ణి ఉన్నట్లుగా ఉందనిస్తే అదే పదివేలు. నీ అవ్యాజ అనుగ్రహ అధీనత నుంచి నన్ను దూరంగా తప్పుకుని పోనిచ్చావా - నీకు వేయి నమస్కారాలు నన్ను నా దారిన పోనివ్వు నీ దారిన నువ్వు పో అన్నట్లు సాగుతుంది ఈ రచన.

కథకుడుగా పీవీ

హైదరాబాద్‌ లో పీవీ, బూర్గుల రామకృష్ణారావు గారి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించేనాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. దేశమైతే స్వాతంత్రమైంది కాన్సీ హైదరాబాద్‌ రాజ్యం రజాకార్ల దురంతాలతో అల్లకల్లోలమైపోయింది. ప్రభుత్వం అండ ఉండడంతో వారి హింసాకాండకు అడ్డూ అదుపూ లేకపోయింది. మతకలహాలు పెట్రేగడంతో హిందూ న్యాయవాదులు మొత్తంగా కోర్టులను బహిష్కరించి తమ వృత్తిని మానుకున్నారు. పీవీ కి తన వకాలత్‌ పై ఆశలుడిగి, హైదరాబాద్‌ నుంచి మకాం ఎత్తేశారు.

బ్లూ సిల్క్‌ శారీ

ఆ రోజుల్లో పీవీ “బ్లూ సిల్క్‌ శారీ” (నీలం పట్టు చీర) అనే ఒక పెద్ద కథను ఆంగ్లంలో రాశారు. మతకలహాల్లో ముఖ్య పాత్రధారులు కేవలం గూండా శక్తులేనని వారికి కావలసింది మతం కాదని, తేరగా దొరికే ప్రజల ధన, మాన, ప్రాణాలేనని ఈ కథ వృత్తాంతం.

హైదరాబాద్‌ నంస్థానంలో వరిన్ఫితులు రోజురోజుకు దిగజారుతుండడంతో, పీవీ మద్రాసు వెళ్ళి అక్కడ కరపత్రాలు రాసి అన్ని ప్రాంతాలలోని ప్రముఖ వ్యక్తులకు, సంస్థలకు పేరుపేరునా పంపారు. కొందరు పత్రికాధిపతులను కలిసి, హైదరాబాద్‌ పరిస్థితిని వివరించి, వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ దాని వల్ల ఆశించిన ఫలితం కనిపించలేదు. ఇందువల్ల ప్రయోజనం లేదని భావించిన పీవీ మద్రాసు నుంచి బయల్దేరి రహస్యంగా మహారాష్ట్రలోని చాందా చేరుకొని అక్కడి స్టేట్‌ కాంగ్రెస్‌ క్యాంపులో చేరిపోయి సాయుధ ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొన్నారు. యువకులకు గెరిల్లా పోరాట పద్ధతుల్లో శిక్షణ ఇవ్వటం, రైఫిళ్ళు, బాంబులు, స్టైన్‌ గను వంటి మారణాయుధాలను సమకూర్చడం మొదలైన బాధ్యతలను పీవీ ఇక్కడ నిర్వర్తించారు.

గొల్ల రామవ్వ

ఈ నేపథ్యంలో పీవీ గారు “గొల్ల రామవ్వ” అనే విప్లవ కథను రాశారు. అందులో తెలంగాణాలో ఒక గ్రామంలో కాంగ్రెస్‌ గెరిల్లా వీరుడి జాడను పసిగట్టి, పోలీసులు అతని వెన్నాడుతారు. అతడు ప్రాణభయంతో పరిగెత్తి అర్ధరాత్రి వేళ ఒక గుడిసెలో దూరుతాడు. ఆ ఇల్లు గొల్లరామవ్వ అనే అమాయక వృద్దురాలిది. ఆమెకు పరిస్థితి అర్ధం కావడానికి ఎంతో సమయం వట్టలేదు. అతని దేహం గాయాలతో నిండి వుంది. పోలీసులు అతనిని తరుముతున్నారని ఏకు అర్థమైంది. అతనిని ఎవరని ప్రశ్నించగా నేను విప్లవ యోధుడిని వేవుు పోలీనులను ఎదిరించి, మీకోనం పోరాడుతున్నామని చెప్పాడు. అతను తన గుడిసెలో ఉంటే తన ప్రాణాలకే ముప్పని ఆమె తెలుసుకుంది. అయితే ఆమెలోని త్యాగశీలత మేల్కొని, ఇతను మనకోసం (ప్రాణాలకు తెగించాడు - ఇతనికి సాయం చేస్తే పోయేది నా ముసలి ప్రాణమే కదా అని నిర్ధారణకు వచ్చి, తన ప్రాణాలకు తెగించి, ఆ వీరుడికి తన గుడిసెలో రక్షణనివ్వడం ఈ కథ వృత్తాంతం. ఒక వక్క పోలీసుల భయం. మరొక వంక తమందరి కోసం చావుకు వెరవక పోరాడుతున్న యువకునికి రక్షణనివ్వాలన్న తాపత్రయంతో ఆ ముసలి ప్రాణం కొట్టుమిట్టాడింది.

ఈ రెండు ద్వంద భావాల సంఘర్షణ ఈ కథలో నాటకీయంగా చిత్రితమైంది. ఆకలితో నకనకలాడుతున్న ఆ గెరిల్లా యోధుడికి తనకున్నదేదో పెట్టి ఆకలి తీర్చడమే కాక, యుక్తవయస్కురాలైన తన మనవరాలి పక్కలో పడుకోపెట్టి, నిజాం పోలీసులు వచ్చినప్పుడు అతను తన మనవరాలి పెనిమిటి అని చెప్పి, వారిని నమ్మించి ఆ యువకుడిని కాపాడి తన జెదార్యం చాటుకుంది.

ఈ కథ కాకతీయ” పత్రికలో 15 ఆగష్టు 1949 సంచికలో “విజయ” అనే మారుపేరుతో వీవీ రాశారు. ఉత్తర తెలంగాణ మాండలికంలో ఆసక్తికరంగా సాగే కథ ఇది. 1955 లో “విసృత కథా సంకలనం” ప్రచురించే సందర్భంలో కథా రచయిత శ్రీపతి చొారవ, పరిశోధనతో ఇది బయటపడింది. పీవీ మరణానంతరం 2 జనవరి 2005 నాటి 'వార్త' దినవత్రిక ఆదివారం ప్రత్యేక సంచికలో ఈ కథ పునర్శుద్రితమైంది.

ఆ రోజుల్లో పీవీ గారు “జయా “విజయ”, “రాజహంసొ “భట్టాచార్య”, “రాజా” “విజయం” ఇత్యాది మారు పేర్లతో ఈ రకమైన కథలు, వ్యాసాలు ఎన్నో రాసి, తాము వరంగల్‌ నుంచి నిర్వపొన్తున్న కాకతీయ వత్రికలోనూ, ఇతర పథత్రికల్లోనూ ప్రచురించారు. ఆ తరువాత పుట్టిన తన కుమార్తెలకు “జయ, విజయ” అనే పేర్లనే పెట్టుకున్నారు.

మంగయ్య అదృష్టం

పీవీ రాసిన మరొక పెద్ద కథ 'మంగయ్య అదృష్టం”. ఇది 1999 నవంబర్‌ 8 నాటి ఆంధ్రప్రభ వార పత్రికలో ప్రచురితమైంది. దీనిని ఆ వత్రికవారు నవలిక అని పేర్కొన్నారు. ఏమాత్రం విద్యాబుద్దులు లేని ఒక నీచుడిని కూడా అదృష్టం వుంటే, ఎన్ని అవరోధాలెదురైనా, రాజకీయ పదవులు ఏ విధంగా వరిస్తాయో తెలిపే వ్యంగ్య రచన ఇది. ఆద్యంతమూ ఒకే అంశంలో సాగిన ఈ రచన ఒక ఆహ్లాదకరమైన 'పొలిటికల్‌ సెటైర్‌. దేవతల మధ్య చెలరేగిన ఒక అంతః కలహం తారాస్థాయికి చేరి తమతమ శక్తులను పరీక్షించుకోడానికి మంగయ్య అనే ఒక అనామక నిరక్షరకుక్షిని ఎంచుకున్న అపూర్వ ఘట్టం దీని ఇతివృత్తం. పీవీ గారు ఎంత సమర్థంగా అధిక్షేపాన్ని రచనలో నిర్వహించగలరన్నదానికి ఇదొక ఉదాహరణ.

సారోస్‌ ఆఫ్‌ ఎ మినిస్టర్‌ (ఒక మంత్రి గారి బాధలు)

1968 జనవరిలో హైదరాబాద్‌లో అఖిల భారత కాంగైెన్‌ కమిటీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేక సంచిక ప్రచురణ బాధ్యత పీవీ నరసింహారావు గారికి అప్పగించబడింది. సావనీర్‌ కమిటీ వైర్మన్‌ పీవీ గారే. 07.01.1968 న విడుదలైన ఈ సావనీర్‌లో పీవీ గారు ఆంగ్లంలో “సారోస్‌ ఆఫ్‌ ఎ మినిస్టర్‌” (ఒక మంత్రి గారి బాధలు) పేరుతో ఒక కథను రాశారు. ఎన్నికల సమయంలో తమ వారితో ఓట్లు వేయించి, గెలిపించిన ముఠా నాయకులు, ఆ నేత గెలిచి మంత్రి అయిన తరువాత తమ స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోడానికి నిబంధనలను తుంగలో తొక్కి ఎంత అడ్డగోలుగా వనిచేయమని ఆయనను వేధిస్తారో వివరించే వ్యంగ్య చిత్రీకరణ ఈ కథ. ఇది వీవీ గారి స్వానుభవం గానే భావించవచ్చు.

ది ఇన్సైడర్‌ (లోపలి మనిషి)

పీవీ గారి సృజనాత్మక రచనా వైదుష్యానికి పరాకాష్ట ఆయన ఆంగ్లంలో రాసిన బృహన్నవల “ది ఇన్ఫైడర్‌”. దీనిని రచించడం తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రారంభించి, ప్రధానమంత్రిగా తన పదవీకాలం పూర్తయిన తరువాత తీరిక సమయంలో వేగం పెంచి, తుదిమెరుగులు దిద్ది పూర్తిచేశారు. దీనిని తెలుగులోకి కల్లూరి భాస్కరం గారు “లోపలి మనిషి” పేరుతో అనువదించారు.

అదధ్గిక్షేపం, అవవోాన్యం, ఎత్తిపొడుపు, ఉపాలంభనం, అన్యాపదేశం నిర్వహించడంలో ఆయన ఎంత సమర్భులో ఈ రచన నిరూవిస్తుంది. ఈ (గ్రంథం తన ఆత్మకథ కాదని, “భారతదేశపు డైరీ” అని స్వయంగా పీవీ గారే పేర్కొన్నారు. ఆయన అంతర్మథనం ఈ నవల ద్వారా బాగా వ్యక్తమైంది. ఆత్మసంవేదనా పూరితుదైన ఒక వ్యక్తి బాహిరంగా, పరిస్థితుల వత్తిడితో కొంత రాజీపడినా, ఆ వ్యక్తి అంతరంగ వేదనలు వేరుగా వుంటాయని చెప్పడం ఈ రచన ఉద్దేశ్యమని భావించవచ్చు.

“ఈ రచన ఆత్మకథ కాదు. కాల్పనిక రచనవలె రచయిత స్వచ్చంద ఊహలను అనుసరించేదీ కాదు. ఇది కల్పనాయదార్థాల సమ్మిశణ సమన్వయాలతో రూపొందింది. భాగస్వామి, సాక్షి కథాకారుడు, విమర్శకుడు - ఈ నాలుగు పాత్రలను ఒకే సమయంలో పోషించే ప్రయత్నం చేస్తున్నాడు రచయిత. ఈ విశిష్ట నేపథ్యంలో ఇదా, అదా అనే మీమాంస రచనను పుట్టుకతోనే వెన్నాడుతూవుంది. దేశ స్వాతంత్రోద్యమంలో తుది ఘట్టం నుంచి నేటి వరకు లోపలి మనిషిగా రాజకీయ, సాంఘిక వికాసక్రమాన్ని సాధ్యమైనంత వ్యక్తి నిరపేక్షంగా పరిశీలించిన వాడిని కనుక ఈ రచనా సౌధం గట్టి నేలపై నిలుచుని వుందనగలను. రాబోయే కాలంలో ఆఘాత విన్మయాలు కలిగించే అనేక నమన్యలను దేశం, (ప్రవంచం ఎదుర్కోబోతున్నాయి. అందుకని ఈ రచనా వస్తువు అనంతంగా ఉంటుంది. అనంతమైన నూతన రచనల నృష్టికి అవకాశాలు కల్పిస్తుంది. ఇది నిస్సందేహం. ఈ ఒరవడిలో ప్రారంభ ప్రయత్నాలలో ఆవిర్భవించినందుకు లోవలి మనిషి తన భాగ్యానికి సంతోషిస్తున్నాడు” అని పీవీ గారు “లోపలి మనిషి” మున్నుడిలో స్వయంగా పేర్కొన్నారు.

వ్యక్తులలో గుణదోషాలను నమానంగా, నిస్పాక్షికంగా ప్రదర్శించడానికి పీవీ ఇందులో ప్రాధాన్యమిచ్చారు. రచనా శైలి (ప్రవాహంలాగా సాగుతుంది. ఎక్కడా ఎలాంటి తడబాటు కానీ అవాంతరాలు కానీ వుండవు. చెప్పదలచుకున్న విషయాన్ని సుస్పష్టంగా. అలతి పదాలలో ఆయన చెప్పారు.

ఇందులో కథానాయకుడు ఆనంద్‌ - పీవీ ఒక్కరే అంటారు. తెలియని అవాస్తవాలను కల్పించి చెప్పడం కన్నా తెలినిన విషయాలను, తన అనుభవాలను ఈ పాత్ర ద్వారా చెప్పారు పీవీ. అయితే ఆనంద్‌ పాత్ర - నరసింహారావు గారి ప్రతిరూపం కాదు. ఆనంద్‌ పాత్రను కొంత వాస్తవం, కొంత కల్పనతో ఆయన మెరుగులు దిద్దారు.

అయోధ్య

1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రధానమంత్రిగా పీవీనే బాధ్యుడని ఆయనపై పెద్ద నిందే పడింది. ఈ సంఘటన పై ఆయనను నిందించిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ లోని తన సహచరులే ముందు వరుసలో నిలిచారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను దేశానికి తెలియజేయటానికి, తనపై నిష్కారణంగా వచ్చిన ఈ నిందను బాపుకోవదానికి వీవీ గారు “అయోధ్య” పేరుతో నివేదికలాంట్ని ఒక గ్రంథం రాశారు.

(తరువాయి వచ్చే సంచికలో...)

తెలుగును బోధించడమే కాదు అన్నీ తెలుగులోనే బోధించాలి