అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద

వికీసోర్స్ నుండి

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి

98481 23655

పడమటి గాలితో

నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద

(గ్రమటిక తెలుగిక తొలి తెలుగు ముద్రిత వ్యాకరణ (గ్రంధం. దీనికి పూర్వం ముద్రణా సౌలభ్యం లేనందువల్ల మన రాతలు రచనలు అన్నీ తాళపత్ర, బూర్జుపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. నేదు ప్రామాణిక వ్యాకరణ [గ్రంథమయిన చిన్నయసూరి బాల వ్యాకరణం 1858లో అచ్చయింది. షూల్డ్‌ వ్యాకరణం 1728లో కూర్చబడింది. అంటే షూల్డ్‌ 180 ఏళ్ళ తర్వాత చిన్నయసూరి వ్యాకరణం వచ్చింది. షూల్డ్‌ వ్యాకరణంలో కూడా తొలిగా వర్ణమాలన్సు తెలుగు గుణింతాలను వివరించాడు. పాఠకుల సౌలభ్యం కోసం, యువ పాఠక నేస్తాల కోసం అచ్చు, హల్లు విభాగమేర్చడిన విధానం రేఖా మాత్రంగా వివరించడం అవసరమని పరిచయం చేస్తున్నా.

సంస్కృతంలో వర్ణాలు 50, ప్రాకృతంలో 40, తెలుగులో 36 సంస్కృత వ్యాకరణాలకు పాణినీయం మూలం. అనుంచి అః వరకు అకారాదులు, మొత్తం 16 వర్జాలు. కనుంచిళ వరకు కకారాదులు 34 వర్జాలు హల్లులు అచ్చులు,హల్లులు ఏర్పడటానికి మహేశ్వర సూత్రాలు మూల కారణం అంటారు. ఇవి మొత్తం 14 తాలి నాలుగు సూత్రాల్లో

1అఇఉణ్‌ 2 బుఇలు 3. ఎఓజ్‌ 4 ఐబెచ్‌ చివరిదయిన నాల్గవ దాన్ని ఇద్వర్దాలు అంటారు. మొదటి సూత్రంలోని తొలి వర్ణం 'అ” చివరి సూత్రంలోని చకారంతో కలిపి అచ్చులుగా పేర్కొంటారు. అచ్చులనే స్వరములు ప్రాణములు అనే వ్యవహారం కూదా ఉంది. హల్లుకు అచ్చు ప్రాణం కాబట్టి ప్రాణములు అంటారు. అచ్చులు స్వయం ్రకాశములు అందువల్ల స్వరములు అనికూడా అంటారు. 'స్వ్పయం రాజంతే ఇతి స్వరా: అని నిర్వచనం హల్లుల విషయానికి వస్తే

కహయవరట్‌ 6.లణ్‌ 7ఇమ ణనమ్‌

&ర్తుభజ్‌ 9 ఘధధష్‌ 10. జబగడదళశ్‌

11 ఖఫఛరథచటతవ్‌ 12కపయ్‌

18. శషసర్‌ 14 హల్‌ అనే పది మహేశ్వర సూత్రాలను బట్టి తొలి హ చివరి హల్‌ కలిపి వాల్లుగా పిలుస్తారు. ఇది నూళ్షంగా వివరణ. హల్గులకు వ్యంజనములు అనికూడా అంటారు. సాధారణంగా ఉచ్చారణ సౌకర్యం కోసం ఏదో ఒక అచ్చు హల్లుతో కలిపి పలుకుతాం కాబట్టి స్వరములచే ప్రకాశింప బడేవి వ్యంజనములు అని వాడుక. భాషా శాస్త్ర సౌలభ్యం కోసం మానవ ముఖాభినయ ఉ చ్చారణ సౌలభ్యం కోసం కంఠ్యములు, తాలవ్యములు మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్యాలు, అంతస్థాలు, ఊప్మములు, అనే విభాగం స్పష్టీకరించినట్టు భాషాశాస్ర్రవేత్తల నిర్వచనం. ఇది విశ్వవ్యాప్తంగా అంగీకరించే విషయం.

విశ్వవ్యాప్త భాషాశాస్త్రవేత్తలు పాణిని భాషా శాస్రపితామహుడుగా పేర్కొంటారు. పాణిని క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది వాడని అంచనా. ఈయన గాంధార దేశవాసి. తల్లి దక్షి తండ్రి పాణిని. దక్షీ పుత్ర పాణిని అని ప్రాదీన నామం. పాణిని కృతమే అష్టాధ్యాయి. ఎనిమిది అధ్యాయాలున్న గ్రంథం కాబట్టి అష్టాధ్యాయి అని పిలుస్తారు. పాణిని సంస్కృత భాషలో రచించిన ఈ వ్యాకరణ [గ్రంధం సశాస్రీయమూ, సమగ్రము అయిన వర్ణనాత్మక వ్యాకరణం (౧౪9౦/10/9 ౬౧౧౧౧౪9౧) అని అంటారు. నిజానికి ప్రపంచంలో మరే భాషకు లేనంతటి శాస్త్రీయత పాణిని అప్టాధ్యాయికి ఉంది.

సూత్ర రూపంలో రచించిన అష్టాధ్యాయి లౌకిక, వైదిక సంస్కృత భాషా న్వరూపాన్ని వర్షించే ఈ గ్రంధంలో మొత్తం 3981 సూత్రాలున్నాయి. అప్పాధ్యాయికి పతంజలి మహర్షి రచించిన మహా భాష్యమనే వాఖ్యానం. వామన జయాదిత్యులు విశ్లేషించిన కౌశికా వృత్తి వనిద్ధమైనవిగా పండితులు వ్యాఖ్యానిస్తారు. కౌశికా వ్యాఖ్యానంలో సూత్రార్ధం, ఉదాహరణం, వద ప్రయోజనం మెదలయిన అంశాలున్నాయి. ఈ [గ్రంథ రచన కాశీలో రచించినట్టు చెప్పడం వల్ల కాశిక అనే పేరు వ్యావహారికంలోకి వచ్చి అదే స్థిరపడింది.

అష్టాధ్యాయిలో మొత్తం ఎనిమిది అధ్యాయాలున్నాయి. అవసరాన్నిబట్టి ఒక్కో అధ్యాయంలో నాలుగు ఉప విభాగాలు కూడా ఉన్నాయి.

మొదటి అధ్యాయం : సంజ్ఞలు, పరిభాషలు, ఆత్మనేపద, వరస్మైపద ధాతువులు, విభక్తి రూపాలు, సమాన అవ్యయాలు ఉన్నాయి.

రెండవ అధ్యాయం : సమాస ప్రక్రియ, సమాస భేదాలు, కారక విశేషాలు దశ విధలకారాలు ఉన్నాయి.

మూడవ అధ్యాయం : ఇందులోఅన్ని కృతంద రూపాలున్నాయి.

నాల్గవ అధ్యాయం: స్త్రీ ప్రత్యయ రూపాలు, తద్ధిత రూపాలు ఉన్నాయి.

ఐదవ అధ్యాయం : నాల్సవ అధ్యాయం కొనసాగింపుగా మరికొన్ని తద్ధిత రూపాలున్నాయి. ఆరవ అధ్యాయం : సంధి, స్వర విధానం ఆదేశాలు, అసాధారణ నమాసాలు, అర్ధ దాతుక పరిణామాలు, ఆదేశ కార్యాలు లోప కార్యాలు మొదలయినవి.

వడవ అధ్యాయం : స్వర విధానం, ధ్వని పరిణామ క్రమం ఉన్నాయి.

ఎనిమిదవ అధ్యాయం: స్వర నామాలు, సంధి నూత్రాలు యిత్యాదులున్నాయి.

సూక్ష్మంగా అష్టాధ్యాయి. వివరణ ఇది. బాలవ్యాకరణ కర్త చిన్నయసూరి తన వ్యాకరణ [గ్రంథంలో 1) సంజ్హ 2) సంధి, 3) తత్సమ 4) అచ్చిక 5) కారక. 6) సమాస ?) తద్దిత 8) క్రియ 9) కృదంత 10) ప్రకీర్ణక పరిచ్భేదాలనే విభాగించాడు. చిన్నయ బాలవ్యాకరణం 1858లో వచ్చింది. బెంజిమన్‌ షూల్డ్‌ గ్రమటిక తెలుగిక 1728లో వచ్చింది. బెంజమన్‌ మాల్డ్‌ ఎనిమిది అధ్యాయాలుగా విభజించడానికి గల కారణం అష్టాధ్యాయినే అనునరించాడని చెప్పడానికి ఈ ఉదాహరణాలన్నీ పేర్కొనడం జరిగింది. షూల్డ్‌ వ్యాకరణం కేవలం పాశ్చాత్యుల కోసం రచన చేసినా ఆనాటి వ్యావవోరిక భాషా పదాలు, ఆకాలం నాటి భాషాబోధనా పద్ధతులు గమనించవచ్చు.

తొలి అధ్యాయం: లిపి (Script) తెలుగు వర్షమాలను సంపూర్ణంగా అక్షరానుగుణంగా వివరించాడు. అచ్చులు, హల్లులు ఆపై య-ర-ల-వ-శ-ష-న -హ-క -క్ష్మ చివరిగా ఐతో ముగించాడు. అధ్యాయం చివర ఇతి: అని ముగింపు. ఆతర్వాత క గుణింతం ఉచ్చారణ [క్రమం వివరించాడు.

అచ్చుల్లో

అ-ఆ-ఇ-ఈ -ఉ-ఊ-రు -రూ-లు-లూ-ఎ-ఐ-ఓ-బె- అం-అ: అని పేర్కొని బు, బూలుకూడా ఉన్నాయి. వాటిని ఉచ్చారణలో రు-రూ అని పలుకుతారు. అని వివరించాడు. గుణింతానికి వస్తే పూర్వం మన పల్లెల్లో ఉండే ప్రాథమిక పాఠశాల స్థాయిలో గుణింతాలు పెద్దగా వల్లె వేయించేవారు. అదే క్రమంలో షూల్డ్‌ కూడా గుణింతాన్ని ఎలా నేర్చుకోవాలో వివరించాడు. బహుశా ఈ పద్ధతి ఆకాలానికి అంటే 1728 నాటికి ఉండి ఉండాలి లేదా ఆయనకు సహకరించిన పండితులయినా ప్రవేశపెట్టి ఉండాలి. ఏమయినా నేటికీ మన ప్రాథమిక పాఠశాలల్లో ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. క కాకు దీర్ధమిస్తే కా కకు గుడిస్తే కి అని వివరించాడు. ఇందులో క గుణింతం, వలపల గిలక ప్రాచుర్యం మొదలయినవి గమనించవచ్చు. పాఠకులు గత సంచిక గమనించండి.

రెండవ అధ్యాయం: ఉచ్చారణ (Pronounciation) ఇందులో వదాలు వలికే తీరు వివరణాత్మకంగా ఉంది. ఉదాహరణకి సర్వేశ్వరుడు మోక్షం, మంచి మనస్సు, సూర్యుడు, ఘడియ, బూడిద, మెఖం, దౌరువు, బొట్టు, పర్వతం, కొండ్డ, బురుద, మంన్ను, తొంట, వారధి, వంత్తెన, పెట, పాళెం, గెవినివాకిలి, తిరువిధి, అంగడి, బంగారు, వెండ్డి, శీసం, సత్తు, వుప్పు, కొమ్మ, పచ్చికసువు, గోధుమలు, పిండి, ఆవాలు, నూనె, సారాయి, పులుసు, మైనం, పాలు, చిలక కొంగ, జెముడుకాకి, పిచ్చిక, బాతులు, నెమలి, పుంజు, పెట్ట, వుడుత, పంద్దికొక్కు గుర్రం, గాడిదె, ఆవు, దూడ, పెంద్ది, కుక్క తాత, అవ్వ, తండ్రి, తల్లి, బిడ్డలు, కొమారుడు, కూతురు, తొత్తు, బానిస, గరిటె, దీపం, సూది, దువ్వెన, అద్ధం, మాదిగెవాండు, ప్రాంత పన్నివాండు, వడ్లవాండు, కుంమ్మరవాండు, వర్తకుడు, మహిమ, నరకం, వెధవది, పొరుగింటి వాండు, మందు, ఆత్మ దాహం, ఆంకలి, వని, కౌక, రాయి, దొవ, యిల్లు ఇందులో తెలుగువారి నంప్రదాయాలు, బాంధవ్యాలు, జంతువుల పేర్సు వృత్తులు, కులాలు, తెలుగు పేర్లు మొదలయిన వెన్నో కన్పిస్తాయి. భాషాపదదోషాలు యివ్పటికీ కాంతమార్చులున్నా సంయుక్తా క్షర ప్రయోగాలు, ద్విత్వాక్షరాలు, దీర్జము మీద సాధ్యపూర్ణాను స్వారాలు ఎన్నో కన్పిస్తాయి.

మూడవ అధ్యాయం: నామవాచకాలు (Nouns). ఇందులో ఏకవచనం, బహువచన రూపాలు వివరించి ఉదాహరించాడు. సంస్కృత వ్యాకరణం అనుసరిస్తే ద్వివచనం కూడా చెప్పాలి కాని తెలుగు రచనా సంవిధాన ప్రక్రియలో కాని, వ్యావహారిక పలుకు బడిలో ద్వివచన విభాగం లేదు. అందువల్ల తెలుగు వ్యాకరణ రచనలో అనాటి ప్రాథమిక రచనాక్రమంలో ఏకవచనం, బహు వచనం మాత్రమే చెప్పాడు. దొర-దొరలు అను విభాగంతోపాటు యొక్క లో, లోపల అనే విభక్తి ప్రత్యయ రూపాలు కూడా ఉదాహరించాడు. దొరలయొక్క దౌరలలో, దౌరలలోపల వీటితోపాటు చేతన్‌, చేన్‌, తోడన్‌, తోన్‌ అనే విభక్తి రూపాలు కూడా దౌరలచేతన్‌, దొరల చేన్‌, దొరలతోడన్‌, దొరలతోన్‌ ఈ రచనా క్రమంలో దౌరకు ధార అని వత్తు ఉంది. బహుశా దొర అనే పలుకులో వత్తుగా ధ అని పలుకుగా విని ఉంచవచ్చు. అది శృతదోషంగా పరిగణిస్తే మిగిలిన రచనా క్రమం అంతా సక్రమంగానే ఉంది. అలాగే అమ్మ అని రాయవలసిన చోట అంమ్మ అని ఉంది ద్విత్వాక్షర రచనల్లో కూడా సంతకు సంత్త అని వింతకు వింత్త అనే రచనా ప్రయోగాలున్నాయి. రచనా సంవిధానం పై సరికొత్త పరిశోధనలు చేయడానికి ఈ వ్యాకరణం ఒక ఆ వరకువు కాగలదు. కొన్ని పండ్లు కూడా ఉదాహరణకు స్వీకరించవచ్చు. అరటి పండు, పనసపంధ్లు, మామిడి పండ్లు, మర్రి చెట్టు, గంగరెని చెట్టు, వేంప చెట్టు, టెంకాయ చెట్టు, పొంక చెట్టు మొదలయినవి ఉన్నాయి. రచనా సంవిధానంలో వత్తులు, పొల్లులు, సంయుక్తాలు, ద్వితాక్షరాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి.

నాల్గవ అధ్యాయం: విశేషణాలు (Adjectives) ఇందులో ప్రత్యేకంగా విశేషించి పేర్కొనదగినవి ఉన్నాయి. ఉదాహరణకు అశ్లీలమైన పదాలు కూడా రచనలో స్వీకరించిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు మంచి మనుషుడు, మంచి ఆండది, ఛడ్డ పాపిష్టి ఛడ్డ లంజ, చివరి పదం సాధారణంగా రచనలో కాని అక్షర బద్దం చేయడంకాని జరుగదు. కాని జనవ్యావహారిక పద పలుకుబడిని స్వీకరించాడనడానికిది ఉదాహరణ. అలాగే షూల్డ్‌ తొలిగా అచ్చువేసిన తెలుగు పుస్తకాల శీర్షికలు కూదా ఇక్కడ కన్పిస్తాయి. పుంణ్యపుదొవ, పాపపుదొవ, ఆకాశపునిచ్చెన, నరకపు వెదన, శశరీరపుపని, తర్మపు మాట. ఈ వదాలు 1746-47లో అచ్చు వేసినన వుస్తకాలు శీర్షికలలో ఉన్నాయి. అలాగే కొన్ని పదాలు విశేషంగా కనిపిస్తాయి. పొడుగు పర్వతం, వెడల్పు సముద్రం అలాగే సంఖ్యా వాచకాలలో వకటి -రెండ్దు -మూడు - నాలుగు -అఇదు -ఆరు -యెడు - యెనిమిది - తొంమ్మిది -పది -పదకొండు -పంద్రెండు -పధ్మూడు - పధ్నాలుగు - పదిహేను - పదహారు - పది హెడు - పద్దెనిమిది - వందొమ్మిది - యిరువై-నూరు-యింన్నూరు - ముంన్నూరు- నంన్నూరు -యనూరు- ఆరునూరు - యెళ్ళూరు - యెనమన్నూరు - తొంమ్మంన్నూరు- వెయ్యి ఈ అధ్యాయం చివరిగా ఒక వాక్యం ఉంది. 'యంన్ని నాళ్లు బ్రతికి వుంన్నాము అంన్నాళ్ళు ధర్మం శాయవలెను” ఈ వాక్యంలో ధర్మం దగ్గర వలపలగిలక లేదు. దీనిని బట్టి రచనలో సందర్భాన్ని బట్టి వలపలగిలక ప్రాధాన్యం ఏర్పరచినట్టు తెలుస్తుంది.

ఐదవ అధ్యాయం: సర్వనామాలు (Pronouns) సర్వనామాల్లో కూడా ఏకవచన బహువచన రూపాలున్నాయి. నేను-మేము, నీవు- మీరు, వారు-వారులు, తాను-తాము, మొదలయినవి కనిపిస్తాయి. అధ్యాయం చివరగా వకవక మనుష్యుడు - వకకవ ఆండది - వకవక మృగం అని ఉదాహరించాడు. అనంతరం ఒక వాక్యం కనిపిస్తుంది.

“నంన్ను స్నేహించ్చే సర్వేశ్వరుడు మంమ్ముల రక్షించిన కృస్తుస్సు అయ్యవారు నికు మోక్షం యయ్యపొయ్యే యెలినవారు” ఈ వాక్యంలో నన్ను- మమ్ముల నీకు- అనే వదాలుక ఏకవచన బహువచన ఉదాహరణలకోసం రాసి ఉందవచ్చు.

ఆరవ అధ్యాయం: క్రియలు (Verbs): ఇక్కడ కూడా ఏకవచన బహువచన రూపాలే కన్పిస్తున్నాయి. నేను అంప్పిస్తునాను - మేము అంప్పతునాము నెను అంప్పెది లేదు - మెము అంప్పెదిలేదు నెను అంటప్పింస్తిని - మెము అంప్పితిమి అలాగే చిన్న వాక్యంలో కూడా క్రియలు వచ్చేలా ఉదాహరించాడు. “పుస్తకం అంప్ప వలెనని చెప్పు” దానుల అంప్పించ్చెటందుకు చెప్పండి. అలాగే క్రియలు వరుసగా కొన్ని చెప్పాడు. ఫేయిస్తునాను - పిలిపింస్తునాను చెప్పింస్తునాను - కట్టెంస్తునాను - ముగింవిస్తునాను - పారింన్తునాను కలిశెది - కదిలేది - నలిశెది - వంగ్గిపొయ్యెది - లెవచెశెది -

ఏడవ అధ్యాయం: ప్రత్యయాలు (Particles) : ఆత్మలోను - ఆత్మనుండ్డి, ఆత్మనుంచ్చి, ఆత్మతోను ఆత్మదగ్గర - కురిచిపిట మీద - కురిచి పిట కింద కురిచి పిట అంచున రెపు - రేపటికి యల్లుండి 'యల్లుండికి కింద - కిందికి పొడుగునా - పొడుగుకి శిఘ్రంగా - గొబ్బును, వెగిరంగా అప్పుడే, తిన్నంగా , అవును లేదు, కాదు - యిదుగో, వొట్టింగా -మరింన్ని - అయ్యో - అబ్బా -ఛీ-పో - పోరి - భళా - శాబాస్సు విలు - వాయి - వారి - వాసి వొాహోయి - ఘిట్ట - స్వభావం ఏం - అబ్బా చిన్న వాక్యాల్లో “సర్వేశ్వరుదికి పెద్దవాడు లేడు సరి ఇన వాడు లేడు” మేము మంచ్చి క్రియలు చెశినపుడు వాడు రూకలు అంపి నాడంబెట్టె అప్పు తీచక వాయినాడంటే ఈ అధ్యాయంలో అన్యదేశాలున్నాయి. కుర్చి శబాసు మొదలైనవి. చివరి అధ్యాయం వాక్య నిర్మాణం 51౪ ఈ అధ్యాయంలో పుం లింగం - స్త్రీ లింగం - నపుంనక లింగం అని మూడు అధ్యాయాలుగా విభజించాడు సర్వేశ్వరుడు మంచ్చిది కలిగిన వారుగా వున్నారు మనుషులు పాపిష్టులుగా వున్నారు. 'ఆడవాండ్లు అనెక మాటలు మాట్లాడింది వానియక్క చెల్లె చురుకుగా వుంన్నది. యీ గుర్రం వొక కాసు శాయదు మంచి చెట్లు మంచి పండ్లు వండును నక్షత్రాలు మెరుస్తుంది మంచ్చిధార - మంచిదొరసాని మంచి మృగం లొకం యొక్క ఘనం నాకు వద్దు సర్వేశ్వరుడు యొక్క కృపమనలకు చాలును మంచి క్రియలు చెసెటందుకు ప్రయాసపదవలెను మీరు పోయి గొడ్డలి తీసుకుని పర్వతాన్ని మెక్కి చెట్లు కొట్టి వగకుడి కట్టి దాని మొక్కపేరు కొత్త శియ్యుంఅని పెరున పిలువండి “వాడు బిక్షం యిచ్చెటట్టు గాను మననులేదు, యిప్పుడు జపం చెశెటట్టుగాను పొద్దు లెదు లెస్సంగా ్రతికెటట్టుగాను వానికి ద్రవ్యం కద్దు ఈ వాక్య నిర్మాణంలో అధికశాతం బైబిలు సంబంధి మిగినవి సమాజ సంబంధిగా కన్పిస్తున్నాయి. భాష వ్యావహారికం సంపూర్ణ భాషాశాస్త్ర దృష్ట్యా పరిశోధన చేయగలిగితే ఆ నాటి భాష, మాండలికం, అన్యభాషా వదాలు, వాళ్యనిర్మాణం అన్నింటినీ వివరంగా విశ్లేషించవచ్చు.

చివరి అనుబంధంలో ఒకటి ముఖ్యంగా పేర్కొనవచ్చు. క్రైస్తవ మతాను యాములు వ్రతి ప్రార్ధనానాంతరం సామూహికంగా జరిపించే పరలోక ప్రార్ధన [౬0169 ౧/౦ ఒకటి దీనికి తొలి అనువాదంలో పరమండల మత్రం అని షూల్డ్‌ అనువదించాడు. దాదాపు ఇదే కాలంలో షూల్డ్‌ 14 భారతీయ భాషలతో పాటు విశ్వభాషలన్నీ కలివి 200 భాషల్లో వరలోక ప్రార్థనను అనువదించాడు. ఇది ఒక చిన్న పుస్తకంగా ప్రత్యేకంగా ముద్రించాడు. ఆధునిక అనువాదానికి తొలి అనువాదానికి గల బేధం కోసం ఇక్కడ ప్రత్యేకంగా పొందుపరచడం గమనించవచ్చు.

పరమండ్డల మంత్రము వరమండ్డలంలో ఉందే మ తండ్రి [మి యొక్క నామ ధేయం పూజింవ్చం వడునట్టు గాని మీ యొక చిత్తం పరమండలంలో 'శాయంబడు నట్లుగె భూమిలో నుంన్ను

మోయనకాబ్టునార్య ట్ర చల ఆడ్లర్తులా గాల

మంయకత్రతక (పీటల ఆలా (యలు

శాయం బడునట్టుగాను 'నానాట కలుగు మభో

గు డడ లన [జనం మకునెడు వచనమ లన న యియ్యండి మయప్పుల చ కకనా' న గా వారికి వెము తాళు నట ర బాయల సట్లగి. మీరుంన్ను

'మయమృలు మకు తాళంది మము శోదనలో ప్రవేశిం ప్ఫింప్ప కుండి అఇతే నూ ఛడ్డ తనంలో నుండి మమున రక్షంచ్చ కోండ్టి అదెమంటె రాజ్యమున్ను బలమున్ను మమీను న్నుం మాకు యిన్నంటి కెంన్నంటి కింన్ని కలిగి ఉన్నది. ఆమెన్‌ ప్రస్తుతం 1885 తర్వాత అనువర్తింపబడిన బైబిల్‌ సొసైటీ వారి ముద్రణలో ఉన్న భాగం ఇది లూక సువార్త 11:1 - 4 భాగం నుంచి స్వీకరించడం జరిగింది తండ్రినీ నామము పరిశుద్ధ పరచబడును గాక, మాకు కావాలిసిన అను దినాహారము దినదినము మాకు దయచేయుము. మేము మాకిచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్ము శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ఈ అనువాదము షూల్డ్‌ రెండికి స్వల్ప బేధాలున్నా అవి భాషాభేదాలే తప్ప అర్థంలో కాని, విషయంలో కానీ మార్పులేదు ఇక్కడ మరో విషయం స్పష్టంగా కన్పిస్తుంది. షూల్డ్‌ అనువాదం నాటికి పుటల సంఖ్య కాని విరామ చిహ్నాలు (౧4౧౦1420 141) ఎక్కడ ఉన్నట్టు లేవు. తెలుగు వాక్య రచనా విన్యాసంలో విరామ చిహ్నాలు, భాషా సంస్మరణ అనువాద సంస్కరణ సి.పి బ్రౌన్‌ తర్వాతే కనిపిస్తుంది.

(తర్వాత భాగం వచ్చే సంచికలో)

సొంత భాషను అణగద్రొక్కి సంస్కృతిని కాపాడలేరు

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి.. అక్షోబరు-2020 |