అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జగమునేలిన తెలుగు-11

వికీసోర్స్ నుండి

డి.పి. అనూరాధ 90100 16555






జరిగిన కథ


తెలుగుజాతి ఆనవాళ్ల గురించి అన్వేషిస్తూ మయన్మార్‌ థాయిలాండ్‌, కాంబోడియా వియత్నాం, ఇండోనేషియా దేశాలను నందర్భిస్తాదు సూర్చవర్భ: అయితే అదంతా కలఅని తరవాత తెలుస్తుంది. కానీ కలలో తను వివరించిన ప్రదేశాలతో తెలుగు నేలకు నష్టమైన నంబంధాలు ఉందదం ఆళ్చర్యవరుస్తుంది. తన కలల రాకుమారిని అన్వేషిస్తూ సూర్యవర్థ (ీలంక చేరుకుంటాదు. అక్ళుడ అతడి ప్రయాణం ఏ మలువు తిరిగింది?

క్యాండీ ఆలయాన్ని రెండు అంతస్థులుగా నిర్మించారు. సందర్శకులని ద్వారం దగ్గర మెటల్‌ డిటెక్టర్లతో పరీక్షించారు. ఎక్కడ చూసినా కట్టుదిట్టమైన బందోబస్తు ... రెండుసార్లు ఎల్టీటీయీ బాంబు దాడులకు గురైందట ఈ ఆలయం. అయినా తిరిగి పునరుద్ధరించారు.

అటూ ఇటూ గోడలపై రంగు రంగుల పెయింటింగులు ఉన్న మార్గంలోంచి ఆలయంలోపలికి ప్రవేశించాం. లోపలంతా వేరే 'ప్రపంచంలా ఉంది. ప్రధాన ఆలయంలో బంగారు బుద్ధ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. పక్కనే పెద్ద గంట. ఆ ఆలయం చుట్టూ కొందరు ప్రదక్షిణలు చేస్తున్నారు. తెల్ల లుంగీ, తెల్ల షర్టు వేసుకున్న ఓ వృద్ధుడు అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణ చేస్తున్నాడు. ఆ మాటకొస్తే చాలా మంది ప్రీపురుషులు తెల్ల దుస్తులే ధరించారు. వాళ్లను చూడగానే ప్రవల్లిక గుర్తొచ్చింది. ఆమె కోసమే ఇంత దూరం వచ్చిన నంగతీ గుర్తొచ్చింది. కానీ నేను ఆ విషయవే మరచిపోయాను. నలువైపులా ఆమె కోసం వెతకడం ప్రారంభించా.

"సూర్యా రా మనం మేడ మీదకు వెళ్లాలి

అనురా మాటలకు నా ప్రయత్నాన్ని పక్కకు పెట్టి ముందుకు వెళ్లా. పై అంతస్తుకు వెళ్లదానికి పాతికలోపు మెట్లున్నాయి. అందరూ ఓ పద్ధతిలో వెళుతున్నారు. ఓ పది మెట్లు ఎక్కగానే గోడ మీద పొడవైన పెయింటింగ్‌ ఆకట్టుకుంది... ఓ వడుచు జంట పెయింటింగ్‌ అది. బహుషా రాజకుటింబీకులై ఉంటారు. అనురా కూదా అదే పెయింటింగ్‌ ను చూపిస్తూ,

“ఈమె పేరు హేమమాలి, కళింగ రాజు గుహసివ కుమార్తె ఇతడు ఆమె భర్త దంతకుమారుడు. వీళ్ల గురించి తెలుసుకునే ముందు దంతపురం అనే గ్రామం గురించి తెలుసుకోవాలి. దానికి మనం బుద్దుడి కాలానికి వెళ్లాలి. బుద్ధుడి నిర్యాణం తరవాత ఆయన ఎడమ కోర దంతాన్ని ఖీమథెరా అనే భిక్షువు సేకరించి, దాన్ని కళింగ రాజు బ్రహ్మదత్తుడికి బహుమతిగా అందజేశాడని బౌద్ధ (గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ బుద్దుడి దంతానికి గౌరవంగా రాజు స్ఫూపాన్ని నిర్మించాడని అదే క్రమంగా దంతవురిగా మారిందని చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఆ దంతం కోసం రాజుల మధ్య నిరంతరం యుద్దాలు జరిగేవి. అది ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉండడమే కాదు ఆ రాజుకు ఆధిపత్యం ఉందేది. దంతాన్ని రక్షించేందుకు గుహసివుడు ఓ పథకం ఆలోచించాడు. తన కూతురు, అల్లుడిని దానికి పాత్రధారులుగా చేశాడు. హేమమాలి తండ్రి ఆదేశంమేరకు దంతాన్ని తన కొప్పులో దాచుకుని అతి సామాన్యుల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శత్రువుల బారిన పదకుండా నౌకలో శ్రీలంకకు చేరుకుంది. ఇక్కడి అనురాధపురాలోని ఆరామంలో బుద్ధదంతాన్ని అందజేనింది. క్రీస్తుశకం మూడో శతాబ్దిలో ఇదంతా జరిగింది. శ్రీలంకకు చెందిన పాలిగ్రంథం దలద వంశం ఈ కథనంతా వివరిస్తోంది. ఆ దంతం ఇక్కడి అనేక ఆరామాల్లో ఉండి ఆఖరుకి క్యాండీ చేరుకుంది. ఈ రాజుల సంరక్షణలో భద్రంగా ఉంది. రోజూ మూడు పూటలా ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి బుధవారం అభిషేకాలు నిర్వహిస్తారు. ఏడాదికి ఓసారి జరిగే పెరిహెరా ఉత్సవాల్లో బుద్ధ దంతాన్ని ఆలయం బయట ఊరేగిస్తారు. ఆ దంతపురం నేటి ఆంధ్రప్రదేశ్‌ లో ఉందని పురావస్తు మా శ్రీలంకకు గట్టి అనుబంధమే ఉండేది.” అనురా మాటలు వింటుంటే ఒళ్లు పులకించిపోయింది.

తెలుగు తోబుట్టువు, సిక్కోలు రాకుమారి హేమమాలి, ఆమె భర్త దంతకుమారుడి చిత్రాలను గర్వంగా చూశాను. 'అమ్మా మీరెవరో, ఆనాడు మీరు ఎంత కష్టపడ్డారో అన్నది నేటి మన తెలుగు గడ్డ మీద తెలియకపోయినా (శ్రీలంకలో మిమ్మల్ని గొప్ప గౌరవంతో చూసుకుంటున్నారు. మీరు ధన్యులు..” అని మనసులోనే నమస్మరించాను.

ఎంతో ఉత్సాహంతో గర్భగుడి దగ్గరకి చేరుకున్నా లోపల బంగారు పేటిక ధగాధగా మెరుస్తోంది. అందులోనే బుద్ధదంతం ఉందని అనురా చెప్పాడు. బౌద్ధ గురువులు పూజలు నిర్వహిస్తున్నారు. స్వదేశీ, విదేశీ భక్తులతో ఆవరణ అంతా నిండిపోయింది. క్యాండీ ఆలయంలో అడుగడుగునా తెలుగుజాతి చరితను మన తాతముత్తాతలు ఇంత పదిలంగా రచిస్తే ఆ విషయం మన దాకా చేరలేదు. కళింగ రాజుకు ఆపదాస్తే శ్రీలంకలోని వాళ్లు సహాయం అందించారంటే ఆనాడు ఈ రెండు ప్రాంతాల మధ్య ఎంతటి అనుబంధం ఉండేదో. విజయుడు, హేమమాలి, క్యాండీ రాజులు వివిధ కాలాలలో తమ ఘనతను చాటారు. ఈనాటికీ బుద్ధ దంతం మన నేల మీదే ఉంటే ప్రపంచ బౌద్దానికి చిరునామాగా ఓ అద్భుత ఆలయాన్ని అభివృద్ధి చేసే వాళ్లమా లేక ఏదో ఓ మ్యూజియంలో అలా ఉంచేసి చేతులు దులుపేసుకునేవాళ్లమూ. (శ్రీలంకలో మాత్రం ఆలయం అద్భుతంగా నిర్వపొన్తున్నారు. కాసేపు అక్కదే కూర్చుండిపోయా. అనురా కూడా నా పక్కనే కూర్చుని ప్రార్ధనలు చేస్తున్నాడు. నా చూపులు ప్రవల్లిక కోసం వెతుకుతున్నాయి. కానీ నిరాశే. బయళల్లేరుదామా అంటూ తను లేచాడు. నేనూ లేచాను.

“అనురా, క్యాండీ రాజుల కోటలు ఎక్కడున్నాయి?”

'ఈ ఆలయానికి ఉత్తరం వైపున నాటి రాజప్రాసాదాలు అలాగే ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మ్యూజియాలుగా తీర్చిదిద్ది నందర్భ్శకులకు అనుమతి ఇస్తున్నారు. వీటిలో క్యాండీ నేషనల్‌ మ్యూజియం చాలా ముఖ్యమైంది. క్యాండీ రాజులకు సంబంధించి అయిదు వేల వస్తువులను సందర్భనకు ఉంచారు. నీకు ఆసక్తి ఉంటే వెళదాం" అన్నాడు.

“ఫర్వాలేదు అనురా.. నువ్వు చాలా సేపటి నుంచీ నీ పనులన్నీ వదులుకుని నాతో ఉన్నావు. నేను వెళతాలే.”

మాటల్లో ఆలయం వెలుపలికి వచ్చాం.

“ఆ కనిపించే ప్రాకారాలే రాజప్రాసాదాలు మరి నాకు సెలవా. ఏదైనా అవసరం అయితే ఫోన్‌ చేయి" అంటూ తన మొబైల్‌ నెంబరు ఇచ్చాడు. సూర్యా, నీతో పరిచయం ఎంతో సంతోషాన్నిచ్చింది. .” అంటూ హత్తుకున్నాడు.

“నాక్కూడా అనురా, నిన్నూ నీ పేరునూ నేనెవ్పుడూ గుర్తుంచుకుంటాను” అంటూ వీడ్కోలు తెలిపాను. తను వెళ్లిపోయాడు.

నేను అమరావతికి చెందిన వాడినని అనురా ఇంతలా గౌరవించడం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. వివిధ దేశాలలో ఈనాటికీ ప్రసిద్ధ బౌద్ధకేం్యద్రంగా అమరావతిని కౌనియాడడం గొప్పవిషయం. మనం ఆ ప్రాచీన నగరాన్ని పూర్తిగా మర్చిపోయాం.

రాజప్రాసాదం దగ్గరికి వచ్చాను. మన భారతీయ కోటలతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి. మొదటిది “పల్లె వాహల), ఇది రాజుకు సంబంధించినది. రెండోది. “మేడ వాహలా .. ఇది ఒకప్పటి రాణి అంతఃపుర వాసానికి చెందింది. నేను మొదట పల్లెవాహలకి వెళ్లా. ఇక్కడ ఆయుధాలు, వస్తువులు, ఆభరణాలు, కిరీటాలు, దుస్తులు ఇలా ఎన్నిటినో భద్రపరచారు. అయితే ఓ పొడవాటి అల్మరాలోని గాజు తలుపులలోంచి కన్పిస్తోన్న దున్తులు రక్తనిక్తమై చిరిగిపోయి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే కళ్లల్లో నీళ్లు ఆగలేదు. అవి విక్రమరాజ నింగవి. ప్రజల్లో ఎంతో పేరున్న అతడి రాజ్యాన్ని కబళించాలనే నెపంతో 'బిటీషర్లు తప్పుడు అభియోగం మోపి కోటను స్వాధీనం చేసుకోవడానికి వచ్చారట. వాళ్లకి దొరకకుండా అతడు తప్పించుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెందు కాదు మూడుసార్లు బ్రిటీషర్లు చేసిన ప్రయత్నాలు విఫలమే అయ్యాయి. ఆఖరుకి రాజు అనుయాయులే ఉప్పం దించారు. కొండల మధ్య ఓ ఇంట్లో ఉన్న రాజు రహస్య స్థావరాన్ని చుట్టుముట్టారట. రాజును చేజిక్కించుకుని దుర్భాషలాదారు. అతడిపై చేయిచేసుకున్నారు. కాళ్లూ చేతులను ఓ స్తంభానికి కట్టేని అతి కిరాతకంగా బంధించారు. ఆ పెనుగులాటలో అతడి దుస్తులు చిరిగిపోయాయి, రక్తసిక్రమయ్యాయి. ఆనాటి దుస్తులే ఇవి. చరిత్రలో రాజులను తమ ఆంతరంగికులే వెన్నుపోటు పొడిచిన ఘటనలెన్నో విక్రమరాజ సింగదీ అదే కథ. మనసు బరువెక్కి అక్కడ ఉండ లేకపోయా.

మేడ వాహల ఆనాటి రాణుల అంతఃపురం. ఇక్కడ శ్రీలంక ఆర్మియాలాజికల్‌ డిపార్భవెంట్‌ వారిని తవృకుండా మెచ్చుకోవలసిందే. మన జేజమ్మ వెంకట రంగమ్మ వంటశాలను యథాతథంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పునరుద్ధరించారు. చాలా మంది సింహళ యువతులు ఆనాటి పాత్రల్ని, వంట సామగ్రిని ఆనక్తికరంగా చూన్తున్నారు. సింహళ (వ్రభుత్వానికే కాదు సింహళీయులకు తమ చరిత్ర పట్ల ఉన్న అనురక్తికి జోహార్లు అర్పిస్తూ అక్కడి నుంచి వచ్చేశాను.

హోటల్లో భోజనం కానిచ్చి టాక్సీలో బయళల్డేరా. మన శ్రీకాకుళానికి చెందిన విజయుడు నిర్మించిన అనురాధపుర నా తదుపరి మజిలీ. అదే శ్రీలంక ప్రాచీన రాజధాని నగరం. అంతేకాదు ఆ నగరం ప్రసిద్ధ బౌద్ధక్షేతం. దీనికి కారణం అక్కడి బోధివృక్షం. బుద్ధుడికి జ్నానోదయం కలిగించిన బుద్ధగయలోని రాగిచెట్టు మొలకే ఈ చెట్టు. ఈ జయశ్రీ మహాబోధి రాగి చెట్టును మొలకగా అశోకుడి కూతురు సంధుమిత్ర భారతదేశం నుంచి శ్రీలంకకు తీనుకువచ్చింది. కచ్చితమైన కాలం తెలియడం వల్ల ప్రపంచంలో మానవుడు నాటిన అత్యంత పురాతన రారిచెట్టుగా ఇది పేరు తెచ్చుకుంది.

ప్రవల్లిక కన్పించలేదన్న అసంతృప్తి తప్పిస్తే నా క్యాండీ ప్రయాణం విజయవంతమైందనే చెప్పాలి. మన తెలుగు జాతికి నంబంధించి ఎన్నో ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. బ్రిటీషర్సు విక్రమరాజనింగతో వ్యవహరించిన తీరు మాత్రం అమానుషం, అమానవీయం.

పైనాపిల్‌ తోటలు ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. రోడ్డు కిరువైపులా రాశుల్లో అమ్ముతున్నారు. ఓ కిలోమీటరు మేరా అవే. రోడ్లు ఇంకా ఇక్కడ అంత పెద్దగా లేవు. అటూ ఇటూ కలిపి నాలుగు దారులే. టూరిస్టు బస్సులు, కాళ్లే ఎక్కువ. చాలా మంది పొలాల్లోనే ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. మధ్య మధ్యలో ఊర్లు. హోటళ్లతో పాటు బేకరీలూ ఎక్కువే. అప్పుడే చీకటి పడుతోంది. దార్లో భోంచేసి అనురాధపుర వెళ్దామని (డైవర్‌ కి చెప్పా. నగర శివార్లలో ఓ హోటల్లో ఆపాడు. రెండు భోజనాలు చెప్పా (డ్రైవర్తో కలుపుకుని. అన్నం, సాంబారు, రసం, రెండు కూరలు తెచ్చిచ్చాడు. మన వంటలతో అలా పోల్చుకోవడమే కానీ వాటి రంగు 'రుబీ వాసనా వేరేగా ఉన్నాయి. ఇక్కడైనా పెరుగు దొరుకుతుందేమోనని ఆశవడ్డా. దొరికింది. కాకపోతే పెరుగుని కుండతో సహా ఫ్రిజ్లో పెట్టడం కాస్త విడ్డూరంగా అన్సించింది. బీన్స్‌ని పొడవుగా కోసి ఉల్లిపాయలు కలిపి కూరగా చేశారు. బీన్స్‌ కంటే కూడా ఉల్లిపాయలు మూడింతలు ఎక్కువగా ఉన్నాయి. ఓ ప్లేట్‌ నిండా ఇడియప్పాలు తెచ్చి పెట్టాడు సర్వర్‌.

'ఆర్జర్‌ చేయలేదు కదా అంటుంటే...

ఇక్కడ అంతే, ఏం ఆర్డర్‌ చేసినా ఇడియప్పం మాత్రం తప్పకుండా పెడతారని మీకు ఇష్టమైతే తినొచ్చని, లేకపోయినా ఫర్వాలేదని, ఎన్ని తింటే వాటికి మాత్రమే బిల్లు వేస్తారని ' డైవర్‌ చెప్పాడు.

ఇక్కడ హోటళ్లలో అంతా పింగాణీ ప్లేట్లూ పాత్రలూ. గైవర్‌ తన ప్లేట్లో అన్నం, సాంబారు, కూరలు, ఇడియప్పం, పెరుగు అన్నీ వేసుకుని ఒకేసారి కలుపుకుని తింటున్నాడు. పక్కటేబుల్‌ వాళ్లని చూశా. వాళ్లూ అంతే. ఒక్కసారే ప్లేట్లో అన్నీ వేసుకుని కలుపి తింటున్నారు. మన లాగా అన్నంలో ఒక్కోటీ కలుపుకుని తినట్లేదు. ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి. ఇక్కడ ఇంతేనేమో. ఏదేమైనా భోజనం రుచిగా ఉంది. నీళ్ల బాటిల్స్‌ అన్నీ లీటరున్నర సైజులో అమ్ముతున్నారు. అంత పెద్దవి పట్టుకుని తిరగడం కాస్త కష్టమే. అనురాధపురాను చేరుకునేసరికి ఎనిమిది గంటలయ్యింది. జయశ్రీ మహాబోధి సమీపంలో హోటల్‌ తీసుకుని ఆ రాత్రికి విశ్రమించా.

ఉదయమే ఆలయానికి బయల్దేరా. హోటల్‌ నుంచి నడిచి వెళ్లేంత దూరమే. చుట్టూ ప్రాకారం అందంగా ఉంది. ప్రవేశ ద్వారం దగ్గర పూజా ద్రవ్యాలు, పూల దుకాణాలు... అనేక రంగులు, సైజుల్లో కలువ పూలు చూడముచ్చటగా ఉన్నాయి. వందల సంఖ్యల్లో కొబ్బరి మొలకల్ని కూదా అమ్ముతున్నారు. వాటిని చేతుల్లో పట్టుకుని కొందరు లోపలికి వస్తున్నారు. మొక్కులు తీర్చడంలో భాగంగా కొబ్బరి మొలకల్ని ఆలయానికి సమర్పించడం ఇక్కడి ఆచారమట.

అలాగే ముందుకు వెళుతుంటే ధ్యానమందిరం వచ్చింది. బంగారు బుద్ధ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు తాము తెచ్చిన కలువపూలను, అగరువత్తులను అక్కడ సమర్పించి ధ్యానంలో కూర్చుంటున్నారు. నేను కూడా కాసేపు ధ్యానంలో గడిపి బయటకు వచ్చేశాను. పక్శనే కొన్ని మెట్లు... అవి దాటగానే శాఖోపశాఖలుగా ఆకాశమంతా పరచుకున్న పవిత్ర బోధివృక్షం. కొన్నిటి శాఖలకు అక్కడక్కడా కాషాయ వస్త్రాలు చుట్టారు.

క్రీస్తు పూర్వం మూడో శతాబ్దికి చెందిన వృక్షం కావడం వల్ల ఇనుప స్తంభాలతో తోద్చాటు అందించి పరిరక్షిస్తున్నారు. ఆ చెట్టు కాండం అంతా ఓ విశాలమైన ఎత్తైన ప్రదేశంలో ఉంది. దాని చుట్టూ రైలింగ్‌ వేశారు. ఆ ఇనుప చువ్వలకీ బంగారు రంగు పెయింటు వేయడం విశేషం. కొద్ది మందికి మాత్రమే కాండాన్ని తాకే అవకాశాన్ని ఇస్తున్నారు. చుట్టూ ఉన్న విశాలమైన ప్రదేశంలో


బృందాలుగా చేరి భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. గాలి వీచినప్పుడల్లా ఆ పవిత్ర వృక్షం ఆకు రాలిపడుతుందేమోనని ఆశతో చూస్తున్న వారూ లేకపోలేదు. నేను కూడా కాసేపు అలాగే చెట్టునీడలో కూర్చున్నా బోధివృక్ష శాఖలను చూస్తూ ప్రవల్లిక కోసం వెతికాను.

నాకు కాస్త్ర దూరంలో ఓ యువకుడి హస్తరేఖలను చూస్తూ ఓ నడివయసు స్త్రీ జోస్యం చెబుతోంది. ఆమె వస్త్రధారణ అందరిలోకీ భిన్నంగా లంగా జాకెట్టూ, ఓణీ కట్టుకుంది. ఆమె పక్కనే ఓ అయిదేళ్ల పిల్లాడు... బహుశా ఆమె మనవడు అయిఉంటాడు. ఆమె ఎరుక చెప్పడం అయిపోయినట్టుంది. యువకుడు ఆమెకు దబ్బులిచ్చేసి వెళ్లిపోయాడు. ఆమె, మనవడూ గడ్డిపై కూర్చున్నారు. తన జోలెలాంటి సంచిని తీసింది. అందులోంచి అన్నంతీసి వాడికి తినిపించేందుకు ప్రయత్నిస్తోంది. వాడు మారాం చేస్తున్నాడు. కొద్దిగా కోపంతో ...

“కూడు తినరా అయ్యా. అంది...