అమ్మనుడి/సంపుటి 5/మే 2019/పేరుబలం
భాషోద్యమ కథానిక
ఆచార్య కొలకలూరి ఇనాక్ 94402 43433
'మీ పేరేమో ఇంగ్లీషు పేరు కావచ్చు. ఇంగ్లీషులో మాత్రం రాయరు. మేం ఇంగ్లీషులో రాస్తే తప్పు అంటారు. బాగుందండి మీ వరస!
నేను తిరుపతిలో శ్రీవేంకటేశ్వర
విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడుగా ఉన్న
ప్పుడు బంధువుల్ని పలకరించటానికి భీమ
వరం వెళ్ళాను. ఎవరింటికీ వెళ్ళకుండా ఎక్క
డయినా వసతి చూచుకోవాలను కొన్నాను.
ఎక్కడ బాగుంటుందని అడిగితే “విజయ
లక్షి” మేలు అన్నారు.
వెళ్ళి, “గది కావాలి” అన్నాను.
“'ెంగిలా? డబలా?” అని అడిగాడు.
'నేనాక్కణ్ణే అన్నాను.
“అయితే సింగిల్ తీసుకొండి” సలహ ఇచ్చాడు.
“సరే అన్నాను.
“ఏసినా? నానేసినా?” అని అడిగాడు.
“అసలే చలికాలం” అన్నాను.
“అయితే నాన్ - ఏసీ సింగిల్ ఇస్తాను” అన్నాడు.
“సరే అన్నాను.
“ఎన్ని రోజులుంటారు?”
“రెండు రోజులు”
“చెకిన్ ఎప్పుడయినా, చెకవుట్ మిడ్డే ట్వెల్వో క్లాక్” అన్నాడు.
“సరే అన్నాను.
“టూ డేస్ కదా! త్రీ దవుజండ్ అడ్వాన్సు ఇవ్వాలి” అన్నాడు.
“అలాగ్గే' అన్నాను.
“రిజిష్టర్‌లో పేరు, ఊరు, అడ్రసు, ఫోను నెంబరు రాయండి” అన్నాడు.
“భోజనం ఇక్కడేనా? బయటా?” అడిగాను.
'హోటల్ ఎటాచ్‌ద్! వెజ్ ఆ? నాన్ వెజ్ ఆ?” సమాచారం చెప్పాడు. ప్రశ్నలు అడిగాడు.
“ఏదైనా ఫరవాలేదు” అన్నాను.
“హోటల్‌లో తింటారా? రూంకు తెప్పించుకొంటారా?
“గదిలోనే అనుకూలంగా ఉంటుంది కదా!”
“మీ యిష్టం” అన్నాడు.
'పిలిస్తే తెచ్చి పెట్టటానికి, పిల్లలు ఉంటారు కదా! వస్తారు కదా!”
“బెల్ కొట్టండి. బొయిస్ వస్తారు. ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసు. డ్రింక్స్ అవసరం ముంటు౦దా?”
“అవసరం ఉండదు " చెప్పాను.
“నో ప్రాబ్లం. బోయిస్‌కి టిప్స్ ఇవ్వండి. మాట వింటారు”
'సరే! '
'వినోదానీకి?' అడిగాను.
“టి.వి. ఉంది. ఫోన్ ఉంది. రిమోటు చేతిలో ఉంటుంది. సినేమాహాలు వెరీ నియర్. నో వరీ!' అన్నాడు.
“సంతోషం” అన్నాను
“పర్చనల్ డిటెయిల్స్ రిజిస్టర్‌లో రాయండి” అనీ దాన్ని ముందుకు నెట్టాడు.
సీరియల్ నెంబరు - వేశాను.
నేమ్ - కొలకలూరి ఇనాక్ రాశాను.
మొబైలు - వేశాను.
అడ్రస్ - ఉపాధ్యక్షులు చిరునామా ఇచ్చాను.
కమింగ్ ఫ్రం - తిరుపతి.
గోయింగ్ టూ తిరుపతి.
సిగ్నేచర్ - చేశాను.
అద్వాన్స్ - రూపాయిలు మూడు వలు.
అన్ని గళ్ళూ నింవినప్పుడు, నా ముఖంలోకి ఎగాదిగా చూశాడు.
“ఇంగ్లీషు రాదా?” అని అడిగాడు.
“వస్తుంది! అన్నాను.
“మరి తెలుగులో రాశారేం?”
“మనం తెలుగు వాళ్ళం కదా!”
"డిల్లీలో ఏ భాషలో రాస్తారు?”
“హిందీలో”
“అమెరికాలో?”
“ఇంగ్లీషులో!”
“ఆంధ్రప్రదేశ్ అంత అలుసా? ఇంగ్లీషు లో రాయలేదు. హిందీలో రాయలేదు. తెలుగులో రాశారు!!!”
“అలుసు కాదు. గౌరవం! మన రాష్ట్రం! మన భాష! మన రాష్ట్రంలో మనం మనభాష వాడుకోవచ్చు కదా!”
“ఏం గోలో? అద్వాన్స్ త్రీ థౌజండ్ ప్లీజు!
మూడు వేలు ఇచ్చాను. 'రిసీట్ తీసుకొని రూంకు పొండి. అన్నాడు. రాశాడు. కాగితం చించి ఇచ్చాడు.
చూశాను. అది ఇంగ్లీషులో రాశాడు.
“ఇది నాది కాదు” అన్నాను. “వాట్?” అన్నాడు.
“నా పేరుతో కదా దీన్నీ ఇవ్వాలి ' అన్నాను.
“అది మీ పేరే! "
“నా పేరు తెలుగులో ఉంది?
“నేను ఇంగ్లీషులో రాశాను”
“ఇంగ్లీషులో నా పేరు ఇట్లా ఉండదు. వేరే అక్షర క్రమం ఉంటుంది” “ఏదో లెండి. రిసీట్ ఇచ్చాను కదా!” నవ్వాడు. నేనూ నవ్వాను. “మీరు యజమానా? ఉద్యోగా?” అన్నాను.
“బోత్!” అన్నాడు.
“నాకు తెలుగులో రసీదు ఇచ్చి ఉంటే మీకు ఇబ్బంది ఏమిటి?”
“ఏం ఇబ్బంది లేదు '
“అయితే రాసి ఇవ్వండి”
నా పేరు నేనెట్టా రాశానో అట్లా తెలుగులో రాశాడు.
ఆ అఆలు నేర్చుకొంటున్న పిల్లల రాతలాగా ఉంది.
“ఏం పేరిది??
'నా పేరు!”
“ఇసాకా?”
కాదు. ఇనాక్”
“ఇంగ్లీషు పేరా?”
“అవును
“మీ పేరేమో ఇంగ్లీషు పేరు కావచ్చు. ఇంగ్లీషులో మాత్రం రాయరు. మేం ఇంగ్లీషులో రాస్తే తప్పు అంటారు. బాగుందండి మీ వరస!
“అది అమ్మ పెట్టిన పేరు. నాది అమ్మ నేర్పిన భాష
ఏ పుణ్య ముహూర్తాన ఆ పేరు పెట్టిందో నాలుగు తెలుగు మాటలు వచ్చాయి. తెలుగు బోధించే స్థాయి వచ్చింది. అది పేరు బలం!
తెలుగూ ఇంగ్లీషూ కలిసి మీ పేరు ఉండవచ్చు గానీ, మేం ఇంగ్లీషూ తెలుగు కలిపి మాట్లాడినా, రాసినా మీకు ఇష్టం కాదు. కష్టం! అవునా?”
“ఎంత చక్కగా తెలుగు మాట్లాడారండి! ధన్యవాదాలు
నవ్వాడు యజమాని - ఉద్యోగి, రెండూ అయిన మనిషి
కాఫీ తెప్పిస్తాను. తాగి రూంకు వెళుదురుగాని అన్నాడు.
"నేను మజ్జిగ మాత్రమే తాగుతాను!”
“ఇంత చలిలోనూ!”
“ఎల్లప్పుడు!”
“అందులోనూ తెలుగేగా?
“అసలు సిసలు తెలుగు వాళ్ళు కదా!”
ఎంత హాయిగా నవ్వేడంటే అంత హాయిగా అతను తన బాల్యంలో ఎప్పుడు నవ్వాడో గుర్తు చేసుకోవలసిందే!
“ఇంత పెద్ద ఉద్యోగి మీరు. తెలుగు అంటే అంత ప్రేమ ఎందుకు?”
“అన్నం పెట్టింది కదా!”
“ఏమిటీ?”
“అమ్మ కదా!”
కౌగిలించుకొాని “హాయిగా ఉంది!” అన్నాడు.
“నాకూ సుఖంగా ఉంది” అన్నాను. తాళం తీసుకొని నా గదికి బయలుదేరాను. పిల్లవాడు సామాను తెస్తున్నాడు.
తృప్తిగా, ఆనందంగా చూస్తున్న యజమాని + ఉద్యోగిని- వెనుదిరిగి చూస్తే పరమానందం కలిగింది.- రచయిత
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ
అద్యక్షులు