అమెరికా సంయుక్త రాష్ట్రములు/పదమూడవ అధ్యాయము
పదమూడవ అధ్యాయము.
పరిసమాప్తి.
అభివృద్ధి - విదేశ వ్యవహారములు.
స్వతంత్ర్యము
సర్వతోముఖమైన
ఆభివృద్ధికి
కారణమయ్యెను.
(1) అమెరికో స్వతంత్ర యుద్ధ కాలములో చాలమంది రాజభక్తులు తమ దేశ స్వాతంత్ర్యఘునకు వ్యతిరేకముగ (తుదివరకు ఆంగ్లేయపక్షమున నిలచి పనిచేయుట పైన చూచియున్నాము, ధనికులగు వర్తకులలోను గొప్ప భూఖామందులలోను, వాళ్ళలోను చాల మంది రాజభ క్తులుగనేయుండిరి. స్వతంత్ర ముకొరకు పోరాడు చున్న వారిని అల్లరిగుంపులని వీరు పిలిచిరి. ప్రధమదివసము లలో స్వతంత్ర పక్షమున నున్న వారి పేళ్ళను ఆంగ్లేయ సైనికులకు వ్రాసియిచ్చి, వాని కాల్చమని, దోచుకొమ్మని ప్రోత్స హించిరి. ఆఖరు వరకును స్వతంత్ర పక్షము నకు వ్యతిరేక ముగ తీవ్రమైన పత్రికా ప్రచారము చేసిరి. కరపత్రములను విరివిగా పంచి పెట్టిరి వారు తెలియపరచిన ముఖ్య హేతువు లేమనగా, "అమెరికాలోని ఐచ్ఛిక భటులు ఆంగ్లేయ సైన్య ముల ముందర నిలుపజాలరు. అమెరికాకు స్వతంత్రము పచ్చునను మాట వట్టికల్ల. ఒక వేళ నిజముగా అమెరికాకు స్వతంత్రమే వచ్చినచో, ఆమెరికాకు అంతకన్న ఎక్కువ దురదృష్టముండబోదు. ఆంగ్లేయులు దేశమును విడిచి పోగానే అమెరికాలో అంతః కలహములు కలిగి ఒక కక్షివారు మరియు కక్షివారిని, ఒక రాష్ట్రమువారు రియొక రాష్ట్రము వారిని సరకుకొని దేశమును రక్త ప్రవాహములో ముంచెదరు. ఇది నిశ్చయము. స్వతంత్ర మని ఆర్భాటము చేయుచున్న దుండగీడుల మాటలు విని దూరాలోచనగలవా రెవ్వరు చెడి పోకుడు. ” ఈ రాజభక్తుల ముఖ్య పత్రిక యగు రాయల్ గెటిన్ ఆసు పత్రికలో పసిపిల్లలకు తండ్రి యొక్క ఆవశ్యకత యెంతగలదో, అమెరికా యొక్క సురక్షితమునకును గౌరవ మునకును ఆంగ్లేయ, ప్రభుత్వము యొక్క ఆవశ్యకత యంతకలదని సదా వ్రాయుచుండెను.
అమెరికా స్వతంత్రమును పొందిన తరువాత అదివరకు రాజభక్తులు ,ప్రకటించుచుండిన భావము. లన్నియు అబద్దముగ తేలను, ఐక్యత చెడలేదు. రక్త ప్రవాహములు కలుగ లేదు. అంతర్యుద్ధములు రాలేదు. తమ దేశపాలనము మొక్క జవాబుదారీ తమమీద పడగనే తమదేశము యొక్క గౌరవము కొంకును ఘగతి కొరకును అందరుసు కలసి పని చేసిరి. స్వతంత్రము పొందుట అమెగాకు, దురదృష్టమగు
టకు మారుగ అమెరికా అత్యాశ్చరగరముగా సర్వతోముఖమైన అభివృద్ధి చెంది స్వతంత్రము. స్వర్గహతుల్యముగ పరిణ మించినది, స్వతంత్రము స్వభావమగు స్థితి, పరతంత్రము అస్వభావికమగు స్థితి. " అని రూసోపండితుడు వ్రాసినన సిద్దాల తము నిజమని తేలెను. ఇతరుల క్రింద సుపరి పాలనము కంటెకూడ స్వపరిపాలనము మావవాభివృద్ధికి అనేక మడుంగులు వుపయోగ కరమని రూఢియయ్యెను •
వ్యసాయము
పరిశ్రమలు..
సంయుక్త రాష్ట్రములు చాల పెద్దజేశము. 'కావలసి అ నంత వ్యవసాయమున కర్హమగు ప్రదేశము వ్యవసాయము గలదు. అడవులు గలవు. గనులు గలవు. పరిశ్రమలు,
వివిధములగు శీతోష్ణ స్థితులుగలవు. సమస్త మైన పంటలు పండును. పశువులు సమృద్ధిగాగలవు. లోహములు, రాక్ష,సిబొగ్గు విరివిగా దొరడును. "కలప, కట్టె చాల లభించును. ప్రభుత్వమువారును ప్రజలను కలసి నవీన పద్దతులమీద పరిశ్రమలను విశేషముగ వృద్ధి చేసికొనినారు. పరిశ్రమలు చాలవరకు ఆవరియంత్రముల వలసను, విద్యు చ్చక్తి వలనను నడపబడుచున్నది. పరిశ్రమలకు కావలసిన
ముడిపదారముల కొరకు యితర దేశములకు పోవలసిన పని 'లేదు. యూరవు ఖండములోని ఇంగ్లాండు మొదలగు దేశములు కేవలము పారిశ్రామిక దేశములుగ నున్నవి. వాటికి కావలసిన ఆహారపదార్ధముల కొరకును ముడి పదార్ధముల కొరకు,
యితర దేశములమీద నాధారపడి యున్నవి. ' సంయుక్త రాష్ట్రములలో బహుశేష్టమగు ప్రత్తివండును. - దేశములోని బట్టలయంత్ర శాలకై సరిపోగ పండిన దానిలో
+
E
.
సగము ఇంగ్లాండు మొదలగు యూరపుఖండములోని దేశములకు రవాణా యగుచున్నది. హిందూదేశములోని ప్రత్తికన్న అమెరికా ప్రత్తి శేషమైనది. సంయుక్త రాష్ట్రములు, హిందూ దేశము, ఈజిప్టు ఈ మూడు దేశములనుండియే యూరపియస్ జూతులు తమ బట్టలయం త్రశాలలకు శావలసిన దూదిని తెప్పించుకొనుచున్నారు. ఈ దేశములనుండి దూదిరానిచో యూరపులోని యంత్రశాలలు మూయబడును. రాష్ట్రము
లలో ఇనుము, రాగి, వెండి, అల్యూమినం మొదలగు లోహ ములే గాక, కాలిఫోర్నియా, గోలొరాడో మొదలగు రాష్ట్ర ములలోను, అలాస్కాలోను బంగారు గనులు త్రవ్వబడి మేలైన బంగారము చాల దొరకుచున్నది. ప్రపంచములోని అన్ని దేశములతోను రాకపోకలు పూర్తిగా మాని నను సంయుక్త రాష్ట్రముల ప్రజల ఆహారము కును, బట్టలు మొదలగు పారిశ్రామిక సరుకుల కును కొదువ లేకుండ స్వయం సహాయము మీద నిలువగలరు. సంయుక్త రాష్ట్రములలోగల అన్ని సౌకర్యము లును హిందూదేశములోన గలవు. రెండువందల సంవత్సరములకు ముందు హిందూదేశము గొప్పపారిశ్రామిక దేశముగను, వ్యవసాయ దేశము: గనుకూడ ప్రసిద్ది చెంది దేనికిని ఇతర దేశములమీద ఆధారపడని స్థితి యందుండెను, కాని ఇపుడు హిందూదేశములో పరిశ్రమలన్నియు క్షీణించి కేవలము వ్యవసాయిక దేశ మైనదీ, కట్టుకొను బట్టలకును, వ్రాసుకొను కాగితములకును పొయిరాజేయు నిప్పుపుల్ల కును ఇతర దేశముల మీద హిందూదేశ మిపుడా ధారపడియున్నది. ప్రకృతి శాస్త్ర శోధనలలోను శోధనా ఫలితములను వదిశ్ర మల,
కొరకును, ఇతర విధములగు అభివృద్ధికగారకును వినియోగించుట తోను సంయుక్త రాష్ట్రములు ప్రసిద్ది చెందియున్నవి. ప్రవాహము లన్నిటినుండియు విద్యుచ్చక్తి ఉత్పత్తిచేయబడు చున్నది. అమెరికసులు పతిపనికిని విద్యచ్చక్తిని వినియోగించుకున్నారు. సంయుక్త రాష్ట్రములలో వాడినంత విద్యుచ్ఛక్తి మరొకదేశ ములో వాడుట లేదని చెప్పవచ్చును. .
నగరవై
భవము.
సంయుక్త రాష్ట్రములలో నగరములు పట్టణములు విశేషముగ వృద్ధిచెందినవి. ప్రధాన నగర రాజము న్యూయార్కు. ఇది తూర్పసముద్ర తీరమున నొక ద్వీపముమీద కట్టబడినది. దీని జనసంఖ్య అరువది లక్షలు కలిగి ప్రపంచములో మొదటిదిగ నున్నది. ఇంగ్లాండు యొక్క రాజధానియగు లండ నునగరము: సందే బదిలక్షలు జనులు గలరు. అమెరికాలో న్యూయార్కుతరువాత ప్రధాన నగరములు చికాగో, ఫిలడల్ఫియా సగర ముల. న్యూయార్కులో ,పపంచములో కెల్ల ఎత్తైనకట్టడములు గలవు. 'ఆనగరములోని బ్రాడ్వే అను వీథిలో పది అంతస్తులకు తక్కువ మేడ లేదు. నలుబది అంతస్తులకు మేడలు గలవు. ఆగరముయొక్క స్కై లైనవీధిలో మ్యునిసిపలు కచ్చేరి ముప్పదినాలుగంతస్తులు గలగి. సింగరు, (బట్టలు కుట్టు యంత ముల) కంపెనీ యొక్క కట్టడములు బది అంతస్తులు గలది. వులువర్తు కట్టడము ఏబడి అయిదు అంగస్తుల గలది. ' . ఇట్టి యెత్తయిన కట్టడము లెన్నయో గలవు. సలుబదినాలు గంతస్తులు గల యొక (హోటలు), పూటకూళ్ళ బస గలదు. ఈ కట్టడముల లోని ఏఅంతస్తు కైన
పోవుటకును క్రిందికి దిగుటకును' విద్యుచ్చక్తివలన లాగబడు బల్లలుండును. బొంబాయ నగరమును చూచినవారు ఇట్టి బల్లలను చూచి యుందురు. ఈగట్టడముల వైభవము వర్ణింప నలవికాదు.
కోటీశ్వరులు
ఇంతేగాక అమెరికాలో సున్న కోటీశ్వరులు మరియెక్కడను లేరు. ఏమియు ద్రవ్యము లేకుండ అమెరికాకుపోయి తమ తెలివి తేటలవలన కోటీశ్వరులై నవారు పెక్కు మందిగలరు. రాకు ఫెల్లరు, కాగ్నిజీ వీరు పొంటు మార్గసు ఫోర్డు మొదలగువారు బహు సామాన్య స్థితినుండి కోటీశ్వరులైనవారు. న్యూయార్కులో నా నాకోటీశ్వరుల బజారు గలదు. {Millionaires avenue) ఆ బజారులలోని కట్టడముల వైభవము సొగసు అందులోని ఐశ్వ ర్వవము ఎవరు వర్ణించగలను! నిమిషమునకు ఎన్ని వేల సవర మల ఆదాయ మవచ్చునో చెప్పవీలు లేని కోటీశ్వరులు గలరు. ఈ కోటీశ్వరులు సంయుక్త రాష్ట్రములలోని విద్యావిష యిక వరిపాపనలకును, ప్రకృతి శాస్త్ర శోధనలకును, గ్రంధా లయములకును, వైద్యాలయములకుసు, విశేషముగ సహా యము చేయుచున్నారు. సంయుక్త రాష్ట్రములలో ప్రతి రాష్ట్రములోను నొక విశ్వవిద్యాలయము ప్రభుత్వమువారిచే పాపింపబడియున్నది. ఇవిగాక ధనవంతులు స్థాపించిన విశ్వ విద్యాలయములు, కళాశాలలు, పాఠశాలలు లెక్కలేనన్ని గలవు. యూరపుఖండము నుండి ప్రతి ఏటను లక్షలు బీదలగు. తెల్లవారు అమెరికాకు వలస పోవుదురు. వారు ప్రధమమున న్యూమూర్కు , సగరమున దిగుదురు,
న్యూయార్కులో సున్నట్టియు, న్యూయార్కుకు కొత్తగా ఏటట దిగునట్టియు బీదలగు పిల్లల కందరకును అన్న వస్త్రము లిచ్చి విద్యార్ధివసతిగృహములలో నుంచి జీతము లేకుండ ప్రైమరీ, ఉత్తమపారిశ్రామిక విద్య నేర్చుటకు తగిన ప్రతిష్టాపనలు న్యూయార్కు పట్టణమున లెక్క లేనిన్నిగలవు. ధనవంతులు చేయ సహాయమువలన ఈ ఏర్పాటులు జరుగుచున్నవి. అచట నాపిల్ల లాంగ్లేయభాషను వారి స్వభావను ప్రకృతి శాస్త్రమును అమెరికా దేశ చరిత్రమును చదివి తాము పెంపకము నకు వచ్చిన అమెరికా సంయుక్త రాష్ట్రము లందు . అత్యంత దేశాభమాసమును గర్వమును నేర్చుకొందురు. పిల్లల ఆరోగ్యము నరయ టకు వైద్యులు మంత్రసానులు గలరు. పిల్లలు ఆడుకొనుటకు ఆటస్థలములును చదువుకొనుటకు గ్రంథాలయ ములునుగలపు. బీదల యిండ్లను దర్శించి తల్లులకు శిశుపోషణ సుగూర్చి సలహానిచ్చుటకును వైద్య సహాయము చేయుటకును తిరుగుచుండు నైద్యులును మంత్రసానాలను చాలమంది ఏర్పడి యన్నారు. కోటీశ్వరులగు వారిలో చాలమంది తమధనము తమదేళమునకు వినియోగపడవ లెనను దేశాభిమానము కలిగి యుండుట వలననే ఇంక పని జరుగుచున్నది. శార్నీ జీ అను కోటీశ్వరుడు గ్రంధాలయను లకును విద్యాలయములకును ఎంతో దానధర్మములు చేయుచున్నాడు. ఇంతవరకు ఏబది “ఆరుకోట్ల రూప్యముల ధనమును దానధర్మములకు వెచ్చించి యన్నాడు. ఇంకను ధనము తరుగుట లేదు. మాకాలను కోటీశ్వరుడు చిత్తరువులకును కళలకును శిల్పములకును ఎక్టున సహాయము చేయుచున్నాడు. . రాడు ఫెల్లరు ప్రకృతిశాస్త్ర శోధనలకును విశ్వవిద్యాలయములకును లెక్క లేనిసొమ్ము వెచ్చించుచున్నాడు. ఫోర్డు అనువాడు మోటారుకార్ల యజ మాని. ఫోర్డు కారు అనునది అతను కనిపెట్టిన కారు. హిం దూదేశములోను మరి ఇతర దేశములోను క్రైస్తవమతబోధ సల్పు తెల్లపాదిరీలకు (బోధకులకు) తలావక ఫోర్డుకారు ఉచితముగా నిచ్చుచున్నాడట ! అమెరికాలో మోటారుకార్లు చాల చవుక , మరియు వాటిని పెట్టుకోగలవారును విశేషముగాగలరు. అచటి కార్మికులలో చాలమందికి స్వంత మోటారు కార్లుండును. వాటిలోనే ఎక్కి కూలిపనిచేసు కొనుటకు పోయివచ్చెదరు. మన దేశములో కార్మికులకు వంటెద్దు బండ్లు ఉన్నట్టులనే అచట, మోటారు కార్లుండును. మన దేశమునకును ఆదేశమునకును ఐశ్వర్యములోకూడ అంతే భేదము .
నవనాగరికత.
సంయుక్త రాష్ట్రములు నవీనమగు దేశము. ప్రతిసంవత్సరము సగుటున పదిలక్షలకు తక్కువగా కుండ యూరఫు ఖండమునుండి తెల్లవారు ఇచ్చటికి కాపురమునకు వచ్చుచున్నారు. ప్రధమములో యూరపుయొక్క, పశ్చిమభాగమునుండి అనగా యింగ్లాండు,ఫ్రాన్సు, ఐర్లండు, జర్మనీ, స్పైస్ , హాలెండు దేశ ములుండి పలస వచ్చిరి. కానీ రానురాను ఆ దేశము లనుండి ప్రజలువలన వచ్చుట చాల తక్కువయింది. యూరపు ఖండపు, తూర్పు దేశములగు రొమేనియా, బాల్కను రాష్ట్రమలు, రుష్యా, టర్కీ, ఆర్శినిము, ఆస్ట్రియా మొదలగు దేశములనుండి నచ్చు చున్నారు రాచకీయ నిర్బంధములకును మత నిర్భంధముల
కును పడలేక వలస పచ్చెడి ధీరులివుడు వచ్చుటలేదు. పటట బీదలగుగారు స్త్రీలు పురుషులు పిల్లలు వచ్చుచున్నారు. ఈ వచ్చు వారు స్వేచ్చగా అమెరికాలో ద్రవ్యార్జన చేసికొనుటకై వచ్చుచున్నారు. సాంఘికాచారములు పూర్వ సొంప్ర దాయములు మొదలగు ప్రాత బంధములను పూర్తిగా తెంచి వచ్చునట్టియు స్వతంత్రమనే పూర్తిగా కోరునట్టియు జనులే విశేషముగా అమెరికాకు చేరుచున్నారు.
స్త్రీలు.
అమెరికాలో స్త్రీలకు పురుషులతో బాటు సంపూర్ణస్వతంత్రము గలదని చెప్పనక్కర లేదు. శ్రీ పురుషులతో బాటు స్త్రీలు కూడ విద్య నేర్చు కొనినారు. స్వతంత సంపాదనమునందును నీగ్రోబానిసత్వ నిర్మూలము నందున పురుషులతో పోటు స్త్రీలు పని చేసియు చున్నారు. ఇపుడు రాజకీయ సాంఘిక వ్యవహారములలో నేగాక దాదాపుగా అన్ని వృత్తులలోను స్త్రీలు ప్రవేశించుచు పురుషులకు పోటీగనున్నారు. ఆ రాష్ట్రములలో స్త్రీలకు ఓట్లుగలవు. స్త్రీలు శాసన సభ్యులు నున్నారు. ఉద్యోగములు చేయుచున్నారు. ఈ మధ్యనే ఒక స్త్రీ ఒక రాష్ట్ర ముసకు గవర్నరుగ నెన్నుకొనబడెను.
1910 వ సంత్సరపు జనాభాగణితీవలన ఆరులక్షల పందొమ్మిది వేల మంది ఉపాధ్యాయ వృత్తి స్వీకరించిన వారిలో నాలుగులక్షల ఎనుబది నాలుగు వేల మంది స్త్రీలు గలరు 1843 మంది స్త్రీ లాయర్లును (న్యాయవాదినులుము) 9015 మంది స్త్రీ డాక్టర్లును వైద్యులును) గల, సంగీత మును నేర్పు ఉపాధ్యాయినులుగా 81478 మంది యున్నారు. టైపు రైటిర్లు 288816 మందియు లెఖ వ్రాయువారు 187155 మందియున్నారు. ఇంత సాంఘిక స్వతంత్రముగల ఆచారము లేక్పడియుండి, ప్రతి యేటను కడు బీదలగు స్త్రీపురుషులు పది లక్షల మంది, యూరఫుసుండి వచ్చుచుండినప్పుడు మానవ స్వభావములోగల బలహీనతను 'అవకాశము తీసుకొనువారు కూడ సుండక పోవుదురా? పట్టణములలో నైతిక బలహీనత వలసను పేదరిక మువలనను వ్యభిచావృత్తికి లోబడుచున్న దార్భాగ్యు