అభినయ దర్పణము/నవవిధశిరోభేధ లక్షణమ్‌

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉపాంగాని ద్వాదశితాన్యన్యాన్యంగాని సంతి చ,
పార్ష్ణిగుల్భౌ తథా౽జ్గుళ్యః కరయోః పదయో స్తలే. 53
ఏతాని పూర్వశాస్త్రానుసారేణోక్తాని వై మయా,

తా. చూపు, ఱెప్పలు, నల్లగ్రుడ్దు, చెక్కిళ్ళు, ముక్కు, దవుడలు, అధరము, దంతములు, నాలుక, గడ్దము, మొగము, శిరస్సు ఈ పండ్రెండును ఉపాంగములు. వీని అంగాంతరములుగా గుదికాలు, చీలమండ, కాళ్లచేతులవ్రేళ్లు, అరచేతులు, అరకాళ్లు. ఇవి పూర్వశాస్త్రము ననుసరంచి నాచేత చెప్పఁబడినవి.

అంగానాం చలనాదేవ ప్రత్యజ్గోపాజ్గయోరపి. 54
చలనంప్రభవే త్తస్మాత్స ర్వేషాం నా౽త్రలక్షణమ్&,

తా. అంగములు చలించుటవలననే ప్రత్యంగోపాంగములకును చలనము కలుగును. కాఁబట్టి వీని కన్నిఁటికిని వేరువేరుగా లక్షణములు చెప్పలేదు.

నృత్యమాత్రోపయోగ్యాని కథ్యంతే లక్షణై క్రమాత్.
ప్రథమం తు శిరోభేదః దృష్టిభేద స్తతః పరమ్‌,
గ్రీవాహస్తౌ తతః పశ్చాత్క్రమేణైవం ప్రదర్శ్యతే. 56

తా. నృత్యమున కుపయోగించునవి మాత్రము లక్షణయుక్తముగఁ జెప్పఁబడును. మొదట శిరోభేదము, తరువాత దృష్టిభేదము, పిమ్మట గ్రీవాభేదము, అటుపిమ్మట హస్తభేదము నీవిధముగ వివరింపఁబడును.

అథ నవవిధశిరోభేదా లక్ష్యన్తే.

సమముద్వాహితమథోముఖమాలోలితం ధుతమ్,
కమ్పితఞచ పరావృత్త ముత్తిప్తమ్పరివాహితమ్‌. 57

నవధా కథితం శీర్షం నాట్యశాస్త్రవిచక్షణైః,

తా. సమము, ఉద్వాహితము, అధోముఖము, ఆలోళితము, ధుతము, కంపితము, పరావృత్తము, ఉత్తిప్తము, పరివాహితము నని శిరోభేదములు తొమ్మిది.

1. సమము :-
నిశ్చలం సమమాఖ్యాతమున్నత్యానతివర్జితమ్‌. 58

తా. క్రిందకి వంపక, మీఁదికెత్తక నిశ్చలముగ నుంపఁబడునది సమశిరస్సు.

వినియోగము:-
నృత్తరమ్భే జపాదౌ చ గర్వే ప్రణయకోపయోః,
స్తమ్భనేనిష్క్రియాత్వేచ సమశీర్ష ముదాహృతమ్‌.
59

తా. నృత్తారంభము, జపాదులు, గర్వము, ప్రీతి, కోపము, స్తంభించి యుండుట, క్రియారహితత్వము- వీనియం దీశిరస్సు ఉపయోగింపఁబడును.

2. ఉద్వాహితము :-
ఉద్వాహితశిరో జ్నేయ మూర్ధ్వభాగోన్నతం శిరః,

తా. మీఁదికెత్తి నిలుపఁబడునది యుద్వాహితశిరము.

ధ్వజే చన్ద్రేచ గగనే పర్వతే వ్యోమగామిషు.
తజ్గవస్తుని సంయోజ్య ముద్వాహితశిరో బుధైః,
60

తా. ధ్వజము, చంద్రుఁడు, ఆకాశము, పర్వతము, ఆకాశమున సంచరించెడువస్తువులు, ఎత్తైనపదార్ధము--వీనిని చూచుటయందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

3. అధోముఖము:-
అధస్తాన్నమితం వక్త్ర మధోముఖమితీరితమ్‌. 61

తా. క్రిందికి పంపఁబడిన శిరస్సు అధోముఖ మనఁబడును.

వినియోగము:-
లజ్జాఖేదప్రణామేషు దుశ్చిన్తా మూర్ఛయో స్తథా,
అధస్థ్సితార్థనిర్దేశే యుజ్యతే జలమజ్జనే.
62

తా. సిగ్గు, ఖేదపడుట,మొక్కుట, దురాలోచనచేయుట, మూర్ఛిల్లుట, క్రిందుగా నుండుపదార్ధమును చూచుట, నీటమునుఁగుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.

4. ఆలోలితము:-
మణ్డలాకారవద్భ్రాన్త మాలోలితశిరో భవేత్,

తా. చక్రాకారముగాఁ ద్రిప్పఁబడునది అలోలితశిర మనఁబడును.

వినియోగము:-
నిద్రోద్వేగే గ్రహావేశే మదే మూర్ఛాతురే తథా. 63
భ్రమణేచ వికల్పాదౌ హాస్యేచా౽౽లోలితం శిరః,

తా.తూగాడుట, దయ్యముసోకుట, మదము, మూర్ఛపోయినవాఁడు, గిరగిరతిరుగుట, వికల్పాదులు, నవ్వు వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.

5.ధుతము:-
వామదక్షిణభాగే తు చలితం తద్ధుతం శిరః 64

తా. ఎడమ కుడిప్రక్కలకు కదలింపఁబడునది ధుతశిర స్సనఁబడును.

వినియోగము:-
నా స్తీతి వచనే భూయః పార్శ్వదేశావలోకనే,
జనాశ్వానే విస్మయే చ విషాదే ౽నీప్సితే తథా. 65
శీతార్థే జ్వలితే భీతే సద్యఃపీతాసవే తథా,
యుద్ధయత్నే నిషేధే చ అమర్షే స్వాజ్గవీక్షణే. 66
పార్శ్వాహ్వానే చ తస్యోక్తః ప్రయోగో భరతాగమే,

తా. లేదనుట, మాటిమాటికి ప్రక్కలఁజూచుట, జనుల నూరడించుట, ఆశ్చర్యము, ఖేదము, ఇచ్చలేమి, చలి, మండుట, భయపడుట, అప్పుడు త్రాగినకల్లు, యుద్ధప్రయత్నము, త్రోపుడు, కోపము, తన అవయవములను జూచుకొనుట, ప్రక్కలనుండువారలను బిలుచుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.

6. కంపితము:-
ఊర్ధ్వాధోభాగచలితం కంపితం తచ్ఛిరో భవేత్. 67

తా. క్రిందుమీఁదుగాఁ గదలింపఁబడునది కంపితశిరస్సనఁబడును.

వినియోగము:-
రోషే తిష్ఠేతి వచనే ప్రశ్నసంజ్నోపహూతయోః,
ఆవాహనే తర్జనే చ కమ్పితం తచ్ఛిరో భవేత్.
68

తా. కోపము, ఉండుమనుట, అడుగుట, పిలుచుట, ఆవాహనము, బెదరించుట వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

7. పరావృత్తము:-
పరాజ్ముఖీకృతం శీర్షం పరావృత్తమితీరితమ్,

తా. ప్రక్కగాఁ ద్రిప్పిన పరావృత్తశిర స్సగును. వినియోగము:-

తత్కార్యం కోపలజ్జాది కృతే వక్త్రప్రసారణే. 69
అనాదరే కచే తూణ్యాం పరావృత్తశిరో భవేత్,

తా. కోపము, సిగ్గు మొదలైన వానివలన ముఖమునుచాఁచుట, ఉపేక్షించుట, జడ, అమ్ములపొది వీనియందు ఈశిరస్సు ఉపయోగింపఁబడును.

8. ఉతిక్షప్తము:-

పార్శ్వోర్ధ్వభాగచలిత మతిక్షప్తం నామ శీర్షకమ్‌. 70

తా. ప్రక్కన మీఁదికెత్తఁబడునది ఉత్తిక్షప్తశిరస్సనఁబడును.

వినియోగము:-

గృహాణ గచ్ఛేత్యాద్యర్థే సూచనే పరిపోషణే,
అజ్గీకారే ప్రయోక్తవ్య మతిక్షప్తం నామ శీర్షకమ్‌. 71

తా. తీసికొనుము పొమ్ము అనుట మొదలగునవి, జాడచూపుట, పోషించుట, సమ్మతించుట వీనియందు ఉత్తిక్షప్తశిరస్సు ఉపయోగింపఁబడును.

9. పరివాహితము:-

పార్శ్వోర్ద్వయోశ్చామరవన్నతం చేత్పరివాహితమ్‌,

తా. వింజామరమువలె ఇరుప్రక్కలకు పంపఁబడునది పరివాహిత శిరస్సనఁబడును.

వినియోగము:-

మోహేచ విరహే స్తోత్రే సన్తోషే చాఽనుమోదనే. 72
విచారే చ ప్రయోక్తవ్యం పరివాహిత శీర్షకమ్‌,

తా. వలపు, ఎడబాటు, పొగడుట, సంతోషము, ఒప్పుకొనుట, విచారము వీనియందు ఈశిరస్సు ఉపయోగింపఁబడును.

గ్రంథాంతరస్థ శిరోభేదాః.

ధుతం విధుతమాధూత మవధూతం చ కంపితమ్‌. 73
అకంపితో ద్వాహితే చ పరివాహిత మంచితమ్‌,
నిహంచితం పరావృత్త మతిక్షప్తాధోముఖే తథా. 74
లోలితం చేతి విజ్ఞఏయం చతుర్దశవిధం శిరః,
తిర్యజ్నతోన్నతం స్కంధానతమా రాత్రికం సమమ్‌. 75
పార్శ్వాభిముఖమిత్యన్య భేదాన్‌ పంచ పరే జగుః,
సౌమ్యమాలోకితం చైవ తిరశ్చినం ప్రకంపితమ్‌. 76
సౌందర్యం పంచధాప్రోక్తం శిరోభేదా ఇదం క్రమాత్,
భరతాదిభిరాచార్యై శ్చతుర్వింశతిరీరితాః. 77

తా. ధుతము, విధుతము, అధూతము, అవధూతము, కంపితము, అకంపితము, ఉద్వాహితము, పరివాహితము, అంచితము, నిహంచితము, పరావృత్తము, ఉత్తిక్షప్తము, అధోముఖము, లోళితము, తిర్యజ్నుతోన్నతము, స్కంధానతము,అరాత్రికము, సమము, పార్శ్వాభిముఖము, సౌమ్యము, ఆలోలితము, తిరశ్చీనము, ప్రకంపితము, సౌందర్యము అని శిరోభేదములు ఇరువదినాలుగువిధములుగా భరతాచార్యులు మొదలైనవారిచేఁ జెప్పఁబడి యున్నవి.

1. ధుతము:-

పర్యాయేణ శనైస్తిర్యగ్గతముక్తం ధుతం శిరః,

తా. క్రమము చొప్పున మెల్లఁగా అడ్డముగాఁద్రిప్పంబడునట్టిశిరము ధుతమనఁబడును.

వినియోగము:-

శూన్యస్థానే స్థితేచైవ పార్శ్వదేశావలోకనే. 78

గ్రంథాతరస్థశిరో భేదలక్షణమ్.

అనాశ్వాసే విస్మయే చ విషాదే౽నీప్సితే తథా,
ప్రతిషేధే చ తస్యోక్తః ప్రయోగో భరతాదిభిః. 79

తా. ఏమిలేనిచోటు, ప్రక్కలుచూచుట, ఊరటలేమి, ఆశ్చర్యము, ఖేదము, ఇచ్చలేమి, త్రోపుడు వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

2. విధుతము:-

ద్రుతగత్యథతత్త స్మా ద్విధుతం తత్ప్ర చక్షతే,

తా. అదేశిరస్సు వడితోఁ ద్రిప్పఁబడినయెడ విధుత మనఁబడును.

వినియోగము:-

శీతార్థేజ్వలితే భీతే సద్యః పీతాసవే తథా. 80

తా. చలి, వేండ్రము, పిరికివాడు, అప్పుడు కల్లు త్రాగినవాఁడు వీరియందు ఈశిరస్సు వినియోగింపబడును.


3. ఆధూతము:-

ఆధూతం తు సకృత్తిర్యగూర్ద్వనీత శిరోమతమ్,

తా. రవంత అడ్డముగా నిక్కించిన శిరస్సు అధూత మనఁబడును.

వినియోగము:-.

సర్వేషు స్వాంగవీక్షాయాం పార్శ్వస్థోర్వనిరీక్షణే. 81
శక్తో౽స్మీత్యభిమానే చ ప్రయోగస్తస్య చోదితః,

తా. సమస్తముననుట, తనదేహమును జూచుకొనుట, పార్శ్వములందు నిక్కిచూచుట, సమర్ధుఁడనైతినను గర్వము వీనియందు ఈ శిరస్సు వినియోగింపబడును.

4. అవధూతము:

యదధస్సకృదానీత మవధూతం తదుచ్యతే.82 తా. కొంచము క్రిందుగా వంపఁబడునది యవధూత మనఁబడును.

వినియోగము:

   స్థిత్యర్థేదేశానిర్దేశే ప్రశ్న సంజ్ఞోపహూతయోః,
   ఆలా వేచ ప్ర యోక్తవ్య మిదమాహుర్మనీషిణః, 83

తా. ఉండుమనుట, తావుజూపుట, అడిగెడుజాడ, పిలుచుట, సంభాషణము వీనియందు ఈ శిరస్సు వినియోగింపబడును.


5. కంపితము:-

బహుళోద్ధృతమూర్ధ్వం చ కంపనొక్కంపితం శిరః,

తా. మిక్కిలి పొడువుగనెత్తి చలింపఁజేయఁబడిన శిరస్సు కంపితమనఁబడును.

వినియోగము:-

జ్ఞానాభ్యుగమే కోపే వితర్కే తర్జనే తథా. 84
త్వరితే ప్రశ్న వాక్యే చ ప్రయోక్తవ్యమిదం శిరః

తా. జ్ఞాపకము తెచ్చుకొనుట, కోపము, ఆలోచన, బెదిరించుట, త్వరితము, ప్రశ్నముచేయుఁట వీనియందు ఈశిరస్సు వినియోగింపబడును

6. అకంపితము:-

అకంపితం తదేవ స్యా త్కంపితం తు శ నైర్యది. 85

తా. ఆ శిరస్సే మెల్లమెల్లఁగ చలింపఁజేయఁబడెనేని అకంపిత మనఁబడును.
వినియోగము:

పురఃప్రస్థితనిర్దేశే ప్రశ్న సంజ్ఞోపదేశయోః,
ఆవాహనే స్వమనసికథనే తత్ప్రయుజ్యతే. 86.

తా. ముందుపోవుదాని జూపుట, అడిగెడిజాడ చూపుట, ఉపదేశించుట, ఆవాహనము చేయుట, తనమనస్సునందు చెప్పుకొనుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపబడును.

ఉద్వాహితము:-

తా.కొంచెము మీఁదికెత్తఁబడిన శిరస్సు ఉద్వహిత మనఁబడును.

వినియోగము:-

తా. అన్నిటికిని నేను చాలుదు ననుగర్వమున నీ శిరస్సు వినియోగింపబడును.

పరివాహితము:-

తా. చక్రాకారముగ మిక్కిలి త్రిప్పఁబడు శిరస్సు పరివాహిత మనఁబడును.

వినియోగము:-

తా. సిగ్గులేమి, భ్రమము, మౌనము, ప్రియుని అనుకరించుట, ఆశ్చర్యము, చిరునవ్వు, సంతోషము, పులకాంకురము, సంతోషింపఁజేయుట, విచారము వీనియందు ఈ శిరస్సు వినియోగింపబడును. తా. ఇరుప్రక్కలకును ఇంచుక వంపఁబడిన మెడగలశిరస్సు అంచిత మనఁబడును.

వినియోగము:-

తా. దురాలోచనము, మోహము, మూర్ఛమొదలైనవి, క్రిందనుండు వస్తువులను చూచుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపబడును.

నిహంచితము:-

తా. పొడువుగ నెత్తఁబడిన మూఁపుతో మెడను జేర్చిన శిరస్సు నిహంచిత మనఁబడును.

వినియోగము:-

తా. విలాసము, లలితము, గర్వము, బిబ్బోకము, కిలికించితము, మోట్టాయితము, కుట్టమితము, మౌనము, స్తంభము అను వీనియందు ఈ శిరస్సు వినియోగింపబడును. (ఇందలి విలాసము మొదలగువాని అర్థము భరతరసప్రకరణమునందు వివరింపఁబడియున్నది.)

పరావృత్తము:-

తా. పెడమొగముగలదిగాఁ ద్రిప్పఁబడిన శిరస్సు పరావృత్త మనఁబడును.

వినియోగము:

తా. కోపము, లజ్జ మొదలగుదానిచే ముఖమునుచాఁచుట, ఒకతట్టు తిరిగినదాని ననుకరించుట, వెనుకతట్టు చూచుట వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

తా. మీఁది కెత్తఁబడిన మొగముగలశిరస్సు ఉప్తమనఁబడును.

వినియోగము.-

తా. ఎటత్తైనపదార్ధములను జూచుట, చంద్రుడు మొదలైన ఆకాశ సంచారులను జూచుట వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

అధోముఖము:-

తా. క్రిందుమొగముగా వంచఁబడిన శిరస్సు అధోముఖ మనఁబడును.

తా. సిగ్గు, దుఃఖము, మ్రొక్కుట వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

తా. గర్వాధిక్యముచేత తేలవేయఁబడిన కన్నులుగలశిరస్సు లోలితమనఁబడును. వినియోగము:-

తా. నిదురవచ్చుట, దయ్యముసోఁకుట, మదము, మూర్ఛ వీనియందు ఈశిరస్సు చెల్లును.

తా. అడ్డముగవంచి యెత్తఁబడినశిరస్సు తిర్యజ్నతోన్నతమనఁబడును.

వినియోగము:-

తా. స్త్రీలయొక్క బిబ్బోకము మొదలగు విలాసచేష్టలయందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

స్కంధానతము:-

తా. మూఁపుమీఁదికి వంపబడినశిరస్సు స్కంధానతమనఁబడును.

వినియోగము:-

తా. ఆశిరస్సు నిద్ర, మదము, మూర్ఛ, చింత వీనియందుపయోగింపబడును.

ఆరాత్రికము:-

తా. మూఁపులయందు కొంచెము తాఁకించి త్రిప్పఁబడుశిరస్సు ఆరాత్రిక మనఁబడును. వినియోగము:-

తా. ఆశ్చర్యము, ఇతరులయభిప్రాయము నెఱుఁగుట వీనియందు ఈశిరస్సునకు వినియోగము.

సమశిరము:-

తా. ఉన్నదియున్నట్టుండు శిరస్సు సమము. ఇది స్వభావాభినయము మొదలైనవానియందు వినియోగించును.

పార్శ్వాభిముఖము:-

తా. ఒకప్రక్కకుఁ ద్రిప్పఁబడుశిరస్సు పార్శ్వాభిముఖ మనఁబడును. అది ప్రక్కనుండువారిని జూచుటయందు ఉపయోగించును.

సౌమ్యము:-

తా. చలనములేకఉండు శిరస్సు సౌమ్య మనఁబడును. అది నాట్యారంభమం దుపయోగింపఁబడును.

ఆలోలితము:-

తా. అంతటను ద్రిప్పఁబడు శిరస్సు ఆలోలిత మనబఁడును.

వినియోగము:

తా. పుష్పాంజలిక్రమము, చారినాట్యము, లావణ్యము, వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

తిరశ్చీనము:-

తా. ఇరుప్రక్కలందును మీఁదితట్టు చలించుశిరస్సు తిరశ్చీన మనఁబడును.

వినియోగము:-

తా. సిగ్గునుకనపరచుట, ముఖచారి అనునృత్తము వీనియందును, ఇంక నిట్టి తగినసమయములందును ఈశిరస్సు చెల్లును.

ప్రకంపితము:-

తా. ముందరికిని ఇరుప్రక్కలకును మాటిమాటికి చలించు శిరస్సు ప్రకంపిత మనఁబడును.

వినియోగము:-

అద్భుతరసము, పాట, ప్రబంధము, తుమ్మెద, శత్రుయుద్ధ భావము వీనియందు ఈ శిరస్సు చెల్లును. దృష్టిభేదాష్టకలక్షణం

తా. క్రిందుమీఁదులకు త్రిప్పుటవలన వెనుకతట్టు చలించుట గలది సౌందర్య శిరస్సు. అది యెల్ల నాట్యములందు ప్రశంస చేయఁబడుచున్నది.

వినియోగము:-

తా. కారణాభినయము, హస్తభ్రమణము అను నృత్తము, యోగాభ్యాసము వీనియందు ఈ శిరస్సు చెల్లును.


తా. సమము, ఆలోకితము, సాచి, ప్రలోకితము, నిమీలితము, ఉల్లోకితము, అనువృత్తము, అవలోకితము, అలి దృష్టి యెనిమిదివిధములు గలదిగా భరతశాస్త్రమునందుఁ జెప్పఁబడినది.

తా. దేవతాస్త్రీలవలె రెప్పపాటులేక చూచుట సమదృష్టి యనఁబడును.

వినియోగము:- నాట్యారం

తా. నట్యారంభము, త్రాసు, ఇతరచింతను నిశ్చయించుట, ఆశ్చర్యము, దేవతారూపము వీనియందు ఈ దృష్టి యుపయోగింపఁబడును.

అలోకితము:-

తా. వడితోడి తిరుగుడుగల సృష్టమైనచూపు అలోకితమనఁబడును.

వినియోగము:-

తా. కుమ్మరిసారె తిరుగుట, అన్నివస్తువులను జూచుట, ఇచ్ఛ వీనియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.

సాచి:-

తా. స్వస్థానమందుండి కడకంటివరకు అడ్డముగా చలించునది సాచీ దృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. అభిప్రాయము, మీసము దువ్వుట, గురి, వస్త్రము, తలఁపు, నయిగ, కులటానాట్యము వీనియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.

ప్రలోకితము:-- ప్రలోకితం పరి తా. ఇరుప్రక్కలయందును చలించునట్టి దృష్టి ప్రలోకితమనఁబడును.

వినియోగము:-

తా. ఇరుప్రక్కల నుండువస్తువులను జూచుట, సయిగచేయుట, కదలుట, కలవరము వీనియందు ఈ దృష్టి యుపయోగింపబడును.

నిమీలితము:-

తా. సగము కన్నుదెరచి చూచెడి చూపు నిమీలిత మనబఁడును.

వినియోగము:-

తా. ఋషివేషము, పరవశత్వము, జపము, ధ్యానము, నమస్కారము, చిత్తచలనము, సూక్ష్మదృష్టి వీనియందు ఈ దృష్టి ఉపయోగింపఁబడును.

ఉల్లోకితము:-

తా. మీఁదికి నిక్కించి వంపఁబడినదృష్టి ఉల్లోకిత మనఁబడును.

వినియోగము:- ధ్వజాగ్రే గోపురే దేవమణ్డవే పూర్వజన్మని, ఔన్నత్యే చనిద్రికాదౌ చ ఉల్లోకితనిరీక్షణమ్

తా. ధ్వజముకొన, గోపురము, దేవమండపము, పూర్వజన్మము, పొడుగు వెన్నెల మొదలగువానియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.

అనువృత్తము:-

తా. వడిగ క్రిందుమీఁదుగాఁ జూచునట్టిచూపు అనువృత్త మనఁబడును.

వినియోగము:-

తా. కోపముతోఁ జూచుట, ప్రీతితోఁ బిలుచుట వీనియందు ఈ దృష్టి వినియోగింపబడును.

అవలోకితము:-

తా. క్రిందుచూచెడిచూపు అవలోకిత మనఁబడును.

వినియోగము:-

తా. నీడనుచూచుట, విచారము, శయనము, చదువుట, తన యవయవములను జూచుకొనుట, నడక వీనియందు ఈ దృష్టి వినియోగింపబడును. తా. సమ, ప్రలోకిత, శృంగార, స్నిగ్ధ, ఉల్లోకిత, అద్భుత, కరుణ, విస్మయ, దృప్త, విషణ్డ, భయానక, సాచి, ద్రుత, వీర, రౌద్ర, దూర, ఇంగిత, విలోకిత, వితర్కిత, శంకిత, అభితప్త, అవలోకిత, శూన్య, హృష్ట, ఉగ్ర, విభ్రాంత, శాంత, మీలిత, సూచన, లజ్జిత, మలిన, త్రప్త, మ్లాన, ముకుళ, కుంచిత, ఆకాశ, అర్ధముకుళ, అనువృత్త, విప్లుత, జిహ్మ, వికోశ, మదిర, హృద్య, లలిత అని దృష్టిభేదములు నలునదినాలుగును.

అందు సమము:-

తా. దేవతాస్త్రీవలె రెప్పపాటులేనిది సమదృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. సమాధులయందు ఈదృష్టి వినియోగింపబడునని నాట్యశాస్త్రజ్ఞలు చెప్పదురు.

ప్రలోకితము:-

తా. ఇరుప్రక్కలను జూచెడిచూపు ప్రలోకిత యనఁబడును. వినియోగము:-

తా. ఇరుప్రక్కలనుండు వస్తువులు జూచుట మొదలైనవానియందు ఈదృష్టి వినియోగించును.

స్నిగ్ధ:-

తా. సంతోషముతోడను, అభిలాషముతోడను గూడునదియు, మనోజ్ఞతగలదియు, అంతర్వికాసముగలదియు, మన్మధోద్రేకముగలదియునైన దృష్టిస్నిగ్ధయనఁబడును. ఇది స్నేహముగల వస్తువు మొదలైనవానియందు వినియోగించును.

శృంగారము:-

తా. సంతోషమువలనఁ బుట్టిన సుఖశేషమునందుఁ గలిగినదియు, మిక్కిలి మన్మధాధీనమయినదియు, మనోజ్నురాండ్ర కనుబొమ్మలు నిక్కించుటవలనను, కడగంటిచూపువలనను గలిగినదియునైన చూపు శృంగారదృష్టి యనఁబడును. ఈదృష్టి మన్మధావేశముగల స్త్రీలవీక్షణము మొదలగువానియందు చెల్లును.

ఉల్లోకితము:-

తా. మీఁదిభాగము జూచునట్టిది ఉల్లోకితదృష్టి యనఁబడును. వినియోగము:-

తా. ఎత్తైనపదార్ధములను జూచుటయందును, పూర్వజన్మమును తలఁచుటయందును ఈదృష్టిచెల్లును.

అద్భుతము:-

తా. కొంచెమువంచఁబడిన రెప్పకొనలును, ఆశ్చర్యముచేత నెత్తఁబడిన కనుబొమ్మలునుగలిగి వికాసముతోఁగూడియున్న సమదృష్టి అద్భుత దృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. ఈదృష్టి ఆశ్చర్యము మొదలైనవానియందు వినియోగించును.

కరుణ:-

తా. దిగువకు వ్యాపించినదియు, సగము తెరవఁబడినదియు, కన్నీళ్లచే మెల్లగాతిరుగుచున్న నల్లగ్రుడ్లుగలదియు, ముక్కుకొనయందు నిలువఁబడి నదియు నైనచూపు కరుణాదృష్టియనఁబడును. ఈదృష్టి కరుణారసమునందు వినియోగపడును.

విస్మయము: తా. మిక్కిలి నిక్కునుచూపునదియు, సమమయినదియు, వికాసము గలదియు, చక్కగా తెరవఁబడిన రెప్పలుగలదియునైనచూపు విస్మయదృష్టి యనఁబడును. ఈదృష్టి ఆశ్చర్యము మొదలైనవానియందు చెల్లును.

దృప్తము:-

తా. నిలుకడగలదియు, వికాసముతోఁగూడినదియు, చలింపనినల్ల గ్రుడ్లుగలదియు, స్వస్థానగతమయినదియు నైన దృష్టిదృప్త యనఁబడును. ఇది ఉత్సాహమందు చెల్లును.

విషణ్ణము:-

తా.విసిరినరెప్పలును, తొలఁగిన రెప్పపాట్లును, చలింపని నల్లగ్రుడ్లునుగలది విషణ్ణదృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. ఖేదమునందును, చింతయందును ఈదృష్టి వినియోగించును.

భయానకము:-

తా. చలింపనిమీఁదికి ఎత్తఁబడినరెప్పలతో, మిక్కిలి చలించుచు, వికాసము నొందియున్న నల్లగ్రుడ్లుగలచూపు భయానక దృష్టియనఁబడును. ఇది మిక్కిలి భయపడుటయందును, భయానకరసమునందును వినియోగపడును.

సాచి:-

తా. కడకంటి చలించునది సాచీదృష్టి యనఁబడును. ఈదృష్టి ఇంగితము మొదలైనవానియందు వినియోగించును.

ద్రుతము:-

తా. రెండు నల్లగ్రుడ్లయొక్క చలనముగలది ద్రుతదృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. ఈదృష్టి సంభ్రమము మొదలైనవానియందు వినియోగింపఁబడును.

వీరము:-

తా. వెలుఁగునదియు, తేటమయినదియు, విరిసినదియు, ఉగ్రమును శాంతమునుగాక మధ్యస్థమైయుండునదియు, లోపలనణఁగిన యభిప్రాయముగలదియు, కలకలేనిదియు, సమములయిన నల్లగ్రుడ్లుగలదియునైన చూపు వీరదృష్టియనఁబడును. ఈదృష్టి వీరరసమునందు ఉపయోగించును. రౌద్రము:-

తా. ప్రీతిలేనిదియు, ఎఱ్ఱనయినదియు, క్రూరమయినదియు, చలించని రెప్పలు నల్లగ్రుడ్లుగలిగినదియు, వంకరైన కనుబొమలుగలిగినదియు, మీఁదికి తెరవఁబడినదియు నైనచూపు రౌద్రదృష్టి యనఁబడును. ఈదృష్టి రౌద్రరసమునందు వినియోగించును.

దూరము:-

తా. కొంచెము మీదికెత్తఁబడినచూపు దూరదృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. దూరముననుండు వస్తువులను జూచుటయందు ఈదృష్టి వినియోగపడును.

ఇంగితము:-

తా. కటాక్షచలనముగలిగి సంతోషముతోఁగూడినచూపు ఇంగిత దృష్టి అనఁబడును. ఇది ఇంగితము మొదలైనవానియందు వినియోగింపఁబడును.

నిలోకితము:

తా. వెనుకతట్టు చూచునట్టిచూపు విలోకితదృష్టి యనఁబడును. ఇది వెనుకతట్టు ఉండువానిని జూచుటయందు వినియోగపడును.

వితర్కిత:-

తా. తేటయై మీఁదికి తెరవఁబడిన రెప్పలు గలదియు, విరిసి భయముతోఁ గూడినవివలె సమములైన నల్లగ్రుడ్లుగలదియు నైనచూపు వితర్కితదృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. ఈదృష్టి ఊహించుట మొదలైనవానియందు వినియోగించును.

శజ్కితము:-

తా. కొంచెము చలనము గలదియు, కొంచెము నిలుకడగలదియు, నిక్కినదియు, అడ్డపువిరివిగలదియు, మరుగైనదియు, బెదరును తోపించెడి నల్లగ్రుడ్లుగలదియు నైనచూపు శంకితదృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. ఇది శంక మొదలయినవానియందు వినియోగింపబడును. తా. రెప్పలకదలికయు, దర్శనాలనములగు నల్లగ్రుడ్లునుగలచూపు అభితప్తదృష్టి యన@ంబడును. ఇదొ విసుగు మొదలగువానియందు వినియోగించును.

అవలోకితము:-

తా. క్రిందుగచూచెడిచూపు అవలోకితదృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. ఈ దృష్టివిచారము, చదువుట మొదలైన విషయములందు వినియోగించును.

శూన్యము:-

తా. సమములైన నల్లగ్రుడ్డును రెప్పలునుగలదియు, బయలుపడినదియు, చలనములేనిదియు, శూన్యమునుచూచునదియు నైనచూపు శూన్య దృష్టియనఁబడును. ఇది బాహ్యార్ధాగ్రహణమునందు వినియోగించును.

హృష్టము:-

తా. చలించునదియు, మనోహరమయినదియు, రెప్పపాట్లుగలదియు, కొంచెము సంకోచింపఁబడినదియు నైనచూపు హృష్టదృష్టి యనఁబడును. ఈదృష్టి నవ్వునందు వినియోగపడును. తా. లెస్సగావికసించినదియు, రెండుకనుగొనలందును ఎరుపుగలదియునైనచూపు ఉగ్రదృష్టి యనఁబడును. ఇది ఉగ్రము మొదలైనవానియందు చెల్లును.

విభ్రాంతము:-

తా. చలించుచున్ననల్లగ్రుడ్లు గలిగినదియు, భ్రమించునదియు, ప్రీతిని గనబరుచునదియు, నడుమనడుమ వెలవెలపాటును తేటదనమును గలిగినదియు నైనచూపు విభ్రాంతిదృష్టి యనఁబడును. ఇది సంభ్రమము మొదలైనవానియందు వినియోగపడును.

శాంతము:-

తా. మూఁతపడు రెప్పలుగలదియు, కొంచెము చలించునట్టి కన్నులు గలిగినదియు, చలించుచున్న నల్లగ్రుడ్లు గలిగినదియు నైనచూపు శాంతదృష్టి యనఁబడును. ఇది శమము మొదలైనవానియందు చెల్లును.

మీలితము:-

తా. సగము తెరవఁబడిన కన్నులుగలది మీలితదృష్టియనఁబడును.

వినియోగము:-

పరవశత్వము మొదలైనభావములయందు ఈదృష్టి యుపయోగింపబడును. సూచన:-

తా. చేసైగ ననుసరించి కొంచెము మూయఁబడినకన్నులుగలది సూచనాదృష్టి యనఁబడును. ఇది జాడచూపుట మొదలైనవానియందు చెల్లును.

లజ్జిత:-

తా. వాలిన మీఁదిరెప్పలును, సిగ్గువలన వాల్పఁబడిన నల్లగ్రుడ్లును, కొంచెము ముడిగినరెప్పల కొనలునుగలది లజ్జితదృష్టి యనఁబడును. ఈదృష్టి సిగ్గుపడుట మొదలైనవానియందు వినియోగించును.

మలినము:-

తా. సంకోచించిన కనుగొనలును, చంచలములైన రెప్పలునుగలిగి కొంచెముముడిగి కన్నులచే ఆకర్షింపఁబడిన నల్లగ్రుడ్లుగలది మలినదృష్టి యనఁబడును. ఇది స్త్రీయందు గనుపడును.

త్రప్తము:-

తా. తొలుత వికాసముగలదై పిమ్మట చలించుచున్న నల్లగ్రుడ్లతో

సరిగా మీఁదికెత్త@ంబడిన రెప్పలుగలది త్రస్తదృష్టి యనఁబడును. ఇది భయమందును మదమునందును చెల్లును.

మ్లానము:-

తా. సడలి, కొంచెపుకదలికతో క్రమముగా సోలుచున్న నల్లగ్రుడ్లు గలిగి రెప్పలకొనలనంటుచున్న కనుబొమ్మలుగలది మ్లానదృష్టి యనఁబడును. ఇది వాడినవస్తువులు మొదలయినవానియందు చెల్లును.

ముకుళము:-

తా. కదలుచున్నట్టియు, ఆసక్తితోఁగూడినవియు నయిన కొనరెప్పలును, తిన్నదనమును, కలిసిననల్లగ్రుడ్లును, మూయఁబడిన పైరెప్పలునుగలది ముకుళదృష్టి యనఁబడును. ఇది యానందమునందు వినియోగించును.

తా. కొంచెము వాల్పబడిన కొనరెప్పలును, మిక్కిలి లోఁగొనఁబడిన నల్లగ్రుడ్లునుగలది కుంచితదృష్టి యనఁబడును. ఇది అనిష్టమునందును అసూయత మొదలైనవానియందును వినియోగపడును.

ఆకాశము: తా. మిక్కిలి విసిరినగ్రుడ్లతో నాకాశమున నిగుడ్పఁబడిన దృష్టి యాకాశదృష్టి. ఆకాశమునందు సంచరించు వస్తువులు మొదలగువానియందిది చెల్లును.

అర్ధముకుళము:-

తా. చిరునవ్వుతో మీఁదికికూరుకొనఁబడుచున్న రెప్పలుగలది అర్ధముకుళదృష్టి యనఁబడును. ఇది అనందాహ్లాదముల గోచరమైయుండును.

అనువృత్తము:-

తా. మాటిమాటికి చూచుట అనువృత్తదృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. ఇది తత్తరపాటు మొదలగువానియందు వినియోగింపఁబడును.

విప్లుతము:-

తా. కదలింపఁబడి, విరిసి, వాల్పఁబడిన రెప్పలుగలది విప్లుతదృష్టి యనఁబడును.

వినియోగము:-

తా. ఈదృష్టి అన్నివస్తువులయొక్క సౌందర్యాదులను జూచుటయందు చెల్లును. జిహ్నము:-

తా. అంతటను వాల్పఁబడినరెప్పలు నిగూఢములయిన గ్రుడ్లుగలిగి, పయికి తెలియక అడ్దముగాను మెల్లగాను చూచుట జిహ్నదృష్టియనఁబడును. ఇది గూఢార్ధములయందును అసూయ మొదలైనవానియందును చెల్లును.

వికోశము:-

తా. రెప్పపాటు లేనిదియు, చలించుచున్న నల్లగ్రుడ్లుగలదియు, సంకుచితములైన రెప్పలుగలదియు నైనచూపు వికోశదృష్టి యనఁబడును. ఇది సంతోషము మొదలైనవానియందు చెల్లును.

మదిర:-

తా. ఒప్పిదమును దిక్కులుజూచుటయు కలతపాటునుగలదియు, మధ్యస్థమయి క్రిందికి వాల్పఁబడినదియు, బెదరుగలదియు నైనచూపు మదిరాదృష్టి యనఁబడును. ఇది తరుణమదమునందు చెల్లును.

హృద్య:-

తా. నిలుకడలేనిదై తడబాటుగలిగి కొంచెము చలింపఁజేయఁబడిన నల్లగ్రుడ్లును వంచఁబడిన రెప్పలునుగలచూపు హృద్యదృష్టియనఁబడును. ఇది మధ్యమములైన వస్తువులయందు చెల్లును.

లలితము:-

తా. కనుబొమ్మలకదలికచే ముడుగఁజేయఁబడిన కడకన్నులు, మన్మధ వికారమువలని చిరునవ్వును, తేటదనమునుగలది లలితదృష్టి యనఁబడును. ఇది ఆనందకరములైన వస్తువులయందు చెల్లును.


తా. సహజ, పతిత, ఉ-ప్త, చతుర, రేచిత, కుంచిత అని భ్రూభేదములు (కనుబొమలచతురత్వము గలక్రియలు) ఆరువిధములుగాఁ జెప్పఁబడుచున్నవి.

సహజము:-

తా. ముఖమందేవికారమును లేక స్వభావికముగనుండెడి కనుబొమ్మ సహజభ్రువనఁబడును. ఇది స్వభావము మొదలైనవానియందు చెల్లును.

పతితము:-

తా. చలింపని కనుబొమ్మలను వాల్చిన పతితభ్రువగును. వినియోగము:- 2.జుగుప్సాయాం విస్మయేచ అసూయామాం భవేదసౌ,

తా. ఇది రోఁతపడుటయందును, ఆశ్చర్యమందును, ఓర్వనితనమందును చెల్లును.

3 ఉత్క్ష్ప్తము: ఏకావాసాదివ్తీయావా యదుత్క్షిప్తతీతరాం, 175 ఉత్తిప్తాసభవేత్ స్త్రీణాం కోవేసత్యవచస్యసి, శృజ్ఞారభావేలీలాయాం భ్రూరేషా వినియుజ్యతే. 176

తా. కనుబొమ్మలు రెంటియందును ఒక్కటిగాని రెండుగాని మిక్కిలి నిక్కింపఁబడునేని అది ఉ-ప్తభ్రువనఁబడును. ఇది స్త్రీలకోపమునందును, సత్యవచనమునందును, శృంగారభావమందును, లీలయందును వినియోగింపఁబడును.

4.చతుర:- ద్వితీయసహితౌ స్తోకాస్ఫురితామదమంథరా, చతురా ముఖసంస్పర్సే హృదానందేచ సమ్బ్రమే 177

తా. రెండుకనుబొమ్మలకూడికతో కొంచెము మెల్లగా చలింపఁజేయఁబడియెనేని చతురభ్రువగును. ఇది ముఖముతాఁకుట, మనస్సంతోషము, వేగిరపాటు వీనియందు ఉపయోగింపఁబడును.

5.రేచితము:- లావణ్యమధురాక్షిప్తా యద్వేకాత్రేచితామతా,

తా. అందముగాను ఇంపుగాను ఒక కనుబొమ్మ వంపఁబడునేని అది రేచితభ్రు వనఁబడును.

వినియోగము:-

రహస్య శ్రవణేసాధు కలనే పదవీక్షణే. 178

తా. ఇది రహస్యమును వినుట, మంచిది అనుట, స్థాన వీక్షణము వీనియందు చెల్లును.

కుంచితము:-

ఏకావాసా ద్వితీయావా కుంచితాంచితవా మతా,

తా. ఒక కనుబొమ్మయేని రెండు కనుబొమ్మలేని ముడిగింపఁబడిన యెడ అది కుంచితభ్రువనఁబడును.

వినియోగము:-

మెట్టాయితే కుట్టమితే విలాసే కిలికించితే. 179

తా. ఇది మోట్టాయితము, కుట్టమితము, విలాసము, కిలికించితము అను శృంగారచేష్టావిశేషములందు వినియోగింపఁబడును. మోట్టాయితము మొదలగు వానియర్ధము భరతరసప్రకరణమందు వివరింపఁబడియున్నది.

అధ చతుర్విధ గ్రీవాభేదానిరూప్యంతే.

సుందరీ చ తిరశ్పీనా తధైవ పరివర్తితా, ప్రకంప్తా చ భావజ్ఞాన .... యాగ్రీవా చతుర్విధా 180

తా. సుందరి, తిరశ్చీన, పరివర్తిత, ప్రకంపిత అని గ్రీవా (మెడ) భేదములు నాలుగు విధములు.

సుందరి:-

తివ్యక్ప్రచలితా గ్రీవా సుందరీతి నిగద్యతే,

తా. అడ్డముగాఁ గదలింపఁబడినది సుందరీగ్రీవ యనఁబడును.

వినియోగము:-

తా. స్నేహారంభము, యత్నముచేయుట, మంచిదనుట, తలఁచుట, సరసము, అనుమోదము వీనియందు ఈగ్రీవ యుపయోగింపఁబడును.

తిరశ్చీనము:-

తా. ఇరుప్రక్కల నూర్ధ్వభాగములయందు సర్పగతివలెఁ గదలిక గలది తిరశ్చీనగ్రీవ యనఁబడును.

వినియోగము:-

తా. కత్తిని ద్రిప్పుటయందును, పామునడకయందును ఈగ్రీవ వినియోగించును.

పరివర్తితము:-

తా. వామదక్షిణములకు అర్ధచంద్రాకారముగా కదలింపఁబడునది పరివర్తితగ్రీవ యనఁబడును.

వినియోగము: తా. శృంగారనటనమునందును, స్త్రీల చెక్కిళ్లు ముద్దుపెట్టుకొనుట యందును ఈ గ్రీవ ముపయోగించును.

తా. పావురాయి మెడకదలించునట్లు ముందువెనుకలుకు గదలింప బడునది ప్రకంపితగ్రీవ యనబాడును.

వినియోగము:-

తా. నీవు నేను అనుటయందును, దేశీనాట్యమునందును, ఉయ్యెలయందును, లెక్కపెట్టుటయందును, ఈగ్రీవ యుపయోగింపడును.

తా. హస్తప్రాణములు పండ్రెండు, వానిలక్షణము చెప్పఁబడుచున్నది.

తా. ప్రసారణము, కుంచితము, రేచితము, పుంఖితము, అపవేష్టిత

కము, ప్రేరితము, ఉద్వేష్టితము, వ్యావృత్తము, పరివృత్తము, సంకేతము, చిహ్నము, పదార్ధటీక అని హస్తజప్రాణములు పండ్రెండు.

ప్రసారణము:-

తా. వ్రేళ్ళనుజూఁచుట ప్రసారణ మనఁబడును.

కుంచితము:-

తా. వ్రేళ్ళనుముడుచుట కుంచిత మనఁబడును.

రేచితము:-

తా. వ్రేళ్ళనుగదలించుట రేచితమనఁబడును.

తా. పతాకాదిహస్తములందు వ్రేళ్ళు ముందరికివంచుట, కదలించుట, చాఁచుట అను నిట్టిది పుంఖిత మనఁబడును.

ప్రేరితము:

తా. వ్రేళ్ళను వెనుకప్రక్కకు ముడిగించుట, కదలించుట, చాఁచుటయను హస్తప్రాణము ప్రేరిత మనఁబడును.

ఉద్వేష్టితము:-

తా. నాట్యకర్మమునందు చేతులను మీఁదికెత్తుట యనెడి హస్తప్రాణము ఉద్వేష్టిత మనఁబడును.

వ్యావృత్తము:-

తా. పార్శ్వభాగములందు మీఁదికెత్తఁబడిన చేతులుగల హస్తప్రణము వ్యావృత్త మనఁబడును.

పరివృత్తము:-

తా. నాట్యముచేయునపుడు పార్శ్వములనుండి ముందరితట్టునకు చేతులను తెచ్చుట అనుహస్తప్రాణము పరివృత్త మనఁబడును.

సజ్కేతము:-

తా. స్థూలోక్తి పరంపరలేక ఊహచేత తెలిసికోఁదగిన సైగగల హస్తప్రాణము సంకేత మనఁబడును. చిహ్నము :-

తా. నాట్యకర్మమునందు ప్రత్యక్షపరోక్షవస్తువులయొక్క స్థావర జంగమత్వములను దెలుపు చిహ్నములు ఎనిమిది. అవి వానియాకారములను జూపుట, వానిముఖములను జూపుట, అవియుండుతావులను జూపుట, వానిటెక్కెములను చూపుట, వాని యాయుధములను దెలుపుట, వానియందుగల ప్రయోజములను దెలుపుట, వానిచే వ్యాపింపఁజేయఁబడిన వానిని దెలుపుట, వానిచేష్టలను దెలుపుట, ఈ యెనిమిదిలక్షణములుగల హస్తప్రాణము చిహ్నము అనఁబడును.

పదార్ధటీక:-

తా. చెప్పఁబడుచుండెడు భావవ్యంజకములైన పదములయర్ధములను నిశ్చయపరచునట్టి హస్తప్రాణము పదార్ధటీక అనఁబడును. తా. ఇఁక హస్తములయొక్క లక్షణములు చెప్పఁబడును. హస్తములు అసంయుతములు సంయుతములు నని రెండువిధములుగలవి.


తా. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, శుకతుండము, ముష్టి, శిఖరము, కపిత్ధము, కటకాముఖము, సూచి, చంద్రకల, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, సోలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్యము, హంసపక్షము, సందంశము, ముకుళము, తామ్రచూడము, త్రిశూలము అను ఇరువదియెనిమిదియు అసంయుత హస్తములనఁబడును.

తా. అన్నివ్రేళ్లనుచేర్చి చాఁచి బొటనవ్రేలినివంచిపట్టునది పతాక హస్తమని నృత్యశాస్త్రవిశారదులు చెప్పుదురు.

వినియోగము: