అభినయ దర్పణము/
1. పతాకహస్తలక్షణమ్
అఙ్గుళ్యః కుఞ్చతాఙ్గుష్ఠా | 207 |
| సపతాకకరః ప్రోక్తో | |
తా. అన్ని వ్రేళ్లను చేర్చి చాఁచి బొటనవ్రేలిని వంచిపట్టునది పతాకహస్తమని నృత్యశాస్త్రవిశారదులు చెప్పుదురు.
వినియోగము—
| నాట్యారమ్భే వారివా హే వనే వస్తునిషేధనే. | 208 |
| కుచస్థలే నిశాయాంచ నద్యామమరమణ్డలే, | 209 |
| ప్రతాపేచ ప్రసాదేచ చంద్రికాయాం ఘనాతపే, | 210 |
| వీథీప్రవేశభావే౽పి సమత్వేచా౽ఙ్గరాగకే, | 211 |
| ఆశీర్వాదక్రియాయాం చ నృపశ్రేష్ఠస్య భావనే, | 212 |
| తత్రతత్రేతి వచనే సింధౌతు సుకృతిక్రమే, | 213 |
| మానే సంవత్సరే వర్షే దినే సమ్మార్జనే తథా, | 214 |
తా. నాట్యారంభము, మేఘము, వనము, వస్తువులను నిషేధించుట, కుచస్థలము, రాత్రి, నది, దేవసమూహము, ఆశ్వము, ఖండించుట, వాయువు, శయనము, గమనము, ప్రతాపము, ప్రసాదము, చంద్రిక, మిక్కిలియెండ, తలుపుతట్టుట, ఏడువిభక్తులు, అల, వీథిలో ప్రవేశించుట, సమముగా నుండుట, గందము పూయుట, తాననుట, పంతము, ఊరకుండుట, ఆశీర్వదించుట, గొప్పరాజును జూపించుట, తాటాకు, చెంపపెట్టు, పదార్థమును స్పృశించుట, అక్కడనే యక్కడనే యనుట, సముద్రము, సుకృతిక్రమము, సంబోధనము, ముందుగాఁ బోవువాఁడనుట, కత్తియాకృతిని జూపుట, మాసము, సంవత్సరము, వర్షము, దినము, సమ్మార్జనము, (అనఁగా తుడుచుట) ఈఅర్థములయందు ఈహస్తము వినియోగపడును.
గ్రన్థాంతరస్థపతాకలక్షణమ్
| సంలగ్నః తర్జనీమూలే యత్రా౽ఙ్గుష్ఠో నికుఞ్చితః, | 215 |
| ఏకాకినాపురాధాత్రా పరబ్రహ్మ సమాగమే, | 216 |
| యతో భేజే తతో లోకే పతాక ఇతి విశ్రుతః, | 217 |
| పతాకో బ్రహ్మణోజాతః శ్వేతవర్ణో ఋషిశ్శివః, | 218 |
తా. తర్జనీమూలమందుఁ జేర్చి వంచఁబడిన బొటనవేలును, చాఁచఁబడిన అరచేయియు, వేళ్లునుగలది పతాకహస్త మనఁబడును. ముందు బ్రహ్మ యొంటరిగా పరబ్రహ్మను చేరఁబోయినప్పుడు పతాకాకృతిగా చేయి చాఁచి ‘జయవిజయీభవ’యని స్తోత్రము చేసెను. ఆకారణముచేత అట్లు పట్టఁబడిన చేయి నాఁటినుండి లోకమునందు పతాకమని ప్రసిద్ధినొందెను. కనుక ఇది యెల్లహస్తములకును మొదటిదాయెను. ఈపతాకహస్తము బ్రహ్మవలనఁ బుట్టినది. దీనిజాతి బ్రాహ్మణజాతి. వర్ణము తెలుపు. ఋషి శివుఁడు. అధిదేవత బ్రహ్మము.
వినియోగము:—
| జయేతి వచనే మేఘే నిషేధే విపినే నిశి, | 219 |
| పురఃపుణ్యేచా౽తిశయే ప్రవాహే విబుధాలయే, | 220 |
| అర్గళాపుటనేకుడ్యే ఖణ్డనే పరితోషణే, | 221 |
| సమూహే సైన్య సన్నాహే సమయే భయవారణే, | 222 |
| జ్వాలాసు వర్షధారాసు తరఙ్గే పక్షిపక్షకే, | 223 |
| చపేటే వస్తు సంస్పర్శే సరస్యామఙ్గమర్దనే, | 224 |
| పార్శ్వాశ్లేషేపతాకాయాం ప్రవాతే వసనాఞ్చలే, | 225 |
| అయనే వాసరే పక్షే మానే స్వచ్ఛే మహాకులే, | 226 |
| బ్రహ్మజాతౌ శుభ్రవర్ణే పతాకో౽యం నియుజ్యతే, | |
తా. జయజయయనుట, మేఘము,నిషేణము, అడవి, రాత్రి, పొమ్మనుట, నడచుట, గుఱ్ఱము, గాలి, రొమ్ము, ఎదురు, పుణ్యము, అతిశయము, .ప్రవాహము, దేవలోకము, హాహాకారము, వెన్నెల, ఎండ, దేవతాసమూహము, గడియ తీయుట, గోడ, నరకుట, సంతోషము, చెక్కిలి, గంధము పూయుట, కత్తి, నీటికి కట్టవేయుట, గుంపు, దండుయొక్క ఆయత్తము, సమయము, వెరపుతీర్చుట, ఆశ్రయములేమి, క్షయము, కప్పుట, పానుపు, భూమి, నిప్పుకుంట, వానధార, అల, పక్షిరెక్క, ప్రభువుతో మనవి చేయుట, ఇక్కడననుట, ఎట్టిది అట్టిది యనుట, చెంపపెట్టు, వస్తువులను అంటుట, కొలను, ఒడలు పిసుకుట, వ్యాజస్తుతి, ప్రతాపము, దేవతానివేదనము, ప్రక్కకౌఁగిలింత, టెక్కెము, పెద్దగాలి, కొంగు, చలి, ఉక్క, తళతళ, నీడ, సంవత్సరము, ఋతువు, అయనము, దినము, పక్షము, మాసము, తేట, గొప్పవంశము, సమీపించుట, పాలింపుము లాలింపుము అనుట, బ్రాహ్మణజాతి, శుభ్రవర్ణము వీనియందు ఈ హస్తము వినియోగించును.
2. త్రిపతాకహస్తలక్షణమ్
సఏవ త్రిపతాకస్స్యా | |
తా. ముందు చెప్పిన పతాకహస్తమందలి యనామిక (అనఁగా చిటికినవ్రేలికి ముందువ్రేలు) వంచఁబడెనేని యది త్రిపతాకహస్త మగును.
వినియోగము:—
| మకుటే వృక్షభావేచ వజ్రేతద్ధరవాసవే. | 227 |
| కేతకీ కుసుమే దీపే వహ్నిజ్వాలా విజృమ్భణే, | |
| కపోలేపత్రలేఖాయాం బాణార్థే పరివర్తనే. | 228 |
| స్త్రీపుంసయోస్సమాయోగే యుజ్యతే త్రిపతాకకః, | |
తా. కిరీటము, వృక్షము, వజ్రాయుధము, ఇంద్రుఁడు, మొగలిపువ్వు, దీపము, అగ్నిజ్వాల పైకిలేచుట, చెక్కిలి, మకరికాపత్రరేఖ, బాణము, మార్పు, స్త్రీపురుషులచేరిక వీనియందు ఈ హస్తము వినియోగించును.
గ్రంథాంతరే త్రిపతాకహస్తలక్షణమ్
| పతాకే౽నామికావక్రాత్రిపతాకకరోభవేత్. | 229 |
| శక్రేణా౽౽దౌ యతోవజ్రం పస్పర్శే౽నామికాంవినా, | 230 |
| వాసవాత్త్రిపతాకో౽యం జజ్ఞే తస్య ఋషిర్గుహః, | 231 |
తా. క్రింద చెప్పఁబడిన పతాకహస్తమందు అనామిక (ఉంగరపువ్రేలు) వంచఁబడెనేని యది త్రిపతాకహస్త మగును. ఆదికాలమందు దేవేంద్రుఁడు వజ్రాయుధము నెత్తుకొనునపుడు అనామికను వదలి పతాకముయొక్క మూఁడుభాగములచేత గ్రహించుటచే నేర్పడినది కనుక ఇది త్రిపతాకము అనఁబడెను. ఇది ఇంద్రునివలన పుట్టినది, ఎఱ్ఱవన్నె గలది, క్షత్త్రియజాతి, దీనికి ఋషి గుహుఁడు, అధిదేవత శివుఁడు.
వినియోగము:—
| ఆవాహనే౽వతరణే వదనోన్నమనే నతౌ, | 232 |
| సన్దేహే మకుటే వృక్షే వాసవే కులిశాయుధే, | |
| అలకాపనయేదీపే తిలకోష్ఠీషధారణే. | 233 |
| కటుగన్ధరవాలాపైః నాసాకర్ణస్యసంవృతౌ, | 234 |
| పాతేఖగవిశేషాణాం కీలికీలా విజృమ్భణే, | 235 |
తా. ఆవాహనము, దిగుట, మొగమెత్తుట, వంచుట, మంగళవస్తువులనుముట్టుట, గురుతిడుట, నమ్మకములేమి, దుర్జనుఁడు, సందేహము, కిరీటము, వృక్షము, ఇంద్రుఁడు, వజ్రాయుధము, ముంగురుల నెగదువ్వుట, దీపము, బొట్టు పెట్టుకొనుట, పాగా పెట్టుకొనుట, కారైనవాసనవలనను కఠోరశబ్దమువలనను ముక్కుచెవులను మూసికొనుట, గుఱ్ఱమును తోముట, బాణము, మొగలిపువ్వు, మకరికాపత్రములను వ్రాయుట, కొన్నిపక్షులయొక్క పాటు, నిప్పుమంటలు లేచుట, క్షత్త్రియజాతి, ఎరుపువన్నె వీనియందు ఈహస్తము వినియోగించును.
3. అర్ధపతాకహస్తలక్షణమ్
త్రిపతా కేక నిష్ఠాచే | |
తా. త్రిపతాకహస్తమందు చిటికెనవ్రేలు వంపఁబడునేని యది అర్ధపతాకహస్త మనఁబడును.
వినియోగము:—
| పల్లవేఫలకేతీరే౽ప్యుభయో రితి వాచకే. | 236 |
| క్రకచేచ్ఛురికాయాంచ ధ్వజే గోపురశృఙ్గయోః, | |
| యుజ్యతే౽ర్ధపతాకో౽యం తత్తత్కర్మప్రయోగతః. | 237 |
తా. చిగురు, పలక, గట్టు, ఇద్దరని చెప్పుట, నూరుకత్తి, రంపము, ధ్వజము, గోపురము, కొమ్మ వీనియందు ఈ హస్తము వినియోగించును.
4. కర్తరీముఖహస్తలక్షణమ్
అస్యైవచా౽పి హస్తస్య | 238 |
తా. అర్ధపతాకహస్తమందలి చిటికెనవ్రేలును చూపుడువ్రేలును బైటికి చాఁపఁబడునేని కర్తరీముఖహస్త మగును.
వినియోగము:—
| శ్రీపుంసయోస్తు విశ్లేషే వివర్యాసపదే౽పి చ, | 239 |
| విద్యుదర్థేప్యేకశయ్యా విరహే పతనే తథా, | 240 |
తా. స్త్రీ పురుషులయెడబాటు, వ్యత్యస్తస్థానము, దొంగిలించుట, కడకన్ను, చావు, భేదించుట, మెరపు, ఏకశయ్యావిరహము, క్రిందపడుట, వీనియందు ఈహస్తము వినియోగించును.
గ్రన్థాన్తరే
| త్రిపతాకే బహిర్యాతా తర్జనీ యదికర్తరీ, | |
| శశాఙ్కశేఖరః పూర్వం జటాధర వధమ్ప్రతి. | 241 |
| చక్రం లిలేఖ తర్జన్యా నిక్షిప్య భువి మధ్యమామ్, | 242 |
| కర్తరిశ్శంకరాజ్జాతః ఋషిః పర్జన్యదేవతా, | 243 |
తా. త్రిపతాకహస్తమందు తర్జని బయటకు చాచఁబడెనేని కర్తరీహస్త మగును. పూర్వకాలమునందు శివుఁడు జటాధరాసురసంహారముకొఱకు భూమిలోమధ్యమనుంచి తర్జనిచే చక్రమును వ్రాసెను. అది మొదలుకొని కర్తరి గలిగెనని ఋషులు చెప్పుచున్నారు. కర్తరిహస్తము శివునివలనఁ బుట్టినది. ఇది క్షత్త్రియజాతి. ఋషి పర్జన్యుఁడు. రక్తవర్ణము. అధిదేవత చక్రపాణి.
వినియోగము:—
| పాదాలక్తకనిర్మాణే పతనేలేఖ్యవాచకే, | 244 |
| చపలాయా మేకశయ్యా వియోగే మహిషేమృగే, | 245 |
| కేశపాశస్య శోధిన్యాం క్షత్త్రియే తామ్రపర్ణకే, | 246 |
5. మయూరహస్తలక్షణమ్
అస్మిన్ననామికా౽౦గుష్ఠే | 247 |
తా. కర్తరీముఖహస్తమందు అనామికను అంగుష్ఠతోఁజేర్చి తక్కినవ్రేళ్లను చాఁచిపట్టినయెడ మయూరహస్త మగును.
వినియోగము:—
| మయూరాస్యే లతాయాంచ శకునే వమనేతథా, | 248 |
| నేత్రస్యోదకవిక్షేపే శాస్త్రవాదే ప్రసిద్ధకే, | 249 |
తా. నెమిలిముఖము, తీఁగె, పక్షి, క్రక్కుట, ముంగురులు దిద్దుట, నొసలు, తిలకము, కన్నీరు ఎగజిమ్ముట, శాస్త్రమును వ్యవహరించుట, ప్రసిద్ధి వీనియందు ఈహస్తము వినియోగించును.
6. అర్ధచంద్రహస్తలక్షణమ్
అర్ధచన్ద్ర కరస్సో౽యం | |
వినియోగము:—
| చన్ద్రే కృష్ణాష్టమీభాజి గళహస్తాదికే౽పిచ. | 250 |
| భల్లాయుధే దేవతానా మభిషేచన కర్మణి, | 251 |
| ధ్యానేచ ప్రార్థనేచా౽పి అఙ్గసంస్పర్శనే తథా, | 252 |
తా. కృష్ణాష్టమీచంద్రుఁడు, మెడపట్టి గెంటుట, భల్లాయుధము, దేవాభిషేకము, కంచము, పుట్టుక, మొల, చింత, తన్ను దాను చెప్పుకొనుట, ధ్యానము, ప్రార్థించుట, అవయవములను అంటుట, సలాము చేయుట వీనియందు ఈహస్తము వినియోగించును.
గ్రంథాన్తరస్థార్థచంద్రహస్తలక్షణమ్
| పతాకే విరళాంగుష్ఠే సో౽ర్ధచంద్రకరోభవేత్, | 253 |
| జాతశ్చంద్రాదర్ధచన్ద్రో ఋషిరస్యా౽త్రిరుచ్యతే, | 254 |
తా. పతాకహస్తము చాఁచఁబడిన బొటనవ్రేలు గలదగునేని అర్థచంద్రహస్త మగును. ఇది అవిసెమొగ్గవలె నుండును. ఇది భూషణేచ్ఛగల శివునినిమిత్తమై చంద్రునినుండి పుట్టినది. ఇది వైశ్యజాతి, దీనికి ఋషి అత్రి, వర్ణము గౌరము, అధిదేవత మహాదేవుఁడు.
వినియోగము:—
| వలయే మణిబంధేచ దర్పణస్య నిరూపణే, | 255 |
| తాళమానే మౌళిబంధనిర్మాణే బాలపాదపే, | 256 |
| యువార్థే చ సమర్థే చ శశాజ్కేప్రాకృతానతౌ, | 257 |
| కటిపట్టదృఢీకారే కలశారచనే౽ఙ్గకే, | 258 |
| గౌరవర్ణే వైశ్యజాతా వర్ధచంద్రో నియుజ్యతే, | |
తా. ముంజేతికడియము, మనికట్టు, అద్దమును జూచుట, ఆశ్చర్యము, ప్రయాసము, మేరలేమి, సకలము, తాళమానము, సిగముడి వేయుట, లేఁత చెట్టు, దుఃఖమువలన చెక్కిట చెయి చేర్చుట, ఏనుఁగు చెవులను చూపుట, తప్పు చేసినవారిని వెడలఁగొట్టుట, నొసటిచెమట తుడుచుట, యౌవనవంతుఁడు, సమర్థుఁడు, చంద్రుఁడు, ప్రాకృతులకు నమస్కరించుట, అభిషేకము, కనుబొమ్మ, వస్త్రము, ధనుస్సు, మిక్కిలి యనుట, నడుముకట్టు బిగించుట, కుండలు చేయుట, అంగము కాళ్ల ను చూపుట, బిడ్డ నెత్తుకొనుట, వీఁపు, తెలుపు, వైశ్యజాతి వీనియందు ఈహస్తము వినియోగపడును.
7. అరాళహస్తలక్షణమ్
పతాకే తర్జనీ వక్రా | 259 |
వినియోగము:—
| విషామృతాదిపానేషు ప్రచండ పవనే౽పిచ, | 260 |
తా. విషము అమృతము మొదలగువానిని త్రాగుటయందును, ప్రచండమయిన గాలియందును ఈ హస్తము ఉపయోగింపఁబడును.
గ్రన్థాంతరస్థారాళహస్తలక్షణమ్
| పతాకాఙ్గుష్ఠతర్జన్యౌ వక్రితౌస్యాదరాళకః, | 261 |
| అరాళః కుమ్భజాజ్జాతః సఏవ ఋషిరుచ్యతే, | 262 |
| ఏవమేతస్యా౽నుపూర్వీం వదంతిభరతాదయః, | |
తా. పతాకహస్తమున అంగుష్ఠతర్జనులు వంచఁబడినయెడ అరాళహస్త మగును. ఇది పూర్వకాలమునందు అగస్త్యమహామునివలన సప్తసముద్రములను ఆపోశనము చేయునపుడు పుట్టెను. ఇది మిశ్రజాతి. దీనికి అగస్త్యుఁడు ఋషి. పాటలవర్ణము. వాసుదేవుఁడు అధిదేవత. దీని అనుపూర్వి ఇటువంటిదని భరతాదులు చెప్పిరి.
వినియోగము:—
| ఆపోశనే బ్రాహణానామాశీర్వచనకర్మణి. | 263 |
| విటానాం ప్రియవై ముఖ్యే కేశానాంచ విశీర్ణకే, | 264 |
| లలాటస్వేదహరణే కజ్జలాలేపనే దృశోః, | 265 |
తా. బ్రాహ్మణులయొక్క ఆపోశనము, ఆశీర్వాదము చేయుట, విటుల ప్రియవైముఖ్యము, వెండ్రుకలు చిక్కుదీయుట, వేగము రమ్మనుట, సంధ్యాకర్మమునందలి ప్రదక్షిణము, నొసటిచెమ్మట తుడుచుట, కన్నులకు కాటుక పెట్టుట మొదలగువానియందు ఈ హస్తము చెల్లును.
8. శుకతుణ్ణహస్తలక్షణమ్
అస్మిన్ననామికావక్రా | |
తా. ముందు చెప్పిన అరాళహస్తమందు అనామిక వంచఁబడెనేని శుకతుణ్డహస్త మగును.
వినియోగము:—
| బాణప్రయోగే కుంతార్థేమర్మోక్తావుగ్రభావనే. | 266 |
| శుకతుండకరోజ్ఞేయో భరతాగమవేదిభిః, | |
తా. బాణ ప్రయోగము, ఈటె, మర్మమైన మాట, తీక్ష్ణభావము వీనియం దీహస్త ముపయోగింపఁబడును.
గ్రథాన్తరస్థశుకతుణ్డహస్తలక్షణమ్
| వక్రేపతాకతర్జన్యనామికౌ శుకతుండకః. | 267 |
| నటయిత్వాప్రేమకోపంనాథమ్ప్రతిసదాశివమ్, | 268 |
| ద్విజాన్వయశ్శోణవర్ణో దేవతా౽స్య మరీచికః, | |
తా. పతాకహస్తమందు తర్జన్యనామికలు వంచఁబడెనేని శుకతుండహస్త మగును. ఇది సదాశివునిపై పార్వతీదేవికి ప్రణయకలహము గలిగినప్పుడు పార్వతీదేవియందు పుట్టెను. ఇది బ్రాహ్మణజాతి. ఋషి దుర్వాసుఁడు. రక్తవర్ణము. మరీచి అధిదేవత.
వినియోగము:—
| బ్రహ్మాస్త్రేస్యాన్ముఖాగ్రేచ కౌటిల్యే పరివర్తనే. | 269 |
| భిణ్డిపాలేచ భావ్యర్థే క్రమణే కలహే౽పిచ, | 270 |
| ద్యూతాక్ష పాతే కున్తార్థే శుకశారినిరూపణే, | 271 |
| శుకతుండకరోభావనేతృభిః పరికీర్తితః, | |
తా. బ్రహ్మాస్త్రము, మొగముతుద (ముక్కు), వంకర, మార్పు, భిండిపాలమను ఆయుధము, నడవఁబోవువిషయము, దాఁటుట, కలహము, ప్రీతిలేమి, ప్రణయకలహము, అభిప్రాయము, విడుపు, జూదపుపాచికలు వేయుట, ఈటె, చిలుకగోరువంకలను జూపుట, ఉగ్రభావము, మర్మోక్తి, తామ్రవర్ణము వీనియందు బ్రాహ్మణజాతిదైన ఈహస్తము చెల్లును.
9. ముష్టిహస్తలక్షణమ్
మేళనాదఙ్గుళీనాఞ్చ | 272 |
| అఙ్గుష్ఠేనోపరియుతో | |
తా. నాలుగు వ్రేళ్లను జేర్చి యరచేతిలోనికి వంచి యంగుష్ఠమును మీఁదఁ జేర్చునెడ ముష్టిహస్త మగును.
వినియోగము:—
| స్థిరేకచక్రహేదార్థ్యేవస్త్వాదీనాంచ ధారణే. | 273 |
| మల్లానాంయుద్ధభావేచ ముష్టిహస్తో౽యముచ్యతే, | |
తా. స్థిరమనుట, సిగబట్టుట, దృఢత్వము, పదార్థములఁ బట్టుకొనుట, జెట్టీలజగడము వీనియందు ఈముష్టిహస్తము వినియోగింపఁబడును.
గ్రంథాంతరస్థముష్టిహస్తలక్షణమ్
| మధ్యోపరికృతాంగుష్ఠో ముష్టిర్ముష్ట్యాకృతిఃకరః. | 274 |
| మధుకైటభయోర్యుద్ధేజాతోవిష్ణోరయంకరః, | 275 |
తా. నడిమివ్రేలిమీఁద అంగుష్ఠమును మడిచి పిడికిలి పట్టఁబడెనేని యది ముష్టిహస్త మగును. అది విష్ణువు మధుకైటభులతో యుద్ధము చేయుకాలమందు విష్ణువువలన పుట్టెను. ఇది శూద్రజాతి. దీనికి ఋషి అమరేంద్రుఁడు. వర్ణము నీలము. చంద్రుఁడు అధిదేవత.
| ఆలమ్బనేమధ్యభావే ఫలే సఙ్కేతభావనే, | 276 |
| ఊరుసంవహనే ఘంటాగ్రహణే౽తి ప్రధావనే, | 277 |
| కచాకర్షే ముష్టిఘాతే గదాకున్తాదిధారణే, | 278 |
తా. పట్టు, నడుము, ప్రయోజనము, సంకేతము, క్షేమము, బలి యిచ్చుట, ప్రాకృతజనుల నమస్కారము, గట్టిపట్టు, గంటను పట్టుట, వడిగా పరుగెత్తుట, తేలిక, జెట్టిపోట్లాట, కేడెము మొదలయినవానిని పట్టుట, నిలుకడ, తలవెండ్రుకలు పట్టుట, పిడికిటిపోటు, గద యీటె మొదలయిన ఆయుధములను పట్టుట, నీలవర్ణము, శూద్రజాతి వీనియందు ఈహస్తము వినియోగింపఁబడును.
10. శిఖరహస్తలక్షణమ్
చేన్ముష్టిరున్నతాంగుష్ఠ | |
తా. ముందు చెప్పిన ముష్టిహస్తమందు అంగుష్ఠమును పొడవుగా నెత్తినయెడ శిఖరహస్త మగును.
వినియోగము:—
| మదనే కార్ముకే స్తమ్భే నిశ్శబ్దే పితృతర్పణే. | 279 |
| ఓష్ఠే నాథేచ రదనే ప్రవిష్టే ప్రశ్నభావనే, | 280 |
| కటిబంధాకర్షణే చ పరిరమ్భవిధౌధవే, | 281 |
| శిఖరోయుజ్యతేసో౽యం భరతాగమవేదిభిః, | |
తా. మన్మథుఁడు, ధనుస్సు, స్తంభము, శబ్దములేమి, పితృతర్పణము, పెదవి, పెనిమిటి, దంతము, ప్రవేశించుట, ప్రశ్న చేయుట, అవయవము, లేదనుట, తలఁచుట, ఇతరాభినయము, నడుముకట్టు నీడ్చుట, కౌఁగిలింత, ప్రియుఁడు, శక్త్యాయుధ తోమరాయుధములను ప్రయోగించుట, ఘంటానాదము, పేషణము వీనియందు ఈ హస్తము ఉపయోగింపఁబడును.
గ్రంథాంతరస్థశిఖరహస్తలక్షణమ్
| ముష్టిరూర్ధ్వాకృతాంగుష్ఠః సఏవ శిఖరః కరః. | 282 |
| సుమేరుం కార్ముకీకృత్య తన్మధ్యే చంద్రశేఖరః, | 283 |
| శిఖరో మేరుధనుషో జాతస్తస్య ఋషిర్జినః, | 284 |
తా. ముష్టిహస్తము పైకెత్తఁబడిన బొటనవ్రేలు గలదయ్యెనేని శిఖరహస్త మగును. ఇది పూర్వకాలమందు శివుఁడు త్రిపురాసురులతో యుద్ధము చేయుటకు మేరుపర్వతమును విల్లుగా చేసి దాని నడిమిభాగమును పట్టునపుడు శివునివలనఁ బుట్టెను. ఇది గంధర్వజాతి. దీనికి ఋషి జినుఁడు. వన్నె చామన. అధిదేవత మన్మథుఁడు.
| పితౄణాం తర్పణేస్థైర్యే కుటుమ్బస్థాపనే౽పిచ, | 285 |
| వ్యజనేతాలవృంతస్య భేదే కిమితి భాషణే, | 286 |
| శక్తితోమరయోర్మోక్షే ఫలాంశక పరిగ్రహే, | 287 |
| పురుషే నిశ్చయే స్తమ్భే ఘంటానాదేచ నర్తనే, | 288 |
| మహిషాసురమర్దన్యాం వీరాంశే హయవల్గనే, | 289 |
| ఇంద్రనీలే గాఢభావే శిఖరస్సత్ప్రయుజ్యతే, | |
తా. పితృతర్పణము, కుటుంబమును నిలుపుట, నాయకుఁడు, శిఖరము, స్నేహితుఁడు, అడ్డముగఁ బట్టినయెడ పండ్లు తోముకొనుట, వింజామరము, విసనకఱ్ఱ, ఏమని యడుగుట, గిండిచెంబు, నీళ్లు త్రాగుట, నాలుగని లెక్కపెట్టుట, శక్తి అను ఆయుధమును వైచుట, ఈటెను విసురుట, ఫలాంశమును గ్రహించుట, ఆఁడువారియడఁకువ, సిగ్గు, విల్లు, మన్మథుఁడు, మగఁడు, నిశ్చయము, స్తంభము, గంటవాయించుట, బోగమాట, లేడనుట, ఈవి, నిలుకడ గలిగియుండుట, పిళ్ళారి, మహిషాసురమర్దని, వీరుఁడు, గుఱ్ఱమును దాఁటించుట, అర్ధచంద్రతిలకము మొదలగునవి, కొప్పుగురుతును పూనుట, ఇంద్రనీలము, దృఢత్వము వీనియందు ఈ హస్తము ఉపయోగింపఁబడును.
11. కపిత్థహస్తలక్షణమ్
అంగుష్ఠమూర్ధ్ని శిఖ రే | 290 |
| కపిత్థాఖ్యకరస్సో౽యం | |
తా. ముందు చెప్పిన శిఖరహస్తము అంగుష్ఠముపై చూపుడువ్రేలు వంచఁబడెనేని కపిత్థహస్త మగును.
వినియోగము:—
| లక్ష్మ్యాంచైవ సరస్వత్యాం వేష్టనే తాళధారణే. | 291 |
| గోదోహనేచా౽౦జనేచ లీలాత్త సుమధారణే, | |
| చేలాఞ్చలాది గ్రహణే పటస్యైవా ౽వకుణ్ఠనే. | 292 |
| ధూపదీపార్చనేచాపి కపిత్థ స్సంప్రయుజ్యతే, | |
తా. లక్ష్మీదేవి, సరస్వతి, చుట్టుట, తాళమును పట్టుట, పాలు పిదుకుట, కాటుక పెట్టుకొనుట, వినోదముగా పూలచెండ్లు ధరించుట, కొంగు మొదలగువానిని పట్టుకొనుట, గుడ్డ ముసుఁగు వేసికొనుట, ధూపదీపార్చనము వీనియందు ఈ హస్తము వినియోగింపఁబడును.
గ్రంథాంతరస్థకపిద్ధహస్తలక్షణమ్
| శిఖరాంగుష్ఠ తర్జన్యౌ లగ్నౌచే త్సకపిత్థకః. | 293 |
| సముద్రమథనేపూర్వం మందరాకర్షణోచితః, | 294 |
| ఋషిజాతి గౌరవర్ణః పద్మగర్భో౽ధిదేవతా, | |
తా. శిఖరహస్తమునందలి బొటనవ్రేలును చూపుడువ్రేలును చేర్పఁబడునెడ కపిత్థహస్త మగును. పూర్వకాలమునందు సముద్రమును చిలుకుటకు అనుకూలముగా మందరపర్వతమును పట్టునపుడు ఈకపిత్థహస్తము విష్ణువువలనఁబుట్టెను. ఇది ఋషిజాతి. దీనికి ఋషి నారదుఁడు. వర్ణము తెలుపు. అధిదేవత పద్మగర్భుఁడు.
వినియోగము:—
| మంథానాకర్షణేలక్ష్మ్యాం ధూపదీపనివేదనే. | 295 |
| వరాటకానాం విక్షేపే వహనే౽ఙ్కుశవజ్రయోః, | 296 |
| లీలాబ్జధారణేవాణ్యాం జపదామ నిరూపణే, | |
| పేషణే యావకా దీనాం చేలాఞ్చల సమాహృతౌ. | 297 |
| ఋషిజాతౌ గౌరవర్ణే కపిత్థో౽యం నియుజ్యతే, | |
తా. కవ్వమును బట్టి చిలుకుట, లక్ష్మి, ధూపదీపములను నివేదించుట, గవ్వలను ఎగఁజిమ్ముట, అంకుశవజ్రాయుధములను పట్టుట, ఒడిసెల త్రిప్పుట, తాళము పట్టుట, నాట్యమును జూపుట, వినోదముగా తామరపువ్వు చేతపట్టుకొనుట, సరస్వతిజపమాలికను ధరించుట, లత్తుక మొదలగువానిని మెదుపుట, కొంగును లాగుట, ఋషిజాతి, గౌరవర్ణము వీనియందు ఈహస్తము వినియోగించును.
12. కటకాముఖహస్తలక్షణమ్
కపిత్థ తర్జనీచోర్ధ్వం | 298 |
| కటకాముఖహస్తో౽యం | |
తా. ముందు చెప్పిన కపిత్థహ్తసమందు చూపుడువ్రేలు నడిమివ్రేలితోను బొటనవ్రేలితోను జేర్చి పట్టఁబడునేని కటకాముఖహస్త మగును.
వినియోగము:—
| కుసుమాపచయేముక్తాప్రజాందామ్నాంచధారణే. | 299 |
| శరమందాకర్షణేచ నాగవల్లీప్రదానకే, | 300 |
| వచనేదృష్టిభావేచ కటకాముఖఇష్యతే, | |
తా. పువ్వులుకోయుట, ముత్యాలదండ పూలదండలు ధరించుట, బాణ మెల్లగా ఆకర్షించుట, ఆకుమడుపు లిచ్చుట, కస్తూరి మొదలగు ద్రవ్యం కలుపుట, వాసన ద్రవ్యములు చేర్చుట, మాట, చూపు వీనియందు ఈహస్త ముపయోగింపఁబడును.
గ్రంథాంతరస్థ కటకాముఖలక్షణమ్
| ప్రత్యంగుష్ఠయుతఃక్షిప్తః కపిత్థః కటకాముఖః. | 301 |
| అభ్యస్యతోధనుర్విద్యాం గుహాదీశ్వరసన్నిధౌ, | 302 |
| దేవజాతి స్వర్ణవర్ణో రఘురామో౽స్య దేవతా, | |
తా. కపిత్థహస్తముయొక్క బొటనవ్రేలు ఎత్తి పట్టఁబడునేని కటకాముఖహస్త మగును. శివునియొద్ద కుమారస్వామి విలువిద్య నేర్చునపుడు ఈ ముఖహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఋషి భార్గవుఁడు. స్వర్ణవర్ణం. అధిదేవత రఘురాముఁడు.
వినియోగము:—
| ముక్తాస్రజాంపుష్పదామ్నాం చామరాణాంచ ధారణే. | 303 |
| ఆకర్షణే శరాదీనాం దర్పణాభిముఖగ్రహే, | 304 |
| కుసుమాపచయే నాగవల్లీదళపరిగ్రహే, | 305 |
| ధనురాకర్షణే చక్రధారణే వ్యజనగ్రహే, | 306 |
తా. ముత్యాలసరము, పూలదండ, వింజామరము వీనిని ధరించుట; బాణము మొదలైనవానిని ఆకర్షించుట, అద్దము నెదుటికి తెచ్చుట, కళ్లెము పట్టుట, తొడిమను త్రుంచుట, పండ్లు తోముట, పువ్వులు కోయుట, ఆకుమడు పు లిచ్చుట, కస్తూరి మొదలగువస్తువులను మెదుపుట, బోగమువారి కౌఁగిలింత, వింటీని తిగుచుట, చక్రాయుధమును ధరించుట, విసనకఱ్ఱపట్టుట, బంగారువన్నె, దేవజాతి వీనియందు ఈహస్తము వినియోగించును.
13. సూచీహస్తలక్షణమ్
ఊర్ధ్వం ప్రసారితా యత్ర | 307 |
తా. ముందు చెప్పిన కటకాముఖహస్తమునందలి చూపుడువ్రేలు పొడుగుగా చాఁచఁబడిన యెడ సూచీహస్త మగును.
వినియోగము:—
| ఏకార్థే౽పి పరబ్రహ్మ భావనాయాం శతే౽పిచ, | 308 |
| యచ్ఛబ్దే౽పిచ తచ్ఛబ్దే వ్యజనార్థే౽పితర్జనే, | 309 |
| ఛత్రే సమర్థేకోణేచ రోమాళ్యాంభేరిభేదనే, | 310 |
| వివేచనేదినాం తేచ సూచీహస్తః ప్రకీర్తితః, | |
తా. ఒకటి అనుట, పరబ్రహ్మనిరూపణము, నూరు అనుట, సూర్యుఁడు, నగరము, లోకము అనుట, అట్లు అనుట, ఎవఁడు ఎవతె ఏది యనుట, వాఁడు ఆమె అది యనుట, విసనకఱ్ఱ, వెరపించుట, కృశించుట, సలాక, దేహము, ఆశ్చర్యపడుట, జడచూపుట, గొడుగు, నేర్పరితనము, మూల అనుట, నూగారు, భేరి వాయించుట, కుమ్మరవాని చక్రము తిరుగుట, బండిచక్రము, సమూహము, వివరించుట, సాయంకాలము వీనియందు ఈ హస్తము వినియోగించును.
గ్రన్థాన్తరస్థసూచీముఖహస్తలక్షణమ్
| సూచీముఖో భవేదూర్ధ్వం కటకాముఖతర్జనీ. | 311 |
| అహమేక ఇతి బ్రహ్మా నిర్దేశమకరోద్యతః, | 312 |
| దేవజాతి శ్శ్వేతవర్ణా విశ్వకర్మా౽ధిదేవతా, | |
తా. కటకాముఖహస్తముయొక్క చూపుడువ్రేలు పైకెత్తఁబడెనేని సూచీముఖహస్త మగును. పూర్వకాలమునందు బ్రహ్మ నేనొకఁడనే యని నిర్దేశించునపుడు ఆ బ్రహ్మవలన ఈ సూచీహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఋషి సూర్యుఁడు, వర్ణము శ్వేతము. అధిదేవత విశ్వకర్మ.
వినియోగము:—
| శ్లాఘాయాం సత్యవచనే దూరదేశనిరూపణే. | 313 |
| ప్రాణార్థే చ పురోగే౽పి ఏకసఙ్ఖ్యానిరూపణే, | 314 |
| తథేతి వచనే లోకే పరబ్రహ్మనిరూపణే, | 315 |
| ఉదయాస్తమయేబాణే గూఢనాయక దర్శనే, | 316 |
| తర్జనే నీచసంబుద్ధౌ శ్రవణే విరహేస్మృతౌ, | 317 |
తా. శ్లాఘించుట, నిజము, దూరమును జూపుట, ప్రాణమనుట, ముందుగఁబోవువానిఁ జూపుట, ఒకటి అనుట, సంధ్యాకాలము, ఏకాంతప్రదేశము, తూడు, బాగనుట, చూపు, అట్లే యనుట, లోకము, పరబ్రహ్మనిరూపణము, ఒకటే యనునర్థము, సలాక, చక్రమును త్రిప్పుట, సూర్యుఁడు, ఉదయాస్తసమయములు, ఋణము, రహస్యముగ నాయకుని జూపుట, అలుగు గలబాణము, ఏది అది అనుట, ఇనుము, కమ్మి, జెదరించుట, నీచుని పిలుచుట, వినుట, విరహము, తలఁచుట, ముక్కు, పక్షిముక్కు, తెలుపు, చూచుట వీనియందు ఈహస్తము వినియోగపడును.
14. చన్ద్రకలాహస్తలక్షణమ్
వినియోగము:—
సూచ్యామఙ్గుష్ఠమోక్షేతు | 318 |
15. పద్మకోశహస్తలక్షణమ్
అఙ్గుళ్యో విరళాః కిఞ్చిత్ | 319 |
తా. అయిదువ్రేళ్లను ఎడముగా చాఁచి కొంచెము వంచి అరచేయి పల్లమగునట్టు పట్టఁబడునెడ పద్మకోశహస్త మగును.
వినియోగము
| ఫలేబిల్వకపిత్థాదౌ స్త్రీణాంచ కుచకుమ్భయోః, | 320 |
| సహకారఫలే పుష్పవర్షేమంజరికాదిషు, | 321 |
| వల్మీకే కుముదే౽ప్యండే పద్మకోశో౽భిధీయతే, | |
తా. మారేడుపండు, వెలగపండు, స్తనములు, వట్రువ, చెండు, అల్పాహారము, పూమొగ్గ, మామిడిపండు, పూలవాన, పూగుత్తి మొదలగునది, మంకెనపువ్వు, ఖంటారూపమును జూపుట, పాములపుట్ట, నల్లకలువ, గుడ్లు వీనియందు ఈహస్తము ఉపయోగించును.
గ్రంథాంతరస్థపద్మకోశహస్తలక్షణమ్
| వరశ్వేతామ్బుజాకారః పద్మకోశో౽భిధీయతే. | 322 |
| చక్రార్థే పద్మనికరైశ్శమ్భుపూజాం వితన్వతః, | 323 |
| యక్షాన్వయః కిన్నరాంశో అధిదేవో౽స్య భార్గవః, | |
తా. శ్రేష్ఠమయిన తెల్లదామర యాకృతిగా పట్టఁబడునది పద్మకోశహస్త మనఁబడును. పూర్వకాలమునందు చక్రాయుధముకొఱకు పద్మములచేత శివపూజఁ జేయుచున్న విష్ణుదేవునివలన ఈపద్మకోశహస్తము గలిగెను. ఇది యక్షజాతి, కిన్నరాంశము. దీనికి పద్మధరుఁడు ఋషి. భార్గవుఁడు అధిదేవత.
వినియోగము:—
| శుండాయాం థాళథళ్యేచ హేమరౌ ప్యాదిభాజనే. | 324 |
| ధమ్మిల్లే చ మితార్థే చ లావణ్యే సాధువాదనే, | 325 |
| నారికేళే చూతఫలే కర్ణికారేచదర్పణే, | 326 |
| బిల్వేకపిత్థే యుజ్యేత పద్మకోశాహ్వయః కరః, | |
తా. ఏనుఁగుతొండము, ధళథళయనుకాంతి, బంగారు వెండి మొదలగువాని పాత్రము, కొప్పు, కొలఁది యనుట, అందము, బాగు అనుట, ఘంట, పుట్ట చెండు, తామర, పుట్ట, గుండ్రన, కుచము, టెంకాయ, మామిడిపండు, కొండగోగు, అద్దము, కొమ్మ వంగుట, పూలవాన, కబళము, గ్రుడ్లు పగులుట, మారేడుపండు, వెలగపండు వీనియందు ఈ హస్తము వినియోగించును.
16. సర్పశీర్షహస్తలక్షణమ్
పతాకతల నిమ్నత్వా | 327 |
వినియోగము—:
| చన్దనే భుజగే మందే ప్రోక్షణే పోషణాదిషు, | 328 |
| భుజాస్ఫాలే తు మల్లానాం యుజ్యతే సర్పశీర్షకః, | |
తా. గందము, పాము, మెల్లగాననుట, నీళ్ళు చిలుకరించుట, ప్రోచుట మొదలగునవి, దేవర్షి తర్పణములు, ఏనుఁగు కుంభస్థలములను చరచుట, జెట్టిలు భుజము చరచుట వీనియందు ఈహస్తము ఉపయోగపడును.
గ్రంథాంతరస్థసర్వశీర్షహస్తలక్షణమ్
| పతాకే నిమ్నమధ్యత్వం సర్పశీర్ష ఇతిస్మృతః. | 329 |
| నిరీక్ష్యనిర్జరాన్భీతాన్కరవిన్యాసపూర్వకమ్, | 330 |
| వామనాత్సర్పశీర్షో౽యం వాసవో ఋషిరుచ్యతే, | 331 |
తా. పతాకహస్తమునందలి అరచేయి పల్లముగా పట్టఁబడునేని సర్పశీర్షహస్త మగును. పూర్వకాలమునందు బలిచక్రవర్తికి వెరచి తన్ను శరణుచొచ్చిన దేవతలనుగూర్చి విష్ణుదేవుఁడు 'వామనావతార మెత్తి బలిని వంచించి మిమ్ము కాపాడెద' నని చేయి చాఁచి చెప్పునపుడు ఆవామనునివలన ఈసర్పశీర్షహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఇంద్రుఁడు ఋషి. పసుపు వర్ణము. శివుఁడు అధిదేవత.
వినియోగము:—
| కుఙ్కుమే పఙ్కభావే౽పి ప్రాణాయామనిరూపణే, | 332 |
| చందనేచ గజే ఖర్వే మల్లాస్ఫాలేచ లాలనే, | 333 |
| ప్రతిమాయాం పయఃపానే లీనే సత్పరిభాషణే, | 334 |
| పటవాసపరిక్షేపే చన్దనాదివిలేపనే, | 335 |
తా. కుంకుమము, అడుసు, ప్రాణాయామమును జూపుట, మొగము కడుగుకొనుట, దానకాలమును నిరూపించుట, గందము, ఏనుఁగు, పొట్టివాఁడు, జెట్టిలు భుజము చరచుట, బుజ్జగించుట, పాలు, నీరు, కుంకుమపువ్వు,సిగ్గు, దాఁచఁదగినవస్తువు, పసిబిడ్డ, బొమ్మ, నీళ్ళు త్రాగుట, ఐక్యము, మంచి దనుట, దేవజాతి, పసుపువన్నె, తగుననుట, గంధపుపొడి చల్లుట, గందము మొదలగువానిపూఁత, స్తనము మొదలగువానిని పట్టుకొనుట వీనియందు ఈహస్తము వినియోగించును.
17. మృగశీర్షహస్తలక్షణమ్
అస్మిన్ కనిష్ఠికాఙ్గుష్ఠే | |
తా. ముందు చెప్పిన సర్పశీర్షహస్తమందలి చిటికెనవ్రేలును బొటనవ్రేలును చాఁచఁబడునేని మృగశీర్షహస్త మగును.
వినియోగము:
| స్త్రీణామర్థేకపోలేచ క్రమ మర్యాదయోరపి. | 336 |
| భీతేవివాదే నైపథ్యే౽ప్యావానేచ త్రిపుండ్రకే, | |
| ముఖాముఖేరంగవల్యాం పాదసంవాహనే౽పిచ. | 337 |
| సర్వసమ్మేళనేకార్యే మందిరే ఛత్రధారణే, | 338 |
| సఞ్చారేచ ప్రయుజ్యేత భరతాగమకోవిదైః, | |
తా. స్త్రీవిషయము, చెక్కిలి, క్రమము, మర్యాద, వెరపు, వాదు, అలంకారము, ఉనికిపట్టు, త్రిపుండ్రము పెట్టుకొనుట, ఎదురెదురు, ముగ్గు, కాళ్ళు పిసుకుట, అన్నిటిని కూర్చుట, ఇల్లు, గొడుగు బట్టుకొనుట, మెట్టు, అడుగుపెట్టుట, ప్రియులను బిలుచుట, తిరుగుట వీనియందు ఈహస్తము వినియోగించురు.
గ్రంథాంతరస్థమృగశీర్షహస్తలక్షణమ్
| ఊర్ధ్వగశ్చతురాంగుష్ఠో మృగశీర్షకరః స్మృతః. | 339 |
| శివం ప్రతితపః కర్తుం ధారయిత్వా త్రిపుణ్డ్రకమ్, | 340 |
| ఋషిజాతి శ్శుభ్రవర్ణో౽ధిదేవస్తు మహేశ్వరః, | |
తా. చతురహస్తాంగుష్ఠము వెలుపలి కెత్తఁబడెనేని మృగశీర్షహస్త మౌను. మహేశ్వరునిగూర్చి తపస్సు చేయుటకు పార్వతీదేవి త్రిపుండ్రమును ధరింపఁగా ఈహస్తము పుట్టెను. ఇది ఋషిజాతి. దీనికి ఋషి మార్కండేయుఁడు. వర్ణము తెలుపు. అధిదేవత మహేశ్వరుఁడు.
వినియోగము:—
| భిత్తావిచారే సమయే ఆవాసే ఛత్రధారణే. | 341 |
| పద్మిన్యామపిశంఖిన్యాం హస్తిన్యాం మందవాచకే, | 342 |
| తిరస్కరిణ్యాం సోపానే సాక్షాత్కారే౽పిచక్రమే, | 343 |
| అస్మదర్థే శరీరేచ సంజ్ఞాపూర్వసమాహృతౌ, | 344 |
తా. గోడ, విచారము, సమయము, నివాసస్థానము, గొడుగుపట్టుట, పద్మినీ శంఖినీ హస్తినీజాతి స్త్రీలు, మెల్లగాననుట, గందము మొదలగువాని పూఁత, స్త్రీల అభినయము, త్రిపుండ్రధారణము, వితర్కము, మృగముయొక్క మొగము, నేను అనుట, దేహము, సైగచే గ్రహించుట, ఋషిజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము ఉపయోగించును.
18. సింహముఖహస్తలక్షణమ్
మధ్యమానామికాగ్రాభ్యా | 345 |
తా. నడిమివ్రేలు ఉంగరపువ్రేలు ఈరెంటికొనలను బొటనవ్రేలితోఁ జేర్చి తక్కినవ్రేళ్ళను జాఁచిపట్టినయెడ సింహముఖహస్త మగును.
వినియోగము:—
| విద్రుమే మౌక్తికేచైవ సుగన్ధే౽లకస్పర్శనే, | 346 |
| హోమే శశే గజే దర్భచలనే పద్మదామని, | 347 |