అభినయదర్పణమ్/పీఠిక
పీఠిక.
శ్రీమత్సకలభువనకర్తయైన శ్రీయఃపతికిం బ్రియతమంబై నిఖిలరసిక జనాహ్లాదభాజనంబై సర్వలోకవ్యాపకంబై విలసిల్లెడి భరతశాస్త్రము.---
"శంభుర్గౌరీ తథా బ్రహ్మా మాధవో నందికేశ్వరః,
దత్తిలోకోహళశ్చైవ యజ్ఞవల్క్యశ్చ నారదః.
హనూమాన్విఘ్న రాజశ్చ షణ్ముఖోథబృహస్పతిః,
అర్జునో రావణశ్చైవ కన్యాబాణసుతాతథా.
ఏతే భరతకర్తారో భువనేషు ప్రకీర్తితాః.
అనగా, శివుడు, పార్వతి, బ్రహ్మ, విష్ణువు, నందికేశ్వరుడు, దత్తిలుడు, కోహళుడు, యాజ్ఞవల్క్యుడు, నారదుడు, ఆంజనేయుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, బృహస్పతి, అర్జునుడు, రావణుడు, ఉషాకన్యక అనువారు భరతశాస్త్రకర్తలు అని లోకములయందు కొనియాడబడుచున్నారు అను నీయర్థముగల ప్రమాణశ్లోకములచేత వన్నెకెక్కియున్నది. అట్లుండియు ప్రకృతమునందు మనవారందరును అభినయవిద్యను సాధారణవిద్యలలో నొకటిగా దలచి యాదరింపకపోవుటయే గాక, అది కేవల పామరరంజకవిద్య 4
యనియు, శిష్టులకు పరిగ్రహణీయము కాదనియు, నాట్య ప్రవర్తకులకే యభ్యసనీయమనియు నుల్లంఘించి యున్నారనుట యెల్లవారికిని తెల్లమే కదా ? మోక్షసాధక మగు యోగశాస్త్రమును బోలిక యీశాస్త్రము ఇట్టి దశకు వచ్చుటకు నాయికానాయకవ్యాపారములను తదంగములయిల యితర విషయములనుజూచి ధర్మనునందు ప్రవృత్తి గలుగ జేయుటయే గాక గూడార్థప్రదర్శకములై, ఆంగికాభినయము వలన రసికులకు నభిజ్ఞఉలకు నానందప్రదమై యట్టి రసికాగ్రగణ్యులచే నాయభినయ విద్యాప్రవీణులు సన్మానింపబడు విషయము కేవల నటీప్రేష్యముగా నెన్నంబడుటయు, జనుల మనసులందు దోచు విషయములను అంగచలనాదౌల దెలిసికొనుట వలన కామవికారము కలుగునను భ్రాంతియును కారణము లగుచున్నవి. అట్లుగాక సూక్ష్మదృష్టితో చక్కగా విచారించునెడల ఈశాస్త్రము శృంగార సాధిష్ఠాన దేవతల లోకజనకుడు నగు శ్రీకృష్ణదేవుని లీలావినోదములను ఆయా రసానుభవమౌలతోడా నూహించి తెలిసికొనుట వలన బ్రహ్మజ్ఞానమును, ఆ జ్ఞానము వలన చూడబడునని యన్నియు అస్థిరములయిన వ్యాపారములు అను తాత్పర్యమును, ఆ తాత్పర్యము త అట్టి వ్యాపారములందు విరక్తియు, శాంతిదాంత్యాది విశిష్టగుణములును, జనింపగా నిత్యసుఖప్రదమయిన బ్రహ్మానందమును బొందించు నను విషయము తేటపడును , నాయికానాయకవ్యాపారములు జ్ఞాన పార్జనము నందు గురు 5
శిష్యులయొక్క సేవ్యసేవకభావబోధకములేగాని యితరములు కావు అని బ్రహ్మాదులచేత చెప్పబడియున్నది కనుకను, ధర్మార్థకామమోక్షము లనెడి చతుర్విధ పురుషార్థములకును సాధకమును, సర్వోత్కృష్టమును దేవతాది కర్తృకమును నైన యీ భరతశాస్త్రము ఎల్ల ధముల తను మనకు పరిగ్రహణీయమును అభ్యసనీయము నగుచు అని విచారించి, కాలానుసారముగా దినే నే క్షీణదశ నొందుచున్న దీనిని యథోచిత ప్రచారామునకు తేదలచి, భరతకర్తలలో నొకరగు నందికేశ్వరుని జెప్పబడిన ' యభినయదర్పణము ' అను గ్రంథమును పతాకా ముఖ్యహస్తముల స్వరూపములను దెలిపెడి చిత్రపు గురుతుల నాయాహస్తముల లక్షణశ్లోకములకు మొదటజేర్చియు, గ్రంథాంతరములందు జెప్పబడిన ఆయా హస్తముల యుత్పత్తికాలము, ఋషిదేవతాజాతి వర్ణములు మొదలగువాని గూర్చియు విశేషసంయుత హస్తములను, ప్రసిద్ధ రాజుల హస్తములను, పుణ్యనదుల హస్తములను, అశ్వత్ఠాది వృక్షహస్తములను, సింహాది మృగహసములను, హంసాదిపక్షిహస్తములను వక్రాదిజంతుహస్తములను, శిరోభేదాద్యనేక విషయములను సంగ్రహించియు నిట్లు చేరిన నన్నూట యెనిమిది విషయములను తెలుపునట్టి శ్లోకములకు స్త్రీ బాలబాలికాదులకు గూడ తేటగా దెలియునట్లు సులభములైన మాటలతో తెనుగు తాత్పర్యము వ్రాసి మంచి అక్షరములతో ముద్రింపించితిమి. 6
ఇదిగాక అభినయమునందు నవరసములు మొదలగు వానిని దెలుపదగిన భరతరస ప్రకరణమనెడి గ్రంథమును నిట్లే తెనుగు తాత్పర్యముతో మాచేత ముద్రింపబడియున్నది.
తండయార్పేట, చెన్నపురి, 10-6-1934.
ఇట్లు, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్.