అబలా సచ్చరిత్ర రత్నమాల/విజ్జిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విజ్జిక

ఈమెకు విజ్జకాయనియు నామాంతరము కలదు. ఈమెచే రచియింపబడిన శ్లోకములనేక గ్రంథములలో నుదహరింపబడియున్నవి. ఈమెను లోకులు సరస్వతియొక్క యవతారమని తలచుచుండిరి. ఇందువలననే యామె యభిమానముతో నిట్లు చెప్పుకొనినది.

శ్లో. నీలోత్పలదలశ్యామాం విజ్జకాం మాంజానతా
   వృథైవ దండినా ప్రోక్తంసర్వశుక్లా సరస్వతీ.

అనగా నల్లకలువలవంటి దేహమునుగలనన్ను నెరుగక దండికవి యూరక సరస్వతీదేవి దేహమంతట దెల్లనిదేయని వర్ణించెను.


_______