అబలా సచ్చరిత్ర రత్నమాల/మారుల

వికీసోర్స్ నుండి

మారుల

ఈమె యొక విఖ్యాతయయిన సంస్కృతకవయిత్రి. ఈమెను గురించియు నితర కవయిత్రులను గురించియు ధన దేవుడను కవి యిట్లు వ్రాసియున్నాడు.

శ్లో. శీలా విజ్జా మారులా మోరికాద్యా:
   కావ్యం కర్తుం సంతి విజ్ఞా:స్త్రియోపి
   విద్యావేత్తుం వాదినో నిర్విజేతుం
   విశ్వంవక్తుం య:ప్రవీణ: స వంద్య:.

అనగాశీలా, విజ్జా, మారులా, మోరికా మొదలయినస్త్రీలు కావ్యములు చెప్పుటకు సమర్థురాండ్రై యున్నారు. విద్య నేర్చినవారును, వాదులను గెలువనేర్చినవారును, విశ్వమును వర్ణింప నేర్చినవారును, నెవరయినను వంద్యులే.

ఈశ్లోకమువలన నా కాలమునందనేక స్త్రీలు విశేష విద్యనేర్చి పండితులతో వాదించి వారి నోడింపుచుండిరనియు, విద్వాంసులు మెచ్చదగిన కావ్యములు రచియుంపు చుండిరనియు స్పష్టమగుచున్నది.


_______