అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/వనలతాదేవి

వికీసోర్స్ నుండి

వనలతాదేవి

బంగాళ దేశమునందలి నదియా జిల్లాలోఁ గృష్ణనగర మనుగ్రామమున శశిపాద బనర్జీయను బ్రాహ్మమతావలంబి పోష్టాఫీసులో సూపరింటెండెంటుగా నుండెను. ఈమహనీయుఁ డనేకసంవత్సరములనుండి హిందూవితంతు శరణాలయము నొక దానిని స్థాపించియున్నాఁడు. ఈ యౌదార్యవంతుని బిడ్డ లందఱును సత్కార్యములనే చేయుచున్నారు. వనలతాదేవి యీతనిపుత్రి. ఈమె 1879 వ సంవత్సరము డిశంబరు 22 వ తేదిని కృష్ణనగరమున జన్మించెను. చిన్నతనమునుండియే యీమె మిగుల సద్గుణవతియు, దయాశాంతాదిగుణసహితయు నయియుండెను. ఈమె బుద్ధిసూక్ష్మతను గని శశిపాద బనర్జీగారీమెకు బాల్యమునుండియే విద్య నేర్ప మొదలుపెట్టిరి. ఈమె యెనిమిది సంవత్సరముల దయినప్పటినుండియుఁ గవిత్వశక్తి యీమె కలవడియెను. వనలతాదేవికి సేవా, ప్రేమ, వైరాగ్యములను నీగుణత్రయం బెంతయుఁ బ్రియంబైయుండె. ఆమె నడవడిలోను, గవిత్వములోను, ఉపదేశమునందును ముఖ్యముగా నీమూఁడు శబ్దములు గానవచ్చుచుండెను. ఈమెకుఁగల మాతృ పితృభక్తియు, పతిప్రేమయు మిగులస్తుత్యములు. పదమూఁడు సంవత్సరముల వయస్సున వనలతాదేవి వరాహనగరమునందలి వితంతు శరణాలయములో 'సుమతీ సమితి' యను నొక స్త్రీ సమాజము నేర్పఱచెను. అంత చిన్న వయస్సుననే యామె తనతోడి బాలికలతో నేర్పఱచిన యాసమాజమునకు మర్యాద గల యనేకకుటుంబములలోని ప్రౌఢ స్త్రీలును సామాజికు రాండ్రైరి. ఆసమాజముయొక్క యుద్దేశములను గని ప్రవీణులగు పురుషులును మెచ్చుచుండిరి. ఈసభ నానాఁటికి వృద్ధిఁబొంది యనేక స్త్రీజనోన్నతకార్యములను జేయఁ గలుగుచున్నది. వనలతాదేవి బ్రహ్మమతావలంబిని యైనను నామె సద్గుణ సదుద్దేశములవలన నామె యన్నిమతములవారికి నిష్టురాలుగానే యుండెను. ఈమె యాదివారపు పాఠశాలను స్థాపించి ప్రతి భానువారము బాలురకును బాలికలకును, మంచి నీతులను గఱపుచుండెను. నాఁటిదినమున నామె తానురచియించిన యనేక నీతిపరములగు పద్యములను, హృద్యములగు కీర్తనలను వారికినేర్పి వారిచే మరల వానిఁ జదివించి యప్పుడప్పుడాబాలకులకుఁ దెలియునటుల బోధపరములగు నుపన్యాసముల నిచ్చుచు వారి మనసులయందు నీతి జ్ఞానములు పాదుకొనునటులఁ జేయుచుండెను. ఆమె యాబాలకులకు వినోదముగ నుండునటుల గద్యపద్యరూపములగు నాటకములను రచియించి యాపిల్లలచే నానాటకముగ నాడించి యందుమూలమున వారికిఁ గొంతసద్గుణములను నేర్పుచుండెను. ఆదివారము నాఁడీమె యొద్దికి వచ్చుటకు బడిపిల్లలంద ఱెంతో సంతోషపడుచుండిరి.

ఈమె మూఁడు సంవత్సరములనుండియు 'సుమతీ సమాజా'అను మతంబున నంత:పురమను మాసపత్రి'కను స్త్రీలకొఱకై ప్రచురపఱచుచుండెను. ఆ మాసపత్రికకు లేఖక, ఉప లేఖక, కార్యదర్శులందఱును స్త్రీ లే! ఈపత్రికలోని సంగతులును స్త్రీల కత్యంతోప యుక్తములుగా నుండును. దీని యంత: స్వరూపమువలనే బాహ్యస్వరూపమును మిగుల నందముగానుండును. సాధారణముగా నీ మాసపత్రిక ప్రతి బంగాలీకుటుంబీకులును దెప్పించుచుందురు. వనలతాదేవిచేస్థాపింపఁబడిన ఈ సమాజము వలనను, నీ మాసపత్రికవలనను స్త్రీలు స్వతంత్రముగా నేకార్యమును జేయ లేరను కొందఱి యభిప్రాయము భ్రమయేమనియు స్త్రీలు విద్యనుగాంచి బుద్ధివికాసమునుగాంచినచోఁ బురుషుల సహాయ మెంతమాత్రము నక్కఱలేకయే యనేక సత్కార్యములను గ్రంధరచనలను జేయఁగలరనియు నందఱుకును దెల్లంబయ్యె! వనలతాదేవి స్త్రీలయున్నతినే సదాగోరుచున్నందుకై యనేక యుపాయములను జేసెను. ఆమె మరణమునకుఁ బూర్వము కొన్ని మాసములనుండి విశేషరోగగ్రస్తగా నుండియు నంత:పురమునకు వ్యాసములును, బద్యములును వ్రాయుచునేయుండెను. ఆమె మరణసమయమునందును "అంత:పురము; సుమతీసమితి" యను రెండుశబ్దముల నుచ్చరించి వాని శాశ్వతమును గోరుచుఁ బ్రాణముల విడిచెను.

ఈమెకుంగల గృహకృత్యములయందలి శ్రద్ధయుఁ, బతియందలి యనురాగమును, శిశుపోషణమునందలి నేర్పును మిగుల వర్ణనీయములు. ఈమె సాధారణముగా గృహకృత్యములను దానే నెఱవేర్చుచుండెను. రుగ్ణతలో నుండినప్పుడు సహిత మీమె యింటికిఁ గావలసిన వస్తువులను దానే తెప్పించుచు, నింట నేమివండవలసినదియుఁ దానే చెప్పుచు నింటి యందుండువారి యందఱ సేమము నరయుచుండెను. ఆమె రుగ్ణతలో సహిత మింటి కర్చులను వ్రాయుటమానక తలాపున నొక పుస్తకమును, పెన్సలును నుంచికొనుచుండెను. వనలతాదేవి తనభర్తను గేవలము దైవతుల్యునిగా భావించి యతని పనిని నౌకరులచేఁ జేయింపక తానే చేయుచుండెను. ఆమె పతిభక్తిని గాంచినవా రందఱు నిజమయిన పతిభక్తియనిన నిదియేగదాయని మెచ్చుచుండిరి. వ్యాధిలోనుండి భర్తకుఁ దాను భోజన మిడలేని సమయమునందు సహిత మామె భర్తకును, గుమారునకును దనయెదుట భోజనము పెట్టింపుచుండెను. ఈమె మరణదినమునం దీమె భర్తకుఁ గొంచెము దేహమస్వస్థముగా నుండెను. ఈమె మరణమున కరగంటకు ముందు భర్తవెచ్చని చొక్కా దొడిగికొనకుండుటను జూచి "మీశరీర మస్వస్థముగానుండినను మీరు వెచ్చనిబట్టలు తొడిగికొనక యేలయుంటిర"ని యాయంగీని తెప్పించి యాతని కిప్పించి తొడిగికొనునట్టు చేసెను. తనమరణవేదన నొకమూలనుంచి పతికళ్యాణమునే గోరునీకాంతయొక్క పతిభక్తి నెంతఁ గొనియాడినను దీఱదు. అనేకులను కొడుకులకును, గూఁతులనుగని వారినిఁ దననేర్పుచేఁ బెంచి పెద్దవారినిఁజేసి తనకుఁగల శిశుపాలనము నందలి నిపుణతను వెల్లడింపఁ దనకు సమయము చాలకున్నను నీమె మిగుల దక్షతతోఁ బెంచి విడిచిపోయిన మూఁడుసంవత్సరముల బాలుని చర్యలు చూచినచోనామెకుఁ దెలిసిన మాతృకర్తృత్వ మహత్వ మితరమాతలకుఁ దెలియుట దుస్తరమని యందఱకును దోఁచును. అంత చిన్న శిశువు తనతల్లి యాజ్ఞప్రకారము వర్తించుచుండెను. ఇంత చిన్న వయసుననే వాని తల్లి వాని కెన్నోనీతులను గఱపెను. వనలతాదేవికిఁ దన రుగ్ణత కుదురదని స్పష్టముగాఁ దెలిసినపిదప నొకదినమునం దెవ్వరును లేనిసమయమునఁ దనచిన్నికొమరునిఁ దనయొద్దికిఁ బిలిచి "నాయనా! నాశరీరమున రోగము హెచ్చెను. అది యిచటఁ బాగుకాదు. నేనుపరమేశ్వరుని సన్నిధికరిగిన నాబాధ నివారణమగును. తదనంతరము బాగయి వచ్చెదను. నేను పోవునపుడు నీవు ఏడ్వక సంతోషముగా బుద్ధి కలిగియుండుము." అని చెప్పఁగా నాబాలుఁ డౌననియెను! తదనంతర మామె 1900 వ సంవత్సరము నవంబరు 3 వ తేది రాత్రి స్వర్గస్థయయ్యెను. ఆమెకొఱకై యామెబంధువు లందఱును విలపించుచుండిరి. అప్పు డాశిశువు తల్లిమాటల యందలి విశ్వాసము వలన నెంతమాత్రము నేడువక గులాభిమొదలగు పూవులను దెచ్చి తల్లిశవముపై నుంచి "యమ్మా దేవునివద్దికిఁ బొమ్ము బాగయిరమ్ము" అని చెప్పి యామెను గొనిపోయిన పిదప నేడ్చువారినిఁ గని "మీరేలయేడ్చెదరు? మాయమ్మరోగ మిచట కుదురనందున దేవునికడకరిగెను. అచట బాగయి మరల రాఁగలదు. ఇట్లని నాతోఁ జెప్పిపోయినది" యని తన ముద్దుమాటలతోఁ జెప్పెను. ఈవనలతాదేవి మరణము కామె బంధువులేకాక యామెను గనినవారును, నామె సద్గుణములను వినినవా రందఱును మిగుల దు:ఖింపుచున్నారు. ఈమెకు మరణసమయమున నిరువదియొకటవసంవత్సరము. ఈమె యింత యల్పవయస్సునచే మృతినొందుట దేశముయొక్క దురదృష్టమనియే చెప్పవలయును.


గణపాంబ

ఈమె బేటరాజునకు భార్య; గణపతిదేవునకుఁ గూతురు ఈగణపతిదేవుఁడు క్రీ. శ. 1245 వ సంవత్సరమునుండి 1292 వ సంవత్సరమువఱకును నోరుగంటిరాజ్యముఁ బాలించిన రాజేయైయుండిన చోనీగణపాంబరుద్రమదేవికిఁ గూతురైయుండును. కానియిందునకుఁ బ్రబలనిదర్శనము లేవియుఁగాన రాకున్నవి. గణపాంబయుఁదనపతి మరణానంతరమునందాతని యేలుబడిలోనుండిన యాఱువేలగ్రామములనుమిగుల నేర్పుతోఁబాలించెను. ఆమె మిక్కిలి యౌదార్యవతియై యనేకవిధములైన ధర్మకార్యములను జేసెను. ఈమె ధర్మకృత్యములను జరితమును దెలుపు శిలాశాసనమొకటి కృష్ణా మండలములోఁ జేరియున్న గుంటూరు తాలూకాలోనున్నది. దానిలోని కొన్ని సంగతుల నిందుఁ బొందు పఱచెదను.

"మిగుల ప్రసిద్ధిఁగాంచిన కాకతీయవంశమునందు అనేక ప్రభువులు రాజ్యము చేసినమీదట వైరిభీకరుఁడగు బేటరాజు సింహాసనారూఢుఁడయ్యెను. శివునకుఁ బార్వతివలెను, విష్ణువునకు లక్ష్మివలెను, ఈబేటరాజునకు గణపాంబ ధర్మపత్ని యయ్యెను. ధర్మకటకపురిని మిక్కిలి యోగ్యముగా బాలించి బేటరాజు కీర్తి శేషుఁడయ్యెను. తదనంతరం బాతనిభార్యయగు గణపాంబ సింహాసన మెక్కెను. ఈమె భర్తయొక్క సుగతి