Jump to content

అన్నమాచార్య చరిత్ర పీఠిక/ప్రచురణ వివరాలు

వికీసోర్స్ నుండి



అన్నమాచార్యచరిత్రపీఠిక

అవతరణిక

అన్నమాచార్యచరిత్రము కథాపురుషుని మనుమఁడే రచించినది కాఁబట్టి విలువగల ప్రామాణిక చరిత్ర గ్రంథము. తెనుఁగున ప్రాచీనకాలపుఁజరిత్రగ్రంథములు కవీశ్వరులవి, ప్రాచీనులే ఆయా కవీశ్వరుల దగ్గఱి కాలమువారే కవితతో రచించినవి, చాలఁ దక్కువ.

బసవపురాణము, పాండితారాధ్యచరిత్రము, తిక్కనచరిత్రము (దశకు- ౧ఆ.) కృష్ణరాయయచరిత్రము, రఘునాథనాయకాభ్యుదయము, నృసింహగురుచరిత్రము, ఇట్టివి కొన్నిమాత్రమే వ్రేళ్ళలెక్క కెక్కి యున్నవి. అం దీయన్నమాచార్యచరిత్రము మతపాండిత్యకవితా ప్రఖ్యాతి గన్న మహనీయని చరిత్రమై చాలఁగా జరిగిన విషయములనే సవదరించు నదిగా నిరూపణకెక్కి నా కెక్కువమక్కువ గొల్పినది.

దీని రచయిత చినతిరువెంగళనాథుఁడని నిండు పేరుగల చిన్నన్న ఈతని విషయము 'అన్నమాచార్యసంతతి' అనుపట్టున వివరింతును. [1]ఈ యన్నమాచార్య చరిత్రమునుబట్టియే కాక, అన్నమాచార్య రచితము లయిన సంకీర్తనములఁ బట్టి, తత్ర్పసక్తము లయిన శాసనములఁబట్టి, అన్నమాచార్యుల పుత్రపౌత్రాదులు రచించిన సంకీర్తన కావ్యాదులనుబట్టి, కూడఁ దచ్చరిత్రము కొంత గుర్తింపనగును. నలుదెఱఁగుల సాధనములను గ్రుచ్చి యెత్తి హృద్యమయిన తచ్చరిత్రము నుద్ధరింప యత్నింతును.

అన్నమయ వంశము

అన్నమాచార్యుఁడు నందవరవైదిక బ్రాహ్మణవంశమున జన్మించినాఁడు. ఈ వంశమువారు ఋగ్వేదులు. ఆశ్వలాయనసూత్రులు. భరద్వాజగోత్రులు. పొత్తపినాఁటిలోని తాళ్లపాకగ్రామమున[2] నుండినవారు.

లభించిన తాళ్ళపాకవారి యితరగ్రంథములలో నెందుఁగాని యన్నమయ పితృపితామహాదుల ప్రశంసలేదు. ఇందే అది కలదు. (చూ4 నుండి 8 పుటలు) అన్నమాచార్యునితాత విద్యాభ్యాసమునకు ఊటుకూరను బంధుగ్రామమున కరిగిన ట్లున్నది.[3]

అవతారము

అన్నమాచార్యునితల్లి లక్కమాంబ[4] మాడుపూరిమాధవస్వామి భక్తురాలట. అది యామె పుట్టినింటివారియూరు గాఁబోలును. అన్నమయ శక. 1346 క్రీ. 1424 క్రోధి వైశాఖమాసమున విశాఖా నక్షత్రమున జన్మించినాఁడు. వన్నిద్దరాళ్వార్లలో ముఖ్యులగు నమ్మాళ్వార్లు (శఠకోపయతి) కూడ వైశాఖవిశాఖనే జన్మించిరి. జన్మోత్సవము పుట్టిన నక్షత్రమునుబట్టియును, నిర్యాణోత్సవము చనిపోయిన తిథిని బట్టియును జరుపుట నంప్రదాయము. వైశాఖమాసమున విశాఖా నక్షత్రము ప్రాయికముగా పూర్ణిమాతిథికి వచ్చును. కనుక వైశాఖ పూర్ణిమ జన్మతిథిగాఁ గూడ నిర్ణయింపవచ్చును. శక.1424, క్రీ.శ.1503 దుందుభి ఫాల్గుణ బహుళ ద్వాదశినాఁ డాతఁడు దివ్యధామ మందినాఁడు. అతని జీవిత పరిమాణము 79 ఏండ్లు. ఇటు చూడఁగా నేఁటి కాతఁడు జన్మించి 524 ఏండ్లయినది. దివ్యత్వమంది 445 ఏండ్లయినది. వేదాంతదేశికులు శ్రీవెంకటేశ్వరస్వామివారి గుడిఘంట యంశమున నవతరించి రని ప్రఖ్యాతి. మన యన్నమాచార్యులు స్వామి నందకము (ఖడ్గము) నంశమున నవతరించి రని ప్రఖ్యాతి. (చూ.10 పుట.)

బాల్యము

అన్నమాచార్యునకు బాల్యమునఁ దల్లిదండ్రులు వదినెయన్నలు పనులు చెప్పుటయు, భగవద్భక్తిపరాయణుఁడై యాతఁడు వానినిఁ జేయఁ జాలక చీకాకుపడుటయు జరిగెను. (చూ.11,12 పుటలు.) కుటుంబము వారి వలనఁ దాను జీకాకు పొందుటను సూచించు సంకీర్తనములు కొన్ని యన్నమాచార్య సంకీర్తనములలోఁ గలవు. అం దొకటి:

సామంతం

అయ్యో పోయం బ్రాయముఁ గొలము!
ముయ్యంచుమనసున నే మోహమతి నైతి ||పల్లవి||
చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు!
వట్టియాసలఁ బెట్టువారే కాక!
నెట్టుకొని వీరు గడు నిజ మనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృథా పిరివీకు లైతి ||అయ్యో|| 1

తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును!
వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక!
మిగుల వీరలపొందు మే లనుచు హరి నాత్మఁ
దగిలించలేక చింతాపరుఁడ నైతి || అయ్యో || 2

అంతహితులా తనకు నన్నలునుఁ దమ్ములును!
వంతువాసికిఁ బెనఁగువారే కాక|
అంతరాత్ముఁడు వెంకటాద్రీశుఁ గొలువ కిటు!
సంతకూటములయలజడికి లోనైతి ||అయ్యో || 3
                                     అన్న అధ్యా. 29, ఱేకు.

9

స్వామి సాక్షాత్కారము

అన్నమయకుఁ బదునాఱవయేఁట స్వామి ప్రత్యక్ష మయిన ట్లాయన సంకీర్తనముల తొలి రాగితేకుమీఁదఁ జెక్కంబడి యున్నది. నాఁట నుండియే స్వామియానతి చొప్పన నాతఁడు సంకీర్తన ములు రచింప నారంభించెను. నమ్మాళ్వార్లు (శఠకోపయతి) కూడఁ బదునా అవయేఁటనే ప్రజ్ఞాపూరులై దివ్యప్రబంధరచన సాగించిరి. అన్నమయ తనకు స్వామి బాల్యమున దర్శన మిచ్చుట నిట్లు సంకీర్తనములఁ జెప్పకొన్నాఁడు.

భూపాలం

ఇప్ప డిటు కలగంటి నెల్లలోకములకు నప్పఁడగు తిరువెంకటాద్రీశుఁ గంటి ||పల్లవి|| అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి! ప్రతిలేనిగోపురప్రభలు గంటి! శతకోటిసూర్యతేజములు వెలుఁగఁ గంటి! చతురాస్యుఁ బొడగంటిఁ జయ్యన మేలుకంటి ||ఇప్పు|| 1

కనకరత్నకవాటకాంతు లిరుగడఁ గంటి! ఘనమైనదీపసంఘములు గంటి! అనుపమమణీమయ మగుకిరీటము గంటి! కనకాంబరము గంటిఁ గ్రక్కన మేలుకంటి ||ఇప్పు|| 2

అరుదైన శంఖచక్రాదు లిరుగడఁ గంటి! సరిలేనియభయహస్తము గంటిని! తిరువెంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటి! హరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి ||ఇప్పు|| 3

అన్న, అధ్యా. 6 తేకు.

పాడి

సందేహ మెక్కడా లేదు సంతోషించుకొంటి నేను! కందువ బ్రహ్మానందము గైకొంటి నేను ||పల్లవి|| 10

నున్నఁగా సంకీర్తన నానోరి కిచ్చితి గనుక! నన్ను రక్షింతువే యనుచు నమ్మితి నేను! పిన్ననాఁడే నీవు నన్నుం బేరుకొంటివి గనుక! యొన్నంగ నీడేర్తు వని యియ్యకొంటి నేను ||సందే|| 1

శ్రీకాంతుఁడ నీమూర్తి నాచిత్తములో నిల్పఁగాను! నాకు నీవు గల వని నమ్మితి నేను! దాకొని లోకములో నీదాసుం డనిపించఁగా! ఈడక నేలితి వని యెఱిఁగితినేను ||సందే|| 2

కైవసమై నీవు నాకుఁ గలలో నానతియ్యఁగా! నావద్ద నున్నాఁడ వని నమ్మితి నేను! ఏవేళా శ్రీవేంకటేశ యెదుటనే వుండఁగాను! పావనమై యిన్నిటాను బ్రబలితి నేను ||సందే|| 3 అన్న అధ్యాII వాల్యుం 244 పేజి.

తిరువతికిఁ బయనము

అన్నమయ కాడినమా టెల్ల నమృతకావ్యముగాను, పాడినపా టెల్లఁ బరమగానముగాను గాఁజొచ్చినవి. తిరుపతి యాత్రకుఁ బయనమయ్యెను. పరుసగుంపువా రిటు పాడఁజొచ్చిరి. (చూ 13 పుట.)

వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ||పల్లవి||

ఆమటి మొక్కులవాఁడే ఆదిదేవుఁడే వాఁడు తోమని పళ్యాలవాఁడే దురితదూరుఁడే ||వేడు|| 1

వడ్డికాసులవాఁడే వనజనాభుఁడే పుట్టు గొడ్డురాండ్రకు బిడ్డలనిచ్చే గోవిందుఁడే ||వేడు|| 2

ఎలమిఁగోరినవరా లిచ్చే దేవుఁడే వాఁడు అలమేల్మంగా శ్రీవెంకటాద్రినాథుఁడే ||వేడు|| 3 తాళ్లపాక శేషాచార్యులుగారి వ్రాఁతప్రతి. 11

దిగువతిరుపతి క్షేత్రము పొలిమేరలో తాళ్ళపాకగంగమ్మ యను గ్రామదేవత గలదు. తాతాయుగుంట గంగమ్మ[5] అంకాళమ్మ ఇత్యాది నామముల గ్రామసీమాదేవత లింకను గలరు. అందరకంటెఁ దాళ్ళపాక గంగమ్మ ప్రాచీనదేవతయట. ఇప్పటికి నాదేవి తిరుపతి పొలిమేరలోనే కలదు. పూర్వము తిరుపతియాత్రకు వచ్చు యాత్రికు లాక్షేత్రదేవత నర్చించి క్షేత్రప్రవేశము చేయుచుండెడివారట. అన్నమయ యాదేవతకు మొక్కు చెల్లించెను. (చూ. 14 పుట.) తొలుత నాదేవతను తాళ్ళపాక 12 యన్నమయ యర్చించుటచేతనేమో యూమెకు తాళ్ళపాక గంగమ్మయని పేరయ్యెను. తిరుపతిలో నేఁటేఁట జరుగు గంగమ్మ జాతర యీగంగా నమ్మలకై యేర్పడినదే. అన్నమయ యుంతటఁ దిగువతిరువతికి విచ్చేసి యిటు సంకీర్తనము చేసెను.

మలహరి

అదె చూడు తిరువెంకటాద్రి నాలుగుయుగము! లందు వెలుఁగొంది ప్రభమీఱఁగాను ||పల్లవి||

తగనూటయిరవై యెనిమిది తిరుపతులం గల స్థానికులును చక్రవర్తి పీఠకములును! అగణితంబైన దేశాంత్రులమఠంబులును నధికమై చెలు వొందఁగాను! మిగుల నున్నతములగు మేడలును మాడుగులు మితిలేనిదివ్యతపసు లున్నగృహములును! వొగినొరగుఁబెరుమాళ్ళవునికి పట్టయి వెలయు దిగువ తిరుపతి గడవఁగాను ||అదె|| 1

పొదలి యరయోజనము పొడవుననుఁబొలుపొంది పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి చెదర కేవంకఁ జూచిన మహాభూజములు సింహశారూలములును! కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడగంధర్వ యక్షులును విద్యాధరులు! విదితమై విహరించు విశ్రాంతదేశముల వేడుకలు దైవాఱఁగాను ||అదె|| 2

ఎక్కువల కెక్కువై యొసగి వెలసిన పెద్ద యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁద! అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్! 13

చక్క నేఁగుచు నవ్వచఱి గడచి హరిఁదలఁచి మ్రొక్కుచును మోఁకాళ్ళ ముడుగు గడచినమీఁద! నక్కడక్కడ వెంకటాద్రీశు సంపదలు అంతంతఁ గాన రాఁగాను ||అదె|| 3

బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును పొందైననానావిధంబుల వనంబులును! నిగిడి క్రిక్కిఱిసి పండినమహావృక్షముల నీడలను నిలిచి నిలిచి! గగనంబు దాఁకి శృంగారరసభరితమై కనకమయమైన గోపురములనుఁజెలువొంది! జగతీధరునిదివ్యసంపదలుగల నగరు సరగునను గానరాఁగాను ||అదె|| 4

ప్రాకటంబైన పాపవినాశనములోన భరితమగు దురితములు పగిలి పాఱుచునుండ! ఆకాశగంగతోయములు సోఁకిన భవము లంతంత వీడిపాఱఁగను! ఈకడనుఁ గోనేట యతులు బాశుపతుల్ మును లెన్ననగ్గలమై వున్న వైష్ణవులలో నేకమై తిరువెంకటాద్రీశుఁ డాదరిని యేప్రొద్దు విహరించఁగాను ||అదె|| 5 -అన్న అధ్యా. 37 ఱేకు.

శేషాద్రి దర్శనము

శ్రీరాగం

అదివో అల్లదివో హరివాసము! పదివేల శేషుల పడగలమయము ||పల్లవి|| అదె వేంకటాచల మఖిలోన్నతము! అదివో బ్రహ్మాదుల కపురూపము! 14

అదివో నిత్యనివాస మఖిలమునులకు! నదే చూడుఁ డదె మొక్కుఁ డౌనందమయము ||అది|| 1

చెంగట నల్లదివో శేషాచలము! నింగి నున్న దేవతల నిజవాసము! ముంగిట నల్లదివో మూలనున్నధనము! బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము ||అది|| 2

కైవల్యపదము వేంకటనగ మదివో! శ్రీవెంకటపతికి సిరు లయినది! భావింప సకలసంపదల రూప మదివో పావనముల కెల్లఁ బావనమయము ||అది|| అన్న. అధ్యా, 4 ఱేకు.

రామక్రియ

కట్టెదుర వైకుంఠము కాణా చయినకొండ! తెట్టెలాయ మహిమలే తిరుమలకొండ ||పల్లవి|| వేదములే శిలలై వెలసినది కొండ! యేదెసఁ బుణ్యరాసులే యేఱులైనది కొండ! గాదిలి బ్రహ్మాదిలోకముల కొనలకొండ! శ్రీదేవుఁ డుండేటి శేషాద్రి యీ కొండ ||కట్టె|| 1

సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ! నిర్వహించి జలధులే నిట్టచఱులైన కొండ! వుర్విఁదపసులే తరువులై నిలిచిన కొండ! పూర్వపు టంజనాద్రి యీపొడవాటికొండ ||కట్టె|| 2

వరములు కొటారుగా వక్కణించి పెంచేకొండ! పరగులక్ష్మీ కాంతు సోబనపుఁ గొండ! కురిసి సంపద లెల్ల గుహలనిండినకొండ! విరివైన దిదివో శ్రీ వేంకటపుఁ గొండ ||కట్టె|| 3 అన్న అధ్యా. 282 ఱేకు. 15

ఆహిరి

తోరణములే త్రో వెల్లా! మూరట బారట ముంచినలతల ||పల్లవి|| కూరిమి మటములు గోపురంబులును! తేరుపడగలే తెరు వెల్లా! కోరినపండు గురిసేటి తరువులు! తోరములైన వెదురుజొంపములు ||తోర|| 1

ఆటలుఁ దిరువులు నందపు టురువులు! పాటలు వనవైభవ మెల్లా! కూటువనెమిళ్ళ కోవిలగుంపులు! పేటలఁ దేటల పెనుఁగూటములును ||తోర|| 2

వింజామరలును విసనకఱ్ఱలును! గొంజెగొడుగులె కొండెల్లా! అంజనగిరిరాయఁడు వెంకటపతి! సంజీవని పరుషల కొదవఁగను ||తోర|| 3 అన్న అధ్యా, 20 టేకు.

అన్నమయ దిగువ తిరుపతినుండి వేకువజామున బయలుదేరి అడిపడి నరసింహుని, తలయేరుగుండును, పెద్దయెక్కుడును, కపురపుఁ గాలువను, దర్శించుచు జామెక్కుసరికి మోకాళ్ళ ముడుపుకడకేగెను.

తలయేరుగుండు

అడిపడిదగ్గఱనే గొప్పచింతచెట్టు నేఁడును గలదు. శ్రీవేంకటేశ సేవాక్రమమున నది ప్రస్తుతిగన్నది. అన్నమాచార్యుఁడు దీనిఁబేర్కొన్నట్టు లేదు.

చించా మున్నిద్రసుభగాం దివ్యాం తన్మూలత శుభే! శ్రీనివాసపదాంభోజే స్వసంకల్పాత్ సముత్థితే తన్మూలత స్ప్వయంవ్యక్తా౯ సరోయోగిముఖానపి! లక్ష్మీనృసింహం శేషాద్రిం ప్రణిపత్య కృతాంజలి: ||సేవాక్రమః|| 16

చింతచెటు దాటినతర్వాత నరసింహస్వామి, తలయేరుగుండు, అక్కడనే శ్రీపాదములు నున్నవి. కొండమీఁది కెక్కువారును, దిగువారును తలనొప్పి కాలునొప్పి కలుగకుండుటకై యాగుండును దలతో మోఁకాళ్ళతోఁ దాఁకుదురు. కనుకనే దానికిఁ దలయేరుగుం డన్న పేరయ్యెను. (చూ. 14 పుట.)

శ్రీపాదములు

శ్రీరానానుజాచార్యులవారు తిరుపతికి విచ్చేసి కొండ పై స్వామిసన్నిధిని మూన్నాళ్ళు వసించి, యుటుపై దిగువ తిరుపతిలో నొకవత్సరమునెలకొని తిరువులనం బిగారికడ రామాయుణ రహస్యార్ధములఁదెలిసికొనిరట! తిరుమలనంబి ప్రొద్దుట స్వామిని సేవించి కొండదిగి యడిపడికడ దలయేరుగుండు దగ్గఱిమండపమునకు రాఁగా రామానుజాచార్యులవారు గోవిందరాజ సన్నిధినుండి యక్కడికరిగి రహస్యార్ధములఁ దెలిసికొనుచుండెడివారట. తిరుమలనంబి యొుఁక నాఁడు స్వామిసన్నిధిని మధ్యాహ్నపూజ సాగదయ్యెఁగదాయని ఖిన్నుఁడు కాఁగా స్వామి నీకాకొఱఁత తొలగిపోఁగలదు. దుఃఖింపకు మని స్వపోద్బో ధము కావించిరట. మఱునాఁడు ప్రాతఃకాలపూజచేసి వచ్చి రామానుజుల కుపదేశము చేయుచుండగా మధ్యాహ్నపూజా సమయమునకు దివ్యకుసుమ తులసీ మృగమదకర్పూర సుగంధముతో స్వామిపాదములు ప్రత్యక్షమయ్యెనట. తదాది శ్రీపాదముల కక్కడ ప్రతిష్ట కలిగెను. ఇతిహాసమూలలోనే ఈ కథ.

ముఖారి

బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మము దా నీపాదము ||పల్లవి|| చెలఁగి వసుధ గొలిచిన నీపాదము! బలి తలమోపిన పాదము! 17

తలఁకక గగనము దన్నినపాదము! బలరిపు గాచిన పాదము ||బ్రహ్మ|| 1

కామిని పాపము గడిగిన పాదము! పాము తల నిడిన పాదము! ప్రేమపు శ్రీసతి పిసికెటిపాదము! పామిడి తురగపు బాదము ||బ్రహ్మ|| 2

పరమ యోగులగుఁ బరిపరివిధముల! పరమొసఁగెడి నీపాదము! తిరువేంకటగిరి తిరమనిచూపిన! పరమపదము నీపాదము ||బ్రహ్మ|| 3 అన్న అధ్యా, 31 ఱేకు.

కురువనంబి

తలయేరుగుండు దాటిన తర్వాత కుమ్మరమండప మని యొుక స్థలము గలదు. అది నేఁడు చెడినది. అక్కడిజాళ్ళు మెట్లకుఁ బ్రక్కగోడ ఱాళ్లుగా మాఱినవి. ఆ జాళ్ళ మీఁదఁ గురువనంబి కథాశిల్పము లున్నవి.

ఒక కుమ్మరి స్వామికిఁ బ్రతిదినము వంటకుండలుచేసి యర్పించుచు దానియాయతిచే జీవించుచుండెను. అనుదినము నెడతెగక యూవని యుండుటచే నాతనికి స్వామిదర్శనము తఱచుగా లభింపదయ్యెను. కొయ్యతో శ్రీనివాసమూర్తిని గల్పించుకొని యాతఁడు కుండలు చేయఁగా మిగిలిన మట్టితోఁ బుష్పములు గావించి యామూర్తి నర్చించు చుండెను. తొండమానుఁడనురాజు ప్రతిదినము స్వామికి బంగారుపూలతో దొలిపూజ జరుపుచుండెను. ఒకనాఁడు రాజు స్వామి పాదములపై నర్పించిన బంగరపూ లోకప్రక్కకు జాఱి యుండుటయు, మట్టిపూవులు శ్రీపాదములపై నుండుటయుఁ గానవచ్చెను. రాజుచూచి విచారింపఁగా కుమ్మరి తనయున్నచోట నర్పించుచుండినపూవు లవి యగుట తెలియవచ్చెను. రాజు కుమ్మరిని దర్శించి, తన కట్టియోగ్యత నర్థించెను. స్వామి కుమ్మరికిని అహంకృతి తొలగించుకొన్న రాజునకును సాన్నిధ్యమొసగెను. ఈ కథ వెంకటాచలమాహాత్మ్యమునను గలదు. 18

కురువనంబి

కాఁబోది

కురువనంబి తిరుమల కురువనంబి నీ చరణములే కొలిచి బ్రతికె కిరీటము గలరాజు ||పల్లవి||

దవ్వులామటనుండి నీవు పువ్వులఁ బూజించితే అవి! చివ్వన అప్పనియడుగుఁదామెరలపై చెలఁగియప్పడే నిలిచె! పువ్వులకు ఱెక్కలున్నవో లేక పుండరీకాక్షుని మహిమో! నివ్వటిల్లు నీభక్తియోకాని నేఁడు నాతోఁ జెప్పవే ||కురు|| 1

పొంకపుదోసిటి యడుసున లెస్స పొరలిన గన్నేరుఁ బువ్వలు! కుంకుమగంధ మాకల్పములపై కోరివేడి నిలిచె! బంకమ న్నది యెంతవాసనో లేక పారిజాతముల కెక్కుడో! వెంకటపతి కెంత వేడుకో నాకు వివరింపవె అప్పయ్య ||కురు|| 2 శేషాచార్యులుగారి వ్రాఁతప్రతి.

పెద్దయెక్కుడు

ఇక్కడ మెట్లు నిట్టనిల్వునను చాలాయెత్తుగాను నుండును. తిరుమల యెక్కుటలో నెక్కువశ్రమకర మయినయెక్కు డిది.

కర్పూరవుఁగాలువ

"కపురంపుఁదావులు గడు నూలుకొలువు కపురంపుఁగాలువ" యుట. పెద్దయెుక్కుడు దాటినతర్వాత మోఁకాళ్ళ ముడుపునకుఁ బూర్వమీకాలువ గలదట. అక్కడ నాసెలయేటి జాలునీళ్ళు సుగంధము గలిగి యుండునట. సేవాక్రమమున ని ట్లున్నది. "తతఃకర్పూరసురభితీర్థం కర్పూర నిర్ ఝరమ్"


మోఁకాళ్ళ ముడుపు

సాలగ్రామమయమైనది గనుక నిఁకమీఁదఁ బర్వతము పాదములతోఁగాక మోఁకాళ్ళతో నడచుట జరిగెడిదట. కాన మోఁకాళ్ళ ముడు పని పేరయ్యె నందురు. ఒక్కొకవెుట్టు వెూఁకాలి యెత్తుగలిగి వెూఁకాళ్ళు ముడుచుకొనుచు నెక్కవలెను. గనుక నాపేరయ్యె ననియు నందురు. 19

"అలమేలుమంగకు నాశుమార్గమున
సలలితంబుగ నొక్కశతకంబు సెప్పె"

తెలియక చెప్పుఁగాళ్ళతోఁ గొండ నెక్కుచు బడలి మోఁకాళ్ళ ముడుపు దగ్గఱ నన్నమయు వెదురుపొదక్రింద నొకబండపై మైమఱచి నిద్రించుచుండఁగా నలమేలుమంగాంబ దర్శనమిచ్చి యూఱడించి, చెప్పలు విడిచి కొండ నెక్కు మని తెలిపి దివ్యప్రసాదము ప్రసాదించి యూకలిదీర్చియరుగుట, మెలకువగొని కళవళమంది యాతఁడిది నిజమో కాదేమో యనిసంశయించి, కడకు నమ్మి యాశుకవితగా నమ్మవారి మీఁద శతకముచెప్పట జరిగినది.

చ|| అరసెలు నూనెబూరియలు నౌఁగులుఁ జక్కెరమండెగల్ వడల్ బురుడలు పాలమండెఁగ లపూపము లయ్యలమేలుమంగ నీ కరుదుగ విందువెట్టుఁ బరమాన్నశతంబుల సూపకోట్లతో నిరతవినిర్మలాన్నముల నేతులసోనల వేంకటేశ్వరా!

ఉ|| చొచ్చితిఁ దల్లి నీమఱుఁగు సొంపుగ నీకరుణాకటాక్ష మె ట్లిచ్చెదొ నాకు నేఁడు పరమేశ్వరి యోయలమేలుమంగ నీ మచ్చిక నంచు నీతరుణిమన్నన నే నిను గంటి నీకు నా బచ్చెనమాట లేమిటికి బ్రాతివి చూడఁగ వేంకటేశ్వరా!

ఉ|| యోగ్యత లేని కష్టుఁడ నయోగ్యుఁడ నన్నిటీఁజూడ గర్భని ర్భాగ్యుఁడ నీకృపామతికిఁ బ్రాపుఁడ నోయలమేలుమంగ నా భాగ్యము నీకృపాగరిమఁ బ్రాష్యము కావు మటంచు సారె నీ భాగ్యవతీశిరోమణిని బ్రస్తుతిచేసెద వేంకటేశ్వరా!

ఉ|| అమ్మకుఁ దాళ్ళపాకఘనుఁ డన్నఁడు పద్యశతంబు సెప్పెఁ గో కొమ్మని వాక్ర్పసూనములఁ గూరిమితో నలమేలుమంగకున్ నెమ్మది నీవు చేకొని యనేకయగంబులు బ్రహ్మకల్పముల్ సమ్మద మంది వర్ధిలుము జవ్వనిలీలల వేంకటేశ్వరా!*

• దీనిని వావిళ్ళవారు ప్రకటించిరి. 20 ‘వేంకటేశ్వరా యని పద్యాంతనంబోధన మున్నను నిందుఁ బ్రతిపద్యమును నలమేలుమంగాంబికా ప్రస్తుతిపరమే. కడపద్యములో కవికూడా అమ్మకు అలమేల్మంగకు పద్యశతకము చెప్పితిననెను-కనుక నిది యల మేల్మంగాంబికాస్తుతి శతకమే యనఁదగినది.

అన్నమాచార్యచరిత్రలో నన్నమయ కొండనెక్కునాఁటి కెనిమిదేండ్ల వాఁ డని యున్నదిగాని, దాని నుపనయనముచే ద్విజత్వము వచ్చిన దాదిగా నని యున్వయించుకొని యెనిమిదేండ్లవాఁ డని, మాతృ గర్భముననుండి పుట్టినదాది పదునాఱేండ్లవాఁ డని సరిచూచు కోవలెను. కొండనెక్కు నాఁటి కాతఁడు నంకీర్తనకర్త. పదునాఱవయేఁట స్వామిప్రత్యక్షమై సంకీర్తన రచనానుగ్రహము చేసినాఁ డని రాగిఱేకు మీఁద నున్నది.

త్రోవభాష్యకారులు

దేశాళం

గతు లన్ని ఖిలమైన కలియుగ మందును! గతి యీతఁడే చూపె ఘనగురుదైవము ||పల్లవి||

ఈతనికరుణనేకా యిల వైష్ణవులమైతి! మీతనివల్లనే కంటి మీతిరుమణి! యీతఁడే కా వుపదేశ మిచ్చె నష్టాక్షరమంత్ర! మీతఁడే రామానుజులు ఇహపరడైవము ||గతు|| 1

వెలయించె నీతండెకా వేదపురహస్యములు! చలిమి నీతండె చూపె శరణాగతి! నిలిపినాఁ డీతండెకా నిజముద్రాధారణము! మలసి రామానుజులే మాటలాడే దైవము ||గతు|| 2

నియమము లీతండెకా నిలిపెఁ బ్రపన్నులకు! దయతో మోక్షము చూపెఁ దగ నీతండె! నయమై శ్రీవేంకటేశునగ మెక్కీ వాకిటను! దయఁ జూచీ మమ్మునిట్టే తల్లిదండ్రి దైవము ||గతు|| 3 అన్న అధ్యా. 175 ఱేకు. 21 అన్నమయ కొండ నెక్కి స్వామిపుష్కరిణిని దర్శించి తొలుత నందు స్నానముచేసినాఁడు. అప్పడు పుష్కరిణి నిట్లు ధ్యానించినాఁడు. (18 పుట చూ.)

స్వామివుష్కరిణి

గుండక్రియ

దేవుని కిదే వునికి నీ తెప్పల కోనేరమ్మ! వేవేలు మొక్కులు లోకపావని నీ కమ్మా ||ప్లలవి||

ధర్మార్ధకామమోక్షతతులు నీసోబనాలు! అర్మిలి నాలుగువేదా లదే నీదరులు! నిర్మలపు నీజలము నిండు సప్తసాగరాలు! కూర్మము నీలోఁతువో కోనేరమ్మా ||దేవు|| 1

తగిన గంగాదితీర్ధములు నీకడళ్ళు! జగతి దేవతలు నీజలజంతులు! గగనపుఁ బుణ్యలోకాలు నీదరిమేడలు! మొగి నీచుట్టుమాఁకులు మును లోయమ్మా ||దేవు|| 2

వైకుంఠనగరమువాకిలే నీ యాకారము! చేకొను పుణ్యములే నీజీవభావము! యేకడను శ్రీవేంకటేశుండె నీవునికి! దీకొని నీ తీర్థ మాడితిమి కావంవమ్మా ||దేవు|| 3 అన్న అధ్యా. 186 ఱేకు.

పెద్దగోపురమును నీడతిరుగనిచింతచెట్టును[6] గరుడగంభమును చంపకప్రదక్షణమును దివ్యప్రసాదము లొసఁగుప్రదేశమును అక్కడి ప్రసాదములను నడగోవురమును శ్రీనివాసుని భాష్యకారులను 22 నరసింహుని జనార్ధనుని అలమేలుమంగను యాగశాలను ఆనంద నిలయమును కళ్యాణ మంటపమును బంగారుగరుడుని శేషుని వునుఁగు చట్టలను కాచి తైలము వడియుఁ గార్చు వ్రదేశమును స్వామినినుతించుచిలుకల పంజరవులను శ్రీభండారమును బంగారుగాదెలను బంగారువాకిటిని దర్శించి స్తుతించి లోనికి స్వామిని సేవింప నరిగెను. ఈసందర్భములలోఁబెక్కింటికి సంకీర్తనము లున్నవి.

దేవాలయప్రవేశము

పాడి

సేవించి చేకొన్న నారి చేతిభాగ్యము! వేవేగ రారో రక్షించి విషుఁ డీడను ||పల్లవి||

గరుడగంభముకాడ కడుఁ బ్రాణాచారులకు! వరము లొసఁగీని శ్రీవల్లభుండు! తిరమై కోనేటిచెంతఁ దీర్ధఫలము లెల్ల! పరుషల కొసఁగీని పరమాత్ముడు ||సేవించి|| 1

సేన మొదలారివద్ద చిత్తములో సుజ్ఞానము! నానాగతిఁ బుట్టించీని నారాయణుండు! కానుక పైఁడిగాదెలకాడ నిజరూపు! ఆనుక పొడచూపీని అఖిలేశుఁడు ||సేవించి|| 2

సన్నిధి గర్భగృహాన చనవిచ్చి మాటలాడి! విన్నపాలు వినీ శ్రీవేంకటేశుఁడు! ఎన్నికం బాదాలవద్ద ఇహము పరముఁ జూపీ! మన్ననల నలమేలుమంగవిభుఁడు ||సేవించి|| 3 అన్న అధ్యా. 288 ఱేకు.

వివ్వక్సేనుఁడు

నీవేకా చెప్పఁ జూప నీవేకా! శ్రీవిభుప్రతినిధివి సేన మొదలారి ||పల్లవి|| 23

నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద! దేవతలఁ గనిపించే దేవుండవు! యేవంక విచ్చేసినాను యిందిరాసతికి నిజ! సేవకుండవు నీవేకా సేన మొదలారి ||నీవేకా|| 1

పసిఁడిబద్దలవారు పదిగోటు గొలువ! దెసలఁ బంపులు పంపే ధీరుఁడవు! వనముగా ముజ్జగాలవారి నిందఱిని నీ! సిసువులఁగా నేలినసేన మొదలారి ||నీవేకా|| 2

దొరలైనయసురులఁ దుత్తుమురు సేసి జగ! మిరవుగా నేలితి వేకరాజ్యమై! పరగుసూత్రవతి పతివై వెంకటవిభు! సిరుల పెన్నిధి నీవె సేనమొదలారి ||నీవేకా|| 3

అన్న అధ్యా. 42 తేకు.

వూనుమంతుఁడు

సాళంగనాట

మొక్కరో మొక్కరో వాఁడె ముందర నిలుచున్నాఁడు! యొక్కువ రామునిబంటు యేకాంగవీరుఁడు ||పల్లవి ||

పెట్టినజంగతోడి పెద్దహనుమంతుఁడు! పట్టెను యెడమచేత బలుముష్టి! మెట్టినాఁడు పాదముల మించురాకాసితలలు! కొట్టే ననుచు నెత్తె గొప్పవలకేలు ||మొక్కరో|| 1

వంచెను శిరసుమీఁద వాలుగాఁ దనతోఁక! పెంచెను మిన్నులు మోవఁ బెనుదేహము! నించినాఁడు రౌద్రము నిడుపాటిదవుడల! కాంచనపుఁబటు కాసె కడు బిగించెను ||మొక్కరో|| 2

పెనఁచి తొడలుదాఁక పెద్దపదకము వేసె! తనువుపై వ్రేలాడేదండలతోడ! 24

అనయము శ్రీ వెంకటాద్రిదేవునిబంటు! వెనుబలమై యున్నాఁడు విట్టలములోనను||మొక్కరో|| 3

అన్న అధ్యా. 252 ఱేకు.

సాదములు

దేసాక్షి

ఏపొద్దు చూచిన దేవుఁ డిట్గానె యారగించు రూపులతోఁ బదివేలు రుచులైనటుండెనూ ||పల్లవి ||

మేరు మందరాలవలె మెఱయు నిడ్జెనలు! సూరియచంద్రులవంటి చుట్టుబళ్ళేలు! ఆరని రాజాన్నాలు అందు పై వడ్డించఁగాను! బోరన చుక్కలు రాసివోసినటుండెను ||ఏపొద్దు|| 1

పలు జలధులవంటి పైఁడివెండి గిన్నెలు! వెలిఁగొండ లంతలేసి వెన్నముద్దలు! బలసిన చిలువాలు పంచదార గుప్పఁగాను! అలరువెన్నెల రస మందిచ్చిన టుండెను ||ఏపొద్దు|| 2

పండిన పంటలవంటి పచ్చళుఁగూరలును! వండి యలమేలుమంగ వడ్డించగాఁ! అండనె శ్రీవెంకటేశుఁ డారగించి మిగులఁగ! దండిగా దాసులకెల్ల దాఁచిన టుండెను ||ఏపొద్దు|| 3

అన్న అధ్యా. 252 ఱేకు.

స్వామి దర్శనము

శంకరాభరణం, అటతాళం

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్య కోనేటిరాయఁడా ||పల్లవి|| 25

కోరి మమ్ము నేలినట్టికులదైవమా, చాల! నేరిచి పెద్ద లిచ్చిన నిధానమా! గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు! చేరువఁ జిత్తములోని శ్రీనివాసుఁడా ||పొడ|| 1

భావింపఁ గైవసమైన పారిజాతమూ మమ్ము! చేవదేరఁ గాచినట్టిచింతామణీ! కామించి కోరిక లిచ్చే కామధేనువా, మమ్ము! తావై రక్షించేటిధరణీధరా ||పొడ|| 2

చెడనీక బ్రదికించే సిద్ధమంత్రమా, రోగా! లడఁచి రక్షించే దివ్యౌషధమా,! బడిఁ బాయక తిరిగే ప్రాణబంధుఁడా, మమ్ము! గడియించినట్టి శ్రీవేంకటనాథుఁడా ||పొడ|| 3

రామక్రియ అటతాళం

కంటిఁగంటి నిలువుచక్కనిమేను దండలును నంటుఁజూపులను జూచే నవ్వుమోము దేవుని ||పల్లవి ||

కనకపుఁబాదములు గజ్జెలు నందెలును! ఘనపీతాంబరము పైకట కటారి! మొనసియొడ్డాణపు మొగవుల మొలనూలు! ఒనర నాభీకమల ముదరబంధములు ||కంటి|| 1

గరిమ వరద హస్తకటి హస్తములును! సరస నెత్తినశంఖచక్రహస్తములు! ఉరముపై కౌస్తుభ మొప్పగుహారములు! ....................... ||కంటి|| 2

కట్టిన కంటసరులు ఘనభుజకీర్తులు! కట్టాణిముత్యాల సింగారనామము! నెట్టన శ్రీవెంకటేశ నీకుఁ గర్ణపత్రములు! నట్టెసిరసుమీఁద నమరే కిరీటము ||కంటి|| 3

శేషా. వ్రాఁతప్రతి. 26

భూపాళం

పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా! వేవేల కితని నింక వేమాఱునుం బాడి ||పల్లవి||

హరినామములే పాడి అతనిపట్టపురాణి! ఇరవై మించినయట్టియిందిరఁ బాడి! సరస నిలువంకలాను శంఖచక్రములఁ బాడి! వరదకటిహస్తాలు వరుసతోఁ బాడి ||పావ|| 1

ఆదిపురుషునిఁ బాడి అట్టే భూమిసతిఁ బాడి! పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి! మోదపుబ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి! ఆదరానఁ గంబుకంఠ మంకెతోఁ బాడి ||పావ|| 2

శ్రీవెంకటేశుఁ బాడి శిరసుతులసిం బాడి! శ్రీవత్సముతోడురముఁ జెలఁగి పాడి! లావుల మకరకుండలాలకర్ణములు పాడి! ఆవటించి యితనిసర్వాంగములుఁబాడి ||పావ|| 3

అన్న అధ్యా.173 ఱేకు.

స్వామియుభయుమాన్తము

సామంతం

ఇందఱికి నభయంబు లిచ్చుచేయి కందువ లగుమంచి బంగారుచేయి ||ఇంద||

వెలలేనివేదములు వెదికి తెచ్చినచేయి! చిలుకుగుబ్బలిక్రిందఁ జేర్చుచేయి! కలికియగు భూకాంతఁ గౌఁగిలించినచేయి! వలమైనకొనగోళ్ళ వాఁడిచేయి ||ఇంద|| 1

తనివోక బలిచేత దాన మడిగినచేయి! ఒనరంగ భూదాన మొసఁగుచేయి! 27

మొనసి జలనిధి యమ్ముమొనకుఁ దెచ్చినచేయి! యెనయ నాఁగేలు ధరియించుచేయి ||ఇందు|| 2

పురసతుల మానముల పొల్లచేసినచేయి! తురగంబుఁ బరపెడిదొడ్డచేయి! తిరువెంకటాచలాధీశుఁడై మోక్షంబు! తెరువు ప్రానుల కెల్లఁ దెలిపెడిచేయి ||ఇందు|| 3

llవాల్యుం 215 పుట.

స్వామి మహిమలు

శంకరాభరణం పల్లవి

ఎటువంటివాఁడవో నీమహిమ లెట్టుదెలియవచ్చును! నిటలలోచనుఁడు అజుఁడు తెలియలేరు ని న్నెట్టుదెలిసేరు మానవులు ||పల్లవి||

తిరుమలనంబి తాతాత యున్ననాఁడె తెలిసెఁబో మీ పెద్దతనములు! కురువనంబిగారి చేతిబంకమట్టి పువ్వులు కొన్ననాఁడె తెలిసె మీ భోగము! మఱియు ననంతాళువారి చెఱువుగట్ట మున్నుమోయంగా దెలిసె మీనటనలు! గరుడగంభముకాడ కాసు కొక్కవరమిచ్చి గడియించఁ దెలిసె మీసంపద ||ఎటు|| 1

తొండమాంజక్రవర్తికి సంపద తొలుత నియ్యగాఁ దెలిసె మీయివులు! అండయెఱుకువారి కొఱ్ఱచేనియెన్ను లారగించగాఁ దెలిసె మీరుచులు! వుండి గొల్లలకావిళ్ళపాలెల్ల 28

వుట్టుకోఁగఁ దెలిసె మీనేమములు! దండిగ సంపంగిమాఁకుల నడిపించ దైవరాయ తెలిసె మీవిద్యలు ||ఎటు|| 2

మును దాసు తిమ్మన్న తుంబురుకొండకు మోక్ష మియ్యఁగా దెలిసె మీబుదులు! పనివడి తాళ్ళపాక అన్నమయ్యగారి పదములలోఁ దెలిసె మీవోజలు! యెనయ శ్రీవెంకటనాథ యలమేల్మంగ నెద నుంచఁగాఁ దెలిసె మీగోప్యము! వెనుకొని పరుషవారి కెదురు వోయి వెంటరాఁగాఁ దెలిసె మీరాజసము ||ఎటు|| 3

శేషా. వ్రాఁతప్రతి.

బౌళి

ఎంతమాత్రమున నెవ్వరు దలఁచిన అంతమాత్రమె నీవూ అంతరాంతరము లెంచి చూడఁ బిండంతె నిప్పటి యన్నట్లూ ||ప||

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుం డని! పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మ మనుచు! తలఁతురు మిము శైవులు తగినభక్తులను శివుఁ డనుచు! అలరి పొగుడుదురు కాపాలికులు ఆదిభైరవుఁ డనుచు ||ఎంత|| 1

సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీ వనుచు! దరిసెనముల మిము నానావిధులను తలఁపులకొలఁదుల భజింతురు! సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలఁచినవారికి నల్పం బవుదువు! గరిమల మిముమే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు ||ఎంత|| 2

నీవలనఁ గొఱఁత లేదు మఱి నీరుకొలంది తామరవు! ఆవల భాగీరథిదరిబావుల అజలమే వూరినయట్లు! 29

శ్రీవెంకటపతి నీవైతే మముఁ జేకొనివున్నదైవ మని! యీవల నే నీశరణనియెద నిదియె పరతత్వము నాకు ||ఎంత|| 3

అన్న అధ్యా. 179 ఱేకు

బౌళి

ఏమి వలసిన నిచ్చు నెప్పుడైనను ఏమఱక కొలచిన నితఁడే దైవము ||పల్లవి||

ఘనముగా నిందఱికిఁ గన్నులిచ్చుఁ గాళ్ళిచ్చు! పని సేయఁజేతు లిచ్చు బలియుఁడై! తనుఁ గొలువు మని చిత్తము లిచ్చుఁ గరుణించి! వొనర లోకాన కెల్ల నొక్కఁడే దైవము ||ఏమి|| 1

మచ్చిక తనుఁ గొలువ మనసిచ్చు మాట లిచ్చు! కుచ్చితములేని కొడుకుల నిచ్చును! చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు! నిచ్చలు లోకాన కెల్ల నిజమైన దైవము ||ఏమి|| 2

వంతమూడి కొలచినఁ బ్రాణ మిచ్చు ప్రాయమిచ్చు! యెంతటిపదవులైన నిట్టె యిచ్చు! వింతవింత విభవాల వెంకటేశుం డిదేమో! యంతరంగమున నుండే అరచేతిదైవము ||ఏమి|| 3

అన్న. అధ్యా.128 ఱేకు.

స్వామిదర్శనము (చూ.22.పుట) ఇక్కడి వర్ణనమువంటిదే పరమ యోగివిలాసమునను స్వామివర్ణన మున్నది.

ఆవరణంబుల కొదియై మిగులఁ గొమరారు వైకుంఠగోపురంబునకుఁ బ్రమదంబుతో మున్ను ప్రణమిల్లి యంతఁ 3O

జనుదెంచి గారుడస్తంభంబు చక్కి వినతుఁడై చెంతఁ గొవ్విరిసాల కేఁగి వలనొప్ప చంపకావరణంబు వేగ వలచుట్టి వచ్చి యాస్వామి పుష్కరిణి తోయంబు లాని యుత్తుంగభామున నాయుహికులపతి యువతారమగుచుఁ దిరుగనిచింతలం దెఱలించు నీడ తిరుగనిచింత కెంతే భక్తి మొక్కి రమణ రెండవ గోపురము దాఁటి లోని కమల మహానసాగార సేవించి నెలకొని యూనందనిలయూఖ్య మగుచు నలువొందు మణి విమానంబు సేవించి పటు మహామణి మంటపంబు సేవించి యట వచ్చి తురగతార్ క్ష్యాహినాయకుల సేవించి నిత్యుల సేవించి కూర్మి నావేళ లోనికి నరుదెంచి యచటి పంచాస్త్రకోటుల భావంబు మించి పంచవిగ్రహముల భాసిల్లి పసిఁడి గజ్జెలు నందియల్ కనకాంబరంబు గొజ్జంగిముత్యాలకుచ్చుకటారి బెడఁగుగాఁ గటిమీఁద బెరసినకేలు నుడుగక వరముల నొసగుకెంగేలు నుదరబంధంబు కేయూరహారములుఁ బొదలుతావుల తట్టుపునుఁగు పైపూఁత కుడి రొమ్ముమచ్చ యక్కున నెలకొన్న కడలికన్నియదివ్యకంఠసరంబు ధళధళదులకించు దరము చక్రంబు బలసి చూపట్టెడుపాణి పద్మములు 31

బింబాధరంబు నొప్పెడు కపోలములు కంబు పోతంబు నెక్కసమాడుగళము మకరకుండలములు మణికిరీటంబు వికసితధవళారవిందనేత్రములు చల్లని చూపును జారునాసికము తెల్లని మెఱుఁగు ముత్తియపు నామమును గలిగి యెంతయును శృంగారభావంబు మలయు నయ్యలమేలుమంగా మనోజు.

పరమయో 8 ఆశ్వా.

బంగారుగజ్జెలుఁ బసిఁడియందియలు జెంగావిచాయమించినపైఁడి వలువ మొగవులమొలనూలు ముత్యాలకుచ్చు బిగిసి చూపటుముప్పిడికఠారంబుఁ గటి ఘటియించిన కరపల్లవంబుఁ బటువరంబుల నిచ్చు పాణి పద్మంబు వలమురి నెరవాఁడి వలయపుఁగత్తి బలసి చూపట్టెడు పాణియుగ్మమును బొడ్డుమానికము కెంపులబిటారించు నొడ్డాణమును మించును దరబంధంబు భుజకీర్తులును బాహుపురులు తాయెతులు యక్కుననెలకొన్నయలమేలుమంగ యక్కజంబగువైజయంతిసరంబుఁ దారహారములు పుత్తడిజన్నిదములుఁ జారుమౌక్తికంఠసరముఁ బేరురము కంబుకంధరమును గౌస్తుభమణియు బింబాధరంబు నొప్పెడికపోలము మందస్మితంబును మకరకుండలము 32

లిందుబింబము హసియించునెమ్మోము తెలిదమ్మికన్నులుఁ దిలనాసికంబుఁ దెలిమించునాణిముత్తియపునామంబు కనకపిప్పలదళ కలిత పట్టంబు ననుపమమణిమయం బగుకిరీటంబు గలుగు శ్రీవేంకటగ్రావాధినాథు." పరమయో 2అశ్వా.

పైయన్నింటను స్వామిముఖమున ముత్యాలనామ మున్నట్లు వర్ణన మున్నది, అది యాభరణరూపము.

స్వామికి శుక్రవారమునాఁటి తిరుమజ్జనోత్సవమును అన్నమయయుఁ దత్పుత్రులును బదింబదిగా వర్ణించిరి.

అది యినాఁట నిట్లు సాగుచున్నది:- పునుఁగుతైలపుటభ్యంజ నమును క్షీరఘటాభిషేకమును కుంకుమపూవు, కస్తురి, కప్రము, నూఱి బంగరు గిన్నెలనించిన యునుకుతో నలుఁగును న్వల్ప జలాభిషేకమును అనుకు నలుఁగుతో గలసిన యీతీర్ధము స్వామి పాదతీర్థముగా సేకరమయిన మీఁద విరివిగా జలాభిషేకమును జరుగును. తలకుఁ దడియారఁగాఁ బొడివలువ పిడిచుట్టు చుట్టి దివ్యమంగళ విగ్రహము నెల్లఁ బొడివలువతో దుడిచి నీరు పూఁతగా ముఖమున దూమెఱుఁగుగా సర్వాంగమున పునుఁగు తైలముపూఁత ముఖమునఁ గర్పూర చూర్ణముతో నామము సాఁతుట యానామమునకు నడుమఁ గస్తూరీ తిలకము దిద్దుట అలమేల్మంగ హారము (మంగతాళి) మొదలగు దివ్యాభరణములను పీతకౌశేయములను ధరింపించుట జరగును. తాళ్లపాకవారినాఁట నిట్లు సాగెడిది:-

ఆపాదమస్తకము వునుఁగు తైలవుటభ్యంజనముచేసి కుంకుమపూవు మొదలుగువాని యనుకుతో నలుఁగువెట్టి పన్నీటను శుద్దోదకమునను జలకమార్చి తుడిచి సర్వాంగములరదు నారఁగాఁ గర్పూరధూళిచల్లి మేదించి దానిపై నారఁగా బునుఁగు తైలమురాచి 33

ముత్యాలతిరునామము మంగతాళి మొదలగు దివ్యాభరణములను వస్త్రములను పుష్పహారములను నలంకరించు టయ్యెడిది.

అభిషేకసయువునఁ దాళ్ళపాక వారు దగ్గఱనుండి నలుఁగుపాటలు అభిషేకపుఁబాటలు మొదలుగునవి పాడుట, అభిషేకానంతరము వారి కొక యభిషేకవుఁబన్నీటి చెంబును తాంబూలచందనాదులను నొసగి సత్కరించుట జరిగెడిది. తిరుమజ్జ నోత్సవమిట్లు శాశ్వతముగా జరుగుటకుఁ దాళ్ళ పాకవారే స్వామి కగ్రహారముల నర్పించిరి.

శుక్రవారాభిషేకదర్శనము

కంటి శుక్రవారము గడియ లేడింట! అంటి అలమేల్మంగ అండనుండేస్వామిని ||పల్లవి||

సొమ్ములన్నీ కడఁబెట్టి సొంపుతో గోణముగట్టి! కమ్మని కదంబము కప్పు పన్నీరు! చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి! తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండేస్వామిని ||కంటి|| 1

పచ్చకప్పురమె నూఱి పసిఁడిగిన్నెల నించి! తెచ్చి శిరసాదిగ దిగ నలఁది! అచ్చెరపడిచూడ అందరికన్నుల కింపై! నిచ్చమల్లెపూవు వలె నిటు తా నుండేస్వామిని ||కంటి|| 2

తట్టుపునుఁగె కూర్చి చట్టలు చేరిచి నిప్పు! పట్టి కరఁగించి వెండిపళ్యాల నించి! దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది! బిట్టువేడుక మురియుచుండే బిత్తరిస్వామిని ||కంటి|| 3

శేషాచార్యులవారి వ్రాఁతప్రతి. 34

శ్రీరాగము

ఒకపరి కొకపరి కొయ్యారమై మొకమునం గళలెల్లా మొలచినటుండె ||పల్లవి||

జగదేకపతిమేనఁ జల్లినకర్పూరధూళి! జిగిగొని నలువంకఁ జిందగాను! మొగిఁ జంద్రముఖి నురమున నిలిపెఁ గనుక! పొగరు వెన్నెల దిగఁబోసినట్లుండె ||ఒక|| 1

పొరి మెఱుఁగుఁజెక్కులఁ బూసినతట్టు పునుఁగు! కరఁగు యిరుదెసలఁగారఁగాను! కరిగమన విభుఁడు గనక మోహమదము! తొరిగి సామజసరి దొలఁకిన ట్లుండె ||ఒక|| 2

మెఱయ శ్రీ వేంకటేశుమేన సింగారముగాను! తఱచయినసొమ్ములు ధరియించఁగా! మెఱఁగుఁబోడి యలమేలుమంగయుఁ దాను ! మెఱుపు మేఘముగూడి మెఱసిన ట్లుండె ||ఒక|| 3

శ్రీ రాగము

పులుగడిగినయట్టి పురుషోత్తముఁడు వాఁడే ఎలమి నారతులు మీ రెత్తరే దేవునికి ||పల్లవి||

గొప్పయింద్రనీలాలకొండ మంచు గప్పినటు! నెప్పు మింట పాలవెల్లి నెరసినట్టు! విప్పు నీలమేఘముపై వెన్నెల గాసినయట్టు! కప్పరధూళి మేనఁ గప్పిరి దేవునికి ||పులు|| 1

నిండు నైరావతముపై నీలిజగ గప్పినట! వెండిమేడపైఁ జీఁకటి విడిసినటు! పుండరీకపుఁగొలను పారిఁ దేం ట్లూఁగినటు! మెండగు తట్టుపునుఁగు మెత్తిరి దేవునికి ||పులు|| 2 35

అదె నల్లగలువల నకరువు లుండినట్టు! మెదిగి కస్తూరిభూమి మేరువున్నట్టు! యెదుట శ్రీ వెంకటేశునెద నలమేల్మంగను! గుదిగుచ్చి సొమ్ములెల్ల గుప్పిరి దేవునికి ||పులు|| 3

పెదతిరుమల. శృ. నం94 ఱే

శంకరాభరణ

ఏమని చెప్పుదుమమ్మ యీతని సౌభాగ్యము కోమలపు జవ్వనము గుఱుతై నట్టుండె ||పల్లవి||

ఒటుచుఁ గప్పురకాపు ఊడిగపువారెల్లా! అట్టె దేవునికి నలఁదగాను! దట్టముగ మంచి తెల్లఁదామెరపువ్వునకు! ముట్టి అవయవములు మొలచినట్టుండె ||ఏమని|| 1

తనినొంద గిన్నెలతోఁ దట్టుపునుఁగులు దెచ్చి! పొలువొంద దిరుమేనఁ బుయ్యగాను! పనివడి గొప్పనిడుపాటినేరేడుఁబండు! కనుపట్టు పురుషాకార మైనట్టుండె ||ఏమని|| 2

అలమేలుమంగ నురమందుఁ బెట్టి సొమ్ములెల్లా| పలువిధముల నించి భావించగాను! అలర శ్రీవేంకటేశుం డనెడి పుప్పొడిరాశి! వెలయ మరుఁడు ముద్రవేసిన ట్టుండె ||ఏమని|| 3

నేఁడు స్వామినామపుఁగర్పూరచూర్ణమును తిలకపుఁగస్తూరిని బునుఁగుతైలమునుగలపి శ్రీపాదరేణు వని వేఱుగాను అభిషేకపుసుగంధి తీర్ధమును బాదతీర్థ మనివేఱుగాను భకులకుఁ బ్రసాదించుట జరుగుచున్నది. రేవణూరి వేంకటాచార్యుఁడు రచించిన శ్రీపాదరేణు మాహాత్మ్యమున స్వామి మే నెల్ల మేదించిన, మేదించుటలో శ్రీపాదము లందుఁ దొరిగిన, కర్పూరధూళితోడ పునుఁగుతైలమును, దన్మిశ్రమయిన పాదతీర్ధమును శ్రీపాదరేణు నామమునఁ బ్రస్తుతిగన్నది. 36

తాళ్ళపాకవారి సంకీర్తనములలో నిప్పటికి నేఁ జూచినంతలో పునుగుతైలముతోడి కస్తూరీకర్పూరమిశ్రితమయిన పాదతీర్ధమే ప్రస్తుతమయినది గాని నేటి శ్రీపాదరేణుసంకలనరీతిగాని శ్రీపాదరేణునామముగాని కానరాలేదు.ః ఒక సంకీర్తనము:-

శంకరాభరణము

శ్రీహరిపాదతీర్ధంబే చెడనిమందు! మోహపాశాలు గోసి మోక్షమిచ్చే మందు ||పల్లవి||

కారమై కంటగించని కడుఁ జల్లనిమందు! నూఱనికాచనియట్టి నున్ననిమందు! కోరికతో వెలవెట్టి కొనితేవల్లనిమందు! వేరువెల్లంకులు కూర్చనట్టి వెందువోనిమందు ||శ్రీహరి|| 1

గుఱుతైనరోగములు గుణముచేసేమందు! దురితములు పెడఁబాపే దొడ్డమందు! నిరతముబ్రహ్మదులు నేరుపుతో సేవించేమందు! నరకము సారనట్టినయమయినమందు ||శ్రీహరి|| 2

పొంకముతో భయములు పొందనియ్యనిమందు! మంకు బుద్ధులు మాన్పి మన్నించేమందు! పంకజాక్ష వేంకటరమణ ప్రపన్నునిమందు! సెంకించక తనదాసులఁ జేపట్టేమందు ||శ్రీహరి|| 3

అన్నమాచార్యుని సంకీర్తనములలో గుర్తుస్తుతిపరములుగా రచనలు చాలఁగలవుగాని ఆగురువు పేరేమో సరిగ్గాఁ దెలియరాలేదు. ముద్రాధారణానంతరము వైష్ణవు లీతని బంతి నిడుకొని భుజించిరట (చూ 28 పుట) అన్నమాచార్యునినాఁడే యీ వంశమువారు వైష్ణవు లయిరి. ఈ విషయము నీతిని పెద్దమనుమఁడు చినతిరుమలాచార్యుఁ డిట్లు చెప్పుకొన్నాఁడు. 37

దేసాళం

ఎట్టిహితోపదేశకుం డెటువంటి దయాళువు! అట్టే తాళ్ళపాకన్నమాచార్యుఁడు ||పల్లవి||

పచ్చితామసుల మమ్ముం బరమసాత్వికులఁగా! నిచ్చటనే చేసినాఁడు యెంతచిత్రము! ఇచ్చగించి మాకులాన నెన్నఁడు లేనివైష్ణవ! మచ్చముగాఁ గృపసేస నన్నమాచార్యుఁడు ||ఎట్టి|| 1

ముదిరినపాపకర్మములు సేసినట్టి మమ్ము! యెదుటఁ బుణ్యులఁ జేసె నెంతసోద్యము! కదిసి యేజన్మానం గాననిసంకీర్తన! మదన నుపదేశించె నన్నమాచార్యుఁడు ||ఎట్టి|| 2

గడుసుందనపుమమ్ముఁ గడువివేకులఁ జేసి! యిడుమ లెల్లాఁ బాపె నేగురుఁడు! నడుమనే యెన్నడుఁ గానని శ్రీ వెంకటనాథు! నడియాలముగ నిచ్చె నన్నమాచార్యుఁడు ||ఎట్టి|| 3

చినతిరు, అధ్యా. 9 ఱేకు.

అన్నమాచార్యచరిత్రమున (చూ 28 పుట.) నిక్కడఁ గొంత గ్రంథ పాత మున్నది. అందుఁగొన్నియేండ్లకాల మేమో గురుసన్నిధి నన్నమాచార్యుఁ డుండుట, అతని వెదకికొనుచు నాతనితల్లి తిరుమలకు వచ్చి కొడుకును జూచి యింటికి రమ్మని పిలుచుట, అతఁడు సమ్మతింపకుండుట, అందుపై గురుఁడేవో దివ్యోపదేశములు చేసి యింటికిఁ బొమ్మని మీ వంశమునఁ బుట్టబోవువారు మహనీయులు కాఁగలరని యాశీర్వదించుట, ప్రధానముగా నుండఁదగినకథాంశము. తొలుత నింటికిఁబో సమ్మతింప కున్నను గుర్వాజ్ఞగనుక నన్నమాచార్యుం డెట్టకేల కందుకు సమ్మతించెను. ఈ సందర్భమున సంకీర్తనము లున్నవి: 38

మలవూరి

సర్వోపాయముల జగతి నా కితండె వుర్విధరుఁడు పురుషోత్తముం డితండె ||పల్లవి||

సకల గంగాదితీర్థస్నానఫలము లివి స్వామి పుష్కరిణిజలమె నాకు ! సకలపుణ్య క్షేత్రవాసయాత్ర లివి సరివేంకటాచలవిహార మిదియొ ! సకలవేదాధ్యయన శాస్త్రపాఠంబు లివి శౌరిసంకీర్తనం బిదియె నాకు ! సకలకర్మానుష్టానము లితని కిచ్చటఁ జాతుపడికైంకర్య మిదియె ||సర్వో|| 1

ఉపవాసతపము లివి యితని ప్రసాదంబు లొగి భుజించుటె నాకు దినదినంబు ! జపరహస్యోపదేశంబు లితనిపాద జలములు శరణనేటి సేవయొకటె ! ఉపమింపఁ బుణ్యపురుషులదర్శనము నాకు నొగి నిచటిబహువృక్షదర్శనంబు ! యెపుడుఁ బుణ్యకథాశ్రవణంబు లిచ్చోటి యెన్నఁ గలబహుపక్షి కలకలంబు ||సర్వో ||2

తలఁపుగల యోగంబులందు శ్రీవైష్ణవులఁ దగులు సంవాససహాయోగంబు ! వెలయు నిండుమ హెూత్సవంబు లిన్నియు నితని విభవంబు లెసఁగుతిరునాళు నాకు ! చెలఁగి యిటుదేవతాప్రార్థనింతయు నాకు శ్రీవెంకటేశ్వరుని శరణాగతి అలరునాసంపదలు యితనిపట్టపురాణి అలమేలుమంగకడగంటిచూపు ||సర్వో|| 3

అన్న అధ్యా, 133 ఱేకు. 39

భౌలి

పాడేము నేము పరమాత్మ నిన్నును వేడుక ముప్పదిరెండువేళల రాగాలను || పల్లవి ||

తనువే వొళవు తలయే దండెకాయ ! ఘనమైనవూర్పులు రెండు కట్టినత్రాళ్ళు ! మనసె నీ బద్దితాడు మఱి గుణాలె జీవాళి ! మొనసినపుట్టుగె మూలమైనకరడి || పాడే || 1

పాపపుణ్యా లిరువంక పైఁడివెండియనుసులు పైపైఁ గుత్తికె మేటి పైచనిగె ! కోపులనాలికె లోనఁ గుచ్చికట్టినట్టిత్రాడు ! చూపరాని సంసారమె సూత్రపుఁగణిక || పాడే || 2

జీవునకు నీదండె సేసిన వాఁడవు నీవు ! వావాతిమాటలే నీపై వన్నె పదాలు ! ఈవే మాకు నిహపరా లిచ్చితివి మెచ్చితివి ! శ్రీవెంకటేశ నీవే చేకొన్నదాతవూ || పొడే || 3

అన్న అధ్యా. 281 ఱేకు.

గుండక్రియు

దాఁచుకొని పాదాలకుఁ దగ నేఁజేసినపూజ లివి ! పూఁచి నీకీరితిరూపు పుష్పము లివి యయ్యా || పల్లవి ||

ఒక్కసంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ ! తక్కినవి భండారాన దాఁచి వుండనీ ! వెక్కసము నీనామము వెలసులభము ఫల మధికము ! దిక్కై నన్నేలితి వింక నవి తీరనినాధనమయ్యా || దాచు || 1

నానాలికపై నుండి నానాసంకీర్తనలు ! పూని నాచే నిన్నుఁ బొగడించితివి ! 40

వేనామాల వెన్నుండా వినుతించ నెంతవాఁడ ! కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా || దాచు || 2

ఈమాట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని ! చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాఁడఁ గాను ! నేమానం బాడేవాఁడను నేరము లెంచకుమీ ! శ్రీమాధవ నే నీదాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా || దాచు || 3

అన్న అధ్యా. 169 ఱేకు.

లలిత

బల్లిదులు నీకంటెఁ బరు లున్నారా నన్నుఁ ! దొల్లిటి బారి నింకం దోయకు మోయయ్య || పల్లవి ||

చిక్కులభవములఁ జేరం జిక్కి వోపలేక ! నిక్కి నీమఱుఁగు చొచ్చి నిలిచితివి ! అక్కజమై యల్లనాఁటి అప్పలకర్మము లెల్ల ! ఇక్కడనే చుట్టుముట్టీ నేమి సేతునయ్య || బల్లి || 1

లచ్చి సంసారమునకు లగ్గ మచ్చితీరలేక ! యిచ్చట నిన్నుఁగొలిచి యొక్కువైతిని ! పొచ్చముల నల్ల నాఁటి వూఁటదీర దని కొన్ని ! బచ్చన బందాలు వచ్చెఁ బాపఁగదవయ్య || బల్లి || 2

అంచల నింద్రియముల కరివెట్టి పెట్టలేక ! ముంచి నీపాదలకు మొఱవెట్టితి ! పొంచిన శ్రీవేంకటేశ భువనరక్షకుఁడవు ! పంచలనున్నాఁడ నన్నుఁ బాలించవయ్య ||బల్లి || 3

అన్న అధ్యా, 361 కుఱే

సకల వేదాంతశాస్త్రము నన్నమయ యుధ్యయనముగావించెను. ఈ శఠకోప ముని అహెూబలమఠ ప్రతిష్టాపనాచార్యులయిన యాదివన్ శఠకోప మునీశ్వరు లగుదురు. అన్నమయనాఁట నీశఠకోపయతులే వర్తిల్లిరి. ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలవారీశఠకోపయతిని సన్నుతించిరి. (చూ. ఆశ్వా 7 వచనము) అన్నమాచార్యుఁ డీయతివర్యునిట్లు కీర్తించెను. 41

భైరవి

చూడుఁ డిందఱకు సులభుఁడు హరి ! తోడునీడ యగు దొరముని యితఁడు || పల్లవి ||

కైవల్యమునకు గనకపుఁదాపల ! త్రోవై శ్రుతులకుఁ దుదిపదమై ! పావన మొకరూపమై విరజకు ! నావై యున్నాఁ డిదే యితఁడు || చూడు || 1

కాపాడఁగ లోకములకు సుజాన ! దీపమై జగతికిఁ దేజమై ! పాపా లడపఁగ భవపయోధులకు ! తేపై యున్నాఁ డిదేయితఁడు || చూడు || 2

కరుణానిధికి రంగపతికిఁ గాంచీ ! వరునకు వేంకటగిరిపతికి ! నిరతి నహెూబలనృకేసరికిఁద ! త్పరుఁ డగుశఠకోపముని యితండు || చూడు || 3

అన్న అధ్యా. 1 వాల్యుం.

అన్నమాచార్యుఁడు మంచిప్రాయముననే రామాయణమెల్ల కీర్తనాత్మకముగా వెలయించెను. (చూ. 30 పుట) అన్నమాచార్యుని సంకీర్తన ములలో రామాయణకథా ఘటితములు చాలఁగలవు. అన్నమయ సంకీర్తన పద్ధతి జగన్మోహనమై ప్రఖ్యాతికెక్కెను. అది విని సాళ్వనరసింగ రాయఁ డన్నమయదర్శన మపేక్షించెను. ఈ నరసింగరాయఁడు టంగుటూరి[7] పాలకుఁ డని నాళీకబాంధవాన్వయుఁ డని యిం దున్నది (చూ. పుట 31) అతఁడు చంద్రవంశమువాఁ డని శాసనములందును గ్రంథములందు నున్నది. ఇందునాళిక 'బాంధవా' ఉండుట 'శాత్రవా' ఉండుటకు వ్రాఁతగాని చేతప్పు గాఁబోలును. నరసింహరాయఁడు విజయనగరపుఁ 42

బ్రథమరాజ వంశ్యుఁడగు విరూపాక్షరాయులతర్వాత నావంశము నుత్సారించి రాజ్యమాక్రమించుకొన్నాఁడు. ఇంచుమించుగా నాతఁ డన్నమయవయసు వాఁడు. అతఁడు తొలుత దండనాథుఁడుగా విద్యానగరరాజులక్రిందనుండి యారాజుల దౌర్బల్యముచే సనసన్నగఁ బెంపొంది తుదికి విద్యానగరాధీశ్వరుఁ డయినాఁడు. విద్యానగర మాక్రమించుకొనక పూర్వము క్రీ. 1450 ప్రాంతముల నీతఁడు పొత్తపినాఁటిలోని టంగుటూర దండనాథుఁడై ప్రాభవమున వర్తిల్లుచుండఁ బోలును. అన్నమాచార్యచరిత్రమున నాతఁడు 'రాచమూఁకలలో బరాక్రమశాలి' యని కలదు. అతఁ డన్నమాచార్యుని వేఁడికొని తనయూరికిఁ బిలుచుకొనిపోయినాఁడు. అపుడు "శ్రీకృష్ణుమన్ననఁ గ్రీడి భూచక్ర ! మేకచక్రంబుగా నేలినపగిది ! నాలాగు మీ సహాయము నాకుఁ గలుగ ! నేలుదు ధరయోల్ల నేకచక్రముగ" నని తనకోర్కి తెల్సుకొన్నాడు. రాయఁడు నన్నమయయుఁ బొంది పొసఁగి టంగుటూరఁ గొన్నాళ్లుండిరి. అన్నమయ యాశీస్సుచే శ్రీ వెంకటేశ్వరస్వామి దయచే నరసింగరాయఁడు విజయనగరరాజ్య మాక్రమించుకొనెను. తిరుపతి శాసనములఁబట్టియు సాళ్వాభ్యుదయమునుబట్టియు నాతఁడుకొన్నాళ్లు తిరుపతిదగ్గఱిచంద్రగిరిలో రాజ్య మేలినట్లు తెలియనగును. టంగుటూ రాతని జన్మస్థలమో దండనాయకతాస్థానమో కాఁబోలును.

విజయనగరరాజ్యపు విప్లవ (విరూపాక్ష చంద్రశేఖరరాయల) కాలమునఁ గాఁబోలును కపిలేశ్వర గజపతి యొకమాఱును, పురుషోత్తమ గజపతి యింకొకమాఱును విజయనగరముమీఁదికి దండెత్తి వచ్చిరి. తొలితూరి కొంతకప్పము చెల్లించి విరూపాక్షరాయఁడు గాఁబోలును విజయనగరమును రక్షించుకొనెను. రెండవతూరి పురుషోత్తమగజపతికి సాళ్వనరసింహరాయఁ డుదయగిరిరాజ్యమును నొసంగి విజయనగరమును గాపాడఁగలిగెను.

కపిలేశ్వరజగపతి :-

ప్రసహ్యకర్ణాటమహీపతేఃపరీం నిరుధ్యవిద్యానగరీంనిజైర్బలైః! సమున్నతం మానమివోచ్ఛయంకరం సమాదదే కర్కశచక్రవిక్రమః! 43

పురుషోత్తమగజపతి :-

యస్మైనిత్యతరప్రతాపదహన జ్వాలాయమానధ్వజ ! స్తంభాబద్ధకుసుంభరక్తవసన ప్రేక్షావిభగ్నద్విషే ! సంధాయాభయయాచనాంజలి మహెూదత్వోదయాద్రింభయా దాత్మానం ముముచే నృసింహనృపతిః కర్ణాటదేశాధిపః || [8]

చరిత్రకారు లీసందర్భము నిట్లు గుర్తించిరి !

"విషయాసక్తుఁడగు విరూపాక్షరాయని నాతని పెద్దకొమారుఁడగు రాజశేఖరరాయలు చంపించెను. (1478) ఇతనిని ఈతని తమ్ముడగు రెండవిరూపాక్షరాయులు చంపించెను. కాని యీ భ్రాతృహంత పరిపాలనము ప్రజల కిష్టమైనది గాదయ్యెను. అతని దండనాయకుఁడగు సాళువనరసింహరాజు సర్వజనులు తనకు అనుకూలురుకాగా రాజును వెడలఁగొట్టి రాజ్యమును ఆక్రమించుకొనెను. అంత నీప్రథమవంశ మంత రించెను. (1487) తర్వాత సాళ్వనరసింహరాజు 1487 నుండి 1490 దాఁక రాజ్యమేలెను."[9]

సాళ్వనరసింగరాయనికి బ్రహ్మహత్యాపాపము చుట్టుముట్టఁగా దానిని మాధ్వమతాచార్యులగు శ్రీపాదరాయలవారు విడఁగొట్టిరట. ఈ బ్రహ్మహత్యకారణముగాఁ దిరపతి వేంకటేశ్వరస్వామియర్చనము నిలిచిపోఁగా వ్యాసరాయలు పండ్రెండేడు స్వామియర్చనము సలిపి, నెమ్మదిగా మరల వైఖానసులఁ జేర్చిరట! శ్రీపాదరాయాష్టకములో నీ శ్లోక మున్నది. 44

శ్రీమద్వీరనృసింహరాయనృపతే ర్భూదేవహత్యావ్యధాం దూరీకృత్య తదర్పితోజ్ఞ్వలమహాసింహాసనే సంస్థితః శ్రీమత్పూర్వ కవాటనామకవురే సర్వేష్టసిద్ధిప్రదః శ్రీ శ్రీపాదయతీంద్ర శేఖరమణి ర్భూయా త్సవః శ్రేయసే.

క్రీ. 1440 నాఁటికి బదునాజేండ్లవాఁడయిన యన్నమాచార్యుఁ డీ రాజోప్లవము లెల్ల నెఱుఁగున్నాడు. నరసింహరాయలప్రార్ధనమునఁ గాబోలును దఱచుగా విద్యానగరమున కరగుచు నక్కడ వెలసియున్న వేల్పులపై పెక్కుసంకీర్తనముల రచించినాఁడు. ఆయాకాలములలో నాతని కక్కడిరాజుల దౌర్జన్యములు ప్రత్యక్షము లగుచుండెడివి. రాజ్యలబ్ధికై నాఁటి రాజులు చేసిన పితృభాతృ పుత్రహత్యాదుల నాతఁడు సంకీర్తనములలో వివరించి విలపించినాఁడు.

శ్రీరాగం

వెఱతు వెఱతు నిందు వేడుకపడ నిట్టి కుఱుచబుద్ధుల నెటు గూడుదునయ్యా || పల్లవి ||

దేహమిచ్చినవానిఁ దివిరి చంపెడువాఁడు ! ద్రోహిగాక నేఁడు దొరయటా ! ఆహికముగ నిట్టి అధమవృత్తికి నే ! సాహసమున నెట్టు చాలుదునయ్యా || కుఱు || 1

తోడఁబుట్టినవానిఁ దొడరి చంపెడువాఁడు ! చూడ దుష్టుఁడుగాక సుకృతియట ! పాడైనయిటువంటి పాపబుదులు సేసీ ! నీడ నిలువ నెట్టు నేరుతునయ్యా || కుఱు || 2

1. దీనిని దొలుత కర్ణాటచరిత్రకారులు గుర్తించిరి. 45

కొడుకు నున్నతమతిం గోరి చంపెడువాఁడు ! కడుఁ బాతకుఁడుగాక ఘనుఁడటా ! కడలేని యిటువంటి కలుషవృత్తికి నాత్మ ! వొడఁబఱపఁగ నే నె ట్లోపుదునయ్యా || కుఱు || 3

తల్లిఁ జంపెడువాఁడు తలఁప దుష్టుడు గాక ! యెల్లవారల కన్న నెక్కుడటా ! కల్లరి యనుచు లోకము రోయుపని యిది చెల్లఁబోనే నేమి సేయుదు నయ్యా || కుఱు || 4

యింటివేలుపు వెంకటేశ్వరుఁ దనవెంట ! వెంటఁ దిప్పెడువాఁడు విభుఁడటా ! దంటనై యాతని దాసానుదాసినై ! వొంటి నుండెద నేమి నొల్లనోయయ్యా || కుఱు || 5

అన్న అధ్యా. 38 ఱేకు.

విజయనగర రాజ్యముమీదికి (కపిలేశ్వర, పురుషోత్తమ) గజపతులు దండెత్తి వచ్చునపుడో యింకెపుడో అన్నమయ విజయనగరములోనో స్వగ్రామముననో ఉండఁగా నాతని దేవతార్చన విగ్రహములను శత్రువు లెత్తుకొనిపోవుటో, స్థలముమార్చు గజిబిజిపాటులో నేమో అయిపోవుటో జరగి కానరాకపోఁగా సంకీర్తనరూపమున నిట్లు విలపించినాఁడు.

బౌళి

ఇందిరారమణుఁ దెచ్చి యియ్యరో మా కిటువలె ! పొంది యీతనిఁ బూజించఁ బొద్దాయ నిపుడు || పల్లవి ||

ధారుణి మైరావణు దండించి రాముఁ దెచ్చి ! నేరువు మించిన యంజనీతనయా ! ఘోరనాగపాశములఁ గొట్టివేసి యీతని ! కారుణ్య మందినట్టి ఖగరాజ గరుడా || ఇంది || 1

నానాదేవతలకు నరసింహుఁ గంభములో ! పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుఁడా ! 46

మానవుఁడౌ కృష్ణుమహిమల విశ్వరూపు ! పూని బండి నుంచుకొన్న పోటుబంట యర్జునా ||ఇంది|| 2

శ్రీవల్లభునకు నశేషకైంకర్యములా ! శ్రీ వేంకటాద్రివైన శేషమూరితి ! కైవసమైన యట్టి కార్తవీర్యార్జునుఁడా యీ ! దేవుని నీవేళ నిట్టి మాకుఁ దెచ్చి యీయరే ||ఇంది|| 3

అన్న. అధ్యా. 373 ఱేకు.

క్రీ 1440 ప్రాంతములనో తర్వాతనో తురుష్కులు గాఁబోలును జరపిన దౌర్జన్యము నన్నమాచార్యుఁ డిట్లు చెప్పి చెప్పి చింతిల్లినాడు.

రామక్రియ

తతిగాని యీపాటు దైవమా విచారించవే ! కతలాయఁ జెప్ప నేఁడు కలికాల మహిమా ||పల్లవి||

తుటుములై భూసురుల తుండెములు మొండెములు ! యిటువలె భూతములు యెట్టు మోఁచెనో ! అటుబాలుల రొదలు ఆకాశమె ట్టోరిచెనో ! కటకటా యిట్లాయఁ గలికాలమహిమా ||తతి|| 1

అంగలార్చే కామినుల యంగభంగపు దోఁపు ! లింగితాన మింటసూర్యుఁ డెటు చూచెనో ! పొంగు నానాజాతిచేత భువన మెట్టానెనో ! కంగి లోక మిట్లాయఁ గలికాలమహిమా ||తతి|| 2

అరుదు గోహత్యలు సేయఁగ దూడ లంగలార్వ ! సరిధర్మదేవ తెట్టు సమ్మతించెనో ! పరధనచూఱ కెట్టు పట్టాయతో లక్ష్మి ! కరుణ యెం దణఁగెనో కలికాలమహిమా ||తతి|| 3

దేవాలయాలు నానాదేశము లెల్లాఁ జొచ్చి ! దేవఁగా నెటుండిరో దేవతలు ! 47

తావు లేలే రాజులకు దయ గొంత పుట్టదాయ ! కావరమే ఘనమాయఁ గలికాలమహిమా ||తతి|| 4

నిరపరాధులఁ జంపి నెత్తురు వారించఁగాను తెరల కెట్టుండిరో దిక్పాలులు ! విరసవర్తను లుండే విపరీతకాలమున గరువాలుం గపటాలె కలికాలమహిమా ||తతి|| 5

వుపమించి దంపతులు వొకరొకరినిం జూడ ! చపలదుఃఖములతో సమయఁగాను ! తపములు జపములు ధర్మము లెం దణఁగెనో ! కపురుంబాపాలు నిండెఁ గలికాలమహిమా ||తతి|| 6

తలలు వట్టీడువఁగాను తల్లులు బిడ్డల వేయ ! తలఁపెట్టుండెనో యంతర్యామికి ! మలసి ముక్కులు గోయ మరుఁ డెట్టు వోరిచెనో ! కలఁకలే ఘనమాయఁ గలికాలమహిమా ||తతి|| 7

దీనతలోఁబడి గుండెదిగు లసురుసురులు ! వాని నెట్లు లోఁగొనెనో వాయుదేవుఁడు ! గూనువంచి తల్లి చూడఁ గొడుకుఁ గుత్తిక గోయఁ ! గానఁబడె నింతేసి కలికాలమహిమా ||తతి|| 8

పలుమాఱు నమ్మించి ప్రాణములు గొనఁగాను ! యిలఁ దమలోఁ బ్రాణా లెట్లుండెనో ! నెలవై శ్రీవెంకటేశ నీవే యెఱుంగుదువు ! కలుషమే ఘనమాయఁ గలికాలమహిమా ||తతి|| 9

అన్న. అధ్యా. 373 ఱేకు.

గజపతులు విద్యానగరము నాక్రమించినప్పు డాతఁ డొడ్డెబాస నేర్చుకోవలసినవాఁ డయినాఁడు గాఁబోలును. దీనిని సంకీర్తనమునఁ 48

జెప్పుకొన్నాఁడు:-

మాళవి

అన్నియు నాయందె కంటి నన్నిటివాఁడా నేనె ! మున్నె నా భావముతో ముడిచివేసినది ||పల్లవి||

చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి ! ములిఁగి ముక్తి దలంచి ముక్తుండనైతి ! పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి ! చెలఁగి శ్రీపతి శ్రీవైష్ణువుఁడ నైతి ||అన్ని|| 1

పొసంగఁ బుణ్యము సేసి పుణ్యాత్ముఁడనైతి ! పసలఁ బాపము సేసి పాపకర్ముఁడనైతి ! వెసబ్రహ్మచారినైతి వేఱే యాచారమున ! ముసిఁగి మఱొకాచారమున సన్యాసినైతి ||అన్ని|| 2

వొగి నొడ్జె భాషలాడి వొడ్జెవాఁడ నైతిని ! తెగి తెలుంగాడ నేర్చి తెలుఁగు వాఁడనైతి ! అగడై శ్రీవెంకటేశ అన్నియు విడిచి నేను ! తగు నీదాసుండనై దాసరినైతి ||అన్ని || 3

అన్న. అధ్యా, 266 ఱేకు.

విజయనగరరాజ్య ప్రధానరాజధాని విజయనగరమే అయినను నరసింహరాయఁ డందు స్థిరవాసముచేయలేదేమో ! రాజ్యసర్వస్వాక్రమణా నంతరమో తత్పూర్వమో కొన్నాళ్ళాతఁడు గొప్పదుర్గమగు పెనుగొండలోఁ గూడ నుండెను గాఁబోలును. అన్నమాచార్యునిఁ బెనుగొండకు రావించుకొని సంకీర్తనములు వినిపింపవేఁడెను.

అన్నమయపాడుట

తేనెలపై తేట తిన్నని చెఱకు పానకముల నేరుపణిచిన మేలు 49

చక్కెరలో తీపు చల్లఁదెమ్మెరలు చిక్కని కపురంబు జీవరత్నములు కలయమృతంబు మీఁగడమీదిచవులు చిలుకుచుఁ గవు లెల్లఁ జేయెత్తిమ్రొక్క (చూ. 33 పుట)

నన్నమయపాడెను. తిరుమలాచార్యుఁడుగాఁబోలును అన్నమాచార్యు సంకీర్తనముల నిట్లు సన్నుతించెను.

సురలకు నరులకు సొరిది వినవిన ! అరుదు తాళ్ళపాక అన్నమయ్య పదములు ||పల్లవి||

చక్కెరై చవిచూపీ జాలై తావి చల్లీ ! నక్కజపుమాఁతువజ్రాలై మెఱసీని ! నిక్కుటద్దములై మానిలువు నీడలుచూపీ ! నక్కర తాళ్ళపాక అన్నమయ్య పదములు ||సుర|| 1

పన్నీరై పైఁబూసీఁ గప్రంబై చలువ రేఁచీ ! మిన్నగల ముత్యము లై మెయినిండీని ! వెన్ను బలములై మావెంట వెంటఁ దిరిగీని ! అన్నిట తాళ్ళపాకాన్నమయ్య పదములు ||సుర|| 2

నెట్టన వేదాంతములై నిత్యములై పొడచూపీ ! పుట్టుతోనె గురువులై బోధించీని ! గట్టి వరాలిచ్చే శ్రీవేంకటనాథుని మెప్పించీ ! నట్టె తాళ్ళపాక అన్నమయ్య పదములు ||సుర|| 3

శేషా. వ్రాఁతప్రతి.

వానిని విని యానందపరవశుఁడై నరసింహరాయఁ డాచార్యునిఁ జాల సత్కరించెను. పచ్చలకడియాలు మొదలుగా నాభరణాంబరాదు లొసఁగెను. అన్నమాచార్యుల కాలముననే తాళ్ళపాకవారికి అగ్రహారము లెన్నో ఉన్నట్టున్నవి. ఏలనఁగాఁ దత్పుత్రుఁడు పెదతిరుమలయ్య చాలా ఆగ్రహారములను స్వామికి నమర్పించెను. అందుఁ గొన్నియేని 50

యన్నమాచార్యుఁడు నరసింగరాయాదులవల్ల నార్జించి యుండును. అన్నమాచార్యచరిత్రలో 43 పుటలో ని ట్లున్నది. "వెంకటాద్రిచెంగటను తనయగ్రహారమై తరుచునున్న[10] మరులుంకు (?) నొకజీడిమామిడిదాన"

అన్నమాచార్యుఁడు రాజసముతోఁ జాల వైభవముతోఁ గొన్నాళ్ళు వెలుఁగొందెను. (చూ 35 పుట).

అన్నమయ శృంగారకీర్తనలు

ఈ రాయఁడు మరల నన్నమాచార్యుని నొకనాఁడు పిలిపించి స్వామివారిపై రచించిన శృంగారసంకీర్తనములు గొన్ని పాడవేఁడెను. అన్నమయ పాడెను. (చూ పుట 36) అందు:-

చెలులార వెంకటశిఖిరినాయకుని “కలికికిఁ గడగంటఁ గనుపట్టునెఱుపు చెలువ మేగతి నుండెఁ జెప్పరే" యనిన "నలువునఁ బ్రాణేశునాటిన చూపు నిలువునఁ బెఱుక నూనిన శోణితంబు తలపోయఁ గాదుగాదా యన్నపదము పలుమఱుఁ బాడించి పాడించి చొక్కినాఁ" డట.

అశృంగార సంకీర్తనమిది.

నాదనామక్రియ

యేమొకో చిగురుటధరమున యెడనెడఁ గస్తురినిండెను ! భామిని విభునకు వ్రాసినపత్రిక కాదుగదా ||పల్లవి||

కలికి చకోరాక్షికిఁ గడకన్నులు గెంపై తోచిన ! చెలువం బిప్పుడిదేమో చింతింపరె చెలులు ! నలువునఁ బ్రాణేశ్వరుపై నాటిన యాకొనచూపులు ! నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు కాదుగదా ||ఏమొ|| 1 51

పడతికి చనుఁగవమెఱుఁగులు పైపైఁ బయ్యద వెలుపల ! కడుమించిన విధమేమో కనుఁగొనరే చెలులు ! ఉడుగని వేడుకతోఁ బ్రియుఁడొత్తిన నఖశశిరేఖలు ! వెడలఁగ వేసవికాలపు వెన్నెల కాదుగదా ||ఏమొ|| 2

ముద్దియచెక్కుల కెలఁకుల ముత్యపుజల్లుల చేర్పుల ! వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు ! గద్దరి తిరువేంకటపతి కౌఁగిటయధరామృతముల ! అద్దిన సురతపు వేళల అందము కాదుగదా ||ఏమొ|| 3

అన్న. శృంగా, 14 ఱేకు.

రాజధిక్కారము

రాయఁడు గర్వించి మైమఱచి వెంకటపతిమీఁది పదములవంటి పదములు నామీఁదఁ జెప్పమని కోరఁగా అన్నమాచార్యుఁడు "హరి ముకుందునిఁ గొనియాడు నాజిహ్వ నినుఁ గొనియాడంగ నేర" దని చెప్పి తిరస్కరించినాఁడు. (చూ. 36 పుట.) ఇట్టికథయే తిరుమళిశై అళ్వార్ల చరిత్రమునను గలదు. (చూ.పరమ. ఆశ్వా2. పుట 92.)

లలిత

తలఁగరో లోకులు తడవకురో మమ్ము ! కలిగిన దిదె మాకాపురమూ ||పల్లవి||

నరహరికీర్తన నానినజిహ్వ ఒరుల నుతింపఁగ వోపదు జిహ్వ ! మురహరుపదముల మ్రొక్కినశిరము ! పరులవందనకుఁ బరగదు శిరము ||తల|| 1

శ్రీపతినే పూజించిన కరములు ! చోఁపి యాచనకుఁ జొరవు కరములు ! యేపున హరికడ కేఁగినకాళ్ళు ! పాపులయిండ్లకుఁ బాఱవు కాళ్ళు ||తల|| 2 52

శ్రీవెంకటపతిఁ జింతించుమనసు ! దావతి నితరముఁ దలఁచదు మనసు ! దేవుం డతని యూధీనపు తనువు ! తేవల నితరాధీనముగాదు ||తల|| 3

అన్న. అధ్యా. 135 ఱేకు

పాడి

పుటుభోగులము నేము భువి హరిదాసులము ! నట్టనడిమిదొరలు నా కియ్యవలెనా || పల్లవి ||

పల్లకీలు నందలాలు పడివాగె తేజీలు ! వెల్లివిరి మహాలక్ష్మి విలాసములు ! తల్లి యాకె మగనినే దైవ మని కొలిచేము ! వొల్లనే మా కీసిరులు వొరులియ్యవలెనా ||పుట్టు|| 1

గ్రామములు రత్నములు గజముఖ్య వస్తువులు ! ఆమని భూకాంతకు నంగభేదాలు ! భామిని యాకెమగని ప్రాణధారిలెంకలము ! వోమి మాకాతఁడె యిచ్చీ వొరులియ్యవలెనా ||పుట|| 2

పసగలబ్రహ్మపదవులు బ్రహ్మనిర్మితములు ! వెస బ్రహ్మతండ్రి శ్రీవేంకటేశుండు ! యెసఁగి యాతఁడే మమ్మునేలి యిన్నియు నిచ్చె ! వొసఁగిన మా సొమ్ములు వొరులియ్యవలెనా ||పుట|| 3

అన్న. అధ్యా. 316 ఱేకు.

శుధ్భవనంతం

చీచీ వివేకమా చిత్తపువికారమా ! యేచి హరిఁ గొలువక హీనుఁ డాయ జీవుఁడు ||పల్లవి|| బతికేనంటాఁ బోయి పయిఁడి వచ్చుకతన ! పతియవసరమునఁ బ్రాణ మిచ్చీని ! 53

బతు కందులోన నేది పసిఁడి యొక్కడనుండు ! గతి హరిఁ గొలువక కటువడె జీవుండు ||చీచీ|| 1

దొడ్డవాఁడ నయ్యేనని దొరలఁ గొలిచి వారి ! కడ్డమునిడుపు మొక్కు నతిదీనుఁడై ! దొడ్డతన మేది యందు దొర యాడనున్నవాఁడు! వొడ్డి హరిఁ గొలువక వోడుపడె జీవుండు ||చీచీ|| 2

చావనేల నోవనేల సారెఁ గిందుపడనేల ! యీవల శ్రీవెంకటేశుఁ డింట నున్నాఁడు ! దేవుఁ డాతఁడె నేఁడు తెలిసి కొలిచెఁగాని ! భావించ కిన్నాళ్ళదాఁకా భ్రమపడె జీవుండు ||చీచీ|| 3

అన్న. అధ్యా. 103 ఱేకు.

వరాళి

ఎవ్వరివాఁడాఁ గాను యేమందు నిందుకు ! నవ్వుచు నాలోని హరి నన్నుఁ గావవే ||పల్లవి||

కోపుల రాజుల నెల్ల కొలచి కొన్నాళ్ళు మేను ! చూపుడుఁ బూఁటవెట్టితి సొగిసి నేను ! యేపున సంసారమున యిదిగాక కమ్మటాన ! దాపుగ తొర్లుంబూఁట తగిలించుకొంటిని ||ఎవ్వ|| 1

మొదలఁగర్మములకు మోసపోయి యిబ్రదుకు ! కుదువవెట్టితి నే గుజీగానకా ! వెదకి కామునికి విషయములకు నే ! నదివో నావయ సెల్ల నాహివెట్టితిని ||ఎవ్వ|| 2

ఇప్పడే శ్రీవెంకటేశ యిడేర్చి నామనసు ! కప్పిన గురుఁడు నీకు క్రయమిచ్చెను ! వొప్పించి రిందఱు బలువుఁడు చేపట్టె ననుచు ! అప్ప లెల్లఁబాసి నీసొమ్మైతి నే నయ్యా ||ఎవ్వ|| 3

అన్న. అధ్యా. 325 ఱేకు. 54

ఆచార్యునికి నంకెల

రాయఁ డన్నమాచార్యునికి మారురాయరగండ మని పేరుగల సంకెలవేయించి చెరసాలలోఁ బెట్టించెను. "సంకెల లిడువేళఁ జంపెడువేళ నంకిలి ఋణదాత లాగెడువేళ" ఇత్యాదిగా నాతఁడు సంకీర్తనము చెప్పి సంకెల విదలించుకొన్నాడు. (చూ. 38 పుట.)

ముఖారి

ఆఁకటివేళల నలపైనవేళలను తేఁకువ హరినామమే దిక్కు మజీలేదు ||పల్లవి||

కొఱమాలి వున్న వేళ కులము చెడినవేళ ! చెఱవడి వొరులచేఁ జిక్కినవేళ ! వొఱపైన హరినామ మొక్కటే గతిగాక ! మఱచి తప్పిన నైన మఱిలేదు తెఱఁగు ||ఆఁక|| 1

ఆపద వచ్చినవేళ నాఅడిఁ బడినవేళ ! పాపపువేళల భయపడినవేళ ! వోపినంత హరినామ మొక్కటే గతిగాక ! మాపుదాఁగాఁ బొరలిన మఱిలేదు తెఱఁగు ||ఆఁక|| 2

సంకెలఁబెట్టినవేళ చంపఁ బిలిచినవేళ ! అంకిలిగా నప్పులవా రాఁగినవేళ ! వెంకటేశు నామమే విడిపించ గతిగాక ! మంకుబుద్ధిఁ బొరలిన మఱిలేదు తెఱఁగు ||ఆఁక|| 3

అన్న. అధ్యా. 26 ఱేకు.

దే సాక్షి

నీదాసులభంగములు నీవు చూతువా ! యేదని చూచేవు నీకు నెచ్చరించవలెనా ||పల్లవి||

పాలసముద్రముమీఁదఁ బవళించినట్టి నీకు ! బేలలై సురలు మొఱవెట్టినయట ! 55

వేళతో మామనవులు విన్నవించితిమి నీకు ! యేల నిద్దిరించేవు మ మ్మిట్టే రక్షించరాదా ||నీదాసు|| 1

ద్వారకానగరములో తగ నెత్తమాడే నీకు ! బీరాన ద్రౌపది మొర వెట్టినయట ! ఘోరపు రాజసభలఁ గుంది విన్నవించితిమి ! యేరీతి పరాకు నీకు నింక రక్షించరాదా ||నీదాసు|| 2

ఎనసి వైకుంఠములో నిందిరఁ గూడున్న నీకు ! పెనఁగి గజము మొరవెట్టినయట్టు ! చనవుతో మాకోరిక సారె విన్నవించితిమి || విని శ్రీవెంకటేశుండ వేగ రక్షించరాదా ||నీదాసు|| 3

అన్న. అధ్యా. 247 ఱేకు.

సామంతం

దాసవర్గముల కెల్లా దరిదాపు మీరే కాన ! వాసికి నెక్కించరాదా వసుధలో మమ్మును ||పల్లవి||

సేనాధిపతి నీవు చేరి విన్నవించరాదా ! శ్రీనాథునికి నేము సేసేవిన్నపము ! ఆనుక భాష్యకారులు అట్టే మీరుం జేయరాదా! మానక విన్నపముల మామనవి చనవులు ||దాస|| 1

వేయినోళ్ళభోగి నీవు విన్నపము సేయరాదా ! వేయేసి మావిన్నపాలు విషునికిని ! ఆయితమై గరుడండ అట్టే మీరుం జేయరాదా ! యేయెడ విన్నపము మాకేమి వలసినాను ||దాస|| 2

దేవులమ్మ యిందిర మాదిక్కె విన్నవించరాదా ! శ్రీ వెంకటపతికి చిత్తమందను ! ఆవేళ శేషాచలమ అట్టే మీరుం జేయరాదా ! యీ వేళ మావిన్నపము లీడేరే నింకను ||దాస|| 3

అన్న. అధ్యా 247 ఱేకు. 56 ఆచార్యుని మాహాత్మ్యమున కచ్చెరుపడి నరసింగరాయఁడు శరణువేఁడి యాతనిచే ననుగృహీతుఁ డయ్యెను (చూ 39 పుట.) రాయులకైంకర్యములు విజయనగరరాజ్యమున సురక్షితుఁడై నరసింగరాయఁడు 1495 దాఁక రాజ్యమేలెను. సంస్కృతమునఁ దచ్చరిత్రము సాళ్వాభ్యుదయ మని రచితమయ్యెను. రాయఁడే రామాభ్యుదయ మని కావ్యము రచించెను. వీరన యీతనిని శ్రీవెంకటాద్రినాథదయావర్ధితరాజ్యఁ డని రత్నాంశు మత్కాంచీ వెంకట కాళహస్తి నగరీకళ్యాణసౌధాంచల ప్రాంచచ్ఛాశనుఁ డనీ తాను గృతిచేసిన జైమిని భారతమున వర్ణించినాఁడు. శ్రీతిరుపతి వేంకటేశ్వరస్వామి కీతఁ డనేకోత్సవవిశేషములు, నైవేద్య విశేషములు, ఆభరణవిశేషములు, ప్రాకారమండపసోపానాది నిర్మాణ విశేషములు ధనవ్యయముతో వెలయించినాఁడు. వానిని గూర్చి శాసనములు పదునాలు గున్నవి. స్వామి కైంకర్యపరాయణులై కొండమీఁదఁ బ్రఖ్యాతి గాంచియున్న కందాళరామానుజజియ్యంగారి కీఁతడు శిష్యుఁ డయ్యెను. పై కైంకర్యములు స్వామికిఁ గావించుటలో నన్నమా చార్యులయు నా జియ్యంగార్లయు నుపదేశముల నాతఁడు పాటించు చుండవచ్చును. నాఁటియున్నమయు ఆనాళ్ళలో నన్నమాచార్యుఁడు తనయగ్రహారములలోను దాళ్ళపాక లోను గొంతకాలము వసించుచువచ్చినను దిగువ తిరుపతిలోను గొండ మీఁద స్వామిసన్నిధిని నెక్కువకాలము గడపుచువచ్చెను. ఆ చోట్ల గృహాది వసతు లాతనికాలముననే యేర్పడెను. ఆతని కుమారుని నాళ్ళలోఁ గొండ మీదను దిగువతిరుపతిలోను దమగృహములముందు మండపముల గట్టించి యక్కడ స్వామిని వేంచేవ చేయించి, యుత్సవాదులు జరపించుట సాగెను. గుండక్రియు కోటికిం బడగయెత్తి కొంకనేల 1 యీటులేని పదమెక్కి ఇంకనేల చింత iపల్లవి: 57 పెట్టినది నొసలను పెద్ద పెద్ద తిరుమణి కట్టినది మొలఁ జిన్నకౌపీనము ! పట్టినది శ్రీహరిపాదపద్మమూలము 1 యెట్టయినా మాకు మేలె యింకనేల చింత 15°ê51 1 చిక్కి నాలో నైనది శ్రీవైష్ణవధర్మము ! తొక్కినది భవముల తుదిపదము యొక్కినది హరిభక్తి యిది పట్టపేనుఁగు | యొక్కువ కెక్కువేకాక యింక నేల చింత |కోటి|| 2 చిత్తములో నిండినది శ్రీపతిరూపము హత్తినది వైరాగ్య మాత్మధనము || యెత్తలం జూచిన మాకు నిదివో శ్రీ వేంకటేశుం! డెత్తి మముఁ గావఁగాను యింకనేల చింత |కోటి| 3 అన్న అధ్యా. 307 తేకు. కొండకుఁ బయనము అన్నమాచార్యుఁడు పెనుగొండ (రాయలయాస్థాని) S తాళ్ళపాకనో వీడి స్వామిని దర్శింప రాఁగోరి చెప్పినసంకీర్తనము: ෆඕෆ් రామ కృష్ణ నీవు నందె రాజ్యమేలుచుండుదువు | యేమి సేసే విక్కడ నీయిరవుకే పదవే iపల్లవి లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు 1 అంకె సుగ్రీవుఁ గిష్కంధ కంపినయట ! వంకకు సంజీవి దేను వాయుజుని నంపినటు ! వెంకటాద్రి పొంతనుండ వేగ మమ్ము నంపవే రామ! 1 ఘనకీరీటము దేను గరుడని నంపినటు | అనుఁగుఁ గవులనిండ్ల కంపినటు 1 నొనర గోపికలొద్ద కుద్ధవుని నంపినట్టు ననుపు శేషాద్రి నుండ నన్ను నంపవే tiరామ|| 2 58 పెండిలికిఁ బరుషలఁ బిలువఁగ నంపినటు అండనె ముందరఁ గంత కంపినయట ! వెండియు శ్రీవెంకటేశ వెంట వచ్చి మరలితి వుండుచోటనుండి నన్ను వూడిగాన కంపవే 3 ווס8יסו అన్న అధ్యా. 275 తేకు. అన్నలజోల అన్నమాచార్యుఁడు శృంగారమంజరి' యనుమంజరీచ్ఛందోమయ రచనను భాషచే భావముచే శృంగారసుందరమైనదానిని శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై రచింపఁగాఁ జిత్తగించి స్వామి యన్నమాచార్యు ని ట్లను గ్రహించెను. (చూ. పుట. 41.) శృంగారమంజరిఁ జేసి శేషాద్రి శృంగవాసునకు నర్పించి యిచ్చుటయు నాడుచుఁ బతకమా కన్నల జోల పాడఁగ నాఁడెల్ల బసిబిడ్డ నైతి నాకృష్ణమాచార్యు నధ్యాత్మవినుతి రాకఁ గొన్నాళ్ళు విరక్తుండ నైతి జగతి నీశృంగార సంకీర్తనముల కగపడి మంచిప్రాయపువాఁడ నయితి నని వెంకటేశ్వరుఁ డన్నమాచార్యుఁ గనుఁగొని వాక్రుచ్చి గారవించుటయు పైగ్రంథభాగమునఁ దొలుత పతకమాకన్నలజోల తర్వాత కృష్ణమాచార్యునధ్యాత్మవినుతి కలవు. కృష్ణమాచార్యుఁడు కాకతీయ ప్రతాప రుద్రునినాఁటివాఁడు. కాన యూతని వినుతికి ముందు గల పతకమా కన్నలజోల యంత కింకను బ్రాచీనము కాఁబోలును అది యెట్టిదో యొక్కడేని కలదేమో తెలియఁజాలకున్నాను. వాక్యము సరిగానున్నదో లేదో 1. ముద్రితము. తాళ్ళపాకరచనలు 1 వాల్యుం. 59 కూడఁ దెలియదు. పతకమూక ఊరిపేరోమో! అది పతకమాకో లేక పతకమూరో పొతకమూరో ఇంకేదో ఆయూరివాఁడయిన అన్నలు అనుగేయకవి జోలపాట రచించియాడుచు నొండె స్వామి బాలుఁడై యూడఁగానొండెఁబాడెడివాఁ డని యర్ధము. కాఁబోలును. పయిపతక మాకయున్నలజోల సుప్రఖ్యాతమయి తాళ్ళపాక వారు మెచ్చినదయి యుండును. రాగితేకులలో అన్నమాచార్యుఁడు రచించినవే యనేకములు జోల లున్నవి. వేలకొలఁదిగా నున్నయూశృంగారనంకీర్తన లెల్ల నిఁక సుపరిశోధితములు ముద్రితములును గావలసియున్నవి. అన్నమయుజోల ఇటీవల నొక జోలపాటను లోకమున వ్యాపించిన దానిని నన్నమా చార్యుని పేర నుండుట గుర్తించితిని.' రాగం. ఆటతాళం జో వచ్యుతానంద జోజో ముకుంద | రావె పరమానంద రామగోవింద 率 * 率 అంగజునిగన్న మాయన్న యిటు రారా | బంగారుగిన్నెలోఁ బాలు పోసేరా ! దొంగ నీ వని సతులు పొంగుచున్నారా ! ముంగిట నాడరా మోహనాకారా గోవర్ధనం బెల్ల గొడుగుగాఁ బట్టి కావరమ్మున నున్నకంసుఁ బడగొట్టి ! నీవు మధురాపురము నేలఁ జేపట్టి ఠీవితో నేలిన దేవకిపట్టి |బోu -2 1. శ్రీవిస్సా అప్పారావుగారి యింట వారి పూర్వులు వ్రాసియుంచుకొన్న మంచి సంకీర్తనముల సంచయములోనిది. చిరంజీవి తి. కోదండరామయ్య ఆంధ్ర 8-9-48 వార పత్రికలోఁ బ్రకటించెను. 60 అంగుగాఁ దాళ్ళ పాకాన్నయ్య చాల శృంగారరచనగాఁ జెప్పె నీజ్ల సంగతిగ సకలసంపదల నీవేళ | మంగళము తిరుపట్ల మదనగోపాల Iા3°ા 3 ఈ జోలలో అన్నమాచార్యుని పేరున్నది గాని యది తిరుపట్ల బాలగోపాలదేవునిముద్రతో మాత్రమే యున్నది. నేను ముప్పదేండ్లకుఁ బూర్వము తంజావూరి లైబ్రరినుండి ఈజోల కొన్నిచరణములు వ్రాసియుంచుకొనుట నిటీవలఁ జూచితిని. అది వేఱుతీరుగా నున్నట్టున్నది. అం దీచరణ మున్నది: అలిగి తృణావర్తు నవనిఁ గూల్చితివి బలిమిమైఁ బూతనఁ బట్టి పీల్చితివి చెలఁగి శకటాసురునిఁ జేరి డొల్చితివి ! తలఁచి మదులు రెండు ధరణి వ్రాల్చితివి II అన్నమయ శ్రీవెంకటేశ్వరస్వామి మీఁదనే కాక యింక ననేక పుణ్యక్షేత్రములలోని దేవతలమీఁదగూడ సంకీర్తనములు రచించినాఁడు. ఆ సంకీర్తనములలో బెక్కింట నాయాక్షేత్రముల దేవతల పేర్లతో నభేదము గల్పించి తుదిచరణమున శ్రీ తిరుపతి వెంకటేశ్వరస్వామి నామముద్రికను నెట్టుకొల్పుచుండును. ఈ జోలలో స్వామినామముద్ర లేదు. ఇది యిక్కడి రాగిరేకులలో నున్నదో లేదో, అన్నమయులాలి తంజావూరిపుస్తకశాలనుండి యిటీవలఁ గొన్ని తాళ్ళపాకసంకీర్తన ములు వ్రాయించి తెప్పించితిమి. అందు మీఁదిజోలవంటి దొకలాలి కలదు. దానఁగూడ గండవరపు బాలగోలపాలుని నామాంక మున్నదిగాని శ్రీ వెంక టేశ్వరస్వామినామాంకము గానరాదు. అన్నమయపేరందు లేకపోయినను గండవరము తాళ్ళపాకవారికిఁ జెల్లుచువచ్చిన గ్రామ మని తెలియుటచే దమయూరిస్వామి మీఁద నన్నమాచార్యుఁడో తత్పుత్ర పౌత్రులో దానిని 61 రచించియుందు రనుకొంటిని, అదియిది: శ్రీరాగం. జంపెతాళం లాలనుచు నూచేరు లలన లిరుగడల | బాల గండవరగోపాల నినుఁ జాల ఉదుటుగుబ్బలసరము లుయ్యాల లూఁగ ! పదరి కంకణరవము బహంగతుల మ్రోఁగ | వొదిఁగి చెంపలకొప్ప లొక్కింత వీఁగ ముదురుచెమటల నళికములు తొప్పఁదోఁగ సొలపు తెలిగన్నుఁగవచూపు లిరువంక మలయురవళులకుఁ బలుమాఱును బెళంక ! కొలఁదికోవిలగములు క్రోలుమదనాంక ములఁ గ్రేణి సేయు రవములు వడిఁ దలంక సరసపదములు జంగచాపుచేఁ బాయ | గురులీల మీఁగాళ్లఁ గుచ్చెళ్ళు రాయ | కరమూలముల కాంతి కడుఁజాయఁ జేయు 1 సరస నురుకుసుమవాసన లెదురు డౌయ కొలఁది నునుమేను లతకూన లసియాడ ! మేలఁకువతొ నొకరొకరి మెచ్చి సరిగూడ తల లూఁచి చొక్కి చిత్తరుబొమ్మలాడ | అలరి యెల్లరు మోహనాకృతులు చూడ లలితతాంబూలరసకలితంబు లైన తళుకుదంతములు కెంపులగుంపులీన మొలక వెన్నెలడాలు ముసురుకొనితోన చెలఁగి సెలవుల ముదుచిఱునవ్వులాన మలయమారుతగతులు మాటికిఁ జెలంగ | పలుకుఁగపురపుతావి పైపై మెలంగ ! fiపలవిil } ΙΙe σ•έδιι וו&יעeוו μεσ•έδιι ΙΙey"έ)ιι ווb&יטeוו 62 బలుగానలహరి యింపుల రా ల్గరంగ ! బలసి వినువారిచెవి బడలిక దొలంగ IIevsê)II 6 లలనాజనాపాంగలలితసుమచాప ! జలజలోచనదేవ సదుణకలాప ! తలఁపు లోపలమెలఁగు తత్వప్రదీప ! భళిర గండవరేశ పరమాత్మరూప ווe7 וופ8יט అన్నమయు మహిమలు మండెమురాయనామక నరసింహదండనేత్రు (తృ) న కిష్టధనబల స్ఫూర్తి నిత్యాదివాక్యములకు (చూ 43 పుట.) స్పష్టముగా నర్థమెఱుఁగ రాదు. మండెమురాయఁ డన్నపేరు మండెము గ్రామమున వెలసిన నరసింహస్వామికిఁ గలదు. చండనేత్రుఁ డనియో? దండనేత్రుఁ డనియో? దండనేతృఁడని దిద్ది దండనాథుఁడని యర్థముగుదుర్చుకొనఁగా నాతఁడు సాళువనరసింహరాయని విద్యానగర సామ్రాజ్యలాభమునకుఁ జాలఁ దోడుపడినవాఁడును, నరసింగరాయని తర్వాత నిమ్మడి నరసింహరాయఁ డను తత్పుత్రుడు పేరి కల్పకాలము రాజుగా నున్నను విద్యానగర సామ్రాజ్యము నాక్రమించుకొన్నవాఁడును నగు నరసింహ దండనాథుఁడు కాఁగలఁడు, అన్నమాచార్యు నగ్రహారము మరులుంకు (మరువాకరై?) ఆదండనాథున కిష్టమగు ధనబలస్ఫూర్తి కలది గాఁబోలును. (చూ 43 పుట) ఆగ్రామమునఁగల జీడికంపు పుల్లమామిడి పండ్లను స్వామికి నివేదనచేసి తా నారగింపఁగా నన్నమాచార్యునకుఁ బండు పులిసెను. అపచారము క్షమింప స్వామినివేఁడి దానిని దియ్య మామిడిని జేయ నర్థింపఁగా స్వామియనుగ్రహమున నది తియ్యమామిడి యయ్యెను. ఈ విషయము నీ యన్నమాచార్యచరిత్రమేకాక పెద తిరుమలాచార్యునిఁ గూర్చియున్న సంకీర్తనముకూడ నిరూపించుచున్నది. (రాగము పేరు లేదు) కరము జీడిపులుసు గలిగిన మామిడి కరముసోకిన యంతనే సరవిఁజక్కెరవలెఁ జవిగలిగించువాని చనవరిసుతుఁడితఁడే పల్లవి: 63 వేఁకరి మండెముకోట వెళ్ళుతా విచ్చనవిడిరాఁగా వొక వీఁకతో వేసిన కత్తి తునుకలాయ వెన్ను సోకినయంతనే ఆకాలమునాఁడు రాతినాతిఁ జేసె అతడేపో యీతఁడు ! వాకుచ్చి పొగడరొ ఘనపుణ్యము తాళపాకతిరుమలయ్యను కర 1 గుములుగూడియలుఁగులుతిరుగబాజీ చుట్టుకొన్న కురువదోవ నతఁడు కమలనయనునిఁదలఁచినమాత్రాన కకపికలైపాజెను అమరఁబాంచాలికి వలువ లొసఁగి నతఁడె వోయిబాతఁడు | ప్రమదముతోడుత పేరుకొనరే తాళపాకతిరుమలయ్యను కర 2 దేవుఁడొకకన్ను దయచేసి తనవద్దికి నంపిన నతఁడు పావనుఁ డితఁడు తానొక్కకన్నిచ్చె పరుషలు చూడఁగా శ్రీవెంకటప్పని సేవచేయఁగోరి చేకొన్నతను వితఁడు | భావించి పొగడరొ భాగ్యముగల తాళపాకతిరుమలయ్యను కరః 3 శేషాచార్యులవారి వ్రాఁతప్రతి. ఈ సంకీర్తనమున, 2.3. చరణముల విషయములు పెదతిరుమలా చార్యునికి సంబంధించినవి. ప్రజ లన్నమయ మాహాత్మ్యమును వశ్యవాక్కును దెలిసికొని యేవేవో యర్ధించి వెంటూడసాగిరి. ఆవార్తవిని జను లరుదంది కొనుచు వావిరి నొడి వల్గావళికి గొఁ బెగడి చెలువొందు నా గురుశ్రీపాదరక్ష తలనిడి తమయాపదల వీడుకొనిరి అమాయికప్రజల యీ యలజడికి జడిసి చేసిన సంకీర్తనము: ముఖారి పరమాత్మ నిన్నుఁ గొల్చి బ్రదికేము ! విరసపు జాలిఁ జిక్కి వెతఁబడ నోపము ||పల్లవి| మగఁడు విడిచినా మామ విడువని యుటు 1 నగినా మనసు రోసినా లోకులు మానరు | 64 తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు మొగ మోటలను నేమ మోసపోవ నోపను Hపర! పొసఁగ దేవుఁ డిచ్చినా పూజరి వరమీఁడు ! విసిగి నేవిడిచినా విడువరు లోకులు ! కొనరేరు ముసరేరు కోరిక దీర్చమనేరు పసలేని పనులకు బడల నే నోపను |పర నుడుగుట దప్పినా నోముఫల మిచ్చినట్లు కడఁగి వేడుకొన్నాఁ గా నిమ్మనరు లోకులు తడవేరు తగిలేరు తామె శ్రీవెంకటేశ i బుడిబుడి సంగా తాలఁ బొరల నే నోపను |పరil అన్న అధ్యా 232 తేకు, అన్నమాచార్య వురందరదానులు కర్ణాటభాషలో వేలకొలఁది సంకీర్తనముల రచించి మహానుభావుఁ డని ప్రఖ్యాతి గాంచిన శ్రీపురందరదాసుఁ డన్నమాచార్యుని దర్శింపవచ్చి యతని సంకీర్తనములు విని తనిసి నీవు శ్రీపాండురంగ విట్టలుని యవతారమవేయని సన్నుతించెనట. (చూ. 44, పుట.) పురందరదాసుల వారు శ్రీవ్యాన తీరులవారి శిష్యు లని ప్రతీతి. వ్యాసతీరులవారు సాళ్వనరసింగరాయనికాలమునఁ గూడఁ గలరు. శ్రీకృష్ణరాయలకు వారు గురువులు. వయసున చిన్నవారయినను వ్యాసతీరులను సన్యాసాశ్రమ స్వీకారముచే గురువర్యులనుగాఁ బురందరదానుల వారు పూజించియుందురు. అన్నమాచార్యుని వార్ధకమునఁ బురందర దాసులవారు చాలఁజిన్నవారై దర్శించియుందురు. పురందరదాసుల వారన్నమార్యుల సంకీర్తనముల ననుకరించి సంకీర్తనముల రచించిరి. మచ్చున కొక్కటి: మాళవిరాగం శరణుశరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీస్తతివల్లభా ! 3 శరణు రాక్షసగర్వసంహార శరణు వెంకటనాయకా పల్లవి|| 65 కమలధరుఁడును కమలపుత్రుఁడు కమలశత్రుఁడు పుత్రుఁడు క్రమముతో మీకొలువు కిప్పడు కాచినా రెచ్చరికయా శర అనిమిషేంద్రులు మునులు దికృతు లమర కిన్నర సిదులు ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా Iశర! ఎన్నఁగల ప్రపదముఖ్యులు నిన్నుఁ గొలువఁగ వచ్చిరీ } విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయకా శర భజనపద్ధతిలో అన్నమార్యునిదిగా నాఁటనుండి నేఁటిదాఁక సాగుచున్న యీ పై సంకీర్తమును జదివి పురందరదాసుగారి యీ క్రింది సంకీర్తనమును గూడఁ జదువుఁడు. మూళవి రాగం శరణు శరణు సురేంద్ర వందిత శరణు శ్రీపతిసేవిత ! శరణు పార్వతితనయ మారుతి శరణు సిద్దివినాయక పల్లవి: నిటలనేత్రన దేవిసుతనె నాగభూషణప్రియనె ! తటిల్లతాంకిత కోమలాంగనె కర్ణకుండల ధారనె శర బటువు ముత్తిన పదకహారనె బాహుహస్తచతుష్కనె | ఇట్టితొడగియు హేమకంకణ పాశ అంకుశ ధారనె శర కుక్షియోుళు మహాలంబోదరనె ఇక్షుచాప గెలిదనె | పక్షివాహన నాద పురందరవిట్టలన నిజదాసనె శర అన్నమాచార్యులవారి సంకీర్తనచ్ఛాయనే పురందరదాసులవారి కీర్తన మున్నది. నంకీర్తననంఖ్య అన్నమాచార్యుఁడు యోగవైరాగ్య శృంగార మార్గములలో ముప్పది రెండువేల సంకీర్తనములఁ జెప్పెనని కలదు. (చూ. 45 పుట.) అతఁడు తనవదునాజేండ్లవయసున నుపక్రమించి దివ్యధామ మందుదాఁక 66 దినమున కొక సంకీర్తనము చొప్పన సంకీర్తనములు రచించిన టున్నది.' అటు లెక్కింపగా నించుమించుగా నిర్వదిమూఁడువేల సంకీర్తనములు లెక్కకు వచ్చును. ఇందు ముప్పదిరెండువేల సంకీర్తనములు రచించిన టున్నది. "పరమతంత్రమ్ములిర్వదిరెండువేలు" అనియుండ వలెనో, కానిచో ఆరాగిరేకు మీఁదివాక్యమునకుఁ బ్రతిదినము నొక్కదానికిఁ దక్కువ కానీక సంకీర్తనములు రచించుచుండె నని యర్ధము చెప్పికొన వలెనో రెండవ తీరనుకొందుమేని ముప్పది రెండువేల సంకీర్తనములు రచించె ననుట సంగతమే. రచించిన యా సంకీర్తనములెల్ల రాగిరేకుల కెక్కనే ಪೆದ್? ఎక్కినను నిప్పడు మనకు దొరకలేదో? తిరుపతి దేవస్థానమునఁ గాక అహెూబలమునకుఁ గొన్ని రేకులు చేరియున్నట్లు తెలియుచున్నది గదా. ఇంక నెన్ని యెప్పడెక్కడికిఁజేరినవో? క్రీ 1560 ప్రాంతములదాఁక సంకీర్తనములను రాగిమీఁదఁ జెక్కించుట జరగిన టున్నది. విద్యానగర విప్లవముమూలమున దక్కిన వానిఁ జెక్కించుట సాగక తాళపత్రముల మీఁదనే యుంపఁగా కాలవశమున నవియుఁ జెడియండును. 1560 క్రీ. పూర్వమే కొన్నిసంకీర్తనములు తంజావూరికిఁ జేరియుండును. అక్కడఁ గలసంకీర్తనము లన్నియుఁ దిరుపతి రాగితేకులమీఁద నున్నవో లేవో? శేషాచార్యులవారి తాళపత్రప్రతిలోని సంకీర్తనములు గూడ నన్నియు రాగితే కులమీఁది కెక్కినవో లేవో ? పెదతిరుమలాచార్యుఁడుగూడ దినమున కొకసంకీర్తనము చొప్పనఁ దండ్రియానతిని రచించెను. అవి కొన్నివే లుండవలెనుగదా ! కానరావు. ద్వివదరామాయణము అన్నమాచార్యుఁడు ద్విపదముగా నవముగా రామాయణమును గూడ రచించెనట. ద్విపదరచన మంతకుముం దింకొకటి కల దని సూచించుటకు నవముగా ననుట. ఈతని రామాయణరచనము నేఁడు గానరాదు కాని రామాయణ కథాప్రసక్తములు సంకీర్తనము లనేకము 1. (చూ) అన్నమాచార్యుల శృంగార సంకీర్తనముల మొదటి తేకు. అధ్యాత్మ సంకీర్తనముల మొదటి తేకు. 67 లున్నవి. రాగిజేకులమీఁద నన్నమాచార్యుల సంకీర్తనములను శృంగార మంజరిని మాత్రమే తత్పుత్రుఁడు పెదతిరుమలాచార్యుఁడు చెక్కించెను గాఁబోలును.' వేంకటాచలమాహత్మ్యము సంస్కృతభాషలో శ్రీవేంకటాచలమాహాత్మ్యము నన్నమాచార్యుఁడు రచించెను. (చూ. 46 పుట) వరాహపురాణాదులలోనిదిగా సంఘటిత మయి పదునేడు పదునెనిమిది శతాబ్దముల పిదప తెలు పరివర్తనము పడసి ప్రాచీనతాళ పత్రప్రతులు గలిగి యిప్పడు నాగరాంధ్రాక్షరములలో ముద్రితమై వ్యాప్తిగాంచియున్న వేంకటాచలమాహాత్మ్యము నాఁడు తాళ్ళపాక యన్నమాచార్యుఁడు రచించినది యయినను గొవచ్చును. అష్టాదశపురాణములలోఁ జేరినవిగాఁ గానవచ్చు స్థలమాహాత్మ్యముల నన్నింటిని సమకూర్చి గ్రంథసంఖ్యను గణించినచో నష్టాదశపురాణము లకుఁ బ్రాచీనులే పరిగణించిన గ్రంథసంఖ్యకంటె నీస్థల మాహాత్మ్యముల గ్రంథసంఖ్య చాల మీజీపోఁగలదు. వ్రాఁతప్రతులు గలిగి పురాణక్రమ నిర్వచనమునఁ జెప్పఁబడిన యానుపూర్విగలిగి యనేక స్థలములం 1. తిరుపతి దేవస్థానమునగల రాగిరేకులలో నన్నమాచార్యుల రచనము లనుకొనఁదగినవి యించుమించుగా రెండువే లుండును. అన్నమాచార్యుని సంకీర్తనముల తొలిరేకున నామాంకముగలిగి ఒకటి,రెండు, మూడు, నాలుగు, ఇత్యాది క్రమసంఖ్యాంకములతో రేకుల యడ్డము నిడుపుల సమపరిమాణముతో నున్నరేకుల సంఖ్యను ఇంచుమించుగా రేకున కాఱు పాటల చొప్పననున్న పాటలసంఖ్యను, ఒరిగణించి యీ మొత్తము గుర్తింపఁగల్గితిమి. అట్లే తొలిరేకుపై పెదతిరుమలాచార్యుల నామాంకముతో 1, 2, 3, సంఖ్యాక్రమముగల రేకులను వానియడ్డము నిడుపుకొల్లల పృథక్త్వమును గమనించి పెదతిరుమలాచార్యుల సంకీర్తనముల నంఖ్యను, చినతిరుమలాచార్యుల సంకీర్తనముల నంఖ్యను గుర్తింపఁగల్గితిమి. కాని, యన్నమాచార్యులరేకులని కొల్లలపరిమాణము, సంఖ్యానుపూర్వియుగల రేకులలో(గూడఁ గొన్ని యున్నమాచార్యప్రనక్తములు తత్పుత్రుఁడో పౌత్రుఁడో రచించినవికూడఁ గల సెఁగాఁ బోలునని కొన్ని సంకీర్తనములలోని విషయములఁబట్టి సందేహింప నవకాశముకలిగినది. 68 దుపలభ్యమాసము లగుటచే ముద్రితముల యినయష్టాదశ పురాణము භාණ්* నాయాస్థలపురాణములు నూటికిఁ దొంబది తొమ్మిదివంతులు గానవచ్చుటే లేదు. పురాణపుముద్రాపకులు కొన్నిస్థలపురాణములను నేఁటిపురాణ ముద్రణములందుఁ జేర్చుటయు జరగకపోలేదు. అది యొక మహత్తరచర్చ అధ్యాయ సంఖ్యలు, పురాణముల పేళ్ళఉన్ననునేటిస్థల పురాణము లెల్ల నాయాపురాణములలో దొలుత రచితములు గా వనుట ప్రఖ్యాతనత్యార్ధము. ఇంచుమించుగా నిట్టిస్థలమాహాత్మ్యములు పదుమూఁడు పదునాలు శతాబ్దములనుండి నిన్నటినేఁటి దాఁకగూడ నుప్పతిలుచునే యున్నవి. కాన అన్నమా చార్యుఁడు రచించినాఁ డన్న వేంకటాచలమాహాత్మ్య మిప్పడు ప్రఖ్యాతముగానున్న వేంకటాచల మాహాత్మ్యము కావచ్చుననుట విడూరపడవలసిన విషయముకాదు. ఆతఁ డేదో నంన్కృతవు ననునరించి తెలున నలవూహాత్మ్యవు రచించెననఁగాదు. "దివ్యభాష ! నా వేంకటాద్రిమాహాత్మ్యమంతయును | రచించె" నని కలదు. జియ్యర్ రామాను జయ్యంగా రనువారు é. 1491 నాఁడు (అప్పటి కన్నమాచార్యుఁ డఱువది యేడేండ్లవయసువాఁడు) తాను విన్నపముచేసిన తిరువేంకటాచల మాహాత్మ్యమునకు శ్రీ స్వామివారు స్వీకారము చిత్తగించి ఆలకింప ననుగ్రహించునట్లు చేయుటకును, గొన్ని యుత్సవములు జరుపుటకును ఉభయముగాఁ గొంత ద్రవ్య మొుసఁగి స్థానాధిపతులచే శిలాశాసనము చెక్కింపించుకొన్నారు. ఆ రామానుజ జియుంగారు కవీశ్వరుఁడయిన యున్నమాచార్యునిచే వేంకటాద్రి మాహాత్మ్యమును రచింపించి తననమర్పణముగా స్వామి సన్నిధిని విన్నపింవఁ గోరియుండవచ్చును. పెదతిరుమలాచార్యుఁడు స్వామినన్నిధిని వేంకటాచల మాహాత్మ్యమును బఠించుటకుఁగాను అనంతాచార్యు లనువారికిఁగొంత జీవిక యేర్పఱిచెనట. అది పితృదేవరచితమన్న యభిమానముచేఁ జేసిన దయినఁ గానశచ్చును. 1. చూ, తిరుపతి శిలాశాసనముల వాల్యుం : నెం 95 శాసనము. 69 అంతకుఁబూర్వమే యీస్థలమాహాత్మ్య సముచ్చయము కల దని నిరూపింపఁగల సాధనములు గానరా నంతవఱకు నిది యన్నమాచార్య రచితమని తలఁచుట యసంగతముగాదు. ఇప్పడున్న పురాణములలోని వేంకటాచలమాహాత్మ్య భాగములు వేర్వేఱు రచనము లనుకొన్నచో నందుఁగొన్నియయినను నీతని రచనములు గావచ్చును. వరాహబ్రహ్మాండములలో వేంకటేశ్వర విషయ మున్నట్టిక్రింది సంకీర్తనమున నన్నమాచార్యఁడో పెదతిరుమలాచార్యుఁడో చెప్పినాఁడు. ᏯᏛ& శ్రీవేంకటేశుఁడు శ్రీపతియు నితఁడె పావనపు వైకుంఠపతియును నితఁడె ||పల్లవి: భాగవతములోఁ జెప్పె బలరాము తీర్థయాత్ర | నాగమోక్తమైన దైవత మాతం డితఁడె ! ూగుగా బ్రహ్మాండ పురాణపద్ధతియాతఁ డితఁడె యోగమై వామనపురాణోక్తదైవ మీతఁడె శ్రీవేంక| 1 వెలయు సప్తఋషులు వెదకి ప్రదక్షణము | లలరఁ జేసినదేవుఁ డాతఁ డితఁడె నెలవై కొనేటిపొంత నిత్యముఁ గూమారస్వామి ! కలిమిఁ దపము సేసి కన్న దేవుఁ డితండి శ్రీవేంక 2 యొక్కువై బ్రహ్మాదులు నెప్పడు నింద్రాదులు తక్కకు కొలిచియున్న తత్వ మీతఁడె చక్క నారాదాదుల సంకీర్తనకుఁ జొక్కి : నిక్కిన శ్రీవేంకటాద్రి నిలయుఁడు నితఁడె శ్రీవేంక 3 అన్న, అధ్యా. 87 జేకు నేఁటి వేంకటాచలమామాత్మ్యకథలు సంకీర్తనములలో నంతగాఁ గానరాకున్నవి. కొన్ని స్థానికదేశిగాథ లున్నవి. (చూ. 25 పీఠక పుట.) 70 ఇతరగ్రంథములు అన్నమాచార్యుఁడు పండ్రెండు శతకములు రచించెనట. సకల భాషలందును ప్రతిలేని నానాప్రబంధములు రచించెనట. అన్నమాచార్యుని వేంకటేశ్వరశతక మొకటి నేను ప్రకటించిన ప్రబంధ రత్నావళిలో నుదాహృతమయినది. దేనస్థానపు రాగిరేకులలోఁ గానరాదు. అలమేల్మంగాంబమీఁద నీతఁడురచించిన శతక మిదే (చూ.పీఠిక 16పు.). మజీ మిగిలిన పదిశతకములు నేయేవేల్పులమీఁద రచితము లయ్యెనో, వాని పేళ్ళేమో తెలియరాదు. ఇవిగాక యన్నమాచార్యుఁడు సంస్కృతమున సంకీర్తనలక్షణము రచించినట్టును దానికిఁ దనతండ్రి పెదతిరుమలా చార్యుఁడు వ్యాఖ్య చెప్పినటును వాని ననుసరించి తాను తెలుఁగు రచన చేసినట్లును జెప్పకొన్నాడు. ఆ సంస్కృత సంకీర్తన లక్షణమును గానరాదు. అన్నమాచార్య విగ్రహము సంకీర్తనభండార మనీ తాళ్ళపాకవారి యర అనీ, పేర్కొనఁబడు చుండుకొటు నరిగా భాష్యకారుల సన్నిధికిఁ బ్రక్కగా నున్నది. స్వామిదర్శనము చేయువారు బంగారువాఁకిటికడ నిలిచి ముందుచూచిన స్వామిదివ్యవిగ్రహమును గుడి చేతి ప్రక్కకేసి చూచిన భాష్యకారుల విగ్రహమును గానఁగలుదురు. భాష్యకారులతోపాటు దర్శనీయులుగా నన్నమాచార్యుల విగ్రహము సంకీర్తనభండారము ద్వారమునెడమప్రక్క నున్నది. ఆద్వారమునకుఁ గుడిప్రక్కను పెదతిరుమలాచార్యుల విగ్రహమును గాననగును. బంగారువాకిలిదగ్గఱనుండి ఒకకంట స్వామిని ఇంకొక కంట భాష్యకారులను (చిదంబరమున కనకనభాపతిని, వరదరాజులను దర్శించునట్లే) అన్నమాచార్యుని తత్పుత్రునిగూడ దర్శింవనగును. నరిగా నీయుర్ధవును నిరూపించునదిగాఁ జినతిరుమలాచార్యుఁడుగాఁబోలును రచించిన సంకీర్తనము లున్నవి. అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను ! మఱఁగు సొచ్చితి మీకు మహిలో నారాయణా పల్లవి 71 నిన్ను ధాన్యముచేసీ నిచ్చఁ దాళ్ళపాక ! అన్నమయ్యఁగా రెదుట నదిగో వయ్యా పన్ని యూతనినే చూచి పాతకులమైన మమ్ము ! మన్నించవయ్య వో మధుసూదనా Iieseồli 1 సంకీర్తనలు చేసీ సారెఁ దాళ్ళపాక అన్నమయ్య ! అంకెల నీ సన్నిధినే అదిగోనయ్యా ! అంకించి నేవారివాఁడ నని దుషుండ నైనా నా ! సంకె దీఱఁ గావవయ్య సర్వేశ్వరా ! llege5ii 2 పాదాలం దున్నాఁడు తాళ్ళపాక అన్నమయ్య మీకు ఆదరాన ముక్తుండై అదిగో వయ్యూ ! ఈ దెస శ్రీవెంకటేశ యీసంబంధాననే నన్ను ! నీదయ వెట్టి రక్షించు నెమ్మది భూరమణా ! అఱి 3 అన్న అధ్యా, 223జేకు దేసాళం ఈతఁడే ముక్తిదోవ యీతండే మా యాచార్యుఁ ! డీతఁడు గలుగఁబట్టి యిందరు బదికిరి పల్లవి అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు ! యిదె వీఁడె శ్రీవెంకటేశునెదుట ! వెదవెట్టి లోకములో వేదము లన్నియు మంచి 1 పదములు సేసి పాడి పావనము సేసెను ఈతడే|| 1 అలరుచుఁ దాళ్ళపాక అన్నమాచార్యులు నిలిచి శ్రీవెంకటనిధియె తానై | కలిదోషములు వాప ఘనపురాణము లెల్ల పలుకుల నించి నించి పాడినాఁడు హరిని |ఈతఁడేI2 అంగవించెం దొళ్ళపాక అన్నమాచార్యులు ! బంగారు శ్రీవెంకటేశు పాదములందు ! 72 రంగువీఱ శ్రీవెంకటరమణుని నలమేలు ! మంగను యిద్దజీం బాడి మమ్ముఁ గరుణించెను Iఈతఁడే 13 అన్న అధ్యా 232 తేకు. శ్రీరాగము హరియవతార మీతఁడు అన్నమయ్య | ఆరయ మూగురం డితం డన్నమయ్య ||పల్లవి వైకుంఠనాథునినద్ధ వండి(బాడుచున్నవాఁడు ! ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య | ఆకసపు విష పాదమందు నిత్యమై వున్నవాఁడు ఆకడీకడఁ దాళ్ళపాక అన్నమయ్య |హరి| 1 క్షీరాబ్దిశాయి నిట్టె సేవింపుచునున్న వాఁడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య | ధీరుఁడై సూర్యమండల తేజము వద్ద నున్నవాఁడు 1 ఆరీతులఁ దాళ్ళపాక అన్నమయ్య హరి|| 2 యీవలసంసారలీల నిందిరేశుతో నున్నవాఁడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య | భావింప శ్రీవేంకటేశు పాదములందె వున్నవాఁడు ! హావభావమై తాళ్ళపాక అన్నమయ్య హరి 3 అన్న అధ్యా. 117 టేకు. భాష్యకారులకుఁబోలె నన్నమాచార్యులకును విగ్రహమును వెలయించి తాళ్ళపాక యరలో ప్రతిష్టయే జరుపవచ్చునుగాని యానాఁ డన్నమాచార్యునినట్లు పూజించుటకు స్థానపతుల సమ్మతి దొరకవలెను. ఆయురగోడ మీఁదవారి విగ్రహవు చెక్కించుటకే దొరకెనేమో. అన్నమాచార్యునివలె గొప్ప విద్వాంసుఁడు సంకీర్తనాదికర్త మహాభక్తుఁడు స్వామి కగహారము లనేకములు సమర్పించినవాఁడు పెదతిరుమలా చార్యునిమూర్తికూడ నుండవలసినదయ్యెను. పినతిరుమలాచార్యుఁడీ కొఱఁత తీరుటకు మంగాపురమున గుడి కట్టించి మజొక వెంకటేశ్వరస్వామినే 73 వెలయించి ప్రతిష్టించి యక్కడ నాళ్వార్లతో భాష్యకార్లతో దేశికులతోసహ అన్నమాచార్యుని విగ్రహమునుగూడఁ బ్రతిష్టించి పూజాపురస్కారములు కల్పించెను. తాళ్ళపాక యరద్వారమున కిరుప్రక్కలనున్న విగ్రహములలో నొకటి ముదివయసుది ఇంకొకటి లేవయసుది గానున్నది. అన్నమాచార్య చరిత్ర (చూ.35 పుట)లో నున్న వర్ణనమున కనుగుణముగానే యిక్కడ రూపకల్పన మున్నది. నంగీతరచన ద్రవిడకర్ణాటాంధ్రభాషలలోకెల్లఁ బ్రాచీనములయిన సంకీర్తనము లన్నమాచార్యునివే. నంకీర్తన శాస్రవును గల్పించినవాఁడు నన్నమాచార్యుఁడే. కనుకనే యూతనికిఁ బదకవితాపితామహుఁ డని, సంకీర్తనాచార్యుఁ డని హరికీర్తనాచార్యుఁ డని బిరుదులుగలిగెను. కన్నడమునఁ బురందరదాసులవారును ప్రాకృతమున వెంకటమఖియు నీయనకుఁ దర్వాతనే సంకీర్తనములు గీతములను రచించిరి. ప్రాఁతవగు కృష్ణాచార్యుని నంకీర్తనములు తాళగంధివచనములేకాని పల్లవి చరణములు గల పదకవితా రచనలుకావు. అట్టి తాళగంధివచనరచనలను పెదతిరుమలాచార్యుఁడుగూడ వైరాగ్యవచనమాలికాగీతము లని పేర్వెట్టి రచించినాఁడు. అవి వెంకటేశ్వరవచనములని వెంకటేశ్వరవిన్నపము లని మద్రాసు తంజావూరి లైబ్రరీలలో నుండగా నేను గుర్తించి ప్రకటించితిని. జాజఱలు, చందమామలు, కోవెల, చిలుక, తుమ్మెదపదములు, లాలి సువ్వి గొబ్బి ఉయ్యాల లాల జోల జోజో జేజే జయజయ విజయీభవ శోభన మంగళ వైభోగములు, మేలుకొలుపులు, నలుఁగులు, దంపుళ్ళ కొట్నాలు, కూగూగులు, గుజ్జెనగూళ్ళు, చందమామ గుటకలు, నివాళులు ఆరతులు, మంగళారతులు, జయమంగళాలు, అల్లోనేరేళ్లు, చాఁగుబళాలు, బళాబళాలు, సాసముఖాలు, అవధానములు, తందానలు, వెన్నెలలు, చిత్తమా, మనసా, బుద్ధి (సంబోధనలు) మొదలగు మధురకవితారచనా విశేషము లీనంకీర్తనములలోఁజాలఁగలవు. అన్నమాచార్యుఁడు సంకీర్తనలక్షణమున వీనిలోఁ గొన్నింటిని బేర్కొనుటచే నంతకుఁబూర్వముననుండియు నివి వాడుకలో వచ్చుచున్నవే 74 యనవలెను. తుమ్మెదపదములు, ప్రభాతపదములు, పర్వతపదములు, ఆనందపదములు, శంకరపదములు, నివాశిపదములు, వాలేశుపదములు, గొబ్బిపదములు, వెన్నెల పదములు, సెజ్జవర్ణన గణవర్ణనపదములు, పాల్కురికిసోమనాథుఁడు తనగ్రంథములలోఁ బేర్కొన్నాఁడుగాని యవి యిప్పడు గానరావు. అవి యేవో పొడిపొడిగా వెలసినలఘురచనలయి యుండునుగాని ప్రఖ్యాతకవ లానుపూర్వితో రచించినవిగావేమో! త్యాగ రాయలకృతులకుఁ బూర్వ మాంధ్రగాయకు లాలాపించుచుండిన గేయములే వి? యుని పరిశీలింపఁగాఁ జాలినంత సమాధానము దొరకకున్నది. నేఁటిగాయకు లందఱును ద్యాగరాయాదులను నూతేండ్ల క్రిందటి వారినే యెఱుఁగుదురు. సింగభూపాలుఁడు పెదకోమటివేమారెడ్డి ఫ్రాడదేవరాయఁడు (సంగీతరత్నాకరః అనఁబడినాఁడు) సంగీతగ్రంథకర్తలు అన్నమాచార్యుని కించుకపూర్వులు. బయకారరామామాత్యుఁడు, కృష్ణరాయఁడు అచ్యుతరాయఁడు తిరుమలరాయఁడు, సంగీతగ్రంథములకుఁ గర్తలు, కారయితలును. వెంకటగిరి కాళహస్తి కార్వేటినగరము నూజివీడు చల్లపల్లి ముక్త్యాల పిఠాపురము పెద్దాపురము విజయనగరము గద్వాల వనపర్తి ఆత్మకూరు మొదలగు రాజాస్థానములు సంగీత వినోదము లేనివి గావు. దక్షిణాంధ్రరచనలలో తంజాపుర్యాదులలో వెలసినగీయరచనలు సురక్షితములుగా నున్నవిగాని తెలుఁగుదేశపు రచనలు ససిగా దొరకుట లేదేల? కృష్ణరాయలమీఁదిగేయరచన లైనఁ గానరావే. ఆనుపూర్వితో క్షేత్రయపదములు ఏగంటిచిలుకపాటి పదములు రామదాసుకీర్తనలు ముత్తేవివారికీర్తనలు తాడంకి వారికీర్తనలు నల్లబాటివారికీర్తనలు సారంగపాణి పదములు గుత్తెనదీవిరామాయుణకీర్తనలు అధ్యాత్మ రామాయణకీర్తనలు శోభనాద్రీశ్వరసంకీర్తనలు నని కొన్నిగలవు గాని యవియెల్ల నంతప్రాచీనములు గావు. మద్రాసుప్రాచ్యలిఖితపుస్తకశాలలోఁ గొన్ని పొడి పొడి గేయరచన లున్నవిగాని యందుఁ గొన్ని ప్రాచీనతరము లయినను గావచ్చునుగాని యవి యానుపూర్వితో కర్తృనామాంకముతో లేవు. యక్షగానములు గొన్ని వానిలోనిగేయరచనలు గొన్ని కలవుగాని మొదటి కొయక్షగానములే యంతప్రాచీనములు గావు. తెలుఁగునఁ 75 దొలుత శ్రీనాథుఁడే యక్షగానములఁ బేర్కొన్నవాఁడు. దాక్షారామమున సంగీత నాట్య విద్యా వినోదములు జరుగుట నాతఁడు వర్ణించినాఁడుగాని యానాఁటిగేయుము లేవొ సరిగాఁ దెలియరావు. చాళ్యుక్యరాజుల గ్రంథములలో (అభిలషితార్థచింతామణి, సంగీత చూడామణి) సంగీతవిషయములు చాలఁ గలవుగాని వానిలో వర్ణితము లయిన సంగీతప్రబంధము లంతముఖ్యమయినవి గావు. ఏలలు ధవళములు చర్చరులు ఏకతాళులు శరభలీలలు చిందులు మొదలయినవేవో కొన్ని మాత్రమే చిన్నచిన్ని రచన లందుఁ జెప్పఁబడినవి. అందు గొన్ని నేఁడును వాడుకలో నున్నవి. వానిని గూర్చి యభిలషితార్థచింతామణి సంగీతచూడా మణులలోని ముక్కలు కొన్ని “కథాసు షట్పదీ యోజ్యా వివాహే ధవళ స్తథా ఉత్సవే మంగళో గేయ శ్చర్యా యోగిజనై స్తథా" "పదేపదే భవే ద్రాగః తాళ శ్చాన్య పదేపదే పదాస్తే స్వరతాళాభ్యాం గేయ శ్శరభలీలకః" "షోడశమాత్రాః పాదేపాదే యత్రభవస్తి నిర స్తవివాదే పద్దళికా జగణేనవియుక్తా చరమగురు స్సా సద్బిరి హెూక్తా" "రాగో హిందోళక స్తాళ చర్చరీ బహవోంఘ్రయః యస్యాం షోడశమాత్రాస్సు ర్వె ద్వేచ ప్రాససంయు తౌ సా వసంతోత్సవే గేయా చర్చరీ ప్రాకృతైఃపదైః" 'పద మన్త్యంసమాదాయ యమకస్థితిభూషితః ఆవృత్యాగీయతే యస్తు చక్రవాళ స్ప ఉచ్యతే గద్యేవా పద్యబంధేవా పుణ్యనామాంతశోభితః నామాంతే స్వరసంయుక్తో గీయతే చక్రవాళకః" లక్ష్యమ్ శశాంకశకలం కలంకికుముదం ముదం నవహతే హతే హిమకరే కరే తదసమం సమంవివసితం సితంవిజయతే యతే తవయశః. 76 "నిరంతర మనుప్రాసో యతి ర్యత్ర పదేపదే క్రియతే గీతత్త్వజైః సా స్మృతా త్వేకతాళికా" “ధవళాది పదైః పాదై రాశీర్వాదసమన్వితైః ఛందసా యేనకేనాపి కర్తవ్యో ధవళాభిధః" పై గ్రంథములలో లక్ష్యములు గొన్ని కర్ణాటభాషలో నున్నవి. చాళు క్యులు కర్ణాటకు లగుటచేతను రాజులగుటచేతను తొలుత సంగీత సంప్రదాయ మధికముగాఁ గన్నడమున బెంపొందించియుందురు. మొదటి కీగానమునకే కర్ణాటగాన మని పేరయ్యెను. సంగీతశాస్త్రమున స్వరపద్ధతికి ధాతు వని సాహిత్యపద్ధతికి మాతు వనిపేరు. శరీరమున సప్తధాతువు లుండుటఁ బట్టి తత్సాదృశ్యమున సప్తస్వరములకు ధాతుసంజ్ఞ కుదిరెను. 'మాతు కర్నాటభాషాపద మనుకొందును. మాతు=మాట ఈ శాస్త్రము తొలుత కర్ణాటమున వెలయుటచే సాహిత్యమునకు మాతు' అన్నకర్ణాటపదము గొనుటయ్యెను గాఁబోలును. పై లక్షణ శ్లోకములలో నున్న చర్చరియే జాజఅ యయినది. అన్న వూ చార్యనంకీర్తనములలోని జాజఅపాట లన్నియు గోవాళ్ళు వసంతోత్సవములోఁ బాడునవిగా నున్నవి. ఒకటి: ముఖారి చాలుఁ జాలు నీజాజఅ, నన్ను జాలిఁ బఱచె నీజాజఱ ||పల్లవి| వలపువేదనల వాడేను యీ ! తలనొప్పలచే తలఁకేను పులకలమేనితో పొరలేను కడు | జలిగొని చల్లకు జాజర |iళనాలు|| 1 వొల్లని నినుఁ గని వుడికేను నీ చిల్లరచేఁతలఁ జిమిడేను ! కల్లగందవొడిఁ గాగేను పైఁ జల్లకు చల్లకు జాజఱ thధాలు! 2 77 తివిరి వెంకటాధిప నేను నీ | కప్పఁగిటి కబ్బితి గదనేఁడు రవరవ చెమటఁ గరఁగి నేడూ యిదె ! చవులాయెను నీజాజఱ |చూలు 3 అన్న, శృంగా. 87 తేకు. నాచనసోమనగూడ వసంతవిలాసమున జాజఱ నిట్లు వర్ణించినాఁడు: "వీణాగానము వెన్నెలతేట | రాణమీఱఁగా రమణులపాట | ప్రాణమైనపిన బ్రాహ్మణువీట | జాణలుమెత్తురు జాజఅపాట"| ఇంతకుఁ జెప్పవచ్చిన దేమనఁగా విద్యానగరవినాశముపిదప అంధ్ర దేశమున సంగీత మన్నఁ గొంత యశ్రద్ద పెరిగినదనుట. అదికారణముగాఁ బ్రాచీనగేయరచన లెన్నో అంతరించి పోయినవి. దాగియున్నను రాగిరేకుల మీఁది కెక్కియుండుటచే నేఁటి కయినను దాళ్ళపాక సంకీర్తనములు పైకి రాఁగల్గినవి. అన్నమయు నంతానము నరసింహకవి అన్నమాచార్యుని ప్రథమభార్యయగు తిరుమలమ్మకు నరసింగన్న, నరసయ్య, నరసింహాచార్యుఁడు అని పేర్కొనఁబడువాఁడు చాలా గొవ్పకవీశ్వరుఁడు కొడు కుండెను. నిరువ వూన ను కవితా నిర్వాహకుఁడయిన తెనాలి రామకృష్ణకవి తనసమీపకాలమువా రగు తాళ్ళపాక కవుల నిట్లు సన్నుతించెను. కI చిన్నన్న ద్విపద కెఱఁగును పన్నుగఁ బెదతిరుమలయ్య పదమున కెఱఁగున్ ! మిన్నంది మొరసె నరసిం గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్ | 1 1. రామకృష్ణునికిఁ జిన్నన్నకు. నూ జేండ్లతర్వాత నప్పకవీయమున నీపద్య ముదాహృత మయినది. 78 ఈ పద్యమునఁ దనతో § 1560 దాఁక వర్తిల్లినవాఁడగు చిన్నన్నను, అతని తండ్రియు క్రీ 1453 దాఁక వర్తిల్లినవాఁడునగు పెదతిరుమలాచార్యుని, అతని యన్నయగు నరసింగన్నను మెచ్చినాఁడు. ద్విపదమునకుఁ జిన్నన్న వ్రాలును. పదములకుఁ బెదతిరుమలయ్య వ్రాలును. పద్య గద్య (ని) శ్రేణిని నరసింగన్న మిన్నందివైూఁగును! అని దీనియర్థ వును కొందును. నరసింగన్న 0ుం దది కవుగాఁ బ్రస్తుతుఁడయ్యెను. కాని యూతఁడు రచించిన గ్రంథము లేవో తెలియరావు. "పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు! జోడు లేఁ డన సభఁజొచ్చి వాదించి పరగిన ధీశాలి ప్రతివాది దైత్య నరసింహుఁ డనఁగల్లె నరసింహగురుఁడు, అని చిన్నన్నయష్టమహిషీకళ్యాణమున నాతని స్తుతించెను. ఆతని కుటుంబ వృద్ధినిగూడ వివరించెను. చిన్నన్న పేర్కొనుటే కాని దేవస్థానశాననములోఁగాని, తాళ్ళపాక వారి యిండ్డలోఁగాని, లోకమునఁగాని యాతని విషయ మేదియు గానరాకున్నది. చిన్నన్నయే ($ 1546 కొండవీటిసీమలోని చెందలూరు మల్లవర గ్రామములను స్వామికైంకర్యములకై సమర్పించుచు నందు మాఘశుద్ధ చతుర్టీతిథిని తన పెదతండ్రిగారయిన నరసయ్యంగారి ప్రత్యాబ్లికదినమున నర్చనావిశేషముల నిర్వహణముకూడఁ జేర్చినాఁడు.' සුධි é 1546 నాఁటికి నరసింగన్న దివ్యధామముఁ బడయుటను జిన్నన్న కాతనిపై గౌరవమును దెలుపుచున్నది. శ్రీ వీరేశలింగము పంతులుగారు కవిచరిత్రమున కవిర్ణరసాయన కర్త కృష్ణదేవరాయలనాఁటి వాఁడని కృష్ణరాయని "ఆందోళికల యందు నంతరచరులౌట సవికృతాకృతుల పిశాచకజనులు.ప్రభుదురాత్ముల నెవ్వాఁడు ప్రస్తుతించు" నని గర్పించె నని, వ్రాసినారు వృద్ధానుశ్రుతినిబట్టి వ్రాసినయి వ్రాఁత విశ్వాస్యమే యనుకొందును. కవికర్ణరసాయనకర్త నరసింగన్న తాళ్ళపాకసింగన్న కాఁ గూడు ననుకొందును. 1. తిరుపతి శాసనములు 5 వ్యాల్యుం. 184 పుట, చూ, 11 79 లక్షణగ్రంథములందు సుంకసాలనరసింగన్న అని కలదు. సంకుసాల అని లోకమునూడుక. "సుంకేసుల" అని గ్రామములు రాయలసీమలో నున్నవి. కI ఇంకా నవ్వే వచ్చే సుంకేసుల మ్రానిక్రింది సుద్దులు దలఁపన్ లంకించుకొన్న రాజవు వెంకటగిరివాస ! విబుధవినుతవిలాసా ! క టెంకాయ చిప్పలోపల వంకాయా పెసరపప్ప పరివంటకమున్ ఇంకాఁ బెట్టేఁ దినరా వెంకటగిరివాస ! విబుధవినుతవిలాసా ! ఇత్యాదిగా నెవరు రచించినవో రుచిగల కందపద్యములు గొన్ని శ్రీవెంకటేశ్వరస్వామిపేరనున్నవి. సుంకసాల సంకుసాల సుంకేసులలు ఒకయూరిపేరి వికారములేమో ! కృష్ణరాయఁడు తాళ్ళపాక గ్రామమును వ్యాసతీరులవారి కగ్రహారీకరించుటచే నరసింగన్న తాళ్ళపాక విడిచి పైగ్రామము చేరి నుంకసాల యింటి పేరివాఁ డయ్యెనేమో! కవి కర్ణకసాయనమున నాతఁడు తనకులగోత్రములను దలిదండ్రులను బేర్కొనఁ డయ్యెను.గ్రంథాదిని 'గురువరభట్టపరాశరచరణ సరోరుహ సముల్లసన్నాననుఁడన్' అని గురుస్తుతి చేసినాఁడు. 'ఆదిమశఠకోపాది' తుదిని 'ఆదిమశఠకోపాది' అని యాశ్వాసాంత పద్యమునఁ జెప్పినాఁడు. వీనినిబట్టి యాతఁడు, భట్ట పరాశరాహ్వయుని శిష్యుఁడనీ, రెండవ శఠకోప యతియైన-యహెూబలమఠ ప్రతిష్టాపకవన్ శఠకోపయతి నెఱిఁగిన వాఁ డనీ గుర్తింపనగును, వేదాంతదేశికుల శిష్యులు, బ్రహ్మనూత్ర గీతావ్యాఖ్యాతభట్టపరాశరు లొకరు గలరుగాని అయినను రామానుజుల నాఁటి పరాశరభట్టారకుల వంశజులందఱకు పరాశరభట్ట నామము సాధారణ మనికూడ వాడుకగలదు. క్రీ. పదునైదవ శతాబ్దియత్తరార్ధమున 80 వన్ శఠకోపయతులు గలరుగాన యీతఁడు వారినాఁటివాఁడో వారితర్వాతివాఁడో అగుటచే నన్నమయ పుత్రుఁ డగుట నిర్బాధమగును. కవికర్ణరసాయనమున వైష్ణవమతాభిమానము, అద్వైతమత ద్వేషము, అన్నమాచార్య సంకీర్తనచ్ఛాయలు నిలడారుగా నున్నవి. నన్నిచోడ కుమార సంభవమును, ఎఱ్ఱననృసింహపురాణమును, ఉత్తర హరివంశమును, శ్రీనాథరచనలను, ననుకరించునవిగా పలుకుబళ్ళు, కూర్పుతీర్పులు, పద్యచ్ఛాయలు, నిందుఁ జాలఁగలవు. కవిర్ణరసాయనము తాళ్ళపాక నరసింగన్న రచనమే యగుచో నందు రాజాశ్రయగర సహేతుకమే యగును. కారణము సుస్పష్టముకాదు కాని బహువారములు తిరుపతికి విచ్చేయుచు వచ్చినవాఁడు కవి విద్వాసుఁడు కవిపోషకుఁడునగు శ్రీకృష్ణరాయఁడు సంస్కృతాంధ్రవిద్వాంసులు మహనీయులు కవులు గాయకులునగు నరసింహ పెదతిరుమల పినతిరుమలాచార్యాదుల నేలొకోయాదిరింపఁడయ్యెను. పైగా వారి నివాసగ్రామమగు తాళ్ళపాకను వ్యాసతీరుల కగ్రహారీకరించెను. అచ్యుతరాయలవారు మాత్రము తాళ్ళపాకవారి నాదరించి యాదృతుఁ డయ్యెను. పెదతిరుమలయ్యు అన్నమాచార్యుని రెండవభార్యయగు అక్కలాంబయం దీతఁడు జన్మించెను. ఈతనికి నరసమ్మ, తిరుమలమ్మ యుని యిర్వురు చెలియండ్రును గలరు. ఈ తిరుమలాచార్యుఁడు § 1553 దాఁక జీవించినాఁడు. క్రీ 1503 దాఁక జీవించిన యున్నవూర్యుఁడీ పెదతిరుమలయ్య పెదకుమారుఁడగు చినతిరుమలయ్యగారికి బ్రహె్మూప దేశముఁ జేసినాఁడు. 1500 ప్రాంతముల చినతిరుమలయ్యు యపనయనము జరిగిన దనుకొన్నచో 1493 ప్రాంతముల జన్మించిన చినతిరుమలయ్య యువనయనము జరగిన దనుకొన్నచో 1493 ప్రాంతము జన్మించిన చినతిరుమలయ్య తండ్రియప్పటి కిర్వదేండ్లవాఁడే యనుకొన్నను 1473 ప్రాంతముల జన్మించినవాఁ డగును. ఈతని నిండుయావనము శ్రీకృష్ణరాయలవారి కాలమున గడచినది. కృష్ణరాయల 8] పరిపాలన కాలమున నీతఁడు శ్రీవెంకటేశ్వరస్వామికిఁ గొన్నికైంకర్యములు జరపి నను నందు సాళ్వతి వ్మురునును నాతని తవ్ముఁడగు గోవిందయ్యుయు నిర్వాహకులుగా నుండిరి. అశాననములలో శ్రీకృష్ణరాయలపేరు లేదు. పెదతిరుమలయ్యకును నాతని యన్నయగు నరసింహకవికిని శ్రీకృష్ణరాయనితో వైరస్యము గల దనుకొనుట క్రింకొక సాధనము: 'మండెమురాయునామక నరసింహ దండనేత్రు (తృ?)న కిష్టధనబలస్పూర్తి" నని యన్నమాచార్య చరిత్రముననున్న వాక్యమునకు మండెము రాయఁడను నామాంతరముగల నరసింహ దండనాధుఁ డని యర్థముగావచ్చు నని యనుకొంటిమి. (చూ.పుట. 286) పయిమండెము కడపమండలము చినమండెము అనీ, చితూరు మండలమున గాజులమండెము చిఱుమండెము అనీ కలగ్రామములలో నొకటయి యుండఁబోలును. ఆయూర పెదతిరుమలయ్య నెవరో కత్తితో నఱకిరట. ఆకత్తివ్రేటాతనికిఁ గలువదండ యైనదట ! “మండెము కోటలో మండలం బెఱుఁగ మండలాగ్రాహతి మహనీయ పుష్ప దామమై ధర్మాంగదస్థితిఁ బొలిచె నేమహామహుని యహీనగాత్రమున" నని చిన్నన్న చెప్పినాఁడు. దేవకీపురవాస్తవ్యుఁడగు నరసింహ దండనాధుఁ డిందు వ్రయోజకుఁడే వెూ! ఈ విషయువు పెదతిరుమలాచార్యుఁడే యిట్లు సంకీర్తనమునఁ జెప్పకొన్నాఁడు. శంకరాభరణ నాఁటికి నాఁడు గ్రోత్త నేఁటికి నేఁడు గ్రోత్త! నాటకపుదైవమవు నమో నమో పల్లవి సిరుల రుక్మాంగదుచేతికత్తిధార దొల్లి వరునధర్మాంగదుపై వనమాలాయ | 82 హరి నీకృపకలిమి నట్లనే యురులచే ! కరఖడ్గధార నాకుఁ గలువదండాయ |నాఁటి 1 మునుపు హరిశ్చంద్రుమొనకత్తిధార దొల్లి - పొనిఁగి చంద్రమతికిఁ బూవుదండాయ | వనజాక్ష నీకృపను వరశత్రులెత్తి నట్టి ! ఘనఖడ్గధార నాకుఁ గసూరివాటాయ నాఁటి| 2 చలపట్టి కరిరాజు శరణంటె విచ్చేసి కలుషముఁ బెడఁ బాపి కాచినట్టు 1 అలర శ్రీవెంకటేశ ఆపద లిన్నియు బాపి | ఇల నన్నుఁగాచినది యెన్నఁ గతలాయ నాఁటి 3 ఈ కీర్తనమునఁ జెవ్పఁబడినదే కాక (వుట. 286 వుట) సంకీర్తనమున వర్ణితమయిన విషయములుగూఁడఁ బెదతిరుమలాచార్యుని మాహాత్మ్యమును వెల్లడించుచున్నవి. ఆసంకీర్తనమును జినతిరుమలా చార్యుఁడు రచించియుండఁ బోలును. అచ్యుతరాయలవారు వూండి, నంగవుకోట గ్రామములఁ దామ్రాశాసన పూర్వకముగా దానము Šostocnoc బెదతిరుమలాచార్యుడు వానిని స్వామికే సమర్పించెను. ఆతఁ డచ్యుతరాయల జన్మనక్షత్రము నాఁడు తనద్రవ్యముతో స్వామికిఁగైంకర్యములఁ గల్పించెను. అచ్యుతరాయలనాఁ డాతఁడు విజయనగరములో విట్టలేశ్వరస్వామి కైంకర్యముల కై గొప్పభూ సమర్పణము చేసిను. పెదతిరుమలయ్య స్వామికి అర్పించిన గ్రామములు:- కావనూరు, మరువాకరై, కుప్పము, కీళంగుస్రము, మన్నసముద్రము, పూండి, సంగమకోట, (ఈ రెండూళ్ళ నంవత్సర వు రాబడి 1000 రేఖ పొన్నులు) రాయులపాడు, సోమయాజులపల్లి, కత్తమువారిపల్లి, ఎఱ్ఱగుంటపల్లి, పల్లిపురము, (133 వరాహాల సంవత్సరాదాయముకలది.) గండతిమ్మాపురము (100 oථිඟු పొన్నులు సంవత్సరాదాయముగలది.) ఈ గ్రామములుగాక-భిన్న భిన్న సమయములలో 4600 పణాలు 5203 పణాలు 2000 వరహాలు 450 వణాలు 1900 వణాలు 1020 నర్పణాలు 2300 నర్పణాలు సమర్పించినారు. 83 శ్రీస్వామివారికిని ఎగువ దిగువ తిరుపతులను కడమ చోట్లను వెలసిన వేల్పులకు బహువిధభక్ష్యభోజ్యాది నివేదనలను నిత్యోత్సవ వక్షోత్సవమాసోత్సవ వరోత్సవాదులలో నింక ననేకవిధముల కైంకర్యములను వనభోజన వినోదములను తమ వంశపారంపర్యముగా తమ పేర జరపించుటకు బయిగ్రామములను ధనమును శ్రీభండారమున నర్పింపగాఁ గోవెల స్థానపతు లందుకు నమ్మతిగా శాననములు చెక్కించిరి. ఇవిగాక వీరు కట్టించిన కట్టడములు వగైరాలు:- స్వామిపుష్కరిణి జీర్ణోద్ధారము, మెటు, మండపములు, నీరాడుమండపము కొండమీఁద తాళ్ళపాకవారి యింటి ముందు మండపము, సంకీర్తన (సంకీర్తనములు చెక్కిన రాగిరేకులు దాచి ఉంచినది) భండారము, అక్కడ దీపారాధనలు, అక్కడ సంకీర్తనలు పాడే వైష్ణవులకు జీతాలు, గుడిగ్రామాలలో చెరువులు కాలువలు బాగు చేయించుటకు ధనదానము, ఆళ్వారుతీర్థము దగ్గఱ శ్రీలక్ష్మీనారాయణస్వామి ప్రతిష్ఠ ఇత్యాదులు. కొన్ని ఉత్సవములలోని ముఖ్యాంశులు:- శ్రీనివాసమూర్తికి ప్రతి శుక్రవారము తిరుమంజనము పిదప పునుఁగుతైలము పూయునప్పడు పన్నీరు.చెంబు సత్కారముపడయుట (తాళ్ళపాకవారు సంకీర్తనములు అప్పడు పాడేవారు), అచ్యుతరాయల జన్మనక్షత్రమగు మృగశిరనాఁడు ఉత్సవముజరవుట, స్వామి వుష్కరిణి గటున తాళ్ళపాక వారు నిర్మించినరాతి నంభవుమీఁద నంవత్సరవు పొడుగునా ప్రతిగురువారము దీపారాధన, ముక్కోటి ఏకాదశినాఁడు స్వామిపుష్కరిణి గటున ముప్పది దీపాలు, సంకీర్తన భాండారము దగ్గర నాలు తిరుబోనములు దీపాలనూనె ఆభాండారములో సేవచేసే శ్రీవైష్ణవుల జీతాలు వగైరాలు. తిరుమలయ్యగారికి శ్రీపతితొన్నడయ్య అనీ తిరుపతి చేరువనున్న కులశేఖరపురవాస్తవ్యుఁడు పల్లి పట్టురయ్య అనీ ఇద్దఱు సాతాని వైష్ణవులు శిష్యు లుండిరి. వారు కూడ స్వామికిఁగైంకర్యములు జరపిరి. 84 పెదతిరుమలయ్య గారు చేయించిన యుత్సవ విశేషములు సమగ్రముగా వ్రాసిన నదియే పుస్తకమగును. ఈతఁడు రచించిన గ్రంథములు: 1 శృంగారసంకీర్తనములు. 8 నీతిసీసశతకము 2 అధ్యాత్మ సంకీర్తనములు 9.సుదర్శనగడ 3 వైరాగ్యవచనగీతాలు 10 రేఫఱకారములు. 4 శృంగారదండకము 11 భగవద్గీత తెలువచనము 5 చక్రవాళమంజరి 12 ద్విపదహరివంశము 6 శృంగారవృత్త శతకము 13 ప్రభాత స్తవము 7 వెంకటేశ్వరోదాహరణము పై వానిలో కడవటి రెండు వుద్రితవులుగా లేదు. తొలి రెండింటిలోఁ గొంత భాగమును, గడమవి సమగ్రముగాను ముద్రితములయినవి. హరివంశము దొరకనే లేదు. ఇవిగాక చిన్నన్న పేర్కొన్న యుంధ్ర వేదాంతము తొలుత కృష్ణమాచార్యుఁడును తర్వాత తనతాత యన్నమాచార్యుఁడును పిదప తనతండ్రి తిరుమలాచార్యుఁడును ననుక్రమముగా రచించినది. సంకీర్తనాత్మకము. ఇట్లనుటకు సాధకముగా అష్టమహిషీ కల్యాణము లోన నిట్లున్నది. "క్ష్మానుతద్రావిడాగమసార్వభౌము లై 1 న మావారలనాళు వారలను వేదంబులెల్ల ద్రావిడముగాఁజేసి వేదాంతవిదులు గోవిదులు నైనట్టి గురుతరులకు పరాంకుశ ముఖ్య యోగివరుల" నని ద్రవిడవేదాంతకర్తల సన్నుతిపై "వనజాతజాత సర్వసురేంద్రముఖులు గనలేని వెంకటగ్రావాధినాథు! పదముల శోభనా స్పదములౌ తనదు! పదముల బహుదేశపదము జనులఁ గనఁ జేసిపంచమాగమస్వారభౌముఁ డనఁబ్రసిద్ధకినెక్కియఖిలవిద్యలను నన్నయాచార్యుండెయనఁదాళ్ళపాక యన్నయాచార్యుఁడాయతకీర్తిఁజెలగె" "వేదంబు తెనుఁగుగావించి సంసార 85 భేదంబుమాన్పిన కృష్ణమాచార్యు ఘనతరపంచమాగసార్వభౌము! ననఘు శ్రీతాళ్ళపాకాన్నమాచార్యుఁ దలఁచి" అనియు "ఉరుయోగసామ్రాజ్యవిభవ జనకుండు తిరుమలాచార్యవర్యుండు వేదాంతవిద్యాప్రవీణుఁడై యంధ్ర వేదాంతమొనరించి, ద్విపదరూపమున హరివంశకావ్య మాయతనస్ఫూర్తి హరివంశమిగురొత్త నను వొందజేసి" అనియు నాంధ్ర వేదాంత కర్తలసన్నుతిగలదు. ద్రవిడమున వేదవేదాంతములను పరాకుంశయోగి మొదలగు నాళ్వార్లు ద్రావిడీకరించి ద్రావిడగమసార్వభౌము లనిపించుకొనఁగా తెలుఁగున కృష్ణ వూచార్యుఁడు:- కృష్ణమాచార్యనంకీర్తనకర్త, అన్నమాచార్యుఁడు:- సంకీర్తనాచార్యుడు, సంకీర్తనకర్త, పదకవితా పితామహుఁడు. పెదతిరుమలాచార్యుడు:- సంకీర్తనాదికర్త. ఇటీవుువ్వురును వేద వును తెనుఁగు గావించి అంధ్రవేందాతకర్తలని వంచమాగసార్వభౌములని పంచమాగచక్రవర్తులని యనిపించుకొనిరి. తిరువులయ్యుకు శ్రీవుద్వేద వూర్గ వ్రతిష్ణా వనాచార్య శ్రీరామానుజసిద్ధాంతస్థాపనాచార్య వేదాంతాచార్య కవితార్కికకేనరి శరణాగతిజ్రపంజరబిరుదములు గలవు. ఈతనికి వేంకటేశ్వరస్వామి త్రిపురుషపర్యంతము ప్రత్యక్షంబును సప్తపురుషపర్యంతముగా మోక్షంబు నొసంగెదనని వరమిచ్చెనట!' నంకీర్తనభండారము ఈ పెదతిరుమలయ్యుగారే నంకీర్తన భండారమునకుఁ బెంపువెలయించిరి. తొలుత అన్నమాచార్యుఁడే సంకీర్తన భండారమును నెలకొల్పిన టున్నాఁడు. అందకుఁ దార్కాణగా సంకీర్తనము. (పుట. 263) 1 చూ. శకుంతలాపరిణయము. పీఠిక, 86 అన్నమాచార్యుని నాఁట సంకీర్తనములు తాటియాకులమీఁద వ్రాసియుంచఁబడెనేమో! ఆతని తర్వాత పెదతిరుమలాచార్యుఁడు వానిని రాగి రేకులమీఁదఁ జెక్కించెను. రాగివిలువయు, చెక్కించుకూలియు నిప్పటిలెక్క ప్రకారము లక్షలగును. ఒకరో యిద్దరో అక్షరములఁ జెక్కువారగుచో నదియొక పురుషాయుషమునంతకాలము జరపినఁ దేల వలసినవనియగును. రాగితే కులను జెక్కినవాఁడు-అన్నమరాజు తిమ్మయ్య అని కొన్ని తేకులమీఁద నున్నది. పెదతిరుమలాచార్యుని తర్వాత చినతిరుమలాచార్యుని సంకీర్తనములుకూడ రాగితేకులకెక్కినవి. 1540లో సంకీర్తనభండారము దగ్గఱ సేవచేయు వైష్ణవు లిర్వు రుండుట, సంకీర్తనములు పాడేవారు కొంద అుండుట, కైంకర్యములు దీపారాధనలు జరుగుచుండుటయు తాళ్ళపాకవారి శిలా శాసనముల కెక్కి యున్నవి.’ ఈ సంకీర్తనభండారము (తాళ్ళపాకవారి అర) ద్వారమున కిరు ప్రక్కలనే విగ్రహము లున్నవి. అవి యన్నమాచార్య తిరుమలాచార్యు లివి. చినతిరుమలయ్యు ఈతఁడు పెదతిరుమలయ్య పెద్దకుమారుఁడు. అనమాచార్యుఁ డి తనికి బ్రహె్మూపదేశము (ఉవనయువు) చేసెను. ఇందుకు సంకీర్తనము: භාවිද් తాళ్ళపాకాన్నమాచార్య దైవమవు నీవు మాకు వేళమె శ్రీహరిఁ గన వెర వానతిచ్చితివి |పల్లవి గురుఁడవు నీవె సుమ్మీ కుమతి నైననాకు ! సరవి బ్రహె్మూపదేశము సేసితి | 1. చూ, తిరుపతి దేవస్థానం శాసనము నెం 144 నెం.4 వాల్యుం. 12 87 పరమబంధుఁడ వైనా పరికింప నీవే الجدد: دكة వరుస నేఁ జెడకుండ వహించుకొంటివి ዘöሞክ11 తల్లివైన నీవే సుమ్మీ తగినవిషయాలలో ప్రల్లదానం బడకుండా బ్రదికించితి | అలుకొని తోడునీడవైనా నీవే సుమ్మీ ! చిల్లర మాయలలోనఁ జెడకుండాఁ జేసితి |கு1ை2 ధాతవు నీవే సుమ్మీ తగు శ్రీ వేంకటనాధు నాతలఁపులో నిలిపి నమ్మంజేసితి ! యేతలఁ జూచినా నాకు నేడుగడయు నీవే ! ఆతల నీతల నన్ను నాచుకొని కాచితివి I€ত"॥3 చినతిరు. అధ్యా 7తేకు. కాన యీతఁడు § 1495 ప్రాంతముల జన్మించినవాఁ డను కొనవచ్చును. క్రీ. 1553 దాఁక నీతనిశాసనము లున్నవి. ఈతఁడు సంస్కృతాంధ్రములందు మహాకవి, మహావిద్వాంసుఁడు, అష్టభాషాకవి చక్రవర్తియని బిరుదుగలవాఁడు. తండ్రితాతలవలెనే అధ్యాత్మ శృంగార సంకీర్తనలను రచించినాఁడు. తెలుసంకీర్తన లక్షణము, అష్టభాషా, దండకము రచించినాఁడు (ఇవి ముద్రితములు చూ, తాళ్ళపాక1 వాల్యుం) శ్రీవెంకటేశ్వరస్వామికి దిగువ తిరుపతిలో వేల్పులకుఁ గూడఁ జాలా కైంకర్యములు కావించినాఁడు. అందు ముఖ్యములు గొన్ని గోవిందరాజస్వామికి, పెండ్లి తిరునాళ్ళు (వైవాహికోత్సవము) జరుపుటకు నేడియం అనుగ్రామము రాబడిలో సగమిచ్చినాఁడు. గోవిందరాజ విట్టలేశ్వరాచ్యుత పెరుమాళ్ రఘునాథ వరదరాజ లక్ష్మీనారాయణులకును హనుమదాలయములోఁ దాను ప్రతిష్టించిన నరసింహస్వామికిని కైంకర్యములకై చిత్రిచిత్రానక్షత్రమునఁ దన తిరునాళ్ళలో వైశాఖమృగశిరను దనతండ్రి తిరునాళ్ళలో గోవిందరాజస్నామి గుడిదగ్గఱి సుదర్శన చక్రమునకుఁ గైకర్యములకై 200 రేఖై పొన్నుల రాబడిగల వెదుమప్పాకంగ్రామము నర్పించినాఁడు. 88 మంగాపురమున కళ్యాణవేంకటేశ్వర దేవాలయ జీర్ణోద్ధారణము గావించినాఁడు. స్వామి దివసుందరమంగళ విగ్రహమునుగూడ నీతఁడే క్రొత్త వెలయింపించిన టున్నాఁడు. ఆళ్వారుతో భాష్యకార్లతో దేశికులతో సహ తన తాతగారగు అన్నమాచార్యువిగ్రహము నక్కడ ప్రతిష్టించినాఁడు. కాని యావిగ్రహము నేఁడు గానరాకున్నది. పెదతిరువెంగళనాథుఁడు ఈతఁడు సాత్త్వికశుభమూర్తి, సంగీతసత్కవిత్వాధికుఁడు నని చిన్నన్నచే స్తుతింపఁబడెను. స్వామి సన్నిధి నీతఁడు సంకీర్తనములు పాడుచుండఁగా స్వామి యాడుచుండెడువాఁడట! వెంకటాచార్యుఁడు "విశేషించియు నత్తిరు వెంగళనాథుండు సంకీర్తనంబుఁ బాడిన నాడందొండండె."నని చెప్పినాఁడు. ఈతఁడు. చిన్నన్న జీవించియుండఁగా క్రీ 1546 పూర్వమే దివ్యధామ మందినాఁడు. చిన్నన్న ఈతఁడే అన్నమాచార్యచరిత్రకర్త చినతిరుమలాచార్యున కీతఁడు వునాఁడవ తమ్ముఁడు. ఈంుర్వురనడువు అన్నమయు యుని పెదతిరువెంగళనాధుఁ డనీ యిద్దరు సోదరులు. చిన్నన్నతర్వాత తమ్ముడు కోనేరునాథుఁడు - వీ రందఱును సుప్రసిదులు. కోనేరునాథుఁడు 1560 తర్వాతఁగూడ నున్నాఁడు. తాళికోట యుద్ధమును విద్యానగర వినాశనమును జూచుచౌర్భాగ్యమునకుఁబాల్పడక 1565 పూర్వమే వీ రందఱు దివ్యధామ మందియుందురు. ధర్మకైంకర్యములు స్వామి కీతఁడును జాల ధరకైంకర్యము లొనర్చెను. అందొకటి:క్రీ. 1546 లో కొండవీటిసీమలోని చెందలూరు మల్లవర గ్రామములను స్వామి శ్రీభండారమున కర్పించెను. రెండు గ్రామములనుండి 1. శకుంతలా పరిణయ కృత్యవతరణిక, 89 సంవత్సరపురాబడి 620 గట్టివరహాలు. ఈసొమ్ముతో జరపవలసిన ధర్మకైంకర్యము లలో మన కిక్కడ ముఖ్య మయినవి : 1 వైశాఖమాన విశాఖానక్షత్రమున తాత అన్నమయుగారి జన్మనక్షత్రోత్సవకైంకర్యము. 2 చైత్రమాసము మృగశిరనక్షత్రమున పెదతిరుమలయ్యగారి జన్మ నక్షత్రోత్సవకైంకర్యము. 3 వూవుశుద్ధ చతుర్థి తవు పెదతండ్రి నర నయ్యగారి శ్రాద్ధదినకైంకర్యము. 4 జ్యేష్ఠమాసపూర్వపక్షచతుర్థి తనయన్నగా రగుతిరువెంగళప్ప శ్రాద్ధదినకైంకర్యము. 5 ఆశ్వయుజమాన బవూుళ త్రయోదశి తమతల్లిగారైన తిరుమలమ్మగారి శ్రాద్ధదినకైంకర్యము. వీనివల్ల నన్నమాచార్యాదుల జన్మమాననక్షత్రములు నిర్వాణ మాసతిథులు తెలియ నయినవి గాని వానిసంవత్సరనామములుతెలియ రాకుండట కొఱఁత గొల్పుచున్నది. ఒక్కయున్నవూ చార్యునివే జనననిర్యాణసంవత్సరములు తెలియువచ్చినవిగావి తక్కినవారివి తెలియురాలేదు. సూర్యచంద్రాదు లున్నందాఁకఁ బైవారిజన్మనక్షత్ర నిర్యాణతిథికైంకర్యములు సాగుచుండుటకే యాయగ్రహారసమర్పణములు జరగినవి గాని యాధర్మకైంకర్యములకు "శ్రీవైష్ణవులరక్ష" అనిమాట కలదుగాని అన్నీ అన్యథా అయిపోయినవి. పరమాచార్యుఁడయిన యన్నమాచార్యనిజన్మనక్షత్ర నిర్యాణతిథి కైంకర్యములను స్వామి కనేకా గ్రహారముల నొసగి యనేకకైంకర్యములు జరసిన మహావిద్వాంసుడు మహాకవి యగు తిరుమలాచార్యుని నిర్యాణదినకైంకర్యములు నయిన నిఁకమీఁద సాగుట యర్ధింపఁదగినది. అష్టమహిషీకళ్యాణము పరమోగివిలాసము ఉషాపరిణయము అన్నమాచార్య చరిత్రము చిన్నన్న రచించిన గ్రంథములు. ఈతఁడు జలజాత వాసిని చనుబాలపష్టిచే కవితారచన నేర్చినాఁడట. ఈతని యన్న 90 పెదతిరువెంగళనాథుఁడు 'సంగీతసత్కవిత్వాధికుఁడు' సంకీర్తనములు పాడుచుండు నవ్పడు స్వామి యూడుచుండెడువాఁడట. ఈమహామహులకు (అయిదు గురుకు) నప్పడు స్వామి పాండవులకుఁ గృషునట్లు సహాయమై యుండెడివాఁడట! వీరికి విచిత్రముక్తాత పత్రరత్నకిరీట ముద్రికా ప్రచండమణిమండిత మకరకుండలోత్కరాహః కరదీపికాపాదుకాది బహూకరణంబులను స్వామి కరుణించెనట! చిన్నన్న పరమయోగివిలాసాష్టమహిషీకళ్యాణములలో రత్నశుంభదనుపమ శ్రీవేంకటాద్రీశదత్తమకరకుండలరత్నమండితకర్ణుఁడనని, కావ్యంబు చెప్పి శ్రీవేంకటేశు మెప్పించి సకలంబు నెఱుఁగ నసాధారణాంక మక రకుండలములు గొన్నవాఁడ నని దినములోననె వేయిద్విపద లింపొంద వినుతవర్ణనలతో విరచించువాఁడ నని చెప్పకొన్నాడు. ద్విపదలక్షణము నీతడే నిష్కృష్టముగా నిర్వచించినాఁడు. లక్షణగ్రంథకారు లెవ్వరుగాని యితనివలె నిర్వచింపఁజాల రయిరి. ఈతఁడు. కస్తురివీణఁ గోసినకరణి తెలిగప్పరపుఁగ్రోవి దెఱచినసరణి విరవాదిపొట్లంబు విడిచినమాడ్కి పరిమళించుచుఁ గవుల్ బళిబళీ యనఁగు కవిత సెప్పినసులక్షణకవి. అర్వాచీనులు కొందఱు ‘తాళ్ళపాక చిన్నన్న దండెమీటులుగావు' అనీ అల తాళ్ళపాక చిన్నన్న రోమము లైతె తంబురాదండెకుఁ దంత్రులౌనె అనీయీతని గొప్పగాయకునిఁగా స్మరించిరి. చిన్నన్న గాయకుఁ డనుట కిక్కడి రాగిరేకులలోఁగాని గ్రంథములలోఁగాని యూధారములు గానరావు. చిన్నన్నకు అన్న తండ్రి తాత గొప్పగాయకులు గాన యిటీవలివారు గ్రంథములఁబట్టి చిన్నన్ననే యెఱిఁగినవారుగాన వారియోగ్యత నీతనికిఁ జేర్చి చెప్పియుండవచ్చును. కాక యీతఁడును గాయకుఁడేమో! గణపవరపు వెంకటకవి ప్రబంధరాజమున చిన్నన్న నిటు నన్నుతించెను: š. ఎన్నఁ దెనుఁగునకు రాజను గ్రన్నన యతిరాజునకును రమణయకును నేఁ జిన్నను ద్విపద నొనర్చను జిన్నన్నను బిరుదుగద్య చెప్పినఘనుఁడన్, 91 నూలినేతచే వస్త్రములు గల్పించి లోకమును నాగరక పల్చి యుద్ధరించువా రయిన సాలెవారి కీతఁ డాచార్యపురుషుఁడు. వారి వంశమర్యాదల కీతఁడు సంరక్షకుఁడుగా నుండెను. వీరికి పదివేల వరహాలు పాదకానిక సమర్పించిరి. చిన్నన్న వంశపారం పర్యముగా దమవంశపారంపర్యముగా గురుశిష్యతా సంబంధము వర్ధిల్లఁగోరిరి. ఇందుకు తామ్రాశాసనము వెలయించిరి. కోనేటి తిరువెంగళనాథుఁడు ఈతఁడు సదాశివరాయలచే క్రీ 1544, 1545 అద్దంకిదగ్గజీ బొల్లాపల్లి ఓలపల్లి అని రెండగహారములఁ బడసినాఁడు. క్రీ 1559లో కడపజిల్లా పుష్పగిరి చెన్నరాయనికిఁ గొంతభూమి సమర్పించినాఁడు. ఈతఁడు గొప్పవైభవ మనుభవించినాఁడనుట కీ క్రిందిపద్యముసాక్షి. సీ|| మొకరివా తెర కీర్తిముఖము బంగరుదండె పాలకి యేగురుం డోలి నెక్కె శ్రీజగన్నాథునూర్జితపదాంభోజముల్ సేవించి యేబుధాశ్రితుఁడు వెలసె కాయసిద్ధిని లంబికాయోగమార్గంబు తెలిసి యే ఘనుఁడు సాధించి నెగడె భక్తితోఁ బట్టాభిషిక్తులు ధరసాగి మొక్క నేవిభుఁడు పెంపెక్కి చెలగె నతఁడు పొగడొందు హారనీహారగంధ సారకర్పూరగోక్షీర సదృశయశుఁడు ఘనుఁడు పెదతిమ్మదేశికగర్భజలధి కువలయాపుండు కోనేటిగురువరుండు" | 1. చూ, తామ్రాశాసనము. శ్రీ వెం. ఓ జర్నల్, lవాల్యుం 1 పారు. 2. ఈ పద్యము శ్రీతాళ్ళపాక సూర్యనారాయణయ్యగారి వ్రాఁతకాగితములనుండి కైకొంటిని. 92 తిరువెంగళవ్ప ఈత ( డు గొవ్పవిద్వాంనుఁడు ఆవురు కావ్యవును దెలిఁగించినాఁడు. నామలింగానుశాసనమునకుఁ దెలుఁగువ్యాఖ్య రచించినాఁడు. కావ్యప్రకాశికకు వ్యాఖ్య రచించినాఁడు. é. 1554లో అంబతూరు తూప్పిల్ అగ్రహారములలో కొంతభాగము తిరుపతి గోవిందరాజస్వామి పెండ్లి తిరునాళ్ళ జరపించుటకుగా సమర్పించినాఁడు. క్రీ 1553లో చినకంచిలో అరులాళప్పెరుమాళ్ళకు వల్లత్తంజేరి పేరీచ్చంబాకము అను గ్రామము లిచ్చినాఁడు.' తిరువతి శాననములు తిరువతి దేవస్థానశాననము ಶೆಲ್ಲ నరవముననే కలవు. సర్వస్వతంత్రుఁడు దక్షిణాపథమునకెల్ల సార్వభౌముఁడును గాన యొక్క శ్రీ కృష్ణదేవరాయుఁడు మాత్రము గుడిలో నంన్కృతకర్ణాటాంధ్ర ద్రవిడములలోఁ దనశాసములఁ జెక్కించుకోఁ గలిగెను. తిరుమల తిరుపతి దేవస్థానమున గుడి గోపురములలోఁ దాళ్లపాక వారి శాసనములు నరవముననే యున్నవి. తిరుమల కొండక్రిందనే తాళ్ళపాక వారి యగ్రహారముగా నున్నమంగాపురమునఁదాళ్ళపాక చినతిరుమలాచార్యుఁడు తాను గట్టించిన కళ్యాణ వెంకటేశ్వర దేవాలయమున శాసనము లన్నింటిని తెలుఁగుభాషలోఁ దెలుఁగులిపిలోనే చెక్కించెను. శు దాంద్రులంున వుమానీయులు సాళువతిమ్మన, గోవిందన, బయు కారరావుయు వెుదలగువారు శ్రీస్వామివారి కర్పించిన యగ్రహారాదుల శాసనములుగూడ ద్రవిడముననే ద్రావిడీకరణముఁ బడసిన పేర్లతోనే యున్నవి. శాసనము లెల్ల ద్రావిడముననే యుండుటకుఁ గారణము దేవస్థానస్థానపతులు ద్రవిడు లగుటయే. గుడిలో శాసన ములఁ జెక్కించుట కధికారులు వారే. తిరుమలాచార్యాదులు పదులకొలఁది గ్రామములను స్వామికి సమర్పించుకొన్నారేకాని గుడిలో 1. పై చరిత్రవిషయములు పెక్కులు శ్రీసాధుసుబ్రహ్మణ్యశాస్రులుగారు రచించిన శాసనముల రిపోర్టులోని విషయములు శాసనములు చదివి సమకూర్చినవి. 93 శాసనములఁ జెక్కించుకోలేదు. ఆయూ దాతలిచ్చిన యీవులను బ్రతిగృహీత యగుదేవునికిఁ జెల్లింతు మని దేవస్థానస్థానపతులు బాధ్యత వహించి యుభయులకు నమ్మికగా శాసనములఁ జెక్కించిరి. దానికి 'శ్రీవైష్ణవరక్ష' వెట్టిరి. తిరుమలాచార్యులనాఁడు శాననములఁ జెక్కించినయుద్యోగి తిరుని నార్ వుడయుE. స్వామిపుష్కరిణికడ మాత్రము పెదతిరుమలాచార్యుఁ డొకతెలుఁగుశాసనము వేయించుకొనెను. పద్యరూపముగా(గూడ నది తాళ్ళపాక సూర్యనారాయణయ్యగారి ప్రాఁత కాగితములలో నున్నది. అది యిది: సీ. శ్రీశాలివాహనాంచితశకాబ్దము లెన్న నిల వేయునన్నూఁట యేఁబదియును నాలవయేఁడగు నందనవత్సర వైశాఖ పూర్ణిమావాసరమున శ్రీ వేంకటాధీశ శృంగారసంకీర్త నాచార్యతాళపాకాన్నమార్య పుత్రతిమ్మార్యుండు పూర్వపుఁగోనేఱు కట్టించె నవశిలాకలితముగను తత్తటాంకణగోపురద్వారములను భువనసన్నుతుఁడైనట్టి భూవరాహ ఘనుని తిరుచుట్టమాలె ప్రాకారవరము తానె కట్టించె నాచంద్రతారకముగ. నేఁటి తాళ్ళపాక వారు తిరుపతిలో స్వామికి సంకీర్తనకైంకర్యము జరుపుచుఁ దాళ్ళపాక శేషాచార్యులగారు కుటుంబవృద్ధితో నున్నారు. మడితాడు గ్రామవాసి, సూర్యనారాయణయ్యగారు చిన్నన్న కోవలోనివారట. నేఁడు తిరుపతిలోనె వైద్యాదివృత్తులతో సకుటుంబముగా నున్నారు. వీరే తాళ్ళపాకవారి పూర్వగాథలకై చాల శ్రమించుచున్నవారు. అన్నమాచార్యుల దేవతార్చన విగ్రహాదులను మంగాపురమునకుఁ చేర్చినవారు వీరే. ఇంకను 94 కడపజిల్లాలో ముడుంపాడు, ఊటకూరు, మాచనూరు, రాజుపాలెం, ఎజ్ఞవారిపాలెం అనుగ్రామములో(గూడఁ దాళ్ళపాకవారు పెదతిరుమలా చార్యుల యయిదుగురు కుమాళ్ళ వంశపరంపరలవారు ఉన్నారట. శ్రీసూర్యనారాయణయ్యగా రాయాగ్రామముల కరిగియక్కడి విశేముల దెలిసికొనివచ్చిరి. మణి కొన్ని విగ్రహాదులు ముడుంపాడు గ్రామమునఁ గల వని తెలుపఁగా వాని సేకరింపగోరి వారి నాగ్రామమున కంపితిని. కాని వారు విగ్రహముల నీయరంురట. గ్రంథములు శిథిల మయి పోయినవట. తాళ్ళపాకవారి యిండ్లనుండి (కడపజిల్లా) కొన్నితాళపత్ర గ్రంథము లాంధ్రసాహిత్యపరిషత్తువారు సేకరించిన టున్నారు. (చూ.6 వాల్యుం. పరిషత్పత్రిక) నందవరీకులు-వైష్ణవత అన్నమయు యూదివE శఠకోపయతిశిష్యుఁడై వైష్ణవుఁడైనట్టే యూకాలమున నందవరీకట్రాహ్మణులు మజీకొందఱు వైష్ణవము స్వీకరించి శఠకోపయతిశిష్యులయిరి. అల్లసాని పెద్దనకూడ నందవరీకబ్రాహ్మణుఁడే, స్మారుఁడే. శఠకోవయుతిశిష్యుఁడై వైష్ణవము పుచ్చుకొన్నాఁడు. ప్రబంధరాజవిజయు వేంకటేశ్వరవిలాసమురచించిన గణపవరపు వెంకటకవికూడ నందవరీకుఁడీ. వారి పూర్వులు వైష్ణవము పుచ్చుకొన్న వారే! కాని యూతఁడు తాళ్ళపాక వారికిఁ జాలఁ దర్వాతివాఁడు శ్రీవెంకటేశ్వరస్వామిపై నాతఁడు రచించినకృతి వెంకటేశ్వరవిలాస మాతఁ డన్నటు ప్రబంధరాజమే, నందవరీకులు గొందఱు వైష్ణవులగుటకుఁ బ్రధానముగా నన్నమాచార్యుఁడే కారణ మనుకొందును ఆరాధ్యశైవుఁడగు తెనాలి రామకృష్ణుఁడు వైష్ణవుఁడగుటకుఁ గూడ నీతాళ్లపాకవారి పలుకుబడి కలదేమో. ఆతని కృతిపతి విరూరివేదాద్రిమంత్రి నందవరబ్రాహ్మణుఁడేమో. విరూరి' యింటిపేరివారు నందదవరీకులు నేఁడున్నారట. రామకృష్ణుని గురువగు కందాడ అప్పలాచార్యుడు తాళ్ళపాక పెదతిరుమలాచార్యునకును గురువు. కాన పెదతిరుమలయ్య రామకృష్ణుఁడు సతీర్యులు. 13 95 అన్నమాచార్యాదులు తిరిగినదేశములు అన్నమాచార్యుఁడు కడప, కర్నూలు,బళ్ళారి,యనంతపురము, చితూరు, చెంగల్పటు, ఆర్కాడు, నెలూరు, గుంటూరు, తంజావూరు, తిరుచినాపల్లి మండలములలో నంచారము చేసినటున్నాఁడు. కృష్ణాగోదావరి మండలముల నెఱుఁగడేమో! అన్నమాచార్యుని మనుమఁడు చిన్నన్న గుంటూరు కృష్ణామండలములఁగూడఁ దిరిగినవాఁడు. ఆతనికి శిష్యులు సాలెవారు సర్వాంధ్రదేశమున నుండిరి. కీర్తించినవేల్పులు అన్నమాచార్యుఁడును ఆయనకొడుకు పెదతిరుమలాచార్యుఁడును మనుమఁడు చినతిరుమలాచార్యులును నీక్రింది పుణ్య స్థలములలోని దేవతలఁ బేర్కొని సంకీర్తనములు చాల రచించిరి. మాడుపూరికేశవుఁడు కృషుఁడు దానరిపల్లె రాముఁడు మండెమునృసింహుఁడు కదిరి నృసింహుఁడు కదిరి వనంతుఁడు చెంజినవనీత కృషఁడు కళసాహనుమంతుఁడు అహెూబల నృసింహుడువిజయనగరవేంకటేశ్వర విట్టల నరసింహహనుమంతులు కడప వెంకటేశ్వరుఁడు తిరువళాచ్చి విషుఁడు తిరువళ్ళూరి వీరరఘవుఁడు కంచి వరదరాజు గండవరము గోపాలుఁడు కుఱునూతుల చెన్నఁడు చేగలమట్టి చెన్నుఁడు వావిలిపాడు రాముఁడు ఉద్దగిరికృష్ణుడు గుత్తిరాముఁడు, వెలుగోటికేశవుఁడు, వుంగాంబుధి హనుమంతుఁడు, నల్లబల్లి చెన్నుఁడు,ఊటుకూరి చెన్నకేశవుఁడు, కోవెలగుంట్ల గోపాలకృష్ణుఁడు, ఓగునూతులనృసింహుఁడు కోనచెన్న రాయుఁడు శ్రీరంగము రంగనాథస్వామి ఒంటి వెుట్ట వీరరఘురాముఁడు చుక్కపల్లి చెన్నుఁడు కోసువానిపల్లె చేళ్ళపిళ్ళ, నెలూరు-అధ్యాత్మసంకీర్తనములలో చదివిచూచి నంతలోఁ గానవచ్చిన వివి, కడముట్టఁబరిశీలించినపై నింక నెన్నియగునో! నంకీర్తనముద్రాసామ్యములు తాళ్ళపాక అన్నయ తిరుమలాచార్యులకు నిన్నూఱువర్షములఁ దర్వాతి కాలమున క్రీ 1650 ప్రాంతముల వర్తిల్లినత్యాగరాయలవారును క్షేత్రయ్య కించుమించుగా నిన్నూజేండ్లతర్వాత వర్తిల్లిన త్యాగరాయల 96 వారును నిట్లే యనేకదివ్యస్థలముల దేవతలపై సంకీర్తనముల రచించిరి. తాళ్ళపాకవా రాయాదేవతలకుఁ దిరుపతి వేంకటేశ్వరునితో నభేదము గల్పించి వేంకటేశ్వరనామముద్ర యుంచినటు క్షేత్రయుయు నాయాక్షేత్రమలదేవతలకు మువ్వగోపాలునితో నభేదము గల్పించి మువ్వగోపాలముద్రను సంకీర్తనములకుఁ గూర్చెను. త్యాగరాయలవా రాయాక్షేత్రములదేవతలఁ బేర్కొనుచుఁ గడపటి చరణమునఁ దన పేరే ముద్రగా వెలయించిరి. రాజస్తుతిపరాజ్ముఖత్వము దేవతార్చనవిగ్రహములను గోల్పోవుట మొదలగు విషయములు కొన్నియన్నమాచార్యునకును, త్యాగరాజునకును సమానముగాఁ దటస్థించినవి. అన్నమాచార్యుని శృంగార సంకీర్తన రచనాంశము క్షేత్రయ్యగాను ఆధ్యాత్మ సంకీర్తన రచనాంశము త్యాగయ్య గాను నవతారముదాల్చె ననఁజెల్లును. అన్నమాచార్యునట్లు సంకెళువేసి చెరలోనుంచుట స్వామి కృవ వలన నాక్లేశము తొలఁగిపోవుట రామదాసుగారికిని గలిగెను. అన్నమాచార్యుని వలుకుబళ్ళు అన్నమాచార్యుని సంకీర్తనములభాష పశ్చిమాద్ర దేశమున వాడుకగన్నది. ఆతనిపలుకుబళ్ళు చాలా కృష్ణరాయులయుఁ దదాస్థానకవులయు రచనలలోని కెక్కినవి. రాయలతో, దఱచుగాఁ దిరుపతికి వచ్చి స్వామి సన్నిధిని తాళ్ళపాకవారి సంకీర్తనముల వినుచుండుటచే నాయాకవులకు వీరి పలుకుబళ్ళు సుపరిచితములయి యుండవచ్చును. మచ్చుకుఁ గొన్ని చిగురుఁగొమ్మైనఁ జేవ, మీసాలపై తేనియల్, సందు సుడిమా యలు, తంగేటిజున్ను, నూతులుత్రవ్వితే బేతాళాలు బయల్పడును, కోలగర, పొరి విడంగాయములు, గోవాళ్ళు, చిందువందు, తలవూవాడక. తాళ్ళపాకవారి సంకీర్తనముల ఛాయలు వేమన పద్యములలోని కెక్కినవి. 97 భాయూవమాహారులు తనసంకీర్తనచ్భాయాపహారులను-వా రెవరో పేరు తెలియదుఅన్నమయ కటువుగా గర్షించెను. రామక్రియు వెఱులాల మీకు వేడుక కలితేను! అ8్మవంచి తడు కల్లంగరాదా ||పల్లవిil ముడిచి వేసినపువ్వు ముడువ యోగ్యముగాదు! కుడిచివేసినపల్లె కుడువఁగాఁ గాదు! బడి నొకరు చెప్పినఁ బ్రతిచెప్పఁ బోతేను అడరి శ్రీహరికి నది అరుహము గాదు వెఅు| 1 గంపెఁ డుముక దినఁగా నొక్కవరిగింజ తెంపునఁ గలసితే తెలియ నెట్టవచ్చు జంపులం బలవరించఁగ నొకమంచిమాట! ఇంపైతె హరి యందు కిచ్చునా వరము వెఱు| 2 ఉమిసినతమ్మలో నొకకొంత కప్రము సమకూర్చి చవిగొని చప్పరించనేల అమరంగ ఛాయాపహారము చేసుక తమమాట గూర్చితే దైవము నగఁడా 1്l 3 చిబికివేసినగింజ చేతఁ బట్టఁగ నేల గబుక కెంగిలిబూరె గడుగంగ మఱియేల తొబుక కవిత్వాల దోషాలఁ బొరలితే దిబుకార నవ్వఁడా దేవుఁడైనాను ஜெl 4 మించు చద్దికూటమీఁద నుమిసినటు మంచి దొకటి చెప్పి మజీ చెప్పనేరక కంచుఁ బెంచు నొక్కగతి నదికితే మట్టి పెంచువలెనే చూచుఁ బెరుమాళ్ళు వాని వెఱు| 5 98 పుచ్చినట్టిపండు బూఁజిలోననె వుండు బచ్చనకవితలు బాఁతిగావు యెందు! ముచ్చుఁ గన్నతల్లి మూల కొదిఁగినటు! వ్రుచ్చిమి నుతు లేల మైుక్కరో హరికి వెఱ| 6 ఉల్లి దిన్నకోమ టూరక ఉన్నటు జల్లెడ నావాలు జాఱిపోయినటు కల్లలు చెప్పి యాకత కుత్తరములీక మెల్లనే ఉండితే మెచ్చునా దైవము ವಿಣ್ಣು|| 7 నేతిబీఅకాయ నేయి అందు లేదు! రాతివీరునికి బీరము ఇంచుకా లేదు! ఘూత బూరుగుఁబండు కడుపులోన దూది ఏతులనుడుగులు యొక్కునా హరికి liవెఱ్ఱ| 8 ఇరుగువా రెఱుఁగరు పొరుగువా రెఱుఁగరు! గొరబైనమాటలు గొణఁగుచునుందురు! పరులఁ గా దందురు బాతిగారు తాము! విరసు లట్టివారి విడుచు దేవుండు |వెఆ || 9 ఎన్నఁగు శ్రీవేంకటేశుఁ దాళ్ళపాక అన్నమాచార్చులు అఖిలదిక్కులు మెచ్చ ఉన్నతితోఁ బాడి రొకఁ డెవ్వఁడో తాను! సన్న నొరసునట సమ్మతా హరికి ವಿಆಣ್ಣು|| 10 అన్న అధ్యా. 196 తేకు. పాడి నరసింహా రామకృష్ణ నమో శ్రీవేంకటేశ సరుగ నాశత్రుల సంహరించవే |పల్లవిil 99 బావతిట్లకు శిశుపాలునిఁ జంపిన! యేవకోపకాఁడవు నేఁ డెందు వోయితివి నీవాఁడ నని నన్ను నిందించీ శత్రువును! చావగొట్టి వాని నిట్టె సంహరించవే |నరI 1 దాసుని భంగించేటితజీఁ గసిపుఁ జంపిన యీసుకోపకాఁడ విపు డెందు వోతివి మేసుల నీలాంఛనాల మించి నన్ను దూషించీ సాసించి శత్రువును సంహరించవే |నరt| 2 కల్లలాడి గూబయిలు గైకొన్న గద్దఁ జంపిన యెల్లఁగాఁగఁ గోపకాఁడ వెందువోతివి యిల్లిదె శ్రీవేంకటేశ యీ నీమీఁదిపాటలు! జల్లన దూషించుశత్రువు సంహరించవే నర 3 అన్న అధ్యా, 378 తేకు. చాలా కోపగాఁడయి యీ సంకీర్తనలు రచించినాఁడు. కవితా శత్రు వెవ్వఁడో యీతనిఁ గాసిపఱిచిన టున్నాఁడు. భాషా విశేషములు చక్కఁగా గ్రాంథికభాషను నేర్చినవాఁడయినను నీతఁడు సంకీర్తనములలో జాలచోట్ల వాడుకభాషనే యుపయోగించినాఁడు సంకీర్తనలక్షణమున నాతఁడు చెప్పినదానికి మనుమఁడు చిన తిరుమల్లయ్య యిటు తెలుఁగు చేసినాఁడు. క పల్లవనారీమేచ్ఛా ద్యుల్లాసమనోజ్ఞబంధురోక్తులు చవులై చెల్లును గ్రామ్యము లైనను హల్లీసకముఖ్యనాటకాదికఫణితిన్ | 100 కi జగతిఁ గడుఁ జెల్లుబళ్ళై నగి నగి భాషించునట్టి నానుడి పలుకుల్ తగ దన రహిచెడుఁ బువ్వల సొగ సుడుగన్ బిసికి కంపుసూపిసభంగిన్| వచ్చీని పోయిని చేసీని ఆడుతా చేయరంటా చిముడుతా ఏమిచెప్పే దమ్మా అమ్మలాలా అయ్యలాలా ఏవూరికేవూరు యేనాటి ఋణము (సంధి కూర్చవలసినచోట్లు కూర్పక వ యు ఆగమములు చేర్చుట) పోయె ఆయె ననుటకు పోయ ఆయు అనుట, లోకవాడుక దినదిన కొత్తలు(వైరిసమాసములు) ఇత్యాదివిధముల వాడుకభాష నీకవులు ప్రయత్పముతోఁ గోరి ప్రయోగించినారు. అరవములోవలె నీకవులు ఉదంతతద్దర్మార్ధకక్రియాజన్యవిశేషణములకు సమాసములో ద్రుతము చేర్చిరి. పోవుంబ్రోవ చెప్పంబలుకు ఇత్యాదులు. దీమ సపుఁబారివార (వారలార అనుటకు) కట్టివార (వారలార అనుటకు) ఇట్టిప్రయోగము నాచనసోమనయు వెజ్జివారపిడుగు ప్రేసినఁ దలటోప్పి యూగునే' అని చేసెను. నాచన సోవునరచనల యునుకృతులీ సంకీర్తనములలోఁ జాలఁగలవు. ఎదిరికి న్మడఁచువాఁడు తనకుఁ దగరంబు సఱచు టెంతటిభరమ్ము నాచనసోమన నానుడి యిది ఎనలేక యెదిరికి యినుమడిచేవానికి తనకు తగర మడువఁదడ వం్యూనా' అని సంకీర్తనమున కెక్కినది. నిఘంటువుల కెక్కని దేసి తెలుఁగుపలుకు లీసంకీర్తనములలో నెన్నో కలవు. అట్టివాని నెల్ల సేకరించి వేఱుగా నిఘంటువులకుఁ బరిశిష్టములు వెలయింపఁ దగును. కవితారీతులు అన్నమాచార్యుఁడు నరనన్న (కవికర్ణరసాయనకర్త?) పెద తిరుమలయ్య చినన్న-శబ్దార్ధశుద్ధి గలిగిన వరకవులు. అన్నమయ మజీసరిగాఁ బోతనవలె సహజకవితావిశారదుఁడే. స్వామి పలికింపఁగా 101 దాను పలికితి నని చెప్ప కొన్నాఁడు. ఆతఁ, డాడినది యమృతకావ్యము పాడినది వరమనంకీర్తనము నంునది. అన్నమయు తెలుఁగు నొడికారముసఁ గడుదిట్ట. సంస్కృతమునఁ గూడ సత్కవితారచన నేర్చినవాఁడు. పెద తిరుమలాచార్యుదులు సంస్కృతాంధ్రాది భాషలలో నన్నమయవలె విద్వాంసులు. పెదతిరుమలాదులరచనలలో పాండిత్య ప్రకర్షము పదబంధపు జిగిబిగి యధికముగా నుండును. అన్నమాచార్య సంకీర్తనములును శృంగారమంజరియు తేటతేటగా తేలిక తేలికగా తియ తియ్యగా హాయి హాయిగా గోస్తనీద్రాక్షాగుళుచ్ఛములవలె నాస్వాద్యము లయినవి. వానియర్ధవిశేషములు శ్రోతలహృదయములలో సులువుగాఁ జొరఁబాటీ వానిని చూఅగొని కొనిపోయి యేడుకొండల నెక్కించి భగవంతునిపాదారవిందములపజ్ఞ నడంకువతో నత్తియుండు నటు చేయఁగలవి! అన్నమాచార్యుఁడు తిరుపతి కొండమీఁద జగదేక నాథుఁడు ప్రత్యక్షమై వెలసియున్నాఁ డని ఓహెూప్రజలారా నామాట వినుండు దర్శించి కృతారులు కండు రండు రం డని రెండుచేతు లెత్తి యాహ్వానించిన తీ రాలకింపఁదగినది. రావు క్రియు చాటెద నిదియే సత్యము సుండో చేటులే దతని సేవించినను ||పల్లవి! హరి నొల్లనివారసురలు సుండో సుర లీతని దాసులు సుండో పరమాత్ముఁ డితఁడె ప్రాణము సుండో మరుగక మఱచిన మఱిలే దింకను 85יסוןd31 ון వేదరక్షకుఁడు విష్ణుఁడు సుండో సోదించె శుకుఁ డచ్చుగ సుండో అది బ్రహ్మగన్నాతఁడు సుండో యేదెస వెదకిన నితఁడే ఘనుఁడు 85יסוןd3it 2 102 యిహపర మొసఁగను యివాతఁడె సుండ్"| వహి నుతించెఁ బార్వతి సుండో రహస్య మిదివో రహి శ్రీవేంకట మహీధరంబున మనికై నిలిచె [iచాటెదil 3 అన్న అధ్యా. 138 తేకు వైష్ణవు లనఁగా నిట్టివారట: అపారి మదమత్సరము లేక మనసు పే దైపోవ పదరిన యాసలవాఁడువో వైష్ణవుఁడు |మద|| ఇటు నటుఁ దిరుగాడి యేమైనాఁ జెడనాడి పెట్టరంటాఁ బోయరంటాఁ బెక్కు లాడి ఎట్టివారి నైనా దూఱి యెవ్వరినైనాఁ జేరి వట్టి యూసలఁ బడని వాఁడువో వైష్ణవుఁడు పల్లవి 1 గడనకొఱకుం జిక్కి కాముకవిద్యలఁ జొక్కి నిడివి నేమైనాఁ గని నిక్కినిక్కి ఒడలి గుణము తోడ వుదుటువిద్యలఁ జాల! వడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు మద2 ఆవల వొరులఁ జెడనాడఁగ వినివిని చేవమీఱి యెవ్వరినిఁ జెడనాడక కోవిదు శ్రీవేంకటేశుఁ గొలిచి పెద్దలకృప వావివర్తన గలవాఁడువో వైష్ణవుఁడు |lమదil 3 అన్న అధ్యా, 9 తేకు. ය’ న్నాసి వైష్ణవులు గానివార లెవ్వరు లేరు! విషప్రభావ మీవిశ్వమంతయుఁ గాన |పల్లవి। 103 అంతయు విషమయం బట మఱి దేవ తాంతరములు గల వననేలా! బ్రాంతిఁ బొంది యేభావము భావించి నంతటనే పుణ్యు లౌట దప్పదుగాన lవైష్ణ 1 ఎవ్వరిఁ గొలిచిన నేమిగొఱఁత మఱి యెవ్వరిఁ దలఁచిన నేమీ! అవ్వలివ్వల శ్రీహరిరూపు గాని వా! రెవ్వరు లేరని యెఱుక దోచినఁ జాలు వైష్ణ 2 అతిచంచలంబైన యూతుమ గలిగించు! కతమున బహుచిత్తగతులై యితరులఁ గొలిచిన యెడయక యనాథ పతి తిరువేంకటపతి చేకొనుఁగాక వైష్ణ! 3 అన్న అధ్యా, 6 తేకు. భూపాళం ఏకులజుఁ డేమి యెవ్వఁడైన నేమి ఆకడ నాతఁడే హరి నెఱింగినవాఁడు ||పల్లవిil పరగిన సత్యసంపన్నుఁడైన వాఁడె పరనిందసేయఁ దత్పరుఁడు గానివాఁడు! అరుదైన భూతదయానిధి యగువాఁడు పరులుఁ దానే యుని భావించువాఁడు ఏకులII 1 నిర్మలుండై యాత్మనియతిఁ గలుగువాఁడే ధర్మతత్పరబుద్ధిఁ దగిలినవాఁడు కర్మమార్గములు గడవనివాఁడే మర్మమై హరిభక్తి మఱవనివాఁడు HఏకులII 2 104 జగతిపై హితముగాఁ జరియించువాఁడే పగలేక మతిలోన బ్రతికినవాఁడు తెగి సకలము నాత్మఁ దెలిసినవాఁడే తగిలి వేంకటేశు దాసుఁ డయినవాఁడు |ఏకుల | 3 అన్న అధ్యా 47 తేకు. كان eo &D విజాతు లన్నియు వృథావృథా అజామిళాదుల కది యేజాతి ||పల్లవి || జాతిభేదములు శరీరగుణములు! జాతిశరీరము సరిఁ దోడనె చెడు! ఆతుమ పరిశుద్ధబ బెప్పడును అది నిర్దోషం బనాది యీతల హరివిజ్ఞానపు దాస్యం బిదియొక్కటె పో సుజాతి t|విజా|| 1 హరి యిందరిలో నంతరాత్ముఁడిదె ధరణి జాతిభేదము లెంచిన మరమయోగు లీభావ మష్టమదము భవనికార మని మానిరి! ధరణిలోనఁ బరతత్వ జ్ఞానము ధర్మమూలమే సుజాతివిజాl 2 లౌకిక వైదిక లంపటులకు నివి కైకొనునవశ్య కర్తవ్యంబులు! శ్రీకాంతుఁడు శ్రీ వేంకటపతి సేసిన సంపాదన మిందఱికి మేకొని యిన్నియు మీఱినహరికి మీనామమే సుజాతివిజాI 3 అన్న అధ్యా. 177 తేకు నాదనామక్రియు ప్రపన్నులకు నిది పరమాచారము! విపరీతాచారము విడువఁగ వలయు |పల్లవి| 105 భగవదపచారము భాగవతాపచారముఁ ! దగులక దేవతాంతరము మాని నగధరు శరణము నమ్మి యాచార్యుని బగి వాయనిదే పరమవైష్ణవము |ప్రపI 1 దురహంకారము దుఃఖము సుఖమునుఁ | బొరయక ప్రాకృతుల పొంతఁ బోవక దరిశనాభిమానాన ధర్మము వదలక పరిశుద్ధి నుండుటే పరమవైష్ణవము Itప్రపll 2 ఉపాయాంతరము లొల్లక భక్తి చేపట్టి యెపుడూఁ దీర్ధప్రసాదేచ్ఛతోడ నిపుణత శ్రీవేంకట నిలయుండె గతియని ప్రపత్తి గలుగుటే పరమవైష్ణవము ாகுல் 3 అన్న అధ్యా. 166 తేకు. లక్ష్మీవిలాసము: గుండక్రియు రూకలై మాడలై రువ్వలై తిరిగీని దాకొని వున్నచోటఁ దా నుండ దదివో ||పల్లవి || ఒకరిరాజుఁ జేసు నొకరి బంటుగఁ జేసు! వొకరికన్నెల వేతనొకరికి నమ్మించు! : వొకచోట నున్నధాన్య మొకచోట వేయించు! ప్రకటించి కనకమే బ్రమయించీ జగము రూక 1 కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు! కొందరి పుణ్యులఁ జేసు గొందరిఁ బాపులఁ జేసు! కొందరికొందరిలోనఁ గొట్లాట వెట్టించు! పందె మాడినటువలెఁ బచరించు పసిఁడీ Iరూకn 2 106 నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు! తగిలి శ్రీవేంకటేశు తరుణియై తానుండు తెగనిమాయైయుండు దికుకదెసయై యుండు! నగుతా మాపాల నుండి నటియుంచుఁ బసిఁడీ రూక 3 అన్న అధ్యా, 92 తేకు తత్త్వవిచారణ: భూపాళం చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు! ఎప్పడును జింతించే నిదేపనై నేను |పల్లవి!! పొలసి నీరూప మెటు పొడసూపేవో ఎలమి నాభాగ్య మింక నెట్బన్నదో ఆ లరి నా కేబుద్ధి ఆన తిచ్చేవో కలిగిననీమూయ యేుగతిఁ గడచేనో చెప్పవే 1 వరుస నా కెట్టాఁ గైవస మయ్యేవో ఇరవై నాజన్మ ఫల మెటున్నదో పరగ నామతినెటు పాయకుండేవో కరుణానిధిని ని న్నేకరణి మెప్పించేనో చెప్పలే|| 2 పనిపడి యెట్టా నీ భక్తి యిచ్చేవో నా మనసుచంచల మెట్టు మట పడీనో ఎనలేనినా తలఁపు లెఱిఁగి శ్రీవేంకటేశ నను నేలితివి యెట్టా నాకోరిక చెల్లీనో చెప్పవే 3 భౌలి పట్టినచోనె వెదకి భావింపవలెఁ గాని గట్టిగా నంతర్యామి కరుణించును ||పల్లవి ఇంటిలోని చీకటే యిట్టె తప్పక చూచితే వెంటనే కొంతపడికి వెలుఁ గిచ్చును! 107 అంటి కానరాని తనయాత్మ తప్పకచూచు! కొంటెఁ దనయాత్మయును గొబ్బునఁ గాన్పించును పట్టి! 1 మించికఠినపురాతిమీఁదఁ గడువ వెట్టితే అంచెలఁ దానే కుదురైనయట ! పొంచి హరినామ మేప్రాదు నాలికతుదను! ఎంచి తలఁచఁదలఁచ నిరవె సుజ్ఞానము పట్టి2 ఒక్కొక్కయుడుగడుగె ఒగి ముందు వెట్టితే ఎక్కువె కొండైన నెక్కుఁగొనకు! ఇక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును! పక్కనం గొలిచితె బ్రహ్మపట్ట మొక్కును |పట్టి|3 ෆඞීද් ఆడుతాఁ బాడుతా నీతో నట్టే ముదు గునుసుతా వోడక నీదండ చేరి వున్నారమయ్యా ||పల్లవి || ఆసఁ దల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు! యేసుఖదుఃఖములుఁ దా మెఱుఁగ నటు! వాసుల శ్రీపతి మిమ్ము వడి నాత్మఁ దలఁచుక యీసులఁ బుణ్యపాపము లెఱఁగమయ్యా |ఆడుతా|| 1 ఏలినవారు వెట్టఁగా నేపునఁ దొత్తులు బంటు అలకించు పురులఁ బో యడుగనటు తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించఁగా యేలని యేమియుఁ గోర నెఱుఁగమయ్యా iఆడుతాil 2 చేతఁ జిక్కి నిధానము చేరి యింటఁ గలవాఁడు! యేతులఁ గలిమిలేము లెఱుఁగనటు ఆతుమలో శ్రీవెంకటాధిప నీ వుండఁగాను యీతల నేవెలుతులు నెఱుఁగమయ్యా |ఆడుతాil 3 అన్న అధ్యా. 268 తేకు. 108 భైరవి కరుణానిధి నీవే కనుఁగొంచు నున్నాఁడవు! యిరవై నాలో నున్నాఁడ వేది గతి యింకను |పల్లవి: పేరుచున్నవి నాలోనఁ బెక్కువికారములు! వూరుచున్న వెన్నైనా వూహ లెల్లాను! చేరుచున్న వొక్కొక్కటే సేనా సేన కోరికలు! యిదారీతి నున్నాఁడ నాకు నేది గతి యింకను иšćои 1 పటుచున్నవి నానాప్రకృతులవోజలు! పుటుచున్నవి యనేకభోగేచ్ఛలు చుట్టుకొనుచున్నవి సులభపు వేడుకలు) యిట్టివి నానడకలు యేదిగతి యింకను కరు 2 సందడింపుచున్నవి సారెకు నామమతలు ముందువెనకై వున్నవి మోహాలెల్లా చెందె నీ పైభక్తి శ్రీవేంకటేశ్వర యెందునూ నీవే కాక యేది గతి యింకను!కరు| 3 అన్న అధ్యా. 238 తేకు. ෆර්‍ම నమో నారాయణ నావిన్నప మిదివో సమానుఁడఁ గాను నీకు సర్వేశ రక్షించవేపల్లవి: మనసు నీయూధీనము మాటలు నీ వాడేటివే తనువు నీపుట్టించినధన మిది! మును నీపంపున నిన్ని మోచుకున్నవాఁడ నింతే వెనుక నన్ను నేరాలు వేయక రక్షించవే నమో 1, భోగము లెల్లా నీవి బుదులు నీ విచ్చినవి యీ గతి నాబతుకు నీ కిరవైనది 109 చేగదేర నీవు నన్నుఁ జేసినమానిసి నింతే సోగల నాయజ్ఞానము చూడక రక్షించవే నమో| 2 వెలి నీవే లో నీవే వేడుకలెల్లా నీవే కలకాలమును నీకరుణే నాకు! యిల శ్రీవేంకటేశ నీవేకొన్నబంట నింతే నెలవు దప్పించక నీవే రక్షించవే 3 וויט:&ון అన్న అధ్యా 235 తేకు. పెండ్లి తిరునాళ్ళు: సామంతం పసిఁడి యక్షంత లివె పట్టరో వేగమె రారో దెసలఁ బేరంటాండు దేవుని పెండ్లికిని పల్లవి| శ్రీవేంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి దైవికపుఁ బెండ్లి మూహూర్తము నేఁడు కావించి భేరులు మ్రోసె గరుడధ్వజం బెక్కె దేవతలు రారో దేవుని పెండ్లికిని ||పసిఁడి|| 1 కందర్ప జనకునికిఁ గమలాదేవికిఁ బెండ్లి పందిలి లోపలం దలఁబాలు నేఁడు! గందమూ విడె మిచ్చేరు కలువడాలు గట్టిరి అందుక మునులు రారో హరిపెండ్లికిని పసిఁడి|| 2 అదె శ్రీవెంకటపతి కలమేలుమంగకును! మొదలి తిరుణాళ్ళకు మొక్కేము నేఁడు! యెదుట నేగేరు వీరే యిచ్చేరు వరము లివె కదలి రారో పరుషఘనులు పెండ్లికిని II:3&cón 3 అన్న అధ్యా, 234 తేకు. 110 రావు క్రియు గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పరుష లదివో వచ్చెఁబైపై సేవించను ||పల్లవి || పాడిరి సోబాన నదే భారతియు గిరిజయు! ఆడిరి రంభాదులై అచ్చరలెల్ల కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి వేడుకలు మీఱఁగ శ్రీవిభుని పెండ్లికిని గరుడ 1 కురిసెఁ బువ్వలవాన కుప్పలై యెందు చూచిన మొరసె దేవదుందుభి మ్రోఁత లెల్లను బెరసె సంపద లెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి! తిరమైమించిన దేవదేవుని పెండ్లికిని |గరుడt| 2 వేసిరి కానుక లెల్ల వేవేలు కొప్పెరల పోసి రదే తలఁబ్రాలు పుణ్యసతులు! ఆసల శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ దాను! సేసలు వెట్టిన యట్టి సింగారపు పెండ్లికినిగరుడ1 3 అన్న అథ్యా. 204 జేకు వెంకటేశ్వరస్వామి పెండ్లి తిరునాళ్ళు మన యన్నమాచార్యుఁడే తొలుత వెలయించినవాఁడుగాఁ దోచుచున్నాఁడు. ఆగమశాస్రమున వివాహెూత్సవము చేయుచున్నమాన్యుఁడే కన్యాదాతగా వర్తిల్ల నగునని. కలదట. కనుకనే శ్రీపాదరేణుమాహాత్మ్యమున ని టున్నది. శ్రీలలరంగ మంగమును శ్రీహరి కెన్నఁడు దారవోయుచోఁ దాళులపాక యన్నమయ దాఁ గడిగెం బదముల్, ధరిత్రిమా తాళులపాక చిన్నన పదంబులు పాడిన నాడె సర్పరాట్ శైలవిభుండు తత్పదరజంబును మాకు నొసంగఁజెల్లదే! శకుంతలా పరిణయ కృత్యవతరణిక ని టున్నది. 15 11] 'మఱియు నమ్మహదేవుండు మదీయువూ తావు హవంశ శిఖారత్నంబగు నన్నమాచార్యునకు జామాతరం డనిపించుకొని, భవదీయ సంకీర్తనంబు లాలించిన కర్ణంబుల నితరసంకీర్తనంబు లాలించ నని" ప్రతిజ్ఞ గావించెనట." దేవాలయములో సంవత్సరోత్సవములను తెలుదేశమున కళ్యాణోత్సవము లనీ, ద్రవిడదేశమున బ్రహె్మూత్సవము లనీ, నేఁడు పేర్కొనుట కలదు. ఆలయములలో స్వామిప్రతిష్టజరగిననాళ్ళే యా యుత్సవములనాళ్ళట. శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మప్రతిష్టితుఁడు గనుక ఆప్రతిష్ట జరగించిన బ్రహ్మపేర తిరుపతి వర్ణోత్సములు బ్రహె్మూత్సములయ్యె ననీ దాని ననుసరించి దక్షిణదేశపు దేవోత్సములకెల్ల బ్రహె్మూత్సవము లని పేరు సంక్రమించెననీ ఆయుత్సవములలో కళ్యాణము జరుపుట తెలుదేశమునఁ గొత్తగాఁ గలిగిన యాచారమని శ్రీపరవస్తు రామానుజ స్వామి ఎం. ఏ. గారు చెప్పచున్నారు. బ్రహె్మూత్సవము: అహిర నానా దిక్కుల నరు లెల్ల వానల లోననె వత్తురు గదలి |పల్లవి: సతులు సుతులుఁ బరిసరులు బాంధవులు హితులు గొలువఁగా నిందరును! శతసహస్ర యోజనవాసులు సు! వ్రతములతోడనె వత్తురు గదలి నానా 1 ముడుపులు జాళెలు మొగిఁ దలమూటలు! కడలేనిధనము గంతలును కడుమంచిమణులు కరులు దురగములు! వడిగొని చెలఁగుచు వత్తురు గదలి יסיסוןit 2 | 12 మగుటవర్ధనులు మండలేశ్వరులు! జగదేక పతులుఁ జతురులును! తగువేంకటపతి దర్శింపఁగ బహు! వగల సంపదల వత్తురు గదలి |నానా || 3 అన్న అధ్యా. 331 తేకు. ముఖారి భోగీంద్రులును మీరుఁ బోయి రండు! వేగిన మీఁదటి విభవములకు ||పల్లవి || హరుఁడ పోయిరా అజుఁడ నీవు నుంభోయి! తిరిగిరా మీఁదటి తిరునాళ్ళకు సురలు మునులు భూసురులు పోయిరండు। అరవిరి నిన్నాళ్ళు నలసితిరి ΙΙε5"ήoι 1 జముఁడ పోయిరా శశియు నీవునుఁ బోయి! సుముఖుఁడవై రా సురలఁ గూడి! గుములై దిక్పతులు దిక్కులకుఁ బోయి రండు! ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి Iાદ *6૦ા 2 నారద సనక సనందనాదులు! భూరి విభవములఁ బోయి రండు। దూరముగాఁ బోకిట్టె తొరలి వెంకటగిరిఁ| జేరి న న్నిట్లనే సేవించుఁడి |బోగీం! 3 అధ్యా. 353. 11 వాల్యం. ఇంతవఅకు అధ్యాత్మసంకీర్తనలే ఉదాహరించినవి. శృంగారసంకీర్తనలుగూడ రెండు: 113 కేదార గౌళ - అటు తాళం నీవు గాఁగా నేను గాఁగా నేఁటి కాయఁ బోయును! మీవంటి చులుకనివారము మేమైతే మేటైనంతలేసి పనులు నేఁడౌను |పల్లవి। మంచిగందము నెఱపూఁత పూసుకొని మూ వాడ కాతఁడు రాఁ గా పోఁగాఁ జూచి1 పొంచులు మూయింటిపంచ నుందువట బోగాల వారమటే ఎంచనేటికి తప్ప నీమగఁడైతే యిలు వెళ్ళకుండ నరికట్టుకొని వల! పించవలెఁ గాక వూరివారిమీఁద పొంచు లుండవచ్చునా వోచెలియు IIనీవు || 1 ఎమ్మెకాఁ డాతఁడు మావిథి నిలుచుండి యెవ్వరితోనో మాటలాడఁగా విని కొమ్మరో చూపెట్టుకొనివుందువట గుట విడిచివున్నామా! అమ్మరో ఆతఁడు నీమగఁడై తే ఆన లిడుకొని వుండవలెఁ గాక దిమ్మరికత్తెవై మాయింటిచుటూ తిరుగులాడ నాయమూ |నీవు It 2 నాయముగా అల మేల్మంగ వెంకటనాథుఁడు ననుఁగూడి నవ్వినంతలోనే వోయమ్మ నేఁజెల్ల వూర నాఁట చాట వున్న పనులవారమా! పాయక ఆతఁడు నీపతియైతే పక్క 114 పవ్వళించి వుండవలెఁ గాక కాయని కాపులు పూయని పూతలు గట్టి కాపురాలు గుత్తగొందురటే నీవు | 3 శేషా, వ్రాఁతప్రతి. (రాగము పేరు లేదు) కటకటా అయ్యో కాంత నింత యేపుదురా అటమటముగాదు నీయానసుమ్మీ నిజమయ్య పల్లవి| కొసరినా నిన్నే కాని కోపించినా నిన్నే కాని కసరినా నిన్నే కాని కాదన్న నిన్నే కాని విసరినా నిన్నే కాని వేసరినా నిన్నే కాని ఇసుమంతైనా అన్య మెఱుఁగదయ్యా lištoll 1 అలసినా నిన్నే కాని అఁకొన్నా నిన్నేకాని పిలిచినా నిన్నే కాని పేరుకొన్నా నిన్నే కాని సొలసినా నిన్నే కాని సోకనాడినా నిన్నే కాని కలనైనా తలఁ పెందూ కలుగదు గదవయ్యా! కట| 2 కొనియాడినా నిన్నే కాని గుంపించినా నిన్నే కాని పనివినా నిన్నే పాడినా నిన్నే కాని మనసిచ్చి యలమేలుమంగపతి వేంకటేశ యెనసితివి మాచెలి నింక నేచ నేమిటకయ్యా |కట| 3 అళ్వారు - అన్నమాచార్యుఁడు ద్రవిడవేదాంత రచనమునకై శఠకోపయతీంద్రు లవతరించిన విధముగా నంధ్రవేదాంతరచనమునకై యన్నమాచార్యుఁ డవతరించి నాఁడు, శఠకోపయతి వైశాఖమాసమున విశాఖానక్షత్రమున నవతరింపఁగా నన్నమాచార్యుఁడును వైశాఖమాసమున విశాఖానక్షత్రమున నవతరించి 115 నాఁడు. శఠకోపయతి పదునాజేండ్ల వయసువాఁడయిన తర్వాత సర్వ విద్యలు గోచరించి ద్రవిడ సంకీర్తనములు రచింప దైవానుగ్రహమందఁగా నన్నమాచార్యుఁడు నట్లే వదునా అవయేట స్వామి ప్రత్యక్షమై యుద్బోధింపఁగా సంకీర్తరచనము సాగించెను. శఠకోపయతి శ్రీతిరువేంగడ నాథునిమీదను నింక ననేక దివ్యస్థలములలోని విష్ణుమూర్తుల మీఁదను సంకీర్తనములు రచింపఁగా, నన్నమాచార్యుఁడును ప్రధానముగా శ్రీవేంకటనాథునిమీదఁను నింక ననేకపుణ్యస్థలముల విష్ణుమూర్తుల మీఁదను సంకీర్తనలు రచించెను. శఠకోపయతిస్వామి కౌస్తుభాంశమున జన్మించినట్లు విజ్ఞలు విశ్వసింపఁగా నన్నమాచార్యుఁడు స్వామినంద కాంశమున నవతరించినట్లు ప్రాజ్ఞలు పరిగణించిరి. పెరియాళ్వారు (విష్మచితులు) తులసీవనమున జనించిన గోదాదేవిని రంగనాథస్వామి కొసంగి పెండ్లిచేసి మామగా రయినట్లే యన్నమాచార్యులు గూడఁ బద్మసరోవరమున జన్మించినమంగాంబికను వెంకటేశ్వరస్వామి కిచ్చి పెండ్లిచేసి మామగా రయ్యోను. ఇట్టిమహత్త్వముగలవాఁడు గనుకనే తిరుపతివేంకటేశ్వరస్వామి సన్నిధి నీతనికి, నీతనివంశమునకుఁ గూడ నానాఁ డఖండగౌరవ మల వడినది. ఆంధ్రనంకీర్తనము - ద్రవిడ పాశురములు ఆళ్వారు రచింపఁగా నరవమున ద్రావిడవేదమనీ పంచమాగమ మనీ పేర్కొనఁబడుదివ్యప్రబంధము నాలువేలసంకీర్తనములు పాటలు (సీసపద్యాదులవంటివి) కలదికాఁగా అన్నమాచార్యుఁ డొక్కఁడే రచించిన యంధ్రవేదము ముప్పదిరెండువేలపాటలు గలది. ఈ సంకీర్తనలు దివ్య ప్రబంధముల ననువర్తించియే పరమాత్మునకు భక్తజీవులకు పతిపత్నీ భావము నాయికానాయకభావము కల్పించి యుజ్జ్వలరసానుభూతి నొద వించుచు ననేక దేవాలయములలోని యర్బామూర్తుల నభివర్ణించుచు శరణాగతిమహత్త్వమును బ్రతిపాదించుచు నింక ననేకవిధముల లోకనీతి 116 ధర్మోద్భోధభూత సారస్యముతో సవరనిభాషతో వేదవేదాంతేతిహాసాది సూక్తి తదర్ధప్రతిపాదనములతో వెల్విరిసి పెరియావాచ్బాంబి శైవంటి మహా వ్యాఖ్యాత వెలసెనేని యఖండానందతాండవముగాఁ బెదపెద్దవ్యాఖ్యా చమత్కారములు త్రవ్వితీయఁదగినట్లు విజ్ఞాననిధులై విరాజిల్లుచున్నవి. తిరువాయ్ మొజి మొదలగు దివ్యప్రబంధరచనల కివి తీసిపోవు. దేశ ప్రజాదౌర్భాగ్యముచే నివి వెలసిననాఁటనుండి నేఁటిదాఁక రహస్య రక్షలో నున్నవేకాని రాణ కెక్కవయ్యెను. అన్నమాచార్యులయుఁ దత్పుత్ర పౌత్రులయుఁ బ్రాభవము చెల్లునప్పుడు వారే స్వామికి వైభవములు కల్పించునప్ప డుత్సవములందేకాక యనుదినమును నీ సంకీర్తనములు స్వామిసన్నిధిని విన్నపించుట జరగినది. తమతర్వాత నట్లు జరగుటకుఁ గూడ వారు వసతులు గల్పించిరి. తర్వాతఁ గొన్నాళ్ళటు తనరెనేమో! ఇందుకుఁదార్కాణగా భజనగోషులవారు తొలుదొలుత తాళ్ళపాకవారి సంకీర్తనములనే యాలాపింతురు. కాని యిటీవల వీనియెఱుక మఱుగు పడిపోయినది. వీనిజన్మస్థానమగు తిరుపతిలోనే వీనిప్రాభవము వెలయ లే దనఁగా నిఁక నితరస్థలములమాట చెప్పనేల? ఈ సంకీర్తనములు తెలునాఁటివిష్ణ్వాలయములలో దివ్య ప్రబంధములుగా నిత్యసంకీర్తనార్హములుగా నెగడఁదగినవి. ఆయాదేవాల యముల యధికారులును ప్రభుత్వమువారును వీని కర్షమయినయా దరము కల్గింతురుగాక! త్యాగరాజకీర్తనలవలె నివి సంగీతపుఁ జమత్కార గములు రాగస్వరవిహారములు పక్కిలించునవిగా నున్నవో లేదో నిరూపించు యోగ్యతనాకు లేదు. గానవిశారదులే దానిఁ గనుఁగొనఁ దగినవారు. ఈ సంకీర్తనఫలములు గాయకులగానామృతమునఁ దోగి మాగి యాస్వాద్యము లయినప్పుడే వానితీయన తెలియనగును. శ్రీవేంకటేశ్వర వైభవము ఉవనిషన్మంత్రములవలె శ్రీవేంకటేశ్వరమూర్తి తొలుత నాయామతములవారికిఁ గొంతకొంత యానుకూల్యము గొల్పు నవయవా లంకారాదికముతో వెలసి తననిజాంతరంగమును నీరు కొలఁదిగా 117 గోచరింపించుచు మహిమాభిరామమై రహికెక్కినది. పలు మతములవారు పలుదెఱఁగుల వేంకటేశ్వరుని భావించుచుండుట నన్నమాచార్యుఁడు వివరించినాఁడు. (చూ. పుట. 253) శివుఁ డని, శక్తి యని, భైరవుఁ డని, జినుఁ డని, స్కందుఁ డని, తమతమ నిర్ణయముల కనుకూలము లయిన రూపురేఖలను బ్రమాణ ములను జూపకొనుచు పలుమతములవారు పలుకుబడి చెల్లించుకొనుచు వైవిధ్యముతో నర్చించుచు వచ్చిన శ్రీవేంకటేశమూర్తిని ఆళ్వారాచార్యుల యభివర్ణనానుగుణముగా విష్ణుమూర్తినిగా శ్రీరామానుజాచార్యులవారు. క్రీ. పదొకొండవ శతాబ్దిలో విఖ్యాతపజీచిరి. సింహాచలము శ్రీకూర్మము మొదలగు స్థలములఁ గూడ నిట్టి నిర్ధారణములే వారు చేసిరట! పర్వతారణ్యమధ్యస్థమై, దుర్గమమై పలుమతముల పలుకుబడికి చెల్లుబడికి లోఁబడుచు, పూజాపురస్కారములు సరిగా సాగక ఎవరో ప్రగాఢభక్తిపరులగు నిశితవ్రతులే నిలువఁదగినట్లున్న స్వామి సన్నిధిని శ్రీవైష్ణవుల స్థానపతిత్వమును స్థాపించి శ్రీరామానుజులు తమకు రామాయణోపదేశము చేసిన గురువులు తిరుమలనంబిగారిని శిష్యులు ఆనందాళ్వార్లను ఇద్దఱు జియ్యంగార్లను ఇర్వదినలుర నేకాంగులను సదా స్వామిని గాచియుండునట్లు చేసిరి. వైఖానసాగమవిధానమునకు తిరుపతి ప్రధానక్షేత్రము. ఇది మధ్య రంగముగా నాంధ్రద్రవిడకర్ణాట దేశములందు విష్ణ్వాలయములలో వైఖానసాగమప్రకారమునఁ బూజోత్సవాదికము లెప్పటనుండియో సాగుచున్నవి. స్వామి కీయుభయులు నుభయరక్షలు. పదునాల్గవ శతాబ్దిలో దేశికులవారును వారిశిష్యులును మనవాళ మహామునులు వారిశిష్యులును స్వామివైభవములకు విఖ్యాతిగూర్చిరి. పదునైదవ శతాబ్దిలో అహెూబలమఠప్రతిష్టాపకులు శఠకోపయతులును, వారి శిష్యుఁడన్నమాచార్యుఁడును స్వామివైభవమునకుఁ బ్రఖ్యాతిగొల్పిరి. 118 అన్నమాచార్యుఁడొక సంకీర్తనమున: "నే నొక్కండ లేకుండితే నీకృపకుఁ బాత్ర మేది వూని నావల్లనే కీర్తిఁ బొందేవు నీవు." ఆనెను. అతఁడు స్వామి సన్నిధి నివసించి సంకీర్తనములు సాయించుట చేతను. బైయెల్లరు రాజుల నావర్ణించుకొని వారికృతముగాను స్వకృతముగాను ఆలయ గోపురారామ మార్గసోపానాది నిర్మాణములను ఉత్సవవిశేషములను బెంపొందించుటచేతను వైష్ణవమతపు శరణాగతి మాధుర్యము చేతను కలౌ వేంకటనాయక యన్నసూక్తికిఁ దార్కాణముగా లోకరక్షకమై యూపన్నివారకమై ప్రజ్వరిలుచుండు స్వామి మాహాత్మ్య విశేషముచేతను పదునైదవ శతాబ్దిలో తిరుపతి క్షేత్రము భక్తపరిషత్తుల రాకపోక లధికముగా గలదై జనరంజకమై వర్ధిల్లినది. పదునాఱవ శతాబ్దిలో విజయనగరచక్రవర్తి శ్రీకృష్ణరాయఁడు, నంతకుఁ బూర్వుఁడు సాళ్వ నరసింగరాయఁడును దమవిజయము లెల్ల శ్రీవేంకటేశ్వరాను గ్రహమున వెలసినవే యున్న విశ్వాసములగలవారయి దిగ్విజయయాత్రలలో శ్రీవైష్ణవాచార్యులను, కవీశ్వరులను, శ్రీవేంకటేశ్వరవిగ్రహమును దోడఁగొంపోవుచు శ్రీవేంకటేశ్వరభక్తిని దేశ మెల్ల వెల్లివిరియించిరి. దిగ్విజయయాత్రారంభములందు విజయనిర్వాహాంతములందు వారు శ్రీతిరుపతి వేంకటేశ్వరస్వామిదర్శనము చేసికొని కాన్క లర్పించు కొనుచునుండెడివారు. శ్రీకృష్ణరాయఁడు క్రీ 1512 నుండి, 1523 దాఁక నేడు తూరు తిరుపతికి విచ్చేసెను. తొలితూరి:- ఇర్వురుభార్యలతో వచ్చి స్వామికి నవరత్న ఖచిత కిరీటమును కర్పూరహారతికి ఇర్వైమైదు వెండిపళ్ళెములను భార్యలచే స్వామి పాలారగింప బంగారుగిన్నెను. రెండవతూరి:- శ్రీభూదేవుల కనేకాభరణములను, మూదవతూరి:- 5 గ్రామములను, 16 119 నాల్గవతూరి: ముప్పదివేలవరహాలతో స్వామికి కనకాభి షేకమును కొన్ని యాభరణములను తాళ్ళపాక గ్రామమున (చిన్నాదేవిచే) కంఠమాల పదకము ఒక గ్రామమును (తానే) నవరత్స ప్రభావశీయును మకరతోరణమును. అయిదవతూరి:- కంఠమాలను పదకమును అనందవిమానపు బంగారుపూతకు ముప్పదివేలవరహాలను పులికాపునిర్వాహమునకు వెయ్యివరహాలను ఉదయనైవేద్యమునకు 500వరహాలను. ఆఱవతూరి:- కొన్ని భూములను, ఏడవతూరి:- నవరత్నఖచితమయిన పీతాంబరమును నవరత్న ఖచితములయిన రెండువింజామరలను పదకమును పదివేలవరహాలను సమర్పించెను. అచ్యుతరాయుఁడు ప్రతినంవత్సరము స్వామికిఁ బ్రబంధ వుష్పాంజలు లర్పించుచుండెను. సదాశివరాయఁడును స్వామికెన్నో సేవలు చేసెను. దాన శ్రీవేంకటేశ్వరమాహాత్మ్యము దక్షిణభారతదేశమం దెల్లఁ బ్రజ్వరిల్లి నది. పదరునాఱుపదునేడు శతాబుల తెలుగు ప్రబంధములలో శ్రీ వెంకటేశ్వరస్వామికి సమర్పితములే లెక్క కెక్కువగా నున్నవి. పుణ్యక్షేత్ర యాత్రలలో ముఖ్యములయిన యనేకవిష్ణ్వాలయ శివాలయు దేవతలతో పాటుగా నంతదాఁకఁ గీర్తనీయమగుచున్న శ్రీవేంకటేశార్చా మూర్తి పదు నాఅవ శతాబ్ది యారంభమున నుండి సర్వ భారతదేశమునకు ముఖ్యార్చామూర్తి కాఁజొచ్చినది. బ్రాహ్మణులు మొదలుగాఁ బంచముల దాఁక నన్ని జాతులవారును తమయిండ్లలో శు భకార్యములు జరగునప్పడు మనముందుగా వెంకటేశ్వర దీపారాధన, సమారాధన, జరుపుట, ఇంట నెవరికిఁగాని యనారోగ్యము కలిగినప్ప డౌపదమైుక్కులవాఁడని స్వామికి ముడుపు గట్టి కొండకు వచ్చి వడ్డితో ముడుపు చెల్లించుకొనుట సంప్రదాయ మయినది. తలనీలాలిచ్చువారు. నిలువు దోపిళ్ళిచ్చువారు అనర్ఘరత్నా భరణము లిచ్చువారు బ్రహె్మూత్సవ 120 కళ్యాణోత్సవాలు జరిపించు వారునై ప్రజలు, ప్రభువులు, మహారాజులు తండోప తండములుగా తిరుపతికి రాకపోకలు జరపసాగిరి. భారతదేశమున నెక్కడగాని ప్రజలు తమకుఁ జేర్వైయున్న దేవాల యార్చామూర్తుల పేళ్ళ బెట్టుకొనుటకలదు. కాళహస్తీశ్వరుడు, వరదరాజు, మల్లికారునుఁడు, పానకాలరాయుఁడు ఇత్యాదినామములు దాల్చినవా రాయూపుణ్య క్షేత్రములచేరిక గ్రామములవారని తెలివిడికలుగును. కాని వెంకటేశ్వర వెంకటాచలపతీత్యాది నామములు దక్షిణాపథమందెల్ల నూరూర నింటింట సర్వసామాన్యమై వెలయసాగినవి. శ్రీతిరుపతి వెంకటేశ్వర.స్వామి పోలికగా ననేకప్రదేశము లలో వెంకటేశ్వర దేవాలయములు వెలసినవి. దక్షిణాపథదేవాలయము లలో శ్రీతిరుపతి వెంకటేశ్వరాలయమున కున్నంత యాదాయ మేదేవళమునకు నుండదు. విజయనగరరాజ్యము తర్వాత మట్ల మైసూరు తంజాపూర్యాది రాజ్యములు నేటిజమీందారీలు స్వామి కెన్నోకైంకర్య ములు జరపినవి. అవి నేఁడు ప్రజాస్వామ్యముచేఁ జిదికి పోయినను, పోవుచున్ననుగూడ శ్రీవెంకటేశ్వర వైభవము ప్రజాసామాన్యపరమై యుఖండమై యలరారుచునే యున్నది. అన్నమాచార్యచరిత్రవరిశోధనము ఈశ్వరసంకల్ప మెట్టిదోగాని తాళ్ళపాకవారి యధ్యాత్మసంకీర్తన ములు చదువుచుండునపుడు నా హృదయ తంత్రులలో ననురణనము సాగుచు పరమానంద పారవశ్యముకలుగుచు కర్తవ్యమేదో వ్యక్తమగుచున్న టుండును. ఈయన్నమాచార్యు చరిత్రము ముద్రించుచు నందు సాళ్వ నరసింహరాయని దగ్గఱ నన్నమాచార్యుఁడు పాడిన శృంగార సంకీర్తన ప్రతీకము చదివి ఈకథనిజమా? ఇట్టికీర్తనము దొరకఁ గలదా? ఉన్నను నది వేలకొలఁది సంకీర్తనములలో నెక్కడ నున్నదో కదా అనుకొనుచుఁ జేతనున్న తాళ్ళపాకశేషాచార్యులుగారి వ్రాఁతప్రతిని దెఱతునుగదా సరిగా నా సంకీర్తమే యందు నాకన్ను లెదురఁ గానవచ్చెను. ఆనందమాయెను. నాతో నిందు(బరిశ్రమించుచున్న చిరంజీవి శ్రీనివాసాచార్యున కిది చూపి చెప్పి మజొకసంకీర్తనము నంకెల విడిపించుకొనుటకుఁ బాడినదాని 121 ప్రతీకమును జదివి యిది కూడదొరకిన బాగుగాదాయనఁగా ఇదిగో యిప్పడే యిట్టి సంకీర్తనమును జదివితిరి అని యాత డంతలోనే దానినెత్తియిచ్చెను. ఇటునాలుగు మూఁడు నాళ్ళలోనే మాకుఁగావలసిన సంకీర్తనము లెన్నో పుటపుట దొరకసాగినవి! అందు ముఖ్యములఁ గొన్నింటినీ పీఠికలో వెల్లడించితిని. ఇటు సంకల్పసిద్ధి సంతోషములతో పీఠిక రచించుచు దేవస్థానశాసనములలో మంగాపురమున తాళ్ళపాక చినతిరుమాచార్యుఁడు కట్టించిన కల్యాణ వెంకటేశ్వర దేవాలయమున అన్నమాచార్యునివిగ్రహపుఁ బ్రతిష్టయు జరిగిన టుండుటచే నదికల దేమోయని బరిశీలింపఁబోఁదలచి మిత్రులతో ముచ్చటించితిని. మహమ్మ దీయ విప్లవముచే పాడుపడి విగ్రహములు విరిగి సర్వధ్వంసమై యున్న యీ దేవళమునొక పుణ్యపురుషుడు (సుందరరాజురాయస్వామి) స్వప్నొద్బో ధము వలన వెదకి వచ్చి చేరి చాల శ్రమపడి తిరుపతి కొండమీది దివ్య మంగళ మూర్తివలెనే మహనీయమై దర్శనీయమైయున్న యక్కడి మూల మూర్తిని చక్కఁజూచుకొని పూజాపురస్కారములు ఉత్సవాదులు కొలఁది యేండ్లనుండి జరపుచున్నట్లును, వా రప్పడు తిరుపతిలోనే ఉన్నట్టును తెలియవచ్చెను. వారితో మిత్రులతో మూలమూర్తిని దర్శించి మాట మాటమీద తాళ్ళపాకవారి విషయమెత్తగా తాళ్ళపాకవారిదేవతార్చన విగ్రహాదు లిక్కడికిఁ జేరిన వని వారొక పెద్దకథ చెప్పిరి వానినెల్లఁ జూపిరి, అందు అన్నమాచార్యునినాఁటి భజనచిఱుతలు, తులసితావళము, స్ఫటికహారము సాలగ్రామములు శ్రీవేంకటేశ్వర, తద్దేవ్యాదుల దేవతార్చన విగ్రహములు ఆవిగ్రహముల యిత్తడి మకరదోరణము. వెండిఛత్రములు మొదలగునవి యున్నవి. వానిని శ్రీతాళ్ళపాక సూర్యనారాయణయ్యగా రొసఁగి రని వా రిప్పడు తిరుపతిలోనే ఉన్నారని యాసత్పురుషుఁడు తెలియఁజెప్పెను. పరమానందముతో తిరుపతికిఁ దిరిగి వచ్చి యా శ్రీసూర్యనారాయణయ్యగారిని గలసికొంటిని. వారే అన్నమాచార్య చరిత్రమును శ్రీ తిరుపతి వేంకటేశ్వర ప్రాచ్య విద్యాలయమునకు ఇచ్చిన వారు. కడపజిల్లా మడితాడును బీదరికముచే విడనాడి అన్నమాచార్యాదు లర్చించిన దేవతావిహ్రములను సరిగా నర్చింపననువు పడక తిరుపతిలో 122 దేవుని సన్నిధి నర్పింపఁగోరి తెచ్చితి ననియు దమపూర్వులే కట్టించిన దేవాలయము పునరుద్దారము చెంది పూజాపురస్కారములుగలదై యున్నందుకు పరితోషించి యావిగ్రహములనెల్ల నక్కడనర్పించితి ననియు వారు చెప్పిరి. ఆనాఁ డెప్పడో యన్నమాచార్యుఁడు తనదేవతార్చన విగ్రహములు పోయినందుకు విలపించిన సంకీర్తనము తలఁపున గోచరించెను. (చూ పుట. 269) నా డాతని కవి మరలదొరకెనేమో దొరకినప్ప డెంత సంతోషించెనో ఏమిచేసెనో తెలియదుగాని యయిదువందలయేండ్ల తర్వాత నాతని భజనచిరుతులు తావళములు దేవతార్చన విగ్రహములు వెదకఁబోయినతీవ కాలఁదవిలినట్లే నాకన్నులెదుటగానవచ్చుట, వారు వెలయించిన దేవళము పూజాపురస్కారములతో మరల వెలయుట, చూడఁగా నాకుఁ బరమాపహ్లాదము గలిగినది. శ్రీయన్నమాచార్యుఁడు నిత్యనూరులతో నారదాది వుహరులతో నాళ్వారులతోఁగలసి శ్రీవేంకటేశ్వరస్వామి పుష్కరిణీతీరమున ఆకాశగంగా ఝారులలో దరులలో సూర్యమండలములో నిత్యానంద విహారము సల్పుచుండెనని యానాఁటి వా రానందించిరి. (చూ. పుట 295) అన్నమాచార్యుఁడు పరమప్రాప్యము శ్రీవేంకటేశ్వర సన్నిధానమేయని యనేకసంకీర్తనములలో గొంతెత్తి చేయెత్తి గొప్పగాఁ జెప్పకొనెను. ఆయన పరమపదమందిన ఫాలున బహుళ ద్వాదశి వ్రత్యాబ్దికశ్రాద్ధదినవుగాన యూతని కువూరుఁడు పెద తిరుమలాచార్యుడిటు తన తండ్రిగారి నాహ్వానించెను. శ్రీరాగం దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు జనకుండ అన్నమాచార్య విచ్చేయవే ||పల్లవి| అనంత గరుడముఖ్యులయిన సూరిజనులతో ఘననారదాది భాగవతులతో దనుజమర్దనుఁడైన దైవశిఖామణితోడ వెనుకొని యారగించ విచ్చేయవే |దినil 1 123 వైకుంఠాననుండి యూళువారలలో పలనుండి! లోకపు నిత్యముక్తులలోన నుండి శ్రీకాంతతోడ నున్న శ్రీ వేంకటేశుఁ గూడి! ఈకడ నారగించ నింటికి విచ్చేయవే Iదిన 2 సంకీర్తనముతోడ సనకాదు లెల్లఁ బాడ పొంకపు శ్రీవెంకటాద్రిభూమి నుండి! లంకె శ్రీవెంకటగిరి లక్ష్మీవిభుఁడ నీవు అంకెల మాయింటవిందు లారగించవే |lదిన 3 అన్న, అధ్యా, తేకు. మదరాసువిడిచి శ్రీ తిరుపతి వేంకటేశ్వరుల సన్నిధి సేవకావింప వచ్చుటలో నాతోల్లటికోరిక తాళ్ళపాకవారిరచనల నన్నింటిని వెల్లడించుట. ఎంత ప్రయత్నించినను నడ్డంకులచే నింకి పోవుచున్న నాసంకల్పపు టూటలు చక్కసాగుట కద నిప్పటికి సమకూడినది. ఇక్కడనున్న తాళ్ళపాకవారిసంకీర్తనములు రాగిరేకుల లన్నింటిని స్వాధీనము చేసి కొంటిని. అస్మదీయుఁడు నాకుఁ జేదోడుగా ననువర్తించు పరిశోధనకార్య సహాయ విద్వాంసుఁడు చిరంజీవి. ఎ.వి. శ్రీనివాసాచార్యుఁడు వేలలెక్క నున్నరాగిరేకుల భరము మోయుచు బడలుచున్నను సంకీర్తనముల స్వారస్యాస్వాదనవున శ్రవుతీర్చుకొనుచు నర్వవరిశోధన సందర్భములందు జాగరూకుఁడై తోడ్పడుచున్నాఁడు మిత్రులై డైరెక్టరు శ్రీపరవను వెంకటరామానుజస్వామి, ఎం.ఏ. గారు నా కీకార్య నిర్వాహములో సహాయపడుచున్నారు. దేవస్థానమునఁ బైముఖ్యాధి కారు లిందుకుఁ జాల ముచ్చట పడువారుగానున్నారు. ఇఁకఁ జక్కగాఁ దాళ్ళపాక సంకీర్తనముల ముద్రణము సాగగల దనుకొందును. ముద్రితము లయిన సంకీర్తనములఁగొన్నిటిని సంగీతసాహిత్యపరిపుషులు శ్రీఅనంత కృష్ణశర్మ గారు న్వరవిన్యానముతోఁ బ్రకటించుచున్నారు. ఇ ట్టిన్నాళ్ళకుఁ దాళ్ళపాకమహనీయుల స్వామి సేవాఫలము పరిపక్వమై సహృదయా 124 స్వాద్య మగుచున్నది. అన్నమాచార్యాదులారా ! ఆనందింపుడు! అయిదు వందలేండ్లకుఁ బిదప మీయభీప్సితము లన్వర్ధములు గావలసిన టున్నది గాఁబోలును స్వామియనుగ్రహము ! ல்ா Al సీ! ດ໋!!! చెక్కిళ్ళఁ జిఱునవ్వు చిందు ద్రోక్కెడుజేఁడ ! యేడుకొండలవాఁడ ! యేలుకొమ్ము అలమేలు మంగాంబ చెలికాఁడ ! యడుగడు దండాలవాఁడ ! మాకండ వగుము ఆమటమైుక్కులస్వామి ! గోవింద గో వింద సందడివేల్ప ! వందనమ్ము కలియుగప్రత్యక్షకులదైవమా ! యెల్ల డెందాలవిహరించువింద ! శరణు పిండివంటకములు కుండలవండిన యోరెములును మాత్ర లారగించి భక్తులకుఁ బ్రసాదపఱుచు మహాభోగి వరకటాక్ష ! పరమపురుష! రక్ష! నిలువుదోపుడు దోచు గెఱదొంగతన మేమి? పాపముల్ హరింుంచు భావ మొక్కొ వడ్డికాసులఁ గూర్చు వ్యాపార మది యేమి? మేలు పెంపొందించు లీల యొక్కొ తలమీఁది నీలాలఁ దొలఁచిపుచ్చుట యేమి? చిక్కులం దెగటార్చు ఫక్కి యొక్కొ ఏడుకొండలమీఁద వీడౌటయేమి? స హస్రారవసతిరహస్య మొక్కొ ఏటివో యివి పెద్దలనాఁటిమాట లీశ్వరుఁడు సర్వభూతసుహృత్తు, సుహృదు డాపదపహర్త, యనవార్త కలరి యట్టి వాఁడ వను కన్నెజీఁగి కొల్చినాఁడ నిన్నె! ፵ምዘ

ă”ţi

చ|| 125 ఏరీ కోరి మనోజ్ఞపుష్పములు నీ కీయెన్మిదే' యంచు నా త్మారామమ్మునఁ బూవఁజేసితి నహింసాదిప్రసూనంబు ö నారాధించెద వీనిచే నిను ననంతాళ్వార్ల కైంకర్యపుం దీరుల్ గా వని వేఱుచేసెదవె తండ్రీ! వేంకటాధీశ్వరా ! దూరంబేల పరంబు నీ విహమునందున్ భక్తరక్షార్ధ మ ర్చారూపంబు ధరించి యుంటివన నిచ్చల్ నిన్నె లోకన్ను చె న్నారం గాంచెద దేహదేవకులమూలాధారమం దాసహ ప్రారంబున్ సుఖసత్యచిత్కలిత దీపారాధనల్ సేయుచున్! కరకరపల్కులన్ బిరుసు గల్గినశర్కర నన్ను బాగుగాఁ గరఁచి పొరంటికొంటివి నిగన్నిగమీఁగడపాల వీవు ని ల్వరమున నాకు మార్దవము వచ్చెను నీకు ఘనత్వ మబ్బె ని ర్వురము రసాయనం బగుటపోలదె యుర్వికిఁ గ్రోత్తకోవగాన్. వే. వ్రభాకరశాస్త్రి 1. అహింసా ప్రథమం పుప్పం పుప్ప మింద్రియనిగ్రహః కొంతిః పుష్పం దయా పుష్పం జ్ఞానం పుష్ప మతః పరమ్! సత్యం పుష్పం తపః పుష్పం భావపుష్ప మథాష్ట్రమమ్ ఏవ మష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతకరం పరమ్!

పూర్తి విషయసూచిక

[మార్చు]
  1. ఈ యన్నమచార్యచరిత్ర కాగితపు వ్రాఁతపుస్తకమును కడపజిల్లా రాయచోటి తాలూకా మడితాడుగ్రామవాసి శ్రీ తాళ్ళపాక సూర్యనారాయణయ్యగారు తిరుపతి వెంకటేశ్వర ప్రాచ్య గ్రంథాలయమున కొసగిరి. ప్రాఁత తాటాకు ప్రతి ననుసరించి వారు దానిని 1940 సం||లో వ్రాసిరట. దానితో రేవణూరి వెంకటాచార్యుని శ్రీపాద రేణుమాహాత్మ్యమును, తాళ్ళపాక చిన్నన్న తామ్రాశాసనమును గూడ వా రీగ్రంథాలయమున కొసఁగిరి. తామ్రాశాసనమునుస శ్రీమా. రామకృష్ణకవిగారు జర్నల్ వాల్యుం 1 పార్టు 1లో ప్రకటించిరి.
    ఈ యన్నమాచార్య చరిత్ర వ్రాత్రఁప్రతిలో గ్రంథము ముగిసిన తర్వాత 7 పుటలో ‘తాళ్ళపాక తిరువెంగళనాథుని జీవితచరిత్రము కార్వేటినగర సంస్థానములో ఉన్నది. చూడవలెను." అని కలదు. అట్లది కార్వేటినగరమునఁ గలదేమో.
  2. తాళ్లపాక నేఁటి కడపజిల్లా రాజంపేట తాలూకాలోనిది.
  3. చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయనిమీఁద సంకీర్తనములు రచించెను.
  4. మాడుపూరు, కడపజిల్లా సిద్ధపటము తాలుకొలో నున్నది.
  5. తాతాయగుంట గంగమ్మను గూర్చి యీకథ గలదు :- ఎప్పడో తిరుపతి నుండి తిరుమల తాతాచార్యులవారు శిష్య సంచారము చేయుచు కడప ప్రాంతముల నొక యూరి కరుగఁగా జరిగినది :- ఆయూర నెన్నఁడో వెలసియున్న గంగానమ్మ భయంకరవ్యాధులచే ప్రతివత్సరము నసంఖ్యాకజనమును నాహుతి కొనుచుండుటయు నొకప్పుడు జాత్ర జరగుచుండఁగా నామె జాలి దలఁచి యేఁడాది కొకనరబలి యిచ్చుచో నీమారణ మాపివేయుదు ననుటయు గ్రామసులందుల కంగీకరించుటయు జరిగెను. ఏటేఁట జాతరనాళ్ళలో బాటసారిగా వచ్చిన పరాయి యూరివాని నొకని బలిపెట్టుట జరగుచుండెను. ఒకయేఁట తాతాచార్యులుగారు చిక్కిరి, గురువుగారిని గోల్పోవుటాయని యూరివారు తటపటాయింపసాగిరి. ఎట్లో తెలిసిఆచార్యులవారు భీమునివలె బలి యగుదునని వెఱపు మాన్పిరి, బలి గావలసిననాఁడు జాతరచోట అష్టాక్షరీనారాయణ కవచాదుల ననునంధించుచు శిష్యులకుఁ జేయు శంఖచక్రముద్రాంకితముల తీరునఁగాక కణకణ నిప్పు రగిల్పించి శంఖచక్రముద్రల నెజ్జగాఁగాల్చి యుంచిరి. జాతరలో నమ్మవారి పూనకముతో నొకబత్తుఁడు బలిబలి యనుచు వారిమీఁదికి దూకెను. ఆచార్యులవారు పటుకార్లతో శంఖచక్రముద్రల నాపూనకమువాని రెండు భుజముల మీఁద గట్టిగా నంటించఁ బోయిరి. శివశక్తి పాటిపోఁజూచి వెనుదిరిగెను గాని మంత్ర ప్రభావముచే నడుగు సాగక నిలిచిపోయెను. ముద్ర వీపు మీఁదఁబడెను. తాతాచార్యులుగారిముద్ర భుజముదప్పినా వీపతప్పదన్న సామెత తదాదిగా వెలసెను. గంగానమ్మ యా యాచార్యులవారి కాళ్లపై వాలి శరణాగతురాలయ్యెను. ఆమెకు శిష్యత ననుగ్రహించి యాచార్యులవారు తిరుపతికిఁ దోడైచ్చి యూరివెలుపల నెలకొల్పిరి. వాఁటితో నాగ్రామపువారి కామెవలని పీడ తొలఁగెను. నాఁటనుండి తిరుపతిలో తాతాచార్యులవారి యనుమతి నామెకేఁటేటఁ జంతుబలులతోను, మద్యపుఁ జూఱలతోను నిన్నటిదాఁక జాతర సాగినది. మహాత్ములయునుగ్రహమున నేఁ డామె శుద్ధసాత్త్వికురాలై మద్యపుంజూజను జంతుబలిని విడనాడినది.
  6. ఈచింత చెట్టు శేషాంశమట. సేవాక్రమమునను వెంకటాచలమాహాత్మ్యమునను పరమయోగివిలాసమునను నీచింతచెట్టుస్తుతికలదు. ఈచెట్టు నేఁడులేదు కాని సేవా క్రమమున పర్వతారోహణోపక్రమమునఁగూడ నొకచింత చెట్టున్నట్టు వర్ణన మున్నది. ఆ చింతచెట్టు నేఁడును గలదు.
  7. టంగుటూరు కడపజిల్లా రాజంపేట తాలుకాలో నున్నది
  8. అనంతవర తామ్రాశాసనము, భారతిసంవత్సరాది సంచికలోను, కళింగదేశసంచికలోను ప్రకటితము.
  9. మహమ్మదీయమహాయుగము
  10. ఇది “మరువాకర" కావచ్చును. ఈ పేరియగ్రహారమును అన్నమాచార్యుల కుమారుఁడు పెదతిరుమలాచార్యుఁడు స్వామికి సమర్పించెను.